భేదాభిప్రాయాలు సహజం, సత్యాన్వేషణే అంతిమ లక్ష్యం!


(ఇది చందుతులసి గారి వ్యాఖ్య. మరో వ్యాఖ్యాత చందు గారితో తన అభిప్రాయాన్ని పంచుకుంటూ ఆయన వ్యక్తపరిచిన అభిప్రాయం. సమస్యను విభిన్న కోణంలో చూస్తారని చందుగారిని అభినందిస్తూ, భేదాభిప్రాయాలను ఎలా చూడవచ్చో, చూడాలో చెప్పిన అమూల్యాభిప్రాయం.  నచ్చని అభిప్రాయాలను కూడా గౌరవంగా ఎలా చూడవచ్చో క్లుప్తంగా ఈ నాలుగు మాటలు వివరిస్తున్నాయి. ఆయన అభిప్రాయంతో ఏకీభవిస్తూ మరింత వెలుగు కోసం టపాగా మారుస్తున్నాను. -విశేఖర్)

                       ***                                           ***                                             ***

మనందరికీ అభిప్రాయాలు వెల్లడించే హక్కు ఉంది. బహుశా వాల్టేర్‌ అనుకుంటా… గొప్ప మాట‌ చెప్పాడు…

“I disapprove of what you say, but I will defend to the death your right to say it.”

నీ అభిప్రాయంతో నేను ఏకీభవించకపోవచ్చు. కానీ నీకు అభిప్రాయం వెల్లడించే హక్కు కోసం చావుతోనైనా పోరాడతాను.

ప్రపంచంలో భిన్న రకాల మనుషులున్నట్లే భిన్నరకాలు అభిప్రాయాలుంటాయి. ఉండాలి కూడా. ఒక్కొక్కరు సమస్యను ఒక్కో కోణంలో చూస్తారు. దీనికి ఆ వ్యక్తి నేపథ్యం, చదువు, మానసిక పరిణతి, నమ్మిన సిద్ధాంతాలు, విలువలు… ఇలా అనేక కారణాలు.

మన మనసుకు నచ్చిన అభిప్రాయాలు వెల్లడించిన వారిని, మన ఆలోచనలకు దగ్గరగా ఉండేవారిని మనం ఇష్టపడతాం. మనకు భిన్నంగా ఆలోచించేవారిని దూరంగా ఉంచుతాం. దురదృష్టవశాత్తూ… మనలో చాలా మంది ఒక విషయానికి రెండో కోణం ఉంటుందన్న వాస్తవం గ్రహించేందుకు సిద్ధపడరు. ఇక్కడే సమస్య.

ఒక విషయాన్ని భిన్న కోణాల్లోంచి చూడగలగడమే జ్ఞానానికి మొదటి మెట్టు. కనుక ఎవరి అభిప్రాయాన్నైనా గౌరవించాలి. (అభిప్రాయంతో అంగీకరించకున్నా.)

మనకు తెలిసిన దాన్ని వారితో పంచుకోవాలి. అభిప్రాయ బేధాలుంటే పరిష్కరించుకోవాలి. తమ ఇద్దరిలో ఏది ఉత్తమమో తేల్చుకోవాలి.

తిరిగి ఇద్దరూ కలిసి మరో సత్యాన్ని అన్వేషించాలి. ఇలా అంతా కలిసి అసలైన సత్యాన్ని తెలుసుకొవాలి. ఆ సత్యాన్ని అందరికి చెప్పాలి.

సత్యం ద్వారా మొదట మనలో మార్పు రావాలి. తర్వాత సమాజంలో మార్పు సాధించాలి. మనిషి జీవితానికి ఇంతకు మించిన పరమార్దం ఉందని నేను అనుకోను.

అన్నట్లు నేనేదో నా అభిప్రాయాలు, భావాలు పంచుకుంటున్నాను. ఇది మీకు హితబోధ మాత్రం కాదు.

22 thoughts on “భేదాభిప్రాయాలు సహజం, సత్యాన్వేషణే అంతిమ లక్ష్యం!

 1. బొందలపాటి గారూ, మీ లాజిక్ చదివాను. మీరు తీసుకున్న పోలిక ద్వారా విషయాన్ని వివరించిన తీరు బాగుంది.

  అయితే అన్ని అభిప్రాయాలు కరెక్టే అనడంలో యాంత్రికంగా అన్వయించినట్లు కనిపిస్తోంది. సామాజిక పరిస్ధితులపై తమ తమ అనుభవాలని బట్టి అభిప్రాయాలు ఏర్పడతయాన్నది నిజం. కాని ఏ ఒక్కరి అనుభవాలు సంపూర్ణం కానందున అందరి అభిప్రాయాలూ కరెక్టే అనడం సరికాదని నా అభిప్రాయం.

  మీరు చెప్పిన ఉదాహరణ కోణం నుండి చూస్తే… బుట్టలో ఉన్న మొత్తం గోలీలే అసలు నిజం తప్ప గుప్పిటలో ఉన్నవి మాత్రమే వాస్తవం కాదు. ఎవరి అనుభవం ఏదైనా, వాటితో నిమిత్తం లేకుండా సమాజం, అందులో వాస్తవాలు ఎప్పుడూ ఒకటే కదా.

