పన్నులు ఎగవేయడానికి పౌరసత్వం త్యజించనున్న ఫ్రాన్సు సంపన్నుడు!


Photo: fashionphile.com

బెర్నార్డ్ ఆర్నాల్ట్. ఫ్రాన్సులో అత్యంత సంపన్నుడు. 41 బిలియన్ యూరోల (52.33 బిలియన్ డాలర్లు, 2.9 లక్షల కోట్ల రూపాయలు) ఆస్తులతో ప్రపంచంలోనే నాలుగో స్ధానంలో ఉన్న కుబేరుడు. ఈయనకి అర్జెంటుగా ఓ సమస్య వచ్చి పడింది. ఫ్రాన్సు నూతన అధ్యక్షుడు హాలండే, సూపర్ ధనవంతుల ఆదాయాలపైన 75 శాతం పన్ను వేయనున్నట్లు ప్రకటించడమే ఈయన సమస్య. అధ్యక్షుడు హాలండే, సంవత్సరానికి 1 మిలియన్ యూరోల కు మించి ఆదాయం పొందుతున్నవారిపై 75 శాతం పన్ను వేస్తానని ప్రకటించాక పన్నునుండి తప్పించుకోవడానికి బెర్నార్డ్ ఆర్నాల్ట్, బెల్జియం పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నాడని ‘ది హిందూ’ తెలిపింది. పెట్టుబడిదారుల దేశభక్తి, సమాజ సేవ బూటకమని చెప్పడానికి ఆర్నాల్ట్ ఒక చిన్న ఉదాహరణ మాత్రమే.

LVMH (Louis Vuitton Moet Hennesey) అనే లగ్జరీ బ్రాండుకు ఆర్నాల్ట్ అధినేత. బెల్జియం పౌరసత్వం కోసం ఆయన చేతున్న ప్రయత్నాలకు కుంటిసాకులు చూపుతున్నప్పటికీ పెద్దగా నమ్ముతున్నవారు లేరు. “ఫ్రెంచివాడిగా ఉండడం అంటే ఏమిటో ఆయన తెలుసుకోవాలి. మనం ఒక పెద్ద దేశం. అనేక సానుకూలతలు, చరిత్ర ఉన్న దేశం. ఫ్రెంచి అయినందుకు మేము గర్వపడతాం. దేశభక్తి ఇప్పటి అవసరం. అప్పుపై పోరాటంలో భాగం పంచుకోవాల్సిన సమయం” అని ఆర్నార్ట్ పౌరసత్వ ప్రయత్నాల గురించి వ్యాఖ్యానిస్తూ ఫ్రాన్సు అధ్యక్షుడు హాలండే వ్యాఖ్యానించాడు.

పన్నులు ఎగవేయడానికి వీలుగా పౌరసత్వం వదులుకోవడమో, ద్వంద్వ పౌరసత్వం పొందడమో ఫ్రాన్సు కుబేరులకు ఇది కొత్త కాదు. 1981 లో ఫ్రాంకోయిస్ మిట్టరాండ్ ఫ్రాన్సులో మొదటిసారి (సోకాల్డ్) సోషలిస్టు పార్టీ అధ్యక్షుడుగా ఎన్నికయినప్పుడు కూడా ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. అప్పట్లో ఫ్రాంకోయిస్ పినాల్ట్ అనే కుబేరుడు మూడేళ్ళ పాటు అమెరికాకి తరలిపోయాడు.

బెల్జియం పౌరసత్వం కోరిన వార్తలను ఆర్నాల్ట్ నిరాకరించలేదు. పైగా వ్యక్తిగత కారణాల వల్ల మాత్రమే తాను బెల్జియం పౌరసత్వం కోరుతున్నట్లు చెప్పుకున్నాడు. ఎప్పటినుండో బెల్జియం పౌరసత్వం తీసుకోవాలనుకుంటున్నట్లు కూడా చెప్పుకున్నాడు. పనిలో పనిగా దేశభక్తి పూర్వకంగా నాలుగు మాటలు కూడా చెప్పాడు. “ఫ్రాన్సులో నేనిన్నాళ్లు టాక్స్ రెసిడెంట్ నే. ఇకముందూ అలాగే ఉంటాను. ఈ విషయంలో అందరు ఫ్రెంచి పౌరుల్లాగానే, ఫిస్కల్ బాధ్యతలను పూర్తిగా పాటిస్తాను. మన దేశం తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో ఉంది. కఠినమైన బడ్జెట్ ఒత్తిడుల నేపధ్యంలో ప్రతి ఒక్కరూ తమవంతు కర్తవ్యం నిర్వహించాలి” అని బోధలు కూడా చేశాడు. కుబేరులకు ఉపదేశం చేసే హక్కు భుక్తం, వారు పాటించకపోయినా సరే.

