వారి భావజాలంపై పోరాటం కోసమే పోలీసు కేసు –మహిళా నేత సంధ్య


sandhya 01తాడేపల్లి, కృష్ణ మోహన్ తదితరులు వ్యక్తం చేసిన మహిళా వ్యతిరేక భావజాలంపై తాము పోరాటం ఎక్కుపెట్టామని అందుకే పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించడానికే తాము నిర్ణయం తీసుకున్నామని ప్రగతిశీల మహిళా సంఘం (POW) రాష్ట్ర అధ్యక్షురాలు వి. సంధ్య తెలిపారు. క్షమాపణలతో వదిలెయ్యడమా లేక కేసు పెట్టాలా అన్న విషయాన్ని తాము చర్చించామని, అంతిమంగా కేసు పెట్టడానికే తాము నిర్ణయించుకున్నామని సంధ్య తెలిపారు. కొద్దిసేపటి క్రితం సంధ్య గారిని ఈ బ్లాగర్ సంప్రదించగా ఆమె ఈ సంగతి తెలియజేశారు. క్షమాపణలు చెప్పడం ఒక అంశం అనీ, కానీ అత్యంత వికృత స్ధాయిలో మొత్తం మహిళా లోకంపైన వారు వ్యక్తం చేసిన వ్యతిరేకత, సహించరాని విషయం అనీ, ఈ ధోరణికి అడ్డుకట్ట వేయాలంటే చట్టం, న్యాయం తమ పాత్ర నిర్వహించడం అనివార్యమని సంధ్య తెలిపారు.

తాడేపల్లి లలితా సుబ్రమణ్యం, కృష్ణ మోహన్, పరశురాముడు, పవన్ సంతోష్, యోగే పవన్, పవన్ కుమార్ అనే ఆరుగురు వ్యక్తులు ఫేస్ బుక్ లో మహిళలపై ఉంచిన అసభ్య వ్యాఖ్యలపై పెను దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఫేస్ బుక్ లో ఖాతాలు ఉన్న అనేకమంది తెలుగు మహిళలు వారిపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేయగా, సీనియర్ జర్నలిస్టులు రూప వాణి, వనజ, ఫిల్మ్ మేకర్ కత్తి మహేష్ కుమార్, భూమిక పత్రిక సంపాదకులు కొండవీటి సత్యవతి తదితరులు ప్రత్యక్ష కార్యాచరణలోకి దుమికారు. వీరంతా కలిసి కొద్ది రోజుల క్రితం కమిషనర్ ఆఫ్ పోలీస్ అనురాగ్ శర్మను కలిసి ఫిర్యాదు చేయడంతో విషయాన్ని పరిశీలించమని ఆయన సైబర్ క్రైమ్ విభాగానికి పురమాయించారు.

fb 12ఈ లోపు అసభ్య వ్యాఖ్యాతలు తాము పశ్చాత్తాపం చెందుతున్నట్లు ఫేస్ బుక్ ద్వారా, ఈ మెయిల్స్ ద్వారా తెలియజేశారు. ప్రముఖ స్త్రీవాద రచయిత్రి కొండవీటి సత్యవతి గారికి రాసిన ఈ మెయిల్స్ లో పవన్ కుమార్, పవన్ సంతోష్ లు బేషరతు క్షమాపణలు కోరారు. సదరు క్షమాపణ లేఖలు ఈ బ్లాగ్ లోనే పాఠకులకు అందుబాటులో ఉన్నాయి. తాడేపల్లి మాత్రం తన పశ్చాత్తాపానికి మెలికలు పెట్టారు. తాము మిత్రులుగా చేసుకున్న సంభాషణలు “మా ఇష్టం, అడగడానికి మీరెవ్వరు?” అని ప్రశ్నిస్తూ “ఆడము__” అని దూషించినట్లు తెలుస్తున్న తాడేపల్లి ఆ తర్వాత విషయం సీరియస్ అయింది అని అర్ధం అయాక కాళ్ల బేరానికి వచ్చాడు. తన ఉద్దేశ్యం మంచిదేననీ, తనకు సరైన వ్యూహం, శైలి లేకపోవడంతో దానిని మహిళలు అర్ధం చేసుకోలేకపోయారని ‘మదిలో మెదిలిన భావాల’ పేరుతో ఆయన తన క్షమాపణలకు షరతు విధించారు. “అలా మనం ఎవఱి మనసూ మార్చలేం. ఎవఱినీ బాగుచేయలేం” అంటూ పరోక్షంగా ఎత్తిపొడిచారు కూడా.

