2012లో జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ -వర్డ్ ప్రెస్ రివ్యూ


2012 సంవత్సరం ప్రారంభంలో చేసినట్లే 2013 సంవత్సరం ప్రారంభానికి కూడా “జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ” బ్లాగ్ ను వర్డ్ ప్రెస్ వారు సమీక్షించారు. వర్డ్ ప్రెస్ బ్లాగర్లకు ఆ సంస్ధ ఇస్తున్న నూతన సంవత్సర కానుక కాబోలు!

గత నాలుగైదు నెలలుగా మునుపటిలా ఎక్కువగా టపాలు రాయలేకపోతున్నాను. దానికి మూడు కారణాలు. ఒకటి: వార్తకంటే విశ్లేషణపై కేంద్రీకరించాలని నిర్ణయించడం; రెండు: ఆర్ధరైటిస్ సమస్య వలన కంప్యూటర్ ముందు ఎక్కువగా కూర్చోలేకపోవడం; మూడు: పుస్తక పఠనంపై మరింత కేంద్రీకరణ పెంచడం. టపాలు తగ్గినప్పటికీ పాఠకుల ఆదరణ మాత్రం ఎప్పటిలాగే కొనసాగుతోంది. అందుకు పాఠకులందరికీ మనఃపూర్వక ధన్యవాదాలు.

కింది భాగం అంతా వర్ట్ ప్రెస్ వారు ఒక లింక్ ద్వారా ఆటోమేటిక్ గా పోస్ట్ అయేలా అందజేసిన సౌకర్యం ద్వారా ప్రచురితం అయింది.

—      —      —

The WordPress.com stats helper monkeys prepared a 2012 annual report for this blog.

Here’s an excerpt:

19,000 people fit into the new Barclays Center to see Jay-Z perform. This blog was viewed about 150,000 times in 2012. If it were a concert at the Barclays Center, it would take about 8 sold-out performances for that many people to see it.

Click here to see the complete report.

9 thoughts on “2012లో జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ -వర్డ్ ప్రెస్ రివ్యూ

  1. విశేఖర్ గారూ!
    మీ ‘జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ’ బ్లాగుపై వర్డ్ ప్రెస్ విశ్లేషణ, గణాంకాలు ఆసక్తికరంగా ఉన్నాయి.

    తెలుగు బ్లాగుల్లోనే అత్యధికంగా టపాలు రాస్తున్న బ్లాగు ఇది. కేవలం రాశిపరంగానే కాదు, వాసి పరంగా కూడా మీ బ్లాగు తప్పనిసరిగా చదవాల్సిన స్థాయిలో ఉంది!

    సమకాలీన సంఘటనల గురించి పత్రికల్లో చదివి ఊరుకునే అలవాటు నుంచి వాటిని చర్చించే లాగా చేసింది- ఈ బ్లాగు. 2011లో కంటే 2012లో టపాలను ఎక్కువ ఫాలో అయ్యాను. అన్ని అంశాల్లో కాకపోయినా కొన్నిటి చర్చలో పాల్గొన్నాను.

    ‘ వార్త కంటే విశ్లేషణపై కేంద్రీకరించాల’నే మీరు పాటిస్తున్న నిర్ణయం మంచిదే!

    వార్తలు వెంటనే కాకపోయినా, మర్నాడు పేపర్లో చదవొచ్చు. వివిధ అంశాలపై విశ్లేషణ, చర్చలే ముఖ్యం. గతంతో పోలిస్తే… టపాల సంఖ్య తగ్గటం అంత పట్టించుకోదగ్గ విషయం కాదు.

  2. ఈ వార్త నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. సమకాలీన విషయాల పై మార్క్సిస్ట్ ఐడియాలజి తో విశ్లేషన చేయటం, అభివృద్ది నిరోధకులు ఎన్ని దాడులు చేస్తున్నా, మీ అరోగ్యం సహకరించక పోయినా ఈ బ్లాగుని క్రమం తప్పకుండా నడపుతున్నారు. వార్డ్ ప్రెస్స్ రివ్యూ మీకు మంచి నైతిక బలాన్ని ఇచింది అనుకుంటున్నాను. మీ కృషిని కొనసాగించండి. మీకు నా అభినందనలు.

