హాకీ ప్రత్యర్థి పాక్ ఐతే మన టీం సభ్యులు డజను -కార్టూన్


From The Hindu

From The Hindu

హాకీ ఆటలో ఒక్కో టీం లో ఎంతమంది సభ్యులు ఉంటారు? లెక్క ప్రకారం అయితే 11 మంది. భారత్ ప్రత్యర్థి పాకిస్ధాన్ ఐతే మాత్రం మనవాళ్లు 12 మంది ఆడుతారు. ఫీల్డ్ లో ఆడేది 11 మందే అయినా భారత టీం లో మరో అదృశ్య ప్లేయర్ తప్పనిసరిగా ఉంటారు. వారే మన విదేశాంగ శాఖ (Ministry of External Affairs –
MEA).

ఆటను ఆటగా ఉండనిస్తేనే అందం. ఆటలో ప్రభుత్వాలు, వారి తరపున రాజకీయ నాయకులు కూడా ఆటలో జొరబడితే ఆట స్వరూపమే మారిపోతుంది. భారత్ – పాక్ ల మధ్య మ్యాచ్ లు జరిగేటప్పుడల్లా ఈ మధ్య కాలంలో ఇదే జరుగుతోంది.

భారత్, పాకిస్ధాన్ జాతీయ టీం ల మధ్య ఏప్రిల్, మే నెలల్లో పది మ్యాచ్ ల సిరీస్ జరగాల్సి ఉంది. ఏప్రిల్ లో ఐదు మ్యాచ్ లు ఇండియాలోను మిగిలిన ఐదు మ్యాచ్ లు మే నెలలో పాకిస్ధాన్ లోనూ జరగాల్సి ఉండగా వీటికి భారత విదేశాంగ శాఖ అనుమతి ఇవ్వలేదు. అఫ్జల్ గురు ఉరి శిక్షకు వ్యతిరేకంగా పాకిస్ధాన్ పార్లమెంటు తీర్మానం ఆమోదించడం, కాశ్మీరులో సి.ఆర్.పి.ఎఫ్ బలగాలపైన ఆత్మాహుతి దాడి జరగడం దీనికి కారణంగా ప్రభుత్వం చెప్పింది.

జనవరిలో కూడా ఇలాగే జరిగింది. ఐ.పి.ఎల్ తరహాలో జరుగుతున్న లీగ్ మ్యాచుల్లో తొమ్మిది మంది పాక్ ఆటగాళ్లు కూడా ఆడుతున్నారు. సరిహద్దు వద్ద పాక్, భారత్ సైనికుల మధ్య ఘర్షణ జరగడంతో వీరిని ఇంటికి పంపేశారు. శివ సైనికులు, ముంబై ,ఢిల్లీల్లో ఆటను అడ్డుకోవడంతో ప్రభుత్వం సలహా మేరకు నిర్వాహకులు ఈ చర్య తీసుకోవాల్సి వచ్చింది.

ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నడుపుతోందా లేక బిజెపి నడుపుతోందా అన్న అనుమానాలు వస్తున్నాయంటే, మరి రావా?

21 thoughts on “హాకీ ప్రత్యర్థి పాక్ ఐతే మన టీం సభ్యులు డజను -కార్టూన్

 1. Nagasrinivasa గారు, సైనికుల తలలు పట్టుకుపోవడం మన సైనికులు ప్రారంభించిందే. మనవాళ్లు ప్రారంభించాకనే ప్రతీకారంగా వారాపని చేసారు. ఈ సంగతి ది హిందూ పత్రిక వివాదం రగులుతున్నపుడు ఎడిట్ పేజీ ఆర్టికల్ ద్వారా తెలిపింది.

  మీరు చెప్పిన సూత్రం ప్రకారం మనవాళ్లూ నీచులే. కను మన ఆటగాళ్లతో ఒక్క పాకిస్ధాన్ మాత్రమే కాదు, ఇంకే దేశమూ ఆడకూడదు. మీరు జనరలైజ్ చేసిన సూత్రాన్ని బట్టి అది క్రికెట్, బాడ్మింటన్ మొదలైన ఆటలకు కూడా వర్తిస్తుంది.

