పాకిస్ధాన్ పశ్చిమ రాష్ట్రం ఖైబర్ పఖ్తూన్వా రాష్ట్రంలోని స్వాట్ లోయలో ‘మలాల యూసఫ్జాయ్’ అనే 14 సంవత్సరాల బాలికపై హత్యా ప్రయత్నం జరిగింది. అక్టోబర్ 9 తేదీన ఆమె ప్రయాణిస్తున్న స్కూల్ బస్సు ను మిలట్రీ చెక్ పోస్టుకి సమీపంలోనే ఆపి, దుండగులు ఆమె తలపైనా, గొంతులోనూ కాల్పులు జరిపారు. బాలికా విద్య కోసం ప్రచారం చేస్తున్నందుకు ఆమెను పాకిస్ధాన్ తాలిబాన్లు చంపడానికి ప్రయత్నించారని పశ్చిమ కార్పొరేట్ పత్రికలు ప్రచారం లంకించుకున్నాయి. పాకిస్ధాన్ లో వైద్యం సరిపోలేదని చెప్పి మలాలను పూర్తి వైద్య సదుపాయాలు ఉన్న ప్రత్యేక విమానాన్ని యు.ఏ.ఇ నుండి రప్పించి అందులో బ్రిటన్ కు తరలించారు.
మలాల హత్యా ప్రయత్నం తర్వాత ఉత్తర వజీరిస్తాన్, స్వాట్ లోయలపై పాక్ మిలట్రీ మరోసారి దాడి చేసి మిలిటెంట్లను తుడిచి పెట్టాలని డిమాండ్లు వస్తున్నాయి. ఈ డిమాండు వాస్తవానికి పశ్చిమ దేశాలది. పశ్చిమ దేశాల ఈ డిమాండుకు మలాల హత్యా ప్రయత్నం ద్వారా మద్దతు సమకూర్చే ప్రయత్నాలు అంతర్జాతీయ స్ధాయిలో జరుగుతున్నాయి. దానితో గత మూడేళ్లుగా పాకిస్ధాన్ లో మారుమోగుతున్న మలాల పేరు ఇపుడు అంతర్జాతీయ స్ధాయిలో పశ్చిమ కార్పొరేట్ పత్రికల పతాక శీర్షికలకెక్కింది. మలాల హత్యా ప్రయత్నంపై పాకిస్ధాన్ విద్యార్ధినులు, మహిళలు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లుగా పత్రికలు చెబుతున్నాయి. ఎం.క్యూ.ఎం లాంటి పార్టీలు జాతీయ పిలుపు ఇచ్చి మరీ ప్రదర్శనలు నిర్వహించాయని వార్తలు వెలువడ్డాయి.
బాలికలకు విద్య కావాలని కోరినందుకు మలాల పై హత్యా ప్రయత్నం చేయడంపై అమెరికా అధ్యక్షుడు ఒబామా కార్యాలయం ఆగ్రహం ప్రకటించి సానుభూతి సందేశం పంపింది. యూరోపియన్ దేశాల ప్రభుత్వాలు, నాయకులు కూడా యధాశక్తిగా ఖండన మండనలు జారీ చేశారు. పాకిస్ధాన్ బాలికల విద్య ఇపుడే గుర్తొచ్చినట్లుగా, అసలు బాలికల విద్య కోసమే ఆఫ్ఘనిస్ధాన్ ని దురాక్రమించినట్లుగా వారు ఫోజులు కొడుతున్నారు. మరో పక్క స్వాట్ లోయనుండి తాలిబాన్ ను తరిమేయడానికి పాకిస్ధాన్ మిలట్రీ మరోమారు మిలట్రీ చర్య చేపట్టాలన్న డిమాండు ఊపందుకుంది.