  3. వేణు గారూ, మీలాంటి వాళ్ల ప్రోత్సాహం మరువలేనిది. నా బ్లాగు ప్రయాణం ఈ మాత్రం సాగడంలో మీరిచ్చిన సహాయ, సహకారాలు ప్రముఖ పాత్ర పోషించాయి. వివిధ చర్చల్లో మీరిచ్చిన తోడ్పాటు విలువైనది. వార్తకంటే విశ్లేషణపై కేంద్రీకరించడానికి నిర్ణయం తీసుకోవడానికి కారకులు రాజశేఖర్ రాజు గారు. కాగా ప్రారంభంలో ప్రవీణ్ ఇచ్చిన నైతిక మద్దతు నాకు సహాయపడింది.

    భాస్కర్, ధన్యవాదాలు. మీ ప్రోత్సాహం మునుముందు కొనసాగాలని నా కోరిక.

  4. ఈ టపాకు వ్యాఖ్యకు సంబంధం లేదు.

    గతంలో గుట్టు రట్టు: భాగ్యలక్ష్మి ఆలయం ఐదు దశాబ్దాల నాటిది మాత్రమే -ఫోటోలు
    https://teluguvartalu.com/2012/11/22/%E0%B0%97%E0%B1%81%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B1%81-%E0%B0%B0%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B1%81-%E0%B0%AD%E0%B0%BE%E0%B0%97%E0%B1%8D%E0%B0%AF%E0%B0%B2%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B1%8D/
    అని రాసారు.బాగుంది. మరి అక్బరుద్దీన్ వ్యాక్యాల గురించి ఏమంటారు .వాటిని కూడా ఏ పత్రికా ప్రచురించలేదు?

  5. Common Man M గారూ

    ఉన్మాదం అనేది ఏ మతం ముసుగు వేసుకున్నా ఒకటే. అలాగే ఎవరు తప్పు చేసినా తర తమ బేధం లేకుండా వాటిని ఎత్తిచూపవలసిన బాధ్యత పత్రికలపై ఉంటుంది.

  6. డా. సుధాకర్ గారు

    ధన్యవాదాలు. మీ ఆశింపు నిజం కావాలని కోరుకుంటున్నాను. ఆలస్యంగా స్పందిస్తున్నందుకు క్షంతవ్యుడ్ని. మొదట వ్యాఖ్యలను ఆమోదించి తర్వాత తీరిగ్గా స్పందించడం అలవాటు చేసుకున్నాను. ఆ అలవాటులో దొర్లిన పొరబాటు.

  7. విశేఖర్ గారూ,
    ఆలస్యంగా చూస్తున్నాను. ముందుగా అభినందనలు. తర్వాత మీ ఆరోగ్యం సజావుగా ఉండాలని కోరుకుంటున్నా.
    విశ్లేషణకు ప్రాధాన్యం ఇవ్వాలని నేను గతంలో సూచించిన చిన్న సూచనకు ఇంత ప్రాముఖ్యత ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఆవేశం,వయోగత ఉద్రేకం స్థానంలో వివేచనకు మీ ఈ బ్లాగు మరింత ప్రాధాన్యతను ఇవ్వాలని కోరుకుంటున్నా.. నా వ్యాఖ్యను నెగటివ్ గా తీసుకోవద్దని మనవి.
    నేను యూనికోడ్ పాంట్ కు దూరం కావడంతో బ్లాగులను ఫాలో కాలేకపోతున్నాను. అలాగే నెట్ కూడా ఇంకా దూరంగానే ఉంది.
    మీరు అధ్యయనానికి ప్రాధాన్యత ఇవ్వడం మరీ బావుంది.
    మరోసారి అభినందనలతో..

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s