  ఒక కాశ్మీరు ముసలమ్మ లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్.ఒ.సి) దాటి అజాద్ కాశ్మీర్ లో ఉన్న తన పిల్లల దగ్గరికి వెళ్లిపోయింది. ముసలమ్మే దాటగా లేనిది ఇంకెవరైనా దాటుతారన్న భయంతో భారత ప్రభుత్వం ఎల్.ఒ.సి కి సమీపంలో బంకర్లు నిర్మిస్తోంది. ఇది ఐరాస తీర్మానానికి విరుద్ధం. సమస్య ఇక్కడే మొదలయింది.

  పత్రికలు ఇవేవీ చెప్పకుండా మనవాళ్ల తలలు పట్టుకుపోవడం పైనే హడావుడి చేసాయి. కనీస వివరాలు ఇవ్వాలన్న సూత్రాన్ని అవి విస్మరించాయి. రాజకీయ లబ్ది పొందుదామన్న రాజకీయ పార్టీల ఎత్తుగడలకు ఆ విధంగా అవి మద్దతుగా నిలిచాయి. ఇలాంటి సమయాల్లోనే ‘ది హిందూ’ లాంటి పత్రికల విలువ అర్ధం అవుతుందనుకుంటాను.

  ఇలాంటి చర్యలను ప్రజలు వ్యతిరేకిస్తారు. కనుకనే భావోద్వేగాలతో స్పందిస్తారు. ఆ స్పందనను రాజకీయాలకు ఉపయోగపెట్టుకోవచ్చు అని రాజకీయ పార్టీలకు తెలుసు. దశాబ్దాలుగా ఆ స్పందన కోసమే అనేక చర్యలు జరుగుతున్నాయి. అంటే ఇక్కడ స్పందన కోసం చర్యలు అనేది అర్ధం చేసుకుంటే చర్యలకు ప్రేరణ ఎక్కడ మొదలవుతుందో ఇట్టే అర్ధం కావడం లేదా!

 2. ” సైనికుల తలలు పట్టుకుపోవడం మన సైనికులు ప్రారంభించిందే. మనవాళ్లు ప్రారంభించాకనే ప్రతీకారంగా వారాపని చేసారు”….. ee vishyam meeru tappa… ee itara patrika rayaledu telugu lo… kanisam okka line kuda raayaledu… mari Hindu vaallaki ela telsindo aa vishayam

 3. Hindu lo raasau raasaru ane badulu.. daani taluka link emina ivvagalaremo chudandi… Naa uddesamlo asalu Ajjadi Kasmir anede ledu… mana nayakula chetagani tanam valla vaallu mana bhubhaganni aakraminchukuni daaniki aa peru pettukunnanaru… ddani vembadi bankarlu nirmiste tappem undi… adi kuda bharatadesam loni bhagame…..

 4. Pakistan kukka budhi teliyanidi evariki… swatamtram vachina time lo girijanula musugu lo war ki vachindi.. madhala 2 times, recent ga 10 yrs back kargil lo war… . ఇది ఐరాస తీర్మానానికి విరుద్ధం kaada… inni anubhavalayyaka kuda bankarlu nirminchukuni jaagrattaga undaka pote.. mana bratuku kuda kukka bratuke avutundi…

 5. Nagasrinivasa గారు, పత్రికల పనే సమాచారం సేకరించడం. కనుక మీకు ఎలా తెలిసింది అని ‘ది హిందు’ పత్రికని అడగడం అంత బాగోదేమో.

  పాకిస్ధాన్, బంగ్లాదేశ్ కూడా ఒకప్పుడు ఇండియాలో భాగమే కాని కాశ్మీర్ 1947 ముందు ఎప్పుడూ ఇండియాలో భాగంగా లేదు. అదొక స్వతంత్ర రాజ్యం. కాశ్మీరీలు ప్రత్యేక జాతికి చెందిన వారు. వారికి మొదటినుండి స్వతంత్ర అస్తిత్వం ఉంది. ఆ స్వతంత్రాన్నే వారు తిరిగి కోరుకుంటున్నారు.

