(గత మలాల యూసఫ్జాయ్ ఆర్టికల్ కింద వ్యాఖ్యాత చక్రిగారు ఒక కొత్త కోణాన్ని పాఠకుల ముందు ఉంచారు. ‘వర్టికల్ మరియు హారిజాంటల్ సమస్య’ అనే దృష్టి కోణంలో తాను సమస్యను చూస్తున్నట్లు చెప్పారు. సామాజిక విశ్లేషణల్లోనే కాక ప్రజలతో సంబంధం ఉన్న అనేక ఇతర సమస్యల విశ్లేషణలో కూడా కొందరు ఈ కోణాన్ని తరచుగా ప్రస్తావిస్తారు. ఈ కోణంలో చూసినపుడు వ్యవస్ధాగత సమస్యలు కొంత తేలికగా అర్ధం అయే అవకాశం ఉంటుంది. తన దృష్టిలో ఏది వర్టికల్, ఏది హారిజాంటలో చెప్పనపటికీ ఆ ప్రస్తావన ఆధారంగా ఆయనకి ఇచ్చిన సమాధానానమే ఈ టపా. కొన్ని మార్పులు చేర్పులతో ప్రచురిస్తున్నాను. -విశేఖర్)
తాలిబాన్ స్త్రీలపై సాగించే అణచివేతే వర్టికల్ సమస్య కాగా, అమెరికా దురాక్రమణ హారిజాంటల్ సమస్య. ఎందుకంటే స్త్రీల అణచివేత ఆఫ్ఘన్ స్త్రీలు మాత్రమే ఎదుర్కొనే సమస్య. అది కూడా తాలిబాన్ అధికారంలో ఉన్నపుడు మాత్రమే. (ఇప్పుడు కూడా తాలిబాన్ వల్ల ఆఫ్ఘన్ స్త్రీలు సమస్యలు ఎదుర్కొంటున్నారని చెబితే అది వాస్తవం కాబోదు. ఎందుకంటే తాలిబాన్ శక్తులన్నీ ఇపుడు అమెరికా పై పోరాటం మీదికే ఎక్కుపెట్టబడి ఉన్నాయి తప్ప స్త్రీలను అణచివేసే విషయంలో కాదు. పాక్ తాలిబాన్ కి కూడా ఇదే వర్తిస్తుంది.)
ఆఫ్ఘన్ జనాభాలో సగం స్త్రీలు ఎదుర్కొనే సామాజిక అణచివేత సమస్య వర్టికల్ అయితే అమెరికా దురాక్రమణ వల్ల ఆఫ్ఘన్ ప్రజలు మొత్తం ఎదుర్కొనే ఆర్ధిక, రాజకీయ, సాంస్కృతిక సమస్యలన్నీ హారిజాంటల్ సమస్య. ఎందుకంటే స్త్రీ పురుష విభజన వర్టికల్ విభజన కాగా, సామ్రాజ్యవాదం, ఆఫ్ఘన్ ప్రజల విభజన హారిజాంటల్ విభజ కనుక.
స్త్రీల అణచివేత వల్ల స్త్రీలు మాత్రమే నష్టపోతే విదేశీ దురాక్రమణ వల్ల పురుషులు, స్త్రీలు, పిల్లలు, వృద్ధులు ఆంతా ఒకే విధంగా నష్టపోతారు. అమెరికా వల్ల వారి దేశానికి ఆర్ధిక, రాజకీయ సార్వభౌమత్వం లేదు. దేశ వనరులను సొంతానికి వాడుకోలేరు. అమెరికా సైన్యం ఎప్పుడొచ్చి గ్రామాలపై దాడులు చేసి స్త్రీలు, పిల్లలను చంపేస్తారో, ఏ స్త్రీని లాక్కెళ్లి మానభంగం చేస్తారో, ఏ రాత్రి వచ్చి తలుపులు విరగ్గొట్టి మగవాళ్ళని లాక్కెళ్తారో, ఏ బాంబుదాడిలో ఆస్తులు, ప్రాణాలు కోల్పోతారో తెలియని పరిస్ధితుల్లో దేశం మొత్తం బతుకుతోంది.
ఈ పరిస్ధితుల్లో దేశం మొత్తం ఒక్కటై అమెరికా దురాక్రమణపై పోరాడాల్సి ఉంటుంది. మీరు మా చదువుకి అడ్డు చెబుతున్నారు గనక మీతో కలవం అని స్త్రీలు చెబితే అది ఆఫ్ఘన్ జాతీయ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటుంది. అమెరికా దురాక్రమణకే ఉపయోగపడుతుంది. దురాక్రమణదారు తాను ఆక్రమించిన దేశంలోని ప్రజలను వివిధ పేర్లతో విడగొట్టి తన పబ్బం గడుపుకుంటాడు. ప్రజలలో చీలికలు తెచ్చి తన ఆక్రమణను కొనసాగించడానికి ప్రయత్నిస్తాడు. అలాంటిది ఆఫ్ఘన్ ప్రజలే తమలో తాము కొట్టుకుని విడిపోతే అమెరికాకి అంతకంటే కావలసింది ఇంకేం ఉంటుంది?
