66 ఏళ్ల వెనుకబాటు భారతానికి సారధులు అగ్రకుల ప్రతిభా సంపన్నులే


Source: The Economic Times

ఎస్.సి, ఎస్.టి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రతిపాదించింది. బుధ, గురు వారాల్లో ఈ బిల్లును రాజ్య సభలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నించి విఫలం అయింది. సమాజ్ వాదీ పార్టీ, శివసేన పార్టీలు బిల్లుకి వ్యతిరేకంగా నినాదాలిస్తూ సభలో ప్రవేశపెట్టకుండా అడ్డుకున్నాయి. కోల్-గేట్ కుంభకోణాన్ని సాకుగా చూపి ప్రమోషన్ రిజర్వేషన్ల బిల్లు కి బి.జె.పి మోకాలడ్డింది.

“జూనియర్లు సీనియర్లవుతారు. ఇదేం జోకా? ప్రభుత్వ పాలనే జోకైపోయింది” అని బి.సి ల విముక్తి ప్రదాత అయిన ములాయం ఎస్.సి, ఎస్.టి ల జీవితాలపై పరిహాసమాడాడు. నలభై యేళ్ళు కూడా నిండని కొడుకుని దేశంలోని అతిపెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రుద్దిన ములాయం అగ్రకుల, బిసి సీనియర్లపై ఎస్.సి, ఎస్.టి జూనియర్లు పెత్తనం సాగిస్తారని తెగ ఆందోళన పడ్డాడు. కోడలిని పోటీలేకుండా పార్లమెంటుకి ఎంపిక చేసుకుని ప్రజాస్వామ్య వ్యవస్ధనే జోక్ గా మార్చిన ములాయం, సమాన న్యాయాన్ని రేఖా మాత్రంగా మాత్రమే ప్రతిబింబించే ఒక న్యాయబద్ధమైన చట్టాన్ని జోక్ గా చెప్పేందుకు బరితెగించాడు.

ఈ సందర్భంగా ప్రతిభావాదులు మళ్ళీ గొంతెత్తి, రానున్న రోజుల్లో దేశ భవిష్యత్తు గురించి కన్నీళ్ళ వరద పారించే అవకాశం లేకపోలేదు. వివిధ పత్రికల కధనాలు చూస్తే, ఇప్పటికే ఆ క్రమం ప్రారంభం అయినట్లు కనిపిస్తోంది. అందువలన వీరి ప్రతిభా నేతి బీరలో నేయి ఎంతో తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. అరవైయారేళ్ళ స్వతంత్ర భారతావని ప్రగతి గమనిస్తే ప్రతిభావాదంలో ఏ మాత్రం ప్రతిభా లేదని ఇట్టే అర్ధం అవుతుంది.

ఉన్నత అధికారులెవరు?

ఎకనమిక్ టైమ్స్ పత్రిక ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లోని ఉన్నత స్ధానాల్లో ఇప్పటికీ ఎస్.సి, ఎస్.టి ల ప్రాతినిధ్యం  లేదు, లేదా తక్కువ. ఉదాహరణకి మార్చి 2011 నాటికి ఇండియన్ బ్యూరోక్రసీ లో అత్యున్నత అధికారులయిన కార్యదర్శుల స్ధాయి అధికారులు 149 మంది ఉంటే అందులో ఎస్.సి (0%) అధికారి ఒక్కరూ కూడా లేరు. 4 గురు దారి తప్పిన ఎస్.టి (2.68%) అధికారులు మాత్రం ఉన్నారు. ఆ తర్వాత స్ధాయి అదనపు కార్యదర్శులది. 108 మంది అదనపు కార్యదర్శుల్లో (additional secretary) ఇద్దరు ఎస్.సి లు (1.85%) ఇద్దరు ఎస్.టి లు (1.85%) ఉన్నారు.

