బొగ్గు కుంభకోణంలో మీడియా, మాయమవుతున్న ఫోర్త్ ఎస్టేట్

2జి కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన మీడియా బొగ్గు కుంభకోణంలో నేరుగా లబ్ది పొందినట్లు సి.బి.ఐ పరిశోధనలో వెల్లడైంది. నాలుగు మీడియా కంపెనీలు అక్రమ లబ్ది పొందాయని ‘ది హిందూ’ చెప్పినప్పటికీ పేర్లు వెల్లడించలేదు. నెట్ వర్క్ 18 (ఐ.బి.ఎన్ గ్రూపు), డి.బి కార్ప్ (డెయిలీ భాస్కర్ గ్రూపు) లు లబ్ది పొందిన మీడియా కంపెనీల్లో ఉన్నాయని ఫస్ట్ పోస్ట్ తెలిపింది.  తమకు కేటాయించిన బొగ్గు గనులనుండి కంపెనీలు అక్రమ లబ్ది పొందాయన్న ఆరోపణలపై సి.బి.ఐ విచారణ…

కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలపై గురువింద ధాకరే మండిపాటు

చూసే తీరిక ఉండాలే గానీ భారత రాజకీయ నాయకుల సర్కస్ విన్యాసాలకు, రెండు నాలుకల ప్రకటనలకు కొదవ ఉండదు. కొడుకు ఉద్ధవ్ ధాకరే తో పాటు మనవడు అధిత్య ధాకరేను కూడా శివసేన ఆధిపత్య స్ధానాలకు నామినేట్ చేసిన బాల్ ధాకరే కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలపై మండిపడుతున్నాడు. రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి పదవి కోసం ఆశపడుతున్నాడనీ, ప్రియాంక గాంధీ మరో ఇందిరా గాంధీ లాగా రాజకీయాల్లో ఎదగలానుకుంటున్నదనీ వాపోయాడు. శివసేనలో మాత్రం అంతా ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నదనీ…

66 ఏళ్ల వెనుకబాటు భారతానికి సారధులు అగ్రకుల ప్రతిభా సంపన్నులే

ఎస్.సి, ఎస్.టి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రతిపాదించింది. బుధ, గురు వారాల్లో ఈ బిల్లును రాజ్య సభలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నించి విఫలం అయింది. సమాజ్ వాదీ పార్టీ, శివసేన పార్టీలు బిల్లుకి వ్యతిరేకంగా నినాదాలిస్తూ సభలో ప్రవేశపెట్టకుండా అడ్డుకున్నాయి. కోల్-గేట్ కుంభకోణాన్ని సాకుగా చూపి ప్రమోషన్ రిజర్వేషన్ల బిల్లు కి బి.జె.పి మోకాలడ్డింది. “జూనియర్లు సీనియర్లవుతారు. ఇదేం జోకా? ప్రభుత్వ పాలనే జోకైపోయింది” అని బి.సి ల విముక్తి ప్రదాత అయిన…

ఎస్సీ, ఎస్టీ ప్రమోషన్ల బిల్లు: పార్టీల వికృత రూపాలు బట్టబయలు

ఎస్.సి, ఎస్.టి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్ల కోసం కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టడానికి గురువారం మరో ప్రయత్నం చేసింది. ఈ సందర్భంగా పాలక, ప్రతిపక్ష పార్టీల ద్వంద్వ బుద్ధులు దేశ ప్రజల ముందు నగ్నంగా ప్రదర్శించబడ్డాయి. కోల్ గేట్ కుంభకోణం సృష్టించిన పార్లమెంటరీ సంక్షోభం నుండి బైట పడడానికి అధికార పార్టీ ‘ఎస్.సి, ఎస్.టి ప్రమోషన్ల రిజర్వేషన్’ బిల్లుని అడ్డు పెట్టుకుంటే, బి.సి ఓట్ల కోసం ఒక పార్టీ, హిందూ ఓట్ల కోసం మరొక పార్టీ ఈ…

