మలాల యూసఫ్జాయ్: అమెరికా దురాక్రమణ యుద్ధ వాస్తవాలు వాస్తవాలే, ‘కుట్ర సిద్ధాంతాలు’ కాదు


మలాల యూసఫ్జాయ్ -ఫొటో: నేషనల్ పోస్ట్

కుట్రలు లేనిదే అమెరికా ప్రపంచాధిపత్యం నడవదు. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలతో పాటు యూరప్ లో కూడా అమెరికా జరిపిన, జరిపిస్తున్న కుట్రల సమాచారం బైటికి వచ్చినప్పుడల్లా, వాటిని ‘కుట్ర సిద్ధాంతాలు’ గా పశ్చిమ కార్పొరేట్ పత్రికలు కొట్టిపారేయడం పరిపాటి. అది వాటి అవసరం, ప్రయోజనం. అందువల్లనే ప్రత్యామ్నాయ వార్తా సంస్ధలు పూనుకుని ఈ కుట్రలను బైటికి తీస్తున్నాయి. మనం చేయవలసింది వాటిని గుర్తించడమే తప్ప అక్కడ కూడా పశ్చిమ పత్రికల ప్రచారంలో కొట్టుకుపోయి ‘కుట్ర సిద్ధాంతాలు’గా కొట్టిపారేస్తే నిజాలు బైటికి వచ్చే మార్గమే లేదు.

అమెరికా, యూరప్ దేశాలు చేస్తున్న కుట్రలను గుర్తించడం వదిలిపెట్టి, కుట్రలు గురించి చెప్పడాన్ని ‘కుట్ర సిద్ధాంతాలు’ గా కొట్టిపారేయడం సరికాదు. ఏ పేరుతో కొట్టేసినా అది అంతిమ పరిశీలనలో అమెరికా తదితర పశ్చిమ దేశాల కుట్రలకు మద్దతుగా తేలుతుంది. సామ్రాజ్యవాదం గురించి అవగాహన ఉన్నవారు ఇటువంటి ఘటనలను జాగ్రత్తగా పరిశీలించక పోతే ఇంకెవరు పరిశీలిస్తారు?

తక్షణ పరిశీలనలో మలాల హత్యా ప్రయత్నం దుర్మార్గమే. కానీ ఆ ఒక్క సంఘటనని వెంటనే ఖండించాలి, మిగిలినవన్నీ తర్వాత అంటే… మలాల చుట్టూ ఎన్ని కుట్రలు ఉన్నా మాకు అనవసరం, ఒక బాలికపై హత్యాప్రయత్నం తప్పా కాదా అంటే…  అందులో న్యాయం ఉన్నదా? మలాల హత్యని ఖండించామన్న తృప్తి మనకి వెంటనే కలిగితే కలగొచ్చు గానీ, దశాబ్దకాలంగా ఛిద్రమైతున్న ఆఫ్-పాక్ ప్రజల బతుకుల మాటేమిటి? మలాల ఘటన పశ్చిమ కార్పొరేట్ పత్రికలు పెద్ద ఎత్తున కవర్ చేస్తే దాన్ని ఖండిస్తున్నాం. కానీ లక్షలాది సామాన్య జనం దురాక్రమణ యుద్ధంలో ఉత్తి పుణ్యానికి చచ్చిపోయినా ఆ హత్యల్ని అవే పశ్చిమ పత్రికలు దాచిపెట్టాయి. దీన్ని ఖండించడం, ప్రశ్నించడం మనకి ఎప్పుడు సాధ్యం అవుతుంది?

లాడెన్ అనే ఒక వ్యక్తిని అడ్డుపెట్టుకుని (ఆయన కూడా అమెరికా సాకినవాడే అయినా) ఒక స్వతంత్ర దేశంపై దాడి చేసి లక్షలాది మందిని చంపేసి అది ‘టెర్రరిజం పై యుద్ధం’ అంటే మనం నమ్మేస్తాం. లాడేన్ సంస్ధ ఆల్-ఖైదాయే ప్రపంచంలో జరిగే టెర్రరిజం అంతటికీ కారణం అంటే నమ్మేస్తాం. ఆల్-ఖైదా పచ్చినెత్తురు తాగే నరహంతకులకు నిలయం అంటే నమ్ముతాం. మళ్ళీ అదే ఆల్-ఖైదాతో కలిసి సెక్యులర్ గడ్డాఫీ ప్రభుత్వాన్ని కూల్చి అరాచక రాజ్యాన్ని స్ధాపించి అది కూడా ప్రజాస్వామ్యమే అన్నా నమ్మేస్తాం. ప్రపంచవ్యాపితంగా అనేక టెర్రరిస్టు సంస్ధలని పెంచి పోషించి అనేక స్వతంత్ర జాతీయ ప్రభుత్వాలని అమెరికా కూల్చిందని చెబితే అవన్నీ కుట్ర సిద్ధాంతాలని కొట్టిపారేస్తాం.

మధ్య ప్రాచ్యంలో ఏకైక సెక్యులర్ రాజ్యం అయిన సిరియాలో కీలుబొమ్మ ప్రభుత్వాన్ని నిలపే లక్ష్యంతో అక్కడి జనాన్ని ఊచకోత కోస్తూ, అధ్యక్షుడు బషర్ కూడా చావాలి అంటే తలూపేస్తాం. లిబియా, ఆఫ్ఘనిస్ధాన్, పాకిస్ధాన్ మొదలయిన దేశాలనుండి ఆల్-ఖైదా టెర్రరిస్టులను సేకరించి సిరియాలో దింపి అమెరికా, యూరప్ లు కిరాయి తిరుగుబాటు నడిపిస్తున్నాయని చెప్పే వార్తలేవీ మన దృష్టికి రావు.  సిరియా ప్రజలపై సాగుతున్న ఊచకోతలను ఖండించే అవకాశం, అవసరం మనకి ఎప్పుడూ రాదు. పైగా సిరియాలో టెర్రరిస్టుల ఊచకోతకి బషర్ నే బాధ్యుడిని చెయ్యడానికి మనకి ఎంతో ఉబలాటం. దశాబ్దాల తరబడి లిబియా, సిరియాలని పాలించిన దేశాధ్యక్షులు ఉన్నట్లుండి తన స్వంత ప్రజలని ఊచకోత కోయడం మొదలుపెట్టారని పశ్చిమ పత్రికలు రాస్తే నమ్మడానికి మనకి అభ్యంతరం ఏమీ ఉండదు.