 2. విశేఖర్ గారు,
  బుట్ట లో రంగు గోళీలు ఏ నిష్పత్తి లో ఉన్నాయో మనం తీసిన గుప్పెడు గోలీలలో కూడా రంగు గోళీలు అదే నిష్పత్తి లో ఉండే అవకాశం ఉంది. ఇలాంటప్పుడు మన అనుభవం, వాస్తవం, ఒకటే అవుతాయి.
  అలానే కొందరి గుప్పెట్లోని గోళీల నిష్పత్తి బుట్టలోని నిష్పత్తి కి దగ్గరగా ఉంటే, ఇంకొన్రి గుప్పెట్లోని గోళీల నిష్పత్తి బుట్టలోని గోలీల నిష్పత్తి కి చాలా దూరం గా ఉంటుంది. కాబట్టీ ఒకరి అభిప్రాయం ఎంత నిజం (90% నిజమా 40% నిజమా?) అనే quantitative judgement కూదా అవసరమే. కానీ ఎవరి గుప్పెట బుట్టలోని గోళీల నిష్పత్తి కి దగ్గరగా ఉంది అనే విషయం లో, ఒక నిరూపణ (proof) అంటూ ఏమీ లేదు. ఆ నిరూపణ అనేది శాస్త్రీయమైన ప్రయోగాల వలననే సాధ్యం. కానీ సామాజిక రంగాలలో, ముఖ్యం గా మన దేశం లో ఇటువంటి ప్రయోగాలు తక్కువ. పాశ్చాత్య దేశాలలో మనం హాస్యాస్పదం అనుకొనే విషయల గురించి కూడా ప్రయోగాలు జరుగుతాయి. ఈ మధ్య రిసెషన్ దెబ్బకి డబ్బులు లేక కొంత వెనుకకి తగ్గుతున్నారు. ఈ ప్రయోగాలు కూడ అన్నీ బయాస్ కి అతీతం అని చెప్పలేం.
  మొత్తం మీద ఒక రి భిప్రాయం వేరొకరి అభిప్రాయం కంటే సరైనది అని నిరూపించే పధ్ధతులు లేనందున, అలా ప్రూవ్ అయ్యే వరకూ, అందరి అభిప్రాయాలూ సాపేక్షం గా సరైనవే అనుకోవటం మంచిది అని నేననుకొంటాను. సాపేక్షం గా మాత్రమే, పరిపూర్ణం గా కాదు.
  ఈ ఉదాహరణ పని చేయని కొన్ని స్పెషల్ కేసులు కూడా ఉన్నాయి. బుట్టలో ఓ వంద నల్ల గోలీలూ, ఐదు తెల్ల గోలీలూ ఉన్నాయనుకొందాం నేను తీసిన గుప్పెట్లోకి బుట్టలో ఉన్న ఐదు తెల్ల గోళీలు మాత్రమే వచ్చాయనుకొందాం. నా అభిప్రాయం ప్రకారం బుట్టలో అన్నీ తెల్ల గోలీలే ఉండాలి. గొళీలు తీసిన తరువాతి బుట్టని చూస్తే అందులో అన్నీ నల్ల గోళీలే ఉంటాయి.
  కానీ సమాజమనే బుట్టలోంచీ మన అభిప్రాయమనే గోళీలను తీయటం వలన, బుట్టలో గోళీల సంఖ్య తగ్గదు. కాబట్టీ నేనిచ్చిన అన్వయానికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి.బుట్టలోని గోళీలను సాంపిల్ తీసేముందు మాత్రమే పరిగణన లోకి తీసుకోవాలి.
  నేను ఈ స్పష్టతనూ, ఇంకొన్ని వివరణ ల నూ ఇచ్చినట్లైతే, యాంత్రికం గా అన్వయించినట్లు అనిపించేది కాదేమో!
  అలానే ఒక మనిషి ఆంధ్ర దేశం లో వేసవి కాలం లో మంచుకురుస్తుంది అనే అభిప్రాయం కలిగి ఉన్నాడనుకొందాం. అతని అభిప్రాయం నిస్సందేహం గా తప్పు. అలాంటి గోళీలు బుట్టలో ఉండే అవకాశం లేదు కాబట్టీ.

 3. అభిప్రాయాలు అనేవి ఎన్నడూ బలవంతం వల్ల మారవు. చిన్నప్పుడు మా నాన్న నన్ను బెల్ట్‌తో కొట్టి చదివించి డాక్టర్‌నో, ఇంజినీర్‌నో చెయ్యాలనుకున్నాడు. కానీ నేను డాక్టర్ అవ్వలేదు, ఇంజినీర్ అవ్వలేదు. డాక్టర్‌లు, ఇంజినీర్‌లతో పోలిస్తే రెవెన్యూ ఇన్స్పెక్టర్‌లు, పోలీస్ ఇన్స్పెక్టర్‌లకి వచ్చే జీతం తక్కువ కావచ్చు. “డాక్టర్ లేదా ఇంజినీర్ అవ్వలేక రెవెన్యూ ఇన్స్పెక్టర్ లేదా పోలీస్ ఇన్స్పెక్టర్ అయినవాళ్ళందరూ ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్‌కి లోనై ఆత్మహత్యలు చేసుకుంటున్నారా?” అని మా నాన్నని అడిగితే సమాధానం చెప్పేవాడు కాదు. “వాళ్ళ గురించి నీకెందుకురా, నీ చదువు & నీ కెరీర్ గురించి ఆలోచించు” అని అంటూ తిట్టేవాడు. అభిప్రాయాలు అనేవి నిజంగా బలవంతం వల్ల మారే పరిస్థితి ఉంటే నేను కూడా డాక్టర్ లేదా ఇంజినీర్ అవ్వకపోతే జీవితం వేస్ట్ అని అనుకుని ఈ పాటికి ఆత్మహత్య చేసుకుని ఉండేవాణ్ణి. అభిప్రాయాలు అనేవి భౌతిక అనుభవాలు & చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల కలుగుతాయి.

  మనిషికి అభిప్రాయాలు ఏర్పడడంపై అతని గురువుల ప్రభావం కూడా తప్పకుండా ఉంటుంది. కార్ల్ మార్క్స్ జీవిత చరిత్ర చదివాను. రోబర్ట్ ఓవెన్, సెయింట్ సైమన్ లాంటి ప్రగతివాదుల గురించి తెలియకపోయి ఉంటే మార్క్స్ కూడా సమాజం గురించి ఆలోచించకుండా కేవలం వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించేవాడేమో అనే సందేహం వచ్చింది. మార్క్స్ తండ్రి హెన్రిక్‌లో కొంత వరకు ప్రజాస్వామిక భావనలు ఉండేవి. అతని తండ్రితో పాటు అతని తండ్రికి తెలిసినవాళ్ళు కూడా అతనికి రోబర్ట్ ఓవెన్, సెయింట్ సైమన్ వంటి వారి గురించి పరిచయం చేశారు. జీవితంలో డబ్బు సంపాదించడం ఒక్కటే పరమార్థం అనుకుని పిల్లల్ని బెల్ట్‌తో కొట్టి చదివించి డాక్టర్‌నో, ఇంజినీర్‌నో చెయ్యాలనుకునే తల్లితండ్రుల పెంపకంలో పెరిగినవాళ్ళకి సామాజిక భావజాలాల గురించి తెలిసే అవకాశాలు తక్కువే. “తండ్రి-కొడుకుల సంబంధమే డబ్బు సంబంధమైనప్పుడు ఇక సామాజిక సంబంధాల గురించి ఆలోచించడం అనవసరం” అని ఆ వాతావరణంలో పెరిగినవాళ్ళు అనుకునే అవకాశాలు ఎక్కువ.

