పత్రికలకెక్కిన ఫేస్ బుక్ బూతులు, మహిళల తిరుగుబాటుతో క్షమాపణలు


ఫేస్ బుక్ రాతలపై హైద్రాబాద్ లో మహిళల ప్రెస్ మీట్ (ఫొటో: ఫేస్ బుక్)

ఫేస్ బుక్ రాతలపై హైద్రాబాద్ లో మహిళల ప్రెస్ మీట్ (ఫొటో: ఫేస్ బుక్)

గత రెండు మూడు రోజులుగా ఫేస్ బుక్ లో కొందరు మగరాయుళ్ళు మహిళలకు వ్యతిరేకంగా అసభ్య రాతలు రాస్తున్నారు. తెలుగు బ్లాగర్ తాడేపల్లి లలితా బాల సుబ్రమణ్యం మహిళలను తీవ్రంగా అవమానిస్తూ ప్రారంభించిన ఒక టాపిక్ కింద కొందరు పురుష పుంగవులు చేరి వీరంగం వేశారు. అసభ్య వ్యాఖ్యలు చేస్తూ మహిళల గుణ గణాలను కించపరిచారు. చిన్న వయసులోనే అమ్మాయిలు శారీరక కోర్కెల కోసం వెంపర్లాడుతున్నారని, అలాంటివారికి పెళ్లిళ్లు చెయ్యకుండా వాళ్ళ తల్లిదండ్రులు డిగ్రీలు, పోస్టు గ్రాడ్యుయేషన్లు చదివించి తప్పు చేస్తున్నారని తాడేపల్లి బాల సుబ్రమణ్యం చేసిన వ్యాఖ్య దరిమిలా పారిన అసభ్య వ్యాఖ్యల వరదపై మహిళలు ధ్వజమెత్తారు. విషయం వార్తా ఛానళ్లకు ఎక్కి మహిళా సంఘాల నేతల వరకు వెళ్లడంతో తెలుగు బ్లాగర్లు కూడా అయిన తాడేపల్లి, పవన్ సంతోష్ ఫేస్ బుక్ ముఖంగా క్షమాపణలు చెప్పుకున్నారు.

తాడేపల్లి తదితరుల అసభ్య రాతలను మొదటగా కత్తి మహేష్ కుమార్, లోక్ నాధ్, ప్రియ కారుమంచి తదితరులు వెలుగులోకి తెచ్చినట్లు తెలుస్తోంది. కనీసం ఆరుగురు వ్యక్తులు మహిళలపై గుణగణాలపై చేసిన అసభ్య వ్యాఖ్యలను స్క్రీన్ షాట్ తీసి వారు తమ ఫేస్ బుక్ ఖాతాల్లో ఉంచడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మహిళలపై ఏ మాత్రం గౌరవం లేనట్లుగా వీరు చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి. డిగ్రీలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన అమ్మాయిలు ఎవరికీ శీలం ఉండదన్నట్లు వీరు అసభ్యంగా వ్యాఖ్యలు రాశారు. ఉన్నత చదువులు చదివిన మహిళలలో అనేక మందికి పెళ్ళికి ముందే అనుభవాలు ఉంటాయని ఒకరు సూచిస్తే అసలు అప్పటివరకూ ఆగేది ఎవరని మరొకరు వ్యాఖ్యానించారు. వీరి వ్యాఖ్యల స్క్రీన్ షాట్లు కింద చూడవచ్చు.

అసభ్య వ్యాఖ్యలు చేసిన వ్యక్తులు పేర్లు ఇలా ఉన్నాయి: తాడేపల్లి లలితా బాల సుబ్రమణ్యం, కృష్ణమోహన్, పవన్ చావలి, పవన్ సంతోష్, పరశురాముడు, యోగే పవన్. వీరిలో కృష్ణమోహన్ అనే వ్యక్తి కె.పి.ఎం.జి రియల్ ఎస్టేట్ కంపెనీలో పని చేస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ సంతోష్ అనే వ్యక్తి 2008 నుండే తెలుగులో బ్లాగింగ్ చేస్తున్నట్లు ఆయన సత్యవతి గారికి పంపిన ఈ మెయిల్ క్షమాపణ ద్వారా తెలుస్తున్నది. వారందరిలో ఎక్కువ అసభ్యంగా రాతలు రాసిన కృష్ణమోహన్ ఇంకా క్షమాపణలు చెప్పలేదని తెలుస్తోంది. క్షమాపణలు చెప్పనివారిపై మహిళలు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తారేమో చూడవలసి ఉంది.

అసభ్య రాతలు స్క్రీన్ షాట్లు కింద చూడవచ్చు:

పరమ అసహ్యంగానూ, మహిళా లోకాన్ని తీవ్రంగా కించపరిచేవిగానూ ఉన్న ఈ వ్యాఖ్యలపై ఫేస్ బుక్ లో చురుకుగా ఉన్న మహిళలు ధ్వజమెత్తారు. ప్రముఖ రచయిత్రి కొండవీటి సత్యవతి, కువైట్ లో బ్యుటీషియన్ గా పని చేస్తున్న అజంతా రెడ్డి తదితరులు వీరి వ్యాఖ్యలను తీవ్రంగా నిరసించారు. సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి మహిళలంతా సిద్ధం అయ్యారు. ముఖ్యంగా విశాఖపట్నం, హైదరాబాద్ నగరాలకు చెందిన మహిళలు వీరిపై చర్యలకు సిద్ధం అయ్యారు. హైదరాబాద్ మహిళలు ఫేస్ బుక్ అసభ్య రాతలపై విలేఖరుల సమావేశం పెట్టి మరీ కడిగేశారు. విలేఖరుల సమావేశానికి సంబంధించిన వార్త టి.వి7లో ప్రసారం అయింది. సదరు వీడియోను ఇక్కడ చూడవచ్చు.

అసభ్య రాతలపై ఒక మహిళ ఫేస్ బుక్ లో ఇచ్చిన సమాచారం ఇలా ఉంది.

నిన్న తాడేపల్లి లలితా బాల సుబ్రహ్మణ్యం అనే అతను ఒక చెత్త పోస్ట్ అమ్మాయిల మిద పెట్టాడు దానికి కృష్ణమోహన్ , పవన్ చావాలి , పవన్ సంతోష్ , పరశురాముడు , యోగే పవన్ …ఈ ఆరుమంది కలిసి అమ్మాయిల మానంతో డెల్లి రేప్ కేసు లో నిందితుల కన్నా హీనంగా ఆడుకున్నారు …ఆరోజు ఆ డిల్లి రేపిష్టులను వీళ్ళు సపోర్ట్ చేస్తే ఏమో అనుకున్న కాని వీళ్ళ నిజ స్వరూపం ఇప్పుడే చూస్తున్నాము …అసలు వీళ్ళు బ్రామ్హణ కులంలో పుట్టిన వాళ్ళ అని నాకు నిజంగా సందేహం కలుగుతుంది …ఆ కులం అంటే మాంసాహారం తినే మిగతా వాళ్ళు ఎంత గౌరవం ఇస్తాము ….వేదం తెలిసిన పండితులు అని ఎంత మర్యాదిస్తాము …అటువంటి వాళ్ళ మనుషుల్లో ఇంత కుల్లిని చూసి నిర్గాంతపోయాను…అసలు అందరు ఆడపిల్లగురించి అనే హక్కు వీళ్ళకు ఎవరు ఇచ్చారు …సినిమాలో నటించే ఆడవాళ్ళను , ఉద్యోగాలు చేసేవాళ్ళను fb లో గట్టిగ మాట్లాడే నాలాంటి వాళ్ళను కూడా చాల హీనంగా మాట్లాడారు (easy lay) అన్న word కూడా use చేసారు …కాని ఇప్పుడు కాలేజి పిల్లలను , స్కూల్ పిల్లలను ఆకరికి 6,7 తరగతి చదివే చిన్న పిల్లలను కూడా వదలలేదు ఈ దుర్మార్గులు …పబ్లిక్ గా అందరు ఆడపిల్ల గురించి ఎలా పడితే అలా వాగే హక్కు ఈ వేదవలకి ఎవరు ఇచ్చారు …అంట నోటిదూల చేతిదూల ఉంటె వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ గురించి రాసుకోవాలి గాని ఎవరో ఉరమ్మ కన్నా పిల్లగురించి ఇక్కడ ఇలా వాగితే ఎలాగా ..అందుకే ఏ చెత్త నార్లతో అయితే ఇలా వాగారో అల్లాగే పబ్లిక్ గా ఆడపిల్లకు క్షమాపణ చెప్పాలి లేదంటే లీగల్ గా ఆక్షన్ గా తీసుకుంటాము …ఇది సబా ముకంగా హెచ్చరిక ఆ ఆరుగురికి …ఆడవాళ్ళను తక్కువగా అంచనా వెయ్యొద్దు …మేము తలుచుకుంటే కూలిపోయే రాజ్యము నిలబెట్టగళము…ఉన్న దుష్టరాజ్యాన్ని కూలగొట్టను గలము …ఖబదార్ పింజారి వేదవల్లరా!

క్రిష్ణ మోహన్ అనే వ్యాఖ్యాతకు మహిళలు చేసిన హెచ్చరిక ఇలా ఉంది:

Mr. Krishna Mohan of KPMG:(Urban Infrastructure Consultant – KPMG – NEHRU Place Office – NEW Delhi), Do you talk and think in the same cheap way about your KPMG women colleagues too? For a person who is working in a MNC like KPMG how come you are able to think so cheaply and place comments in such a cheap way in public domain? We are planning to take the issue to KPMG higher ups!! We will see that if you still will have place in KPMG after doing all these cheap talk on Women? Let us see whether KMPG have any regulations regarding Women harassment in their company at all?