అమెరికా, యూరప్ దేశాల మిలట్రీ సంఘం నాటో కూటమి, స్వాట్ లోయలో బలంగా ఉన్న పాకిస్ధాన్ తాలిబాన్ మిలిటెంట్లను ఊచకోత కోయాలని ఎప్పటినుండో పాక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఆఫ్ఘన్ తాలిబాన్ తో పాటు అమెరికా సైనికులకు వణుకు పుట్టిస్తున్న హక్కానీ మిలిటెంట్ గ్రూపు కూడా స్వాట్ లోయ స్ధావరంగా ఉన్నదని పశ్చిమ దేశాలు చెబుతాయి. పశ్చిమ దేశాల ఒత్తిడికి తలొగ్గిన పాక్ మిలట్రీ మూడేళ్ళ క్రితం స్వాట్ లోయపై దాడి చేసింది. స్వాట్ లోయలో తమ ప్రజలపైనే యుద్ధం చేసి అనేకమంది అమాయక ప్రజలను బలితీసుకుంది. అమాయక ప్రజల హత్యలను ఖండించకపోగా మిలట్రీ చర్యను శభాష్ అని అమెరికా, యూరప్ లు మెచ్చుకున్నాయి. స్వాట్ నుండి తాలిబాన్ ను తరిమికొట్టామని పాక్ ప్రభుత్వం ప్రకటించింది.
అయితే మిలిటెంట్లను తుడిచిపెట్టామన్న పాక్ ప్రకటిత సంతోషం ఎంతోకాలం నిలవలేదు. స్వాట్ లోయ మిలిటెంట్లకు యధావిధిగా ఆశ్రయం ఇస్తూనే ఉంది. ప్రకృతి సౌందర్యాలతో అలరారుతూ ‘స్విట్జర్లాండ్ ఆఫ్ పాకిస్ధాన్’ గా పిలవబడే స్వాట్ లోయ నిజానికి ప్రశాంతమైన ప్రాంతం. తమపని తాము చేసుకునే గిరిజన ప్రజలకు నిలయం. ఆఫ్ఘనిస్ధాన్ పై నాటో మంద దాడి చేసి దురాక్రమించాక మాత్రమే ఆ ప్రాంత ప్రజలు మిలిటెంట్లకు ఆశ్రయం ఇవ్వడం మొదలుపెట్టారు. ఆఫ్ఘన్ ఫస్తూన్ తెగకు చెందినవారే స్వాట్ లోయలో నివసిస్తారు. అందుకే అమెరికా దురాక్రమణకు సహజంగానే వారిలో వ్యతిరేకత పెల్లుబుకింది. దాని ఫలితమే స్వాట్ లోయలో మిలిటెన్సీ.
తాలిబాన్ ని బాగా బలహీనపరిచామని అమెరికా చెప్పుకునేదంతా వట్టి అబద్ధం. అమెరికా ఒకపక్క తాలిబాన్ తో చర్చలని నాటకాలాడుతూ ఆఫ్ఘనిస్ధాన్ లోనూ, ఆఫ్-పాక్ సరిహద్దులోని స్వాట్ లోయలోనూ వైమానిక దాడులు నిర్వహిస్తున్నది. ఆఫ్ఘన్ తాలిబాన్ నాయకులను చంపడం కోసమని చెప్పి హంతక డ్రోన్ విమానాలతో స్వాట్ లోయపై విచక్షణారహిత దాడులు నిర్వహిస్తూ అనేకమంది అమాయకులను బలితీసుకుంటోంది. డ్రోన్ దాడులకు వ్యతిరేకంగా పాకిస్ధాన్ ప్రజలు తీవ్ర నిరసన తెలుపుతున్నారు. డ్రోన్ దాడులను నిరసిస్తూ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలోని రాజకీయ పార్టీ ఇటీవలనే స్వాట్ లోయలో పాదయాత్ర నిర్వహించి ప్రజల ఆదరణ పొందింది. ఆ తర్వాత డ్రోన్ దాడులపై ప్రజల నిరసన మరింత పెరిగింది.