ఈ నేపధ్యంలో కేసు పెట్టడానికి సిద్ధపడితే తాము ఆత్మహత్య చేసుకుంటామని వీరిలో కొందరు హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఒకరైతే తన వేలు కూడా కోసుకున్నట్లు చెప్పాడని వనిత టి.విలో ఈ విషయంపై జరిగిన చర్చలో ఒక మహిళ తెలిపారు. దానితో ఏం చేయాలన్నదీ మహిళలు, కార్యకర్తలు తదితరులు మళ్ళీ సమావేశమై చర్చించుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమ నేపధ్యంలో తీరిక లేకుండా ఉన్న ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు సంధ్య గారు కూడా ఈసారి వీరితో కలిసి చర్చించినట్లు తెలుస్తున్నది. కేసు పెట్టడానికే మహిళలు, ఇతర కార్యకర్తలు సోమవారం జరిపిన చర్చల్లో నిర్ణయించామని సంధ్య తెలిపారు.

ఇది వ్యక్తిగతం కాదు

క్షమాపణలు చెప్పడం, స్వీకరించడం ఒక అంశం మాత్రమేనని, అది జరగాల్సిందే అయినప్పటికీ సమస్య తీవ్రత దృష్ట్యా దానిని చట్టం దృష్టికి తీసుకుపోయి తగిన న్యాయం పొందవలసి ఉన్నదని సంధ్య వ్యాఖ్యానించారు. ఫేస్ బుక్ లో వ్యక్తమయిన వ్యాఖ్యానాలు ఒక భావజాలానికి సంబంధించినవనీ, వాటికి వ్యవస్థాగత నేపధ్యం ఉన్నదని తెలిపారు. “వీరి భావజాలం మహిళలకు వ్యతిరేకమైనది మాత్రమే కాదు. బడుగు కులాలకు, మైనారిటీ మతానికి కూడా వీరు వ్యతిరేకం. నిమ్న కులాల వారన్నా, మైనారిటీ మతస్ధులన్నా వీరికి చులకన అని వీరి వ్యాఖ్యలు చూస్తే తెలుస్తుంది. ఇవన్నీ ఆధిపత్య వర్గాల భావజాలం. సమాజంలో శ్రమ చేసే తరగతికి చెందిన మెజారిటీ ప్రజలను అణచిపెట్టి ఉంచే భావజాలాన్ని వీరు కలిగి ఉన్నారు. రాజ్యాంగం ఇలాంటి వారినుండి ప్రజలకు రక్షణ కల్పిస్తానని ఆయా తరగతుల ప్రజలకు వాగ్దానం ఇచ్చింది. వారి రక్షణకు చట్టాలు చేశామని ప్రభుత్వాలు చెబుతున్నాయి. అయినా ఇలాంటి భావాలు ఇంత బహిరంగంగా, ఇంత నిస్సిగ్గుగా, అందరూ సంచరించే ఒక సామాజిక వెబ్ సైట్లో వ్యక్తం చేయడం ఏమిటి? ఈ నేపధ్యంలో చట్టం, న్యాయం కల్పిస్తామని చెప్పే వ్యవస్థలు తమ పని తాము చేయకపోతే ఇలాంటి శక్తులు మళ్ళీ మళ్ళీ తలెత్తుతూనే ఉంటాయి” అని సంధ్య ఈ బ్లాగర్ తో మాట్లాడుతూ అన్నారు.

