ఎకాలజిస్టు అచంగ గారు మళ్ళీ పాఠకులను తప్పుదారి పట్టించే పనిలో పడ్డారు. ఆయన నన్ను ఉద్దేశించి రాసిన తాజా టపాలో ఇలా రాశారు.
ఇంకా తమరేమన్నారంటే, “అసలీయన సవాలు విసిరిందే ఫుకుషిమా రేడియేషన్ అమెరికా, యూరప్‌ల దాకా రాలేదని“ఈ ముక్క చెప్పి చెలరేగిపోయారు! తమరికి తెలుగు రాకపోయన్నా ఉండాలి లేదా ఒక వ్యక్తి వ్యాఖ్యలను తమ నరంలేని నాలుక వంకర్లు తిప్పి అయినా ఉండాలి. నేనన్నదేమిటి మీరు చెప్పింది ఏమిటి? “అణుధార్మికత యూరోపు వరకూ విస్తరించిందనటానికి ఆధారాలేవైనా ఉంటే ఇవ్వండి నా వ్యాఖ్యలను నేను వెనక్కి తీసుకుంటాను“అని. కాదని మీరు నిరూపించగలరా? నేనడిగింది యూరోపు గుఱించి మీరు తెగ గొంతు చించుకుంది అమెరికా గుఱించి.
ఫుకుషిమా రేడియేషన్ అమెరికా వరకూ వస్తే ఏమిటట, నేనన్నది యూరోప్ వరకూ రాలేదని కదా? అని అచంగ గారు పైన అంటున్నారు. కానీ అసలు ఈ వాదోపవాదాలకు, కారణమైన అచంగ గారి అసలు వ్యాఖ్య ఇది. (కింద కొటేషన్స్ లో ఉన్న మొదటి వాక్యం నేను రాసిందాన్నుండి అచంగ ఉటంకించినది. ఆ తర్వాతది ఆయన స్పందనగా గ్రహించగలరు. ఈ వ్యాఖ్య స్క్రీన్ షాట్ కూడా పక్కన ఇస్తున్నాను.)
“ఫుకుషిమా ప్రమాదం సంభవించిన తర్వాత అమెరికా, యూరప్ లవరకూ రేడియేషన్ విస్తరించింది….”
అమెరికా పశ్చిమతీరాన్ని అణుధార్మికత తాకవచ్చనేది కేవలం అప్పట్లో చేసిన హెచ్చరిక మాత్రమే. అయితే అమెరికా (కెనడా కూడా కలిపి) పశ్చిమతీరాన్ని తాకినట్లు ఎలాంటి ఋజువులూ లేవు. ఇక అణుధార్మికత యూరోప్ వఱకూ వ్యాపించిందనటం కేవలం అపరిపక్వ మఱియు నిరూపణకు నిలబడని వ్రాత. ఇది చెప్పటానికి నా అర్హత ఏమిటని కష్టపడొద్దు. నేనో ఎకాలజిస్టును, వృత్తిరీత్యా. అణుధార్మికత యూరోప్ వరకూ విస్తరించిందనటానికి ఆధారాలేవైనా ఉంటే ఇవ్వండి నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటాను.
అచంగ గారు తాను చేసిన వ్యాఖ్యలోనుండి ఒక ముక్కని (ఎర్ర అక్షరాల్లో ఉన్నది) బైటికి తీసి నేనన్నది ఇదే గదా అనంటున్నారు. కాలిఫోర్నియా యూనివర్సిటీ వారి నివేదికలోని ఒక పేరాలో కొన్ని వాక్యాలను మాత్రమే చూపించి, అదే పేరాలోని తర్వాతి వాక్యాలను దాచేసి పాఠకులను పక్కదారి, తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించినట్లుగానే మళ్ళీ అదే దుస్సాహసానికి పూనుకున్నారు. కనీసం తన వ్యాఖ్యపైన కూడా తనకు గౌరవం లేదని చాటుకున్నారు. ఆయన అన్నమాటలకి ఆయనకే గౌరవం లేనప్పుడు పాఠకులకు ఉండవలసిన అవసరం లేదు.
అచంగ గారు రాసిన పై వ్యాఖ్యని చూస్తే ఫుకుషిమా రేడియేషన్ అమెరికా, కెనడా, యూరప్… ఈ మూడు చోట్లకు రాలేదని వాదించినట్లు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. “అయితే అమెరికా (కెనడా కూడా కలిపి) పశ్చిమతీరాన్ని తాకినట్టు ఎలాంటి ఋజువులూ లేవు” అని తాను రాసిన విషయాన్ని ప్రస్తావించకుండా యూరోప్ గురించి రాసిన వాక్యాన్ని ఉటంకించి తాను యూరప్ వరకు మాత్రమే అభ్యంతరం చెప్పినట్లు నమ్మించడానికి ప్రయత్నించారు. ఇంత ఘాతుకానికి పాల్పడడమే కాకుండా ‘నరం లేని నాలుక’ అనీ ‘తెలుగు రాదని’ దూషించడానికి కూడా సిద్ధపడ్డారు. వాదనలో నిజాయితీ లేనపుడు ఇలాంటి వారికి మిగిలేది దూషణలే.
