మూతపడని నోళ్ళు, గీత దాటితే సీత గతేనట!


Mohan Bhagvat and Kailash Vijayvargiya

Mohan Bhagvat and Kailash Vijayvargiya

అత్యాచారాలకి వ్యతిరేకంగా అంతపెద్దఎత్తున జనం ఉద్యమించినా పురుష పుంగవుల నోళ్ళు మూతపడబోమంటున్నాయి. గీత దాటితే సీతకి పట్టిన గతే పడుతుందని బి.జె.పి నాయకుడొకరు నోరు పారేసుకుంటే, మహిళలపై అత్యాచారాలు ఇండియాలో జరుగుతున్నాయి గానీ భారత్ లో జరగడం లేదని ఆర్.ఎస్.ఎస్ సుప్రీం నాయకుడు స్పష్టం చేస్తున్నాడు. మధ్య ప్రదేశ్ బి.జె.పి మంత్రి కైలాస్ విజయ్ వర్గియా, ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ తాజాగా మహిళాలోకం ఆగ్రహాన్నీ, పౌర ప్రపంచం ఖండన మండనలను ఎదుర్కొన్నారు.

“Ek hi shabd hai- Maryada. Maryada ka Ulanghan hota hai, toh Sita-haran ho jata hai. Laxman-rekha har vyakti ki khichi gayi hain. Us Laxman-rekha ko koi bhi par karega, toh Rawan samne baitha hai, who Sita-haran karke le jayega.” (Times of India, 4/1/2013)

“నైతిక పరిమితి (లక్ష్మణ రేఖ) అనేది ఒకటుంటుంది. దానిని ప్రతిఒక్కరూ పాటించాలి. ఆ పరిమితి దాటితే సీతను రావణుడు ఎత్తుకెళ్ళినట్లే జరుగుతుంది” అని మధ్య ప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల మంత్రి కైలాస్ విజయ్ అన్నాడని ఎన్.డి.టి.వి తెలిపింది. టైమ్స్ ఆఫ్ ఇండియా, ది హిందూ, ఫస్ట్ పోస్ట్ లాంటి జాతీయ పత్రికలు, వెబ్ పత్రికలన్నీ ఈ వార్తను ప్రచురించాయి. ఢిల్లీ సామూహిక అత్యాచార ఘటనపై ఒక పక్క జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు కొనసాగుతుండగానే మరో పక్క దేశంలో అన్నిమూలలా అత్యాచారాలు కొనసాగుతున్నాయి. పసివాడని పిల్లలపైనా టీనేజి యువతులపైనా ఈ దారుణకృత్యాలు కొనసాగుతుండడాన్ని పత్రికలన్నీ ప్రచురిస్తున్నాయి. అయినప్పటికీ స్త్రీ స్వేచ్చా వ్యతిరేక తత్వంతో కూడిన వ్యాఖ్యలు చేయడానికి ఈ సోకాల్డ్ పెద్దలు వెనకడుగు వేయడానికి ససేమిరా అంటున్నారు.

మధ్యప్రదేశ్ మంత్రి వ్యాఖ్యలు బి.జె.పిని ఇరకాటంలోకి నెట్టాయి. ఢిల్లీ కాక కొనసాగుతున్న నేపధ్యంలో కైలాస్ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని బి.జె.పి ప్రతినిధి రవి శంకర్ ప్రసాద్ స్పష్టం చేశాడు. తమ పార్టీ ఆయనను తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కోరుతుందని ఆయన చెప్పాడు. ఆయన చెప్పినట్లే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు కైలాస్ విజయ్ శుక్రవారం ప్రకటించాడు. మహిళలను గాయపరిచే ఉద్దేశ్యం తనకు లేదని ఆయన చెప్పుకొచ్చాడు. అనదలుచుకున్నది అనేసి నాలుక్కరుచుకోవడం, తమ ఉద్దేశ్యాలేమిటో స్పష్టం చేసి ఆనక తమకా ఉద్దేశ్యం లేదని చెప్పడం రాజకీయ నాయకులకు, పెద్దలం అనుకుంటున్నవారికి ఉన్న ఆలవాటే.