శ్రీలంక కాకి తమిళనాడుపై ఎగరకూడదు మరి! -కార్టూన్

నేను చెప్పానా? తమిళనాడు పైన ఎగరకపోతేనే మంచిదని….! శ్రీలంక తో భారత దేశానికి ఉన్న ప్రతి సంబంధాన్నీ రాక్షసీకరించే ప్రయత్నాలు తమిళనాడులో జోరుగా సాగుతున్నాయి. రాజకీయ పార్టీలు ఒకరితో ఒకరు పోటీలు పడుతూ తమిళ జాతీయవాదంలో తామే నిఖార్సయినవారమని చెప్పడానికి అసలు సమస్యే కానీ అంశాలని పెద్ద సమస్యలుగా చేస్తున్నారు. ఎల్.టి.టి.ఇ తో పోరులో చివరి రోజుల్లో శ్రీలంక ప్రభుత్వం ఆదేశాల మేరకు తమిళ పౌరులపై సాగిన నరమేధం గురించి నిర్దిష్ట అవగానను ఇంతవరకూ ఈ పార్టీలేవీ…

తెలంగాణ ఈ నెల్లోనే -కె.సి.ఆర్

తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు కె.చంద్రశేఖర్ రావు మరోసారి ప్రజలని మభ్యపెట్టే పనిలో పడినట్లు కనిపిస్తోంది. తెలంగాణ సమస్య ఈ నెలలోనే పరిష్కారం కానున్నదని ఆయన ప్రకటించాడు. ఢిల్లీకి ప్రయాణం కాబోతూ ఆయన పత్రికలు, చానెళ్ల ముందు ఈ అనూహ్య ప్రకటన చేశాడు. ఢిల్లీలో తెలంగాణ కోసం మూడు రోజులు దీక్ష చేసి జాతీయ పత్రికల దృష్టిని ఆకర్షించడంలో బి.జె.పి సఫలం అయిన నేపధ్యంలో కేంద్రీకరణను తనవైపు మళ్లించుకోవడానికే కె.సి.ఆర్ ఈ ప్రకటన చేశాడన్నది కొందరి అనుమానం.…

12 మిలియన్ల యాపిల్ డివైజ్ లపై ఎఫ్.బి.ఐ నిఘా, హ్యాకర్ల వెల్లడి

1.2 కోట్ల యాపిల్ ఉత్పత్తుల కొనుగోలుదారులపై అమెరికా ఫెడరల్ పోలీసు సంస్ధ ఎఫ్.బి.ఐ నిఘా పెట్టిన సంగతిని హ్యాకర్లు బట్టబయలు చేశారు. ఎఫ్.బి.ఐ ఉన్నతాధికారికి చెందిన ల్యాప్ టాప్ ను హ్యాక్ చేసి అందులో 12,367,232 యాపిల్ డివైజ్ లకు చెందిన యు.డి.ఐ.డి (Unique Device IDentifiers) లను ఎఫ్.బి.ఐ నిలవ చేసిన సంగతిని హ్యాకర్లు వెల్లడి చేశారు. యు.డి.ఐ.డి లు నిజమైనవే అని చెప్పడానికి ఒక మిలియన్ యు.డి.ఐ.డి లను కూడా తమ వెబ్ సైట్…

నేషనల్ జాగ్రఫిక్ ట్రావెలర్ 2012 ఫోటో పోటీలు -ఫోటోలు

‘నేషనల్ జాగ్రఫిక్ ట్రావెలర్’ మ్యాగజైన్ (National Geographic Traveler) వారు 2012 సంవత్సరానికి గాను నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన ఫొటోలివి. 152 దేశాలకు చెందిన 6,615 మందికి పైగా ఫోటో గ్రాఫర్లు 12,000 కి పైగా సమర్పించిన ఎంట్రీలనుండి విజేతలను నిర్ణయించారరని మ్యాగజైన్ వెబ్ సైట్ తెలిపింది. ఆఫ్ఘనిస్ధాన్ నుండి వియత్నాం వరకూ తీసిన ఈ ఫొటోల్లో ప్రశాంత ల్యాండ్ స్కేప్ దృశ్యాలనుండి యాదృచ్ఛిక సంఘటనల వరకూ అన్ని రకాల దృశ్యాలనూ పరిగణించారట. మొత్తం మీద చూస్తే…