ఆ తర్వాత స్ధాయి అధికారులయిన సంయుక్త కార్యదర్శులు (joint secretary) 477 మంది ఉంటే ఎస్.సి లు 31 మంది (6.5%), ఎస్.టి లు 15 మంది (3.1%) ఉన్నారు. ఇక డైరెక్టర్లు 590 మంది ఉంటే వారిలో ఎస్.సి లు 17 మంది (2.9%) కాగా ఎస్.టి లు 7 గురు (1.2%) మాత్రమే. ఉన్నతాధికారులు మొత్తం చూస్తే 1324 మందిలో 50 మంది (3.78 %) మాత్రమే ఎస్.సి అధికారులు కాగా ఎస్.టి అధికారులు 28 (2.11 %) మాత్రమే. ఎస్.సి ఉద్యోగులు కనీసం 15 శాతం, ఎస్.టి ఉద్యోగులు 7.5 శాతం ఉండవలసిన చోట కేవలం 3.78%, 2.11 శాతం మాత్రమే ఉండడాన్ని బట్టి ఉన్నత స్ధానాలను ఆక్రమించింది ప్రతిభా సంపన్నులమని చెప్పుకుంటున్నవారేనని గ్రహించవచ్చు. ఈ సమాచారం అంతా ప్రభుత్వం ఇచ్చినదే. పార్లమెంటులో 2011 లో చర్చ జరుగుతున్న సందర్భంగా  పి.ఎం.ఓ సహాయ మంత్రి వి.నారాయణ స్వామి ఈ గణాంకాలు ప్రకటించాడు.

ఈ ఉన్నత పదవుల్లోకీ వచ్చే వారిలో అత్యధికులు ఐ.ఏ.ఎస్, ఐ.పి.ఎస్, ఐ.ఎఫ్.ఎస్ క్యాడర్లలోకి నేరుగా నియమించబడినవారే (direct recruits). ఇతరులు ప్రమోషన్ల పైన ఈ క్యాడర్లలోకి వచ్చినవారు. ఐ.ఏ.ఎస్ కి సంబంధించి డైరెక్ట్ రిక్రూట్లు 2011 మార్చి నాటికి 3251 మంది ఉంటే వారిలో ఎస్.సి లు 13.9 శాతం, ఎస్.టి లు 7.3 శాతం ఓ.బి.సి లు కేవలం 12.9 శాతం (మొత్తం 34.1 శాతం). డైరెక్ట్ గా రిక్రూట్ చేసుకున్నపుడు రాజ్యాంగం నిర్దేశించిన 15 శాతం ఎస్.సి లను 7.5 శాతం ఎస్.టి లను ఈ టాప్ కేడర్లలో నియమించవలసి ఉండగా అలా జరగలేదు. అంటే ఉన్నత స్ధానాల్లో రిజర్వేషన్లు సరిగ్గా అమలు జరగడం లేదని గమనించవచ్చు.

ఇవి కాకుండా ఇతర ఉన్నత, మధ్య స్ధాయి స్ధానాల్లో ఎస్.సి, ఎస్.టి ల కోసం రిజర్వ్ చేసిన అనేక పోస్టులు ఖాళీగా పడి ఉన్నాయి. లోక్ సభలో గత నవంబర్ లో వి.నారాయణ స్వామి చేసిన ప్రకటన ప్రకారం 73 ప్రభుత్వ విభాగాలు, సంస్ధలలో ఎస్.సి ల కోసం రిజర్వ్ చేసిన పోస్టులు 25,037 ఖాళీగా ఉన్నాయి. ఎస్.సి లకు కేటాయించి కూడా నింపకపోవడం వలన ఖాళీ గా ఉన్న పోస్టులివి. ఇందులో డైరెక్ట్ గా రిక్రూట్ చేసుకుని నింపవలసిన పోస్టులతో పాటు ప్రమోషన్ల ద్వారా నింపవలసిన పోస్టులు కూడా ఉన్నాయి. ఇందులో 4,518 పోస్టులు ప్రమోషన్ ఇవ్వడానికి అభ్యర్ధులెవరూ అందుబాటులో లేనందువలన ఖాళీగా పడి ఉన్నాయి. అలాగే ఎస్.టి పోస్టులు 28,173 ఖాళీగా ఉంటే 7,416 పోస్టులు ప్రమోషన్ల కోసం అభ్యర్ధులు లేనందువలన ఖాళీగా ఉన్నాయి.

కేంద్ర ప్రభుత్వంలోని ఎ, బి, సి, డి ఉద్యోగాల పరిస్ధితిని పై పట్టిక చూపుతోంది. మొత్తం ఉద్యోగుల్లో 17 శాతం ఎస్.సి లు, 7.4 శాతం ఎస్.టి లు ఉన్నట్లు కనిపిస్తున్నా సఫాయి ఉద్యోగాల్లో 40 శాతం ఉండడం వల్లనే వారి ప్రాతినిధ్యం వారి జనాభా దామాషా దాటినట్లు కనిపిస్తున్నది. గుమాస్తా, బంట్రోతు ఉద్యోగాల్లో తప్ప రాజ్యాంగం నిర్దేశించిన 15 % (ఎస్.సి), 7.5 % (ఎస్.టి) నిష్పత్తికి ఉద్యోగ నియామకాలు చేరలేదు.