నిజానికి ఇలాంటి వ్యాఖ్యలు గతంలో అన్నీ పార్టీల నాయకులు చేసి ఖ్యాతి గడించి ఉన్నారు. ఉత్తర భారతంలో అనేక గ్రామ పంచాయితీలు అత్యాచారాల నిరోధం పేరుతో డ్రస్ కోడ్ ప్రకటించిన ఉదాహరణాలూ ఉన్నాయి. ఆడపిల్లల మంచి కోరే పేరుతో వారికే ఆంక్షలు విధించడం ఈ వ్యవస్ధల గొప్పతనం. వ్యాఖ్యల ఉపసంహరించుకోవడం, మహిళల క్షేమం కోసమే చెప్పామనడం, పాజిటివ్ గా ఎందుకు చూడరని ప్రశ్నించడం, దురుద్దేశ్యాలు అంటగట్టొద్దని ప్రశ్నించినవారిపైనే ప్రతిదాడి చేయడం ఈ సంస్కృతీ కాపలాదారుల తెలివితేటల్లో కొన్ని. అయితే ఉపసంహరించుకోవడమూ తప్పేనా అని ప్రశ్నిస్తే సమాధానం కాదనే. దశాబ్దాల తరబడి బాలికలు, మహిళలపై దారుణమైన అత్యాచార ఘటనలు జరుగుతున్నప్పటికీ తప్పని రుజువైన కారణాలనే మళ్ళీ, మళ్ళీ చెప్పడం ఏమిటన్నది ఇక్కడి ప్రశ్న. అన్నమాట వెనక్కి తీసుకున్నప్పటికీ ఒక ప్రతినిధిగా లేదా ఒక పెద్దగా బాధితులనే నిందితులుగా చేసి ఆంక్షలు విధించే వెనుకబాటు భావనల్లో వారున్నారని స్పష్టం అవుతోంది. కోపం, ఆవేదన, నిస్పృహ… అన్నీ దానిపైనే.

ఆర్.ఎస్.ఎస్ నేత మోహన్ భగవత్ చెప్పింది ఆమాటలు కాకపోయినా ఆయన అంతరార్ధం రహస్యం ఏమీ కాదు. పురాణ మరియు మధ్యయుగాల మతవిలువల్లో ఆదర్శాలు వెతుకుతున్న ధోరణినే ఆయన మళ్ళీ వ్యక్తం చేశాడు. దళితులను, మహిళలను బానిసలకు సమానంగా చూసిన మధ్య యుగాల సంస్కృతిని పునరుద్ధరించడానికి కంకణం కట్టుకున్న సంస్ధకు ఆయన అధినేత. ఇండియా, భారత్ వేరు వేరు అని చెప్పడం ద్వారా ఇండియా తిరిగి కుల, మత కట్టుబాట్లతో కూడిన భూస్వామ్య వ్యవస్ధవైపుకి (వెనక్కి) ప్రయాణం కట్టాలన్న కోరికను వ్యక్తం చేశాడు.

ఇలాంటి అత్యాచారాలు నగరాల్లో తప్ప గ్రామాల్లో జరగడం లేదని కూడా ఆయన వ్యాఖ్యానించాడని పత్రికలు చెబుతున్నాయి. “దేశంలో గ్రామాలకుగానీ అడవులకు గానీ వెళ్లండి. సామూహిక అత్యాచారం, లైంగిక నేరం లాంటి ఘటనలు అక్కడ ఉండవు. కొన్ని పట్టణ ప్రాంతాల్లోనే అవి మెండుగా ఉన్నాయి. కొత్తచట్టంతో పాటు, ప్రాచీన భారతీయ విలువల ప్రాతిపదికన భారతీయ నైతికవిలువలను, మహిళలపట్ల వైఖరులను పునర్దర్శనం చేయాలి” అని మోహన్ భగవత్ వ్యాఖ్యానించాడు (ఎన్.డి.టి.వి, 4/1/2013).

