అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి?


ఈ వ్యాసం వీక్షణం పత్రికలో వచ్చింది. రచయిత లోక సంచారి. పశ్చిమ రాజ్యాలనుండి దిగుమతి అవుతున్న సామ్రాజ్యవాద విష సంస్కృతి, 1991 నుండి భారత పాలకులు అమలు చేస్తున్న నూతన ఆర్ధిక విధానాల వలన వెర్రితలలు వేస్తున్న వస్తు వినిమయ సంస్కృతి దరిమిలా లుప్తమైపోతున్న మానవ సహజ సంబంధాలు, మహిళలపై హింసా ప్రవృత్తి రాజ్యమేలుతున్న పరిస్ధితి, రాజకీయ, ఆర్ధిక, సామాజిక వ్యవస్ధలన్నీ నేరస్ధుల పక్షాన నిలిచే ధోరణులు వ్యవస్ధీకృతమై ఉండడం, మహిళా స్వేచ్ఛకు వ్యతిరేకంగా పని చేస్తున్న భూస్వామ్య హిందూ మనువాద సంస్కృతి… మొదలయిన కారణాలు స్త్రీలపై అత్యాచారాలకు కారణం అవుతున్నాయని రచయిత ప్రశంసాత్మకంగా వివరించారు. చదవడానికి కొంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఎంత ఎక్కువమంది చదివితే అంత ఉపయోగం అన్న దృష్టితో ఈ వ్యాసాన్ని పాఠకులకు అందిస్తున్నాము.

(కింద బొమ్మపైనే క్లిక్ చేస్తే పి.డి.ఎఫ్ ఫార్మాట్ లో ఉన్న డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది)

veekshanam

12 thoughts on “అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి?

 1. మూల కారణాలను పట్టించుకోకపోతే ఏ సమస్యకూ సరైన పరిష్కారం కనపడదు. ఈ వ్యాసం చాలా బాగుంది. ఆలోచనలు రేపే మంచి విశ్లేషణ!

 2. ప్రవీణ్, మీరు రాసిన వ్యాఖ్యలకూ ఈ టాపిక్ కూ సంబంధమేమిటి?

  >> His thesis on sexual freedom is difficult to agree.>>

  ఈ వ్యాస రచయిత అలాంటి థీసిస్ ఏదీ ఈ వ్యాసంలో చెప్పలేదు. అసలు ‘ఇన్ సెస్ట్’ అనే మాట ఈ వ్యాసంలో ఎక్కడైనా ఉందా? మీరు చెక్ చేసిన pdf ఫైలు ఏమిటో సరిగా వెరిఫై చేసుకోండి.

 3. ఇంతమంచి కథనంలో చర్చించదగిన అంశం ఇదొక్కటే కనబడిందా?

  ఇన్సెస్ట్ అంటే దగ్గరి బంధువులతో లైంగిక సంబంధం అనే అర్థమే కదూ.దీనికి ఈ కథనం సారాంశానికి సంబంధం ఏమిటి?

  పాశ్చాత్య దేశాల్లో లైంగిక స్వేచ్ఛకు, సామ్రాజ్యవాద సంస్కృతిలో లైంగిక స్వేచ్ఛకు చాలా తేడా ఉందనేది గుర్తించాలి. మనం వద్దన్నా కాదన్నా భారతదేశంలోనూ లైంగిక స్వేచ్ఛ బీజాలు ఇప్పటికే పడుతున్నాయి. ఈ క్రమాన్ని ఎవరూ, ఏ నిషేధాలూ తొక్కిపట్టలేవు.

  బూర్జువా సమాజం అన్ని ఫ్యూడల్ విలువల వలువలను ఎలా ఊడ్చేసిందో సుబోధకంగా తెలుసుకోవాలంటే మళ్లీ ఒకసారి కమ్యూనిస్టు మేనిఫెస్టోలో మార్క్స్ రాసిన బూర్జువా సమాజ వికాస దశను గురించి చదువుకుంటేనే బాగుంటుంది. ఈ కథనంలోని కేంద్రక అంశాన్ని ఈ చర్చ దారిమళ్లించినట్లుంది.

  అత్యాచారాల వెనుక సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక నేపథ్యాన్ని ఇంత కూలంకషంగా వివరించిన కథనాన్ని ఇటీవలి కాలంలో నేనయితే చూడలేదు. ఈ కోణంలో ఈ కథనం ఎప్పటికీ విలువైనదే.

