బాధితురాలి స్టేట్‌మెంట్‌ని మార్చడానికి ఢిల్లీ పోలీసుల కుయత్నం?


ఫొటో: ది హిందూ

ఫొటో: ది హిందూ

ఢిల్లీ సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ (ఎస్.డి.ఎం) ముందు సామూహిక అత్యాచారం బాధితురాలు ఏమి జరిగిందీ తెలియజేసింది. ఎస్.డి.ఎం ముందు బాధితురాలు అమానత్ (అసలు పేరు కాదు) ఏమి చెప్పిందీ సౌత్ ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డి.సి.పి) ఛాయా శర్మ క్లుప్తంగా పత్రికలకు తెలిపింది. ఆమె ప్రకారం ఆ రోజు రాత్రి దాదాపు 9:30 గంటలకు అమానత్ తన ఫ్రెండ్ తో కలిసి మునిర్కాలో బస్ స్టాప్ వద్ద నిలబడి ఉన్నారు. బస్సులో ఉన్న మైనర్ బాలుడు రాహుల్ (అసలు పేరు కాదు) తమ బస్సు పాలం వైపు వెళ్తుండని చెబుతూ వారిద్దరినీ బస్సు ఎక్కమని పిలిచాడు. బస్సు ఎక్కాక అందులో తాము కాక మొత్తం ఆరుగురు వ్యక్తులు ఉన్నట్లు వీరు గమనించారు.

కొద్ది నిమిషాల ప్రయాణం తర్వాత బస్సు చెప్పిన రూట్ లో కాకుండా వేరే రూట్ లో వెళ్తున్నట్లు అమానత్, ఆమె ఫ్రెండ్ గమనించారు. బస్సు తలుపు కూడా మూసేయడంతో వారికి అనుమానం ఇంకా పెరిగింది. బస్సు రూటు మార్చడం పట్ల ఇద్దరూ అభ్యంతరం చెప్పారు. అప్పటినుండీ వేధింపులు మొదలయ్యాయి. అసభ్యంగా ప్రవర్తిస్తూ అంతరాత్రి వేళ ఇద్దరూ ఏంచేయ్యబోతున్నారు అంటూ వెకిలి సైగలకు, చేష్టలకు దిగారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న అమానత్ మిత్రుడు వారి చేష్టలను ప్రతిఘటించాడు. దానితో అక్కడ ఉన్నవారంతా అతన్ని చావబాదారు. రామ్ సింగ్ అతన్ని తలపై రాడ్ తో గట్టిగా కొట్టడంతో స్పృహ కోల్పోయాడు. ఆ తర్వాత రాహుల్, అక్షయ్ సింగ్ లు కలిసి అమానత్ ని బస్సు వెనక్కి ఈడ్చుకెళ్లారు.

అనంతరం రామ్ సింగ్ మొదట అమానత్ పై అత్యాచారానికి ఒడిగట్టాడు. రామ్ సింగ్ దుర్మార్గాన్ని అమానత్ శక్తికొద్దీ ప్రతిఘటించింది. అతన్ని గట్టిగా కొరికింది (ఇది రామ్ సింగ్ చెప్పాడు). అనంతరం ఇతరులు కూడా ఆమెపై అత్యాచారం జరిపారు. ప్రతిఘటన కొనసాగిస్తే ఇద్దరినీ బస్సునుండి బైటికి విసిరేస్తామని బెదిరించారు. రామ్ సింగ్ తదితరులు మొదట అమానత్ ఫ్రెండ్ ని ఒక్కడినే బైటికి తోసేయాలని భావించారు. కానీ వారు పెట్టిన అమానుషమైన హింసకి ఇద్దరూ స్పృహ కోల్పోవడంతో మనసు మార్చుకుని ఇద్దరినీ బైటికి విసిరేశారు. బస్సులో మొత్తం 30 నిమిషాల పాటు ఇద్దరికీ నరకం చవిచూపాక మహిపాల్ పూర్ వద్ద బైటికి విసిరారు. సెల్ ఫోన్లు, బట్టలతో పాటు బాధితుల వద్ద ఉన్న వస్తువులు, డబ్బు అన్నీ దోచుకున్నారు. వంటిపై బట్టలు కూడా లాక్కుని దాదాపు నగ్నంగా బైటికి నెట్టారు.

ఫొటో: ది హిందూ

ఫొటో: ది హిందూ

స్టేట్ మెంట్ మార్చడానికి పోలీసుల ప్రయత్నం?

ఢిల్లీ సామూహిక అత్యాచారానికి బాధ్యులయినవారిని కఠినంగా శిక్షించాలని వేలాదిమంది ప్రజలు ఢిల్లీలో ఒకపక్క తీవ్రస్ధాయిలో ఆందోళనలు చేస్తుండగానే పోలీసులు తమపై తప్పు లేకుండా చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని అనుమానాలు కలుగుతున్నాయి. బాధితురాలి స్టేట్ మెంట్ రికార్డు చెయ్యడంలో తనను ప్రభావితం చెయ్యడానికి పోలీసులు ప్రయత్నించారని సబ్ డివిజనల్ మేజిస్ట్రేటే స్వయంగా పోలీసులకి ఫిర్యాదు చేయడంతో ఈ అనుమానాలు తలెత్తాయి. ఎస్.డి.ఎం ఫిర్యాదును పురస్కరించుకుని ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ పోలీసులపై ఫిర్యాదు చేస్తూ కేంద్ర హోమ్మంత్రికి లేఖరాసింది. షీలా దీక్షిత్ లేక పత్రికలకు లీక్ కావడం మరొక సమస్యగా ముందుకొచ్చింది. బాధితురాలికి న్యాయం చెయ్యడం మాని ఎవరికివారు తప్పుని అవతలివారిపైకి నెట్టివేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఈ వ్యవహారం ద్వారా తెలుస్తోంది.