వీటన్నింటిలో గతం ఏమిటి, వర్తమానం ఏమిటి ఈవార్తలు ఎందుకు వస్తున్నాయి? ఎవరి ప్రయోజనం కోసం వస్తున్నాయి అని ఆలోచించే తీరిక, ఓపిక మనకి ఉండదు. అందులో తప్పు లేదు. కానీ లాడేన్, సద్దాం హుస్సేన్, గడ్డాఫీ, బషర్ ఆల్-అస్సాద్… వీళ్ళ ‘పచ్చినెత్తురు తాగే’ కధలు చదివి, విని ఖండించడానికీ, వీలయితే విద్వేషం పెంచుకుని ప్రచారం చెయ్యడానికి మనకి బోలేడు తీరిక ఓపిక దొరకడమే ఆశ్చర్యం. పశ్చిమ దేశాల ప్రయోజనాల కోసం, వారి కుట్రలన్నీ ప్రపంచ ప్రజల ప్రయోజనం కోసమే అని నమ్మడం కోసం మన ఉద్వేగాలనీ, భావుకతనూ, ఆగ్రహాలనీ ఖర్చుపెట్టుకోవడానికి కూడా సిద్ధపడతాం.

ఒక్క క్షణం ఆగి చూడండి. వీటన్నింటిలో ఎవరి ప్రయోజనం ఉంది? అమెరికా తదితర పశ్చిమ దేశాల ప్రయోజనాలే కదా? మరి అవన్నీ ఎక్కడ లెక్కకు వస్తున్నాయి? లక్షల మంది ఆఫ్ఘన్, ఇరాక్, పాకిస్ధాన్, లిబియా ల ప్రజలు దిక్కూ, మొక్కూ లేకుండా కనీసం చచ్చారో లేదో కూడా తెలియకుండా చస్తుంటే రాని లెక్క ఒక్క మలాలకే రావడం ఏమిటి? దిక్కులేని చావుల వెనుక అమెరికా, యూరప్ లు ఉన్నాయి కనుక లెక్కకురావు, మలాల వెనుక ఇంకా రుజువుకాని తాలిబాన్ హస్తం ఉంది కనుక అది మాత్రం లెక్కకు వస్తుంది! ఇది న్యాయమేనా? ఈ ప్రశ్న అడిగితే అది తాలిబాన్ కి సానుభూతా? లేదా మలాల హత్యా ప్రయత్నానికి మద్దతా? లేక కుట్ర సిద్ధాంతాలా?

తాలిబాన్ ఒక ప్రభుత్వం నడుపుతుంటే, దానికింద ఒక రాజ్యం అంటూ ఏడిస్తే అప్పుడు “Taliban and their atrocities” అనే ఫ్రేజ్ కి అర్ధం ఉంటుంది. తాలిబాన్ పాలనలో మహిళలపై అత్యాచారాల గురించి బాధపడి ఖండిస్తే దానికి ఒక అర్ధం. కానీ ఇప్పటి పరిస్ధితి ఏమిటి? ఆఫ్ఘనిస్ధాన్ని తాలిబాన్ ఏలడం లేదు. కనీసం పాక్ తాలిబాన్ కూడా నార్త్ వజీరిస్తాన్, ఖైబర్ ఫక్తూన్వా లలో ప్రభుత్వాన్ని నడపడం లేదు. ఆఫ్-పాక్ తాలిబాన్ లు రెండూ ఇప్పుడు పోరాట సంస్ధలు. ప్రపంచ పోలీసు పెత్తనాన్ని ప్రశ్నించడమే కాక  ఎదిరించి నిలబడి పోరాడుతున్న సంస్ధలు. అమెరికా సైనిక స్ధావరం ఏర్పాటు చేయడానికి అనుమతి ఇచ్చి తమ దేశాన్ని అమెరికా జియో-పోలిటికల్ వ్యూహానికి అనుగుణంగా వినియోగించడానికి తాలిబాన్ ఒప్పుకోకపోవడం వల్లనే ఆ దేశాన్ని దురాక్రమించారు. దురాక్రమణకి వ్యతిరేకంగా నిలబడ్డ తాలిబాన్ కి మద్దతు ఇవ్వాలా? లేక ప్రపంచాధిపత్యం కోసం వరుసగా దేశాల్ని కబళిస్తూ  ఇండియాని కూడా ఆఫ్ఘన్ దాడిలో కలవాలని కోరిన అమెరికా, యూరప్ లకు మద్దతు ఇవ్వాలా?