భారత దేశంలో బ్రిటిష్ ఆక్రమణకి వ్యతిరేకంగా జాతీయోద్యమం ఉవ్వెత్తున ఎగసినపుడు నిమ్నకులాల వారు తమపై కుల అణచివేతను ఆపేసి మాకుకూడా భూములు, పరిశ్రమలు పంచిస్తేనే జాతీయోద్యమంలో కలుస్తాం అంటే ఎలా ఉండేది? హిందూ మతంలో స్త్రీల పరిస్ధితి మెరుగుపడే విధంగా సూత్రాలు చేస్తేనే ఉద్యమంలో కలుస్తాం అని స్త్రీలు చెబితే ఎలా ఉండేది? స్త్రీలు, దళితుల డిమాండ్లు నెరవేరకపోగా జాతీయోద్యమం బలహీనపడి వచ్చిందని చెబుతున్న స్వాతంత్రం వచ్చి ఉండేదా?
భారత జాతీయోద్యమం మొదట స్త్రీల సమస్యను, దళితుల సమస్యను పరిష్కరించాక స్వాతంత్రం కావాలని అడగలేదు. మొదట స్వాతంత్ర్యం వస్తే మిగిలిన సమస్యలు మనమే పరిష్కరించుకుందాం అన్న అవగాహన సాధారణంగా ఉంటుంది. ఇదే అవగాహన తాలిబాన్ కి, ఆఫ్ఘన్ దురాక్రమణకి కూడా వర్తిస్తుంది.
ఆఫ్ఘనిస్ధాన్ ని అమెరికా, యూరప్ దేశాలు ఆక్రమించి ఉన్నాయి. అక్కడ నిలబడి వాళ్ళు ఇండియా, చైనా, రష్యా దేశాల ఎదుగుదలపై చెక్ పెట్టే వ్యూహంలో ఉన్నారు. పశ్చిమాసియాలో ఇరాన్, సిరియాల దురాక్రమణకి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు ఆఫ్ఘన్, పాక్ లలో ఉంటే ఆ దేశాలకే కాక, ఇండియా ప్రజలకి కూడా నష్టమే. అందుకే భారతీయులు, చైనీయులు, రష్యన్లు, అరబ్బులు అందరూ అమెరికా దురాక్రమణని వ్యతిరేకించాలి. అమెరికా దురాక్రమణపై ఎటువంటి మినహాయింపు లేకుండా పోరాడే శక్తులకి మద్దతు ఇవ్వాలి. ఆఫ్ఘనిస్ధాన్ లో ఎటువంటి మినహాయింపులు లేకుండా అమెరికా, యూరప్ దేశాల సామ్రాజ్యవాద దురాక్రమణని ఎదిరిస్తున్నది తాలిబానే. కనుక తాలిబాన్ చేస్తున్న సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటానికి మద్దతు ఇవ్వాలి. దాని బదులు తాలిబాన్ సిద్ధాంతాల్లో తప్పులు ఎన్నుటూ కూచుంటే అది అమెరికాకి లాభమే తప్ప ఆఫ్ఘన్ ప్రజలకి కాదు. కనీసం స్త్రీలకి కూడా కాదు.
తాలిబాన్ అనేది అమెరికా దురాక్రమణకి వ్యతిరేకంగా పోరాడుతున్న సంస్ధ అన్నది మొదట గుర్తించాలి. పశ్చిమ మీడియా వల్ల దానికి బదులు అది స్త్రీలను అణచివేసే సంస్ధ అనో, మతోన్మాద సంస్ధ అనో మాత్రమే అని గుర్తుకు వస్తోంది. ఈ అభిప్రాయం ఉద్దేశ్యపూర్వకంగా అదే పనిగా ప్రపంచ వ్యాపితంగా ప్రచారం చేయబడింది. అందుకోసం పశ్చిమ మీడియా జాగ్రత్తగా చేసిన కృషి ఉంది. ఆ ప్రచారానికి ప్రజలు గురికాకూడదు. పశ్చిమ దేశాల ప్రచారానికి గురికాకూడదు అంటే దానర్ధం తాలిబాన్ మత సంస్ధ కాదనో, దాని సిద్ధాంతాలు గొప్పవనో చెప్పడం కాదు.
అనేక సమస్యలు మన ముందు ఉన్నపుడు ఏ సమస్యను ముందు పరిష్కరించుకోవాలి అన్న సమస్య వస్తుంది. అమెరికా దురాక్రమణా? లేక ఆఫ్ఘన్ స్త్రీలపై అమెరికా అణచివేతా? ఈ రెండింటిలో ఏది ముందు ఎదుర్కోవాలి అన్నపుడు అనేక సమస్యలకు మూలకారణమైన అమెరికా సామ్రాజ్యవాదాన్నే మొదట ఎదుర్కోవలసి ఉంటుంది. అలా నిర్ణయించాక అమెరికా సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలో నిశ్చయంగా కలిసి వచ్చే శక్తులన్నీ కలుపుకుని ఐక్యంగా పోరాడితే విజయం సిద్ధిస్తుంది. ఈ కోణంలో మాత్రమే తాలిబాన్ కి మద్దతు ఇవ్వాలని చెప్పడం.
ఇరాన్, సిరియా, తాలిబాన్ ఇవి తప్ప ఆసియాలో అమెరికా, యూరప్ ల ప్రపంచాధిపత్యాన్ని ఎదిరిస్తున్నవారు మరొకరు లేరు. ఇండియా, పాకిస్ధాన్ ల ప్రభుత్వాలు పశ్చిమ దేశాలకు సహకరిస్తున్నారు తప్ప ఎదిరించడం లేదు. ముస్లిం మతోన్మాదం అనో, స్త్రీలపై అణచివేత అనో, తాలిబాన్ అట్రాసిటీస్ అనో చెప్పి తాలిబాన్ కి మద్దతు లేకుండా చేయడంలో అమెరికా, యూరప్, వాటి మీడియా సఫలం అయ్యాయి. ఆ మాయలో మనమూ పడిపోతున్నాము.