  ఒకరికి ఎదురైన అనుభవాలు ఇంకొకరికి ఎదురవ్వకపోవచ్చు. ఇద్దరు వ్యక్తుల మధ్య అభిప్రాయ బేధాలు ఏర్పడడానికి ప్రధాన కారణం ఇదే. ఒకడు హాస్టల్‌లో చదువుకుని ఆ చదువుతో డాక్టర్ లేదా సైంటిస్ట్ అవుతాడు. అంతమాత్రాన హాస్టల్‌లో చదివినవాళ్ళందరూ డాక్టర్‌లు లేదా సైంటిస్ట్‌లు అవుతారని అనుకోలేము. హాస్టల్‌లో ఉంటూ బంధువులకి దూరంగా పెరగడం వల్ల బంధుత్వాల విలువ తెలియక ఇన్సెస్ట్ చేసినవాళ్ళు కూడా ఉన్నారు. మా పిన్ని గారి స్నేహితురాలు ఒక ప్రముఖ రచయిత్రి. ఆవిడ డిటెక్టివ్ నవలలు వ్రాసేది. ఆవిడ తన సొంత పెదనాన్న గారి అబ్బాయినే పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయింది. ఆవిడ హాస్టల్‌లో పెరిగిందా లేదా ఇంటిలో ఉన్నా బంధువులకి దూరంగా ఉండిందా అనేది తెలియదు. తన స్నేహితురాలి గురించి చెప్పినప్పుడు “ఒకరి నీతికీ, ఇంకొకరి నీతికీ మధ్య తేడా ఉంటుంది” అని మా పిన్ని గారు అనేవారు. కానీ నీతి పైన చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రభావం ఉంటుందనే అనిపిస్తోంది. ఎందుకంటే సంభవమైనది ఏదైనా అది భౌతిక పరిస్థితుల నుంచే పుడుతుంది కానీ శూన్యం నుంచి పుట్టదు కదా.

 4. ఇంకో విషయం. తల్లితండ్రులు పిల్లల్ని ప్రేమగా పెంచినప్పుడు పిల్లల్ని బెల్ట్‌తో కొట్టి చదివించే eternal money minded తల్లితండ్రులు కూడా ఉంటారని ప్రేమ పూరిత వాతావరణంలో పెరిగిన పిల్లలకి తెలియకపోవచ్చు. కుటుంబ సంబంధాలు ఎలా ఉంటాయి అనే విషయంలో ప్రేమ పూరిత వాతావరణంలో పెరిగిన పిల్లలకీ, ప్రేమ రహిత వాతావరణంలో పెరిగిన పిల్లలకీ మధ్య తప్పకుండా అభిప్రాయ బేధాలు ఉంటాయి. ఇక్కడ ఒకరు చెప్పింది నిజం, ఒకరు చెప్పింది అబద్దం అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇవి వ్యక్తులకి స్వయంగా ఎదురైన అనుభవాల వల్ల కలిగిన అభిప్రాయాలు కదా.

  నక్సలైట్ ఉద్యమం మొదలైన కొత్తలో దేశంలో అయిదేళ్ళలో విప్లవం వస్తుందనుకుని ఉద్యమంలో చేరి, సంవత్సరాలు గడిచినా విప్లవం రాకపోవడంతో పార్టీ వదిలి వెళ్ళిపోయినవాళ్ళు ఉన్నారు. సోవియట్ యూనియన్‌లోనూ, తూర్పు యూరోప్‌లోనూ విప్లవ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి కనుక ఇండియాలో కూడా విప్లవం వచ్చే సమయం దగ్గరపడిందని అనుకున్నారు. వర్గ వైరుధ్యాలని అంత తక్కువగా అంచనా వెయ్యకూడదు, విప్లవం అనేది అంత తొందరగా రాదు అని కొందరు విప్లవకారులు చెప్పినా వాళ్ళు వినలేదు. వర్గ వైరుధ్యాలని కొంత మంది తక్కువగా ఎందుకు అంచనా వేశారు, కొందరు లోతుగా ఎందుకు అంచనా వేశారు? కుల సమాజంలో ఉన్నత కులంలో పుట్టి కులం గురించి ఆలోచించనివాళ్ళు కొంత మంది ఉన్నట్టే వర్గ సమాజంలో కూడా ఆర్థికంగా ఉన్నత స్థాయి ఉన్న కుటుంబంలో పుట్టి వర్గం గురించి ఆలోచించనివాళ్ళు కొంత మంది ఉంటారు. వీళ్ళని చూస్తే వర్గ వైరుధ్యాలు బలంగా లేవని అనిపిస్తుంది. వర్గ వ్యవస్థనే బలంగా నమ్ముకుని ఈ వ్యవస్థలోనే తమకి భౌతిక ప్రయోజనాలు ఉన్నాయని అనుకునేవాళ్ళు ఉంటారు. వీళ్ళని చూస్తే వర్గ వైరుధ్యాలని తక్కువ అంచనా వెయ్యకూడదని అనిపిస్తుంది. అందరికీ ఎదురయ్యే అనుభవాలు ఒకేలాగ లేనప్పుడు ఇలాగే జరుగుతుంది.