ఇంతకీ ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ గారు ఎక్కడ ఉన్నారు? నిజం చెప్పాలంటే అర్ధ భూస్వామ్యం చెరవీడని గ్రామాల్లో జరుగుతున్న అత్యాచారాలు చాలా వరకు వెలుగు చూడవు. గ్రామాల్లో కులాధిపత్యం, మగాధిపత్యం చెలాయించడానికి లైంగిక అత్యాచారం చాలా మామూలుగా అందుబాటులో ఉండే సాధనం. బెదిరించి నోరుమూయించడం, పదో పరకో ఇచ్చి లేదా ఇప్పించి సర్ది చెప్పడం, మాట వినకపోతే హత్యలు చేయడం గ్రామాల్లో జరుగుతుంటుంది. తరచుగా పోలీసులే నిందితుల తరపున వకాల్తా పుచ్చుకోవడం మామూలు విషయం. ఇవన్నీ మోహన్ భగవత్ కి తెలియదనుకోవాలా? ఇండియాని భారత్ అన్నంతమాత్రాన ఇవన్నీ ఎలా మాయమవుతాయి?

ఈ బ్లాగ్ లో పదే పదే చెబుతున్నట్లు వీరే భారత సామాజిక వ్యవస్ధకు కాపలాదారులు. కాపలా కాయడమే కాకుండా తమకు వీలయితే సమాజాన్ని మళ్ళీ వెనక్కి తీసుకుపోవడానికి గట్టిగా కృషి చేస్తున్నారు. అన్నింటా ఫక్తు అణచివేతలతో కూడిన సంస్కృతిని ఘనసంస్కృతిగా కీర్తిస్తూ దుర్గంధానికి అత్తర్లు అద్దుతున్నారు. అంటే సమాజం ప్రగతివైపు పయనించడానికి తాము వ్యతిరేకులమని స్పష్టంగానే చెబుతున్నారు. కాకపోతే ప్రగతి వ్యతిరేకతను పశ్చిమ సంస్కృతీ వ్యతిరేకతగా చెప్పి నమ్మమంటున్నారు. ఫ్రాక్ , పశ్చిమ సంస్కృతుల్లో ఏది తీసుకున్నా మారవలసిందే, అభివృద్ధి చెందవలసిందే. ప్రతి సంస్కృతిలోనూ మంచి, చెడు; పాత, కొత్త, వెనుకబాటుతనం, ప్రగతితత్వం… ఇలా పరస్పర వైరుధ్యాంశాలు కొలువుదీరి ఉంటాయి. మానవులంతా తేడాలులేకుండా సహజీవనం సాగించేందుకు వీలయిన అంశాలను స్వీకరించి అభివృద్ధివైపు సాగడమే ఇపుడు వ్యక్తులు, శక్తులు చేయవలసిన పని.

19 thoughts on “మూతపడని నోళ్ళు, గీత దాటితే సీత గతేనట!

 1. విశేఖర్ గారు, ఆధునికతలో కూడా మూఢ నమ్మకాలని ఏర్పరుచుకునేవాళ్ళు ఉంటారు. ఆధునికత పేరు చెప్పుకున్నంత మాత్రాన సంస్కృతి మారదు. సెక్స్ చెయ్యడం తప్పు కాదని అంటూనే hymen పొర చెరిగిపోని స్త్రీతోనే సెక్స్ చేస్తాను అనే మూర్ఖులు కూడా ఉన్నారు. మన ఇండియాలో సెక్స్ గురించి బహిరంగంగా మాట్లాడడం నిషిద్ధమే కానీ టర్కీ దేశంలో అది నిషిద్ధం కాదు. అక్కడ పెళ్ళైన దంపతులందరూ సెక్స్ చెయ్యడం అక్కడి సంప్రదాయం. అంతమాత్రాన అక్కడ స్త్రీలకి స్వేచ్ఛ ఉందని అనుకోలేము. టర్కీ దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో స్త్రీలకి పెళ్ళికి ముందు హైమెన్ పరీక్షలు చేసే అనాగరిక ఆచారం ఉంది. ఒక వ్యక్తి ఒక వైపు ఆధునికత పేరుతో సెక్స్ సంబంధాలని సమర్థిస్తూనే అదే సమయంలో ఆధునికతకి వ్యతిరేకమైన కన్యత్వం లాంటి భావనలని కూడా నమ్మగలడు. ఇండియాలో తాము పాశ్చాత్య సంస్కృతిని నమ్ముతున్నట్టు చెప్పుకునేవాళ్ళు చేస్తున్నది ఇదే. అందుకే నేను పాశ్చాత్య సంస్కృతి, డేటింగ్ లాంటి విషయాలలో వాటిని డిస్కరేజ్ చేస్తున్నట్టే మాట్లాడాను.