ఏం జరిగిందో ది హిందూ పత్రిక సమాచారం ఇచ్చింది. బాధితురాలి ఆరోగ్యం క్షీణిస్తున్నందున ఆమె స్టేట్ మెంట్ రికార్డు చేయాలని పోలీసులు ఎస్.డి.ఎం ని కోరారు. ఎస్.డి.ఎం ఉషా చతుర్వేది బాధితురాలి స్టేట్ మెంట్ తీసుకోవడానికి సఫ్దర్ జంగ్ హాస్పిటల్ కి వెళ్ళగా అక్కడ అనేకమంది పోలీసులు ఉన్నారు. సౌత్ ఢిల్లీ డి.సి.పి, వసంత విహార్ మరియు డిఫెన్స్ కాలనీల ఎ.సి.పిలు కూడా అక్కడే ఉన్నారు. ఉషా చతుర్వేది ఫిర్యాదు ప్రకారం ఈ ముగ్గురు పోలీసు అధికారులు అత్యాచారం విషయమై ఏమి జరిగిందీ క్లుప్తంగా ఆమెకు వివరించారు. ఒక ప్రశ్నాపత్రాన్ని ఆమె చేతికి ఇచ్చి దాని ప్రకారమే బాధితురాలి స్టేట్ మెంట్ తీసుకోవాలని ఆమెను కోరారు.

“వారు నాకొక ప్రశ్నాపత్రాన్ని చూపించారు… వాటినే నిజాలుగా ఇన్విస్టిగేటింగ్ ఆఫీసర్ ముందు రికార్డు చేయాలని వారు నన్ను అడిగారు. కానీ ఆ తర్వాత బాధితురాలి వద్ద నేను స్టేట్ మెంట్ రికార్డు చేస్తున్నపుడు చూస్తే నేరం జరిగిన రాత్రి నాటి వాస్తవ ఘటనలతో పోలిస్తే పోలీసుల కధనం (బ్రీఫ్) భిన్నంగా ఉన్నట్లు నేను కనుగొన్నాను. వారికి అనుకూలంగా ఉండేవిధంగా బాధితురాలి స్టేట్ మెంట్ రికార్డు చేయాలని వారు నన్ను బలవంతపెట్టే ప్రయత్నం చేశారు. నేను అందుకు అంగీకరించకపోవడంతో నాతో అనుచితంగా ప్రవర్తించారు. నన్ను బెదిరించడానికి ప్రయత్నించారు” అని ఎస్.డి.ఎం ఉషా చతుర్వేది తన ఫిర్యాదు లేఖలో పేర్కొంది. బాధితురాలు స్టేట్ మెంట్ ఇస్తున్నపుడు వీడియో తీయడానికి ప్రయత్నిస్తుండగా దానికి కూడా పోలీసులు ఒప్పుకోలేదనీ, బాధితురాలి తల్లిదండ్రులే వీడియోకి ఒప్పుకోలేదని సాకు చూపుతూ వీడియోగ్రఫీకి నిరాకరించారనీ ఉష తన ఫిర్యాదులో తెలిపింది.

ఫొటో: ది హిందూ

ఫొటో: ది హిందూ

పోలీసులకు ఎందుకా అవసరం?

ఢిల్లీ అత్యాచారంపై ఎన్నడూ లేనివిధంగా రాజధాని వీధుల్లో ప్రజాగ్రహం హోరెత్తడంతో ప్రభుత్వంలోని అన్ని అంగాలూ అప్రమత్తం అయ్యాయి. వాల్ మార్ట్ కోసమో, బహుళజాతి అణు కంపెనీల కోసమో ప్రభుత్వాన్ని బెదిరించి మరీ ఎఫ్.డి.ఐ, అణు బిల్లులను ఆమోదింపజేసుకున్న ప్రధానమంత్రి మన్మోహన్ అమానుష అత్యాచార ఘటన విషయంలో మాత్రం యధాలాపంగా ఖండన ప్రకటించి ఊరుకున్నాడు. ఆయన వైఖరిని ప్రతిపక్షాలు, పత్రికలు, సంఘాలు తీవ్రంగా నిరసించాయి. పరిస్ధితి తీవ్రతను పట్టించుకోకుండా మొక్కుబడి ప్రకటనలు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దానితో ప్రధానమంత్రి బుద్ధి తెచ్చుకుని ప్రత్యేకంగా టి.విలో ప్రత్యక్షమై తగిన చర్యలు తీసుకుంటామని ప్రకటించాడు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, హోమ్ మంత్రి సుశీల్ కుమార్ షిండే తదితరులంతా అప్రమత్తమై నిరసనలతో హోరెత్తిస్తున్న ఆందోళనకారులను కలిసి చర్చలు జరిపి వరుస చర్యలు ప్రకటించారు.