 5. మన ఆలొచనలూ అభిప్రాయాలూ, చారిత్రకంగా మనముందుంచిన ఫలితాలతొ మనం ఆలొచించడం మొదలుపెడతాం, అనగా పూర్తిగా దాని వ్యతిరేక దిశలొ. ఆ ఆలొచనలూ, అభిప్రాయాలూ, ఆ సామాజిక దశలను అనుసరించి నిర్దిష్టంగా వుంటాయి. వ్యక్తిగత అనుభవమనేది అదెప్పుడూ, నిర్దిష్టంగానే వుంటుంది. మనం సత్యన్ని సొధించాలంటె మనముందుంచి ఫలితాలతొకాక దనికి కారణమైన దాన్ని పట్టుకొవాలి. ఆ కారణం ఒకటే వుంటుంది. ఒక విషయాన్ని పదిమంది పదిరకాలుగా చెపితే సత్యమనేది పదిరకాలుగా వుండదు. ఒక సామాజికదశననుసరించి సార్వత్రికంగా ఒకేలాంటి ఆలొచనా విదానాన్ని కలిగివుంటారు. చిన్న చిన్న తేడాలు వదిలేస్తె . సమాజం రొండు వర్గాలుగా విడి విడిపొయినప్పుడు భిన్న ప్రయొజనాలుగల వర్గలుగా వున్నప్పుడు ఘర్షణ ఏర్పడుతుంది. వాళ్ళ వాళ్ళ ప్రయొజనాన్ని బట్టి ఆలొచనా విదానం వుంటుంది. రెండే వర్గాలున్నట్టుగా ఆలొచనా విదనాన్ని కుడా రెండుగా కుధించవచ్చు. బొండాలపతిగారి గొళీల ఉదాహరణ సార్వత్రికంగా అయితే పనికిరాదు విడిబాగాలకయితే తీసుకొవచ్చు. మనిషి, మనిషికీ అనుభవాలు భిన్నంగా వుంటయి కదా అందులొ ప్రతేకం వళ్ళు వాళ్ళ ఆర్దిక నేపద్యలను బట్టి. ఈమద్య రంగనాయకమ్మ గారు తన పాటకుల అనుభవాలను చెప్తూ తనను కలవటానికి వచ్చేవాళ్ళు తనకు తెలియపరసకుండా వస్తున్నరని.ప్రాదానంగ ఆరొపనచేశారు. అలా తెలియపరచిరావలనే దశకు ఇంకకొంతమంది చేరుకొలేదు. వాళ్ళను కలవాలనుకున్నప్పుడు చెప్పిరారు కదా. వాళ్ళు కుడా అదేపద్దటి పాటించి వుంటారు. ఇలాంటి చిన్న చిన్న వాటిని వదిలేస్తె సార్వత్రికంగా ఒకే విధంగా వుంటారు.

 6. అవును రామ్మోహన్‌ సార్‌ . ఇదంతా మనం సాధారణంగా అభిప్రాయాలు ఎలాకలిగి ఉంటామనే దానిపై మన విశ్లేషణ.
  సత్యం గ్రహించాలనే కోరిక ఉన్న వారు తమ వాదనలో తప్పుంటే అంగీకరిస్తారు.
  ఐతే కొందరు ఎలా ఉంటారంటే తమ అభిప్రాయాన్ని బయటకు ఒప్పుకోరు. తమ వాదనలో నిజం లేదని తెలిసి కూడా ఏవో కొన్ని మినహాయింపు లాంటి ఉదాహరణలు చూపించి తమ వాదన సమర్థించుకుంటారు. అలాంటి వాళ్లతోనే అసలు సమస్య.
  వాళ్లు కాలికేస్తే మెడకు…మెడకేస్తే కాలికి…ఇలా వాదిస్తుంటారు. ఫలితంగా విషయం పక్కదోవపడుతుంది.
  భేషజాల వల్ల వచ్చిన సమస్య ఇది.
  సత్యం కన్నా మన ఇగో ఎప్పటికీ గొప్పది కాదు కదా…

 7. విశేఖర్ గారు, గతంలో నేను CPI, CPM & న్యూ డెమోక్రసీ పార్టీలని విమర్శించినప్పుడు మీరు “ఈ పార్టీలు పార్లమెంటరీ పంథా వల్ల తప్పులు చేస్తున్నాయి కానీ ఈ పార్టీల నాయకులు renegades కాకపోవచ్చు” అనే అర్థంతో సమాధానాలు వ్రాసారు. పైగా న్యూ డెమోక్రసీ విషయంలో నేను చేస్తున్నదే వితండవాదం అని మీరు అన్నారు. పార్లమెంటరీ పంథా ఎన్ని పరిమితులకి లోబడి ఉంటుందో “The Naxalite Movement in Punjab” పుస్తకంలో చదివాను. ఒక వైపు సాయుధ పోరాటం చేస్తూ ఇంకో వైపు పార్లమెంటరీ పంథాని నమ్ముకునే న్యూ డెమోక్రసీని కూడా నేను విశ్వసించకపోవడానికి ఆ పుస్తకం కూడా ఒక ప్రధాన కారణం. కానీ మీరు నన్ను “నేను పట్టిన కుందేలుకి మూడేకాళ్ళు” అని వాదించే రకం మనిషిని చూసినట్టు చూశారు.

  “జన సాహితీ సంస్థతో మా విబేధాలు” పుస్తకంలో రంగనాయకమ్మ గారు జన సాహితీ సంస్థ & Organisation for Peoples’ Democratic Rights (OPDR)లని విమర్శిస్తూ ఇదే విషయం వ్రాసారు. ఒక సంస్థ సాయుధ పోరాటం చెయ్యకుండా బహిరంగ రాజకీయాలలో పని చేస్తున్నప్పుడు ఆ సంస్థ చట్టపరమైన పరిమితులకి లోబడి పని చెయ్యాల్సి వస్తుంది. తమ సంస్థ అజెండాతో విబేధించిన రంగనాయకమ్మ & ఆవిడ భర్త బి.ఆర్.బాపూజీలని జనసాహితీ సంస్థవాళ్ళు ఇన్‌ఫార్మర్‌లుగా ముద్ర వేసి సంస్థ నుంచి బహిష్కరించారు. ఈ సందర్భంలో రంగనాయకమ్మ గారు కొన్ని ప్రశ్నలు వేశారు. “జన సాహితీ సంస్థ ఒక కమ్యూనిస్ట్ సంస్థా లేదా సాధారణ సంస్కరణవాద సంస్థా?”, “జన సాహితీ ఒక అండర్‌గ్రౌండ్ సంస్థా లేదా బహిరంగ రాజకీయాలు నడిపే సంస్థా?” OPDRపైన కూడా ఇటువంటి ప్రశ్నలే వేశారు. బహిరంగ రాజకీయాలు నడిపేవాళ్ళని పట్టుకోవడానికి ఇన్‌ఫార్మర్‌లు అవసరం లేదు. కనుక రంగనాయకమ్మ & బి.ఆర్.బాపూజీలు ఇన్‌ఫార్మర్‌లు కానట్టే. తమ సంస్థ యొక్క modus operandi ఏమిటో చెప్పకుండానే రంగనాయకమ్మ & బి.ఆర్.బాపూజీలని తమ సంస్థ నుంచి బహిష్కరించారు జన సాహితీ సంస్థవాళ్ళు.

