ఒక జాతి సంస్కృతిని ప్రతిబింబించే అంశాల్లో ముఖ్యమైనది పెళ్లి. చరిత్రలో కుటుంబ జీవనం స్ధిరపడ్డాక పెళ్లి వేడుకలకు ఎనలేని ప్రాముఖ్యత పెరిగిపోయింది. కాల క్రమంలో సంఘంలో హోదాను, ఆస్తుల గొప్పతనాన్నీ చూపుకోవడానికి పెళ్లి కూడా ఒక సాధనంగా మారినా, వివాహం యొక్క సాంస్కృతిక ప్రాధాన్యత మాత్రం పెరిగిందే గానీ తగ్గిపోలేదు.
పెళ్ళిళ్ళు ఆడంబరాలకు వేదికలుగా మారి ఖరీదు పెరిగిపోవడం ఒక విపరిణామం. దానివల్ల మెజారిటీ పేద వర్గాలకు అవి అందుబాటులో లేకుండా పోయాయి. పెళ్లి అంటేనే ఒక వేడుకగా మాత్రమే కాక భరించలేని ఖర్చుగా కూడా మారిపోయింది. ఇటీవల జరిగిన బ్రిటిష్ యువరాజు, బ్రూనే యువరాణి తదితరుల పెళ్ళిళ్ళతో పాటు హాలీవుడ్, బాలీవుడ్ తదితర వుడ్ ల పుణ్యమాని కోట్ల విలువ చేసే సెలబ్రిటీలుగా అవతరించిన ధనికుల పెళ్ళిళ్ళలో మిలియన్ల డాలర్లు ఖర్చయిపోతున్నాయి. ఈ నేపధ్యంలో సామూహిక వివాహ వేడుకలు రంగం మీదికి వచ్చాయి. సామూహిక పెళ్ళిళ్ళు ఒక్క ఇండియాలోనే కాక ప్రపంచ వ్యాపితంగా ఒక ధోరణిగా ఉన్నదని ఈ కింద ఉన్న కొన్ని ఫోటోలు చూస్తే తెలుస్తుంది.
ఇండియా, చైనా, పెరు, మంగోలియా, జోర్డాన్, రష్యా, ఫిలిప్పైన్స్, పాకిస్ధాన్, తైవాన్, సోమాలియా, బ్రూనే, సిరియా, పాలస్తీనా, ఇజ్రాయెల్, బెలారస్, బ్రెజిల్, స్పెయిన్, బొలీవియా, ఘనా, ఇరాక్, మాసిడోనియా, రుమేనియా తదితర దేశాల వివాహ వేడుకలను ఈ ఫొటోల్లో చూడవచ్చు. చాలా దేశాల సంస్కృతులు క్రిస్టియన్ వివాహ సంస్కృతిని అనుసరించడాన్ని బట్టి క్రైస్తవ వివాహ సంస్కృతి ప్రపంచంలోని నలుమూలలకీ విస్తరించిందని గ్రహించవచ్చు.
ఈ మధ్య కాలంలో అమెరికన్లు, జర్మన్లు, బ్రిటిషర్లు ఇండియాకి వచ్చి హిందూ వివాహ పద్ధతిలో పెళ్లి చేసుకోవడం జరుగుతోంది. అమెరికాలో కూడా కొందరు అమెరికన్లు హిందూ పద్ధతిలో పెళ్లి చేసుకుంటుంటే మరికొందరు వివిధ పార్టీలకు చీరల్లో దర్శనం ఇస్తున్నారు. ఇన్నాళ్ళు పశ్చిమానికి సాగిన సంస్కృతీ ప్రవాహం ఇపుడు తూర్పువైపుకి కూడా సాగుతోందనడానికి ఇదొక సూచన కావచ్చు. అయితే పశ్చిమ సంస్కృతీ ప్రవాహం విలువల పతనానికి దారితీస్తే, తూర్పు సంస్కృతీ ప్రవాహం సంస్కృతుల మేలి కలయికకు దారి తీయడం యాదృచ్ఛికం కాకపోవచ్చు.
