నిలువునా చీలిన అన్నా బృందం, చిచ్చు పెట్టిన రాజకీయ పార్టీ ఆలోచన


నా ఫొటో పెట్టొద్దు! -అన్నా (ఫొటో: ది హిందూ)

“బృందం వేరు పడడం దురదృష్టకరం… ఎటువంటి రాజకీయ పార్టీలోనూ, గ్రూపులోనూ నేను చేరేదిలేదు. వారి ప్రచారానికి నేను వెళ్లను. ప్రచారం సందర్భంగా నా ఫోటోని గానీ, నా పేరుని గానీ వాడుకోవద్దని వారికి చెప్పాను. మీరు స్వంతంగా పోరాడండి.” అరవింద్ కేజ్రీవాల్ తో తెగతెంపులు చేసుకుంటూ అన్నా హజారే చేసిన ప్రకటన ఇది. కేజ్రీవాల్ తో విభేధాలున్నాయని అంగీకరించిన తర్వాత రోజే అన్నా, తాజా ప్రకటనతో రాజకీయ పార్టీ ఆలోచన నుండి పూర్తిగా వైదొలిగినట్లయింది.

ఆగస్టులో అరవింద్ దీక్ష ముగిశాక కేజ్రీవాల్ ప్రకటించిన రాజకీయ పంధాకు అన్నా మద్దతుగానే మాట్లాడాడు. రాజకీయ పార్టీ ఏర్పాటు విషయంలో అన్నా బృందంలో విభేదాలు ఉన్నాయని పత్రికలు ఊహాగానం చేసినప్పటికీ అన్నాతో పాటు ఇతర సభ్యులంతా విభేదాలు లేవని చెప్పారు. విబేధాలు లేవని చెబుతూనే బృందంలోని వివిధ సభ్యులు భిన్నాభిప్రాయాలు బహిరంగంగానే వ్యక్తం చెయ్యడం ఒక అలవాటుగా కొనసాగించారు. ఆ తర్వాత కిరణ్ బేడీ పత్రికాముఖంగానే అరవింద్ కేజ్రీవాల్ రాజకీయ పార్టీ ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకించింది. కేజ్రీవాల్ కు తన మద్దతు లేదని కూడా చెప్పేసింది. ఈ ప్రకటనలు ఎన్ని కొనసాగినప్పటికీ అన్నా హజారే తన బ్లాగ్ లో ‘అన్నా బృందం’ రద్దయినట్లు ప్రకటించి ఊరుకున్నాడు తప్ప విభేధాల పరిష్కారానికి కృషి జరగలేదు.

ఢిల్లీలో అన్నా బృందం సభ్యులతో జరిగిన సమావేశంలో వైరి శిబిరాల్లో ఎవరెవరు ఉన్నారో, ఏ శిబిరంలో ఎవరు ఉన్నారో ఒక స్పష్టత వచ్చింది. రాజకీయ పార్టీ ఆలోచనను సమర్ధింస్తున్నవారంతా కేజ్రీవాల్ నాయకత్వంలో ఉండగా, ఇతరుల శిబిరానికి అన్నా నాయకత్వం వహిస్తున్నట్లు స్పష్టమయింది. సినీ నటుడు అనుపమ్ ఖేర్ తదితరులు కేజ్రీవాల్ కి మద్దతుగా నిలవగా, కర్ణాటక మాజీ లోకాయుక్త సంతోష్ హెగ్డే, కిరణ్  బేడీ తదితరులు అన్నా కు మద్దతుగా నిలిచారు. కేజ్రీవాల్ నుండి విడిపోవడానికి అన్నా హజారే నిర్ణయించడం పట్ల కిరణ్ బేడీ పలుమార్లు సంతోషం వ్యక్తం చేసినట్లు పత్రికల ద్వారా తెలుస్తున్నది.

పేరు, ప్రతిష్టలు ఎవరివి?