  CPI, CPM & న్యూ డెమోక్రసీ పార్టీల అజెండా & మోడస్ ఓపరాండీ కూడా స్పష్టంగా లేని విషయాలే. అందుకే నేను ఈ మూడు పార్టీలనీ ఒకేలాగ చూశాను. కానీ న్యూ డెమోక్రసీపై నేను వ్రాసిన విమర్శలు చదివినప్పుడు “బేధాభిప్రాయాలు సహజమే” అనే విషయం గుర్తు తెచ్చుకోకుండా మీరు నన్ను అదోలా చూశారు. అయినా నేను మీరు వ్రాసే పోస్ట్‌లని శ్రద్ధగా ఫాలో అవుతూ వచ్చాను. తనకొక్కడికే మార్క్సిజం-లెనినిజం తెలుసనీ, మిగితా మార్క్సిస్ట్‌లకి మార్క్సిజం-లెనినిజం తెలియదనీ అనుకునేవాడు మార్క్సిస్ట్ కాదు. మనవాళ్ళకి స్కూల్ పుస్తకాలు & కాలేజ్ పుస్తకాలు చదివేసరికే అలసట వచ్చేస్తుంది. ఈ స్థితిలో మార్క్సిజం-లెనినిజం చదివేవాళ్ళ సంఖ్య తక్కువగానే ఉంటుంది. నేను చదివిన పుస్తకాలు మీరు చదివి ఉండకపోవచ్చు, మీరు చదివిన పుస్తకాలు నేను చదివి ఉండకపోవచ్చు. కనుక మనిద్దరి మధ్య అభిప్రాయ బేధాలు సహజమే. గతంలో న్యూ డెమోక్రసీ గురించి చర్చ జరిగిన సమయంలో మీకు ఆ విషయం గుర్తుండి ఉంటే బాగుండేది.

 8. ప్రవీణ్, నాకు గుర్తున్నంతవరకూ మీరు పైన చేసిన ఆరోపణ నిజం కాదు. మన మధ్య ఒక చర్చ అయితే జరిగింది. కాని మీరు చెప్పిన విషయం కాదని నాకు గుర్తు. నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడిగాను. దానికి మీరు సమాధానం ఇవ్వకుండా మీరు చెప్పిందే రిపీట్ చేసినట్లు గుర్తుంది. చర్చకి సంబంధించిన లింక్ ఇక్కడ ఇస్తే ఇతరులకి కూడా ఆ విషయం తెలుసుకునే అవకాశం ఉంటుంది. లింక్ ఇవ్వగలరా?

 9. చర్చ జరిగిన సమయంలో నేను శ్రీకాకుళంలో ఉన్నాను. అప్పటికీ నేను వైజాగ్ ఇంకా రాలేదు. వైజాగ్ వచ్చే ముందు పుస్తకాలు సర్దుతోంటే “The Naxalite Movement in Punjab” పుస్తకం తిరిగి దొరికింది. “India is not ripe for revolution” అని న్యూ డెమోక్రసీ విశ్వసిస్తోందని నేను ఒక ఇంగ్లిష్ వెబ్‌సైట్‌లో చదివాను. అది ఒక మూతపడిన వెబ్‌సైట్ కావడం, ఆ వెబ్‌సైట్‌లో రిఫరెన్సెస్‌గా ఇచ్చిన ఎక్స్‌టర్నల్ లింక్స్ కూడా గుర్తు లేకపోవడం వల్ల సమాధానం చెప్పలేకపోయాను. అంతే కానీ వితండవాదం చేస్తే నాకేమీ రాదు.
  http://4proletarianrevolution.mlmedia.net.in/131229434

 10. @Bondalapati garu: ఇక అంతర్జాల చర్చల విషయానికి వస్తే, అనేక మంది రాగద్వేషాలతో చర్చలు చేస్తుంటారు. విషయాన్ని అన్వేషిద్దాం అని కాక తమ వాదనే గెలవాలి అని వాదిస్తుంటారు..

  Whatever you said is INFINITELY True! Everyone here 99% are doing the same! Just they write posts for the sake with great titles! But they never do it, for the matter of fact!

  Chandu

 11. @Chandu Tulasi garu: You should start a blog. You might be having, but your sign-in link takes me nowhere!

  @Visekhar garu: I know you may not accept this. But, please stop writing more and more about castes and castes and castes and castes. Everyone has problems. Your analysis on international trades and news is really readable and we enjoy it. When you mention something about those castes and all, even though we have friends in our dalit castes it is creating so much gap between us. Let us top naa! At least,we younger generations should avoid this.

  My dalit friends are asking me that why is he so moronic about all these caste things. They are complaining that you are exaggerating sir! Yes, there are people who are having problems. I agree. But your views are one-sided. I could not answer my friends because I already apologized you and I dont want to tell anything bad about you as I see you as an analyst. But, this caste posts are really demeaning. Please consider!

  I know how many people are going to bash me for this! I cant think of comments flow about my comment, but that is okay! I am ready. But, I have to say! Leave castes and all! Why can’t we make this place a better one? Please!

 12. You may have dalit friends but surely those dalits are not from slums of mid town or huts of village edge.

  వేరే కులంవాళ్ళతో తిరగడం గొప్ప కాదు, ఆ విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కులంతో సంబంధం లేకుండా మీ కులానికే చెందిన ఒక మురికివాడవాసితో స్నేహం చెయ్యగలవా? కులాలు ఉన్న సమాజంలోనైనా, లేని సమాజంలోనైనా ఆర్థిక అసమానతలు పైకి కనిపించే ప్రభావాన్నే చూపిస్తాయి.

 13. Chandu garu,

  First: Please do not tell me what to write or what not to write. It is none of your business.

  Second: Stop impersonating your dallit friends. If they exist, let them speak. Regarding gap, it is your problem. You only have to deal with it, not me or my blog.

  Third: As long as I see caste around me and as long the menace of caste exists in India, I will keep writing about it. If it doesn’t please you I can’t help it. I’m not in UK. I live in India and I feel India. I can’t just pretend blind by not seeing the truth around me.

  If you tell something bad or good about me, it is your taste, not mine.

  And finally, stop being moronic by imposing your unsubstantiated, immature, incomplete and biased views on me and other bloggers and commenters.

  Yes! Help me making my blog better place by obliging above points.

 14. @Praveen: Yes, I am from slum! We were not rich at all! We had my complete schooling only in govt. municipal school. I had friends only from slums! By god’s grace or something, we studied well despite of having distractions. I never mentioned my friends are from rich families. But, only one friend could not make after intermediate! He went on to start a barber shop. We friends helped him to start that barber shop. He is decently doing good.

  When YOU all are pointing out the differences between dalit and non-dalit and repeatedly telling and telling that richer people keep those dalits away etc… Yes, I take pride in proving that you are utterly wrong! Yes – adi goppa vishayamey!