మిత్రులు చెబుతున్నట్లు ప్రపంచాన్ని ఇంకొంచెం బెటర్ చేసుకోవడమే అందరూ కోరుకూనేది. అలా కోరుకోవడం నిజమే అయితే, ప్రపంచ మెరుగైన చోటు కాకుండా అడ్డుకుంటున శక్తులను గుర్తించి వారిని వ్యతిరేకించడం అవసరం. అమెరికా, యూరప్ ల ప్రపంచాధిపత్యం లేకపోతే ఆసియాయే కాదు, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలు ఎప్పుడో ఇప్పటికంటే మెరుగైన చోట్లుగా ఉండేవి. అందుకే అలాంటి సామ్రాజ్యవాదాన్ని ఎదిరించి నిలవరిస్తున్న తాలిబాన్, సిరియా, ఇరాన్, హమాస్ (పాలస్తీనా) లకు మద్దతు ఇవ్వాలి.
తాలిబాన్ కి మద్దతు అనగానే తాలిబాన్ సిద్ధాంతాలకు, విధానాలన్నింటికీ మద్దతు ఇస్తున్నట్లు కాదు. అది చేస్తున్న సామ్రాజ్యవ్యతిరేక పోరాటానికి మాత్రమే మద్దతు. తాలిబాన్ చేతికి రాజ్యం వచ్చాక అప్పుడిక ఆఫ్ఘన్ ప్రజల ప్రాధామ్యాలు మారతాయి. ఇతర దేశాల ప్రజల ప్రాదాన్యత కూడా ఆఫ్ఘన్ ప్రజలపై అది సాగించే అణచివేత, భూస్వామ్య దోపిడిల మీదికి మళ్లుతుంది. అప్పుడిక తాలిబాన్ వ్యతిరేకంగా పోరాడే ఆఫ్ఘన్ ప్రజలకు మద్దతు ఇవ్వడమే మిగులుతుంది.
మతాన్ని భూమికగా చేసుకొని అమెరికా (సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం తాలిబాన్ ఉద్దేశం కాదు) విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న తాలిబాన్ పోరాటాన్ని అర్థం చేసుకోవచ్చు. మరో ప్రత్యాయం లేని నేలమీద ఆఫ్ఘన్ ప్రజల పోరాటానికి మన సానుభూతిని కూడా అందించవచ్చు. అయితే సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా తాలిబాన్లు పోరాడుతున్నారనడంలో అవగాహనా లోపం కనిపిస్తుంది.
భారత జాతీయోద్యమాన్ని ప్రస్థావించడంలో కూడా ఇదే పద్ధతి కనిపిస్తుంది. దళిత సమస్య స్వాతంత్ర్యం కంటే కూడా ప్రాధాన్యతను సంతరిచుకున్నదేనని అంబేడ్కర్ లాంటి వారు తమ వైఖరిని చెప్పిన సందర్భాలు కోకొల్లలు. ఇలాంటివి జాతీయోద్యమంలో భాగమవుతాయో కావో పెద్దలు నిర్ణయించి చెప్పాల్సి ఉంది. సంక్లిష్టమైన విషయాలను తేలిక చేసి చెప్పే ప్రయత్నంలో వాటికుండే భిన్న పార్శ్వాలను మరచి పోతే మిగిలేది తొందరపాటే.
అమెరికా సామ్రాజ్య వాద దాడిని ఖండించాలి. దానికి వ్యతిరేకంగా ముందుకొచ్చే పోరాట రూపాలను అర్థం చేసుకోవాలి. మద్ధతు ఇవ్వడంలో మాత్రం వాటికుండే ప్రజాస్వామికత ప్రాతిపదికగా ఆలోచించాలి.
నాగరాజు గారూ, మీ అభిప్రాయాన్ని ఇంకొంత వివరంగా చెప్పాల్సింది. మీరు ప్రస్తావించిన వివిధ అంశాల మధ్య సంబంధాన్ని వివరిస్తే బాగుంటుంది.
ఆఫ్ఘన్ దురాక్రమణ సామ్రాజ్యవాదమే. అమెరికాతో ఇతర సామ్రాజ్యవాద దేశాలు కూడా కుమ్మక్కయ్యి ఆఫ్ఘన్ ని దురాక్రమించాయి. ఈ ఆక్రమణకి వ్యతిరేకంగా పోరాడడం సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటమే అవుతుంది. ఆఫ్ఘనిస్ధాన్ ని వదిలిపోతే తప్ప అమెరికాతో చర్చలు లేవని తాలిబాన్ అనేకసార్లు ప్రకటించింది. వారి ఆచరణ, ప్రకటిత లక్ష్యం సరిపోలుతున్నాయి. ఇవి కాకుండా తాలిబాన్ కి వేరే ఉద్దేశ్యాలున్నాయని మీరు సూచిస్తున్నారు. వాటిని వివరిస్తే బాగుండేది.
అంబేద్కర్ కుల నిర్మూలనా లక్ష్యానికీ, జాతీయోద్యమానికి ఉన్న సంబంధం విషయంలో కూడా మీ దృష్టి కోణాన్ని వివరిస్తే బాగుండేది. బహుశా కుల విషయంలో నేను తెచ్చిన పోలిక మీకు అసంతృప్తి కలిగించిందేమో. ఈ అంశాన్ని వివరించగలరేమో చూడండి.
You are completely mistaken about Taliban and misguiding others because of your hatred towards America. We have seen Taliban’s rule in large parts of Afghanistan and Kabul during 1996-2001. It is an Islamic fundamentalist militant organization and enforced strict interpretation of sharia law. They were brutal in their repression of women. Women faced public flogging and executions for violation of Taliban’s laws. Taliban was also supported by al-Qaeda and Pakistani ISI.
