ఈ అక్టోబర్ 20 తేదీతో చైనా-ఇండియాల యుద్ధం ప్రారంభమై 50 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య జరిగిన సరిహద్దు ఘర్షణలపై పత్రికలు తాజా విశ్లేషణలకు పూనుకుంటున్నాయి. టి.వి చానెళ్లు ప్రత్యేక కధనాలు ప్రసారం చేస్తున్నాయి. చైనా ముందస్తు హెచ్చరిక లేకుండా ఇండియాపై దాడి చేసిందన్నది ఈ విశ్లేషణలు, ప్రత్యేక కధనాల సారాంశంగా ఉన్నది. అప్పటి చైనా కమ్యూనిస్టు పార్టీ ఛైర్మన్ మావో జెడాంగ్ ఆదేశాలతోనే చైనా ఇండియాపై దురహంకార దాడికి దిగిందని నిన్న ఈ టి.వి ప్రత్యేక కధనం ప్రసారం చేసింది. పంచశీల సూత్రాలకు ద్రోహం చేస్తూ చైనా అకస్మాత్తుగా దాడి చేసిందని ఇన్నాళ్లూ ఉన్న ప్రచారం. ఈ వాదనలో నిజం లేదని చైనా ప్రభుత్వం వెల్లడి చేసిన రహస్య పత్రాల ద్వారా తెలుస్తున్నదని ‘ది హిందూ’ తెలిపింది.
అక్టోబర్ 20, 1962 తేదీన చైనా చేసిన దాడికి మూడు నెలల ముందే ఆ దేశానికి చెందిన అత్యున్నత అధికారి ఒకరు మిలట్రీ చర్య గురించి హెచ్చరించినట్లు చైనా పత్రాల ద్వారా తెలుస్తున్నది. పశ్చిమ సరిహద్దులో భారత దేశం తన సైనికుల చొరబాటును కొనసాగించినట్లయితే మిలట్రీ చర్య తప్ప చైనాకు మరో దారి లేదని భారత రాయబారితో జరిపిన చైనా అధికారి హెచ్చరించినట్లు చైనా పత్రాలు తెలియజేస్తున్నాయి. ఈ హెచ్చరికను భారత అధికారులు పట్టించుకోలేదనీ అందువల్లనే మిలట్రీ చర్య అనివార్యమైందనీ చైనా పత్రాలు తెలియజేస్తున్నాయి. భారత అధికారి ఆర్.కె.నెహ్రూ కూడా ఈ విషయాన్ని గతంలోనే అంగీకరించినట్లుగా ‘ది హిందూ’ తెలిపింది.
చైనా-ఇండియాల యుద్ధానికి సంబంధించిన రహస్య పత్రాలను చైనా ప్రభుత్వం గత సంవత్సరం బహిరంగం కావించింది. సరిహద్దు తగాదాపై 1949 నుండి 1962 వరకూ చైనా ఇండియాల మధ్య జరిగిన చర్చల నోట్ లు ఈ పత్రాల్లో ఉన్నాయనీ, సరిహద్దు విభేధాలపై న్యూఢిల్లీలోని చైనా రాయబార అధికారులు చైనా ప్రభుత్వానికి పంపిన వివిధ పత్రాలు కూడా ఇందులో ఉన్నాయని ‘ది హిందూ’ తెలిపింది. చైనా విదేశాంగ శాఖ బహిరంగం కావించిన పత్రాల్లోని కొన్ని విషయాలు, ముఖ్యంగా చైనా-ఇండియా యుద్ధానికి సంబంధించిన విషయాలు ఇంతవరకూ భారత్ లో నివేదించబడలేదని సదరు పత్రిక తెలిపింది.
1962 యుద్ధానికి దారి తీసిన దశాబ్దకాలం నాటి పరిణామాలపై తాజా దృక్పధాన్ని ఈ పత్రాలు కలిగిస్తున్నాయని, ఘర్షణలను నివారించుకునే అవకాశాలు తప్పిపోయిన సంగతి ఈ పత్రాల ద్వారా వెల్లడి అయిందని పత్రిక తెలిపింది. 1960 లో చైనా ప్రధాని చౌ-ఎన్-లై ఇండియా సందర్శించినప్పుడు గానీ, యుద్ధానికి మూడు నెలలముందు జెనీవాలో ఇరుదేశాల రాయబారుల మధ్య జరిగిన చర్చల్లో గానీ సుహృద్భావ పరిష్కారానికి అవకాశాలు తప్పిపోయాయనీ, చైనా హెచ్చరికలను భారత అధికారులు పెడచెవిన పెట్టడమే దీనికి కారణమనీ పత్రిక తెలిపింది.