ప్రజల నిరసనను కప్పిపుచ్చడానికి, పక్కదారి పట్టిమ్మ్చడానికి పశ్చిమ దేశాలకు అకస్మాత్తుగా స్వాట్ లోయలో బాలిక విద్య గుర్తుకు వచ్చింది. ముస్లిం సమాజం స్త్రీల విద్య విషయంలో ఉన్న ఛాందస భావాలు పశ్చిమ దేశాలకు కొత్తగా వరంగా దొరికింది. నిజానికి పాకిస్ధాన్ లోమ మతఛాందస వ్యవస్ధ బాలికల విద్యకు వ్యతిరేకంగా ఉండడం కొత్తదేమీ కాదు. ముస్లిం అరబ్ దేశాల్లోని శతాబ్దాలనాటి ఫ్యూడల్ వ్యవస్ధలలో సాగుతూ వచ్చిన స్త్రీలపై అణచివేతే నేటికీ ముస్లిం మహిళలకు విద్య నిరాకరించడానికి కారణం. నియంత జియా ఉల్ హక్ పాలనలో జడలు విప్పి నర్తించిన ముస్లిం మతఛాందసంపై అమెరికా, యూరప్ దేశాలు ఎన్నడూ అభ్యంతరం చెప్పింది లేదు. అలాంటి దేశాలకు కొత్తగా పాక్ బాలికల విద్యపై ప్రేమ పుట్టుకొచ్చిందంటే నమ్మనవసరంలేదు. స్త్రీ విద్యను అడ్డుపెట్టుకుని ఆఫ్-పాక్ సరిహద్దుకు ఇరువైపులా తాలిబాన్ వ్యతిరేకతను రెచ్చగొట్టడానికి ఒక పధకం ప్రకారం అమెరికా కృషి చేసింది. ఆ విధంగా పాక్ సామాజిక చిత్రపటంపై ‘మలాల యూసఫ్జాయ్’ బాలికల విద్యా ఛాంపియన్ గా ఆవిర్భవించింది.
అమెరికా ఏజంట్?
మలాల గత మూడేళ్లుగా పాకిస్ధాన్ పత్రికల పతాక శీర్షికల్లో నానుతోంది. మలాలకు వచ్చిన ప్రచారం వెనుక అమెరికా, పాక్ పాలకుల సంయుక్త వ్యూహం ఉన్నది. ఆశ్చర్యకరంగా కేవలం 11 సంవత్సరాల వయసులో యూసఫ్జాయ్ బ్లాగ్ నిర్వహించడానికి బి.బి.సి 2009లో అనుమతి ఇచ్చింది. బి.బి.సి కోసం ఉర్దూలో బ్లాగ్ నిర్వహించడం ద్వారా ఆమె ప్రాచుర్యానికి పునాది పడింది. గుల్ మకాయ్ పేరుతో నిర్వహించిన ఈ బ్లాగ్ లో తాలిబాన్ కి వ్యతిరేక రాతలు ప్రత్యక్షమయేవి. తాలిబాన్ నీడలో తాము పడుతున్న కష్టాలను గురించి బాలిక రాసిన రాతలను పశ్చిమ పత్రికలు ఆకాశానికెత్తాయి. 2011 లో ఆమెకు అంతర్జాతీయ అవార్డు ప్రకటించి పశ్చిమ దేశాలు తమ వ్యూహానికి పదునుపెట్టాయి. ఆమ్స్టర్ డాం నుండి పనిచేసే కిడ్స్ రైట్స్ సంస్ధ, ‘ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ పీస్ ప్రైజ్’ ను మలాలకు ప్రకటించింది. అవార్డు తర్వాత మలాల చుట్టూ మరింత హైప్ వచ్చి చేరింది.