స్త్రీలపై అత్యాచారాల కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టాలని కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాలు కోరడం, ఢిల్లీ హైకోర్టు సమావేశమై వెనువెంటనే 5 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు జనవరి 2 నుండి పనిచేస్తాయని ప్రకటించడం ఆగమేఘాలపై జరిగిపోయింది. కేసును సుమోటో గా స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు విచారణ ప్రారంభించి ఢిల్లీ పోలీసులను రఫ్ఫాడించింది. వాహనాలకు టింటెడ్ అద్దాలు లేకుండా  చూడాలని ఆదేశాలిచ్చి అందుకు విధించిన రెండు గడువులు దాటాక కూడా ఆ బస్సు అన్ని గంటలసేపు ఢిల్లీ రోడ్లపై ఎలా తిరిగిందని పోలీసులను ప్రశ్నించింది. చుట్టూ తెరలు కట్టుకుని ఉన్న ఒక బస్సు నాలుగు పోలీసు చెక్ పోస్టుల మీదుగా ప్రయాణించినప్పటికీ పోలీసులు, అధికారులు చూడకుండా ఎలా ఉన్నారని ప్రశ్నించింది. అత్యాచారానికి సంబంధించి మరిన్ని ప్రశ్నలు సంధించి, ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని, సంబంధిత పోలీసు అధికారులను బాధ్యులను చేయాలనీ కోర్టు పోలీసులకు పురమాయించింది.

కోర్టులో తాము సమర్పించబోయే అఫిడవిట్ కీ, బాధితురాలు ఇచ్చిన స్టేట్ మెంట్ కీ మధ్య తేడాలున్నట్లయితే అది మళ్ళీ పోలీసులమీదికే వస్తుంది. తాము అప్రమత్తంగానే ఉన్నామని అఫిడవిట్ లో చెప్పుకుంటే అది తప్పని తేలే అవకాశం ఉంటుంది. బహుశా అందుకే కాబోలు పోలీసులు తామే స్వయంగా ప్రశ్నపత్రం తయారు చేసుకుని వాటికి సమాధానాలు కూడా తామే ఇచ్చేసుకుని దానినే బాధితురాలి స్టేట్ మెంట్ గా ప్రకటించాలని సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ఉషా చతుర్వేదిని బలవంతపెట్టారు. ఆమె లొంగకపోయేసరికి బెదిరించడానికి కూడా సిద్ధపడ్డారు. పోలీసుల అనైతిక వ్యవహారాన్నీ, వారి బెదిరింపులను అక్షరబద్ధం చేసిన ఉషా చతుర్వేది దానిని ఫిర్యాదు రూపంలో ఢిల్లీ (తూర్పు) డి.సి.పి బి.ఎం.మిశ్రాకి అందజేసింది. బి.ఎం.మిశ్రా సదరు ఫిర్యాదుని ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కు ఫార్వర్డ్ చెయ్యడంతో విషయం హోమ్ మంత్రి సుశీల్ షిండే వరకూ వెళ్లింది.

పాత గొడవేనా?

షీలాతో ఢిల్లీ పోలీస్ కమిషనర్ నీరజ్ కుమార్ (ఫొటో: ది హిందూ)

షీలాతో ఢిల్లీ పోలీస్ కమిషనర్ నీరజ్ కుమార్ (ఫొటో: ది హిందూ)

రాజధాని ఢిల్లీలో పోలీసు విభాగం నేరుగా దేశ హోమ్ మంత్రి పర్యవేక్షణలో నడుస్తుంది. ఢిల్లీ పోలీసు విభాగానికీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కీ మధ్య గతంలో ఘర్షణలు జరిగిన చరిత్ర ఉంది. ఢిల్లీలో లా అండ్ ఆర్డర్ పరిరక్షణలో ఢిల్లీ పోలీసు యంత్రాంగం సరిగా వ్యవహరించడం లేదని షీలా దీక్షిత్ గతంలో విమర్శలు చేసింది. ఈ నేపధ్యంలోనే యేమో తెలియదుగానీ ఎస్.డి.ఎం ఉష ఫిర్యాదును ఆమె తీవ్రంగా తీసుకుంది. పోలీసుల అనుచిత ప్రవర్తనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆమె హోమ్ మంత్రి షిండేకు ఘాటుగా లేఖ రాసింది. షీలా రాసిన లేఖ పత్రికలకు లీక్ కావడంతో పోలీసుల వ్యవహారం అంతా బైటికి వచ్చింది. దానితో అసలు ముఖ్యమంత్రి లేఖ పత్రికలకు ఎలా లీకయ్యిందీ విచారణ చేయాలని ఢిల్లీ పోలీసు అధికారులు డిమాండ్ చేస్తున్నారు.