చెప్పొచ్చేదేమిటంటే

మొదటి విషయం: ఈ ఖాళీగా పడి ఉన్న పోస్టులను నింపడానికే ప్రమోషన్ల బిల్లు అవసరం అయింది. ఈ బిల్లు వలన ఎస్.సి, ఎస్.టి లు కొత్తగా లాక్కోబోతున్న ప్రమోషన్లు గానీ, పోస్టులు గానీ ఏమీ లేవు. కింది నుండి పైదాకా మెజారిటీ పోస్టుల్లో ఉన్న పోస్టులని రద్దు చేసి అవసరం ఉన్నా కూడా కొత్త పోస్టులను సృష్టించడం మానుకున్న పరిస్ధితుల్లో ప్రమోషన్ల రిజర్వేషన్ల బిల్లు వల్ల ప్రతిభా సంపన్నులు కోల్పోయే ఉద్యోగాలు గానీ, ఎస్.సి, ఎస్.టి లు బాపుకునే కొత్త ఉద్యోగాలు గానీ ఉండబోవు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ అధికారులు స్పష్టంగానే చెబుతున్నారు.

అయినా సరే, పోస్టులు ఖాళీగా అయినా ఉండొచ్చు గానీ, ప్రజలకు సేవలు అందకపోయినా, పరిపాలన కుంటుబడినా (వారు చెప్పుకునేమేరకయినా) ఫర్వాలేదు గానీ ఎస్.సి, ఎస్.టి లు ఉన్నత స్ధానాల్లోకి చేరడానికి వీలే లేదు. రిజర్వేషన్ కోటాలో కేటాయించిన పోస్టుల్లో కూడా ఎస్.సి, ఎస్.టి లను నియమించకుండా నిరోధించడం అంటే ఇది స్పష్టంగా కుల వివక్షే. మాలలు, మాదిగలు, కొండజాతులు ప్రభుత్వంలో ఉన్నత స్ధానాల్లోకి చేరకుండా నిరోధించే కుల వివక్ష. ఓట్ల కోసం రిజర్వేషన్లు ప్రకటిస్తూ కూడా ప్రకటించిన రిజర్వేషన్లు కూడా భర్తీ కాకుండా ప్రయత్నపూర్వకంగా నిరోధిస్తున్న అత్యంత నగ్నమైన కుల వివక్ష.

రెండో విషయం: భారత దేశ పరిపాలనా వ్యవస్ధకు ఒక మూల స్తంభంగా ఉన్న బ్యూరోక్రసీ లో ఎస్.సి, ఎస్.టి లు లేరు. ఉన్నవారి చేతుల్లో అధికారం ఉండదు. ఒకవేళ ఉన్నా అది పై అధికారుల అదుపాజ్ఞలకు లోబడి ఉండవలసిందేనని, ‘తామేమి చేయలేకపోతున్నామం’ టూ కొందరు ఎస్.సి, ఎస్.టి ఉన్నతాధికారులు వివిధ సందర్భాల్లో పడిన వలపోతలు స్పష్టం చేస్తున్నాయి. అంటే దేశ పాలనా పగ్గాలన్నీ అగ్రకుల ప్రతిభా సంపన్నుల చేతుల్లోనే ఉన్నవి తప్ప ప్రతిభలేదని చెప్పబడుతున్న ఎస్.సి, ఎస్.టి ల చేతుల్లో లేదని స్పష్టంగా గ్రహించవచ్చు.