జులై 20, 1962 తేదీన చైనా ఉప విదేశాంగ మంత్రి ఝాంగ్ హన్ఫు, చైనాలో మాజీ భారత రాయబారి ఆర్.కె.నెహ్రూ ల మధ్య జెనీవాలో ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జరిగిన చర్చల సారాంశాన్ని తెలియజేస్తూ చైనా ప్రభుత్వంలో నడిచిన అంతర్గత నోట్ లో యుద్ధానికి ముందు జరిగిన చర్చల వివరాలు ఉన్నాయి. ఈ నోట్ ప్రకారం చైనా ఉప విదేశీ మంత్రి ఝాంగ్ సరిహద్దు చొరబాటు విషయమై హెచ్చరిక చేశాడు. “సరిహద్దు సమస్య తీవ్రమైనది. ఇండియా తన బలగాలను ఉపసంహరించుకోనట్లయితే, తర్వాత ఎదురయ్యే ఫలితాలను అనుభవించవలసి వస్తుంది” అని ఝాంగ్ హెచ్చరీంచినట్లు నోట్ ద్వారా తెలుస్తున్నది.
జెనీవాలో ఝాంగ్, ఆర్.కె.నెహ్రూ ల మధ్య జరిగిన సమావేశంతో పాటు చైనా విదేశీ మంత్రి చెన్ యీ మరియు భారత రక్షణ మంత్రి వి.కె.కృష్ణ మీనన్ ల మధ్య జరిగిన సమావేశం రెండూ విఫలం కావడం ఇరు దేశాల మధ్య సంబంధాలలో మూల మలుపుగా చైనా భావించినట్లు మరొక పత్రం ద్వారా తెలుస్తోంది.
భారత మాజీ రాయబారి ఆర్.కె.నెహ్రూ కూడా తర్వాత స్వయంగా ఈ సంగతి ప్రస్తావించినట్లు తెలుస్తున్నది. జులై నాటి సమావేశంలో చైనా ముందస్తు హెచ్చరిక చేసిన దృష్ట్యా “సైనిక చర్యకు సంబంధించి చైనా తగిన హెచ్చరిక చేయలేద” ని చెప్పడం సరికాదని ఆయన భావించినట్లు ‘ది హిందూ’ తెలిపింది. ఈ ఒప్పుకోలుతోనే అక్టోబర్ 20 నాటి చైనా దాడిని ‘ద్రోహం’ గా, ‘అకస్మాత్తుగా జరిగిన దాడి’ గా చెప్పడం సరికాదని అర్ధం అవుతోంది. ప్రఖ్యాత జర్నలిస్టు ఎ.జి.నూరాని ఆ తర్వాత కాలంలో యుద్ధ పరిణామాలపై వ్యాసం రాస్తూ ఆర్.కె.నెహ్రూ అభిప్రాయాలను ప్రస్తావించాడు. “అది (ఇండియా బలగాల చొరబాటు) తీవ్రమైన మిలట్రీ ఘర్షణకు దారితీయక తప్పదని ఝాంగ్ ముందే నోట్ ద్వారా సూచించాడు” అని ఆర్.కె.నెహ్రూ చెప్పినట్లుగా నూరాని తెలిపాడు. “బహుశా ఘర్షణ యొక్క స్వభావం, పరిమాణం యొక్క స్ధాయిలను ఊహించలేకపోయాము. కానీ మిలట్రీ ఘర్షణలు చోటు చేసుకుంటాయని వారినుండి తగిన హెచ్చరికలు లేవని చెప్పడానికి మాత్రం నేను సిద్ధంగా లేను” అని ఆర్.కె.నెహ్రూ చెప్పినట్లుగా నూరాని వ్యాసం తెలియజేసింది.