 2. ప్రవీణ్ గారూ మీరు చెప్పిన వైరుధ్యాలు ఉన్నది నిజమే. ఆధునికత పేరుతో చెలామణి అవుతున్నదంతా ఆధునికం కాదని మొదట గ్రహించవలసిన విషయం. పశ్చిమ దేశాల సంస్కృతి దిగుమతి చేసుకుని దానికి ఆధునిక ముసుగు తొడుగుతున్నారు. ఆధునికత అనేది ఆయా వ్యక్తుల సామాజిక అవగాహన స్ధాయిపై ఆధారపడి ఉంటుంది. సమాజం ఎంతగా ప్రజాస్వామ్యీకరించబడితే అంత ఆధునికంగా ఉన్నట్లు అని గ్రహిస్తే ఈ వైరుధ్యాలను సరైన రీతిలో అర్ధం చేసుకోవచ్చు.

  మీ అనుభవాలు, అధ్యయనం, గ్రహింపు బట్టి కొన్ని అభిప్రాయాలు ఏర్పడ్డాయి. అలాగే నాకూ, మిగతావారికీ. మనకి ఏర్పడ్డ అభిప్రాయాలు సరైనవో కాదో తెలియాలంటే పొగడ్త, తెగడ్త రెండింటికీ సిద్ధంగా ఉండక తప్పదు కదా. చర్చించడం తప్ప నాకు మరో ఉద్దేశ్యం లేదని గమనించగలరు.

 3. మరింకేం లక్ష్మణరేఖను దాటడమనే తప్పును చేసిన సీతకు శిక్ష సరైనదేనన్నమాట 🙂

  ఇలాంటివాళ్ళని, ఇలాంటి భావజాలాన్నీ మనం ఎంకా ఎన్నాళ్ళు భరించాలో! ప్రపంచమంతా విజ్ఞానపధంలో ముందుకుపోతుంటే, వీళ్ళు బూజుపట్టిన పుస్తకాల్లోంచి పనికిమాల్నిన సూత్రాలను వల్లించి తమనుతాము నైతికతకు రక్షకులుగా నియమించుకొని వీళ్ళ అజ్ఞానాన్నీ, సమాజంలో వీళ్ళ uselessnessనీ counteract చేస్తున్నామనుకుంటున్నారు. ఇలాంటివాళ్ళు పూర్తిగా తుడిచిపెట్టబడితేగానీ ఏసమాజమైనా బాగుపడదు. May these people die and go to heaven so that we could live as we wish in our country and on earth.

 4. ఈ తరహా ధోరణీకి మూలం వీరి మతమూ, దానిమీద ఆధారపడిన వీరి విలువలూ. వీళ్ళమతంలో ఆడవాళ్ళకి నిబంధనలేఉన్నాయిగానీ, వాళ్ళమీద అఘాయిత్యాలు చెయ్యొద్దని అంతగా కట్టుబాట్లేమీలేవు. అదృష్టవశాత్తూ ఎక్కువమంది వారి మతప్రసాదిత నైతివిలువలపరిధిని దాటి వ్యవహరించగలుగుతున్నారు. చట్టమంటే ఉన్న భయంకూడా దీనిక్కొంతవరకూ కావచ్చు. కానీ ఆలోచించలేకపోతున్నారు. ఏరోజైతే మోహన్ భగవత్‌లాంటివాళ్ళు అధికారంలోకి రాగలుగుతారో అప్పుడు తెలుస్తుంది వీళ్ళమతం ఎంతసొంపైనదో.