అరవైయారేళ్ళ స్వతంత్ర భారతం ప్రపంచంలోని సగం దరిద్రానికి నిలయంగా మగ్గుతోందంటే…, శక్తివంతమైన మందులు ఉన్నప్పటికీ బీదజనం ఇప్పటికీ మలేరియా, టైఫాయిడ్ జ్వరాలతో చస్తున్నారంటే…, మురుగు కాలవల కోసం కూడా అతి చిన్న యూరప్ దేశాల ముందు దేహీ అంటూ బిచ్చమెత్తుతున్నదంటే…, మానవాభివృద్ధి సూచికలో 134 వ స్ధానంలో, తలసరి ఆదాయంలో 128 స్ధానంలో,  విద్యా సూచికలో 147వ స్ధానంలో దేశం కునారిల్లుతున్నదంటే…, ప్రపంచ బ్యాంకు పధకం వేస్తే తప్ప సిమెంటు రోడ్లకు గతి లేదంటే…, బల్లకింద చేయి తడిపితే తప్ప కార్యదర్శి నుండి క్లర్కు దాకా ఫైలు ఒక్క అంగుళం కూడా కదలదంటే…,  దేశ వనరులను ప్రజలకు ఉపయోగపెట్టకుండా విదేశీ కంపెనీలకు అమ్ముకుని అవి విదిల్చే డాలర్ల మెతుకులను ఎరుకునే పాలకులు ఉన్నారంటే… కారణం ఎవరు? దేశాన్ని ఏలుతున్న అగ్రకుల ప్రతిభా సంపన్నులదా? ప్రతిభ లేదని తొక్కి పారేస్తున్న ఎస్.సి, ఎస్.టి, బి.సి, ముస్లిం లదా?

ఈ దేశం ఎస్.సి, ఎస్.టి, బి.సి, ముస్లిం ల చేతుల్లో లేదు. ఈ దేశం ఉన్నది ప్రతిభా! ప్రతిభా!! అంటూ గోల పెడుతున్న అగ్రకుల సంపన్నుల చేతుల్లోనే ఉంది. ఎస్.సి, ఎస్.టి, బి.సి లు ప్రధానంగా శ్రమ చేసి దేశాన్ని నిర్మిస్తున్న వర్గాల్లో ఉన్నారు తప్ప పెత్తందారుల్లో లేరు. ఒకటీ, ఆరా ఉన్నా పెత్తందారులకు సేవకులే. కనుక నేటి భారత దేశ దుస్ధితికి కారణం అగ్రకుల సంపన్నులే. కులం కులం అంటూ గోక్కుంటున్న అగ్రకుల పేదలకు కూడా అగ్రకుల ప్రతిభావాదంతో ఒరిగిందేమీ లేదు. దేశం గానీ, దేశ సంపద గానీ భారతీయుల చేతుల్లో ఉంటే కిందా, మీదా పడైనా వనరుల్ని పంచుకుని తినవచ్చు. ఖనిజాలు, నీరు, బ్యాంకులు, ఆఫీసులు ఇంకా అనేకానేక మానవ వనరులను ఖర్చు పెట్టుకుని  పరిశ్రమలు, ప్రాజెక్టులు నిర్మించుకుని ఉద్యోగాలు పంచుకోవచ్చు.

సార్వభౌమాధికారాన్ని కాపాడ్డంలో ప్రతిభ చూపాలి

కానీ గ్రహించవలసింది ఏమిటంటే భారత దేశమే భారత ప్రజల చేతుల్లో లేదు. బ్రిటిష్ వాడు ఉన్నదాకా వాడొక్కడే ఈ దేశానికి ప్రభువు. ఇప్పుడయితే ప్రభువులకు కొదవలేదు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, జపాన్, జర్మనీ, చీమ తలకాయంత హాలండ్, బెల్జియం లు చివరికి నిన్నగాక మొన్న లేచి నిలబడిన సౌత్ కొరియా కూడా భారత పాలకులకు ప్రభువులే. ఈ దేశాలన్నింటా గొలుసుకట్టుగా వ్యాపించి ఉన్న బహుళజాతి కంపెనీలే భారత దేశంతో పాటు అనేక పేదదేశాలకు ప్రభువులు. అరవైయారేళ్ళ పాటు ఈ ప్రభువులకు సేవ చేయడంలోనే అగ్రకుల పాలకులు గడిపారు తప్ప భారత ప్రజలకు సేవ చేయడంలో కాదు.