ఢిల్లీ పోలీస్ కమిషనర్ నీరజ్ కుమార్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ఉషా చతుర్వేది గతంలోనూ తమ వీధుల్లో జోక్యం చేసుకుందని ఇపుడు ఆరోపణలు చేస్తున్నాడు. బాధితురాలి పరిస్ధితి క్షీణిస్తున్నందున ఆమె స్టేట్ మెంట్ రికార్డ్ చెయ్యడం కోసం తామే ఎస్.డి.ఎం ను పిలిపించామనీ, మేము ఆమె విధులకు ఆటంకం కలిగిస్తే వెనక్కి ఎందుకు వెళ్లిపోలేదనీ ఆయన ప్రశ్నిస్తున్నాడు. తాము ఎటువంటి ప్రశ్నాపత్రమూ ఎస్.డి.ఎం కు ఇవ్వలేదనీ, స్టేట్ మెంట్ రికార్డు చేసేటప్పుడు గదిలో బాధితురాలు, ఎస్.డి.ఎం తప్ప ఎవ్వరూ లేరనీ చెబుతున్నాడు. బాధితురాలి తల్లిగారే వీడియోగ్రఫీకి ఒప్పుకోలేదనీ తమ ప్రమేయం ఏమీ లేదనీ చెబుతున్నాడు. అయితే గదిలో తనను బలవంతపెట్టారని ఎస్.డి.ఎం చెప్పలేదు. బాధితురాలి స్టేట్ మెంట్ కోర్టు విచారణలో కీలకం కనుక వీడియో తీస్తేనే ఎక్కువ ఉపయోగం అని చెబితే బాధితురాలి తల్లి దానికి అభ్యంతరపెట్టే అవకాశం ఉండదు. పేదలైన బాధితురాలి తల్లిదండ్రులు ఇటువంటి కీలకమైన అధికారిక చట్టబద్ధ ప్రక్రియల్లో అధికారులు చెప్పింది పాటిస్తారే తప్ప తమ స్వంత అభిప్రాయాలే నెగ్గాలని పట్టుబట్టరు. ఆ విధంగా చూసినపుడు పోలీసుల వాదనపై అనేక అనుమానాలు ఏర్పడుతున్నాయి.

అమానత్ స్టేట్ మెంట్ పై రగడ చెలరేగిన నేపధ్యంలో మంగళవారం మరోసారి ఆమెనుండి స్టేట్ మెంట్ తీసుకున్నారు. ఈసారి స్టేట్ మెంట్ తీసుకోవడానికి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ రంగంలోకి దిగారు. మన్మోహన్ నేతృత్వంలో మంగళవారం కేంద్ర కేబినెట్ సమావేశమై మాజీ ఢిల్లీ హైకోర్టు జట్జి ఉషా మెహ్రా సభ్యురాలుగా ఏకసభ్య విచారణ కమిషన్ ఏర్పాటుకి నిర్ణయం తీసుకుంది. (చట్టాల్లో మార్పులనూ, సవరణలనూ సూచించడానికి జస్టిస్ జె.ఎస్.వర్మ నేతృత్వంలో నియమించిన త్రిసభ్య కమిషన్ కి ఇది అదనం.)  23 సంవత్సరాల అమానత్ పై సామూహిక అత్యాచారం జరగడానికి దారితీసిన పరిస్ధితులను ఈ కమిషన్ విచారిస్తుంది. ప్రభుత్వ వ్యవస్ధల పనిలో లోపాలను, ఖాళీలను ఎత్తిచూపి అత్యాచారానికి బాద్యులను నిర్ధారిస్తుంది. కమిషన్ ఏర్పాటును కేంద్ర ఆర్ధికమంత్రి చిదంబరం ప్రకటించాడు. మెట్రోపాలిటన్ నగరాలిన్నింటినీ పీడిస్తున్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటున్నామనీ, తమను నమ్మాలనీ ఆయన కోరాడు. ఢిల్లీలోనే ఈ దారుణం జరగడం సిగ్గుపడవలసిన విషయమేననీ కేంద్ర ప్రభుత్వానికి అందుకు ప్రత్యేక బాధ్యత ఉన్నదనీ అంగీకరించాడు.

ఫొటో: ది హిందూ

ఫొటో: ది హిందూ

చిదంబరం లెంపకాయలు

అత్యాచారం విషయంలో నిన్నటివరకూ హోమ్ మంత్రి సుశీల్ కుమార్ షిండే పత్రికల ముందుకు రాగా ఈ రోజు చిదంబరం ఆ బాధ్యత తీసుకున్నాడు. ఆందోళనకారులతో తానెందుకు చర్చలు జరపాలి అని ప్రశ్నించి అప్రతిష్టపాలయిన షిండే పత్రికలకు ముఖం చూపడానికి ఇష్టపడనట్లుంది. “ఇండియా గేట్ వద్దకి ఎవరు వచ్చి అరిచినా చర్చలు చేయాలా? నక్సలైట్లు వచ్చి అరిచినా చర్చలు చేయాలా?” అని ప్రశ్నించిన షిండే దేశ ప్రజలపట్ల తన బాధ్యతారాహిత్యాన్ని చాటుకున్నాడు. శ్రీ కృష్ట దేవరాయలు లాంటివారు స్వయంగా మారు వేషాలు వేసుకుని ప్రజలు తన పాలనాపట్ల ఏమనుకుంటున్నారో వినడానికి ప్రయత్నించేవారని ప్రతీతి. కష్టం వచ్చినవారు రాజుకి చెప్పుకోవడానికి కోటముందు ప్రత్యేకంగా గంట నెలకొల్పేవారని చిన్న చిన్న రాజుల కధలు చదువుకున్నాం.

కానీ ప్రపంచంలోనే అతిపెద్దదని చెప్పుకునే ప్రజాస్వామ్య వ్యవస్ధలో ‘ఒక ఆడకూతురికి దారుణమైన అన్యాయం జరిగింది, మీరంతా ఏమి చేస్తున్నారు?’ అని ప్రశ్నించడానికి వచ్చిన వేలాది జనంతో ‘మీరు అరిస్తే, నేను చర్చించాలా?’ అని ప్రశ్నించే హోమ్ మంత్రిని చూసే భాగ్యానికి భారత ప్రజలే నోచుకున్నారు. ఈయన పరిస్ధితి ఇలా ఉంటే ఆంధ్ర మంత్రి బొత్స ‘అర్ధరాత్రి స్వతంత్రం వస్తే మాత్రం ఆడపిల్లలు అర్ధరాత్రి బైటికి ఎందుకు రావాలి?’ అని ప్రశ్నించి తన భూస్వామ్య అహంభావాన్నీ మగ పెత్తనాన్నీ ప్రదర్శించాడు. మన దేశం నిండా ఇలాంటి మంత్రులే పెత్తనాలు వెలగబెడుతుండగా మహిళలపై అత్యాచారాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుండనుకోవడం ఒట్టి భ్రమే.