 5. మహీధర్ గారూ, ఆయన స్పీచ్ కోసం నేను వెతికాను. నాకు పత్రికల్లో ఎక్కడా దొరకలేదు. అందువలన ఆ స్పీచ్ పై రాయాలనుకుని కూడా రాయలేకపోయాను.

  ముస్లిం ప్రజలు, సంఘాలు కూడా అనేకమంది ఖండిస్తున్నారంటే ఆయన ప్రసంగం ఎంత ఘోరంగా ఉందో అర్ధమవుతోంది. పాతబస్తీలో అనేకమంది ఇంకా కటిక దరిద్రంలో మగ్గుతున్నారంటే కారణం ఓవైసీ కుటుంబమే. మతాన్ని అడ్డుపెట్టుకుని వారి దోపిడీ, అణచివేతలు సాగించుకుంటున్నారన్నది నా అభిప్రాయం.

 6. విశేఖర్ గారు, ఆయన స్పీచ్ యూట్యూబ్‌లో ఉంది. గంటకి పైగా నిడివి గల వీడియోలో పూర్తి స్పీచ్ విన్నాను. ఆ స్పీచ్‌లో అతను సాధారణ ప్రజలకి అర్థం కాని వాలిద్ (తండ్రి), ఇస్మత్ (కవచం) లాంటి ఉర్దూ పదాలు వాడడం వల్ల తెలుగు పత్రికలు ఆ స్పీచ్‌ని పూర్తిగా అనువదించలేకపోయాయి. నాకు ఉర్దూ కొంచెం తెలిసి ఉండడం వల్ల స్పీచ్ అర్థమైంది. అనువదించాలనుకుంటే మీకు సహాయం చెయ్యగలను.

 7. celebrities ki sita gitaa lanti matalu emi undavu…vallu ite rodla meda car lu aapi baga tagi enjoy chesina mana nayakulu emi anaru…pyga vallaki chala manchi protection istaru… ade oka saadarana mahila friend tho cinema ki velte mana nayakulaku sita gita lanti matalu gurthu vastai. ee sangatna kanna chala darunam ina sangatanu grammallo jarugutai, nijam gaa mana media ki antha responsibility unte grammallo unna ilantidi godavala meda focus cheste, nijam gaa ilantidivi repeat kaavu. geeta datite ilantidivi jarugutayi antunnaru mana nayakulu. mari, geeta datani valla meda chala jarugutunnai, mari valla gurunchi emi matladara? kuracha dustulu vesukunte rape chesestaraaa? ala anukunte, mari grammalo rape lu ela jarugutunnai? nijam gaa rape anedi oka manasika jabbu…strela meda/mother meda gowaravam leni vallu chese pani idi…ituvanti vedavalaku mana nayakulu teliyakundane support chestunnaru….it’s too sad

 8. ఇంటిలో కరెంట్ పోయింది. కంప్యూటర్ ఇన్వర్టర్ మీద నడుస్తోంది. బాగా గుర్తున్న ఒక వ్యాఖ్యని మాత్రం అనువదించి ఇస్తున్నాను. “పంద్రా మినట్ పులీస్‌కో హటాదో, హమ్ పచీస్ కరోడ్ లోగ్ వోహ్ సౌ కరోడ్ లోగ్‌కో హమారా తాకత్ దిఖా సక్తే హై” అనేది ఆ వ్యాఖ్యలలో ఒకటి. “పదిహేను నిముషాలు పోలీసులని లేకుండా చేస్తే మన 25 కోట్ల మంది (ముస్లింలు) ఆ వంద కోట్ల మంది (హిందువులు)కి మన శక్తి ఏమిటో చూపిస్తారు” అని దాని అర్థం. అక్బరుద్దీన్‌కి పోలీసుల మీద గానీ చట్టం మీద గానీ నమ్మకం లేదని ఈ వ్యాఖ్యని బట్టి అర్థమైపోతోంది. అందుకే కొంత మంది ముస్లింలు కూడా ఇటువంటి వ్యాఖ్యలపై అభ్యంతరం చెప్పారు.