  ఇకపోతే దగ్గరి బంధువులతో లైంగిక సంబంధం (ఇన్సెస్ట్) మానవ సమాజానికి కొత్త కాదు. స్త్రీపురుషుల మధ్య నిషిద్ద సంబంధాలకు మించిన సుదీర్ఖ చరిత్ర దానికుంది. మధ్యలో వచ్చిన నిషిద్ధ సంబంధాలే శాశ్వతం అనుకోవడం పొరపాటేమో. సగోత్ర వివాహాల నిషేధానికి, కుటుంబం లోపలి లైంగిక సంబంధాల నిషేధానికి ఆరోగ్య కారణాలు కారణం కాదనుకుంటాను.

  సమాజంలో పోగవుతున్న అదనపు మిగులును ఎవరికి కట్టబెట్టాలనే క్రమంలో వర్గసమాజం ఏర్పర్చుకున్న లైంగిక సంబంధాలు శాశ్వతంగా అలాగే కొనసాగవు. దాని అత్యున్నత రూపంలో అవి ఎలా మారతాయో ఇప్పుడు ఊహించడం కష్టం. ఎంగెల్స్ నుంచి అంబేద్కర్ వరకు నిషిద్ధ సంబంధాల నేపధ్యాన్ని విశ్లేషించారు కదా.

  వీక్షణంలోని ఈ కథనాన్ని తిరిగి ఇక్కడ ప్రచురించడం చాలా మంచిపని. సార్వత్రికత, ప్రాసంగికత కలిగిన కథనం ఇంది. ప్రచురించినందుకు అభినందనలు.

 4. ప్రవీణ్ గారూ,

  మీరు పొరపాటు పడుతున్నారేమో అనిపిస్తోంది.

  వీక్షణం వ్యాసంలో లైంగికస్వేచ్ఛ అత్యంత ప్రధాన నిర్ణాయకాంశం అని వక్కాణించినట్లు నాకనిపించడం లేదండి. పాశ్చాత్య దేశాల్లో అత్యాచారాలు తక్కువగా జరగడానికి అనేక కారణాలున్నాయని రచయిత అంటూనే ప్రధానంగా స్త్రీలకు మగవారితో దాదాపుగా సమానహక్కులు ఆచరింపబడుతున్నాయని మాత్రమే చెప్పారు కాని లైంగిక సమానత్వం ఉంది అని తను చెప్పలేదు. జీవితభాగస్వామిని వెతుక్కునే స్వేచ్ఛ, కుదరకపోతే మిత్రులుగా విడిపోయి స్నేహసంబంధాలతో మెలిగే స్వేఛ్ఛ ఉన్నాయని చెప్పారు. పరిచయం పెళ్లివరకు రాకపోతే, ప్రేమ విరిగిపోతే భారతదేశంలో లాగా ప్రతీకారాలు, యాసిడ్ టెస్టులు, హత్యలు, కక్షలు లాంటివి పశ్చిమదేశాల్లో లేవని చెప్పారు. నూటికి నూరుపాళ్లు ఇలాగే ఉన్నాయని కూడా రచయిత చెప్పలేదు.

  షేక్స్ పియర్ రాసిన రోమియో జూలియట్ నాటికలోవలే ప్రేమ ఫలించకపోతే ప్రేమికులకు మరణమే గతి అనే దశను పాశ్చాత్య సమాజం దాటిపోయిందనే ఉద్దేశ్యాన్ని మాత్రమే రచయిత సూచించారు. తల్లిదండ్రులు తమ సంతానాన్ని తమ తమ జంటలను వెతుక్కోమని ప్రోత్సహిస్తారంటే ఆ సమాజంలో లైంగిక స్వేచ్చ విషయంలో యువతీయువకులకు ఎంచుకునే స్వేచ్ఛ ఉందని మాత్రమే అర్థం. సమాజం ఒకమేరకు పరిణితి చెందిందని మాత్రమే అర్థం. అంతేకాని ఆ కథనం మొత్తంలో కూడా పశ్చిమదేశాల్లో లైంగికసమానత్వం సార్వత్రికంగా అమలులో ఉందని అర్థం కాదు.