They were overthrown by The US led army after the attacks of 9/2001. So, for you to say the Taliban is fighting against American Imperialism and that they have never been really in power, and Afghan women have to support them for now is blatantly disingenuous. Afghans, neighboring countries and the world have already seen what happens if Taliban gains power in Afghanistan. We haven’t forgotten their atrcocities against their own people including women and children. Also, don’t forget they were providing training for islamic terrorists to launch attacks in other countries. So, with all this history and context, no one would say we have to support Taliban’s insurgency in Afghanistan. On the other hand, what we should all wish and hope for is to destroy Taliban and not let them come back into power in any shape or form.
Please stop spin doctoring the Malala story because your agenda is hatred towards America and its policies. There is a limit and it has reached when you said you support Taliban ( doesn’t matter what your reason is. Nobody in their right mind would support Taliban).
ఇస్లామిక్ దేశాలలో స్త్రీలకి హక్కు లేవు అని అంటూ దొంగ ఏడుపు ఏడుస్తోన్న పాశ్చాత్య మీడియాకి స్త్రీల మీద నిజంగా ప్రేమ ఉందని అనుకోను. చాలా మంది లిబరల్ భావకులు అనుకుంటారు “ఆసియా దేశాలలో మాత్రమే సెక్స్ గురించి మాట్లాడడం నిషిద్ధం, అమెరికాలో సెక్స్ అనేది వ్యక్తిగత విషయం” అని. ఆ మధ్య అమెరికాలోని ఒక కోర్ట్ “మోనికా లూయిన్స్కీ అని ఇతరులని సంబోధించడం తిట్టుతో సమానం” అని తీర్పు చెప్పింది. స్త్రీ-పురుష సంబంధాల గురించి ఇలాంటి అభిప్రాయాలు ఉన్న అమెరికావాళ్ళు ఇస్లామిక్ దేశాలవాళ్ళకి శ్రీరంగ నీతులు చెపుతున్నారు. ఇండియాలో స్త్రీలపై జరిగే అకృత్యాల గురించి పాశ్చాత్య పత్రికలు వ్రాయనే వ్రాయవు. కాశ్మీర్‌లో మొన్నటి వరకు ప్రభుత్వ రికార్డ్‌లలో భర్త చనిపోయిన స్త్రీలని రండా (అక్రమ సంబంధం పెట్టుకున్న స్త్రీ అని అర్థం వచ్చే పదం) అనే రిఫరెన్స్‌తో వ్రాసేవాళ్ళు. హిందూత్వవాదులకి అమెరికా సామ్రాజ్యవాదంపై మౌలిక వ్యతిరేకత ఏమీ లేదు. కనుక హిందూ సమాజంలో స్త్రీలని ఎంత చెత్తగా చూసినా పాశ్చాత్య మీడియావాళ్ళు పట్టించుకోరు. అలాంటివే ఇస్లామిక్ సమాజాలలో జరిగితే మాత్రం ఇస్లామిక్ దేశాలలో స్త్రీలని మనుషులలాగ చూడడం లేదంటూ పాశ్చాత్య పత్రికలు పెద్ద గోల పెట్టేస్తాయి.
@వీరూ, ఒకప్పుడు సోవియట్ సమాఖ్యకి వ్యతిరేకంగా అఫ్ఘనిస్తాన్‌లోని ఇస్లామిక్ చాంధసవాదులకి డాలర్లూ, ఆయుధాలూ పంచి పోషించింది అమెరికానే. http://a-l-o.maoism.ru లో ఈ చరిత్ర వ్రాసి ఉంది. అమెరికా పెంచిన పాములే తిరిగి అమెరికా మీదకి పడగలు ఎత్తితే మనం అమెరికాని చూసి జాలిపడాలా?
పెట్టుబడిదారీ వ్యవస్థలో వ్యక్తి ప్రయోజనాలే ప్రాథమికం. దాని ముందు సామాజిక అంశాలు సెకండరీ విషయాలు. అమెరికా కేవలం స్త్రీల హక్కుల పరిరక్షణ కోసం అఫ్ఘనిస్తాన్‌పై దాడులు చేస్తోందని అంటే పెట్టుబడిదారీ వర్గానికి చెందినవాళ్ళు కూడా నమ్మరు.
ఆఫ్ఘన్ దురాక్రమణ సామ్రాజ్యవాద దురాక్రమణే. ఈ రోజు ప్రపంచంలో సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అనేక రూపాలలో వ్యతిరేకత ఎదురవుతూనే ఉంది. ఇట్లాంటి వ్యతిరేకతలలో తాలిబాన్ పోరాటం ఒకటి. తాలిబాన్ పోరాటం అనగానే కరుడు కట్టిన ఇస్లాం మత చాందసవాదులు మాత్రమే చేస్తున్న పోరాటంగా కూడా నేను అనుకోవడం లేదు. అది వారి నాయకత్వంలో కొనసాగుతున్నప్పటికీ దానిలో భాగంగా పోరాడుతున్నది సామాన్య ఆఫ్ఘాన్ ప్రజలు.
అమెరికా చేసిన దురాక్రమణకు, మారణ కాండకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు తమకు అందుబాటులో ఉన్న భావజాలంతోనూ, సంస్థతోనూ(తాలిబాన్) ఐడేంటిఫై అవడం వల్ల అక్కడ తాలిబాన్‌కు ఇంతటి బలం చేకూరింది. తాలిబాన్ స్థానంలో మరొకటి ఉండి ఉన్నా ఇదే జరిగేది. తాలిబాన్ల నాయకత్వంలో పోరాడాల్సి రావడం ఆఫ్గాన్ ప్రజలకు చరిత్ర విధించిన విషాద పరిమితి.
అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది, తాలిబాన్ వంటి వాటికి సామ్రాజ్య వాదంతో పోరాడడానికి కావలసిన అవగాహన గానీ, అవసరం గానీ ఉండవు. తమ భూభాగంలోనికి మరొకరు రావడం పట్ల ఉండే వ్యతిరేకతతో మాత్రమే తాలిబాన్ అమెరికాకు వ్యతిరేకంగా పోరాడుతోంది. ఇది దానికున్నకారణం. ఒక్క మాటలోఆఫ్ఘాన్ పోరాటాన్ని వర్తమాన చరిత్రతో గత చరిత్రకు చెందిన సామాజికశక్తి తలపడుతున్న సంక్లిష్టమైన సందర్భంగా చెప్పుకోవాలి. ఇట్లా చరిత్రలోని సామాజిక శక్తులు పునరావృతం కావడం సామ్రాజ్వాద యుగపు ప్రత్యేక లక్షణంగా కూడా గుర్తించాల్సి ఉంటుంది.
ఆలోచిస్తే అనేక జాతుల సముదాయంగా ఉన్న ఆఫ్ఘాన్ ప్రజలందరిని కలుపుకొని పోరాడగలిగినంత భావ సామరస్యం తాలిబాన్ వంటి వాటి నుండి ఆశించడం కష్టం. ఇంకా అక్కడి ప్రజాస్వామిక వాదుల పట్ల తాలిబాన్ ఏ వైఖరిని ప్రదర్శీస్తుందన్నది కూడా ఆలోచించాల్సిన విషయం.
ఇవన్నీ తాలిబాన్లకున్న పరిమితులు. అంతర్గతంగా ఇలా ఉన్నప్పటికీ ప్రపంచానికంతటీకీ ముప్పుగా ఉన్న అమెరికా సామ్రాజ్యవాదానికి తమ పరిమితులతోనే ఎదుర్కోబూనడం ప్రస్తుత పరిస్థితులలో ఆహ్వానించదగ్గ విషయం. అయితే ఆ పోరాటానికి మద్దతునివ్వడం అనేది దాని తప్పులతో సహా కలిసి నడవడమే అవుతుంది. ఈ చర్య మావోయిస్టులతో సహా మరే ప్రజాస్వామిక వాదీ చేసినట్లుగా నాకు తెలియదు. ఆఫ్ఘాన్ ప్రజల మీద సామ్రాజ్య వాద దాడిని ఖండించడం జరిగింది. ఆఫ్ఘన్ ప్రజలు చేస్తున్న పోరాటం పట్ల తమ తమ సానుభూతిని వ్యక్తం చేయడం మాత్రమే జరిగింది. హమాస్ నాయకులను దారుణంగా చంపినపుడు ఆ దాడిని కమ్యునిస్టులు, ప్రజాస్వామిక వాదులు ఖండించారు. హమాస్ పోరాటానికి మద్దతు తెలపలేదు.
ఇక రెండవది మీరు జాతీయ వాదంతో మీరు తెచ్చిన పోలిక ఆఫ్ఘాన్‍లో జరుగుతున్న సంఘటనలలో దేని గురించి మాట్లాడాలి దేనిగురించి మాట్లాదకూడదన్న దృష్టితో రాసినది. ఈ సందర్భంగా ప్రజల మధ్య చీలికలు తెచ్చే వైఖరితో ఉండకూడదని కూడా అన్నారు. మంచిదే. కానీ ప్రజలు చీలిపోకుండా, ప్రజల మధ్య ఉన్న వైరుధ్యాలతో సామరస్యంగా ప్రవర్తించగల ప్రజాస్వామిక వైఖరితో మెలగాల్సిన బాధ్యత తాలిబాన్ల మీద ఉంది.ఇదే తాలిబాన్లకు లోపించిందని నేను మరలా చెపుతున్నాను. మీరు జరగాల్సిన మంచి గురించి మాట్లాడుతున్నారు. నేను నాయకత్వం వహించే శక్తులకు ఉండాల్సిన లక్షణాలను గురించి మాట్లాడుతున్నాను. అమెరికాకు వ్యతిరేకంగా పోరాడుతున్నప్పటికీ తాలిబాన్‍కు ఉండకూడని లక్షణలు ఉన్నాయి కాబట్టే మద్ధతులాంటి పెద్ద మాటలను ఆలోచించి ఉపయోగించాలని కోరుతున్నాను.
Thanks for the long response. I agree to your version of horizontal and vertical relation. I thougth the other way and you made it clear. Appreciate your time in explaining in detail.
Having said that, I agree with Veeru – misleading linkage of this issue with indian national movement and the caste system.
Only time can say which issue is the biggest of the other and this too changes with time.
ఒక్కసారి వెనక్కి తిరిగి చరిత్రను చూస్తే – ఇప్పటివరకు ఆర్థిక కారణాల వల్ల ఎంత మంది చనిపొయారొ అంతే మంది మతం వల్ల కూడా చనిపోయారు.
తెలుగు లో ఆల్టర్నేట్ న్యూస్ ప్రచురించే/చర్చ జరిగే అతి తక్కువ వేదికల్లో ఇదీ ఒకటి.