  కాశ్మీరు ప్రజలు ఇటు ఇండియాలో గాని, అటు పాకిస్ధాన్ లో గానీ కలవాలనుకోవడం లేదు. వారికి స్వంతం అయిన స్వతంత్రతనే వారు కోరుకుంటున్నారు. కనుక కాశ్మీర్ ని పాక్ అక్రమించినా, ఇండియా ఆక్రమించినా అది ఆక్రమణే తప్ప స్వంత భూభాగం కాదు. కాశ్మీరు అంటే చెట్టూ, పుట్టా, నేలా కాదనీ అక్కడి ప్రజలని అంగీకరిస్తే ఆ ప్రజలకు తమ వర్తమానాన్నీ, భవిష్యత్తును నిర్ణయించుకునే హక్కు ఉంటుంది. ఈ హక్కును ఐరాసతో సహా దేశాలన్నీ సూత్రరీత్యా అంగీకరిస్తాయి. కాని ఆచరణలో కుంటిసాకులు చెప్పి ఎగవేస్తాయి.

  కాశ్మీరు ఇండియాలో విలీనం అయిందని చెప్పడం చారిత్రక అబద్ధం. పాక్ ప్రేరేపిత కిరాయి సైన్యం నుండి తప్పించుకోవడానికి అప్పట్లో ఇండియా సాయం కోరారు. విలీనం చేస్తే సాయం చేస్తాం అని భారత పాలకులు ఒత్తిడి చేశారు. విలీనానికి ఒప్పుకోకుండా మూడు శాఖలను మాత్రం భారత ప్రభుత్వానికి అప్పజెప్పారు. ఇతర శాఖలన్నీ తమ స్వాధినంలోనే ఉంచుకున్నారు. సమస్య నుండి బైటపడ్డాక ఫ్లెబిసైట్ జరిపి కాశ్మీరు ప్రజలు ఏది కోరుకుంటే అలా చేయాలని కోరారు. అందుకు నెహ్రూ అంగీకరించాడు. ఆ విధంగా పాక్, ఇండియా సైనికులు కలిసిన చోట ఐరాస జోక్యంతో లైన్ ఆఫ్ కంట్రోల్ గీసారు. కాశ్మీర్ ని ఒక వంతు పాక్, రెండొంతులు ఇండియా పంచుకున్నట్లయింది. ఈ విభజన వెనుక ఇంగ్లండ్ సామ్రాజ్యవాద కుట్ర ఉంది. విభజించి పాలించే దుర్నీతి ఉంది.

  ఆ తర్వాత ఫ్లెబిసైట్ వాగ్దానాన్ని నెహ్రూ ఉల్లంఘించాడు. కాశ్మీరు ప్రజలను నిలువునా మోసం చేశాడు. వాగ్దానం నిలుపుకోమని అడిగినందుకు షెక్ అబ్దుల్లాను 18 సంవత్సరాలు జైలు పాలు చేశారు. (ఆయన కొడుకు, మనవడు కాశ్మీరు ద్రోహులుగా కీర్తి పొందారు.) ఆర్టికల్ 370 ప్రవేశపెట్టి స్వయం ప్రతిపత్తి ఇస్తున్నాం అన్నారు. ఇప్పుడు అది కూడా నామమాత్రం. సైన్యాన్ని దింపి AFSPA ద్వారా సైనిక పాలన సాగిస్తున్నారు. అత్యాచారాలతో, అర్ధరాత్రి సోదాలతో, యువకుల మాయంతో కాశ్మీరు ప్రజలకు నిత్యం నరకం చూపిస్తున్నారు.

  ఈ నేపధ్యంలో కాశ్మీరు భూభాగం గురించి పత్రికలు వ్యాప్తి చేస్తున్న సెంటిమెంట్లకు అర్ధం లేదు. జాతుల స్వతంత్ర కాంక్షలు సహజమైనవి. బ్రిటిష్ పాలన నుండి విముక్తి కావాలని భారతీయులు కోరుకున్నట్లే ఇండియా, పాక్ ల నుండి విముక్తి కావాలని కాశ్మీరీలు కోరుతున్నారు. భారతీయులు కోరుకుంటే జాతీయోద్యమం, కాశ్మీరీలు కోరుకుంటే టెర్రరిజం అనడం పాక్షిక దృక్పధం. స్వార్ధ పరిశీలన కూడా.