కాదని మీరు నిరూపించగలరా? అని మళ్ళీ ఒక డొల్ల సవాలు అచంగ విసిరారు. నిలబడలేని సవాళ్ళు విసరడం ఆ తర్వాత దూషణలకి దిగడం ఈయనకి అలవాటులాగుంది. నిజానికి యూరప్ కి కూడా ఫుకుషిమా రేడియేషన్ వ్యాపించిన సంగతి నేను రాశాను. దానికి శాస్త్రీయ ఆధారాలు కూడా ఇచ్చాను. ఆసక్తి ఉన్న పాఠకుల కోసం మరొకసారి ఆ లింకు ఇస్తున్నాను. లిధుయేనియా, గ్రీసు, ఇటలీ దేశాల్లో ఫుకుషిమా ప్రమాదం నుండి వెలువడిన రేడియేషన్ ని కనుగొన్న విషయాన్ని ఈ లింక్ లో చూడవచ్చు.
లిధుయేనియా, గ్రీసు, ఇటలీ లలో ఫుకుషిమా రేడియేషన్
నాకు తెలిసి ఈ మూడు దేశాలూ యూరప్ ఖండంలోనివే. యూరోపియన్ యూనియన్ లో ఈ మూడూ సభ్య దేశాలు. మన వాదనకు సరితూగనంత మాత్రాన యూరోపియన్ దేశాలను తీసుకెళ్ళి అమెరికాలో కలిపేయడం ఏమి శాస్త్రీయత?
ఆధారాలిస్తే వ్యాఖ్యని వెనక్కి తీసుకుంటానని అచంగ గారు చెప్పారు. చెప్పినట్లుగా తన వ్యాఖ్యలని వెనక్కి తీసుకోవడం ఉత్తమం. కానీ ఆయన అలా చేయరు. ఎందుకంటే పొరబాటుగా చేసిన వ్యాఖ్యలని ఉపసంహరించుకోవడం అంటే ఆయన దృష్టిలో పరువు తక్కువ. ఫాల్స్ ప్రిస్టేజ్. అందువల్లనే నేను గతంలో ఆయనపై వ్యక్తం చేసిన అసహనానికి విచారం వ్యక్తం చేయడాన్ని ఏమాత్రం సందర్భం లేకుండా గుర్తుకు తెచ్చి “చూసారా, నేను చచ్చినా ఆపని చేయను” అని అంటున్నారు.
అచంగ గారు తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే నాకు అలాంటి ఫాల్స్ ప్రిస్టేజ్ ఏమీ లేదు. మనిషన్నాక కొన్ని సందర్భాల్లో అసహనం సహజం. అనవసరంగా అసహనం చెందినట్లు గుర్తిస్తే దాన్ని సవరించుకోవడం ప్రతి ఒక్కరికీ ఉండవలసిన లక్షణం. పొరబాట్లను సవరించుకునే లక్షణం తనకు లేదని అచంగ చెప్పదలిచారు. నేనా విషయాన్ని గ్రహిస్తున్నాను.
అచంగ తాజా టపాలో ఇంకా ఏవేవో రాశారు. నన్ను ఎగతాళి చెయ్యడానికీ, కించపరచడానికీ శాయశక్తులా ప్రయత్నించారు. అవన్నీ ఆయన ఎలాంటివారో పట్టించేవి. పట్టించుకోదగినవి కావు. అందువల్ల వాటి జోలికి నేను పోవడం లేదు. ఇలాంటివారితో కమ్యూనిజం గురించి ఎందుకు చెబుతారు? అంటూ కొందరు మిత్రులు అప్పట్లోనే నన్నడిగారు. ఆ ప్రశ్నకి పూర్తి అర్ధం ఇప్పుడు నా గమనంలోకి వచ్చింది.