న్యూఢిల్లీలో అన్నా బృందం బుధవారం జరిపిన చర్చలు, సంప్రతింపులు విభేధాల వెల్లడికి వేదికగా మారాయి. రిటైర్డ్ జడ్జిలు, మీడియా వ్యక్తులు, ఇతర ప్రముఖులు ఈ చర్చల్లో పాల్గొన్నట్లు పత్రికలు తెలిపాయి. సమావేశంలో తీవ్రస్ధాయిలో వాగ్వివాదాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. జన్ లోక్ పాల్ కోసం జరిగిన అవినీతి వ్యతిరేక ఉద్యమం ద్వారా అన్నా వెనుక సమకూడిన పేరు ప్రతిష్టలకు ఎవరు సొంతదారులన్న విషయమై సమావేశంలో వాదోపవాదాలు జరిగాయి. దీని ఫలితంగానే అన్నా పేరుగానీ, ఫోటో గానీ అరవింద్ స్ధాపించబోయే రాజకీయ పార్టీ కోసం వినియోగించరాదని అన్నా, ఆయన కొత్త సహచరులు ఆంక్షలు ప్రకటించారు.

అవినీతి సమస్య ప్రధానంగా దేశ ప్రజల సమస్య. అవినీతిని ప్రజల సమస్యగా గుర్తించినవారంతా అన్నా బృందం తలపెట్టిన పోరాటానికి మద్దతు తెలిపారు. మధ్యతరగతి జనం విస్తృతంగా అవినీతి వ్యతిరేక పోరాటానికి మద్దతు తెలిపినందునే పోరాట నాయకత్వానికి పేరు ప్రతిష్టలు సమకూరాయి తప్ప ఇవి ఏ ఒక్కరికో సంబంధించిన, సొంతమైనవి కావు. నాయకత్వాన్ని తయారు చేసేవారు, పేరు ప్రతిష్టలను నాయకత్వానికి ఆపాదించేవారు ప్రజలే తప్ప ఒకరిద్దరు వ్యక్తులు కాజాలరు. ప్రజలు అందజేసిన మద్దతు పేరు ప్రతిష్టలుగా మారాక వాటిని తిరిగి ప్రజల ప్రయోజనాలకే వినియోగపెట్టడం విజ్ఞుల గురుతర బాధ్యత. విబేధాలు వచ్చినట్లయితే నమ్మిన మార్గాల్లో పోరాటం కొనసాగించడమే మిగిలిన కర్తవ్యంగా ఉంటుంది. అంతే తప్ప ఉద్యమం అందించిన పేరు, ప్రతిష్టాలకు తామే సొంతదారులుగా ప్రకటించుకుని భిన్న పంధా చేపట్టిన వారిపై ఆంక్షలు విధించడం ప్రజాస్వామిక భావనకు భిన్నమైనది.

అవినీతి ఉద్యమంలో, అందులో ఎన్ని లోపాలు, బలాలు ఉన్నప్పటికీ, అరవింద్ కేజ్రీవాల్ అతని మిత్రులు కూడా అందులో భాగమే. నాయకత్వ స్ధానంలో అన్నా ఉన్నాడు కనుక పేరు ప్రతిష్టలు ఆయనవద్ద కేంద్రీకరింపబడడం సహజంగా జరిగే పరిణామం. ఉద్యమాల గతి నియమాలు ఆ విధంగానే నిర్ణయం అవుతాయి. ఉద్యమాల ప్రతిష్టలను నాయకత్వంలో ఉన్నవారికి ఆపాదించే వ్యక్తిపూజ లక్షణాలు ఉన్న సమాజంలో అది అనివార్యం.

ఈ పరిస్ధితుల్లో అవినీతి వ్యతిరేక ఉద్యమ ప్రతిష్టను సొంతం చేసుకునే హక్కు అన్నా మరియు ఆయనతో ఇప్పుడు మిగిలిన బృందానికి ఎంత ఉన్నదో, కేజ్రీవాల్ బృందానికి కూడా అంతే ఉంది. ప్రజల విస్తృత భాగస్వామ్యం ద్వారా వచ్చిన పేరు ప్రతిష్టలను అన్నా పేరుకీ, ఆయన ఫోటోకీ అంటగట్టి వాటి వినియోగంపై ఆంక్షలు విధించడం తగనిపని. అన్నా గానీ, ఆయన వెంట మిగిలినవారు గానీ గుర్తించవలసిన విషయం ఏమిటంటే, ఉద్యమంలోకి దూకి ప్రజల మనుషులుగా మారాక వారి ఫొటోలు, పేర్లు వారికి సొంతం కాదు. ప్రజా ఉద్యమాల లక్షణం అలానే ఉంటుందని వారు గ్రహించాలి.

