వివిధ దేశాల్లో ప్రజల రోజువారీ జీవనాన్ని, ప్రజా జీవితంలోని వివిధ కోణాలనూ పట్టిచ్చే అరుదైన ఫొటోలివి. ముఖ్యంగా ప్రజల సాంస్కృతిక జీవనాన్ని ఈ ఫోటోలు ప్రతిబింబిస్తున్నాయి. ప్రజల ఆర్ధిక స్ధితిగతులను బట్టే వారి సంతోషాలు, బాధలూ నిర్ణయం అవుతుంటాయి. ఫోటోలన్నీ దాదాపు పాజిటివ్ కోణాన్ని ప్రతిబింబిస్తున్నప్పటికీ అక్కడక్కడా కొన్ని తేడాలు లేకపోలేదు. ఆర్ధిక బలిమి కలిగిన వర్గాల ప్రజల జీవనంలో సౌకర్యం, సంతృప్తి, ఆనందం, కొత్తదనం కనిపిస్తే శ్రమ అనివార్యం అయిన వర్గాల్లో శ్రమల అనివార్యతల్లోనే సంతృప్తి, సంతోషం వెతుక్కోవలసిన పరిస్ధితి కనిపిస్తుంది. ప్రజల సంతోషాల్లో వినియోగ సరుకులు అనివార్యం అయినపుడు ఆ సరుకులు కొనలేని బడుగు జీవుల బతుకులు ఉన్నదాంట్లోనే సంతోషం వెతుక్కోక తప్పదు. ఖర్చు పెద్దగాలేని, అందుబాటులో ఉన్న ఆట పాటల్లోనే వారి సంతోషాలు, సంతృప్తులు గడిచిపోతాయి. కొత్తదనం కోసం జరిగే వారి అన్వేషణ ఆర్ధిక పరిమితుల్లో బంధించబడుతుంది. ఈ అంశాలన్నీ ఈ ఫొటోల్లో చూడవచ్చు.
జేపీజీ డే అనే వెబ్ సైట్ అందించిన ఈ ఫోటోలు ఎక్కడ తీసిందీ సమాచారం ఇవ్వలేదు. ప్రజల రూపు రేఖలు, వేష భాషలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి గనక అటువంటి సమాచారంతో పెద్దగా పనిలేదేమో. ప్రపంచం కుగ్రామంగా మారిందని భావిస్తున్నాక మనిషిని కూడా ‘విశ్వ మానవుడు’ గా భావించవలసిందే. అందుకే ఈ ఫొటోలు విశ్వమానవుడి రోజువారి జీవనం అని చెప్పడం.
మనుషులతో పాటు జంతువులు, వస్తువులు, పరిసరాలు కూడా ఈ ఫొటోల్లో పరిశీలించవలసిన అంశాలు.
బాగున్నాయి శేఖర్ గారు. గని లో పని లో కార్ఖానా లో..గుర్తుకొస్తోంది..
జీవన వైవిధ్యం అనంతం. దానిలోకి ఎన్నో కోణాలను ప్రతిబింబించిన ఫొటోలివి. కొన్ని ఫొటోలైతే మరీ మరీ బాగున్నాయి!