ఈ వ్యక్తులకు తగిన బుద్ధి రావాలంటే వారి భార్యలు, తల్లిదండ్రులు, అక్కలు, చెల్లెళ్లు, కొడుకులు, కూతుళ్లు అందరి పైనా కేసు పెట్టాలనీ, నిందితుల చేత లెట్రిన్ లు కడిగించాలని, వారి ఫొటోలు అన్ని పోలీసు స్టేషన్లలో ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని సి.వి.ఎల్.నరసింహరావు గారి లాంటి వారు వాదించారనీ అందుకు తాము ఒప్పుకోలేదని సంధ్య తెలిపారు. ఆయన చెప్పినట్లు ప్రతీకారం తీర్చుకునే ఉద్దేశ్యం తమకు లేదని స్పష్టం చేశారు. నిందితుల ప్రవర్తనకు వారి బంధువులను, అయినవారిని నేరుగా నేర చట్టాలకు గురయ్యే విధంగా బాధ్యులను చేయడం అర్ధరహితం అని ఆమె వ్యాఖ్యానించారు. టాయిలెట్లు కడగడం అనేది కొన్ని కులాల వారిచేతనే బలవంతంగా చేయిస్తున్న వృత్తి అనీ చెబుతూ ఆమె అలాంటి వృత్తినుండి వారిని విముక్తి చేయాలని తాము పోరాడుతున్నామని తెలిపారు. అలాంటి పనిని నిందితులకు శిక్షగా విధించాలని చెప్పడం సరికాదని తెలిపారు. అలా చేయడం శ్రమని అగౌరవపరచడం మాత్రమే కాక నిందితుల సామాజిక భావజాల నేపధ్యాన్ని విస్మరించడమేనని తెలిపారు.

ఫేస్ బుక్ అసభ్య వ్యాఖ్యల సమస్య ఒకరిద్దరు స్త్రీలకు పరిమితమైన వ్యక్తిగత సమస్య కాదని సంధ్య నొక్కి వక్కాణించారు. వ్యక్తిగత సమస్య అయితే ఆయా వ్యక్తుల ఇష్టాయిష్టాలను బట్టి క్షమాపణ చెప్పడమా లేక కేసు పెట్టడమా నిర్ణయించవచ్చని, ఇది ఆధిపత్య వర్గాల, కులాల భావజాలాలను నిరంతరం కొనసాగేలా చేయడానికి ప్రయత్నపూర్వకంగా రుద్దబడుతోందనీ, అందుకే చట్టాన్ని ఆశ్రయించడానికి తాము చర్చించి నిర్ణయించుకున్నామని సంధ్య తెలిపారు. మహిళలపై సాగిన వక్ర భాష్యాలు, చిన్న పిల్లల దగ్గర్నుంచి పి.జిలు చదివి, రీసెర్చ్ చేస్తున్న వారందరి గుణగుణాలపై వ్యక్తం అయిన భావాలు ఏదో యథాలాపంగా, యాదృచ్ఛికంగా దొర్లినవని భావించరాదని సంధ్య స్పష్టం చేశారు. ఫేస్ బుక్ లోనూ, బ్లాగుల్లోనూ చురుకుగా ఉన్న కొందరు మిత్రులు చెప్పిన విషయాలను బట్టి చూసినా వీరి ఉద్దేశ్యాలు స్పష్టంగానే ఉన్నాయనీ, కొన్ని అగ్రకులాలకు, కొందరు పురుష పుంగవులకు మాత్రమే ఆధిపత్యం పరిమితం కావాలని వీరు చేసిన బోధనలు తీవ్రంగా ఉన్నాయని తెలిపారు.