అయ్యా కృష్ణమోహన్ మీరు పని చేసే kpmg లో కూడా మీ సహోద్యోగులను ఇంతే నీచంగా భావిస్తున్నారా ? kpmg lo మీతోటి ఉద్యోగుల గురించి కూడా ఇలానే చవకబారుగా మాట్లాడుతున్నారా చవకబారుగా ఆలోచిస్తున్నార వారి వెనక ? మీరు kpmg లాంటి సంస్థల్లో పనిచేస్తూ ఇలాంటి హీనసంస్కారపు ఆలోచనలు ఎలా వస్తున్నాయి ?
kpmg సంస్థ ప్రమాణాలకు మీరు సరి తూగరెమొకద మీలాంటి చిన్నతరహ ఆలోచనలు ఉండే వాళ్లకు kpmg లాంటి గొప్ప సంస్తాల్లో పనిచేసే అర్హత లేదేమో కదా
మీ వ్యక్య్హాలను మేము kpmg దృష్టికి తీసుకు వేల్లదల్చుకున్నాము. మీలాంటి వారు kpmg లాంటి సంస్థలో ఉంటె అది ఆ సంస్థకే చెడ్డపేరు వస్తాది. అంత పెద్ద గొప్ప kpmg లాంటి సంస్థల్లో మీకు మీ లాంటి వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చినందుకు ఆ kpmg యాజమాన్యం ఏమి జవాబు చెప్తారో చూస్తాము మిరే చేసే పనులు ఆడవాళ్ళ పట్ల మీరు చేసే అసందర్బ కామెంట్స్ kpmg లో పనిచేసే ఆడవాళ్ళ స్పందన ఎలా ఉంటుందో చూడాలి మరి.

తాడేపల్లి తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. ఇలా:

ప్రియమిత్రులారా ! అక్కచెల్లెళ్ళారా !

“మంచి ఉద్దేశాలుంటే చాలదు. వాటిని వ్యక్తీకరించడానికి మంచి వ్యూహం కావాలి. మంచి శైలి కావాలి. సమాజంలో జఱిగేవి చూస్తే కడుపు రగిలిపోవడం మనందఱికీ అనుభవమే. అలా రగిలిపోయినప్పుడు ఆ మూడ్ లో ఎవఱికీ ఏమీ చెప్పకూడదు. అలా మనం ఎవఱి మనసూ మార్చలేం. ఎవఱినీ బాగుచేయలేం. పైపెచ్చు వారి ద్వేషానికి గుఱవుతాం. ఆ రగలడం అనేది కాస్త తగ్గాక మనసు కాస్త స్థిమితపడ్డాక సరైన వ్యక్తీకరణని వెతుక్కోవాలి. అలా వెతుక్కునే ఓపిక కాస్త తగ్గితే అందఱికీ చెడ్డవాళ్ళమవుతాం. మనకు ఏవైతే నచ్చవో అనుకోకుండా అదే మనం కావడం – అది తాత్కాలికంగానే అయినా – మాయని మచ్చగా మిగులుతుంది. సమాజానికి సంస్కరణ కంటే ముందు కాస్త ప్రేమ కావాలి. అంటే సంస్కరణని ప్రేమతో రంగరించాలి. ఆవేశపూరితమైన శీర్షికలూ, మొఱటు వ్యాఖ్యలూ ఈ ఉదాత్త ప్రయోజనాన్ని నెఱవేర్చవు.”

మొన్న నా టపా, ఇంకా దాని కింద వచ్చిన వ్యాఖ్యలూ, వాటికి జనాల ప్రతిస్పందన చూశాక నా మదిలో మెదిలిన భావాలివి. జనాలు మమ్మల్ని తిడుతున్నారంటే అందులో తప్పేమీ లేదు. వాళ్ళని నేను బాధపెట్టాను. కనుక వాళ్ళు నన్ను బాధపెట్టడానికి నిశ్చయించుకున్నారు. అది చాలా సహజం. వారిని నేను తప్పుపట్టడం లేదు. పైపెచ్చు అభినందిస్తున్నాను. నా టపాలో క్లారిటీ లేదు. ఆవేశం ఉంది. కానీ సాహిత్యకారుడికి ఆవేశం ముడిసరుకే అవ్వాలి తప్ప అంతిమ ఉత్పత్తి (final product) కాకూడదు. ఆ సూత్రాన్ని నేను ఉల్లంఘించాను. అక్కడ కొన్ని పచ్చివివరాలున్నాయి. కానీ వాటిని ప్రెజెంట్ చేయాల్సిన రీతిలో స్వీకారయోగ్యంగా ప్రెజెంట్ చేయడం జఱగలేదు. కాస్త శాస్త్రీయత తోడైతే బావుండేది. అందువల్ల అది ఉద్దేశించిన అర్థాన్ని,ప్రయోజనాన్నీ కోల్పోయి సమాజంలో అందఱినీ నేఱస్థులుగా చూపించే స్థాయికి దిగజాఱింది. అది చాలామంది ఆడపిల్లల్నీ, వారి తల్లిదండ్ర్తుల్నీ నొప్పించింది. అలాగే స్త్రీల సంక్షేమం, సద్భావన కోసం నిరంతరమూ తపించే స్వచ్ఛందసేవకురాళ్ళు కూడా చాలా విచారించారు. వారందఱూ నాకు అక్కచెల్లెళ్ళలాంటివారు. వారు గత ఏడేళ్ళ నుంచి నా తిక్కలతో సర్దుకుపోతూ ఉన్నారు. నాలో వారికి నచ్చిన మంచి లక్షణమేంటో మఱి నాకు తెలీదు. అందుకు వారికి నా కృతజ్ఞతలు.

కానీ అలాంటి “వారినే” నేను బాధపెట్టడం నాకూ బాధ కలిగించింది. కనుక నా అక్కచెల్లెళ్ళందఱికీ, అలాగే వారి తల్లిదండ్రులందఱికీ ఈ టపా మూలంగా క్షమాపణలు చెప్పుకుంటున్నాను. వారు ఇదివఱకటి మాదిరే నన్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాను. అన్యథా భావించరని ఆకాంక్షిస్తున్నాను. ఇకముందు వారి మనోభావాలను దృష్టిలో పెట్టుకుని నా ఆలోచనలను ప్రెజెంట్ చేస్తానని హామీ ఇస్తున్నాను. గతంలో దొర్లిన తభావతులు ఇకముందు దొర్లవని కూడా తెలియజేసుకుంటున్నాను.

నేనొక కొత్త వ్యాపారం ప్రారంభించబోతున్నాను గనుక ఇదివఱకటిలా ఇకముందు మీకు తఱచుగా దర్శనమివ్వలేనని సవినయంగా తెలియజేసుకుంటూ-


నెనర్లు. (Thanks)

ఎప్పటికీ భవదీయుడు

తాడేపల్లి లలితా బాలసుబ్రహ్మణ్యం

ఇంతకీ మహిళలను కించపరుస్తూ తాను చేసిన వ్యాఖ్యలు వారిని సంస్కరించడం కోసమే అని తాడేపల్లిగారు చెప్పదలుచుకున్నారు! మహిళల ఉద్దరణ కోసం నడుం బిగించిన తనను మహిళలే అర్ధం చేసుకోలేదని, అర్ధం చేసుకోలేక బాధపడ్డారని, అందుకే తన క్షమాపణలని ఆయన ‘మదిలో భావాలు’ పేరుతో పరోక్షంగా చెబుతున్నారు. పైగా ఆయన మహిళల నిరసనలను ఏ మాత్రం లెక్క చేయలేదు. ఒకవైపు నిరసనలు సాగుతుండగానే “ఫూల్స్, మా ఇష్టం వచ్చినట్లు మేము రాస్తాం?ఆడ ముండ లకు ఇంత కొవ్వా? ఏమి చేస్తారో చెయండి” అని మరో పోస్ట్ రాసినట్లు ప్రముఖ బ్లాగర్ ఒకరు నాకు ఈ మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చారు. “అతడి చెత్త గాంగ్ అంతా ‘ఇది దళిత జనాల కుట్రే! మనం బ్రాహ్మలం అని..మనల్ని తొక్కాలని..'”- అని తమను తాము సమర్ధించుకున్నట్లు తన సమాచారంలో తెలిపారు.

Ch పవన్ కుమార్, 2008 నుండి బ్లాగింగ్ చేస్తున్న పవన్ సంతోష్, వీరిద్దరూ కొండవీటి సత్యవతి గారికి పంపిన ఈ మెయిల్ లో ఇలా క్షమాపణలు చెప్పారు:

Good evening madam.This is ch pavan kumar.I am doing my post graduation in AU madam.Yesterday i made some abusive comments on the status of tadepalli subramanyam garu.These abusive comments hurted all of mothers and sisters.I am telling my apologogies to all mothers and sisters for making such worst comments.I am promising you that i will not repeat such things once again.I am making a promise to all madam that i will not repeat such comments.I am promising on my mother whom i love a lot.My mother is a fileria patient.She is suffering with fileria for both of the legs.I am feeding her on bed by giving her food and tablets from time to time.I love her a lot.I am promising on her that i will not repeat such things once again.Please excuse me madam for doing this mistake and pls forgive me keeping in view of my future madam.Thanking you madam.Ch pavan kumar
Madam Kondaveeti Satyavati ,
This email was in regard to the comment I made on tadepalli balasubrahmanyam wall.
I didn’t recognize the severity of the post that i’ve commented day before yesterday on tadepalli balasubrahmanyam wall. When i recognized that it is a generelised post that hurts the women, i’ve written my apology on my wall and the page you have created. I feel so sad that you people hurt due to that post. Personally, i don’t have a habit of commenting women; people who knew me personally knows well that i’ve a great respect towards women. But due to the facebook addiction i’ve commented on those posts without having a proper look on the way they are writing. I’m so sorry and please consider my apology.
I’m a old blogger. I’m writing in internet since may 2008. Till now i didn’t wrote such comments/posts which hurt the feelings of women and i won’t write in future. I’m giving this to verify my habit of writing. I wrote with the pen name pakkintabbayi.. i never crossed the limits and will never in future.
http://santosh-surampudi.blogspot.in/
http://pakkintabbayi.blogspot.in/
http://pustakam.net/?tag=articles-by-surampudi-pavan-santhosh
As i said earlier i wont write such comments and i will warn others friends writing such comments. thank you.
regards,
pavan santhosh

ఫేస్ బుక్ అసభ్య రాతలపై ఈనాడు పత్రిక శనివారం స్పందించింది. దానిని కింద చూడవచ్చు.