స్వాట్ లోయలో ‘రేడియో ముల్లా’గా ప్రఖ్యాతి పొందిన ‘మౌలానా ఫజలుల్లా’ (స్వాట్ తాలిబాన్ కు ఈయన నాయకుడు) బాలికా విద్యకు వ్యతిరేకం అన్నట్లుగా ప్రచారం జరిగింది. తాలిబాన్ ఆజ్ఞలను ధిక్కరించి మలాలా పాఠశాలలో చేరి చదువుకుంటోందని పశ్చిమ పత్రికలు కధలు సృష్టించి ప్రచారం చేశాయి. బాలిక విద్యాకోసం ప్రచారం చేస్తున్నందుకు పాక్ తాలిబాన్ ఆమెను చంపుతామంటూ బెదిరింపులు చేసిందని కూడా పత్రికలు వార్తలు గుప్పించాయి. వాస్తవానికి స్వాట్ లోయలో చదువుకుంటోంది మలాలా ఒక్కరే కాదు. హత్యా ప్రయత్నం జరిగిన స్కూల్ బస్సులో కూడా మలాల మాత్రమే కాక ఇంకా విద్యార్ధినులు ఉన్నారు. వారి చదువుకు అభ్యంతరం చెప్పని స్వాట్ తాలిబాన్, మలాల పైనే ఎందుకు గురిపెట్టింది? తాలిబాన్ కి వ్యతిరేకంగా మలాల చేసిన ప్రచారం ఒక కారణం కాగా, ఆమె అమెరికా ఏజంటని తాలిబాన్ నమ్మడం మరొక కారణం. తాలిబాన్ నమ్మకానికి బలమైన కారణాలే ఉన్నాయి. ఆఫ్-పాక్ లకు 2010 వరకూ అమెరికా ప్రత్యేక రాయబారిగా పని చేసిన రిచర్డ్ హల్బ్రూక్ తో మలాల, ఆమె తల్లిదండ్రులు జరిపిన సమావేశాలు ఇందుకు తార్కాణంగా తాలిబాన్ మద్దతుదారులు చూపుతున్నారు.
- రిచర్డ్ హాల్ బ్రూక్ తో మలాల కుటుంబం -ఫొటో: పాక్ లింక్స్ ఫోరం
ఏమయినప్పటికీ మలాలను చంపబూనుకున్నది తాలిబానే అయితే అది మతిలేని చర్య. అమెరికా దురాక్రమణపై పోరాటంపై తాలిబాన్ చేస్తున్న సామ్రాజ్యవాద వ్యతిరేక జాతీయ పోరాటానికి మచ్చ తెచ్చే చర్య. చేజేతులారా సామ్రాజ్యవాదానికి ప్రచారాయుధాన్ని అందించే చర్య. చెప్పిమరీ ఒక నిరాయుధ బాలికపై తుపాకి ఎక్కుపెట్టి చంపడం దుర్మార్గం తప్ప మరొకటి కాదు.
తాలిబాన్ పేరుతో ఆఫ్-పాక్ లలో అనేక సంస్ధలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. వీటిలో అమెరికా నిధులతో నడిచేవీ, పాక్ మిలట్రీ నిధులతో నడిచేవీ కూడా ఉన్నట్లు పత్రికల ద్వారా తెలుస్తోంది. మలాలను చంపుతామని ప్రకటించింది పాకిస్ధాన్ తాలిబాన్. ఆమె బతికితే మళ్లీ చంపుతామని చెప్పిందీ, ఆమెను లండన్ పంపితే ఆమె తండ్రిని చంపుతామని చెప్పిందీ కూడా పాకిస్ధాన్ తాలిబానే. రేడియో ముల్లాకు ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లు అంచనాలే తప్ప ఆ సంస్ధ పేరుతో బెదిరింపు ప్రకటనలు వచ్చినట్లు వార్తలు లేవు. స్వాట్ తాలిబాన్, పాకిస్ధాన్ తాలిబాన్ కు అనుబంధమా కాదా అన్నది తెలియలేదు. ‘ఫాల్స్-ఫ్లాగ్ ఆపరేషన్స్’ లో ఆరితేరి, తాము చేసిన నేరాలను ఇతరులపైకి నెట్టడంలో నిష్ణాతులైన అమెరికా, యూరప్ లకు ‘మలాల’ లను తయారు చేయడం వెన్నతో పెట్టిన విద్య. ఇది తెలిసినప్పటికీ పదే పదే పశ్చిమ దేశాల ఉచ్చులో తాలిబాన్ పడడం ఆశ్చర్యకరం.