ఏవరైనా ‘ఆల్టర్నేట్’ కి సరైన తెలుగు అనువాదం చెబుతారా? గూగుల్ అనువాదం లొ వైకల్పిక అని ఉంది. వైకల్పం = వికల్పం = తప్పుదారి పట్టించటం లా తోస్తోంది.
ప్రత్యామ్నాయ సమచారం అంటే బాగుంటుందా?
వీరు గారు
మీకు అమెరికా పట్ల ఆరాధన ఉంటే అది మీ ఛాయిస్. ప్రపంచ దేశాలపై అమెరికా చేసే దుర్మార్గాలనూ, దాని విదేశాంగ దుర్నీతినీ చూడలేకపోతే అది మీ యిష్టం. కానీ అమెరికా సామ్రాజ్యవాదానికి నేను ఎందుకు వ్యతిరేకమో స్పష్టంగా చెప్పాక కూడా నాది అమెరికా విద్వేషంగా చెప్పడానికి ఉబలాటపడడాన్ని బట్టి మీ ఉద్దేశ్యం తెలుస్తున్నది.
ప్రపంచంలో ఉన్న అశాంతికి, యుద్ధాలకు, టెర్రరిజానికి, కుట్రలకు అమెరికాయే ప్రధాన కారణం. లాటిన్ అమెరికా దేశాలకు ‘లాస్ట్ డికేడ్’ ప్రసాదించి నిత్యం నియంతృత్వాలను పెంచి పోషించిన, మధ్య అమెరికా దేశాల్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన, ఆఫ్రికాలో జాతి విద్వేషాలు రెచ్చగొట్టి సామూహిక హత్యాకాండలను ప్రోత్సహించి భూములు, వజ్రాలు, ఖనిజాలను దోచుకెళ్తూ, దక్షిణ చైనా సముద్రాన్ని నిత్యాగ్నిగుండంగా మార్చి, మధ్య ప్రాచ్యంలో అరబ్బుల ఆయిల్ కోసం సౌదీ, జోర్డాన్, కతార్, యు.ఏ.ఇ, యెమెన్, ఒమన్, బహ్రెయిన్ లలో అత్యంత అభివృద్ధి నిరోధకరమైన ఫ్యూడల్ మతఛాందస రాజులకు, షేక్ లకు మద్దతు ఇచ్చి కాపాడుతున్న అమెరికా దుష్ట నీతికి మీరు ఇస్తున్న మద్దతు పచ్చి అభివృద్ధి నిరోధకరం. అమెరికా దురాక్రమణ నీతికి మీరు ఇస్తున్న మద్దతు ఆధునిక ప్రజాస్వామ్య సూత్రాలకు బద్ధ విరుద్ధం. స్వతంత్ర దేశాల సార్వభౌమాత్వ హక్కులను కాలరాచే సామ్రాజ్యవాద దుర్నీతికి మీరు ఇస్తున్న మద్దతు మీ స్ధాయిలో నాగరికతా విలువలకు పాతర.
నేను చెప్పిన విషయాలను ఉన్నది ఉన్నట్లు చూడకుండా వక్రీకరించడం మీకు ఇష్టం లాగుంది. తాలిబాన్ ఆఫ్ఘనిస్ధాన్ ని అసలే పాలించలేదని నేనెక్కడన్నాను? పైగా తాలిబాన్ ని అమెరికా overthrow చేసిందంటూ సంతోషమా? ఆఫ్ఘనిస్ధాన్ లో అమెరికా ఎవరిమీద యుద్ధం చేస్తున్నట్లు? నిద్రపోతున్నవారిని లేపవచ్చు గానీ, మీలాగా నిద్ర నటిస్తున్నవారిని లేపడం ఎవరికీ సాధ్యం కాదు. తాలిబాన్ ని ద్వేషించడానికీ, అమెరికాని మెచ్చుకోవడానికి మీ కారణాలు చెప్పుకుని అవే అంతిమం అన్నట్లుగా మీరు చేసిన విశ్లేషణ మిమ్మల్ని మీరు తప్పుదారి పట్టించుకోవడమే కాక పాఠకులకి కూడా మీరు తప్పుడు సమాచారం ఇస్తున్నారు.
తాలిబాన్ ఆఫ్ఘన్ లో మాత్రమే అధికారంలో ఉంది. తన దేశ ప్రజలకు మాత్రమే అది అభివృద్ధి ని(వి)రోధి. అమెరికా అలా కాదు. పైన చెప్పినట్లు అమెరికా ప్రపంచంలోని అనేక దేశాల్లో అనేక ఆర్ధిక, సామాజిక వెనుకబాటుతనానికీ, అసంతృప్తులకూ, తిరుగుబాట్లకూ మూల కారణం. దానిని గుర్తించలేకపోతే అది మీ గుడ్డితనం. దానిని మీవరకే పరిమితం చేసుకోవడం శ్రేయస్కరం.