ఫేస్ బుక్ నుండి

ఫేస్ బుక్ నుండి

వీళ్లకి తల్లి చెల్లి లేరా?

ఫేస్ బుక్ లో మహిళలకు వ్యతిరేకంగా వ్యక్తమవుతున్న ఈ అసభ్య ధోరణులకు నిరసనగా అప్పుడే ఒక ప్రత్యేక పేజి ప్రారంభం అయింది. దాని పేరు “వీళ్లకి తల్లి చెల్లి లేరా?” ఆసక్తి ఉన్నవారు ఈ పేజి సందర్శించి తమ అభిప్రాయాలను తెలియయజేస్తే ఉపయోగం. మళ్లీ ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యకుండా ఇతర తుంటరి వెధవలకు హెచ్చరికగా ఉండేలా అభిప్రాయాలు వెల్లువెత్తాలి. కటకటాల వెనక్కి నెట్టి మరింత కరకు నేరస్ధులుగా మార్చడం కంటే మీ వ్యాఖ్యలు అసహ్యంగా ఉన్నాయి అని వేదికలపై చెప్పి చిన్నబుచ్చడం వల్ల ఎక్కువ ఫలితం రావచ్చు. 

తస్మాత్ జాగ్రత్త!

అంతర్జాలంలో మహిళలకి వ్యతిరేకంగా అసభ్య వ్యాఖ్యలు చెయ్యడం ఫేస్ బుక్ వరకే పరిమితం కాదు. అది తెలుగు బ్లాగు ప్రపంచంలో కూడా వ్యాపించి ఉంది. మనం పితృస్వామిక సమాజంలో నివసిస్తున్నామని అనేకమంది సామాజికార్ధిక శాస్త్రవేత్తలు సామాజిక పరిణామాన్ని విశ్లేషించి నిర్ధారించిన సత్యం. అది నిజం కాదని చెప్పాలంటే ముందు ఆ నిర్ధారణలను అధ్యయనం చెయ్యాలి. ఏయే శాస్త్రీయ అధ్యయనాల ద్వారా ఆ నిర్ధారణకు వచ్చారో తెలుసుకోవాలి. ఆ శాస్త్రీయ నిర్ధారణలను శాస్త్రీయ ఆధారాల ద్వారానే తిరస్కరించ గలగాలి. అదేమీ చెయ్యకుండా మన బుర్రల్లోని ప్రగతి వ్యతిరేక పైత్యాన్ని నిస్సిగ్గుగా కక్కడం, మానవ ప్రపంచంలో సగ భాగంగా ఉంటూ పురుషుల జీవితాల్లో విడదీయరాని భాగం అయిన స్త్రీ లోకాన్ని కించబరచడానికి సిద్ధపడడం అంటే మన పుట్టుకని మనమే అవమానించుకున్నంత నీచం.

ఇదంతా స్వేచ్ఛ పేరుతో సాగించడం మరింత అభ్యంతరకరం. అభిప్రాయాలను వెల్లడించుకునే స్వేచ్ఛకూడా మాకు లేదా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. కానీ ఒకరి స్వేచ్ఛ మరొకరి ముక్కు వరకూ రాకూడదన్న మౌలిక సూత్రాన్ని వీరు విస్మరిస్తున్నారు. మన తల్లి, అక్క, చెల్లి ఇంకా అనేక సంబంధాలతో మన చుట్టూ ఉండే స్త్రీల వ్యక్తిత్వాన్ని కించపరచడం, ఉన్నత విద్య చదివిన స్త్రీలను లైంగిక కోణంతోనే చూస్తూ అసభ్య వ్యాఖ్యలు చెయ్యడం స్వేచ్ఛ అయితే అలాంటి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా చట్టాన్ని ఆశ్రయించే స్వేచ్ఛ మహిళలకు ఉంటుందని ఆయా అసభ్య వ్యాఖ్యాతలు గ్రహించాలి.

తెలుగు బ్లాగుల్లో బూతులు, అసభ్య వ్యాఖ్యలు చేస్తూ కూడా క్షమాపణలు చెప్పే అవసరం రాలేదంటే దానికి కారణం ఆయా బాధితుల ఔదార్యమే అని ఈ సందర్భంగా గుర్తించాలి. దళితులకు వ్యతిరేకంగా కూడా కొంతమంది కొన్ని సంవత్సరాల క్రితం అసభ్య వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లను వ్యతిరేకించే పేరుతోనూ, ప్రతిభ పేరుతోనూ మళ్ళీ కొత్తగా ఒకరిద్దరు అసభ్య వ్యాఖ్యలు చేస్తున్నారు. వారు కూడా వారి స్వేచ్ఛకు ఉన్న reasonable limits ను గుర్తించాలి. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అభిప్రాయాలూ చెప్పడం, రిజర్వేషన్లు పొందుతున్న వారిని అసభ్య వ్యాఖ్యలతో తూలనాడం రెండూ ఒకటి కాదు. రెండవది చట్టం దృష్టిలో శిక్షార్హం. ఆ పరిమితులు తెలుసుకుని మసులుకోవాలని ఈ సందర్భంగా గుర్తించాలి.

తాజా వార్త: క్షమాపణలు చెప్పినప్పటికీ ఈ బృందాన్ని మహిళలు వదల దలుచుకోలేదు. సోమాజి గూడ ప్రెస్ క్లబ్ లో శనివారం సమావేశమై కమిషనర్ అనురాగ్ శర్మ ను కలవడానికి వారు సిద్ధం అవుతున్నారు. మిత్ర బృందం తమ ఫేస్ బుక్ ప్రొఫైల్స్  ను తొలగించినట్లు తెలుస్తోంది. వాళ్లంతా పోలీసుల వద్ద లొంగిపోయే ఆలోచనలో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. 

28 thoughts on “పత్రికలకెక్కిన ఫేస్ బుక్ బూతులు, మహిళల తిరుగుబాటుతో క్షమాపణలు

  1. అదేమీ చెయ్యకుండా మన బుర్రల్లోని ప్రగతి వ్యతిరేక పైత్యాన్ని నిస్సిగ్గుగా కక్కడం, మానవ ప్రపంచంలో సగ భాగంగా ఉంటూ పురుషుల జీవితాల్లో విడదీయరాని భాగం అయిన స్త్రీ లోకాన్ని కించబరచడానికి సిద్ధపడడం అంటే మన పుట్టుకని మనమే అవమానించుకున్నంత నీచం.

    ఒప్పుకుంటాను. కానీ అదే విధంగా మగవారిపై జరుగుతున్న అన్యాయాలను ప్రస్తావించగానే వారిని స్త్రీ ద్వేషులనో మరోకటనో తూలనాడడం కూడా అలాంటి పుట్టుకని అవమానించుకునే చర్యే. ఎందుకంటే, మరో సగభాగం పురుషుడే కాబట్టి అన్నది నా అభిప్రాయం.

  2. చాలా కాలంగా బ్లాగుల్లో జరుగుతున్నా గ్రూప్ తగాదాలు బయటకి వచ్చాయన్నమాట ..
    దురదృష్టం ఏంటంటే, ఫేస్బుక్ లో వాళ్ళు మాట్లాడిన మాటలు , ఇంచుమించు ఇలాంటివే నేను హైదరాబాద్ హాస్టల్స్ లో కూడా విన్నాను.
    ఇక్కడ వీళ్ళు లిమిట్ దాటేశారు అది objectionable . కాని ఈ పోస్ట్ వల్ల మంచి కన్నా చెడె ఎక్కువ జరుగుతాదేమో అని నా ఉద్దేశ్యం. దీన్ని వెకిలి గా షేర్ చేసేవాళ్ళు కుడా ఉంటారు.
    మీ పోస్ట్ లో కుల ప్రస్తావన కూడా వచ్చింది. కులానికి, మతానికి ఈ పోస్ట్ తో సంబంధం లేదని గుర్తించాలి.
    ప్రతీ గొడవ, ప్రతీ టెర్రరిస్ట్ చేసేది కులానికో, ఒక మతానికో అంటగడుతూ పోతే, కొన్నాళ్ళకి అవి వందల మంది లో విద్వేషాన్ని రగిలిస్తాయి.
    నేను బయట చూశాను , ఇంచు మించు ఇలాంటి పిచ్చి పిచ్చి కామెంట్స్ చేసినవాల్లలో అన్ని కులాలకి , మతాలకి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు.
    ఈ పోస్ట్ కి రిజర్వేషన్స్ కి సంబంధం ఏంటో తెలియదు, ఈ పోస్ట్ ని చూపిస్తూ మీరేదో హెచ్చరిస్తున్నట్టు తెలుస్తుంది
    కాని అంతర్జాలం లో కూడా పరిమితులు ఉంటాయని ఈ మధ్యన జరుగుతున్న సంఘటనలు తెలుపుతున్నాయి.

  3. “ఈ పోస్ట్ కి రిజర్వేషన్స్ కి సంబంధం ఏంటో తెలియదు, ఈ పోస్ట్ ని చూపిస్తూ మీరేదో హెచ్చరిస్తున్నట్టు తెలుస్తుంది.”

    వెంకట్ గారూ మీరు గమనించింది నిజమే. ఈ పోస్టులో చూపించిన వ్యాఖ్యలకు ఎంత తీవ్రత ఉన్నదో, రిజర్వేషన్ల పేరుతో కించపరిచే వ్యాఖ్యలకు కూడా అంతే తీవ్రత ఉంది. ఇంకా చెప్పాలంటే రిజర్వేషన్ల (కులం) పేరుతో చేసే అవమానకర వ్యాఖ్యలకు మరింత తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుంది. అలాంటివి చెయ్యవద్దని ఈ పోస్ట్ సందర్భంగా నేను సూచించదలిచాను.

    విషయాన్ని ‘గ్రూపు తగాదాలు’ అంటూ మీరు గుర్తించిన విధానం అభ్యంతరకరం. ఇక్కడ ఏ గ్రూపులూ లేవు. పోస్టులో ఉదహరించిన బ్లాగర్లు ఎవరో కూడా నాకు తెలియదు. వారిలో ఒకరు వ్యాఖ్యల ద్వారా నాకు తెలుసు అంతే. ఫేస్ బుక్ లో నిరసన తెలిపిన వారికి బ్లాగులు కూడా ఉన్నట్లు లేదు.

