వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఎన్.ఎ.నజీర్ తీసిన ఫోటో ఇది. పాలక్కాడ్ జిల్లా (కేరళ) లోని పరంబికులం టైగర్ రిజర్వ్ అడవిలో ఫారెస్ట్ వాచర్ వెంట రాగా ప్రమాదకర పరిస్ధితుల్లో నజీర్ ఈ ఫోటో తీశాడని ఫ్రంట్ లైన్ తాజా సంచిక (డిసెంబర్ 28) తెలియజేసింది. పశ్చిమ కనుమల మధ్య విస్తరించి ఉన్న దట్టమైన అడవుల్లో పచ్చదనం నీడలో అదమరిచి నిద్రపోతున్న పులి ఇలా నజీర్ కెమెరా కంటికి చిక్కింది. తోకను పైకి లేపి నిద్రపోతున్న పులిని కెమెరాలో బంధించగలిగితే అది అరుదైన ఫోటోగా నిలుస్తుందని తన గురువు స్వామినాధన్ చెప్పిన విషయం మెదడుని తొలుస్తుండగా ఫారెస్ట్ వాచర్ హెచ్చరికను పక్కనబెట్టి నజీర్ చేసిన సాహసానికి ఫలితం ఈ ఫోటో.
–