సెల్ ఫోన్ల వాడకం నిస్సందేహంగా ప్రమాదకరమేనని కేంద్ర ఆరోగ్య మంత్రి గులాం నబీ ఆజాద్ సాక్ష్యాత్తూ లోక్ సభలోనే ధృవపరిచారు. ఆ విషయం 1800 కు పైగా జరిగిన పరిశోధనల్లో తేలిందని మంత్రి గారు చెప్పిన సంగతిని ఆంధ్ర జ్యోతి పేపర్ తెలియజేసింది. పేపర్ వార్తను కింద చూడవచ్చు.
ఆజాద్ ప్రకటనను బట్టి సెల్ ఫోన్లతోనే కాక సెల్ టవర్లతో కూడా ముప్పే అని తెలుస్తోంది. సెల్ టవర్ల వల్ల పిచ్చుకల జాతి అంతరించుకుపోతోందని వచ్చిన వార్తలు నిజమేనని అర్ధం చేసుకోవచ్చేమో. సెల్ టవర్ల వద్ద నివసించే ప్రజలు తరచుగా వ్యక్తం చేస్తున్న ఆందోళనలు న్యాయమేనని కూడా స్పష్టం అవుతోంది. నష్ట నివారణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పిన మంత్రి గారు ఆ చర్యలేమిటో చెప్పినట్లు లేదు. ప్రజలే తగిన జాగ్రత్తలు -ఎక్కువగా సెల్ ఫోన్లు వాడకుండా ఉండడం, ఫోన్ ఉంది కదాని అదే పనిగా సె(సొ)ల్లు కబుర్లు చెప్పుకోకుండా ఉండడం, సెల్ ఫోన్ కంపెనీలు ఎక్కడంటె అక్కడ టవర్లు నెలకొల్పకుండా జాగ్రత్త వహించడం మొ.వి- తీసుకోవలసిన అవసరం ఇపుడు ఇంకా ఎక్కువైనట్లే.