వెలికి తీసిన వనరుల్లో, వినియోగంలోకి తెచ్చిన సంపదలో అత్యధిక భాగం విదేశాలకు తరలిపోయింది. వాల్ స్ట్రీట్ బ్యాంకుల్లో, లండన్ ఫైనాన్స్ కంపెనీల్లో, స్విస్ బ్యాంకుల్లో ప్యారిస్, బెర్లిన్, టోక్యో ఇత్యాదిగా గల ఆధునిక నగరాల ప్రవేటు ఆకాశహర్మ్యాలలో భారత దేశ సంపద కుప్పలుగా పేరుకు పోయింది. ఆ కుప్పలనుండి భారత దేశంలోకి తిరిగి వస్తున్నదే విదేశీ పెట్టుబడులు. మన డబ్బుని మనకి ఎఫ్.డి.ఐ, ఎఫ్.ఐ.ఐ ల రూపంలో  కొద్దిగా విదిలించడానికి దేశ సార్వభౌమాధికారాన్ని బలితీసుకుంటున్నాయి బహుళజాతి కంపెనీలు. ప్రతిభా సంపన్నులు చూడవలసింది, ఆవేశపడవలసింది ఈ దోపిడిని చూసి గానీ, అరకొర వేతన బతుకుల కోసం ఆతృత పడుతున్న ఎస్.సి, ఎస్.టి, బి.సి లను చూసి కాదు.

చేతనైతే తమ ప్రతిభను సరిహద్దు దాటిపోతున్న సంపదలను అడ్డుకోవడంలో ప్రతిభావాదులు చూపాలి. భారత ప్రజల చేజారిపోయిన భారత సార్వభౌమాధికారాన్ని తిరిగి ప్రజల చేతుల్లోకి చేర్చడంలో చూపాలి. ఆదివాసుల కాళ్ళకింద ఉన్న ఖనిజవనరులను కొల్లగొట్టడం కోసం సల్వా జూడుం లనూ, రణవీర్ సేనలను సృష్టిస్తున్న పాలకుల కుట్రలను నిలవరించడంలో చూపాలి. ప్రపంచ సామాజిక పటంపై దేశాన్ని అట్టడుగు స్ధాయిలో నిలిపిన కుల వ్యవస్ధను దునుమాడి సమానత్వం నెలకొల్పడం కోసం తమ ప్రతిభకు సానపెట్టాలి. నిస్సహాయ ఆదివాసీ ప్రజలపైనా, ఈశాన్య రాష్ట్రాల ప్రజలపైనా లక్షలాది సైనికులతో యుద్ధం చేస్తున్న పాలకుల దురన్యాయాలను ఎదుర్కోవడంలో ప్రతిభను వినియోగించాలి. కూలీ డబ్బుల తో, ఖాళీ కడుపులతో, దీక్షలు అవసరం లేని నిరాహారంతో, కులాల ఉక్కు సంకేళ్లతో బతుకులీడుస్తున్న బీదాబిక్కి జనానికి దక్కుతున్న కాసిన్ని మెతుకులలో భాగం కోసం పోటీ పడే ప్రతిభ అసలు ప్రతిభే కాదని ప్రతిభావాదులు గుర్తించాలి.

36 thoughts on “66 ఏళ్ల వెనుకబాటు భారతానికి సారధులు అగ్రకుల ప్రతిభా సంపన్నులే

 1. ఇస్రో లో తరువాతి సేటిలైట్ తయారు చెయ్యాలి – కోటా – 30% ఎస్.సీ.
  బీ.హెచ్.ఈ.ఎల్ వాళ్లు మనం 30 ఏళ్ళు గా తయారు చేస్తున్న తేలికపాటి విమానానికి ఒక ఎస్.ఎం.పీ.యెస్ చెయ్యాలి – కోటా – 17% ఎస్.సీ/ఎస్.టీ వాళ్ళకి.
  ఎన్.టీ.పీ.సీ వాళ్ళు థర్మల్ రియాక్టర్లు తయారు చెయ్యాలి – కోటా – 30% ఎస్.సీ/ఎస్.టీ, 13% బీ.సీ.
  మన హాకీ టీం లో కి – అందరినీ రిజర్వేషన్ వాళ్ళని తీసుకుంటే పోలా… ఆటగాళ్ళెందుకు మనకి? కప్పులెందుకు మనకి. ఆడేవాడు ఎవడైతే ఏంటి?