    “ప్రతీ గొడవ, ప్రతీ టెర్రరిస్ట్ చేసేది కులానికో, ఒక మతానికో అంటగడుతూ పోతే, కొన్నాళ్ళకి అవి వందల మంది లో విద్వేషాన్ని రగిలిస్తాయి.”

    అవును మీరు చెప్పింది నిజం. మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేసేవారు అన్ని కులాల్లోనూ ఉంటారు. మహిళా వివక్షకు కులం లేదు. కాని కులం పేరుతో దానిని సమర్ధించుకున్నది అసభ్య వ్యాఖ్యాతలే తప్ప నిరసనకారులు కాదు.

    మీరు గుర్తించినట్లు అంతర్జాలంలో కూడా పరిమితులు ఉంటాయని ఈ వ్యవహారం స్పష్టం చేస్తోంది. మన నిజ జీవితాల కొనసాగింపే అంతర్జాలం. అందుకే అంతర్జాలానికి వర్తించే చట్టాలు వస్తున్నాయి. ఆ చట్టాలకు కూడా రెండు వైపులా పదును ఉంటుంది. చెడుని నియంత్రించడం ఒక వైపు పదునైతే చెడు అనే ముద్ర వేసి మంచిని వ్యాపించకుండా చూడడం మరొక పదును.

  4. వీళ్ళుచూసిన కొద్దిపాటి పరిసరాల్లాగానే మొత్తం ప్రపంచం ఉంటుందనీ, వీళ్ళునమ్మినంత చండాలపు భావజాలమే ఆదర్శవంతమైనదని నమ్మే వీళ్ళకు ఆధునిక సమాజాల్లో నివశించే అర్హతలేదు. ఇలాంటివారిని సంఘంనుండి బహిష్కరించాలి. వీరికి జైలు శిక్షపడాలని కాంక్షిస్తున్నాను. వీరిది అందరికీ తెలిసిపోయిందన్న భయమో, సిగ్గో తప్ప పశ్చాత్తాపం ఎంతమాత్రమూ కాదు. కాబట్టి దాన్ని పట్టించుకోకూడదని కోరుకుంటున్నాను. ఇలాంటివాళ్ళను భరించవలసివస్తున్నందుకు వాళ్ళ కుటుంబాల్లోని మహిళాసభ్యులకు నా సానుభూతి. హిందూత్వంపేరుతో వీళ్ళని ఆదర్శంగా తీసుకొని, వీళ్ళ అడుగుజాడల్లో నడవాలని ప్రయత్నిస్తున్న యువకులు ఇప్పటికైనా కళ్ళుతెరిచి, వీళ్ళ భావాల relavenceను గుర్తెరగాలని మనవి.

  5. తాడేపల్లి చేసిన మరొక తప్పు , ఇంకా ఎవరు ప్రస్తావించలేదు.

    బ్లాగులనుండి కొందరు గెంటివెయ్యబడ్డారు, ఇలాగే ఆడ మగ అందరు బ్లాగర్ల పై నీచమైన వ్యాఖ్యలు చెయ్యడం వలన. వారికి మారుపేరుతో విషం కక్కే అవకాశం ఇచ్చా(డు)ఋ.

    ఏదో ఒక పేరుతొ వచ్చి తన వాల్ పై భజన చేస్తే చాలనుకొన్నాడా తాడేపల్లి? ఏ చండాలాన్నయితే మేము కష్టపడి వదిలించు కున్నామో వాటికి ఇలా తలుపులుతెరవడం జుగుప్సాకరం. దానికేం సమాధానం చెపుతాడు????????????????? క్షమార్పణ సరిపోదు. పురుశాహక్కులకోసం అజ్నాతల భజనతో వ్రాసే ఎవరికైనా, తాడేపల్లి దుస్థితి రాకపోవచ్చు. పూర్తిగా చులకన మాత్రం అవుతారు.

    ఇప్పటివరకు పరశు రాముడి పేరుతొ వ్రాసిన దరిద్రుడెవరో ఎవరికీ అర్ధం కాలేదా?

  6. మౌళి గారు ఆ దరిద్రుడెవరో నాకు అర్ధం కాలేదు.

    “పురుశాహక్కులకోసం అజ్నాతల భజనతో వ్రాసే ఎవరికైనా, తాడేపల్లి దుస్థితి రాకపోవచ్చు. పూర్తిగా చులకన మాత్రం అవుతారు.”

    మీ ఈ సూచనతో నాకేదో అర్ధం అయీ అవనట్లుగా ఉంది. కొంపతీసి అతను తెలుగు బ్లాగుల్లో గాని ఉన్నాడంటారా?

  7. ఈ మధ్యన బ్లాగుల్లో పాట పోస్టలు చదువుతుంటే చాలా బూతులు కనబడ్డాయి.
    కొంత మంది అజ్ఞాతలు చేసి బూతులు సంగతి ఎం చెయ్యాలి.
    ప్రొఫైల్స్ లేకపోతే ఏం చేసిన చెల్లిపోతుందా ?
    దురదృష్టం ఏంటంటే ఇప్పుడు ఈ గొడవ దళితులకి, అగ్ర కులాలకి అన్నట్టు , ఏవో రెండు రాజకీయ పార్టీల తగవు లా తయారయింది.
    ఫేస్బుక్ లలో ఉన్న, I Hate Reservation లాంటి గ్రూప్స్ సంగతి ?
    చాలా మంది ఇంతకు ముందు వాడి వాళ్ళ బాధలు పడ్డాం, వీడి వాళ్ళ బాధలు పడ్డం అని update చేస్తున్నారు, అప్పుడంతా ఏం చేసారో వాళ్ళు ?

    Anyhow, as long as freedom of speech is honoured , we need not worry,
    Do you have any idea about the difference of IT act in India and other western countries ? is Govt of India trying to control this parallel 4th estate ?
    Are we being confined in the name of press freedom ?

  8. Hi venkat.

    >> is Govt of India trying to control this parallel 4th estate ?>>

    Yes. There is no doubt about it. But, it may be cautioned here that It doesn’t apply to the present context. There is certainly the difference between the proper use and misuse of a law.

    >>Are we being confined in the name of press freedom ?>>

    Looking strange but a meaningful expression. When we live in a class society, where one class rules another, every issue -be it an act, a value, a right, the use, the direction etc…- carries two meanings.

    For example, let us take the present subject namely, press freedom. Press freedom exists for the likes of Ramoji, Jagan but not for Pingali Dasaradharam, once the famous editor of the journal ‘encounter’ of Vijayawada in eighties. He was brutally killed under NTR rule with due consent from the then opposition parties. Beause he left none who belonged to ruling classes of any political party. The people of ruling classes desparately tried to brand his journal as ‘yellow journalism’ but failed to prevent the rising popularity of the journal. Hence the murder.

    The bottom line: if the press freedom is expressed by the ruling classes, it carries a great value. But, when it expresses the democratic aspirations of the oppressed people, it becomes a subject to be curtailed, locked and even banned.

  9. @ మౌళి గారు ఆ దరిద్రుడెవరో నాకు అర్ధం కాలేదు.

    ఆ పరుశు (పశువు అనొచ్చా ) ఇంకా ఇప్పటికి పబ్లిక్ గానే తాడేపల్లి ని విమర్శి స్తున్నవాళ్ళని తిట్టిపోస్తున్నాడు. , బహుసా తన స్వరూపం బయట పడలేదు అని కావచ్చు.

    మన బ్లాగుల్లో పురుష హక్కుల గురించి విపరీతంగా శ్రమిస్తున్న ఇంకొకరి (ఆ ప్రయత్నం తప్పు కాదు, విధానం నాకు అంగీకారం కాకపోయినా ) చుట్టూ కూడా ఈ పరుశురాముడు, ఇంకొందరు భజన చేస్తున్నారు ! దానివల్ల వాదన సంగతి తర్వాత, అయ్యేది చులకన మాత్రమె అని నా అభిప్రాయం.

  10. The bottom line: if the press freedom is expressed by the ruling classes, it carries a great value. But, when it expresses the democratic aspirations of the oppressed people, it becomes a subject to be curtailed, locked and even banned.

    Generally I don’t accept the class theory. Because of the way class defined. But what you said is a truth. There are two sets of rules.

  11. ఇది అరెస్టు చేయదగ్గ నేరమన్నవిషయం కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. కానీ సంస్కృతి పరిరక్షణపేరుతో ఇలాంటి భావాలను host చేసేంత వెనకబాటు ఆలోచనవిధానం కలిగిఉన్నవారి ముసుగులుతోసి వీధిలోనిల్చోబెట్టాల్సిన అవసరమ్మాత్రం ఉంది. ఇన్నాళ్ళూ వీళ్ళను సమర్ధించినవాళ్ళు తమ మహిళల విషయంలో నిందితుల మనోభావాలను సమర్ధిస్తున్నారేమో కనుక్కోవాలి. తేలుకుట్టిన దొంగల్లా ఎలా ఉండిపోయారో చూడండి. ఇకపోతే నిందితులు. వాళ్ళకి తాముచేస్తున్నది తప్పన్న భావం అంతర్లీనంగా ఉంది. దాన్ని బయటపడదులెమ్మన్న ధైర్యంతోటీ, బయటపడితె ఏమవుతుందిలేనన్న నిర్లక్ష్యంతోటీ కప్పెట్టేశారు. తీరా ఇలా పరిణమించేసరికి ఇలా నిజాయితీలేని క్షమాపణలతో సరిపెట్టజూస్తున్నారు.