ఆఫ్ఘనిస్ధాన్ కి సైన్యాన్ని పంపి దురాక్రమించడమే కాక, పాకిస్ధాన్ లో కూడా డ్రోన్ దాడులు చేసి జనాన్ని చంపుతున్న పశ్చిమ దేశాల దుర్మార్గం ఒకవైపు ఉంటే, మరోవైపు పరిమిత శక్తితో రాకాసుల దురాక్రమణకి వ్యతిరేకంగా పోరాడుతున్న తాలిబాన్ ఉంది. నార్త్ వజీరిస్ధాన్, స్వాట్ లోయ లు ఆఫ్ఘన్, పాకిస్ధాన్ తాలిబాన్ (ఇదే తెహ్రీక్-ఏ-తాలిబాన్) లకు ఆశ్రయం ఇస్తున్నందునే ఆ ప్రాంతాల్లో డ్రోన్ దాడులు జరుగుతున్నాయి. సోమాలియా, యెమన్ లలో కూడా డ్రోన్ దాడులు జరుగుతున్నాయి. ఈ డ్రోన్ హత్యల్లో చస్తున్నవారి వార్తలను మనం ఎక్కడన్నా చదివామా? ఎక్కడా చదవనపుడు వాటిని గుర్తించి ఖండించే అవకాశం మనకి ఎక్కడ ఉంటుంది? తెలుగు బ్లాగుల్లాంటి పరిగణించడానికి కూడా వీల్లేని అతి కొద్ది విస్తృతి  ఉన్న చోట కూడా తాలిబాన్ ఛాందసాలనే ఖండిస్తూ కూచుంటే ఈ బ్లాగులు కూడా పశ్చిమ దేశాల ప్రభావంలో ఉన్నట్లు కాదా? ఇక పశ్చిమ దేశాల దుర్మార్గాలకి ప్రచారం ఎక్కడ ఉంటుంది?

మలాలపై తాలిబాన్ చేసిన దాడి బాలికల విద్య పై చేసినది కాదు. తాము ఆశ్రయం పొందుతున్న స్వాట్ లోయలో కూడా పశ్చిమ దేశాల దురాక్రమణకి అనుకూలంగా జరుగుతున్న పరోక్ష ప్రచారం పై చేసిన దాడి. ఆ దాడిని అలాగే చూడాలి. కాకపోతే మలాల ఇందులో ఇక పావు. అంతర్జాతీయ రాజకీయాల్లో లక్షలాది మంది దురాక్రమణ యుద్ధ బాధితుల చావులకి ఎంత విలువ ఉన్నదో, మలాల ప్రాణాలకి కూడా అంతే విలువ ఉంది. మలాల ప్రాణానికి ఉన్న విలువ హైప్ అయితే, ఆఫ్ఘన్, ఇరాక్, లిబియా, సోమాలియా, సిరియా, యెమెన్ లలో లక్షలాది సామాన్య ప్రజల చావులకి ఉన్న విలువ సోదిలోకి కూడా రాలేదు. ఉత్తర, దక్షిణ ధృవాలుగా ఉన్న ఈ రెండు తరగతుల చావులకూ అంతిమ లబ్దిదారులు అమెరికా, యూరప్ లే కావడం గమనార్హం.

మలాల హత్యా ప్రయత్నానికి విలువ ఇవ్వడం అంటే తాలిబాన్ సామ్రాజ్యవాద వ్యతిరేక ప్రతిఘటనకి విలువ ఇవ్వకపోవడం. అమెరికా దుర్మార్గాల తీవ్రత తెలియనివారికి, లేదా ఆ తీవ్రతను గుర్తించనివారికి ఈ వాదన నచ్చదు. దీనిని తాలిబాన్ మత ఛాందసత్వానికి ఇస్తున్న మద్దతుగా చూస్తే అది అలా చూసేవారి ఛాయిస్ మాత్రమే. ఆధిపత్యం కోసం తెగబడుతున్న ‘అచ్చోసిన ఆంబోతు’ కీ ఉనికి కోసం తాపత్రయపడుతున్న లేగదూడకీ మధ్య తేడా చూడలేని ఛాయిస్ అది.

తాలిబాన్ ని ఖండిస్తే అది మతఛాందసత్వంపై వ్యతిరేకత మాత్రమే. దానికి చరిత్రతో పెద్దగా పనిలేదు. డ్రోన్ దాడులను ఖండించడం అన్నా, తాలిబాన్ పోరాటానికి మద్దతు అన్నా అది సామ్రాజ్యవాద వ్యతిరేకత. సామ్రాజ్యవాద వ్యతిరేకత వెనుక దశాబ్దాల సామ్రాజ్యవాద దురాక్రమణల చరిత్ర ఉంటుంది. పదుల కొద్దీ దేశాల్లోని కోట్లాది సామాన్య ప్రజల కడగళ్ళు, అవస్ధలు, చావులు సామ్రాజ్యవాద వ్యతిరేకతలో ఉంటాయి. అందు వలన ఈ రెండు వ్యతిరేకతలు ఒకటి కావు. ఈ నేపధ్యంలో అమెరికా డ్రోన్ దాడులు దుర్మార్గమే అనడానికీ మలాల పై హత్యాప్రయత్నం దుర్మార్గం అనడానికీ హస్తిమశకాంతరం ఉంది. ఈ రెండూ ఒక చోటే కనపడాలన్న డిమాండ్ లో ‘హ్రస్వ దృష్టే తప్ప దూర దృష్టి, వాస్తవిక దృష్టి లేవు’ అని చెప్పడానికి నేను సాహసిస్తున్నాను.

20 thoughts on “మలాల యూసఫ్జాయ్: అమెరికా దురాక్రమణ యుద్ధ వాస్తవాలు వాస్తవాలే, ‘కుట్ర సిద్ధాంతాలు’ కాదు

  1. మలాలా ఒబామాకి అనుకూలంగా మాట్లాడడం వల్ల ఆమెపై దాడి చేశామని పాక్ తాలిబాన్ నాయకుడు ఇహ్సానుల్లాహ్ ప్రకటించాడు. కేవలం చదువుకోవడం వల్ల దాడి చేశామని చెప్పలేదు. ఇక్కడ సినిమాలలో రాయలసీమ నుంచి వచ్చినవాడనగానే వేలిముద్ర వేసేవాడు, ఫాక్షనిస్ట్ అని ఎలా చూపిస్తారో, అక్కడ పాశ్చాత్య మీడియా కూడా అలాగే ముస్లింలని బాలికల విద్యని నిరాకరించేవాళ్ళుగా, మతం తప్ప ఏ సత్యమూ తెలియని మూర్ఖులుగా చూపిస్తుంది.