  ఇకపోతే పాకిస్ధాన్ ఒక దేశం. అక్కడ ప్రజలు నివసిస్తున్నారు. వారు మనుషులు. మనకి ఉన్నట్లే మర్యాద, మన్నన, గౌరవం, వ్యక్తిత్వం, జాతీయ తత్వం ఇవన్నీ ఉంటాయి. అలాంటి వారిని కుక్క అనీ, ఇంకోటనీ ద్వేషించడం తగని పని. సమస్యలు ఉంటే పరిష్కారం చేసుకోవాలి తప్ప విద్వేషం రెచ్చగొట్టుగోకూడదు. అలా చేస్తే అంతిమంగా బలయ్యేది ప్రజలే, పాలకులు కాదు. పైగా విద్వేష రాజకీయాలు పాలకులకి లాభం.

  కార్గిల్ యుద్ధం గురించిన వాస్తవాలు మరో సందర్భంలో చర్చిస్తాను. కాశ్మీర్ గురించిన వివరాలు మిత్రులకు ఉపయోగపడతాయని రాసాను. మనకు ఇష్టం ఉన్నా లేకున్నా ఇవే వాస్తవాలు. మన సెంటిమెంటుకి అనుగుణంగా చారిత్రక వాస్తవాలు మారవు.

  ది హిందూ ఆర్టికల్ కి లింక్ వెతకాలి. ప్రస్తుతం వేరే పనిలో ఉన్నాను. అదయ్యాక వెతికి ఇస్తాను.

 6. kashamir to shaha manaki swatantrm vachesamayaniki 548 sanstanala varaku desam lo swatantram ga undevi…. avanni desam lo patel krushi karanam ga kalisipoyai…. hyderabad and Kashmir to matrame godava vachindi … sinika charya to hyd ni kalupu kunnaru.. kashmir mida pakistan mookalu daadi cheste …. aa palakulu manalni sahayam adigaru.. appudu vilinam ite sayam chestanu annaru …. aa vidham ga Kashmir desam lo kalisipoindi…. idi ee nati varaku memu paatalalo chaduvu kunnana di…. meeru kotta kotta vishayalu chepparu.. santosham…..ika pakistan ni dweshinchadam antara … manam vaallaki sneha hastam ichina vaallu manalni vanchistaru ani enno sarlu vaalle nirupincharu…. ika sinikula talala sangati gurinchi miru cheppina vashayam ee patrika lonu raledu… nijam ga jarigi unte … mana desam meeda visha pracharam chese Pakistan ippati varaku daani gurinchi prastavincha kunda untunda… Pakistan noti venta kuda aa mata ippati daka vinaledu…. manam sneha hastam enni sarlu ichina vaari budhi alane untundi ani vaalle enno sarlu nirupinchukunnaru… anduke varidi kukka budhi annanu…

 7. Nagasrinivasa గారు మీరే కాదు, పాఠాల్లో నేను చదివిందీ అదే. పాఠాలు రాసేది ప్రభుత్వాలు. ప్రభుత్వాలు ప్రజల కోసమే అని చెబుతున్నారు గానీ ఆచరణలో అవి ధనిక వర్గాల కోసమే పని చేస్తున్నాయి. ఆ ధనికవర్గాలే పాలకులు, ప్రభుత్వం. కాబట్టి మనకి పాఠాల ద్వారా తెలిసేది వారి వర్షనే. పాఠాల ద్వారా అన్నీ వాస్తవాలే తెలుస్తాయని నమ్మకం లేదనడానికి, ఇదిగో, ఈ కాశ్మీరే ఒక సాక్ష్యం.

  జాతీయోద్యమం గురించి కూడా పాఠాల ద్వారా మనకు తెలిసినవి కొద్ది విషయాలయితే తెలియనివి (దాచిపెట్టినవని నా అర్ధం) బోలెడు.