    వీళ్ళ గురించి చదువుతుంటే దిగ్భ్రాంతికరమైన విషయాలు తెలుస్తున్నాయి. “దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్” అన్న గురజాడవారి మాటలను “దేశమంటే కొన్ని కులాలకు చెందిన పురుషులేనోయ్ వారే దేశమును పాలించతగుదురోయ్” తరహాలో మాట్లాడినప్పుడే వీళ్ళని సరైనదారిలో పెట్టుండాల్సింది. వీళ్ళభావజాలం కుసంస్కారం కాదట, దేశభక్తి అట. మానవత్వమే లేని వీళ్ళలో ఒక నిందితుడు ఇతరుల ఆధ్యాత్మిక ఉన్నతికై తోడ్పాటునందించడంలో తలమునకలై ఉంటాడట. వీళ్ళ మతం ముసుగూ, దేశాభక్తి ముసుగూ జనాలను ఆకర్షించి వారిని నెమ్మదిగా brain wash చెయ్యడానికేమోనని నా అనుమానం. ఇది పూర్తికా తీవ్రవాదం రూపుదాల్చకముందే, వీళ్ళు మానవత్వానికి శతృవులుగా పరిణమించకముందే ప్రభుత్వం తగిన చర్యతీసుకుంటుందని ఆశిద్దాం.

  12. పురుశాహక్కులకోసం అజ్నాతల భజనతో వ్రాసే ఎవరికైనా, తాడేపల్లి దుస్థితి రాకపోవచ్చు. పూర్తిగా చులకన మాత్రం అవుతారు.

    మౌళి, మీరు ఎవరిని రిఫరెన్సుగా తీసుకుంటున్నారో నాకు తెలీదు. కానీ, ఒక్కటి మాత్రం చెప్పగలను. స్త్రీలను ప్రతీ విషయములో సమర్ధిస్తూ రాయనంత మాత్రాన అలా రాసే వాల్లు తప్పు చేసిన వాళ్ళూ అయిపోరు (అది ఎవరైనా సరే). ఇక ప్రత్యేకించి పురుష హక్కుల కోసం రాసే వాల్లు ఆపని చేసి చులకణ అవ్వడం అంటూ జరగదు. ఇక్కడ స్త్రీలను ఘోరంగా అవమానించడముతో వారిని అందరూ నిందించినా ఎవరూ ఏమీ అనడం లేదన్నది గుర్తుంచుకోవాలి. అలా కాక, తమ హక్కులకోసం మగవారు రాసినప్పుడు కూడా ఇలాంటి ప్రతిస్పందన ఎదురైతే దానికి ధీటుగా మరో స్పందన ఎదురౌతుంది అన్న విషయాన్ని స్త్రీలు గుర్తుంచుకోవడం మంచింది.

    చూస్తుంటే, ఇది స్త్రీలపై చేసిన అసహ్యకర వ్యాఖ్యలకు మాత్రమే కాక వారికి వ్యతిరేకంగా రాసిన వారందరినీ బెదిరిస్తున్నట్లుగా ఉందనిపిస్తోంది. స్త్రీలకు వ్యతిరేకంగా రాయడం తప్పుకాదు అందులో న్యాయముంటే.

  13. వ్యాఖ్యాతలు ఒక విషయాన్ని గుర్తించాలి. పురుషులను గానీ, స్త్రీలను గానీ మొత్తంగా ఒక గాటన కట్టి “వ్యతిరేకంగా రాయడం” అనేది ఎల్లప్పుడూ తప్పే. స్త్రీల హక్కుల కోసం పని చేస్తున్నవారిలో స్త్రీలూ, పురుషులూ ఇద్దరూ ఉన్నారు, ఉంటారు. స్త్రీల అణచివేత సమస్య అనేది ప్రధానంగా వ్యవస్ధాగత సమస్య కనుక ఆ సమస్యకు పరిష్కారం కూడా వ్యవస్ధాగతంగానే ఉంటుంది.

    అయితే వ్యవస్ధలు మారడం అనేది ఒక రోజుతో జరిగేది కాదు. కొందరు వ్యక్తులతో జరిగిగేది కూడా కాదు. అదొక సామాజిక ప్రక్రియ. అనేక సానుకూల, ప్రతికూల సంఘటనల సమాహారం. అత్యంత ఉత్తేజకరమైన, అత్యంత బాధాకరమైన, నిర్దాక్షిణ్యమైన క్రియల కలయిక.

    అంతే కాకుండా ఇందులో వ్యక్తుల పాత్రలు కూడా ఉంటాయి. గ్రూపుల పాత్రలూ ఉంటాయి. కాబట్టి వ్యక్తులకు వ్యతిరేకంగా, గ్రూపులకు వ్యతిరేకంగా కూడా విమర్శలు, భావోద్వేగాలు అనివార్యం.

    సామాజిక ప్రక్రియల్లో చర్చల ప్రక్రియ ఒకటి. సున్నితమైన సామాజిక ప్రక్రియల్లో ఇది ఒకటి. తాడేపల్లి బృందం లాంటివారు చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యల విషయంలో నిర్దాక్షిణ్యత ప్రధానంగా ఉంటుంది తప్ప సున్నితత్వం కాదు. ఎందుకంటే వారు సున్నితత్వాన్ని ప్రదర్శించలేదు గనుక. సమాజ ప్రగతిని పట్టి వెనక్కి లాగుతున్న భావజాలానికి వారు ఒకానొక ప్రతినిధి బృందం. అలాంటివారి పట్ల ప్రగతిశీలత నిర్దాక్షిణ్యంగానే ఉంటుంది. లేదంటే దానికి గమనం ఉండదు.

    ఈ నేపధ్యంలో “స్త్రీలకి (లేదా పురుషులకు) వ్యతిరేకంగా రాయడం తప్పుకాదు, అందులో న్యాయం ఉంటే” అనడం సమస్యను సరిగ్గా అర్ధం చేసుకోకపోవడమే. పురుషులు, స్త్రీలు సమాజంలో అనివార్యమైన రెండు అర్ధభాగాలు. వారిద్దరిలో ఎవరికి వ్యతిరేకంగా అయినా సరే గుడ్డి వ్యతిరేకత ప్రదర్శించడం సరికాదు. స్త్రీ వ్యతిరేకతలో గానీ, పురుష వ్యతిరేకతలో గానీ న్యాయం ఎప్పుడూ ఉండదు.

    పురుషాధిక్య వ్యవస్ధలో ఒక స్త్రీని అణచివేస్తున్నది తక్షణ పరిశీలనలో పురుషుడే అయితే అతనికి వ్యతిరేకంగా చర్యలు, చర్చలు ఉంటాయి. స్త్రీ ఐతే ఆమెకి వ్యతిరేకంగా కూడా చర్యలు, చర్చలు ఉంటాయి. కొన్ని మహిళా చట్టాల్లో ఆ ఏర్పాట్లు ఉన్నాయి కూడా. సాధారణ పరిశీలనలో మాట్లాడుకోవలసింది మహిళల సమస్యలకు మూల కారణం అయిన వ్యవస్ధకి వ్యతిరేకంగానే తప్ప పురుషులకో, స్త్రీలకో వ్యతిరేకంగా కాదు. ఆయా సంఘటనల్లో ఆయా వ్యక్తులకు వ్యతిరేకంగా మాట్లాడడం ఎలాగూ ఉంటుంది.

    ఇపుడున్నది పురుషాధిక్య వ్యవస్ధ కాదు అన్న అభిప్రాయం ఉంటే ఆ అభిప్రాయం వ్యక్తం చెయ్యడంతోనే సరిపోదు. దానికి తగిన అధ్యయనాన్ని, పరిశీలనని సమాజం ముందు ఉంచాలి. స్త్రీలకి వ్యతిరేకంగా జరుగుతున్న అనేక సంఘటనలకు ఆ కోణం నుండి తగిన వివరణ ఉండాలి. అట్లా చేయకుండా మనకి తోచిందే అద్భుత తర్కం అని మనమే అనుకుని, తర్కవిరుద్ధమైన వాదనలతో పేజీలు నింపితే మౌళిగారు చెప్పినట్లు చులకన కావడం తధ్యం. తాడేపల్లిగారి లాగా మితిమీరితే ఎప్పుడో ఒకసారి ఆయన ఎదుర్కొంటున్న పరిస్ధితే ఎదురవుతుంది.

    >>దానికి ధీటుగా మరో స్పందన ఎదురౌతుంది అన్న విషయాన్ని స్త్రీలు గుర్తుంచుకోవడం మంచింది.>>

    ఏమిటి ఈ హెచ్చరిక? స్త్రీలు గుర్తుంచుకోవడం ఏమిటి? స్త్రీలందరికీ మీరు హెచ్చరిక చేస్తున్నారా శ్రీకాంత్ గారూ? దీటైన స్పందన అనేది వాదనలో ఉండాలి. తర్కంలో ఉండాలి. ఇలా స్త్రీ జాతి మొత్తానికి చేసే హెచ్చరికల్లో కాదు. ఓ పది అక్షరాలని ఒక చోట చేర్చి హెచ్చరిక చేయడం ఎంతసేపని? చెయ్యగలిగితే సామాజిక పరిణామ క్రమాన్ని అధ్యయనం చెయ్యండి. పరిణామ క్రమంలో స్త్రీ, పురుషులు ప్రస్తుతం ఉన్న సామాజిక స్ధాయిలకి ఎలా చేరుకున్నారో వివరించండి. తద్వారా తర్కబద్ధమైన జ్ఞానాన్ని అందజేయండి. అలా చేస్తే దానికి తగిన ఫలితం ఉంటుంది.

  14. నోట్: తాడేపల్లి అతని బృందం చేసిన వ్యాఖ్యలను కానీ, వారి భావజాలాన్ని కానూ నేను సమర్ధించడం లేదు. నా లక్ష్యం పురుష హక్కుల సాధన అంతే కానీ స్త్రీల దూషణ కాదు.

    విశేఖర్ గారూ,

    స్త్రీలకు వ్యతిరేకంగా రాయడం అంటే, అందరి స్త్రీలనూ ఒక గాటన కట్టేసి రాయడం కాదు అన్నది ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు ఒక స్త్రీ 498Aను దుర్వినియోగం చేస్తోందనుకోండి. ఆమెకు, అలానే దుర్వినియోగం చేసే మిగిలిన స్త్రీలకూ వ్యతిరేకంగా రాయడం అన్నది నా ఉద్దేశ్యం. అలా దుర్వినియోగం చేస్తున్న స్త్రీలను ఇది పురుషాధిక్య ప్రపంచం అని సమర్ధించుకోవడం వలన నిజంగా 498Aలాంటి చట్టాలు అవసరమున్న స్త్రీలు ఇబ్బంది పడతారు. పురుషాధిక్యమైన, స్త్రీ ఆధిక్యమైనా వివక్ష లేని న్యాయాన్ని పొందడం అందరికీ రాజ్యాంగం అందించిన హక్కు. ఆహక్కును ఏవో ఇజాల పేర్లు చెప్పి కాదంటాను అంటే దాన్ని నిర్మొహమాటంగా తిరస్కరిస్తాను.