ప్రభుత్వాల ఉదాసీనత ఫలితం, తమిళనాడులో శ్రీలంక యాత్రీకులపై దాడులు

శ్రీలంక తమిళుల పరిస్ధితిపై కేంద్ర ప్రభుత్వ ఉదాసీనత, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ రెచ్చగొట్టే ప్రకటనలు వెరసి శ్రీలంక యాత్రీకులపై విద్వేషపూరిత దాడులు జరుగుతున్నాయి. తమిళనాడు దేవాలయాలను సందర్శించడానికి శ్రీలంక నుండి వచ్చిన యాత్రీకులు మధ్యలోనే ప్రయాణం ముగించుకుని భయాందోళనలతో తిరుగు ప్రయాణం కట్టారు. తమిళనాడు సందర్శనకు వ్యతిరేకంగా శ్రీలంక ప్రభుత్వం ‘ట్రావెల్ అడ్వైజరీ’ కూడా జారీ చేయవలసిన పరిస్ధితి తలెత్తింది. తమిళనాడు తమిళులనుండి రాళ్ళు, చెప్పుల దాడిని ఎదుర్కొన్న యాత్రికులలో శ్రీలంక తమిళులే మెజారిటీ కావడం జాతి…

పవర్ గ్రిడ్ విఫలమై విద్యుత్ సరఫరా ఆగిపోతే… -ఫోటోలు

ఉత్తర భారతంలో నెల రోజుల క్రితం విద్యుత్ సరఫరా ఆగిపోయి జన జీవనం స్తంభించినప్పటి ఫొటోలివి. జులై 30, 31 తేదీల్లో ఉత్తర భారత దేశంలోని ఏడు రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్ధాన్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కాశ్మీర్ రాష్ట్రాలలో సరఫరా దెబ్బతిని అంధకారం నిండిపోయింది. రాజధాని, శతాబ్ది, దురంతో లాంటి సూపర్ ఫాస్ట్ సర్వీసులతో పాటు 300 కి పైగా రైళ్ళు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. జులై…

వోడాఫోన్ పన్ను వివాదం: ప్రణబ్ నిర్ణయాన్ని అపహాస్యం చేస్తున్న చిదంబరం?

భారత ప్రభుత్వానికి వోడాఫోన్ కంపెనీ పన్ను ఎగవేసిన వివాదానికి సంబంధించి ఆర్ధిక మంత్రిగా ప్రణబ్ ముఖర్జీ తీసుకున్న నిర్ణయాలు అపహాస్యం పాలవుతున్నాయి. ప్రభుత్వ ఖజానా కోసం ప్రణబ్ ముఖర్జీ తీసుకున్న నిర్ణయాలను అపఖ్యాతిపాలు చెయ్యడంలో కొత్త ఆర్ధిక మంత్రి చిదంబరం బిజీ అయినట్లు కనిపిస్తోంది. వోడా ఫోన్ పన్ను విషయమై దుడుకు (rash) నిర్ణయాలు తీసుకోబోమని చిదంబరం సోమవారం ప్రకటించాడు. తద్వారా ప్రణబ్ ముఖర్జీ నిర్ణయం అనాలోచితమైనదని పరోక్షంగా సూచించాడు. కేమన్ ఐలాండ్ లో రిజిస్టరై భారత్…