ఉషా మెహ్రా కమిషన్ ఏర్పాటును ప్రకటించిన చిదంబరం మరొక మంత్రి మనీష్ తివారీ తో కలిసి సమావేశంలో లెంపలు వేసుకున్నాడు (లేదా కనీసం అలా నటించాడు). “ఇది సిగ్గుపడాల్సిన విషయం. ఒక మగవాడిగా నేను సిగ్గుపడుతున్నాను. ఈ గదిలో ఉన్నవారు కూడా సిగ్గుపడాలి. మగవారు ఎందుకిలా ప్రవర్తిస్తారు? ప్రజల ఆగ్రహాన్ని స్వీకరిస్తున్నాం. దాన్ని గుర్తిస్తున్నాం.” అని చిదంబరం చెప్పాడు. జస్టిస్ వర్మ కమిటీ గురించి చెబుతూ దేశంలో మహిళల రక్షణకు సంబంధించిన మౌలిక సమస్యపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నదనీ, అలాంటి నేరాలకు కఠిన శిక్షలు విధించడానికి కట్టుబడిఉన్నదనీ తెలిపాడు. “మేము చేస్తున్నదానిలో మూడు భాగాలున్నాయి. -నేరస్ధులకు తప్పనిసరి శిక్షపడేలా చూడడం, ఎక్కడ తప్పు జరిగిందో పరిశీలించడం, విచారణ వేగంగా జరిగి కఠిన శిక్షలు పడేలాగున మహిళలపై నేరాల విషయంలో ఉన్న చట్టాలను తగురీతిలో సవరించడం-” అని చిదంబరం విలేఖరులకు తెలిపాడు. ఇలాంటి కేసులను త్వరగా విచారించడం ద్వారా ప్రభుత్వానికి కోర్టులు కూడా సహాయం చేయాలని కోరాడు. జనవరి 3 న ప్రారంభం అయ్యేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు ఢిల్లీ హైకోర్టు నిర్ణయించినందుకు చిదంబరం కృతజ్ఞతలు చెబుతూ ఇతర రాష్ట్రాల హై కోర్టులు కూడా ఇదే విధంగా మహిళలపై అత్యాచారాల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని కోరాడు.

ఆర్ధికమంత్రి చిదంబరం విలేఖరుల సమావేశంలో ఒక ముఖ్యమైన ప్రస్తావన చేశాడు. ఆయన ప్రకారం జనం అప్పటికప్పుడు పెద్ద మొత్తంలో గుమికూడి ఆందోళన చెయ్యడం ప్రభుత్వం ఎదుర్కొన్న కొత్త రకం సమస్య. ఈ విధంగా పోలీసులు, ప్రభుత్వాల వైఫల్యంపైనా, ప్రజల సమస్యలపైనా జనం అప్పటికప్పుడు గుమికూడడాన్ని ‘ఫ్లాష్ మాబ్’ (flash mob) గా అభివర్ణించిన చిదంబరం దానిని ‘నూతన పోకడ’ (new phenomenon) గా పేర్కొన్నాడు. అప్పటికప్పుడు పుట్టుకుచ్చే ఇలాంటి ఫ్లాష్ గుంపులతో వ్యవహరించడానికి ప్రభుత్వం (పోలీసులు) సిద్ధపడలేదనీ, కానీ పాఠాలు నేర్చుకున్నామనీ చెప్పాడు. ఇకనుండి నూతనతరహా ప్రామాణిక చర్యల ప్రక్రియలను (standard operating procedures – SOPs),  రూపొందించుకుంటామనీ తెలిపాడు. ప్రజలారా తస్మాత్ జాగ్రత్త!

11 thoughts on “బాధితురాలి స్టేట్‌మెంట్‌ని మార్చడానికి ఢిల్లీ పోలీసుల కుయత్నం?

 1. ఈ సంఘటన మొత్తం లో ఇప్పటివరకు బయటకు రాని అంశం ఆ యాదవ్ బస్సు సర్విస్ యజమాని ఎవరు? ఎన్ని బస్సులు ఉన్నాయి? అతనికి ఎవరైనా రాజకీయ నాయకుడి అండ వున్నదా? ఆ బస్ సర్విస్ లైసెన్స్ రద్దు చేశారా? లేదా?

 2. బస్సు యజమాని పేరు దినేష్ యాదవ్. బస్ సర్వీస్ లైసెన్స్ రద్దు చేసేరో లేదో తెలియదు గానీ నిబంధనల ప్రకారం బస్సుని తన ఇంటి వద్ద పార్క్ చెయ్యకుండా డ్రైవర్ కి అప్పగించినందుకు, కిటికీలకి తెరలు కట్టినందుకు పోలీసులు ఆయనపై కేసు పెట్టారు. బస్సు డ్రైవర్ నివసించే లొకాలిటీలో అతను ఒక విధమైన రౌడీ వ్యవహారాలు చేస్తుంటాడట. గతంలో యాక్సిడెంట్ చేయడం వలన ఒక చెయ్యి సరిగా పని చెయ్యదట. ఐనా డ్రైవర్ గా నియమించుకున్నందుకు యజమాని నేరస్ధుడు అవుతాడేమో తెలియదు. ఈ కారణాల వల్ల బస్సు సర్వీస్ లైసెన్స్ రద్దు చెయ్యవలసిన అవసరం ఉంటుందంటారా? చట్టంలో అలాంటి ఏర్పాటు ఏమైనా ఉందా మనోహర్ గారూ?