  2. తాలిబాన్ ఒక ప్రభుత్వం నడుపుతుంటే, దానికింద ఒక రాజ్యం అంటూ ఏడిస్తే అప్పుడు “Taliban and their atrocities” అనే ఫ్రేజ్ కి అర్ధం ఉంటుంది.

    Even though Pakistan govt is the supposed administration, the Taliban (Pak one, not Afghan Taliban) is the de-facto administration in the north-western Pakistan, according various popular western magazines and newspapers. Even though, they don’t officially run the govt, they control many areas. So ‘Taliban and their atrocities’ might not be an extrapolated statement. If you don’t think that Taliban doesn’t control many areas in Pakistan, its a different story.

    I don’t think any commenters defended Drone attacks or America’s draconian foreign policy. The way you’ve presented the article make it look like you’re giving significant credibility to the taliban just based on their statements.

    మనం చేయవలసింది వాటిని గుర్తించడమే తప్ప అక్కడ కూడా పశ్చిమ పత్రికల ప్రచారంలో కొట్టుకుపోయి ‘కుట్ర సిద్ధాంతాలు’గా కొట్టిపారేస్తే నిజాలు బైటికి వచ్చే మార్గమే లేదు.

    Its different from being skeptical. I’m very skeptical about many things published in the media, but being skeptical about something is far different from getting to a conclusion without any facts. If I remember correctly, you’ve described the girls parents as ‘Agents of America’ and her parents somehow planned this all along.

    ఈ డ్రోన్ హత్యల్లో చస్తున్నవారి వార్తలను మనం ఎక్కడన్నా చదివామా? ఎక్కడా చదవనపుడు వాటిని గుర్తించి ఖండించే అవకాశం మనకి ఎక్కడ ఉంటుంది? తెలుగు బ్లాగుల్లాంటి పరిగణించడానికి కూడా వీల్లేని అతి కొద్ది విస్తృతి ఉన్న చోట కూడా తాలిబాన్ ఛాందసాలనే ఖండిస్తూ కూచుంటే ఈ బ్లాగులు కూడా పశ్చిమ దేశాల ప్రభావంలో ఉన్నట్లు కాదా? ఇక పశ్చిమ దేశాల దుర్మార్గాలకి ప్రచారం ఎక్కడ ఉంటుంది?

    I don’t expect you to write a condemnation for every taliban ‘atrocity’ or violence.
    Like I said before, your article somehow made it look like you are impervious to such an attack by the taliban and gave significant importance to the Taliban statements.

    ఈ నేపధ్యంలో అమెరికా డ్రోన్ దాడులు దుర్మార్గమే అనడానికీ మలాల పై హత్యాప్రయత్నం దుర్మార్గం అనడానికీ హస్తిమశకాంతరం ఉంది. ఈ రెండూ ఒక చోటే కనపడాలన్న డిమాండ్ లో ‘హ్రస్వ దృష్టే తప్ప దూర దృష్టి, వాస్తవిక దృష్టి లేవు’ అని చెప్పడానికి నేను సాహసిస్తున్నాను.

    They’re not the same, but it boils down to ‘isolated event’ vs ‘systematic issue’. All of this outrage over the attack is because it is an isolated event and it symbolizes the current issues faced by women in pakistan (if not muslim countries all around the world).

  3. Goutham,

    First of all, This answer is not solely directed at you. It is a combined answer to you and other commenters. I see a difference between you and them based on your past comments.

    And: There is some, I hope it’s not significant, difference between how we look at Taliban. Some of your statements/opinions demonstrate this.

    You say that there is de-facto admin in NW Pak. How much this is true may also depend upon how we see the functioning of a de-facto admin. This is one thing. Other thing is, how can we assume that there is a de-facto admin of Taliban where there are military check-posts everywhere? (Actually, with reference to my article, this has no or less significance.) There may be a sort of Taliban rule but Taliban is not the sole power in that rule.

    Taliban is not a single most entity that controls the NW Pak. There is an amalgam of entities some linked to Taliban, some to Pak govt and some to Pak military. These three main groups represent different ruling socioeconomic classes. They operate with different motives and interests at a given time. They also operate with a common interest at some other time. This is the fact which illustrates that at any given point, not a single incident (let alone Malala’s which got a prominence on world scale with the help of western interests) can be described to be the handiwork of a single entity operating in NW Pak.

    In this background I can’t agree with your contention that the Malala’s incident is an isolated incident, that too when there is an ample evidence that Malala’s rise to prominence has got the sustained backing of western media as well as the US imperialist political-bureaucratic-finance capital which is waging a draconian imperialist war on the interests and lives of Af-Pak people.

    If we fail to see the link between ‘the war of aggression on Af-Pak people by the combined might of the US, the EU and the comprador elites of Af-Pak’ and Malala incident, then we are certainly clueless. In this way, the ordinary toiling masses of Af-Pak are doomed to their oppressed fate and their struggle against decades old foreign aggressions is non-existent.

    There are some misunderstandings.

    “I don’t think any commenters defended Drone attacks or America’s draconian foreign policy.”

    I don’t think either. The problem occurs when different issues are separated as if they are not related at all, ignoring the fact that all the issues are interrelated.

    “The way you’ve presented the article make it look like you’re giving significant credibility to the taliban just based on their statements.”

    This is not true. My significance to Taliban is solely based on their struggle against Imperialism, but not on their insignificant statements in this case. I described them as ‘మతిలేని’.