అమెరికా ప్రోద్బలంతోనే మలాల చుట్టూ పత్రికలు ఒక హైప్ ను సృష్టించాయన్నది ఇపుడు పాకిస్ధాన్ లో బహిరంగ రహస్యంగా మారింది. నిజానికి 14 సంవత్సరాల మలాల ను అమెరికా ఏజంటుగా చెప్పడం హాస్యాస్పదం. అసలు అమెరికా ఏజంటు మలాల తండ్రి. మలాలని చంపడానికి ప్రయత్నించడం అంటే తాలిబాన్ కోరి వ్యతిరేక ప్రచారం తెచ్చుకున్నట్లే. ఇది పాక్ తాలిబాన్ చేసిన పనే అయితే ఆ సంస్ధ నాయకులు తెలివితక్కువవారయినా అయి ఉండాలి లేదా హత్యాప్రయత్నం చేసింది తాలిబాన్ కాకపోవడమయినా అయి ఉండాలి. పాకిస్ధాన్ లో మోడరేట్ మతతత్వ పార్టీగా భావించే జమాత్ ఇస్లాం నాయకుడు ఈ పని తాలిబాన్ ది కాదని చెప్పడం ఈ సందర్భంగా గమనార్హం.
పాకిస్ధాన్ మిలట్రీ, దాని ఏజన్సీ లే ఈ హత్యా ప్రయత్నానికి పాల్పడ్డాయనీ ఈ సంఘటను అడ్డుపెట్టుకుని స్వాట్ లోయపై మరోసారి మిలట్రీ చర్య జరపడానికి ప్రయత్నిస్తున్నారనీ సదరు సంస్ధ నాయకుడు కాజీ హుస్సేన్ అహ్మద్ రెండు రోజుల క్రితం ప్రకటించాడు. లాహోర్, ఫైసలా బాద్ లలో అనేకమంది ముల్లాలు, ఇమామ్ లు మలాల ను, ఆమె కుటుంబాన్ని పశ్చిమ దేశాల ఏజెంటుగా తమ శుక్రవారం ప్రార్ధనల్లో చెప్పారని వార్తలు వస్తున్నాయి.
అమెరికా డ్రోన్ దాడులనుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి అమెరికాయే ఈ పని చేసిందని వారు చెప్పినట్లు వార్తలు వెలువడ్డాయి. డ్రోన్ దాడులకు వ్యతిరేకంగా ఇమ్రాన్ ఖాన్ చేసిన శాంతి కవాతు (పీస్ మార్చ్) విజయవంతం కావడంతో మలాలపై దాడి చేయించి నెపాన్ని తాలిబాన్ పై నెట్టాయని పాక్ ఇమామ్ లు ప్రార్ధనల్లో చెప్పారని తెలుస్తున్నది. ఈ ప్రచారంతో మలాలకు అనుకూలంగా తలెత్తిన సానుభూతి వెల్లువ క్షీణిస్తున్నట్లుగా కొన్ని పాక్ పత్రికల ద్వారా తెలుస్తున్నది. హత్యాప్రయత్నం ఎవరిది అయినప్పటికీ మలాల కు ప్రాముఖ్యత వచ్చి చేరడం వెనుక పశ్చిమ దేశాలు ఉన్నాయని నిస్సందేహంగా నమ్మవచ్చు.