ఈ బ్లాగ్ లోనే Unknown అనే వ్యాఖ్యాత చేసిన వ్యాఖ్య ఈ సందర్భంగా ఉటంకించడం సముచితం కాగలదు:

వీళ్ళ గురించి చదువుతుంటే దిగ్భ్రాంతికరమైన విషయాలు తెలుస్తున్నాయి. “దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్” అన్న గురజాడవారి మాటలను “దేశమంటే కొన్ని కులాలకు చెందిన పురుషులేనోయ్ వారే దేశమును పాలించ తగుదురోయ్” తరహాలో మాట్లాడినప్పుడే వీళ్లని సరైన దారిలో పెట్టుండాల్సింది. వీళ్ళ భావజాలం కుసంస్కారం కాదట, దేశభక్తి అట. మానవత్వమే లేని వీళ్ళలో ఒక నిందితుడు ఇతరుల ఆధ్యాత్మిక ఉన్నతికై తోడ్పాటునందించడంలో తలమునకలై ఉంటాడట. వీళ్ళ మతం ముసుగూ, దేశభక్తి ముసుగూ జనాలను ఆకర్షించి వారిని నెమ్మదిగా brain wash చెయ్యడానికేమోనని నా అనుమానం. ఇది పూర్తిగా తీవ్రవాదం రూపు దాల్చక ముందే, వీళ్ళు మానవత్వానికి శతృవులుగా పరిణమించకముందే ప్రభుత్వం తగిన చర్య తీసుకుంటుందని ఆశిద్దాం.

సంధ్య గారికి నిందితుల గురించి తెలిసిన విషయాలు ఎంత నిజమో పై వ్యాఖ్యానం చెబుతోంది.

కమిషనర్ ఆఫ్ పోలీస్ అనురాగ్ శర్మ గారికి మహిళలు కొద్ది రోజుల క్రితం చేసిన ఫిర్యాదు సరిపోదని తెలుస్తోంది. వీరంతా స్వయంగా పోలీసు స్టేషన్ కి వెళ్ళి ఫిర్యాదు చేస్తే తప్ప కేసు రిజిస్టర్ కాదు. దానితో పోలీసు స్టేషన్ కి వెళ్ళి ఫిర్యాదు చేయడానికి సంధ్యగారితో కలిసి ఇతరులు ఒక ఫిర్యాదు తయారు చేశారు. ఇందులో నలుగురు [రూప వాణి, సురేష్, వనజ, సంధ్య (POW)] ఫిర్యాదుదారులముగా ఉన్నామని సంధ్య తెలిపారు. తాడేపల్లి లలిత బాలసుబ్రమణ్యం, కృష్ణమోహన్ లు ఇద్దరూ పోలీసుల ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నట్లు ‘వీళ్లకి తల్లి చెల్లి లేరా?‘ ఫేస్ బుక్ పేజి ద్వారా తెలుస్తున్నది.

సంధ్య, రూప వాణి, సత్యవతి, వనజ, సురేష్, మహేష్ కుమార్ తదితరులందరికీ ఈ బ్లాగు పూర్తి మద్దతు ఇస్తోంది.

11 thoughts on “వారి భావజాలంపై పోరాటం కోసమే పోలీసు కేసు –మహిళా నేత సంధ్య

 1. ఇప్పుడు చాలా కొద్ది మంది పబ్లిక్ మద్దతు మాత్రమె ఉన్న ఈ సంఘటనకు, ఒకరొకరు ముందుకు వచ్చి నపుడు మిగిలిన వారంతా ఏకమొత్తంగా కొవ్వుత్తులు పట్టుకోడానికి కదిలిరావాల్సిందే.

 2. పార్లమెంటు సభ్యుడు ఒకరు ఉండవల్లిని ఒక “—– వేశ్యతో” పోల్చితే కేసులు లేవు! ఒక ఖండనా లెదు తెలంగాణా ప్రాంత మహిళోద్ధారాక సంఘాల నుండి.. ఎందుకంటారు? తమ ప్రాంతం వాడేకాదా అని తాయితీనా?

 3. పార్లమెంటు సభ్యుడు ఒకరు ఉండవల్లిని ఒక “—– వేశ్యతో” పోల్చితే కేసులు లేవు! ఒక ఖండనా లేదు తెలంగాణ ప్రాంత మహిళోద్ధారాక సంఘాల నుండి.. ఎందుకంటారు? తమ ప్రాంతం వాడేకాదా అని రాయితీనా?