    “If I remember correctly, you’ve described the girls parents as ‘Agents of America’ and her parents somehow planned this all along.”

    Not again. I mean that If somebody is agent in her family, it can be Malala’s father but not Malala. I can’t confirm whether he is really an agent of America, but the chance is always there. Maybe this is not expressed properly in the previous article, but it is not a big thing I suppose. I think I nowhere said that Malala’s parents planned this all along. There is plenty of information to be unearthed. Again, this accusation/misquote/whatever is something that boils down the whole issue to a supposed isolated incident as you are doing.

    Regarding symbolization of women issues in Muslim countries, I think Praveen has answered this below the previous article.

  4. ఈ హైప్ ప్రోపగాండా వల్ల మరి కొంత మంది బాలికలు భయపడి చదువు మానేస్తారు కానీ బాలికలకి ఒరిగేది ఏమీ ఉండదు. గతంలో సోవియట్ సమాఖ్యకి వ్యతిరేకంగా హిజ్బ్-ఎ-ఇస్లామీ అనే మత చాంధసవాద సంస్థని అమెరికాయే పెంచి పోషించింది. హిజ్బ్-ఎ-ఇస్లామీ కార్యకర్తలు బురఖా వేసుకోని మహిళలపై యాసిడ్ పోసేవాళ్ళు. వీళ్ళేమీ తాలిబాన్ కంటే గొప్పవాళ్ళు కాదు. ఈ చరిత్ర చాలా మందికి తెలియదు. అందుకే వీళ్ళ దృష్టిలో అమెరికా రాబిన్ హుడ్, తాలిబాన్ మాత్రం రాకాసి భూతం.

  5. >>>>>
    The Ikhwanis were initially not taken very seriously by political circles because of their inferior numbers and poor attraction for intellectuals. The Ikhwanis made up for their inferiority by their virulence, which first manifested itself by a spate of acid spraying onto the faces of young university and high school girl students. (This was motivated by Islamic fundamentalist misogyny which abhors the appearance of women in society and considers life-incarceration of women in houses and harems as the acme of Islamic piety.) This Ikhwani virulence grew by leaps and bounds and very soon reached the point of bloodthirsty murders of secular-minded intellectuals. A number of such murders were overtly committed by the Ikhwanis in Herat and Laghman and many covert cases of Ikhwani murders came to light in Kabul and other cities. The climax for the revolutionary Marxist movement came in June 1972 when Sholayis and Ikhwanis clashed on the campus of Kabul University, a hotbed of ideological and political struggle and debate. True to their nature, the Ikhwanis had come armed with knives and pistols. The situation on that fateful day quickly got out of hand and Saydal Sokhandan, a prominent PYO activist and fiery Sholayi orator was personally assassinated by Golbuddin Hekmatyar who later gained notoriety as the leader of the most rabid Islamic fundamentalist grouping, the Hizb-i-Islami [Islamic Party]. (It was this Hizb-i-Islami which got the lion’s share of the CIA largesse during the years of the War of Resistance against Soviet aggression and occupation; like all Afghan fundamentalist parties the Hizb-i-Islami was nurtured on CIA arms and dollars until from a lowly jackal it grew into a bloodthirsty hyena, feasting on the entrails of the people of Afghanistan. This one fact alone is enough to expose the hypocritical howls of Western imperialism against Islamic fundamentalism.) Many other Sholayis were wounded, some of them critically. This clash further polarised the general political atmosphere and generated intense debate within the PYO, forcing an introspection into its policies and approaches.
    >>>>>

  6. విశేఖర్ గారు,

    మీ అభిప్రాయాలతో చాలా వరకు ఏకీభవిస్తాను. ఆల్మోస్ట్ 90%. కాని అమెరికా వ్యతిరేకి అయినందుకు తాలిబాన్ ని సమర్థించే విషయంలొ మాత్రం కాదు.(you said this in a comment of your last post).

    నా టర్మినాలజీ ప్రకారం ఒకటి వర్టికల్ ప్రబ్లెం అయితె మరోటి హారిజాంటల్.
    రెండూ కలిసే చోట కాన్‌ఫ్లిక్ట్. ఈ రెండింటినీ సమాన దూరంతో విశ్లెషించినపుడే ఆర్టికల్ కి సంపూర్ణత వచ్చేది.

    మీరు, నేను, ఇక్కడ మాట్లాడే మిగతా మిత్రులు కోరుకునేదొకటే – మనం ఇప్పుడుంటున్న ప్రపంచాన్ని ఇంకొంచెం బెటర్ చేసుకోవటం. కాదంటారా?

  7. అయ్యబాబోయ్! ఇంత పెద్ద సమధానమా..! కానీ బాగా రాసారు.. భలే కనిపెట్టారు. నిజంగా నాది హ్రస్వ దష్టే. లెఫ్ట్ -4, రైట్ -4.75. ఒకదాని చూపు ఇంకోదానికి లేదు.:)

    ఈనాడు, సాక్షి, విశాలాంధ్ర, ప్రజాశక్తి , నమస్తే తెలంగాణా మొIIగు పత్రికలు చెప్తున్నాయి కదాని చంద్రబాబు, జగన్, నారాయణ, రాఘవులు, కేసిఆర్ లు దీన జనోద్దారకులనీ, సమాజంలోని కుళ్ళుని కడిగి, అవినీతిని రూపు మాపే సంఘ సంస్కర్తలని జనం అనుకుంటున్నారో లేదో తెలియదు కానీ నేను మాత్రం అనుకోవడంలేదు. (అన్నట్లు కాంగ్రెస్ ,బిజెపిలకు పత్రికలు లేవా.. ఐ హర్ట్.. సారీ కిరణ్ & కిషన్)