మలాలపై కాల్పులు జరిగిన తర్వాత మొదట స్వాట్ లోయలో స్ధానికంగా ఉన్న ఆసుపత్రిలోనూ అనంతరం పెషావర్ లోనూ ఆమెకు వైద్యం అందజేశారు. ఆమె కోలుకుంటోందని కూడా మొదట వార్తలు వచ్చాయి. ఈలోగా మలాల బతికితే ఆమెను చంపడానికి మళ్ళీ ప్రయత్నిస్తామని పాకిస్ధాన్ తాలిబాన్ ప్రకటించినట్లు తెలుస్తోంది. పాక్ లో సరైన వైద్యమే అందిందనీ, సుదీర్ఘ చికిత్స కోసం ఆమెను లండన్ కు తరలిస్తున్నామని పాక్ ప్రభుత్వం ప్రకటించింది. తాలిబాన్ బెదిరింపులవల్లనే మలాల ను లండన్ కి తరలించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. మలాలకు మెరుగైన వైద్యం అందించడంపై విభేదం లేనప్పటికీ డ్రోన్ దాడుల బాధితులను కూడా ఇలాగే విదేశాలకు తరలించగలరా అని పాక్ లో అనేకమంది ఇపుడు ప్రశ్నిస్తున్నారు. డ్రోన్ దాడుల్లో వందలాది అమాయకులు మరణిస్తున్నా లేని ప్రచారం మలాల కు లభించడం పట్ల కూడా అనేకమంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. డ్రోన్ దాడుల వ్యతిరేకతను కప్పిపుచ్చడానికే మలాలపై దాడిని వాడుకుంటున్నారని చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం అవసరం లేదన్నది వారి సూచన.
There should have been a condemnation on the incident in this article on those who have commmitted this bereaved act. We can’t just believe what is being told by an Imam on a friday. They won’t have any ground to prove. But there was proof that the Taliban spokesperson has warned that they will kill this girl if she survives.
The drone attacks on the innocent people is equally condemnable.
People will feel bad to know someone they knew getting hurt, but not some unnamed innocent people. Hence the outrage.
Hai Chakri, I think I missed it (condemnation). I’ve added two more paragraphs below the last photo.
I don’t mean to say that I believe what Imams preached. I only mean to inform the effect of Friday prayers.
This article is not about who tried to kill Malala or not about whether Taliban really did it or not. It is about who is really behind this whole episode, and who is actually gaining and who is actually loosing.
I’ve forgotten to add cartoon above, which has great relevance to the article. Now I added it.
I agree with Chakri. This article skips the fact that the Taliban representatives defended this attack and warned it might happen again. The western media might be taking advantage of this whole situation, but that is no excuse to defend the Taliban and their atrocities.
విశేఖర్ గారు, ఈ మధ్య మీ వ్యాశాలలో conspiracy theories బాగా ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది.
వ్యాసం గజిబిజిగా ఉంది. అమెరికాకు ఎదో ఒక సాకు కావాలి నిజమే! అమెరికానే తాలిబన్ల ముసుగులో ఈ పని చేసిందా..లేక తాలిబన్లే చేసారా? తాలిబన్లను, వారు చేసే పనులను, వారి సిద్ధాంతాలను మీరు సమర్ధిస్తున్నారా? చక్రి, గౌతమ్ గార్లతో ఎకీభవిస్తున్నా. వ్యాస ముఖ్యోద్దేశ్యం వేరు అని మీరు చెప్తున్నప్పటికీ, తాలిబన్లమీద సానుభూతి కన్పిస్తుందీ వ్యాసంలో..!
పాకిస్తాన్‌లో తెహ్రీక్-ఎ-తాలిబాన్ అనే ఇంకో సంస్థ ఉంది. ఆ సంస్థ వేరు, అఫ్ఘనిస్తాన్‌లో పని చేస్తున్న తాలిబాన్ వేరు. ఇస్లామిక్ దేశాలలో స్త్రీలకి హక్కులు లేవని అంటూ లిబరల్ పత్రికలు చిలువలుపలువలుగా వ్యాసాలు వ్రాస్తాయి కానీ హిందూ సమాజంలో ఉన్న వరకట్నం లాంటి దురాచారాల గురించి మాత్రం పట్టించుకోవు. హిందూత్వవాదులకి గ్లోబలైజేషన్‌పై మౌలిక వ్యతిరేకత ఏమీ లేదు కాబట్టి హిందూ మతాన్ని పాశ్చాత్య పత్రికలు & టివి చానెల్‌లు సహిస్తాయి కానీ ఇస్లాం మతం విషయంలో మాత్రం ఫోబియాని ప్రదర్శిస్తాయి.