 3. చట్టపరమైన అంశాలపై పెద్దగ అవగాహనలేదు. యాదవ్ ల లో రౌడి వ్యవహారాలు చేయని వాళ్ళు ఉన్నారంటే ఆశ్చర్య పోవాలి. ఈ బస్ సర్విస్ లు రావాలంటే రాజకీయ అండ ఉన్నవారికే ఎక్కువగా వస్తాయికదా! వాడేనకాల ఎవరో ఉంటారు. నార్త్ ఇండియాలో భుస్వామ్య వర్గాలకు చెందిన యాదవ్,గుజ్జార్,జాట్ లు వీరికి రాజకీయ పలుకుబడి చాలా ఎక్కువ. చదువు సంధ్యా ఉన్నా, లేకున్న అడ్డదిడ్డంగా వ్యవహరించటం, ప్రజలను తన్నడం, చంపటం వీరి జన్మహక్కు. ఏ వెధవ ఏటువంటి వాడో తెలియదు. కొంతమంది దగ్గర దొంగ తుపాకులు ఉంటాయి. ఇతరులతో గీకి తగువు పెట్టుకోవటం,కొట్టటం, అవమానించటం, నిద్దర లేస్తే అదే పని. ఇంకొకటి తెలియదు. వాళ్ళు మారరు సరికదా రియల్ భూం వలన పాలు పిండేవారు కూడా కోటిశ్వరులు అయిపోయారు. ఆ దెబ్బతో ఇప్పుడు రాజకీయాలలో చేరి వాటిని ఇంకా బ్రస్టుపట్టిస్తున్నారు . ఈ రౌడి మూక దెబ్బకి చదువుకొన్న వారు హడలి పోతూన్నారు. ఇన్నిరోజులు వీరిని భరించటానికి కారణం వారితో తలపడితే మన చదువు సంధ్యా గల్లంతు అయి, జీవితం దెబ్బతింట్టుందనే భయం, రెండు డిల్లీ లో ని మధ్య తరగతి వర్గం అంతా బయటి రాష్ట్రాల వారు,ప్రభుత్వోద్యోగులు ఎక్కువగా ఉండటం వలన వారికి స్థానికం గా పలుకు బడిలేక నోరు మూసుకొని వచ్చిన పని చూసుకొని బయటపడేవాళ్ళు. డిల్లిలో జరిగిన ఘోరానికి అంతమంది ప్రజలు ఏకంకావటానికి కారణం, ఇప్పటి వరకు వీరి ఆగడాలను ఓర్చుకొన్న చదువుకొన్న మధ్యతరగతి ప్రజల ఓపిక నశించింది.
  వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టి కేంద్రం లొ అధికారంలో కి వస్తే మనదేశం ముందు పడటమో వెనుకబడటమో తరువాత సంగతి, భారతీయ కుటుంబ వ్యవస్థ నాశనమవ్వటం కాయం. దేశం నిండా మధ్యం గంగానది కన్నా పరవళ్ళు తొక్కుతు ప్రవహిస్తున్నాది. అది తాగి మంచి చెడు, వావి వరుసలు, ఉచ్చ నీచాలు లేకుండా మనుషులు ప్రవర్తించటం మొదలైంది. వీళ్లు ప్రకటించే ఉచిత పథకాలు ఈ దేశం ను నాశనం చేసి వదలి పెడతాయి. ఉచిత పథకాల ఆదాయం మద్యం నుంచే వచ్చేది. నష్ట్టపోయేది మంచిగా సంసారం చేసుకొనే కుటుంబీకులే. ఆ అమ్మాయి తండ్రి చూడండి ఆస్థి అంతా అమ్మి, కూతురిని యం బి బి యస్ చదివించుకొంటుంటే, ఆదివారం సాయంత్రం వాళ్ళు తీరికగా తప్పతాగి ఆమే జీవితాన్ని ఎలా నాశనం చేశారో! తల్లిదండృలు ఎంత కుంగిపోయి ఉంటారు. ఆమే తమ్ముళ్లు చెలెళ్ల పరిస్థితి ఎమీటి? మొత్తం కుటుంబం దెబ్బతినిపోయింది, తాగిన వెధవలు చేసిన పని వలన.