 9. శేఖర్ గారు,
  మోహన్ భాగవత్ మాట్లాడిన పూర్తి పాఠం వినండి. మొదట ఆయనపైన విరుచుకు పడిన వాళ్లందరు ఇప్పుడు సారిలు చెపుతున్నారు. నిన్న సాగరిక గోష్ ఆయనకు ట్విటర్ లో సారి చెప్పింది. ఆశిష్ నంది గురించి మీకు చెప్పవలసిన అవస్రం లేదను కొంటాను.
  http://tehelka.com/ashis-nandy-says-bhagwat-is-right/

  “ఈ తరహా ధోరణీకి మూలం వీరి మతమూ, దానిమీద ఆధారపడిన వీరి విలువలూ”

  మా మతం గురించి, దాని విలువల గురించి నీకు ఎమీ తెలియదు. కనీసం నీకు నీమతం గురించి కూడా తెలిసినట్లు లేదు. అన్నచేలెళ్ళు పెళ్ళిళు చేసుకొన్న చరిత్ర ఏడారి మతాల వారిది. ఎక్కడైనా చరిత్ర పుస్తాకాలు దొరికితే చదివితేలుసుకో. ప్రపంచ ప్రఖ్యాత చరిత్రకారుడు గిబ్సన్ రాసిన పుస్తకాలలో ఇటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. నువ్వు మతం మారిన భారతీయ సంస్కృతినే కొనసాగిస్తూ ఉండటం మూలాన, అసలు విషయం మీకు తెలియదు కాబోలు. కనీసం ఈ మధ్య జరుగుతున్న విషయాలైనా మీకు తెలుసా?

  Italy Shuts Off Credit Card Payments In Vatican
  http://www.economywatch.com/in-the-news/italy-shuts-off-credit-card-payments-in-vatican.04-01.html

  Papal Impropriety: The Dark Secrets Of The Vatican Bank
  http://www.economywatch.com/economy-business-and-finance-news/papal-impropriety-the-dark-secrets-of-the-vatican-bank.22-03.html?page=full

 10. శేఖర్, నేను ఆర్ యస్ యస్ వాడిని కాను. ఈ వ్యాఖ్య రాయటానికి కారణం మీడీయ ప్రజలలో ఆవేశాన్ని ఎలా రేకెస్తుందో, ఎలా తప్పుదోవ పట్టిస్తుందో తెలుసుకోవటానికి ,ఈ సమాచారం ఇచ్చాను.

 11. మతోన్మాదం ఏదైనా ఖండించబూనుకోవడం విఙ్ఞత కలిగిన వారు ఎవరినా చేయవలసిన పని. కానీ స్థల కాలాలకు అతీతంగా ఈ పని చేయబూనడం అంత మంచిది కాదని అనుభవాలు చెబుతున్నాయి. ఈ రోజు అక్బరుద్ధీన్ ను విమర్శించడానికి ఆయన విమర్శకులు ఎవరూ పెద్దగా ప్రయాస పడడం లేదు. కానీ హిందూ మతోన్మాదాన్ని ఈ దేశంలో విమర్శించడానికి చాలా శక్తిని వెచ్చించాల్సి ఉంటుంది. ఈ తేడాను గమనించకపోతే చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. మజ్లీస్ ను తిట్టే పనిలో బిజెపి తన శక్తులన్నీమోహరిస్తూనే ఉంది. ఈ రోజుకు ప్రజాస్వామ్యాన్ని కాపాడగలిగిన గొప్పశక్తి తనే అయినట్టుగా. మనం ఇక బిజెపీతో నడుద్దామా? లేకుంటే దాని బండారాన్ని బయటపెడుతూ, మన వైఖరిని ప్రకటిద్దామా?