మతం మౌలికంగా పెట్టుబడిదారీ వ్యవస్థకి వ్యతిరేకం కాదు, పెట్టుబడిదారీ వ్యవస్థ మతానికి మౌలికంగా వ్యతిరేకం కాదు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఆస్ట్రేలియాలో పని చేసే నా స్నేహితునితో నేను యాహూ చాట్‌లో చర్చించే రోజులలో అతని ఓసారి అన్నాడు “మతం తనకి అడ్డుతగలనంతవరకు పెట్టుబడిదారీ వ్యవస్థ మతాన్ని సహిస్తూ ఉంటుంది” అని. హిందూ మతం విషయానికి వస్తే ఈ మతం వ్యక్తివాద పునాదుల మీద నిర్మించబడినది. “ఎవడిని వాడే ఉద్ధరించుకోవాలి, ఒకడిని ఇంకొకడు ఉద్ధరించడు” అనే భగవత్‌గీత సూత్రం ఉండనే ఉంది. ఇలా వ్యక్తివాదాన్ని ప్రవచించే మతం పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క నియమాలకి అనుకూలంగానే ఉంటుంది. కానీ ఇస్లాం మతం అలా కాదు. అది జాతి కేంద్రక మతం. అది అరబ్బీయులలో జాతివాదాన్ని పెంచడానికి పుట్టిన మతం. ఆ మతాన్ని ప్రపంచంలోని ఇంకొన్ని జాతులవాళ్ళు ఆదర్శంగా తీసుకుని ఆ మతంలో చేరారు. అందుకే కొన్ని దేశాలలో ఇస్లాం స్ఫూర్తితో ఇప్పటికీ జాతీయ విముక్తి ఉద్యమాలు జరుగుతున్నాయి. ఈ మతం పాశ్చాత్య పెట్టుబడిదారులకి నచ్చకపోవడంలో విచిత్రం ఏమీ లేదు.
@ గౌతం, చక్రి, బాబు
సమాధానం పోస్ట్ ద్వారా ఇచ్చాను. కింది లింక్ చూడగలరు.
http://wp.me/p1kSha-3o4
చక్రిగారికి, వాస్తవాలేమిటో ఇంకా పూర్తిగా బైటికి రాలేదు. అందుకే వ్యాసంలో గజిబిజి ఉన్నట్లు తోస్తున్నది. ఏదో ఒకటి తేల్చడానికి తగిన వాస్తవాలు అందుబాటులో లేవు. తెహ్రీక్-ఎ-తాలిబాన్ మతిమాలిన ప్రకటనలు తప్ప హిట్ టీం ఎవరిదైందీ తెలియలేదు. పాకిస్ధాన్ వందకిపైగా అరెస్టులు చేసినట్లు చెప్పింది కానీ వారిలో ఎవరూ హిట్ టీం సభ్యులు కాదని చెప్పింది.
తాలిబాన్ కి సంబంధించినంతవరకూ అమెరికా దురాక్రమణకి అది ఇస్తున్న ప్రతిఘటన ఇప్పటి ప్రపంచ అవసరం. తాలిబాన్ సిద్ధాంతాలకు నా మద్దతు ఉంటుందని ఎలా భావిస్తారు? అసలా ప్రశ్న ఎందుకు? అది ప్రభుత్వం నడుపుతున్నపుడు దాని సిద్ధాంతాలు లెక్కకు వస్తాయి తప్ప ఇప్పుడు కాదు.
ఒక్క సానుభూతేం ఖర్మ! తాలిబాన్ అమెరికా వ్యతిరేక పోరాటానికి నా పూర్తి మద్దతు ఉంది.