 4. నేను విరక్తి చెందినవానిలాగ మాట్లాడుతున్నానని మీకు అనిపించొచ్చు. మీరు ఎలా అనుకున్నా నేను చెప్పేది నిజం. ఆ అమ్మాయి తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి డెటింగ్ చేసి తిరిగి వస్తుండగా రేప్ జరిగింది. ఇక్కడ డేటింగ్ చెయ్యడం తప్పని ఎవరూ అనుకోలేదు, బలవంతపు సంభోగం (రేప్) మాత్రమే తప్పని అనిపించింది. సామాజికంగా వెనుకబడిన ఇండియా లాంటి దేశంలో ఒకడితో డేటింగ్ చేసిన అమ్మాయిని ఇంకొకడు పెళ్ళి చేసుకోడని తెలిసి కూడా డేటింగ్‌ని సమర్థించేవాళ్ళు రేప్‌ని మాత్రమే హత్యతో సమానమైన నేరంగా ఎందుకు పరిగణించాలని అనుకుంటున్నారు? కార్మిక వర్గంతో గానీ స్త్రీవాదంతో గానీ సంబంధం లేని & పరువుమర్యాదల కోసం ప్రాకులాడేవాళ్ళ భావజాలంతో మాత్రమే సంబంధం ఉన్న ఈ కేస్ గురించి మార్క్సిస్ట్‌లు సీరియస్‌గా ఆలోచించడం అనవసరం. ఆ అమ్మాయి శరీరం ఆమె ఇష్టం కనుక ఆమె డేటింగ్ చేస్తుందని మీరు అనొచ్చు. ఆ రౌడీగాళ్ళు కూడా తమ బిహేవియర్ తమ ఇష్టం అనుకుని రేప్‌లు చేస్తారు. నీతి అనేది తమకి ఒకలాగ, ఇతరులకి ఇంకొకలాగ వర్తించాలని అంటే దాన్ని అర్థం చేసుకోవడం సాధ్యం కాదు.

 5. ఈశాన్య రాష్ట్రాలలో భారత సైనికులు గిరిజన స్త్రీలపై చేసే రేప్‌లు రోజూ జరుగుతుంటాయి. వాటి గురించి ఎవరూ సీరియస్‌గా ఆలోచించరు. ఈ ఘటనలో రేప్‌కి గురైంది ఒక మెడికల్ కాలేజ్ విద్యార్థిని కాబట్టి మన దేశ వ్యాప్తంగా అభివృద్ధి నిరోధక భావజాలాన్ని నమ్మేవాళ్ళందరూ బాధపడిపోతున్నారు, రేప్ చేసినవాళ్ళకి ఉరి శిక్ష వెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. రేప్‌ని హత్యతో సమానంగా భావిస్తే ఆడదానికి శీలం ప్రాణంతో సమానం అనే భూస్వామ్య భావజాలమే బలపడుతుంది. ఈ శిక్షల వల్ల రేప్‌ల సంఖ్య తగ్గుతుందేమో కానీ సామాజిక భావజాలం మారదు.

  చెన్నైలో లోకల్ ట్రైన్‌లు ఖాళీగా వెళ్తున్న సమయంలో ట్రైన్‌లో ఉన్న ఒకరిద్దరు ప్రయాణికుల సెల్‌ఫోన్‌లు లాక్కుని ఆధారాలు మాయం చెయ్యడానికి హత్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. నాగరిక సమాజంలో పది వేల రూపాయలు ధర చేసే సెల్‌ఫోన్ కోసం హత్య చెయ్యడం చాలా జుగుప్సకరమే. తిండి తినడానికి కూడా డబ్బులు లేక దొంగతనాలు చేసేవాడు నాగరికత గురించి ఆలోచించడు. పది వేల రూపాయలు ధర చేసే GPRS ఫోన్‌ని సాధారణ ఫోన్ అనుకుని వెయ్యి రూపాయలకి అమ్మేసినా అమ్మెయ్యగలడు. కానీ ఆ వెయ్యి రూపాయల కోసం ఒక నిండు ప్రాణం బలి అవుతుంది. ఈ వైరుధ్యాల గురించి ఆలోచించకుండా పరువుమర్యాదల భావనలతో ఎక్కువ సంబంధం ఉన్న రేప్‌ల గురించే సీరియస్‌గా ఎందుకు ఆలోచిస్తున్నట్టు?

 6. ఆ అమ్మాయి తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి డెటింగ్ చేసి తిరిగి వస్తుండగా రేప్ జరిగింది. . ఆ రౌడీగాళ్ళు కూడా తమ బిహేవియర్ తమ ఇష్టం అనుకుని రేప్‌లు చేస్తారు.

  oka ammayi abbayi night 9:30 ki kalisi bayatiki velite dating ki vellinattena?

  okavela vellina adi aame istam. anta maatraana rape chese hakku vastunda?

  Dating ni rape ni compare chestunna meelaantivallani emanaalo teleetam ledu.

  evaraina road pi dash istene kopam vastunde? idi entati himsa ?

  స్త్రీవాదంతో గానీ సంబంధం లేని & పరువుమర్యాదల కోసం ప్రాకులాడేవాళ్ళ భావజాలంతో మాత్రమే సంబంధం ఉన్న ఈ

  meeru chaala tappuga artham chesukunnaaru.
  eeroju intati spandana raavataaniki kaaranam ammaayila,vaari parents, sthree bhaavodvegaalani artham chesukunna vaari andolana.

  “సామాజికంగా వెనుకబడిన ఇండియా లాంటి దేశం” nijame mee laanti vaalani chuste anipistundi. Saamaajika rugmatalaku moolam kooda artham avutundi?

  రేప్‌ని మాత్రమే హత్యతో సమానమైన నేరంగా ఎందుకు పరిగణించాలని అనుకుంటున్నారు?

  oka bullet tagili chanipovatam kannaa idi chaala teevramaina himsa.

  @ sekhar mee blog lo telugulo type cheyatam elaa?