- సెరి బెగవాన్, బ్రూనె: బ్రూనె సుల్తాన్ కూతురి సాంప్రదాయ వివాహంలో వధూవరుల ప్రార్ధన
- అమ్మాన్, జోర్డాన్: సామూహిక పెళ్లిలో వధువులతో వరుల ముచ్చట్లు
- గ్జియాన్, షాంగ్జి, చైనా: ఓ సామూహిక వివాహ వేడుక
- సైబీరియా, రష్యా: వార్షిక పెళ్లి పండగ వేడుకలను తిలకిస్తున్న ఒక వధువు
- మనీలా, ఫిలిప్పైన్స్: సామూహిక పెళ్లిలో సెల్ ఫోన్ కి ఫోజు ఇస్తున్న ఓ కొత్త జంట
- దర్ద్ ఖోరా, శ్రీనగర్: భారత దేశ ద్రిమ్మరి తెగ గుజ్జార్ వధువు పెళ్లి తర్వాత ఇంటికి వెళ్తున్న దృశ్యం
- ఇస్లామాబాద్, పాకిస్ధాన్: చర్చి పెళ్లిలో వధూ వరుల ప్రార్ధనలు
- తైపి, తైవాన్: సామూహిక మిలట్రీ పెళ్ళి వేదిక పడిపోకుండా సైనికుల ఆసరా
- హోడన్, సోమాలియా: సోమాలియా పోలీసు పెళ్లి
- ఫ్యూసెన్, జర్మనీ: కొత్త జంటల యాత్రలకు ఆకర్షణీయ లక్ష్యం ఫ్యూసెన్ లో చైనా జంటలు
- నాంజింగ్, చైనా: సాంప్రదాయక పడవ యాత్రలో కొత్త చైనా జంట
- లీమా, పెరు: ఖైదీలను సామాజికంగా మిళితం చేసే కృషిలో జరుగుతున్న ఓ ఖైదీ పెళ్లి
- లిమా, పెరు: సాంప్రదాయ దుస్తుల్లో సామూహిక వివాహానికి సిద్ధమవుతున్న కొత్త జంట
- ఇజ్రాయెల్ ఆక్రమిత గోలన్ హైట్స్: రెడ్ క్రాస్ సాయంతో సిరియన్ వరుడి కోసం గోలన్ హైట్స్ వచ్చిన సిరియన్ వధువు
- మీ షీరిమ్, జెరూసలెం, ఇజ్రాయెల్: వధువు ముందు మత గురువు రబ్బీతో నృత్యం చేస్తున్న వరుడు
- మిన్స్క్, బెలారస్: సాంప్రదాయ పెళ్లి వేడుకలో వధువుల కుడి చేతులు ముద్దాడుతున్న వరులు
- సావో పోలో, బ్రెజిల్: సామూహిక వివాహ వేడుకలో తమ వంతుకోసం చూస్తున్న వదువులు
- అమ్మాన్, జోర్డాన్: సామూహిక పెళ్ళిలో కుటుంబీకుల భుజాలపై నర్తిస్తున్న నూతన వరులు
- బెనల్మదీనా, స్పెయిన్: సముద్ర జీవుల అక్వేరియంలో పెళ్లి వేడుక
- తివనాకు, బొలీవియా: దేశ ఉపాధ్యక్షుడు (49), జర్నలిస్తు యువతి (25) ల సాంప్రదాయక పెళ్లి పడవ యాత్ర
- కోబ్జా, బొలీవియా: సాంప్రదాయక పెళ్లి పండగలో పాత, కొత్త జంటల సామూహిక వేడుక
- కోబ్జా, బొలీవియా: ఆదిమ తెగకు చెందిన కొత్త బొలీవియా జంట
- ఉలన్ బెటోర్, మంగోలియా: పార్లమెంటు భవనం ముందు నూతన వధూవరులు
- అక్రా, ఘనా: బీచ్ లో కెమెరాకు ఫోజు ఇస్తున్న కొత్త జంట, మిత్రులు
- కోల్ కతా, ఇండియా: పేద జంటల కోసం బెంగాల్ ప్రభుత్వం నిర్వహించిన సామూహిక వివాహాలు
- బాగ్దాద్, ఇరాక్: పెళ్లికి తరలి వెళ్తున్న కొత్త జంటకు సెక్యూరిటీ గార్డుల శుభాకాంక్షలు
- గాల్సినిక్, మాసిడోనియా: సాంప్రదాయక గాల్సినిక్ వివాహానికి ముందు వరుడిని తీర్చిదిద్దుతున్న బెస్ట్ బార్బర్
- వెస్ట్ బ్యాంక్, పాలస్తీనా: ఇజ్రాయెల్ ఆక్రమిత పాలస్తీనా లో సిరియన్ పాలస్తీనియన్ల వివాహ వేడుక
- బుఖారెస్ట్, రుమేనియా: ట్రింప్ ఆర్క్ వద్ద సాంప్రదాయక నృత్యంలో నూతన వధువులు
- మనీలా, ఫిలిప్పైన్స్: వరద నీటితో నిండిన వీధిలోనే కొత్త జంట వేడుక
- టావోయువాన్, తైవాన్: తైవాన్ లో మొదటి స్వలింగ జంటల వివాహం
(బోస్టన్ పత్రిక ఈ ఫొటోలను అందించింది)