అయితే బ్రిటిష్ పత్రిక ‘ది గార్డియన్’ కధనం ఆర్నాల్ట్ పై వచ్చిన వార్తలను మీడియా హైప్ గా కొట్టిపారేసింది. హాలండే విధానం వల్ల సంపదల సృష్టికర్తలు దేశం వదిలి పోతున్నారన్న మీడియా వార్తల వెనుక కుట్ర దాగి ఉందని ఆ పత్రిక అభిప్రాయపడింది. అసలు మొట్టమొదట అల్ట్రా ధనవంతులు సంపదలకు సొంతదారులే తప్ప సృష్టికర్తలు కారన్న వాస్తవాన్ని గుర్తించాలని కోరింది. ధనవంతులు తమ సంపదలు దాచిపెట్టే చోటునే దాచిపెట్టడానికి ఈ మీడియా హైప్ ప్రయత్నిస్తున్నదని అభిప్రాయపడింది. ధనికుల ఆస్తులు కంపెనీల షేర్లలో ఉంటాయి తప్ప పన్నులేసి లాక్కోవడానికి బ్యాంకు ఖాతాల్లోనో, వ్యక్తిగత ఆస్తులుగానో ఉండవని గుర్తు చేసింది. అనేకానేక పన్ను రాయితీలు పొందే కంపెనీల్లో ధనికుల ఆస్తులు భద్రంగా ఉంటాయని తెలిపింది. పన్నులనుండి ధనికుల సంపదలను దాచి పెట్టే కంపెనీలకు అనేక భారీ రాయితీలు ఇచ్చే ప్రభుత్వాల కింద ధనికుల సంపదలు భద్రమేనని తెలిపింది.

అధ్యక్ష పదవి చేపట్టి వంద రోజులుకూడా గడవక మునుపే హాలండే పాపులారిటీ రేటింగ్ తీవ్రంగా పడిపోతున్నది. పాత అధ్యక్షుడు సర్కోజీ విధానాలనే హాలండే కొనసాగిస్తుండడం దానికి ప్రధాన కారణం. సర్కోజీ పొదుపు విధానాలనే హాలండే ఇంకా తీవ్రంగా అమలు చేస్తున్నాడు. ధనికుల అదృశ్య ఆదాయాలపై 75 శాతం పన్ను వేస్తానని ఓ పక్క చెబుతూ పేదల్లోకెల్లా అత్యంత పేదలకు కూడా గోళ్లూడగొట్టే పన్ను పధకాన్ని హాలండే రచించాడు. ధనికుల ఆదాయాలపై పన్నులు వేస్తానన్న హాలండే ఎన్నికల వాగ్దానం ఎంత బూటకమో గార్డియన్ కధనం ద్వారా అర్ధం చేసుకోవచ్చు. అత్యంత పేదలైన రోమా ప్రజలను దేశం నుండి తరిమి కొట్టి వారి ఆవాసాలను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు హాలండే కట్టబెడుతున్నాడు. ఇలాంటి రాజకీయ నాయకులు, పార్టీలు సోషలిస్టు ముసుగు వేసుకోవడం ఒక దౌర్భాగ్యం.

One thought on “పన్నులు ఎగవేయడానికి పౌరసత్వం త్యజించనున్న ఫ్రాన్సు సంపన్నుడు!

 1. పెట్టుబడిదారుల దేశభక్తి, సమాజ సేవ బూటకమని చెప్పడానికి ఆర్నాల్ట్ ఒక చిన్న ఉదాహరణ మాత్రమే.

  Its partially a wrong statement.
  What if someone says “those who do not do any work or not adding any value addition to the country’s economy will be barred from getting some of the Government facilities.”??

  75% is huge tax.

  In fact, Hitler had executed the thing of “getting rid of” old people because they cant work and cant add any value addition. But, that is totally wrong side of execution, where as I partially support this. Very minimal amount of support.

  Please dont say that it is Government’s responsibility to provide people some work so that they can earn. Its not totally Govt’s responsibility. It’s mutual. People should start creating opportunities for themseleves. Don’t bring in many things like India and execution of constitution, dalit etc. etc.

  Let’s talk as Universal Citizen. 🙂

  What do you say?

  Chandu

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s