  It takes a mighty heart with a common sense to under stand this!

 15. @Visekhar: Not a surprising thing that you wrote this! In fact, I made some points to my friends about what you are going to write! Out of 5 points you mentioned 2 correctly!

  I already mentioned somethings my comment. You did not consider. Its okay because I already expected!

  When you mentioned in otherway that “Reservations are birth right!”, we could see your face! To every dalit infant, you keep on telling that “We guys are suppressed. We need reservations”. From his tender age, you guys keep on telling that! You ……….. NEVER wanted equality. You dont want at all.

  1. I did not tell that what you have to write. You cant even grasp that its a request.
  2. Please dont bring in my friends in agony! They are the exact dalits. They are the souls and minds India needs. You are kind of some peanut minds managed by some cheap politicians. You never say anything in agony about my friends.
  3. You generalize very easily. For those riots in Hyderabad – You mentioned a post title generalizing ALL HINDUS that its their community sin. You dont have first of all that outlook. You are running a blog analyzing INTERNATIONAL news.

  Chandu

  (బూతుని ఎడిట్ చేసాను -విశేఖర్)

 16. చందుగారూ,

  I want to make my blog better place. అందుకే మీ బూతుల్ని ఎడిట్ చేశాను. బూతు రాసి బూతు కాదని మీరు చెప్పగలిగినా నా కది సాధ్యం కాదు. మీ బూతు సంసిద్ధత ఏమిటో పాఠకులు ఇప్పటికే చూశారు గనక మళ్ళీ కొత్త బూతుల్ని అనుమతించలేను.

  “When you mentioned in otherway that “Reservations are birth right!”

  రిజర్వేషన్ల అవసరం ఏమిటో ఎంత వివరించినా మీకిలాగే అర్ధం అవుతుంది. అంతకు తప్ప ఇంకోరకంగా మీరు చూడలేరు. మీ దృష్టిలో దళితులు అంటే మీకున్నారని చెబుతున్న నలుగురైదురు మిత్రులే. భారత దేశంలో అంటరానితనం ఇంకా భరిస్తూ, పొలాల్లో, ఫ్యాక్టరీల్లో రెక్కలు ముక్కలు చేసుకున్నా శ్రమకి తగిన ఫలితం లేకుండా బతుకుతున్న కోట్లాది మంది మీ దృష్టిలో దళితులు కాదు. మీరున్న బావి మాత్రమే మీ ప్రపంచం. రిజర్వేషన్లు తాత్కాలిక కంటితుడుపు చర్య తప్ప పరిష్కారం కాదని చెప్పినా అదేమీ చదవనట్లు గుడ్డితనం నటించడమే మీకు ఇష్టం. ఎవరి కళ్ళు వారు తెరుచుకోవాలి తప్ప ఎవరూ తెరిపించలేరు.

  ఓ పక్క దూషిస్తూ రిక్వెస్ట్ చేసానంటూ నటన ఎందుకు?

  పదే పదే మీ ఫ్రెండ్స్ ని ప్రస్తావిస్తూ, మీ అపరిపక్వ విశ్లేషణలోకి వారినెందుకు తెస్తారు? వారి గౌరవం కాపాడడం మీ మర్యాద. పక్కకి వెళ్ళి అమర్యాదగా మాట్లాడే మీకు అది తగునేమో. ఇక్కడ తగదు.

  “You mentioned a post title generalizing ALL HINDUS that its their community sin.”

  మళ్లీ ఒకసారి చదివి అర్ధం చేసుకోగలరేమో ప్రయత్నించండి. అర్ధం కాకపోతే ఎవరినైనా అడగండి. అంతే తప్ప నేను చెప్పని విషయాన్ని నాకు అంటగట్టొద్దు.

  “Your analysis on international trades and news is really readable and we enjoy it.”

  ఇది పైన ఒక వ్యాఖ్యలో మీరు చెప్పిన మాటే. మళ్ళీ ఇంతలోనే “You are running a blog analyzing INTERNATIONAL news.” అని వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఈరోజొక మాట, రేపొకమాట చెప్పడం, దానికి మళ్ళీ అర్ధంలేని సిద్ధాంతాలేవో చెప్పి సమర్ధించుకోవడం, ఏమిటిదంతా?

  మర్యాదస్తుడిలా నటిస్తున్నపుడు కనీసం ఆ నటనైనా సరిగ్గా చెయ్యాలి.

  మీరు బూతులు రాయకుండా, దూషించకుండా ఉంటే నిస్సందేహంగా మీరు వ్యాఖ్యలు రాయొచ్చు. ఇతర బూతురాయుళ్ళలాగా మీకూ అదే పని అని నాకు ప్రస్తుతానికి అనిపించడం లేదు. మీరు ఆవేశాన్ని తగ్గించుకుని ఉన్నది ఉన్నట్లు, రాసింది రాసినట్లు అర్ధం చేసుకుంటే మీరింతకంటే బెటర్ గా వ్యాఖ్యానించగలరని నా నమ్మకం. కాని ఇంతకుముందే చెప్పినట్లు ‘నాకనిపించింది అంటాను, మీరు పడాలి’ అని చెప్పదలిస్తే, సారీ!

 17. @ చందు గారూ… మీరు సమస్యను ఎంతసేపటికీ ఒకే కోణంలో చూస్తున్నారు.
  దయచేసి నా ఈ స్పందనను సానుకూలంగా చదవండి

  మీ వాదన సారాంశం….పేదలు దళిత కులాల్లోనే లేరు. అగ్రవర్ణాల్లోనూ ఉన్నారు.
  రిజర్వేషన్‌ల వల్ల ఓసీకులాల్లోని పేద పిల్లలు నష్టపోతున్నారు. మరోవైపు దళిత కులాల్లోని ఆర్థికంగా ఉన్నవారు మాత్రం ఇటు ఆర్ధికంగా, అటు రిజర్వేషన్‌ల వల్లా లాభపడుతున్నారు.

  -అగ్రవర్ణాల పేదల గురించి చర్చించకుండా… విశేఖర్‌ గారు దళిత పేదల గురించే ఎందుకు రాస్తున్నారు.

  ఆఖరికి మా దళిత స్నేహితులు కూడా ( పేదలు దళితుల్లోనే లేరని ) అంగీకరిస్తుంటే విశేఖర్‌ గారు ఎందుకు అంగీకరించరని..