మీ అభిప్రాయాలూ మీరు చెప్పడం వేరు మీ అభిప్రాయాలని నాపైన, పాఠకులపైనా రుద్దడానికి ప్రయత్నించడం వేరు. మీ వ్యాఖ్యలో రెండోదానికే మీరు ప్రయత్నించారు. నా ఎజెండాను కూడా మీరే నిర్ణయించేసి మీ దురుద్దేశ్యాన్ని చాటుకున్నారు. లిమిట్ అంటూ మీ భావ దారిద్ర్యాన్ని ప్రకటించుకుని మీ పరిమితిని అధిగమించారు. ఒకపక్క తాలిబాన్ షరియా లా అంటూ మొసలి కన్నీళ్లు కార్చి మీదైన షరియా లా తో నా అభిప్రాయాలకు పరిమితి విధిస్తున్నారు. ఆఫ్ఘన్ మహిళల పట్ల మీ సానుభూతి ఎంత నిజమో మీ యీ అప్రజాస్వామిక ధోరణే చెబుతున్నది. మీలాంటివారికి ప్రజాస్వామిక కబుర్లు చెప్పడమే తప్ప దాన్ని పాటించడం అసలే ఇష్టం ఉండదు. లేదంటే ఒక పక్క తాలిబాన్ షరియా లాను అమెరికా నిరోధించిందని చెబుతూ సౌదీ, కతార్, కువైట్, పాక్ లాంటి పచ్చి మతఛాందస, అభివృద్ధి నిరోధకర రాజ్యాలకు అమెరికా ఇస్తున్న మద్దతు చూడనట్లు నటించగలరా?
తాలిబానిజానికి నా మద్దతు లేదు, తాలిబాన్ అమెరికా వ్యతిరేక పోరాటానికే నా మద్దతు అని స్పష్టంగా చెప్పాను. కానీ తాలిబాన్ కి నా పూర్తి మద్దతు ఉందని చెప్పడమే మీకు ఇష్టం. లేకుంటే మీ అమెరికా భక్తిని సమర్ధించుకోవడం సాధ్యం కాదు కదా. మీకు నిజాయితీ ఉంటే అమెరికా దురాక్రమణ వల్ల ఆఫ్ఘన్ స్త్రీలే కాక ప్రజలంతా ఎదుర్కొంటున్న దాడులు, అణచివేతా, దరిద్రం, అబధ్రత.. వీటి గురించి ముందు ఆలోచించండి. వాటికి కారణం ఎవరో చెప్పండి. ఆ కారణాన్ని ఎలా నిర్మూలించవచ్చో చెప్పండి. ఆ తర్వాతే ఆఫ్ఘన్ స్త్రీలపట్ల మీ సానుభూతికి అర్ధం ఉంటుంది. నిజానికి మీకు ఆఫ్ఘన్ స్త్రీలపై సానుభూతి ఏమీ లేదు. ఆ పేరుతో అమెరికా దుర్నీతికి మద్దతు ఇవ్వడమే మీ లక్ష్యం.
వ్యాఖ్య పేరుతో నా ఆర్టికల్ ని వక్రీకరించడానికి మీరు చేసిన ప్రయత్నం తీవ్ర అభ్యంతరకం.
నాగరాజు గారూ
తాలిబాన్ గురించి చాలా సమగ్రంగా, చక్కగా విశ్లేషించారు. మీ విశ్లేషణతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ముఖ్యంగా:
“తాలిబాన్ల నాయకత్వంలో పోరాడాల్సి రావడం ఆఫ్గాన్ ప్రజలకు చరిత్ర విధించిన విషాద పరిమితి.”
అన్న వాక్యం మీ వ్యాఖ్యకు హైలైట్. ఆఫ్ఘన్ ప్రజల పరిస్ధితిని ఈ వాక్యం చక్కగా వివరిస్తోంది.
తాలిబాన్ కి సామ్రాజ్యవాద వ్యతిరేక అవగాహన ఉంటుందని నాకూ భ్రమలేవీ లేవు. ఆఫ్ఘన్ లో ఆధిపత్య వర్గాల్లోని కొన్ని గ్రూపులకి తాలిబాన్ ప్రతినిధి మాత్రమే. అది ప్రజల ప్రతినిధి కాదు. భారత దేశంలో కాంగ్రెస్ జాతీయ పోరాటానికి భారత ప్రజలు మద్దతు ఇవ్వక తప్పని పరిస్ధితి ఉన్నట్లే ఆఫ్ఘన్ లో తాలిబాన్ కు అక్కడి ప్రజలు మద్దతు ఇవ్వకుండా ఉండలేని పరిస్ధితి. అది ప్రజల ప్రతినిధి కాకపోయినా అమెరికాకి వ్యతిరేకంగా అది చేస్తున్న పోరాటంలో ప్రజల ప్రయోజనాలున్నాయి. అందుకే తాలిబాన్ పోరాటానికి మద్దతు ఇవ్వాల్సిన పరిస్ధితి.
ఆఫ్ఘన్ లోని అనేక జాతులను ఏక తాటిపై నిలిపి అమెరికా దురాక్రమణపై పోరాడడానికి ప్రస్తుతానికి అక్కడ మతమే ముఖ్య సాధనంగా అందుబాటులో ఉంది. ఫ్యూడల్ భావాల్లో కూరుకుపోయి ఉన్న ఆఫ్ఘన్ ప్రజలను ఐక్యం చెయ్యడానికి ప్రజాస్వామిక చైతన్యం అందుబాటులో లేదు. అందువల్లనే తాలిబాన్ లాంటి ఛాందస సంస్ధలకు ఆదరణ దొరుకుతోంది.
ఆఫ్ఘన్ ప్రజాస్వామ్యవాదుల బలం ఏపాటిది? గతంలో ఆఫ్ఘన్ విప్లవకారులకి కూడా మతసంస్ధలతో కలిసి పనిచేయక తప్పలేదని ప్రవీణ్ గారిచ్చిన లింక్ ద్వారా తెలుస్తున్నది.