  పోతే నేను చెప్పిన విషయాలు కొత్తవి కావు. చాలా పాతవి. అనేకమంది చరిత్రకారులు దీనిని గ్రంధస్తం చేసారు. ఐరాస రికార్డులు, పాక్, ఇండియా ప్రభుత్వాల రికార్డులు వెతికినా ఇవి దొరుకుతాయి. నిజం ఏమిటో తెలుసుకోవాలన్న దృష్టి ఉంటే సమాచారం అనేక చోట్ల దొరుకుతుంది.

  ప్రజల దృక్పధం లేని పత్రికలు సాధారణంగా పాలక వర్గాలకు అనుగుణంగా పోతుంటాయి. ప్రభుత్వాలు నడిపే వారు చెప్పేవే నిజాలుగా ప్రచారం చేస్తాయి. ఆర్ధిక కారణాల రీత్యా అది వారికి కూడా అవసరమే. అందువలన నిజాలు దొరకబుచ్చుకోవడం కొంత కష్టంగానే ఉన్నా అసాధ్యం అయితే కాదు.

  పాక్ గురించి మన పత్రికలు ఎలా చెబుతాయో ఇండియా గురించి అక్కడి పత్రికలు అలాగే చెబుతాయి. మనకి పాక్ సైనికుల దురాగతాలు చెబితే అక్కడి ప్రజలకు ఇండియా సైనికులు దురాగతాల గురించి చెబుతాయి. ఈ రెండూ నిజమే కావచ్చు. మనం తెలుసుకోవలసిన వాస్తవం ఏమిటంటే ఈ దురాగతాలు ఇరు దేశాల ప్రజలకు ఏ విధంగానూ ఉపయోగపడవు. రెచ్చగొట్టి ఓట్లు నొల్లుకోవడానికి రాజకీయ పార్టీలకు మాత్రం బాగా ఉపయోగపడతాయి.

  ఇండియా సైనికులు పాక్ సైనికుల తలలు తీసుకుపోవడం గురించి పాక్ ఐరాస కు ఫిర్యాదు చేసింది. ఒకసారి కాదు. అనేకసార్లు. ఆ సంగతి మన పత్రికలు చెప్పలేదు. అంతే తేడా.

  ది హిందూ పత్రిక నుండి రెండు లింక్ లు ఇస్తున్నాను. సీనియర్ జర్నలిస్టు ప్రవీణ్ స్వామి రాసిన ఆర్టికల్స్ ఇవి. శ్రమ అనుకోకుండా పూర్తిగా చదవగలిగితే కొన్ని నిజాలు మీ దృష్టికి వస్తాయి. ప్రవీణ్ విమర్శలకు ప్రభుత్వం అర్ధ సమాధానం ఇచ్చింది. ఆ సంగతి కూడా ఒక ఆర్టికల్ లో ఉన్న లింక్ ద్వారా చూడొచ్చు.

  జనవరి 10 న రాసిన ఆర్టికల్ ఇది.

  http://www.thehindu.com/news/national/runaway-grandmother-sparked-savage-skirmish-on-loc/article4291426.ece

  ఇది జనవరి 30 న రాసింది.

  http://www.thehindu.com/news/national/locked-in-un-files-15-years-of-bloodletting-at-loc/article4358199.ece

  పాఠాలు కాసేపు పక్కన పెట్టి మీకు ఇంతవరకు ఏమీ తెలియదని భావిస్తూ నిష్పాక్షిక దృష్టితో ఈ ఆర్టికల్స్ చదివేందుకు ప్రయత్నిస్తే వాస్తవానికి కొంత దగ్గరగా వెళ్లొచ్చు. ఇది నా సలహా మాత్రమే. ఆ తర్వాత మీ ఇష్టం.

 8. Though I am an anti-Hindu, I cannot justify the demand of independence for Kashmir. Even Vizianagaram, Paralakhemundi, Kalahandi and Jeypore etc were princely states under British and those states did not demand independence from post-British India. How can we justify the demand of Kashmiris just because Kashmir was a separate Kingdom in past? Even Kalahandi was a separate kingdom and kings of Kalahandi did work under British mandate as Kashmir’s kings did. Do you support the formation of nation on the basis of a territory occupied by an autocratic (raacharika) dynasty?