  అగ్ర కులాల్లో పేదలు లేరని…వారికి ఏ సమస్యలు లేవని ఎవరూ అనరు ( విశేఖర్‌ గారు కూడా ఎప్పుడూ, ఎక్కడా రాసినట్లు నాకైతే గుర్తు లేదు.)

  – మొదట నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి.

  – 1. ప్రస్తుతం భారతదేశంలోని పేదల్లో దళితులు అధికమా…అగ్రవర్ణాలు అధికమా..?
  – 2. రిజర్వేషన్‌ల వల్ల లాభం పొంది ఇప్పటికీ రిజర్వేషన్‌లను పొందుతున్న దళితులు ఎంతమంది.
  రిజర్వేషన్‌ల ఫలితాలను ఇప్పటికీ అందని దళితులు ఎంతమంది. ( కారణాలు ఏవైనా సరే.)
  -3. రిజర్వేషన్‌ల కారణంగా చదువుకు దూరమవుతున్న లేదా, నష్టపోతున్న ఓసీల్లోని పేదలు ఎంతమంది…?

  పై మూడు వర్గాల్లో ఎవరి జనాభా అధికంగా ఉంటుంది. నిజాయతీగా చెప్పండి. లేదా మీ దళిత స్నేహితుల్ని అడగండి.
  దీనికి ఎవరైనా దళిత, ఇతర వెనుకబడిన కులాల్లోనే పేదలు అధికంగా ఉన్నారని. ( కనీసం దళిత కులాల్లోని పేదల కన్నా, ఓసీ కులాల్లో పేదలు తక్కువ అనే వాస్తవమయినా అంగీకరిస్తారా..)

  వీళ్లని రెండు రకాలుగా అనుకుంటే..1. దళిత పేదలు, 2. ఓసీ కులాల పేదలు

  ( పేదరికానికి కులం ఎలా ఉంటుందని, పేదలంతా ఒకటే అని కొందరు తెలివిగా వాదించవచ్చు. కానీ ఇది మనం పైకి వాదించటానికే బాగుంటుంది. సామాజికంగా అలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే పేదలంతా ఒకటే ఐతే అగ్రకులాల్లోని పేదవారు ఎవరైనా దళిత పేదవానికి తమ కూతురునిచ్చి పెళ్లి చేయగలరా. పెళ్లి కాదు తామిద్దరం పేదవాళ్లమే కనుక అతన్ని తమతో సమానంగా చూడగలరా. మళ్లీ మీరు వాదించవచ్చు. మా కాలేజీలోనే, మా స్నేహితుల్లోనే అంతా సమానంగా ఉన్నామని. పేదరికం, దళిత సమస్యలు మన మధ్య,మన స్నేహితుల మధ్య పరిష్కారం ఐతే సరిపోదు కదా..)
  -కనుక పేదరికం గురించి సమస్యల గురించి మాట్లాడాల్సి వచ్చినపుడు మొదట ఎవరిగురించి మాట్లాడాలి.

  దళిత పేదల గురించి. ( దళితుల్లోనే పేదలు ఎందుకున్నారు..అనేది మరో అంశం దానిగురించి తర్వాత మాట్లాడదాం. )
  ఒక వేళ దళితుల్లో పేదరికం సమస్య గురించి చర్చ పూర్తైన తర్వాత అగ్రవర్ణాల పేదల కూడా గురించి మాట్లాడవచ్చు. ( ఇప్పటికే వి శేఖర్‌ గారు దళితపేదల గురించి ఎక్కువగా ఎందుకు రాస్తున్నారో మీకు అర్థం కావాలి.)

  ఎవరో ఒకరు, ఎపుడో అపుడు నడవరా ముందుకు అన్నట్లు…విశేఖర్‌ గారు
  ఒక సమస్య గురించి చర్చిస్తున్నపుడు మీరు ఆ సమస్య గురించి చర్చించకుండా…అగ్రవర్ణాల్లో పేదలు లేరా..రిజర్వేషన్‌ల వల్ల దేశానికి నష్టం జరగడం లేదా వాదిస్తే ఎలా..?

  – దళితుల్లో పేదల గురించి విశేఖర్‌గారు చర్చిస్తున్నారు. మీరు అగ్రవర్ణాల పేదల గురించి చర్చించండి. ఎవరు వద్దన్నారు. మేం కూడా చర్చలో పాల్గొంటాం. అగ్రవర్ణాల పేదలకోసం ఎలాంటి చర్యలు చేపట్టాలో చర్చిద్దాం.

  ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే
  ఒక వ్యక్తి చెప్పేదాంట్లో అభ్యంతరకర విషయాలు, అవాస్తవాలు ఉంటే వ్యతిరేకించవచ్చు. అంతేకానీ మనకు నచ్చిన విషయం గురించి రాయలేదని మొత్తంగా అతను ఏం రాసినా వ్యతిరేకించడం న్యాయమేనా.. ?

  అసలు అగ్రవర్ణాల పేదల సమస్య గురించి ఇంతగా వాదిస్తున్న మీరే ఒక బ్లాగ్‌ ప్రారంభించండి. విస్తృతంగా చర్చ మొదలు పెట్టండి.

  నేను గతంలోనే చెప్పినట్లు చర్చ ఎప్పుడూ ఆరోగ్యకరంగా జరగాలి. మనం వాదించే విషయంతో ఎదుటి వాళ్లు విభేదించినా మనం పట్టించుకోనవసరం లేదు. కానీ మనం వాదించే విధానమే బాలేదన్నపుడు మాత్రం ఒకసారి పునరాలోచించాలి.

  అన్నట్లు మీరు ఎంతగా సమర్థించుకున్నా…. బూతులు రాయడంపై వ్యక్తిగతంగా మీకు ఎలాంటి అభ్యంతరం లేకున్నా…ఎదుటివారితో చర్చించేటపుడు మాత్రం నలుగురికీ ఆమోదయోగ్యంగా ఉండాలన్న సంగతి గ్రహించకుంటే ఎలా..?
  బూతులు రాయడం మీకు వ్యక్తిగతంగా సంతృప్తినివ్వవచ్చు. కానీ ఎదుటివాళ్లను ఇబ్బందిపెడతాయన్న సంగతి మర్చిపోవద్దు కదా.
  రోమ్‌లో ఉన్నపుడు రోమన్‌లా ఉండాలన్న సంగతి మీకు వేరే చెప్పేలా మిత్రమా…!
  ఎందుకంటే సత్యాన్వేషణకు బూతుమార్గం పనికిరాదు నేస్తమా.