    వెస్ట్ పత్రికలు చెప్తున్నాయి కదాని అమెరికా అంటే ఆదర్శరాజ్యమని, ఈస్ట్ పత్రికలు చెప్తున్నాయి కదాని తాలిబన్లు ఆదర్శమూర్తులని నేను అనుకోవడం లేదు – అలాంటి భ్రమలు నాకు లేవు. ఎందుకంటే కళ్ళజోడు పెట్టుకుని మరీ చదువుతాను కాబట్టి.:) అమెరికా గురించి మీఅభిప్రాయాలతో చాలావరకు నేను ఎకీభవిస్తాను. అమెరికాని నిలవరించాల్సిందే, కానీ ఈ ప్రయత్నంలో ఇంకో దుష్టవాదాన్ని సమర్ధించలేను. అమెరికాని ఎదురిస్తుంది కాబట్టి తాలిబనిజాన్ని సమర్థించాలి (అలా అనిపించింది అంటే తప్పు నాది కాదు) అన్న మీవాదనతో నేను ఎకీభవించడం లేదు. తాలిబన్లు పరిపాలనలో లేరు కాబట్టి వారిని విమర్శించను అనే వాదాన్ని ఖండిస్తున్నాను – మీలాంటి మేధావులు అనతగిన మాటలు కావు.

    మీ వ్యాసాలను చాలా అసక్తితో చదువుతాను. మీరు బాగా రాస్తారు..విశ్లేషణ చేస్తారు. అన్నీ విషయాలను ఒకేదాని లో చెప్పాలన్న తాపత్రయంలో వ్యాసాల నిడివి పెరగటం – అన్నీ పార్శ్వాలను స్పృశించాలి అని అనుకోవటం వల్లనేమో అసలు విషయం మరుగున పడిపోయి గజిబిజిగా తయారవుతున్నాయని నా భావన. సదుద్దేశ్యమే కానీ వేరొకటి కాదు. అన్యధా భావించరని ఆశిస్తున్నా.

  8. మలాలాకి అమెరికా సామ్రాజ్యవాదం గురించి తెలిసి ఉండకపోవచ్చు. కేవలం మీడియా కవరేజ్‌లో కనిపించడానికి అమెరికాకి అనుకూలంగా మాట్లాడి ఉండొచ్చు. గతంలో అమెరికా సామ్రాజ్యవాదులు పడేసిన బిస్కట్‌లు తిన్న హిజ్బ్-ఎ-ఇస్లామీ కార్యకర్తలే బురఖాలు వేసుకోని స్త్రీలపై యాసిడ్ పోసేవాళ్ళనే విషయం ఆమెకి తెలియకపోయి ఉండొచ్చు.

  9. బాబూ, తాలిబాన్ కాకుండా అమెరికా పడేసే బిస్కట్‌లు తినే హిజ్బ్-ఎ-ఇస్లామీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అఫ్ఘనిస్తాన్‌లో ఆడవాళ్ళు స్వేచ్ఛగా బతకగలరా? బురఖాలు వేసుకోని స్త్రీలపై యాసిడ్ పోసేవాళ్ళు ఆడవాళ్ళని చదువుకోనివ్వనివాళ్ళ కంటే గొప్పవాళ్ళా? తాలిబాన్‌లు మూర్ఖులు కనుక వాళ్ళు అమెరికాకి వ్యతిరేకంగా పోరాడకూడదు కానీ అమెరికా తనకి అవసరమైనప్పుడు తాలిబాన్ తరహా భావజాలాన్నే నమ్మే హిజ్బ్-ఎ-ఇస్లామీ లాంటి పెంపుడు పిచ్చికుక్కలకి మద్దతు ఇవ్వొచ్చు! ఇలా అనుకుంటే ఇస్లామిక్ చాంధసవాదం మాయమైనట్టే!

  10. చక్రి గారు,

    తాలిబాన్ కి మద్దతు ఇవ్వడం నచ్చలేదని మీరు ప్రధానంగా చెబుతున్నారు. మీరు చెప్పిన హారిజాంటల్, వర్టికల్ టర్మినాలజీ కోణంలోనుండి ఈ సమస్యను చూద్దాం.

    మీ దృష్టిలో ఏది వర్టికల్, ఏది హారిజాంటలో చెబితే బాగుండేది. మీ కోణాన్ని కొంత వివరిస్తే బాగుండేది. నా ఊహ ప్రకారం తాలిబాన్ వల్ల స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యని హారిజాంటల్ సమస్య గానూ, అమెరికా దురాక్రమణని వర్టికల్ సమస్యగానూ మీరు చూస్తుండవచ్చు.

    కానీ నిజానికి తాలిబాన్ స్త్రీలపై సాగించే అణచివేతే వర్టికల్ సమస్య కాగా, అమెరికా దురాక్రమణ హారిజాంటల్ సమస్య. ఎందుకంటే స్త్రీల అణచివేత ఆఫ్ఘన్ స్త్రీలు మాత్రమే ఎదుర్కొనే సమస్య. అది కూడా తాలిబాన్ అధికారంలో ఉన్నపుడు మాత్రమే. (ఇప్పుడు కూడా తాలిబాన్ వల్ల ఆఫ్ఘన్ స్త్రీలు సమస్యలు ఎదుర్కొంటున్నారని చెబితే అది వాస్తవం కాబోదు. ఎందుకంటే తాలిబాన్ శక్తులన్నీ ఇపుడు అమెరికా పై పోరాటం మీదికే ఎక్కుపెట్టబడి ఉన్నాయి తప్ప స్త్రీలను అణచివేసే విషయంలో కాదు. పాక్ తాలిబాన్ కి కూడా ఇదే వర్తిస్తుంది.)