కేజ్రీవాల్ ఒక పార్టీ పెట్టుకున్నాక తాము “అన్నా నాయకత్వంలో అవినీతికి వ్యతిరేకంగా పోరాడాము కనుక మేము అవినీతి నిర్మూలనకు కట్టుబడి ఉన్నపార్టీ” అని చెప్పుకోకుండా ఎలా ఉండగలరు? అలా చెప్పుకోకూడదని అన్నా చేసిన ప్రకటన సహజ ప్రజాస్వామిక సూత్రాలకు విరుద్ధం. ప్రజలను, వారి ప్రజాస్వామిక అవసరాలను, భావనలను వదిలిపెట్టి మతసూత్రాల ప్రాతిపదికన నియమ నిబంధనలు అమలు చేసే అన్నా హజారేకి ఈ విధమైన ఆంక్షల అమలు ఆమోదనీయమే కావచ్చు. కానీ ఆయనతో ఉన్న ఇతర ప్రజాస్వామిక ప్రియులు ఇటువంటి సున్నిత విషయాన్ని ఆలోచించకపోవడం ఆశ్చర్యకరం.

ప్రజాస్వామ్యం గురించి సూత్రాలు వల్లించే పాలకవర్గాలు అన్నీ రంగాల్లోనూ, అన్నీ దశల్లోనూ నిరంకుశత్వాన్నే మొదటి ప్రాధామ్యంగా స్వీకరించడం కొత్తేమీ కాదు. కానీ పాలకవర్గాల నియంతృత్వ ధోరణులకు మూలమైన ఆర్ధిక అవినీతికి వ్యతిరేకంగా పోరాటం తలపెట్టినవారు కూడా ప్రజాస్వామిక ధోరణులకు భిన్నంగా ఆలోచనలు చేయడం, ఆంక్షలు విధీంచడం ఎంతమాత్రం సమర్ధనీయం కాదు.

7 thoughts on “నిలువునా చీలిన అన్నా బృందం, చిచ్చు పెట్టిన రాజకీయ పార్టీ ఆలోచన

 1. ఆంధ్రా బ్యాంక్‌వాళ్ళు తమ సంస్థ స్థాపకుడు భోగరాజు పట్టాభిరామయ్య ఫొటోని కాపీ రైట్ చేసుకున్నట్టు అన్నా హజారే కూడా తన పేరుని కాపీ రైట్ చేసుకోవడం మేలు కదా.

 2. అన్నా హజారేకు నియంతృత్వం కొత్తకాదు. రాలేగావ్‌ సిద్ధిఖీలో పెదరాయుడులాగా తీర్పులు చెప్పడం, తప్పు చేసిన వారిని బెల్టుతో కొట్టడం లాంటివి చేసేవారని ఆరోపణలున్నాయి కదా..
  ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒకే ఒక వ్యక్తి వల్ల ఏమీ సాధ్యంకాదని…సామూహిక కృషిద్వారానే మార్పు సాధ్యమని గ్రహించాలి.

 3. అన్నా హజారే గురించి పూర్తి వివరాలు తెలుసుకోకుండా అడ్డమైన ఆరోపణలు చేయడం ప్రతివారికీ అలవాటు అయిపోయింది. పెదరాయుడులాగా ఆయన ఎప్పుడూ తీర్పులు చెప్పలేదు. వ్యక్తి బాగుంటేనే సమాజం బాగుంటుంది అనే సిద్ధాంతం ఆయనది. అది ఆచరించి చూపిన విశిష్ట వ్కక్తిత్వం హజారేది. పూర్వాపరాలు తెలుసుకోకుండా గుడ్డిగా మాట్లాడడం సరికాదని గుర్తుంచుకోవాలి.

 4. అవినీతి పై పోరాటం అనేదాని మీద అన్నా హజారేకి (ఏవరికీ) పేటెంట్ హక్కు లేదు. అన్నాఫోటో లేకపోతే కేజ్రీవాల్ పోరాటం చేయలేడా! అన్నా అన్నాడని గింజుకోవటం దేనికన్నా..? ఎవడయితే స్వచ్చంగా నిజాయితీగా అవినీతి పై పోరాటం చేస్తాడో వాడికి బ్రహ్మరధం పదతారు ప్రజలు..వాడు అన్నా అయినా, కేజ్రీవాల్ అయినా, సుబ్బారావయినా, సుబ్బయ్యయినా సరే! ఆడ లేక మద్దెల ఓడంటే ఇదే మరి.