 7. ఆ అమ్మాయి డేటింగ్ చేసి తిరిగి వస్తోందని ఈనాడు పేపర్‌లో నేను చదివాను. అదేమీ నా హైపోథీసిస్ కాదు. రేప్ చెయ్యడం తప్పైనప్పుడు ఎవరిని రేప్ చేసినా అది తప్పే. చివరికి వీధి వ్యభిచారిని రేప్ చేసినా అది తప్పే. కానీ “మా శరీరాన్ని మాకు నచ్చిన మగవాళ్ళకి అప్పగించుకుంటాము, మాకు నచ్చని మగవాళ్ళు మాత్రం మమ్మల్ని అక్కాచెల్లెళ్ళతో సమానంగా చూడాలి” అని అనుకునే రకం స్త్రీలని అర్థం చేసుకోవడం మాత్రం సాధ్యం కాదు.

  ఇంకో విషయం చెపుతాను. ఒక ప్రముఖ మాట్రిమోనీ వెబ్‌సైట్‌లో ప్రొఫైల్ పెట్టిన ఒక అమ్మాయి ఫేస్‌బుక్‌లో కూడా ప్రొఫైల్ పెట్టింది. ఆ రెండు ప్రొఫైల్‌లూ ఒకరివా, కాదా అనే విషయం తెలుసుకుందామని ఆమెని ఫేస్‌బుక్ ప్రైవేట్ మెసేసింగ్ ద్వారా కాంటాక్ట్ చెయ్యడానికి ప్రయత్నించాను. నేను సెక్స్ చాట్ చెయ్యబోతున్నానని పొరపడి ఆమె తన వ్యక్తిగత విషయాలన్నీ నాకు చెప్పింది. నాకు అసలు విషయం అర్థం కాలేదు. మీ ప్రొఫైల్ మాట్రిమోనీ వెబ్‌సైట్‌లో చూశాను కనుక పెళ్ళి సంబంధం కోసమే మిమ్మల్ని కాంటాక్ట్ చేశాను అని ఆవిడతో అన్నాను. అప్పుడు ఆవిడ ఇలా సమాధానం చెప్పింది “మీ ఇంటి పేరు, మా ఇంటి పేరు ఒకటే కనుక మనిద్దరం పెళ్ళి చేసుకోవడం సాధ్యం కాదు” అని. “నీకు నిజంగా ఇంటి పేర్ల గురించి పట్టింపు ఉంటే నీ వ్యక్తిగత వివరాలు నాకెందుకు చెప్పావు” అని ఆవిడకి సమాధానం చెప్పి ఆవిడతో చాటింగ్ ఆపేశాను. అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికీ, ఆన్‌లైన్‌లో సెక్స్ చాటింగ్ చెయ్యడానికీ ఇంటి పేర్లూ, గోత్రాల పేర్లూ, వరసలూ అడ్డు రావు. కానీ లీగల్‌గా పెళ్ళి చేసుకోవడానికే అవన్నీ అడ్డొస్తాయి. ఇదేనా నమ్మకాల విషయంలో మనం సాధించిన అభివృద్ధి?

 8. ఇండియా సామాజికంగా వెనుకబడిన దేశం అనే నిజం చెప్పినంతమాత్రాన నన్ను తిట్టకరలేదు. ఇక్కడ పెళ్ళికి ముందు డేటింగ్ చెయ్యడం తప్పు కాదని అనుకుంటారు కానీ ఒకడితో డేటింగ్ చేసిన స్త్రీని ఇంకొకడు పెళ్ళి చేసుకోడు. ఒకడు అనుభవించిన స్త్రీని ఇంకొకడు ఎంగిలి విస్తరితో సమానంగా చూస్తాడు. మన భారతీయుల భావజాలం ఈ స్థాయిలోనే ఉంది. నేను ఈ నిజాలు చెపితే నా వల్లే దేశం సామాజికంగా వెనుకబడిపోయినట్టా?

 9. “డేటింగ్‌ని సమర్థించేవాళ్ళు రేప్‌ని మాత్రమే హత్యతో సమానమైన నేరంగా ఎందుకు పరిగణించాలని అనుకుంటున్నారు”

  వాళ్ళు చేసిన డేటింగ్ వల్ల ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినవాళ్ళకేమైనా ఇబ్బంది కలిగిందా? ఇలా ఎందుకడుగుతున్నానంటే వీళ్ళుచేసిన పనివల్ల ఆ అమ్మాయికి ఇబ్బంది కలిగింది కాబట్టి. ఇంకొకరికి ఇబ్బంది కలిగించే పని ఏదైనా అది నేరమేకాబట్టి.

  ఏది నేరం అన్నదానిపై రాజ్యాంగం/శిక్షాస్మృతి నిర్దేశిత సూత్రాలు ఉన్నాయికాబట్టి. వీళ్ళుచేసింది వాటి ప్రకారంగా నేరం కాబట్టి. అవన్నీ అనవసరం అంటే మీఇంట్లో మీరు టీవీ వాడుతున్నారు అన్నదాన్నికూడా నేరంగా పరిగణించి మీమీద దాడిచేసే హక్కు ఇంకొకరికి కట్టబెట్టిన వారౌతారు.

 10. ఆత్మహత్య చేసుకునేవాని వల్ల కూడా ఎవరికీ ఇబ్బంది కలగదు కనుక ఎవడైనా ఆత్మహత్య చేసుకుంటే “నాకేమిటి బాధ” అని అనుకుని వదిలేస్తామా? డేటింగ్ లాంటి పేర్లతో విచ్చలవిడిగా తిరిగేవాళ్ళు తాము మాత్రమే గోతిలోకి దిగరు, తాము చేసే పనులకి “ఆధునికత” అనే అందమైన పేరు పెట్టుకుని ఇతరులని కూడా గోతిలోకి లాగుతారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s