 18. విశేఖర్ గారూ,

  గత పదిరోజులుగా స్వంత సిస్టమ్‌కు దూరంగా ఉండటం, తెలుగు ఫాంట్ లేకపోవడం వంటి కారణాలతో ఏ చర్చలోనూ పాల్గొనలేకపోయాను. ఇంకా కొన్నాళ్లు ఇది కొనసాగుతుంది.

  చందు గారితో మీ చర్చ లోతుల్లోకి నేను వెళ్లలేను. కాని ఒక విషయం మాత్రం పంచుకుంటాను.

  నిజమైన దళితులకు ఈ దేశ భూములపై, ఫ్యాక్టరీలపై హక్కు లభించినప్పుడు, ఒక ఎకరా భూమి కూడా వాళ్లు అగ్రకులస్తులకు, బీసీలకు అన్యాక్రాంతం చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు, తమకు మాత్రమే కేటాయించిన డికెటి పట్టాభూములను కూడా దళితులు ఇతరులపరం చేయలేని పరిస్తితి నెలకొన్నప్పుడు.. ఆస్తిసంబంధాలలో కనీసం న్యాయమైన వాటా వారికి నిజంగా దఖలు పడినప్పడు.. నిజంగానే అప్పుడు వారికి రిజర్వేషన్లు అవసరం లేదు.

  రిజర్వేషన్ అనేది దళితులలో కొద్దిమందికి మాత్రమే ఉద్యోగాలు కల్పిస్తున్న మాట నిజమే కాని, బతుకంతా రైతుకూలీలలుగానో, పారిశుధ్య కార్మికుల్లాగానో మిగిలిపోయే వారికి ఏ రిజర్వేషన్ కూడా వారి స్థానాలను మెరుగుపర్చలేదు. దేశంలో మనుషుల మధ్య సంబంధాలు మౌలికంగా మారనంతవరకు రిజర్వేషన్లు దళితులకు మానవ స్వాతంత్ర్యంలో అతి ముఖ్యమైన ఆత్మగౌరవాన్ని దఖలు పర్చలేవు.

  దళితులే కాదు.. వ్యవసాయ సంక్షోభంతో చేనేత సంక్షోభంతో ఆత్మహత్యల పాలవుతున్న లక్షలాదిమందికి ఏ ఆత్మగౌరవం మిగిలిందనీ ఈ దేశంలో….

  ఇంకో రెండు వందల ఏళ్లు రిజర్వేషన్లు ఇలాగే కొనసాగినా దళితుల జీవితం మౌలికంగా మారదు. మెరుగుపడవలసింది, దళిత ప్రతినిధుల జీవితం కాదు. అట్టడుగు దళితుల జీవితం మారాలి. రిజర్వేషన్ వీళ్ల జీవితాల్లో ఒక శాతం మార్పు కూడా తీసుకురావడం లేదు. 40 ఏళ్లుగా రైతుల భూములకు కట్టుబడిపోయిన దళితులను ఏ రిజర్వేషన్లు ఎంత కాలానికి మారుస్తాయో విజ్ఞులు చెప్పాలి. రైతుల వద్ద ఉన్న ఆ కొద్ది భూములు కూడా వాల్‌మార్ట్‌లు రిలయన్స్ ల లీజు భూములుగా మారిపోయే కాలం ముంచుకొస్తున్నప్పుడు సాధారణ దళితుడికి భూమితో ఉన్న ఆ పాటి బానిసబంధం కూడా మాయమైపోవచ్చు. అప్పడు దళితుడే కాదు. అన్ని కులాల్లోని పేదలు కూడా పట్టణాలకు ఎగబడాల్సిందే. కానీ అలాంటప్పుడు కూడా పేదరైతు కార్మికుడిగా ఆవిర్భవించడం లేదీ దేశంలో. తెలంగాణాలో ఓ జిల్లాలో మూడెకరాల ఆసామీ పంటకు దిక్కు లేక హైదరాబాద్‌లో పల్లీలు అమ్ముకుని బతుకుతున్నాడే తప్ప కార్మికుడిగా కొత్త జన్మ ఎత్తడం లేదు. సామాజిక మార్పు ఇక్కడే పక్కకు పోతోంది.

  రిజర్వేషన్లు తాత్కాలిక కంటితుడుపు చర్య తప్ప పరిష్కారం కాదని మీరు చేసిన వ్యాఖ్య దళితులలోనే చాలామందికి అర్థం కాలేదనుకుంటాను.

  బ్లాగ్ లోకంలో చర్చలు మానవ సంబంధాలనే దూరం చేస్తున్న ధోరణి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇరువైపులా సంయమనం ప్రదర్శించాలని కోరుకోవడం తప్ప అంతకు మించి కూడా ఆశించలేమనుకుంటాను.

  బద్దవైరుధ్యం ఉన్నకుక్క పిల్లీ కూడా కలుస్తాయేమో కాని, తెలుగుబ్లాగుల్లో భిన్నాబిప్రాయాలు కలవలేవనే తోస్తోంది.

 19. కులం అనేది పైకి చెప్పే కబురు మాత్రమే. సమాజం గురించి ఆలోచించనివాడు కులం గురించి ఆలోచించడు, తన కులంలోని పేదవాళ్ళ గురించి అస్సలు ఆలోచించడు. దళితులలోని డబ్బున్నవాళ్ళు కూడా పేద దళితులని పెళ్ళి చేసుకోరు, అగ్రకులాలలోని డబ్బున్నవాళ్ళు కూడా తమ కులంలోని పేదవాళ్ళని పెళ్ళి చేసుకోరు. అగ్రకులాలలో పేదల సంఖ్య తక్కువ. అగ్రకుల పేదవాళ్ళు కూడా పేద దళితులలాగే డబ్బున్నవాళ్ళతో పోటీ పడలేనివాళ్ళు. రిజర్వేషన్‌లు ఉన్నంతమాత్రాన పేద దళితులకి ఉద్యోగాలు రావు అనేది ఎంత నిజమో, అవి రద్దు చెయ్యబడినంతమాత్రాన అగ్రకులాలలోని పేదవాళ్ళకి ఉద్యోగాలు రావు అనేది అంతే నిజం. ఈ నిజం అగ్రకులాలలోని డబ్బున్నవాళ్ళు ఒప్పుకోరు. కేవలం అగ్రకుల పేదలు పేద దళితులని పెళ్ళి చేసుకోరు అని చెప్పి పేదల మధ్య తేడా ఉందని అనలేము.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s