    వ్యవస్థ మారడం అనేది ఎంత ముఖ్యమో, ఆమార్పులో అమాయకులను బలిపెట్టడం అన్నది జరగకుండా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం. అదే కనుక జరగక పోతే, ఒక అసమానత్వం నుండి మరో అసమానత్వం వైపు మనం ప్రయాణం చేసినవాల్లమవుతామే కానీ సమానత్వం దిశగా ప్రయానం చేసిన వాల్లం అవ్వము. ఆవిషయం గుర్తించాలి. అలా కాకుండా, పాపులర్ సెంటిమెంట్లనో, సిద్దాంతాలనో పట్టుకుని ఇది పురుషాధిక్య ప్రపంచం కాబట్టి నీకు అన్యాయం జరిగినా పర్వాలేదనో, లేక ఇది తప్పదు అనో చెప్పడం అంటే, మానవహక్కుల పట్ల ఏమాత్రం గౌరవం లేని పనే అవుతుంది.

    అయినా, కసబ్ లాంటి కరుడుగట్టిన ఉగ్రవాదులకు కూడా హక్కులున్న దేశములో మగవారు ఫలానా చట్టాలన దుర్వినియోగం వలన మా జీవితాలు నాశనం అవుతున్నాయని విలపిస్తున్నా పట్టించుకోక, పైపెచ్చు వారిని ప్రగతి నిరోధక చర్యలు చేసేవారు అని అభాండాలు వేయడం ఏం న్యాయం? వారేం అడుగుతున్నారు, అలా చట్టాలను దుర్వినియోగం చేసేవారిని శిక్షించండి, అలా దురుపయోగమవుతున్న చట్టాలను సవరించండి అనే కదా అడ్గుతున్నారు? అది తప్పా?

    మావోయిస్టుల మీద, తీవ్రవాదుల మీద ఉన్న ప్రేమ జనాభాలో సగ భాగమైన పురుషుల మీద లేదా? మావోయిస్టులు తప్పు చేసుంటే చట్ట ప్రకారం శిక్షించాలి అని మాట్లాడే వారు, చట్టాలను దురుపయోగం చేసి మవోయిస్టులను అక్రమంగా నిర్భందించిన వారిపై తిరుగు కేసులు పెట్టి వారిని శిక్షించాలని కోరే వారు, మగవారి పై మాత్రం అలాంటి అభిప్రాయాన్ని కలిగుండాకపోవడమేమిటి? మగవారు అంతపాపం ఏం చేశారని మీరు ఫీలవుతున్నారు?

    తాడేపల్లి బృందం వాడిన అతి దారుణమైన పదజాలముతో, ఆమోదయోగ్యం కానీ భావజాలముతో చేసిన వ్యాఖ్యలను, పురుష హక్కుల పోరాటాలతో పోల్చడం తగదు. పురుష హక్కులనేవి ఎవరికోసమో, ఏ సిద్దాంతము కోసమో కాంప్రమైజ్ అయ్యేవి కావు అన్న విషయాన్ని అందరూ గుర్తించాలి. ఏవిధంగా అయితే స్త్రీల హక్కులు మానవ హక్కులో అలానే పురుషుల హక్కులు కూడా మానవహక్కులే. వారి హక్కులకు విఘాతం కలిగితే స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాన్నే ఇక్కడ చెబుతున్నాను.
    (ఇంకా ఉంది)

  15. (Continued …) (part -2 )

    ##” పురుషాధిక్య వ్యవస్ధలో ఒక స్త్రీని అణచివేస్తున్నది తక్షణ పరిశీలనలో పురుషుడే అయితే అతనికి వ్యతిరేకంగా చర్యలు, చర్చలు ఉంటాయి. స్త్రీ ఐతే ఆమెకి వ్యతిరేకంగా కూడా చర్యలు, చర్చలు ఉంటాయి. “##

    చేసుకోండి అభ్యంతరం లేదు. నిజానికి అవి ఆహ్వానించ దగినవి కూడా. కాకపోతే, మగవారినందరినీ ఒకే గాటన కట్టేసి, ద్వేషముతో ఇచ్చే స్టేట్‌మెంట్లతోనే అసలు సమస్య. అంతే కాదు, పురుషాధిక్య వ్యవస్తే అయినా, పురుషుని హక్కులను హరించే విధంగా చట్టాలు చేసి, వాటిని దురుపయోగం (అంటే అతని తప్పు లేకపోయినా, వ్యక్తిగత కక్షలను తీర్చుకోవడానికి చట్టాలను ఉపయోగించడం) చేస్తూ ఉన్నప్పుడు, తక్షణ పరిశీలనో దానికి కారణం స్త్రీయే అనితేలినపుడు, ఇక్కడ కూడా చర్యలు చర్చలు చేయడం భాధ్యతకలిగిన వ్యక్తుల లక్షణం అవుతుంది. ఆ భాధ్యతను అందరం అలవరుచుకోవాలి. అంటే కానీ, ఇది పురుషాధిక్య ప్రపంచం అన్న ఒక్క స్టేట్‌మెంటుతో రోజు రోజుకీ పెరుగుతున్న బాధిత పురుషులను పట్టించుకోకపోవడం మానవహక్కులను కాలరాయడమే అవుతుంది.

    ఇప్పుడున్నది పురుషాధిఖ్య ప్రపంచం అవునా కాదా అన్నదానికి వద్దాం. కాదని ఎలా నిరూపించగలరు? ఒక వేల అయినా కూడా అన్ని చోట్లా పురుషాధిక్యత కొనసాగుతోందా? ఆ సోకాల్డు పురుషాధిఖ్య ప్రపంచములో ఎంతో మంది స్త్రీలు సబలలుగా మారి, పురుషులతో సమానంగా ఉద్యోగాలు చేస్తున్నారు, అంతరిక్షానికి వెలుతున్నారు, పురుషులకంటే ఒకడుగు అన్ని రంగాలలోనూ ముందున్నారు అంటు పొంగిపోయి చెప్పుకునే వారు, అదే స్త్రీలు పురుషులతో సమానంగా నేరాలు చేయగలరు, అవకాశం వస్తే పురుషులను కూడా ఇబ్బంది పెట్టగలరు అని మాత్రం ఎందుకు ఆలోచించరు? రోజు రోజుకీ పురుషులపై పెరుగుతున్న కేసులు, వాటిలో చాలా శాతం దురుపయోగాలూ మీకు కనిపించడం లేదా? ఉద్యోగాలు పోగొట్టుకుని, జీవితాలు సర్వనాశన మయ్యి ఆత్మహత్యలు చేసుకుంటున్న పురుషులు మీకు కనిపించడం లేదా?

    భారత దేశములో, ప్రతీ సంవత్సరం ఆత్మ హత్యలు చేసుకునే వివాహిత పురుషుల సంఖ్య, వివాహిత మహిళలతో పోలిస్తే ఎందుకు రెట్టింపు శాతం ఉందో ఏవరైనా స్టడీ చేశారా? అసలు పురుషుల సంక్షేమానికి, వారి ఆరోగ్యానికి ప్రభుత్వాలు ఖర్చు పెడుతున్నది ఎంత? నిజానికి వర్కు ఫోర్సులో సగభాగం మగవారే కదా (గృహిణులను కూడా వర్కు ఫోర్సుగా భావిస్తేనే సుమా), మరి వారి సంక్షేమం కోసం చర్యలేవీ? వారి ఆరోగ్యం కోసం చేసిన ఖర్చులేవీ?

    (ఇంకా ఉంది)

  16. ఇవే కాక, భార్యా భర్తలు విడాకులు తీసుకుంతే, భారీ మొత్తములో భరణం చెల్లించడమే కాక, పిల్లల సమ్రక్షణను కూడా కోల్పోవలసి రావడం దారుణం కాదా? తమ పిల్లలను తాము విజిటర్లలా అప్పుడప్పుడు చూస్తూ ఆధుఖముతో ఆత్మహత్యలు చేసుకుంటున్న తండ్రులు లేరా? (తండ్రులు కేవలం అప్పుడప్పుడు మాత్రమే కలిసే వీలుంటుంది. దానినే విజిటేషన్ అంటారు. కన్న తండ్రి విజిటరులా మారడం బావుందా?).

    పిల్లల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఇది చేశాం అనే మాట హాస్యాస్పదం. తండ్రి ప్రేమ నుండి వారిని దూరం చేయడం ఎలా వారి సంక్షేమ మవుతుంది. అలా కాకుండా జాయింట్ కష్టడీకి ఎందుకు అనుమతివ్వరు. Shared parenting అనే కాన్సెప్టును ఎందుకు అమలు చేయరు? మగాడు సంపాదించిన ఆస్థిలో సగ భాగం కావాలి (ప్రస్తుతం ఈ చట్టం పరిశీలణలో ఉంది) కానీ, మగాడికి తండ్రిగా పిల్లల సమ్రక్షణలో సగభాగం ఇచ్చే జాయింట్ కష్టడీని మాత్రం ఇవ్వరు. ఇదేనా ప్రగతి శీలమైన ఆలోచణ? దీన్ని వ్యతిరేకించినదుకేనా స్త్రీద్వేషులనే ముద్రలు?