 9. ప్రవీణ్ గారు, గ్రామర్, మార్ఫాలజీ లలో మీకు పాఠాలు చెప్పగలవారు కూడా ఉంటారు. ఇక్కడ విషయం ప్రధానం తప్ప భాష కాదు. నాగశ్రీనివాస గారు చెప్పదలిచింది మీకు అర్ధం అయిందని మీ వ్యాఖ్యే చెబుతోంది. దాన్ని వదిలి భాష పైన సుద్దులు చెప్పబూనడం అసందర్భం, అసంగతం. గమనించగలరు.

 10. అదొక స్వతంత్ర రాజ్యం. కాశ్మీరీలు ప్రత్యేక జాతికి చెందిన వారు. వారికి మొదటినుండి స్వతంత్ర అస్తిత్వం ఉంది. ఆ స్వతంత్రాన్నే వారు తిరిగి కోరుకుంటున్నారు.

  In that case, the original Kashmiri’s were the kashmiri pundits.
  Millions of them were massacred and driven away from their homes to Delhi and other places.
  I wonder what is their opinion of what was once their homeland.
  There is no denying that the land is now as much as it is of Muslims as the pundits.
  But what abt the pundits and others who became minorities now?
  Interestingly no one bothers to write about them, nor the recent incident in Bangladesh where hindus were persecuted in large numbers.
  I like this website, but there is no mention anywhere.

 11. ప్రవీణ్ గారు,

  నేను నాగశ్రీనివాస గారికి బదులిస్తూ ఇలా రాశాను.

  >>పాకిస్ధాన్, బంగ్లాదేశ్ కూడా ఒకప్పుడు ఇండియాలో భాగమే కాని కాశ్మీర్ 1947 ముందు ఎప్పుడూ ఇండియాలో భాగంగా లేదు. అదొక స్వతంత్ర రాజ్యం. కాశ్మీరీలు ప్రత్యేక జాతికి చెందిన వారు. వారికి మొదటినుండి స్వతంత్ర అస్తిత్వం ఉంది. ఆ స్వతంత్రాన్నే వారు తిరిగి కోరుకుంటున్నారు.

  కాశ్మీరు ప్రజలు ఇటు ఇండియాలో గాని, అటు పాకిస్ధాన్ లో గానీ కలవాలనుకోవడం లేదు. వారికి స్వంతం అయిన స్వతంత్రతనే వారు కోరుకుంటున్నారు. కనుక కాశ్మీర్ ని పాక్ అక్రమించినా, ఇండియా ఆక్రమించినా అది ఆక్రమణే తప్ప స్వంత భూభాగం కాదు. కాశ్మీరు అంటే చెట్టూ, పుట్టా, నేలా కాదనీ అక్కడి ప్రజలని అంగీకరిస్తే ఆ ప్రజలకు తమ వర్తమానాన్నీ, భవిష్యత్తును నిర్ణయించుకునే హక్కు ఉంటుంది. ఈ హక్కును ఐరాసతో సహా దేశాలన్నీ సూత్రరీత్యా అంగీకరిస్తాయి. కాని ఆచరణలో కుంటిసాకులు చెప్పి ఎగవేస్తాయి.>>

  ఇందులో కాశ్మీరు గతంలో ప్రత్యేక కింగ్ డమ్ గా ఉన్నందున లేదా రాచరిక పాలకుల ఆధ్వర్యంలో ఉన్నందున స్వతంత్రంగా ఉండడానికి అర్హులు అని అర్ధం వచ్చె విషయం ఏమన్నా ఉన్నదా?

  కాశ్మీరీలకు ప్రత్యేక జాతీయ అస్తిత్వం ఉన్నదని వారు మొదటి నుండీ ప్రత్యేక (జాతి) రాజ్యంగా అస్తిత్వం కలవారనీ, ఆ పునాది పైనే స్వతంత్రం కోరుతున్నారని చెప్పాను. జాతుల స్వయం నిర్ణయాధికారాన్ని కమ్యూనిస్టు సిద్ధాంతం గుర్తిస్తుందని మీకు తెలియకపోతే తప్పు లేదు. చర్చ ద్వారా తెలుసుకునే అవకాశం ఎలాగూ ఉంటుంది. కాని లేని అర్ధాన్ని తీస్తే ఎలా?