  మొన్న హిల్లరీ క్లింటన్ అమెరికా విదేశీ శాఖ కార్యదర్శి పదవినుండి వైదొలుగుతూ కూడా ఇదే విషయం చెప్పారు. లైంగిక సమానత్వం అనేది 21వ శతాబ్దంలో కూడా ప్రపంచంలో ఒక ఫలవంతం కాని వ్యవహారం -అన్ ఫినిష్డ్ బిజినెస్- గానే ఉందని, దీన్ని సాధించిన నాడే ఏ దేశమైనా నిజమైన పురోగతిలోకి అడుగుపెడతుందని హిల్లరీ అన్నారు. బూర్జువా మహిళా ప్రతినిధికే అమెరికాలో లైంగిక సమానత్వం లేదనే విషయంపై ఇంత స్పష్టత ఉంది.

  పోతే, టర్కీలో సోకాల్ట్ లైంగిక స్వాతంత్ర్యం గురించి మీరు వ్యాఖ్యానించారు. లైంగిక స్వాతంత్ర్యంలో టర్కీ అంతగా అభివృద్ది చెందిందా అనేది నా సందేహం. టర్కీలో పురుషుడి ఆలోచనలు, స్వభావం కన్యాత్వ పరీక్షలు చేయించడాన్ని అధిగమించేటంతగా అక్కడి సామాజిక చట్రం పరివర్తన చెందిందా? నాకయితే తెలీదు.

  అంతపెద్ద అమెరికాలోనే కుటుంబపనిని పంచుకునే విషయంలో ఏ వర్గానికి చెందిన మగవాడిలో కూడా రావలసినంత మార్పు రాలేదని, డబుల్ వర్క్ భారం నుంచి అమెరికా మహిళ ఈనాటికీ బయటపడటం లేదన ఇటీవలే టైమ్స్ మేగజైన్లో ఒక కథనం చదివాను. మగవాడిలో మార్పులేనిదే మహిళా స్వాతంత్ర్యం దాని నిజమైన అర్థంలో ఫలించదని యాభై సంవత్సరాల ఫెమినిస్టు ఉద్యమ కార్యాచరణ తర్వాత అమెరికా అవగాహనకు వస్తున్నట్లు తెలుస్తోంది.

  నా ఉద్దేశంలో టర్కీలో కూడా మనకు లాగే రాజ్యాంగపు కాగితంపై అన్ని స్వేచ్ఛలూ అందరకీ అందుబాటలో ఉన్నట్లు కనపడతాయనుకుంటాను.

  మీరు నమ్ముతున్న విలువలపై నేను ఎన్నడూ వ్యాఖ్యానించలేదనే అనుకుంటున్నాను. మీ వ్యాఖ్యల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయాల గురించే ఆలోచిస్తున్నాను.

  మీరు పంపిన లింకులోని సుదీర్ఘ కథనం ఓపిగ్గా చదివాను. దగ్గర బంధుత్వాలను దూరం చేసుకోకూడదు అనేదే మీకథంలోని ప్రధానాంశం అయితే ఏ సమస్యా లేదు. అయితే దీంట్లోనూ మీరు ఉపయోగించిన అక్రమ సంబంధాలు వంటి పద ప్రయోగాలతో నాకు ఏకీభావం లేదు. తెలుగు నేలపై 20 ఏళ్లకు పైగా ఫెమినిస్టు ఉద్యమాలు జరిగాయి కదా. ఫెమినిజం, మార్క్సిజం కూడా ఇప్పడు మన సమాజంలో అక్రమ సంబంధాలు ఉన్నాయని వ్యాఖ్యానించలేదనే నా ఉద్దేశ్యం.

  మన సమాజంలో స్త్రీపురుషుల మధ్య శారీరక సంబంధాలు వివాహ సంబంధాలు, వివాహేతర సంబంధాలుగా మాత్రమే ఉన్నాయనుకుంటాను.

  మీరు చాలా చోట్ల ఈ అక్రమ సంబంధాలు అనే పదాన్నితరచుగా వాడుతున్నట్లుంది. ఈ విషయంలో మాత్రం మీతో ఎన్నటికీ ఏకీభవించలేను.

  అలాగే మౌఖికంగా మనుషులు మాట్లాడే ప్రతిమాటను, లైంగిక పరంగా సమాజంలో అలవాటై పోయిన పదాలను కూడా, రాసే భాషలో ఉపయోగించడం ప్రజాస్వామ్యం అవునో కాదో కాని సబబు కాదనుకుంటున్నాను. వందేళ్ల క్రితమే లెనిన్ కూడా ఈ విషయమై, విస్పష్టంగా చెప్పినట్లు గుర్తు.

  ఇప్పటికి ఇంతే.
  సెలవు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s