 12. ఏమయ్యా మనోహరా… నీకు నీమతం గురించి తెలునటయ్యా? తల్లిలాంటిది, తల్లితాంటిది అంటూనే కుచాలగురించి వర్ణించారుగదటయ్యా. అసలు కుచాల ప్రస్తావనలేని దేవీస్తోత్రాలు ఎన్నున్నాయయ్యా? శివుడు తల్లినీ, బ్రహ్మ కూతురినీ కూడి ప్రసిధ్ధులయ్యారు అని సంస్కృతంలో రాసుకున్నారుకదయ్యా. శివపార్వతులను తల్లిదండ్రులనిచెప్పుకున్న కవిగారు వారిద్దరి రతికార్యాన్ని వర్ణిస్తే దాన్ని ఇప్పటికీ గౌరవిస్తున్నారుకదయ్యా. తల్లులవంటివారి విషయంలోనె కుచాలమీదమీదకి దృష్టిపోకుండా నిగ్రహించుకోలేనివారు ఇహ లోకాలకి ఏవిధంగా నీతులు చెప్పగలరయ్యా?!

 13. ఒక చిన్న సూచన. చర్చను మతాల గొప్పదనం మీదికి కాకుండా మతాల్లో ఉన్న అంశాలవరకే (అది కూడా భావోద్వేగాలకు లోనుకాకుండా) పరిమితం చేస్తే ఉపయోగం. గౌరవనీయులయిన సందర్శకులు ఈ నియమాన్ని పాటించగలరని విజ్నప్తి.

 14. తల్లిమించిన దైవం లేదు అని మా మతం లో చెప్పారు. ఇంకే మతం లో చెప్పలేదు. మీ మతం లో వాళ్లకి సెక్స్ లో పాల్గొనటం అనేది పాప కార్యం. మీ జుడొ క్రైస్తవ విలువలతో మా మతాన్ని బేరీజు వేయమాక. మా మతం లో వారికి సెక్స్ అంటే బూతు, తప్పుడు పని కాదు. ఈ రోజులలో ప్రభుత్వం సెక్స్ ఎడ్యుకేషన్ అవసరం గుర్తించి ఎలా స్కుల్ చదువు లో భాగం చేయలనుకొంట్టున్నాదో ఆరోజులలో మా తాతలు దానిని కావ్యాలలో భాగం చేశారు, అదేకాక దేవాలయాల మీద శృంగార భంగిమల బొమ్మలు చెక్కించి ప్రజలలో అవగాహన పెంచారు. అది ఒక సంస్కృతిలో ఉన్న పరిణతిని సూచిస్తుంది. కాని ఇప్పుడు డబ్బు సంపాదించటమే పెద్ద సంస్కృతిగా ప్రచారం మొదలయింది. ఈ మధ్య ఒక్కొక్క వర్గం వారికి ఒక్కొక పిచ్చి పట్టింది. మధ్యతరగతి వారికి చదువు పిచ్చి పట్టింది. అలాగే కూలినాలి,డ్రైవర్లు, క్లినర్లు మొద|| చిన్నపనులు చేసుకొనె వారు చాలా చిన్న వయసునుంచే ఆ పనులలో చేరి సంపాదనలు మొదలుపెట్టటం, దానితోపాటుగా తాగుడు, టి వి లలో వచ్చే ప్రతిసినేమా ను చూడటం బాధ్యతా రాహిత్యంగ ప్రవర్తించటం వీరికి సమాజంలో ఎలా ప్రవర్తించాలో తెలియటంలేదు. అందులో ఆడవారి తో ఎలా ప్రవర్తించాలో తెలియకపోగా వాళ్లతో అనుచితం గా ప్రవర్తించటం చూస్తున్నం. ఇంక అవకాశం చిక్కితే గాంగ్ రేప్ ల వరకు తెగబడుతున్నట్లు తెలుస్తున్నాది కదా! ప్రపంచ ప్రఖ్యాతి ఫెమినిస్ట్ లే మగవారి ప్రవరతనకు కారణాలు ఎమీ చెప్తున్నారో చూడండి.

  http://www.firstpost.com/living/us-should-do-what-delhi-ites-have-done-about-rape-eve-ensler-580978.html
  There is a section of people in India which blames Western culture for rise in violence on women. Recently, the RSS chief said rapes in India and not Bharat?

  I wish that was true. I have been to developing, non- developing and over developed countries. Across the board I think there is something to be said for the free market capitalism which is expanding resources for people at the very top and leaving a huge chunk of people at the bottom. This is impacting violence against women because the poorer people become, there are chances of them becoming more shame based and frustrated. They have less and women are often the targets of that.