‘శాస్త్రీయ ఆధారాలు’ అంటూ ఓటి మోతలు మోగించే అచంగ గారు ‘శాస్త్రీయత’ జోలికి ఈ చర్చలో ఏ కోశానా పోలేదు. పైగా పదే పదే ‘శాస్త్రీయత’ అని రాస్తే తాను ఏమి రాసినా ‘శాస్త్రీయత’ కిందికి వచ్చేస్తుందన్న అతి తెలివితో పేజీలు నింపారు. డబ డబా నాలుగు దూషణలు, మరో నాలుగు వ్యంగ్యాలూ చేసేసి అదే ‘శాస్త్రీయత’ అని డబ్బా కొట్టుకున్నారు. ఈయన బండారం ఇంకా బైటపడేయొచ్చు గానీ, అదొక నిష్ఫల ప్రయాస. పాఠకులకు ఏ మాత్రం ఉపయోగపడని వ్యవహారం.
చాప చుట్టేస్తున్నానని చెప్పిన అచంగ, ఆ చుట్టడం కూడా సక్రమంగా చెయ్యలేకపోయ్యారు. స్వస్తి.
emito .. ee blaagola.
Just ignore them. …(Edited)
అవును కదా, మోహన్ గారు! ఇకముందు ఇలాంటి గోల లేకుండా చూడడానికి ప్రయత్నిస్తాను.
@Visekhar Garu: He did not say “అచంగ గారు రాసిన పై వ్యాఖ్యని చూస్తే ఫుకుషిమా రేడియేషన్ అమెరికా, కెనడా, యూరప్… ఈ మూడు చోట్లకు రాలేదని వాదించినట్లు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ”
And also, I agree with him. Please reconsider it again! I have specialization in Nuclear Physics. Please reconsider your post or comment! What Achanga told is almost correct! But he didn’t mean what you though!
Chandu
చందు గారు, మీరు ఏది తప్పంటున్నారో, ఏది కరెక్ట్ అంటున్నారో నాకు స్పష్టంగా అర్ధం కాలేదు.
అచంగ గారి వ్యాఖ్యని పైన ప్రస్తావించాను. అందులో బ్లూ కలర్ అక్షరాల్లో ఉన్న వాక్యానికి అర్ధం ఫుకుషిమా రేడియేషన్ అమెరికా, కెనడాలకి వ్యాపించలేదని. ఆయన ఏమి చెప్పారో కళ్ళెదుటే ఉంది కదా? దాని అర్ధం అది కాదంటారేమిటి?
అమెరికా, యూరప్ లకి ఫుకుషిమా రేడియేషన్ వ్యాపించింది అని చెప్పే ఆధారాలని గత ఆర్టికల్స్ లో ఇచ్చాను. ఆ ఆధారాలన్నీ శాస్త్రవేత్తలు ఇచ్చినవే. ఆ ఆధారాలు తప్పయితే ఎందుకు తప్పో మీరయినా చెప్పండి. (నేను రాసిన అంశాలన్నీ నేను కనిపెట్టినవి కావు. మీలాంటి స్పెషలిస్టులు చెప్పగా చదివి బ్లాగ్ లో రాసాను.)
వీలయితే ఈ అంశంపై గతంలో రాసిన ఆర్టికల్స్ ని ఒకసారి చదివి మీ అభిప్రాయం చెప్పగలరా? స్పెషలైజేషన్ ఉందంటున్నారు గనక వివరంగా చెప్పగలరేమో చూడండి. పాఠకులకి ఉపయోగంగా ఉంటుంది.
ఆచంగ గారి పోస్ట్ నేను చదివాను. అందులో అణుధార్మికత గురించి వాస్తవాల కన్నా…విశేఖర్ గారిపై ఎలాగైనా పై చేయి సాధించాలన్న ఆరాటమే కనిపించింది. దురదృష్టవశాత్తూ అది కూడా నెరవేరలేదు.
వేయి ఆలోచనలు సంఘర్షించనీ అన్నట్లుగా… వాస్తవాలు ఉంటే ఆధారాలతో వెల్లడించాలి.
( ముఖ్యంగా స్పెషలిస్టులకు ఆ బాధ్యత ఉంది. )
వాస్తవాల్ని చాటిచెప్పాలి. ఇందుకోసం సహనం కూడా అవసరమే. ఒక విషయాన్ని మనం మనసావాచా నమ్మినపుడు దాన్ని ఇతరులతో ఒప్పించాల్సివచ్చినపుడు ఓపిక చాలా అవసరం.
ఎందుకంటే అసలైన సత్యం కోసమే కదా తరతరాలుగా మనిషి నిరంతర అన్వేషణ.
@ChanduTulasi: I love your comments always! In fact, I look forward to see your comments! Why because… అసలైన సత్యం కోసమే కదా తరతరాలుగా మనిషి నిరంతర అన్వేషణ.
I will give some supportive links.
Chandu
చందు గారూ. మీ కామెంట్లు కూడా నేను ప్రత్యేకంగా చదువుతాను. ఎందుకంటే మీరు సమస్యను విభిన్నకోణంలో చూస్తారు. మీ మనసుకు నచ్చింది రాస్తారు.