    ఆఫ్ఘన్ జనాభాలో సగం స్త్రీలు ఎదుర్కొనే సామాజిక అణచివేత సమస్య వర్టికల్ అయితే అమెరికా దురాక్రమణ వల్ల ఆఫ్ఘన్ ప్రజలు మొత్తం ఎదుర్కొనే ఆర్ధిక, రాజకీయ, సాంస్కృతిక సమస్యలన్నీ హారిజాంటల్ సమస్య. స్త్రీల అణచివేత వల్ల స్త్రీలు మాత్రమే నష్టపోతే విదేశీ దురాక్రమణ వల్ల పురుషులు, స్త్రీలు, పిల్లలు, వృద్ధులు ఆంతా ఒకే విధంగా నష్టపోతారు. అమెరికా వల్ల వారి దేశానికి ఆర్ధిక, రాజకీయ సార్వభౌమత్వం లేదు. దేశ వనరులను సొంతానికి వాడుకోలేరు. అమెరికా సైన్యం ఎప్పుడొచ్చి గ్రామాలపై దాడులు చేసి స్త్రీలు, పిల్లలను చంపేస్తారో, ఏ స్త్రీని లాక్కెళ్లి మానభంగం చేస్తారో, ఏ రాత్రి వచ్చి తలుపులు విరగ్గొట్టి మగవాళ్ళని లాక్కెళ్తారో, ఏ బాంబుదాడిలో ఆస్తులు, ప్రాణాలు కోల్పోతారో తెలియని పరిస్ధితుల్లో దేశం మొత్తం బతుకుతోంది.

    ఈ పరిస్ధితుల్లో దేశం మొత్తం ఒక్కటై అమెరికా దురాక్రమణపై పోరాడాల్సి ఉంటుంది. మీరు మా చదువుకి అడ్డు చెబుతున్నారు గనక మీతో కలవం అని స్త్రీలు చెబితే అది ఆఫ్ఘన్ జాతీయ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటుంది. అమెరికా దురాక్రమణకే ఉపయోగపడుతుంది. దురాక్రమణదారు తాను ఆక్రమించిన దేశంలోని ప్రజలను వివిధ పేర్లతో విడగొట్టి తన పబ్బం గడుపుకుంటాడు. ప్రజలలో చీలికలు తెచ్చి తన ఆక్రమణను కొనసాగించడానికి ప్రయత్నిస్తాడు. అలాంటిది ఆఫ్ఘన్ ప్రజలే తమలో తాము కొట్టుకుని విడిపోతే అమెరికాకి అంతకంటే కావలసింది ఇంకేం ఉంటుంది?

    భారత దేశంలో బ్రిటిష్ ఆక్రమణకి వ్యతిరేకంగా జాతీయోద్యమం ఉవ్వెత్తున ఎగసినపుడు నిమ్నకులాల వారు తమపై కుల అణచివేతను ఆపేసి మాకుకూడా భూములు, పరిశ్రమలు పంచిస్తేనే జాతీయోద్యమంలో కలుస్తామ్ అంటే ఎలా ఉండేది? హిందూ మతంలో స్త్రీలకు అనుకూలంగా సూత్రాలు చేస్తేనే ఉద్యమంలో కలుస్తామ్ అని స్త్రీలు చెబితే ఎలా ఉండేది? స్త్రీలు, దళితుల డిమాండ్లు నెరవేరకపోగా జాతీయోద్యమం బలహీనపడి వచ్చిందని చెబుతున్న స్వాతంత్రం వచ్చి ఉండేదా?

    భారత జాతీయోద్యమం మొదట స్త్రీల సమస్యను, దళితుల సమస్యను పరిష్కరించాక స్వాతంత్రం కావాలని అడగలేదు. మొదట స్వాతంత్ర్యం వస్తే మిగిలిన సమస్యలు మనమే పరిష్కరించుకుందాం అన్న అవగాహన సాధారణంగా ఉంటుంది. ఇదే అవగాహన తాలిబాన్ కి, ఆఫ్ఘన్ దురాక్రమణకి కూడా వర్తిస్తుంది.

    ఆఫ్ఘనిస్ధాన్ ని అమెరికా, యూరప్ దేశాలు ఆక్రమించి ఉన్నాయి. అక్కడ నిలబడి వాళ్ళు ఇండియా, చైనా, రష్యా దేశాల ఎదుగుదలపై చెక్ పెట్టే వ్యూహం పన్నారు. పశ్చిమాసియాలో ఇరాన్, సిరియాల దురాక్రమణకి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు ఆఫ్ఘన్, పాక్ లలో ఉంటే ఆ దేశాలకే కాక, ఇండియాకి ప్రజలకి కూడా నష్టమే. అందుకే భారతీయులు, చైనీయులు, రష్యన్లు, అరబ్బులు అందరూ అమెరికా దురాక్రమణని వ్యతిరేకించాలి. అమెరికా దురాక్రమణపై ఎటువంటి మినహాయింపు లేకుండా పోరాడే శక్తులకి మద్దతు ఇవ్వాలి. అది మానేసి తాలిబాన్ కి వంకపెడుతూ కూచుంటే అమెరికాకి లాభమే తప్ప ఆఫ్ఘన్ ప్రజలకి కాదు. కనీసం స్త్రీలకి కూడా కాదు.

