ప్రపంచ వ్యాపితంగా అమెరికా వ్యతిరేక నిరసనలు -ఫోటోలు


ఒక అమెరికన్ యూదు (నకౌలా బెస్సెలే నకౌలా) నిర్మించాడని చెబుతున్న ‘ఇన్నోసెన్స్ ఆఫ్ ముస్లిమ్స్’ సినిమా కు నిరసనగా సెప్టెంబరు 11 తేదీన ప్రారంభమయిన నిరసనలు ప్రపంచం అంతటా విస్తరించాయి. కైరో, బెంఘాజీ నగరాల్లో జరిగిన హింసాత్మకం దాడుల అనంతరం పెచ్చరిల్లిన ఈ నిరసనలు ప్రధానంగా అమెరికా, ఇజ్రాయెల్ లకు వ్యతిరేకంగా ఎక్కుపెట్టబడ్డాయి. అమెరికా ఎంబసీలు నిరసనలకు, విధ్వంసాలకు లక్ష్యంగా మారాయి.

తమ ఎంబసీలకు రక్షణ కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని చెబుతూనే అమెరికా కొన్ని అరబ్, ముస్లిం దేశాలకు సైనికులను పంపింది. వీరిని స్వీకరించడానికి కొన్ని దేశాలు తిరస్కరించాయి. ఇస్లాం వ్యతిరేక సినిమాను ఖండించినప్పటికీ, సందర్భం వచ్చినప్పుడల్లా ముస్లిం వ్యతిరేకతను వెళ్లగక్కే పశ్చిమ దేశాల పాలకుల ఖండనలను ఎవరూ విశ్వసించడం లేదు.

భారత దేశంతో పాటు అనేక ఆసియా, ఆఫ్రికా, యూరప్, అమెరికా ఖండాల దేశాల్లో గత వారం రోజులుగా జరుగుతున్న నిరసనల దృశ్యాలివి. హిందూ, ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్, రాయిటర్స్, బి.బి.సి, ఆల్ జజీరా, డెయిలీ న్యూస్, సి.ఎన్.ఎన్… మొదలయిన పత్రికల వెబ్ సైట్ల నుండి సేకరించిన ఈ ఫోటోలు అమెరికా వ్యతిరేక నిరసనల తీవ్రతను చూపుతున్నాయి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s