మధ్య ప్రదేశ్ కోల్-గేట్: కాంగ్రెస్, బి.జె.పి ఇరువురూ పాత్రధారులే

బొగ్గు కుంభకోణం దరిమిలా ప్రధాని రాజీనామాకు బి.జె.పి పట్టుబడుతున్న నేపధ్యంలో బి.జె.పి ముఖ్యమంత్రుల ‘మినీ బొగ్గు కుంభకోణాలు’ బైటికి వస్తున్నాయి. 2011 లో రిలయన్స్, ఎస్సార్ కంపెనీలకు బొగ్గు గనులు తవ్వకానికి అనుమతి ఇవ్వడానికి మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వంతో లాబీయింగ్ నిర్వహించి సఫలమయిన విషయాన్ని ‘ది హిందూ’ పత్రిక వెల్లడి చేసింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ మాజీ మంత్రి జై రామ్ రమేష్ తీవ్ర అభ్యంతరాలను పక్కనబెట్టి కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం…

డబ్బుకు లోకం దాసోహం, ఆలోచనాత్మక ఫోటో ప్రాజెక్ట్ -ఫోటోలు

వినియోగం కోసం తయారు చేసుకున్న వస్తువుల మారకం కోసం మనిషి సృష్టించిన సాధనమే డబ్బు. మారకాన్ని సులభతరం చేయడానికి పుట్టిన డబ్బు మనిషి జీవితాన్ని సంక్లిష్టం చేసింది. సామాజిక జీవనంలో భాగంగా పుట్టి సమాజాన్ని తన వశం చేసుకుంది. ఏం చేసయినా తనను వశం చేసుకున్నవాడిని అందలం ఎక్కించింది. శ్రమ తప్ప ఏమీ చేయ(లే)నివాడిని పాతాళానికి తోక్కేసింది. అమ్మా నాన్న, అక్కా చెల్లి, అన్నా తమ్ముడు, భార్య భర్త… ఇలా సమస్త సంబంధాల్లోకి జొరబడి మానవత్వాన్ని, మానవ…

నరోడ-పాటియా: నేరమెవరిది? శిక్షలెవరికి? -ఫోటోలు

2002 ఫిబ్రవరి 28 తేదీన అహ్మదాబాద్ శివార్లలోని నరోడ-పాటియా లో ముస్లింలపై సాగిన నరమేధానికి దోషులెవరో ప్రత్యేక సెషన్స్ కోర్టు గుర్తించింది. ముఖ్యంగా చేతిలో తుపాకి ధరించి, హిందూ మతం పేరుతో మూకలను రెచ్చగొట్టి, వారికి కత్తులు, కరవాలాలు సరఫరా చేసి తమను తాము రక్షించుకోలేని నిస్సహాయ మహిళలపైనా, పసి పిల్లలపైనా, వృద్ధులపైనా అత్యంత క్రూరంగా, అమానవీయంగా హత్యాకాండకి నాయకత్వం వహించిన మహిళా డాక్టర్ గా డాక్టర్ మాయాబెన్ కొడ్నానిని కోర్టు గుర్తించింది. రీసెర్చ్ స్కాలర్ పేరుతో…

మోడి ప్రతీకార సిద్ధాంతానికి చెంపపెట్టు, నరోడ-పాటియా తీర్పు

గుజరాత్ నరమేధం లో భాగంగా జరిగిన నరోడ-పాటియా హత్యాకాండ కేసులో ప్రత్యేక సెషన్స్ కోర్టు తరతరాలకు నిలిచిపోయే విధంగా అత్యద్భుతమైన తీర్పు ప్రకటించింది. గోధ్రా రైలు దహనానికి హిందువులు ఐచ్ఛికంగా తీసుకున్న ప్రతీకార చర్య ఫలితమే ‘ముస్లింలపై సాగిన నరమేధం’ అని ప్రవచించిన నరేంద్ర మోడి ‘ప్రతీకార సిద్ధాంతానికి’ చెంప పెట్టులాంటి తీర్పు ప్రకటించింది. గుజరాత్ మాజీ మంత్రి మాయా కొడ్నాని, భజరంగ్ దళ్ నాయకుడు బాబూ భజరంగి తదితరులు పన్నిన కుట్ర ఫలితంగానే ‘నరోడ-పాటియా నరమేధం’…