    ## ఏమిటి ఈ హెచ్చరిక? స్త్రీలు గుర్తుంచుకోవడం ఏమిటి? స్త్రీలందరికీ మీరు హెచ్చరిక చేస్తున్నారా శ్రీకాంత్ గారూ? దీటైన స్పందన అనేది వాదనలో ఉండాలి. ##

    విషేఖర్ గారూ, ధీటైన స్పందన అనేది వాధనలోనే కాదండీ, అనేకమంది పురుష హక్కుల కార్యకర్థలు చేతలలో కూడా చూపిస్తున్నారు. ఇప్పుడు 498A అనే చట్టం దారుణంగా దుర్వినియోగ మవుతోంది అని అంతా గుర్తిస్తున్నారు, జాతీయ మహిళా కమీషన్ కు చెందిన వారు కూడా ఆ చట్టం దుర్వినియోగ మవుతోంది తొలగించాలని చెప్పారు అంటే ఆ ధీటైన పోరాటము వలనే. ఇది స్త్రీలందరికీ చేసిన హెచ్చరికా ?? మీరు మీ టపాలో కూడా ఒక హెచ్చరిక పెట్టారు. బయట కూడా చాలా మంది ప్రస్తుతం హెచ్చరికలు చేస్తున్నారు. అవన్నీ పురుషులందరికీ చేసిన హెచ్చరికలేనా? కాదు కదా. మరి దీన్ని మాత్రం మీరు స్త్రీలంతా అని ఎందుకు అనుకున్నారో నాకు అర్థం కావడం లేదు.

    పురుష హక్కుల కోసం గొంతెత్తి పోరాటాలు చేసిన వారిలో ఎందరో స్త్రీలున్నారు. వారందరికీ శిరసు వంచి అభివాడం చేస్తున్నాను. వారికి హెచ్చరికలు చేసేంత సాహసం నేను చేయలేను. అలానే, చాలా మంది స్త్రీలు మగవారికి జరుగుతున్న అన్యాయాలను వివరించినప్పుడు సానుకూలముగా స్పందిన్స్తున్నారు. దానికి కారణమైన చర్యలను ఖండిస్తున్నారు. వారికి హెచ్చరికలు చేసే ఆలోచన కలలో కూడా రానివ్వను. మరికొందరు తమ పనిలో తాము నిమఙ్ఞులై ఇతర విషయాలను అంతగా పట్టించుకోవడం లేదు. వారినీ నేను హెచ్చరించే సాహసం చేయలేను. కానీ, కొంత మంది స్త్రీలూ, అలానే పురుషులూ కూడా మగవారి పై జరిగే అన్యాయాలను ప్రస్తావించినప్పుడు, వారిని స్త్రీ ద్వేషులనో మరోటనో తూలనాడడం జరుగుతోంది. ప్రస్తుతం అయితే బెదిరించడం కూడా జరుగుతోంది. వారిని హెచ్చరించడానికి నేను వెనుకాడను.

    నేను పైన రాసిన కామెంట్లు కూడా మీరు టపాలో వాడిన కొన్ని వ్యఖ్యలకు వ్యతిరేకంగా చేసినవే. ముక్యంగా పురుషాధిక్య ప్రపంచం మీద మీరు రాసిన వాటికి. ఎందుకంటే, కొంత కాలం కిందట స్త్రీల విషయమై నేను మీతో చర్చించడం జరిగింది. గృహహింస అనేది పురుషులే కాదు స్త్రీలు కూడా చేస్తున్నారు అని చెప్పడం జరిగింది. అంతే కాదు, నా వాదణకు బలం చేకూర్చే సాక్షాలను కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఆ సంధర్భములో కూడా మీరు ఈ పురుషాధిక్య ప్రపంచం అంటూ వాదనలు చేశారు. ఇది మీరు మరో వ్యక్తీ (ఎవరో మీకు తెలుసనే అనుకుంటాను) అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. అంతే కానీ, నేనీ వ్యాక్యలను తాడేపల్లి బృందాన్ని సమర్ధించడానికో వారిపై చర్యలు తప్పని చెప్పడానికో చేయడంలేదు. అలాంటి నిందలు నా మీద కొంత మంది వేయాలని ప్రయత్నిస్తున్నట్టుగా అనిపిస్తోంది. అది తగదని, ఈ సందర్భంగా చెబుతున్నాను.

  17. @Sreekanth M

    మీరు స్త్రీలకి వ్యతిరేకంగా వ్రాస్తున్నారని నేను అనుకోలేదు ఎప్పుడు. కాబట్టి మీ వాదన నిరాధారం. మీరు అర్హం చేసికోవడంలో చిన్న పొరపాటు, తాడేపల్లి చుట్టూ ఉన్నవ్యక్తులు అజ్నాతలుగా మీ చుట్టూ కూడా ఉన్నారు. మీరు తాడేపల్లి లా తప్పు చేయ్యరనే చెపుతున్నాను. అదే సమయంలో మీకు వంత పాడుతూ ద్వేషాన్ని వెళ్ళగక్కుతున్న అజ్నాతలవల్ల మీ అభిప్రాయాలు ఎలా వెలతాయో చెప్పాను. మీరు చేసే వాదనని నేను తప్పుపట్టడం లేదు. మీ వాదనచుట్టు చేరుతున్న విషాన్ని అబ్జెక్ట్ చేస్తున్నాను. మీకు సంబంధం లేనిది అని మీరు తప్పుకున్నా అది మీ సంతృప్తి కోసం మాత్రమె.

  18. @మౌళి,

    మీరు నన్ను తప్పు పట్టడాన్ని నేను కాదనను. మీకు న్యాయమనిపించింది మీరు చెబుతున్నారు. అది కాదు సమస్య. కానీ, నేను రాసే రాతలను తాడేపల్లి బృందం చేసిన రాతలను ఒకే గాటన కట్టడం మాత్రం నిజంగా బాధా కరమైన అంశం. దురదృష్టమేమిటంటే కొంత మంది మగవారు చేసే పనుల వల్ల, మగవారిపై జరుగుతున్న అన్యాయాలను ప్రస్తావించే వారు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావడం.

    ఎనీ వే, మీకు ఆ ఉద్దేశ్యం లేదు అంటున్నారు కాబట్టి సంతోషం. తాడే పల్లి బృందం చేసిన వ్యాక్యలపైనే మీ అభ్యంతరం అయితే నా మద్దతు మీకు, వారికి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రతీ ఒక్కరికీ ఉంటుంది.

  19. శ్రీకాంత్ గారూ,

    మీ వ్యాఖ్యని ఇంకోసారి చూద్దాం.

    “దానికి ధీటుగా మరో స్పందన ఎదురౌతుంది అన్న విషయాన్ని స్త్రీలు గుర్తుంచుకోవడం మంచింది.”

    ఇందులో మీరు చెప్పిన పరిమిత అర్ధం లేదు. మీ వ్యాఖ్యలో ఏ అర్ధం వస్తుందో ఆ అర్ధానికే ఎవరైనా స్పందిస్తారు. మీ మనసులో ఇంకేదన్నా ఉద్దేశ్యం ఉన్నా, పరిమిత అర్ధాలు ఉన్నా వాటిని ఊహించుకుని స్పందించడం బహుశా నాకే కాదు ఎవరికీ సాధ్యం కాదు.

    498A దుర్వినియోగం, సద్వినియోగం అంశాలపై నేను మరో టపా ద్వారా చర్చించే ప్రయత్నం చేస్తాను. అప్పటివరకూ నేను చెప్పగలిగినది: సద్వినియోగం కావలసిన చట్టం దుర్వినియోగం అవుతోంది కాబట్టి తీసెయ్యాలనే వాదన అసంబద్ధం. ఆ మాటకొస్తే మన చట్టాల్లో సద్వినియోగం అవుతున్నవి వేళ్లమీద మాత్రమే లెక్కించగలం. ఒక్కసారి కూడా దుర్వినియోగం కాకుండా పూర్తిగా సద్వినియోగం అయిన చట్టం అసలు ఉందో లేదో అనుమానమే. కాబట్టి ఆ చట్టాలు కూడా తొలగించాలని చెప్పడం ఎంత అసంబద్ధమో 498A ని తీసెయ్యాలనడం అంతే.

    ఢిల్లీ బస్ అత్యాచారం నేపధ్యంలో మధ్య ప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గారు “అత్యాచారాలకు పురుషులు ఎంత బాధ్యులో, స్త్రీలు అంతే బాధ్యులు” అని అన్నారు. (విమర్శలు వచ్చేసరికి ఆ నెపాన్ని పత్రికలపైకి నెట్టేశారనుకోండి!) ఆమె అన్నారని అది నిజం కాబోదు. అలాంటి ప్రముఖులు అన్నవి పరిగణించాల్సినవి కొన్ని ఉంటాయి. కాని అవి కొన్ని మాత్రమే. 498A చట్టం దుర్వినియోగాన్ని అరికట్టే బాధ్యత పోలీసులు, కోర్టులపైన ఉంది. వారి వైఫల్యం అనేక పోరాటాలతో సాధించుకున్న చట్టం రద్దు కావడానికి కారణం కారాదు.

    ఇక “పురుషాధిక్య ప్రపంచం కాబట్టి నీకు అన్యాయం జరిగినా ఫర్వాలేదు” అని ఎవరన్నారు? తెలుగు బ్లాగుల్లో నేనెక్కడా అలా చదవలేదు. మహిళా సంఘాలు ఆ మాట చెప్పగా నేను వినలేదు, చదవలేదు. ఒక అన్యాయాన్ని సిద్ధాంతం పేరు చెప్పి సమర్ధించడం ఎవరూ చెయ్యరు, అది నిజంగా అన్యాయం కాకపోతే తప్ప. మీ వ్యాఖ్యల్లో ఇలాంటివే ఇంకా ఉన్నాయి. మీరేవో నీడల్ని ఊహించుకుని వాటిపై పోరాడతానంటే నాకు అభ్యంతరం లేదు. అదంతా మీకు సంబంధించిన వ్యవహారం.