 5. అన్నా హజారే నమ్మేది మత నీతే. ఆర్థిక అసమానతలు పోవడం కంటే మద్యం, మాంసం మానెయ్యడమే గొప్ప అని అనుకునే నీతి అతనిది. ఈ వచనాలు చదవండి:
  >>>>>>>>>>
  The moral preaching of Anna developed as an encompassing tool for influencing the villagers. Slowly it became an integral part of a moral regime, not only to get rid of liquor, smoking or non-vegetarianism, but also to exercise control over the private and the public, the personal and the political.

  Anna Hazare’s sense of morality is wide-ranging, spelling out details of everyday social life. At various points he says, ‘People should have good samskar to do service. They should believe in nishkam karmayog’; ‘Differences between the rich and the poor will remain, but the poor should get some share of the prosperity’. For school children there is moral education and practice, comprising physical training, body building, patriotism, obedience, samskars and Hindu culture. Doing surya namaskar and chanting Om is regular for the students. For women, it is stressed that they should certainly look after the household but they must also participate in activities intended to help their community and country. It is stated, ‘Woman is the Universal Mother, The Great Mother. Many such Great Mothers have given birth to Great Sons — Chhatrapati Shivaji Maharaj, Swami Vivekananda for instance. She is also a symbol of purity, sublime as well as innate strength. She can, if she means it, make a God out of a mortal being and build a model, healthy society.’ Morality here is integrated in such a way that directs the everyday life of a society in a hierarchical moral order.
  >>>>>>>>>>
  http://kafila.org/2011/04/14/the-making-of-an-authority-anna-hazare-in-ralegan-siddhi/

  మహిళలు ఇంటి పట్టునే ఉండాలనుకున్నప్పుడు కిరణ్ బేడీని తన టీమ్‌లో చేర్చుకోవడం ఎందుకు? ఆవిడ కూడా పెళ్ళైన స్త్రీ కనుక ఆవిడని కూడా భర్త కాళ్ళ దగ్గర ఉండమని సూచించొచ్చు. ఆడవాళ్ళ సపోర్ట్ కోసం కిరణ్ బేడీ లాంటి వాళ్ళని వెనకాల పెట్టుకుని తన స్వంత గ్రామంలో మాత్రం ఆడవాళ్ళు ఇంటి పట్టునే ఉండాలని శాసించే రకం.

 6. రంజన్‌ గారూ…హజారే తీర్పులపై నా పెదరాయుడు అనే వ్యాఖ్య మీకు ఇబ్బంది కలిగిస్తే సారీ..
  మీకు హజారే గురించి ఏమి తెలుసోగానీ…నేను ఏం రాశానో అర్థం చేసుకోకుండానే ఆరోపించారని అర్థమైంది.

  నేను ఆరోపణలున్నాయని అన్నాను. నేను ప్రస్తావించిన ఆరోపణలు కొత్తవి కావు. కలకత్తా టెలిగ్రాఫ్ ప్రతినిధి రామచంద్ర గుహ, ప్రముఖ జర్నలిస్టు చంద్రబాన్‌ ప్రసాద్‌లు పత్రికల్లో రాసినవే. మద్యం తాగిన వారిని కట్టేసి కొట్టడం, దళితులను మాంసం మానేయాలని వొత్తిడి తేవడం చేశారని రాలేగావ్ వాసులే ఆరోపించారు. ఈ సంగతి హజారే భక్తులకు తెలియకపోవడం శోచనీయం

  తాము అభిమానించే వారిపై ఏ ఆరోపణలు ఉన్నాయో కూడా తెలుసుకోకపోవడం, పైగా ఎదుటి వారిని గుడ్డిగా ఆలోచిస్తున్నరనడం సమంజసమేనా..?

  గుడ్డిగా ఆరోపిస్తున్నది ఎవరు..? గుడ్డిగా ఆరాధిస్తున్నది ఎవరు..?

  ఇక మీరో సంగతి గ్రహించాలి.

  హజారేపై గుడ్డిగా ఆరోపణలు చేసేవారు ఎందరున్నారో కానీ…
  హజారేనీ గుడ్డిగా అభిమానించేవారు వారు మాత్రం చాలా మందే ఉన్నారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s