  “దేశాలు స్వతంత్రాన్ని కోరుతున్నాయి. జాతులు విముక్తిని కోరుతున్నాయి. ప్రజలు విప్లవాన్ని కోరుతున్నారు” అని మావో జెడాంగ్ చెప్పిన సంగతి జగద్విదితం. బహుశా మీరు వినలేదేమో.

  జాతుల స్వయం నిర్ణయాధికారాన్ని గుర్తించడం ద్వారా మాత్రమే వివిధ జాతులను కలిపి ఉంచగలమని లెనిన్ చెప్పారు. చెప్పడమే కాదు, విప్లవానంతరం ఆయన తీసుకున్న మొదటి చర్యల్లో జాతులకు విడిపోయే హక్కును గుర్తించడం ఒకటి. ఆ మేరకు బాల్టిక్ రిపబ్లిక్కులు (లాత్వియా, లిధువేనియా, ఎస్తోనియా) స్వతంత్రం ప్రకటించుకుని విడిపోయాయి కూడా.

  కాశ్మీరుని భారత భూభాగంగా ఉంచుకోవాలనుకుంటే ముందు అక్కడి ప్రజల నమ్మకాన్ని పొందాలి. వారికి తగిన గౌరవం ఇవ్వాలి. వారి ప్రజాస్వామిక ఆకాంక్షలని నెరవేర్చాలి. సైన్యం దింపి నిత్యం హత్యలతో, దాడులతో, అత్యాచారాలతో అణచివేస్తే ఏ జాతీ సహించదు. జాతి దాకా ఎందుకు వ్యక్తులు, కుటుంబాలే సహించరు. మిలిటెన్సీకి పునాది ప్రజాస్వామిక ఆకాంక్షల అణచివేత. టెర్రరిజం ఆ తర్వాత పుట్టిందే. సమస్య ఉన్నపుడు ఆ మంటల్లో చలికాచుకునే శక్తులు ఎప్పుడూ ఉంటాయి. ఆ సంగతి గుర్తిస్తే ఎవరిని వ్యతిరేకించాలి. ఎవరికి మద్దతు ఇవ్వాలి అనే విషయంలో స్పష్టత వస్తుంది.

 12. వెంకట్ గారు,

  జమ్ము & కాశ్మీరు లో మొదటి నుండి ముస్లింలే మెజారిటీ. డోగ్రా పాలకుల కాలంలో కూడా పండిట్ ల సంఖ్య లక్షకు మించలేదు. స్వతంత్రం అని చెబుతున్న కాలానికి వారి జనాభా 1.5 లక్షలని అంచనా. కొంతమంది మూడు లక్షలని కూడా చెబుతారు. అంతకు మించి పెద్ద సంఖ్య ఎవరూ చెప్పలేదు. కనుక మీరు చెప్పినట్లు మిలియన్ల కొద్దీ అన్న సంఖ్య ఎగ్జాగరేషన్ అని చెప్పక తప్పదు.

  పండిట్ లకు కూడా కాశ్మీర్ లోయలో నివసించే హక్కు ఉంది. కాకపోతే మైనారిటీలుగా ఉంటారంతే. మైనారిటీలు ఎక్కడ లేరు? జె.కె.ఎల్.ఎఫ్ తో పాటు హురియత్ కాన్ఫరెన్స్ కూడా పండిట్ లను తిరిగి రావాలని అనేకసార్లు విజ్ఞప్తి చేసారు. కాశ్మీరు సమస్య పరిష్కారం అయ్యేవరకూ పండిట్ ల సమస్య కూడా అలాగే ఉంటుంది. మెజారిటీ ప్రజలకు లేని శాంతి మైనారిటీ ప్రజలకు మాత్రం ఎలా వస్తుంది చెప్పండి?

  ముస్లిం ఫండలిస్టు పార్టీలు నిన్న మొన్నటి వరకు అక్కడ కాణీకి కూడా చెల్లలేదు. భారత పాలకుల (ప్రజలు కాదు) అణచివేత విధానాలే వారి బలాన్ని పెంచాయి. 1947లో ఇండియాని నిండుమనసుతో ఆహ్వానించిన కాశ్మీరీలు ఇప్పుడు ఎందుకు ద్వేషిస్తున్నారో తర్కించుకోవాలి.