    మనం ఉంటున్నది పురుషాధిక్య ప్రపంచం అని అనేకమంది స్కాలర్లు, పరిశోధకులు, సామాజికవేత్తలు, చరిత్రకారులు చెప్పిన విషయం. అది కాదు అని చెప్పడానికి ఏం చెయ్యవచ్చో నేను ఒకసారి సూచించాను. మళ్లీ చెబుతాను. అలాంటి వారి పుస్తకాలు చదవండి. సమాజాన్ని వారు విశ్లేషించిన విధానాన్ని చూడండి. ఆ విధానాలు తప్పయితే వాటికి ప్రత్యామ్నాయంగా మీరు ముందే నిర్ణయించిన కంక్లూజన్ కి అనుగుణంగా మరొక విధానాన్ని అభివృద్ధి చెయ్యండి. బహుశా దీన్నే పరిశోధన అంటారనుకుంటాను. మీ ధీసిస్ ని ససాక్ష్యాలతో అంటే చారిత్రక ఉదాహరణలతో, సమాజం ఇదిగో ఇలా పరిణామం చెందింది అని చెప్పే ప్రతిపాదనలతో నిరూపిస్తే అది పరిగణనలోకి వస్తుంది. వ్యవస్ధకి సంబంధించిన సిద్ధాంతాలను నిరూపించడానికి ఇంతకు మించిన మార్గం లేదు. అలా చేయకుండా ఊరికే పేజీలు నింపితే ముందే చెప్పినట్లు చులకన అవుతారు. ఎవరూ వినరు.

    నిజం చెబుతాను. పురుషాధిక్య ప్రపంచం కాదంటూ మీరు చేసే వాదనలు తలతిక్క (మీకు కాదు) వాదనలు తప్ప మరొకటి కాదు. కొన్ని మహిళా చట్టాల వలన కొందరు పురుషులకు అన్యాయం జరుగుతోంది అంటే దానికి అర్ధం ఉంటుంది. కాని చట్టాల దుర్వినియోగాన్నీ, కొందరు మహిళలు సాగించే అన్యాయాల్నీ చూపిస్తూ అనేకమంది మేధావులు చరిత్రను, సమాజాన్ని అధ్యయనం చేసి తేల్చిన వాస్తవాన్ని కాదని వాదించబూనుకోవడం, అది కూడా ఎలా నిరూపించమంటారు అని ఎదురు అడగడం… ఏమిటిదంతా? ఎలా నిరూపించగలరు అని ఎవరి అడుగుతారు? ఆ విషయం చెప్పేది మీరే గనుక మీరే నిరూపించాలి. నిరూపించలేకపోతె ఆ వాదనలు చెయ్యడం మానుకోవాలి.

    పైగా మాటి మాటికీ ఇజాల పేరుతో అలా అనడం, ఇలా అనడం అంటూ రాస్తుంటారు. మీ ఇజం మీకు ఉన్నట్లే నా ఇజం నాకు ఉంది. నా ఇజాన్ని తప్పని చెప్పాలంటే దానికి తగిన అధ్యయనంతో ముందుకు రండి. అదేమీ లేకుండా ‘నేను రాసేది రాస్తాను’ అంటే ఈ బ్లాగ్ అందుకు వేదిక కాదు. పురుష హక్కులు అంటూ మీరు రాసేవాటిని ఇకముందు ప్రచురించడం సాధ్యం కాకపోవచ్చు (దానికి తగిన తర్కబద్ధమైన ఆదారాలు ఉంటే తప్ప). హక్కులకోసం పోరాటం అనేది అణచివేతకు గురవుతున్న వర్గాలకు సంబంధించి జరుగుతుంది. పురుష హక్కుల కోసం పోరాడితే నాకు అభ్యంతరం లేదు. కాని పదే పదే వచ్చి ఉపయోగం లేని చర్చ చేస్తే అది ప్రచురించడం నా వల్ల కాదు. గుర్తించగలరు.

    నేను చేసేవి తలతిక్క వాదనలు అని భావించే హక్కు మీకు ఉంది. ఆ సంగతి పాఠకులు ఎలాగూ తేలుస్తారు. కాని అది మీ బ్లాగ్ లో రాసుకోండి. ఇక్కడ కాదు. ఈ విషయం మీకు చెప్పడం ఇది ఎన్నోసారో మరి!

  20. Do u burn ur house if there is rats menace in it? Demanding to abolish 498a act is as ridiculous as burning house to get rid of rats menace. I dont justify all of them who claim themselves as women. When a male blogger used disgraceful words like amangala harati and mundamopi etc, the sister of our telugu blogosphere tried to defend him by sending mails to other female bloggers. I wont get surprised if those women even demand to abolish 498a act in favour of men.

  21. @ Srikanth M

    ****/నేను రాసే రాతలను తాడేపల్లి బృందం చేసిన రాతలను ఒకే గాటన కట్టడం మాత్రం నిజంగా బాధా కరమైన అంశం. దురదృష్టమేమిటంటే కొంత మంది మగవారు చేసే పనుల వల్ల, మగవారిపై జరుగుతున్న అన్యాయాలను ప్రస్తావించే వారు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావడం. /***

    ఇది తప్పనిసరి శ్రీకాంత్, ఒకే గాటన ఉన్నదనే చెప్పడం , మీ టపాల్లో వ్యాఖ్యానించే వారు వీరు వేరు కాదు. మీరు చూసారో లేదో , తాడేపల్లి భర్త సంపాదన నుండి డబ్బులు ఆశించే స్త్రీలు వెలయాళ్ళు అవుతారని అన్నపుడు అతనితో మాట్లాడినది నేను మాత్రమే “!!!!. అప్పుడు కూడా మీ చుట్టూ ఉన్న అజ్నాతలు తాడేపల్లి ని ఉత్సాహపరిచారు. అవన్నీ తాడేపల్లి పట్టించుకోకపోయి ఉండొచ్చు మీలానే. అప్పుడే ఇంకొందరు బ్లాగర్లయినా తాదేపల్లికి ఆతను చేస్తున్న వాదం నీచమైనది అని చెప్పిఉంటే, అటువంటి అజ్నాతలని నిరోధించి ఉంటె ఇవ్వాళ అంతర్జాలం లో ఉన్నవాళ్ళకి ఈ ఖర్మ (అటువంటి చర్చలు చదవడం) తప్పేది. కాని జరగలేదు. సమాజం చాలా కఠినం గా ఉంటుంది.ముందు హెచ్చరికలు చెయ్యదు. అలాగే సమస్యలో ఉన్నపుడు కూడా ఎక్కువమంది మౌనం వహించడ మో , ఆనందించడమో జరుగుతుంది. వీరు మిమ్మల్ని కూడా కొంత అంతే ట్రీట్ చేస్తారు.

    తాడేపల్లి గురించి నేను చర్చించడం లేదు, నేను చెయ్యవలసినది అతని వ్యాఖ్యలను ఖండించడం… అది చాలా రోజులముందే ‘సిరిసిరిమువ్వ’ గారి బ్లాగులో చేసాను.

    మీరు చేసే ప్రతివాదనలు మీ ప్రక్కనున్నవారు దాని స్థాయిని దిగజార్చడం జరుగుతుంది. కాబట్టే నా మొదటి వ్యాఖ్య.

    నేను సాఫ్ట్వేర్ పెళ్ళిళ్ళు అనే టపా వ్రాసాను, నిజానికి అది మీకు చాలా ఉపయోగపడాలి. అలాంటివి వంద ఉన్నాయి. ఎక్కడో జడ్జిలకి వచ్చే సమాచారం చాలా చాలా తక్కువ.హిందూ మతం గురించి కూడా సుప్రీం కోర్టు ఒక జడ్జిమెంట్ వెలువరించింది.అది మనం నూరుశాతం తీసికోము, సమస్య తీవ్రతను బట్టి ( హిందువులు మరీ అతివాదం చేస్తున్నపుడు) ఉదహరించవచ్చు కాని, మొత్తం వాదనకి వారి స్టేట్మెంట్స్ పనికి రావు.

  22. నేను రాసిన వ్యాక్యలకే నేను బాధ్యత వహించగలను అంతే కానీ, అందరి వ్యాక్యలకూ కాదు. నా భావజాలం, పురుష హక్కుల కోసం చేసే పోరాటం ఎవరో నలుగు అసభ్య రాత గాల్ల వలన చెడిపోతుంది అని ఎవరన్నా అన్నా పట్టించుకోవాల్సిన పనిలేదు. నేను రాసే వాటిలో లోపాలు ఉంటే చూపండి అంతే కానీ, ఎవరో రాతలను .. చూపించడం వలన ఒరిగేది ఏమీలేదు. పైనే చెప్పడం జరిగింది, పురుషుల హక్కులు అనేవి మానవ హక్కులే అని. అవి ఎవరికోసమో కాంప్రమైజ్ అయ్యేవి కావు.

    ఇక తాడేపల్లి గారి భావజాలమా? ఆయనను నేను ఎప్పుడు దూరంగానే ఉంచాను. అందుకే ఆయన ఏమి రాస్తున్నాడు అనే దాన్ని గురించి నేను ఏనాడూ పట్టించుకోలేదు. కాబట్టి, ఆయన చెప్పే దాన్ని అప్పుడు వ్యతిరేకించలేదెందుకు అన్న మీ ప్రశ్న అర్థరహితం.

  23. తాడేపల్లి కి మీకు ఒకే భావజాలం ఉందని ఇక్కడ ఎవరు చెప్పలేదు. కాని ఆయన వ్రాతలు కొందరికి ఉపయోగ పడుతున్నట్లే మీవి కూడా. మీ అభిప్రాయాలు పరిచే చోట ఇంకెవరు అభిప్రాయాలు చెప్పకుండా అజ్నాతల హింస ఉంటుంది అది చాలు, మీరెంత నిబద్దతగా మీ భావాలను వ్యక్తీకరిస్తున్నారో అర్ధం కావడానికి. ఇక మీ అభిప్రాయాలు ఎవరు చూడాలనికూడా అనుకోరు. ( ఈ వాక్యం పై కావాలనుకొంటే మీరు విభేదించవచ్చు, కాని పురుష ద్వేషాన్ని అంటగట్టవద్దు ) అలాగే ఆయన భావజాలాన్ని ‘మీరు’ ఎందుకు విమర్శించలేదు అని మిమ్మల్ని ఎవరు ప్రస్నించలేదు. ఒకసారి సరిగా చుడండి. అలాగే ఇకపై మీ ఇష్టం, సందర్భం వచ్చ్సింది అని చెప్పాము ( సందర్భం అని మీకు అనిపించక పోవచ్చు )

  24. పింగ్‌బ్యాక్: 2013లో ‘జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ’ -సమీక్ష | జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s