    తాలిబాన్ అనేది అమెరికా దురాక్రమణకి వ్యతిరేకంగా పోరాడుతున్న సంస్ధ అన్నది మొదట గుర్తించాలి. పశ్చిమ మీడియా వల్ల దానికి బదులు అది స్త్రీలను అణచివేసే సంస్ధ అనో, మతోన్మాద సంస్ధ మాత్రమే అని గుర్తుకు వస్తోంది. ఈ అభిప్రాయం ఉద్దేశ్యపూర్వకంగా ప్రపంచ వ్యాపితంగా కల్పించబడింది. అందుకోసం పశ్చిమ మీడియా జాగ్రత్తగా చేసిన కృషి ఉంది. ఆ ప్రచారానికి మనం గురికాకూడదు. ఇరాన్, సిరియా, తాలిబాన్ ఇవి తప్ప ఆసియాలో అమెరికా, యూరప్ ల ప్రపంచాధిపత్యాన్ని ఎదిరిస్తున్నవారు లేరు. ఇండియా, పాకిస్ధాన్ ల ప్రభుత్వాలు పశ్చిమ దేశాలకు సహకరిస్తున్నారు తప్ప ఎదిరించడం లేదు. ముస్లిం మతోన్మాదం అనో, స్త్రీలపై అణచివేత అనో, తాలిబాన్ అట్రాసిటీస్ అనో చెప్పి తాలిబాన్ కి మద్దతు లేకుండా చేయడంలో అమెరికా, యూరప్, వాటి మీడియా సఫలం అయ్యాయి. ఆ మాయలో మనమూ పడిపోయాము.

    మీరు చేపినట్లు ప్రపంచాన్ని ఇంకొంచెం బెటర్ చేసుకోవడమే అందరూ కోరుకూనేది. అలా కోరుకున్నపుడు బెటర్ కాకుండా అడ్డుకుంటున శక్తులను గుర్తించి వారిని వ్యతిరేకించడం అవసరం. అమెరికా, యూరప్ ల ప్రపంచాధిపత్యం లేకపోతే ఆసియాయే కాదు, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలు ఎప్పుడో బెటర్ అయి ఉండేవి. అందుకే అలాంటి సామ్రాజ్యవాదాన్ని ఎదిరించి నిలవరిస్తున్న తాలిబాన్, సిరియా, ఇరాన్, హమాస్ (పాలస్తీనా) లకు మద్దతు ఇవ్వాలి.

    తాలిబాన్ కి మద్దతు అనగానే తాలిబాన్ సిద్ధాంతాలకు, విధానాలన్నింటికీ మద్దతు ఇస్తున్నట్లు కాదు. అది చేస్తున్న సామ్రాజ్యవ్యతిరేక పోరాటానికి మాత్రమే మద్దతు. తాలిబాన్ చేతికి రాజ్యం వచ్చాక అప్పుడిక ఆఫ్ఘన్ ప్రజల ప్రాధామ్యాలు మారతాయి. మన ప్రాదాన్యత కూడా ఆఫ్ఘన్ ప్రజలపై అది సాగించే అణచివేతమీదికి మళ్లుతుంది.

    సమాధానం పెద్దదయింది. మీ ఒక్కరికే అని కాకుండా ఇతర పాఠకులకి కూడా ఉపయోగపడుతుందని ఇలా రాసాను.

  11. Hi Babu

    హ్రస్వ దృష్టి పై మీ జోక్ ని నేనూ ఎంజాయ్ చేశాను. పత్రికలపై మీ పరిశీలన వాస్తవికం.

    “అమెరికాని నిలవరించాల్సిందే, కానీ ఈ ప్రయత్నంలో ఇంకో దుష్టవాదాన్ని సమర్ధించలేను. అమెరికాని ఎదురిస్తుంది కాబట్టి తాలిబనిజాన్ని సమర్థించాలి (అలా అనిపించింది అంటే తప్పు నాది కాదు) అన్న మీవాదనతో నేను ఎకీభవించడం లేదు.”

    తప్పు మీది కాకపోవచ్చని అంగీకరిస్తూనే ఈ వివరణ:

    అమెరికాని ఎదిరించడంలోనే ‘తాలిబాన్’ కి నా మద్దతు. ‘తాలిబానిజానికి’ నా మద్దతు లేదు. మతఛాందసాలన్నిటికీ నేను వ్యతిరేకం.

    మలాల ఘటనలో తాలిబానిజం ఉందని పశ్చిమ పత్రికలు చెబుతున్నాయి. అలా చెప్పడం వారి అవసరం. ఎందుకంటే వారే దురాక్రమణదారులు కనుక. వారు చెప్పిందే కాక ఇతర అంశాలను కూడా చూస్తేనే బైటినుండి చూసే మనకు వాస్తవం ఏమిటో తెలుస్తుంది. అలా ఇతర అంశాలను చూసే ప్రయత్నమే ఈ ఆర్టికల్స్.

    మీ పరిశీలన నిజమే. నిడివి తరచుగా ఎక్కువవుతోంది. ఒక సంఘటన జరగడానికి అనేక కారణాలు ఉంటాయి. ఆ కారణాలన్నింటినీ చర్చించుకుంటేనే ఆ సంఘటనపైన వాస్తవ అవగాహనకు దగ్గరికి వెళ్లగలుగుతాము. అందువల్ల వ్యాసాల నిడివి తరచుగా ఎక్కువ అవుతుంది. వివరణ లేనపుడు అనివార్యంగా అనేక ప్రశ్నలు, అనుమానాలు (వ్యాఖ్యల రూపంలో) వస్తాయి. బ్లాగ్ లో వచ్చిన అనుభవం ద్వారా ఏయే అనుమానాలు వస్తాయో సాధ్యమైనంత ఊహించి ముందే సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటాను. లేకుంటే వ్యాఖ్యలు వచ్చాక తర్వాతయినా అవి రాయవలసిందే. దీనివల్ల కూడా నిడివి పెరుగుతుంది.
    మీ సదుద్దేశాన్ని నేను ముందే గ్రహించాను. కొన్ని విషయాలు ప్రశ్నలతో అర్ధం అయే అవకాశం ఉంటుంది. అలా మీకు ఆ ప్రశ్నలు వేసాను. మరో ఉద్దేశ్యం లేదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s