పాప పుట్టిందా? ఐతే తండ్రిని అడగండి!


girl child

(ఒక పబ్లిక్ సెక్టార్ కంపెనీలో డిప్యూటీ జనరల్ మేనేజర్ గా పని చేసి రిటైర్ అయిన ఎం.వి.రమణ మూర్తి ది హిందు పత్రిక రాసిన వ్యాసానికి యధాతధ అనువాదం ఇది. చాలా మంది విస్మరించే ఒక శాస్త్రీయ వాస్తవాన్ని గుర్తు చేస్తూ ఒక సామూహిక విస్మరణను సవరించుకుంటే ఆడపిల్లల బతుకులకు కాస్తయినా గ్యారంటీ లభిస్తుందని ఆశిస్తూ ఆయన ఈ వ్యాసం రాసినట్లు కనిపిస్తోంది. మహిళా లోకం ఎదుర్కొంటున్న వ్యవస్థాగత అణచివేతకు రచయిత సూచించిన పరిష్కారానికి పరిమితులు ఉన్నప్పటికీ అది విస్మరించలేనిదని అంగీకరించక తప్పదు. –విశేఖర్)

***           ***           ***

ఇద్దరూ కూలీలే అయిన మహారాష్ట్ర దంపతులు విశ్వనాధ్ గుజార్, తారామతి లు అప్పుడే పుట్టిన తమ కూతురుని వద్దనుకుని అనాథ శరణాలయానికి ఇచ్చేయాలని భావించారు. ఎందుకంటే వారికి కూతురు అవసరం లేదు, కొడుకే కావాలి.

హర్యానాలో XYZ అనే గ్రామంలో ఒక పురుషుడు తన భార్యతో కలిసి తమ కోడలిపై కిరోసిన్ పోసి నిప్పు పెట్టారు. ఇరుగు పురుగు సమయానికి వచ్చి అడ్డు పడడంతో ఆ కోడలు పిల్ల బతికిపోయింది. ఆ అత్తా, మామలకు తమ కోడలి పైన తీవ్రంగా కోపం రావడానికి కారణం, ఆమె మూడో సారి కూడా అబ్బాయికి బదులు అమ్మాయికి జన్మనివ్వడం.

బీహార్ లోని ABC అనే గ్రామంలో ఒక పురుష పుంగవుడు తన భార్యను బెల్టుతో చావబాదాడు. బెల్టు దెబ్బలకు తీవ్రంగా రక్తం కారుతుండగా ఆమె ఆసుపత్రి పాలయింది. ఆమె పరిస్ధితి ఆందోళనకరంగా ఉంది. ఆమె నేరం? రెండోసారి ఆడపిల్లకు జన్మనివ్వడం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని PQR అనే గ్రామంలో ఒక పురుషుడు డాక్టర్ల చేతులు తడిపి అల్ట్రా సోనిక్ పరీక్ష ద్వారా తన భార్య కడుపులో ఉన్నది ఆడ పిండం అని తెలుసుకుని తన తల్లిదండ్రుల అండదండలతో భార్యకు అబార్షన్ చేయించాడు.

నిరక్షరకుక్షులతో పాటు విద్యావంతులు కూడా పసి వారి జన్మాల విషయంలో అవివేకులుగా వ్యవహరిస్తున్నారు. శాస్త్రం విజ్ఞానం పట్ల ఉన్న అజ్ఞానం, మూఢ నమ్మకాలు వెరసి విచారకరమైన పరిస్ధితులకు దారితీస్తున్నాయి. పిండం యొక్క లైంగికతను ప్రకృతి నిర్ణయిస్తుంది, మరియు అదొక సంభావ్యత (conjecture) కూడాను.

ఆడ పిల్ల జన్మించడానికి బాధ్యత తల్లిదా? కణజాల శాస్త్రం ఏమి చెబుతుందో ఒక సారి తార్కికంగా పరిశీలిద్దాము.

