వాస్తవాలను వెలికి తీసే విశ్లేషణ -ఈనాడు ఆర్టికల్ 6వ భాగం


‘జాతీయ అంతర్జాతీయ పరిస్ధితులపై అవగాహన సాధించడమెలా?’ అనే ఆర్టికల్ వరుసగా ఈనాడు చదువు పేజీలో ప్రచురితం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ లో ఆరవ భాగం ఈరోజు (సోమవారం, మార్చి 25 తేదీ) ప్రచురించబడింది.

ఐదు భాగాల వరకూ అంతర్జాతీయ పరిస్ధితులను ఎలా చూడలన్న విషయాన్ని చూశాము. అంతర్జాతీయ రంగంలో ఉండే వివిద శిబిరాలు, ఆర్ధిక, రాజకీయ కూటములు, భౌగోళిక విభజనలు, వాటి ప్రాధాన్యతలు తదితర అంశాలను ఈ ఐదు భాగాల్లో చర్చించాము. ఆరవ భాగం నుండి జాతీయ పరిస్ధితుల్లోకి ప్రవేశించాము. రాజకీయ, సాంస్కృతిక పరిణామాలుగా మనకు పైకి కనిపించే వివిధ పరిణామాలు వాస్తవానికి ఆర్ధిక పరిణామాలేననీ, సామాజిక వ్యవస్ధలకు ఆర్ధిక పరిణామాలు పునాదిగానూ, ఇతర పరిణామాలన్నీ ఉపరితలంగానూ ఉంటాయని ఈ భాగంలో చర్చించాను.

ఈనాడు వెబ్ సైట్ లో నేరుగా ఈ ఆర్టికల్ చదవాలనుకుంటే ఈ లింక్ ను క్లిక్ చేయగలరు. కింద బొమ్మను క్లిక్ చేస్తే ఆర్టికల్ పి.డి.ఎఫ్ డాక్యుమెంట్ రూపంలో చూడవచ్చు.

ఈనాడు ఇ-పేపర్ నుండి

ఈనాడు ఇ-పేపర్ నుండి

4 thoughts on “వాస్తవాలను వెలికి తీసే విశ్లేషణ -ఈనాడు ఆర్టికల్ 6వ భాగం

 1. Hello Sir, I was not aware of this site until your article published in Eenadu. Your analys is very nice and detailed. It beacame a habit reading your articles as part of my news reading every day. Can we expect an article on Telangana issue. We just need the very basic reasons in detailed , but not in political view . Thank you

 2. అంజలి గారు,

  తెలంగాణ అంశం పైన గతంలో కొన్ని ఆర్టికల్స్ రాశాను. వాటిలో కొన్నింటికి లింక్స్ కింద ఇస్తున్నాను.

  http://wp.me/p1kSha-Id

  http://wp.me/p1kSha-1mQ

  http://wp.me/p1kSha-1mR

  పై ఆర్టికల్స్ తో పాటు వాటి కింద జరిగిన చర్చను కూడా చదవగలరు. కొందరు వ్యాఖ్యాతల వ్యాఖ్యానాల్లో వ్యంగ్యం ఉండవచ్చు. వ్యంగ్యం వరకు వదిలేసి విషయం పైన దృష్టి సారించాలని నా సలహా.

  ఇంకా అవసరం అనుకుంటే ఈ బ్లాగ్ లోనే కింద సెర్చ్ బాక్స్ ఉంటుంది. అందులో తెలంగాణ అని తెలుగులో టైప్ చేసి వెతికితే తెలంగాణ అంశం పైన వచ్చిన ఇతర వార్తలు, విశ్లేషణలు చూడవచ్చు. ఆ తర్వాత ఏమన్నా అనుమానం ఉంటే అడగండి. తెలిస్తే తప్పకుండా చెబుతాను.

 3. vijaya sekhar gaaru ,
  ee artical chaalaa arthavanthangaa undi . naa aalochanaa dhorani ki chaalaa daggara gaa undi . mee articals chaalaa useful ga unnai ( especially for telugu medium students ) .

  oka request ,
  mana desham , republic india kaadaa , manadi inka dominion state ani oka friend cheppaadu . idi nijamenaa ?

  veelu kudirithey ee topic meeda oka article raayaalani aashistunnaanu.

 4. javeed గారూ, మీ మిత్రుడు చెప్పింది నిజం కాదు. ఇండియా ఇప్పుడు రిపబ్లిక్.

  ఆగస్టు 15, 1947 నుండి జనవరి 26, 1950 వరకు ఇండియా డొమినియన్ స్టేట్ గా ఉంది. జనవరి 26, 1950 తేదీన భారత రాజ్యాంగం ఆమోదం పొందినప్పటి నుండి ఇండియా రిపబ్లిక్ గా అవతరించింది. అప్పటి వరకూ పాక్షికంగా, నామ మాత్రంగా ఇండియా, బ్రిటిష్ ఆధీనంలోనే ఉంది. బ్రిటన్ నుండి ఒకరు అనంతరం ఇండియా నుండి ఒకరు (రాజగోలాచారి) బ్రిటిష్ ప్రభుత్వం తరపున గవర్నర్ జనరల్ గా వ్యవహరించారు. రాజ్యాంగం ఆమోదం పొందాక ఇండియా పూర్తి స్ధాయి రిపబ్లిక్ అయింది. అందుకనే జనవరి 26ను రిపబ్లిక్ డేగా వ్యవహరిస్తారు.

  అమెరికాలో లాగా మనది ఫెడరల్ వ్యవస్ధ కాదు. యూనియన్ మాత్రమే. అందుకే కేంద్ర మంత్రులను యూనియన్ మంత్రి అని ఆంగ్ల పత్రికలు చెబుతాయి. కోర్టులు కూడా యూనియన్ గవర్న్ మెంట్ అని సంబోధిస్తాయి. ఫెడరల్ వ్యవస్ధలో రాష్ట్రాలకు ఉండే అధికారాలు యూనియన్ లో ఉండవు.

  ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు రిపబ్లిక్ లు కాదు. అవి బ్రిటిష్ రాచరికాన్ని తమ రాజ్యాంగ అధిపతిగా అంగీకరిస్తాయి. అందువలన అవి రిపబ్లిక్స్ కాదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s