తాలిబాన్, హమాస్ పోరాటాలకు మద్దతు ఇవ్వడం అంటే అది పోరాటానికి మాత్రమే మద్దతు. ఇప్పటి పరిస్ధితుల్లో బైటినుండి మనం చేయగలిగింది అంతవరకే. ఆఫ్ఘన్, పాలస్తీనా లలో మనం పౌరులుగా ఉన్నట్లయితే అపుడు ఆ సంస్ధలకు మద్దతు ఇవ్వడం కాకుండా సొంతగా పోరాటం చేస్తూ ప్రజలను కూడగట్టడంపైన కేంద్రీకరిస్తాము. ఆ కృషిలో భాగంగా తాలిబాన్, హమాస్ ల ప్రభావం నుండి ప్రజలను బైటికి తేవడం పైన కూడా కేంద్రీకరిస్తాము. అంతిమంగా దేశాన్ని విముక్తి చేయడంపైన కేంద్రీకరిస్తాము. కానీ మనం అక్కడి పౌరులం కాదు గనక పోరాటానికి మద్దతు ప్రకటించడం వరకే చేయగలం. ఇంకా, మహా అయితే బలాబలాల విశ్లేషణ వరకూ చేయగలం.
తాలిబాన్ వద్ద ప్రజాస్వామిక వైఖరి ఉండే అవకాశం లేదు. ముస్లిం మతాన్ని సాధనంగా వినియోగిస్తూ తమ వర్గ ప్రయోజనాలు నెరవేర్చుకోవడం తాలిబాన్ చేస్తుంది. ఆ రీత్యా చూసినా ప్రజాస్వామిక వైఖరి చూపడం వల్ల దానికి లాభం. అయితే తాలిబాన్ కూడా అమెరికా, పాకిస్ధాన్ ల పరోక్ష మద్దతు ద్వారా అధికారంలోకి వచ్చిందన్న కోణాన్ని గమనిస్తే తాలిబాన్ పైన కూడా అనుమానాలు కలుగుతాయి. ఆ అనుమానాలకు ఇప్పటి పరిస్ధితుల్లో సరైన ఆధారాలు లేనందున వాటిని ప్రస్తావించలేదు.
చక్రిగారు, ఆల్టర్నేట్ కి తెలుగు అర్ధం నాకు తెలిసినంతవరకూ ‘ప్రత్యామ్నాయం’ .
అమెరికన్ సామ్రాజ్యవాద జియో పాలిటిక్స్ లో భాగంగా సంస్కృతుల మధ్య పోరాటం అన్న భావన ముందుకొచ్చింది. ఈ భావన అమెరికా ఆయిల్ అవసరాలకు బాగా సరిపోతుంది. అది ఇస్లాంను అనాగరికమైనదిగా ప్రచారం చేస్తోంది. నిజానికి ఇస్లాం చాందసవాద శక్తుల పట్ల అమెరికా తన ప్రయోజనాల ప్రాతిపాదికగానే కొన్ని చోట్ల వ్యతిరేకంగా మాట్లాడుతుంది. మరికొన్ని చోట్ల భుజాన వేసుకొని నడుస్తుంటుంది. ఇది అమెరికా వైఖరి.
ముస్లీం జనాభా అధికంగా ఉన్న దేశాలలో, అక్కడ అమెరికాసామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రభుత్వాలనూ, ప్రజాస్వామిక సంస్థలనూ బలహీనపరచడానికి అమెరికా ఇస్లాం మత చాదసవాద శక్తులను బలపరిచింది. బలపరుస్తున్నది. పాలస్తీనాలో అరాఫత్ నాయకత్వంలో ఉన్న విమోచన సంస్థను బలహీన పరచడానికి హమాస్‍ను ఇజ్రాయిల్, అమెరికా పెంచి పోషించాయి. పి ఎల్ వొ అనేక రకాలుగా బలహీన పడిన తర్వాత, అక్కడ హమాస్ బలమైన శక్తిగా తయారై ఇజ్రాయిలుకు, అమెరికాకు పక్కలో బల్లెమైంది. ఇలాంటి ఉదాహరణలు చరిత్రలో కోకొల్లలు. దీని బట్టి అర్థం చేసుకోవలసిన విషయం ఒకటుంది.
చాందసవాద శక్తులకు ప్రజల మద్య ఉన్న వైరుధ్యాలను పరిష్కరించి సమీకృతం చేయగల శక్తి చాలా తక్కువ. ఇది సామ్రాజ్య వాద శక్తులతో తనకున్న పరిమితులతో మాత్రమే పోరాడగలుగుతుంది. అంతేకాక భావజాల రీత్యా కూడా ఇది వర్తమాన ప్రపంచంలో బలహీనమైన శక్తి. ప్రజాస్వామిక శక్తులతో పోరాడడం కన్నా తాలిబాన్, హమాస్ లాంటి వాటితో పోరాడడం సాపేక్షికంగా సామ్రాజ్యవాదానికి తేలిక. ఇది అమెరికా తన గత పరాజయాల నుండి నేర్చుకున్న పాఠం. తాలిబాన్ వంటి పోరాటాలను అర్థం చేసుకోవడానికి ఇది ఉపయోగపడే కోణం.
అరబ్ దేశాలలో విప్లవం పేరుతో ఇటీవల జరిగిన సంఘటనలు చాలా సంక్లిష్టమైనవి. వీటి సమీకరణలు గందరగోళ పరిచే విధంగా కూడా ఉన్నాయి. ప్రజాస్వామిక పోరాటాలు అంతటా బలహీన పడిన ప్రస్తుత తరుణంలో మీడియా ఏది చెబితే అది నిజమని నమ్మే వాతావరణం కూడా ఉంది. కాబట్టి నిర్వాహకులు ఓపికతో, గందరగోళానికి తావివ్వని విధంగా ఇలాంటి విశ్లేషణలను నిర్వహించాల్సి ఉంటుంది.