ఒక వెయ్యి అంటే ఒకటి పక్కన మూడు సున్నాలు; ఒక మిలియన్ అంటే ఒక వెయ్యి వేలు (1,000,000); ఒక బిలియన్ అంటే ఒక వెయ్యి మిలియన్లు (1,000,000,000); ఒక ట్రిలియన్ అంటే ఒక వెయ్యి బిలియన్లు (1,000,000,000,000). ఒక పురుషుడు గానీ, స్త్రీ గానీ దాదాపు వంద ట్రిలియన్ల కణాలతో నిర్మితమై ఉంటారు. కణం అనేది మానవుడికి ప్రాధమిక నిర్మాణ యూనిట్. జీవం ఉన్న ప్రతి జీవికి కూడా ఇది వర్తిస్తుంది.

మానవ శరీరం ట్రిలియన్ల కణాలతో నిర్మితమై ఉంటుంది. అవి శరీరానికి నిర్మాణాన్ని సమకూరుస్తాయి, ఆహారం నుండి పుష్టిని (nutrient) స్వీకరిస్తాయి, న్యూట్రియెంట్లను శక్తిగా మార్చుతాయి, ప్రత్యేక విధులను నిర్వహిస్తాయి. శరీరం యొక్క వారసత్వ పదార్ధాన్ని కూడా కణాలు కలిగి ఉంటాయి. అవి తమను తాము కాపీ చేసుకోగలుగుతాయి.

మానవునిలో ప్రతి కణము మామూలుగా 23 జతల క్రోమోజోములు కలిగి ఉంటుంది. అంటే మొత్తం 46 క్రోమోజోములు. ఇందులో ఆటోజోములు అని పిలవబడే 22 జతలు పురుషులలోనూ, స్త్రీలలోనూ ఒకే రకంగా ఉంటాయి. 23వ జత లైంగికతను నిర్ధారించే క్రోమోజోములు, అవి స్త్రీ, పురుషులిరువురిలో వేరు వేరుగా ఉంటాయి. స్త్రీలు రెండు X క్రోమోజోములు ఉంటే, పురుషులు ఒక X క్రోమోజోము, ఒక Y క్రోమోజోము కలిగి ఉంటారు.

పిండానికి స్త్రీలు కేవలం X క్రోమోజోము మాత్రమే అందజేస్తారు. పురుషుడు కూడా X క్రోమోజోమునే అందజేస్తే రెండూ X క్రోమోజోములే కనుక ఆడపిల్ల జన్మిస్తుంది. కానీ పురుషుడు Y క్రోమోజోము అందజేస్తే పిండానికి ఒక X క్రోమోజోము, ఒక Y క్రోమోజోము లభించి మగపిల్లవాడు జన్మిస్తాడు. కనుక పిండం యొక్క లైంగికతను నిర్ణయించడంలో పురుషుడే నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాడు. ఈ అద్భుతమైన వాస్తవం ఇంతవరకూ విస్తృత ప్రచారానికి నోచుకోకపోవడం ఆశ్చర్యకరం. ఆడపిల్ల జననానికి ప్రతిసారి అమాయక భార్యలే నిందలు ఎదుర్కుంటారు. దోషి అయిన భర్త ఇతరులతో కంఠం కలిపి ఆమెను నిందిస్తూ శిక్షించడానికి పూనుకుంటున్నారు.

ఈ వాస్తవాన్ని ముద్రించినట్లయితే, ఈ నిందాట ఇంతటితో తేలికపడి మహిళలకు అత్యంత అవసరమైన ఉపశమనాన్ని చేకూర్చుతుంది. బహుశా, ఆడపిల్లకు జన్మజిచ్చిన పాపానికి శిక్షగా మహిళలపై కొనసాగుతున్న అనేక వేల నేరాలనుండి వారిని కాపాడినవారం అవుతాము.

శాస్త్రం మరియు సంభావ్యతల ఫలితమే అయినప్పటికీ, తాతమ్మ నాయనమ్మలు అబ్బాయే కావాలని, అమ్మాయి వద్దని అనుకున్నట్లయితే వారు తమ కొడుకుని తప్పు పట్టాలి తప్ప కోడలు పిల్లని కాదు. తేలికపాటి అర్ధంలో తీసుకున్నట్లయితే, ఒక జంట కూతురు కాక, కొడుకు కావాలని భావిస్తూ మతపరమైన ఆచారాన్ని (వ్రతం) పాటించదలిస్తే, దానిని పురుషుడు పాటించాలి తప్ప అతని భార్య మాత్రం కాదు.