  ముమ్మాటికి తాడేపల్లి, కుల మత ఆధిపత్య ధోరణి అతని బ్లాగులో ఎప్పుడూ మనం చూసేదే! హద్దులు మీరినప్పుడు యిటువంటి ప్రతిఘటన తప్పదు. నాకు తెలిసినంత వరకు అతను సామాన్యుడు (నా లాగే! కాకపోతే నేను వామపక్ష సానుభూతి పరుడను), వ్యక్తిగతంగా తన భావజాలాన్ని వ్యక్తపరుస్తున్నాడు.

  తను వ్యవస్థీకృతంగా చేసిన వ్యాక్యానం కాకపోయినా, బేషరతు క్షమాపణలు చెప్పినా వారిని కేసులు లేకుండా వదిలి వేయడం మంచిదేమోనని నా ఉధేశం.

  ఈ ప్రతిఘటన కేవలం “స్త్రీ” ని కించపరచడం పై కాకుండా, వారి మిగతావాదలతో విభేదించడం పై ఉక్రోశంగా అని ప్రజలు అనుకొనే అవకాశం వుంది. లేకపోతే పార్లమెంటు సభ్యుడి పై కేసులెందుకులేవు?

  “అంటరానితరం నేరం” చట్టం.. నిజంగా సమాజంలో అనగదొక్కబడిన ప్రజలకు ఉపయోగ పడటం కన్నా, రాజకీయ నాయకుల ఎత్తులు పైఎత్తుల లలో ఒక అస్త్రంగా మిగిలిపోయింది.

  అదేవిధంగా, సరైనా వ్యక్తులపై, సరైనా సమయంలోనే బ్రహ్మస్త్రాన్ని ప్రయోగించాలని నా ఉధేశం.

 4. Pease read this paragraph from this post: http://jabilli.wordpress.com/2010/02/24/%E0%B0%B5%E0%B1%80%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B3%E0%B1%81-%E0%B0%85%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AF%E0%B0%BF%E0%B0%B2%E0%B0%BE/
  >>>>>>>>>>
  తాడేపల్లి గారి వ్యాఖ్య ప్రకారం తండ్రుల్ని చూసి తాగే కొడుకులకు విచక్షణ ఉంటుంది కానీ తల్లి దగ్గర తాగుడు నేర్చుకునే కొడుకులకు తల్లెవరో తెలీనంత కిక్కు ఎక్కుతుంది! అందువల్ల ఆడాళ్ళు తాగ కూడదు! శభాష్!తాడేపల్లి గారు మాత్రమే ఇలా మాట్లాడగలరు!
  >>>>>>>>>>

 5. Mr. Praveen, learning drinking ( alcohol ) is bad. That doesn’t have any different, where you learn from. Bad is bad. And the above statement which is posted by Praveen( I don’t know who the hell is he? But He’s thinking he’s a big shit) states that he is discriminator.just change your attitude about women.

 6. I hope you know that I am not the above Unknown. I’ll try to use other id from now on to avoid these things from now on.

  Thanks
  విశేషజ్ఞ (fka Unknown)

  Request you not to bother publishing this comment.

 7. విశేషజ్ఞ గారు, మీరు చెప్పిన తేడా ఇతరులకు కూడా తెలియాలి. అందుకని స్వల్పంగా సవరించి మీ వ్యాఖ్యను ప్రచురిస్తున్నాను.

 8. Okay here is the the thing? The above unknown is Amar from Michigan, who loves his country and also try to be a global citizen. I have been Rome all over the world and i notice there is no equal justice about women. That’s why I react with above statement. I don’t wanna continue the dispute about my statement, that’s why I didn’t mention my name. Any how this is Dr.Amar, P.hd in computer aided engineering and physiology, annarbor, Michigan, U.S.A

 9. Hi Unknown, It is not about dispute or statement (opinion) but about confusion of same name. Maybe ‘unknown’ is also a name like ‘అనామిక’. But, as there is already one ‘Unknown’ here and he seems to contradict with your opinion, he wants to clarify the difference.

  What you said about women is right. There is no gender equality anywhere in the world due to perpetuation of patriarchal values. There is nothing wrong in expressing your opinion but let us not make personal comments on the other commenters. Thank you.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s