  Yes, capitalism has reached everywhere. But there are many factors that go into violence against women. I don’t think in the end, you can say that the culture of America or the culture of India is the breeding ground for that.

  “I think there is a mindset where boys are brought up in certain ways. For instance, during his upbringing, a boy is not made to understand anything about sexuality or how to touch a woman or pleasure a woman or anything about woman at all. So, suddenly he is with a woman for the first time and he throws himself on her. That does not work. Thus, begins the cycle of non-connectivity and non-reciprocity. I think that’s true everywhere in the world”

 15. శేఖర్ గారు,
  ఇంతకు మించి నేను ఈ విషయం పైన చర్చలో పాల్గొనను. కొన్ని సామాజిక అంశాలపైన రైట్ వింగ్ లేఫ్ట్ వింగ్ వారికి, మధ్యేవాదులకన్నా స్పష్టమైన అవగాహన ఉంట్టుంది. పార్టిలు వేరు కావొచ్చుగాని ఇటువంటి విషయాలలో దాదాపు వారి అభిప్రాయలు ఒకటే. ఇప్పుడు లెఫ్ట్ వింగ్ ని ప్రోత్సహించేవారు లేరు. మీడీయాలో రైట్ వింగ్ ఇంటర్వ్యూ ఎక్కువగా వచ్చాయి. కనుక సందర్భానుసారం వాటిని కోట్ చేశాను. అక్కడ ఆ ఫెమినిస్ట్ చెప్పిన మాటలను మాత్రమే పరిగణలోకి తీసుకొవలసిన అవసరం ఉంది.

 16. మనోహర్. బోల్డన్ని విషయాలు

  1) అత్యాచారాలకి నేరస్తులు అవలంభించేమతం కారణమని నా ఉద్దేశ్యం కాదు. కానీ సమర్ధించేలామాట్లాడుతున్నవారు మతవిలువల్ని ఆధారంచేసుకుని అలామాట్లాడుతున్నారని అన్నాను. గమనించగలరు. వీళ్ళకి కావలసింది నేరాలు తాగడంకాదు. నేరాలవంకతో సమాజాన్ని వెనుకటి సమాజపు పరిస్థితుల మోకుకి కట్టెయ్యడం. ప్రస్తుత పరిస్థితులు తమ గ్రంధాల్లో ఉన్నధర్మాన్ని వీడినందుకేనంటూ వాళ్ళ మతాన్ని promote చేసుకోవడం.

  2) No. I am not an observer of any Judo-christian religion.

  3) హిందూవుల స్తోత్రాల్లోని బూతు ప్రజలని ఎజుకేట్ చెయ్యడానికుద్దేశించింది కాదు. అలానమ్మడం మీకూరట కలిగిస్తే అదివేరేవిషయం. మీరన్న జూడోక్రిస్టియన్ మతంలో ఇంతకన్నా ఘాటైన బూతే ఉంది మరి. అదింకా గొప్పగా ఎజుకేట్ చేస్తుందేమో నాకు తెలీదు.

  4) ఇప్పుడు మీరన్న విషయం సెన్సిబుల్గా ఉంది. కారణమల్లా అత్యాచారాన్ని అత్యంత నీచమైన నేరంగా సమాజం promote చెయ్యకపోవడం. Mediaలో అమ్మాయిలను చవకబారుగా చూపించడం. వాళ్ళను ఇంకాకొంతమంది ఇంఫీరియర్గా భావిస్తుండటం మరియూ అలా భావించకుండా ఉండటానికి సరిపడనంత మెచ్యూరిటీని వాళ్ళున్న కల్పించే స్థితిలో వాళ్ళునివశించే సమాజం లేకపోవడం. ఒక్కముక్కలో చెప్పాలంటే సమాజంలో వేర్వేరు లేయర్లలో వేర్వేరు విలువలుండటం మరియు ఆవిలువల్లో ఒకదానికొకదానికి పొంతనకుదరకపోవడం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s