ఆర్.కె.నెహ్రూ ఒప్పుకోలుతో పాటు చైనా రహస్య పత్రాల వెల్లడి ద్వారా అందిన తాజా సమాచారాన్ని బట్టి చైనా-ఇండియా ల యుద్ధానికి పూర్తిగా చైనా నే బాధ్యురాలిగా చెయ్యడం సరికాదని గ్రహించవచ్చు. చైనాను వ్యతిరేకించడానికి ఇరు దేశాల మధ్య జరిగిన యుద్ధాన్ని తరచుగా ప్రస్తావించడం జరుగుతుంటుంది. కమ్యూనిజం పై ద్వేషం వ్యక్తం చెయ్యడానికి కూడా హిందూ మతసంస్ధలు చైనా-ఇండియా యుద్ధాన్ని సాకుగా తెచ్చుకోవడం పరిపాటి. వారి చైనా విద్వేషానికి అసలు పునాదే లేదని తాజా విషయాలు స్పష్టం చేస్తున్నాయి. ఇరుగు పొరుగు దేశాల మధ్య తలెత్తే సరిహద్దు వివాదాలను శాంతియుతంగా, చర్చల ద్వారా పరిష్కరించుకోవడమే సరైన మార్గం. చర్చల ద్వారా పరిష్కరించుకునే మార్గాన్ని భారత అధికారులు పరిగణించినట్లయితే చైనా వ్యతిరేక భావోద్వేగాలకు స్ధానం ఉండేది కాదు.
కామ్రేడ్ బాగా చెప్పారు. అందరమూ కలసి చైనాకు మద్దతు ఇద్దాం.
చైనాకు మద్దతు ఇవ్వడం ఏమిటి?
ఇరుగు పొరుగు దేశాల మధ్య తలెత్తే సరిహద్దు వివాదాలను శాంతియుతంగా, చర్చల ద్వారా పరిష్కరించుకోవడమే సరైన మార్గం. చర్చల ద్వారా పరిష్కరించుకునే మార్గాన్ని భారత అధికారులు పరిగణించినట్లయితే చైనా వ్యతిరేక భావోద్వేగాలకు స్ధానం ఉండేది కాదు.
I think Indian diplomacy woke up to this fact after the Indo-China War. Sometimes these disputes are better not publicized, since any compromise stance taken by either party will be judged as weakness. They made some good progress since the war, albeit being very slow.
Who really wants to know the truth? Churn out some nationalism and increase viewership/readership.
Also, its equally important to emphasize China’s aggression towards India. The war might be a result of failed Diplomacy between the two countries, but it’s easy to ignore that the Indian Govt acted in its best interests during those turbulent times. (I’m not saying you’re ignoring).
Did China know that India cannot sustain a war? I’m sure they did. I feel like China intentionally escalated this conflict to more than what it is, just to let India know who is the boss. (As cheesy as that statement might sound,I feel like there is some truth to it). Chairman Mao made some really aggressive racist statements towards Nehru and Indians in general before the war, according to popular trivia in those days.
India Govt might have deployed forces in the disputed area, which might be a bit premature, but considering their bad experience in Kashmir I don’t blame them from doing so. China was clearly aware that India’s military is no match and India itself is a struggling new country. China could’ve easily averted the war if they really wanted to, but they chose to teach India a lesson. Indian administration blatantly failed to ‘see’ this aggression (diplomatically) and just didn’t expect a war with China.
In conclusion, its just a failed strategy on part of the Indian administration and overzealous ‘peace’ plan.
పశ్చిమ సరిహద్దులో భారత దేశం తన సైనికుల చొరబాటును కొనసాగించినట్లయితే మిలట్రీ చర్య తప్ప చైనాకు మరో దారి లేదని!!!
I never knew that in decades of our existence, India have invaded another country! and that too china!
Me too have same doubt what Mr.Ajay is having..
@ajay & venkat.
మీరు భావిస్తున్నట్లు India invasion అన్న అర్ధం చైనా నోట్ లో లేదు. ‘Indian Army’s advances’ అనే పదబంధాన్ని నోట్ లో వాడారు. దానిని ఇండియా చొరబాటు గా నేను అనువదించాను. బహుశా చొరబాటు గా కూడా చెప్పకూడదేమో తెలియదు.