7 thoughts on “పాప పుట్టిందా? ఐతే తండ్రిని అడగండి!

 1. Nice
  I wanna add one more point to the article
  As said above, there are total 4 chromosomes involve to decide gender.
  These 4 chromosomes are X,X( from mother) X,Y(from father ).so, due to probability there is more chance to born baby girl(if people let the baby born)
  That’s why female percent is more than male in America

 2. Hello Prasad
  The story you heard that, was totally a myth.
  I want to give an example here. if there is 10 red balls and 5 yellow balls in a box
  There is more chances to pick the read, so the probability to pick yellow is 5/15 and to pick read is 10/15.
  Conclusion
  You can’t really control the happening of probability by enthuse or any other emotional feelings or what ever ….

 3. అంటే సంపర్కం చెందడం వలన ఆ బాధ అనుకుంటా అయితే సంపర్కించడం మానేద్దాం అప్పుడు 2X సరిపోద్ది కదా.

 4. ఎం.వి.రమణ మూర్తి వ్రాసిన దాంట్లో శాస్త్రీయత మాట ఎలా ఉన్నా గాని, ఒక తప్పును సరి చేయడానికి ఇంకో తప్పును ఆచరణ లో తేవడం ఎంత వరకు మంచిది? ఈ అవగాహన ఇప్పుడు ఆడ పిల్లల పట్ల, వారిని కన్న తల్లుల పట్ల జరుగున్న అన్యాయాన్ని కొంత వరకు తగ్గే పరిస్తితులు కల్పించ వచ్చు. కాని
  ఆడపిల్లలు పుట్టడానికి తండ్రి దే తప్పు అంటే, ఆడ పిల్ల పుట్టడం తప్పు అనే భావన అలాగే ఉన్నట్లే కదా. అసలు సమస్య, ఆడ పిల్ల పుట్టడం ఎందుకు తప్పు, లేదా ఎందుకు తక్కువ అనే భావన ఉంది అని. అసలు సమస్య కు తండ్రి దే తప్పు అనే సిద్ధాంతం ఎంత వరకు పరిష్కారం చూపిస్తుంది?

  ఆడపిల్ల తక్కువ అనే భావన కు నాకు తెలిసి మూల కారణాలు
  ఆర్ధిక కారణాలు,
  1. ఆడపిల్ల పెళ్లి అంటే ఎక్కువ ఖర్చు.
  2. వయసు మళ్ళిన తల్లి తండ్రుల ను చూసుకోలేదు.
  డబ్బు ప్రమేయం లేకుండా పెళ్ళిళ్ళు జరిగే పరిస్థితి ఏర్పడడం, వయసు మళ్ళిన వాళ్ళు, కొడుకుల పైన నో, కూతురుల పైననో ఆధారపడి ఉండే పరిస్థితి పోవడం.

  ఇంకొకటి, ఆమ్మాయిల ప్రతి చర్య మీద తల్లితండ్రుల, కుటుంబ గౌరవం ఆధారపడి ఉండే పరిస్థితి. వస్త్రధారణ నుంచి, ఇతరుల తో మాట్లాడే పద్ధతి, జీవిత భాగస్వామిని ఎన్నుకునే పద్దతి, ఇలా ప్రతి విషయం లో అమ్మాయి తల్లితండ్రులు, సమాజం ఏమనుకుంటుందో అని భయపడుతూ ఉండాల్సిన పరిస్థితి.

 5. మొన్న నేను ట్రైన్‌లో వెళ్తున్నప్పుడు నా దగ్గర డబ్బులు లేవు అని అంటే ఒక నపుంసకుడు ఇలాగే అన్నాడు “అబద్దాలు ఆడకు బావయ్యా, ఆడ పిల్లలు పుడతారు” అని. ఆడ-మగ కానివాళ్ళకి కూడా ఆడవాళ్ళంటే చిన్న చూపే.

 6. Nice question Prasad ( even, to answer this question is sort of trickery, but I will try)
  I don’t know how much detail you want to go into but I am making a simple statement
  Thse chromosomes are(chromosomes in the ovum x,x) intert unless and until it fertilize whith sperm.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s