  కాశ్మీరీలు స్వతహాగా సెక్యులరిస్టులు. వారి సాంప్రదాయాలు సెక్యులరిస్టు ధోరణికి అనుకూలంగా ఉంటాయి. సమస్య ఉన్నపుడు దానికి ప్రతిస్పందనగా ఆ చివర, ఈ చివర తీవ్రవాదం వైపుకి ఆకర్షితులయ్యే సెక్షన్ ఎప్పుడూ ఉంటుంది. వారిని ప్రధానంగా తీసుకుంటే సమస్య పట్ల సమగ్ర అవగాహనకు రాలేము.

  పోతే, బంగ్లాదేశ్ అయినా, పాకిస్ధాన్ అయినా సమస్య పట్ల నాకు రాయగల అవగాన ఉంటే తప్పక రాస్తాను. పాక్ లో హిందువుల అణచివేత గురించి, వారిపైన దాడుల గురించి నేను గతంలో రాశాను. బంగ్లాదేశ్ అనే కాదు, నేను రాయని విషయాలు చాలా ఉన్నాయి. నాకు వీలయినప్పుడు రాయడానికి ప్రయత్నిస్తాను.

  ఏ మతం ఐనా, ప్రాంతం ఐనా ప్రజల పక్షం వహించడమే ఈ బ్లాగ్ లక్ష్యంగా గుర్తించగలరు.

 13. Even Stalin refused to give autonomy to his own nation “Georgia” but he did create a separate autonomous oblast for jews to prevent them from getting attracted towards Israel’s Zionism. I did not support the atrocities committed by Indian army in Kashmir. If every tribe has right for autonomy, even I can raise separate country demand in those districts where my tribe is majority in population. India was never united as single nation either in sense or practice.

 14. vishekar garu… kashmir ki svathanthram ivadam lo tappem ledu… kani ah tarvata akkada afghanistan tarahalo ugravadam perigi india and prapancha desalaku penu savaluga maradani guarantee unda…?? ipati paristitullo kashmir tanaku tanu ga ugravadulanundi rakshinchukune samarthyam ledu… kanuka ipatiki kashmir india lo kalisi undatame melu…
  kashmir prajalu kuda ardam cheskovalsina visayam entante, pakistan tanu akraminchina POK ni svathanthramga vadiliveyaledu?? alanti desanni nammi india pi agrahinchadam samanjasama…?
  chivariki nen cheppadalchukunedi emanaga,, ipatlo kashmir ki svathanthram dvara akadi prajalu marintha ugravadha oobi lo kuruku povdame tappa vallaki etuvanti labham ledu…

 15. “దేశమంటే మట్టి కాదోయ్: దేశమంటే మనుషులోయ్” గురజాడ గారి ఈ వాక్యాన్ని ఎవరు ఎంతగా అర్థం చేసుకున్నారనే దాన్ని బట్టి, కాశ్మీర్ మీద వారి అభిప్రాయాలు మారుతుంటాయి.
  ఇకపోతే దిహిందూ పత్రికలో ఆ వార్త చాలామందిని షాక్ కి గురిచేసింది. ఎందుకంటే దేశంలోని రాజకీయ పార్టీలు, మరియూ మీడియా సైనికుల తలలు తీసుకుపోయిన విషయాన్ని గురించి సాధ్యమైనంత యాగీ చేయాలని గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నై. అలాంటి సంధర్భంలో వచ్చిన దిహిందూ వ్యాసం ఆ (దురా)ఆవేశాలన్నింటినీ తుత్తునియలు చేసింది. ఆ రోజే నా బ్లాగులో కూడా ఈవిషయాన్ని గురించి రాయడం జరిగింది. దాని లింక్ –
  http://andamainacheekati.blogspot.in/2013/01/blog-post.html
  హిందూ పత్రికకూ, మన తెలుగు పత్రికలకూ మధ్య నక్కకూ, నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. తెలుగు మీడియాలో మంచి విశ్లేషణలు లేని లోటును మీ బ్లాగు కొంతవరకూ తీరుస్తున్నందుకు ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s