మనందరికీ అభిప్రాయాలు వెల్లడించే హక్కు ఉంది. బహుశా వాల్టేర్ అనుకుంటా…గొప్ప కొటేషన్ చెప్పాడు ….“I disapprove of what you say, but I will defend to the death your right to say it.”
( నీ అభిప్రాయంతో నేను ఏకీభవించకపోవచ్చు. కానీ నీకు అభిప్రాయం వెల్లడించే హక్కు కోసం చావుతోనైనా పోరాడతాను )
ప్రపంచంలో భిన్న రకాల మనుషులున్నట్లే భిన్నరకాలు అభిప్రాయాలుంటాయి. ఉండాలి కూడా. ఒక్కొక్కరు సమస్యను ఒక్కో కోణంలో చూస్తారు. దీనికి ఆ వ్యక్తి నేపథ్యం, చదువు, మానసిక పరిణతి, నమ్మిన సిద్ధాంతాలు, విలువలు…ఇలా అనేక కారణాలు.
మన మనసుకు నచ్చిన అభిప్రాయాలు వెల్లడించిన వారిని, మన ఆలోచనలకు దగ్గరగా ఉండేవారిని మనం ఇష్టపడతాం. మనకు భిన్నంగా ఆలోచించేవారిని దూరంగా ఉంచుతాం. దురదృష్టవశాత్తూ…మనలో చాలా మంది ఒక విషయానికి రెండో కోణం ఉంటుందన్న వాస్తవం గ్రహించేందుకు సిద్ధపడరు. ఇక్కడే సమస్య. ఒక విషయాన్ని భిన్న కోణాల్లోంచి చూడగలగడమే
జ్ఞానానికి మొదటి మెట్టు.
కనుక ఎవరి అభిప్రాయాన్నైనా గౌరవించాలి. ( అభిప్రాయంతో అంగీకరించకున్నా )
మనకు తెలిసిన దాన్ని వారితో పంచుకోవాలి. అభిప్రాయ బేధాలుంటే పరిష్కరించుకోవాలి.
తమ ఇద్దరిలో ఏది ఉత్తమమో తేల్చుకోవాలి. తిరిగి ఇద్దరూ కలిసి మరో సత్యాన్ని అన్వేషించాలి. ఇలా అంతా కలిసి అసలైన సత్యాన్ని తెలుసుకొవాలి. ఆ సత్యాన్ని అందరికి చెప్పాలి.
సత్యం ద్వారా మొదట మనలో మార్పు రావాలి. తర్వాత సమాజంలో మార్పు సాధించాలి.
మనిషి జీవితానికి ఇంతకు మించిన పరమార్దం ఉందని నేను అనుకోను.
అన్నట్లు నేనేదో నా అభిప్రాయాలు భావాలు పంచుకుంటున్నాను. ఇది మీకు హితబోధ మాత్రం కాదు.
చందు తులసి గారూ, చాలా చక్కగా చెప్పారు. మీ వ్యాఖ్యని టపా గా మార్చుతాను, మీకు అభ్యంతరం లేకపోతే.
అన్నీ తెలుసు అనుకుంటూ ఏమీ తెలీని ఓ రాజకీయ సామాజిక ఆధ్యాత్మిక అఙ్ఞాని ఆ ఆచంగ.
@Chandu Tulasi: That’s great!
@Visekhar garu: Please transfer the rights on ChanduTulasi’s comments to me! I would like to make it my post! All copy rights are hers, definitely!
చందు గారూ, చందు తులసి ‘ఆమె’ కాదనుకుంటా, ‘అతను’ అనుకుంటా.
విశేఖర్ గారు…మీ అభిమానానికి కృతజ్ఞతలు. ( నేను మీ బ్లాగుకు మొదటి నుంచి అభిమానిని. ఈనాడులో మీ బ్లాగ్‌పై వచ్చిన వార్త చూసి…మీ బ్లాగు అభిమానినయ్యాను. అప్పటి నుంచీ రోజూ చూస్తున్నాను. అన్నట్లు సివిల్స్ చదివే వాళ్లకోసం ఓ బ్లాగ్ ఎవరైనా పెట్టకూడదూ…అంటూ మిమ్మల్నీ అడిగాను గుర్తుందా. మీరు దానిపై ఓ పెద్ద పోస్టు రాశారు కదా. )
చందుతులసి గారూ, గుర్తులేకేం? బానే గుర్తుంది.
@Visekhar: That is why I wrote “HER”
See my comment – All copy rights are hers, definitely!
చందు గారూ, నేనూ తప్పు రాసాను. ఇపుడు సవరించాను.