  Gone are the days for merit people for Govt. jobs. Irony is… India is a developing country! 🙂

  Whoever it is, S.C, or S.T., or B.C., or O.C., (s)he should be considered as per merit.
  /* I pretend I did not write this. Because, in India its an offense. Fuck! */

 2. చందు గారూ,

  గతంలో మీరు ఇక్కడ పద్ధతిగా వ్యాఖ్యానించారు. (మరో చోటికి వెళ్ళి అసందర్భ వ్యాఖ్యలు చేసిన విషయం గుర్తులేనట్లు నటిస్తాన్లెండి.) ఆ గౌరవంతో మీరు బూతు రాసినా ప్రచురిస్తున్నాను. బూతు కూడా యధాతధంగా ఎందుకు ప్రచురిస్తున్నానంటే, బూతులు రాయడానికి మీకున్న సంసిద్ధతను కూడా పాఠకులు తెలుసుకుంటారని. (లేక ఆంగ్లంలో రాసారు కనుక బూతు కాకపోవచ్చని సరిపెట్టుకోమంటారా?)

  ప్రతిభ ఏలుబడిలోనే అరవైఆరేళ్ల ఇండియా ఇంకా అభివృద్ధి చెందుతున్న దశలోనే ఏడుస్తున్నదని రాసాను. ప్రతిభావంతుల ఏలుబడిలోనే ఇన్నాళ్ళూ దేశం ఉన్నా అభివృద్ధి ఎందుకు లేదని అడిగాను. ఆర్టికల్ లో ఉన్న విషయాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా రిజర్వేషన్లకి పెడార్ధాలు తీయడానికి, ఎస్.సి, ఎస్.టి లని వ్యంగ్యంగా వ్యాఖ్యానించడానికి మాత్రం ఆత్రం చూపించారు. ఇది కూడా ప్రతిభేనా?

  కుల నిర్మూలనకి మీలాంటి వారి వద్ద ఆలోచనలేవీ ఉండవు. ప్రతిభ కోసం మాత్రం ఏడ్పులు పెడబొబ్బలతో సిద్ధంగా ఉంటారు. అసమాన సామాజిక పరిస్ధితుల్లో సమాన పోటీలు తగవన్న సూత్రాన్ని కన్వీనియెంట్ గా మర్చిపోతుంటారు. పైగా కులం మా తప్పు కాదని బుకాయిస్తుంటారు. డొనేషన్లు కట్టి ఇంజనీర్లు, డాక్టర్లు అయినా ప్రతిభకి భంగం రాదు. డొనేషన్లకి వ్యతిరేకంగా ఉద్యమాలు ఉండవు. కాని ఒక్క ఎస్.సి, ఎస్.టి లవల్లనే దేశ ప్రతిభ అంతా కొడిగట్టుకుపోతున్నట్లు హడావుడి చేస్తుంటారు. ఇదే అసలు irony.

  మీకేమన్నా చర్చించాలన్న చిత్తశుద్ధి ఉంటే ముందాపని చేస్తే ఉపయోగం.

  (ఎడిట్ చేయబడింది)

 3. chadu cheppindi vastavam.

  reservations annitilo undalsinde. ika nundi olympics ki velle vallanu kuda reservations prakarme select cheyyali, armyy lo, ISRO lo, OSCAR awards ki kuda reservations thone pampinchalii. antha vote bannk politics kosame. jarugutunnayi.

  manaku tallent unnte evadu addukuntunnnadu. developed countries lo em reservations unnayani vallu develope ayyaru. ee desham lo edagadiniki tallent avasaram ledu. reservations or money unte chalu. india intha venukabatutananiki mummatiki reservations ne reason.

  employement lone reservations kavalani adugutharu. em CM or PM kii reservations undodda? vati kosam eppudu fight cheyaru. endukante backward classes leaders ani cheppukune andaru, party leaders iche chillaraku kakkruti padi samanulanu rechagottukoni batukutunnaru..

 4. సురేష్ గారూ, ఆర్టికల్ లో లెవనెత్తిన అంశాల గురించి చర్చించడానికి ప్రయత్నిస్తే బాగుంటుంది. మీరు చెప్పిన ట్యాలెంట్ గలవారే దేశాన్ని ఇన్నాళ్ళూ పాలించారు తప్ప ఎస్.సి, ఎస్.టి లు కాదు. అయినా దేశం ఎందుకు వెనకబడి ఉండడానికి కారణం ఎమిటో చర్చించండి. వక్ర భాష్యాలు, వ్యంగ్య వ్యాఖ్యానాలు కాకుండా విషయంపై చర్చిస్తే ఉపయోగంగా ఉంటుంది. ఇన్నాళ్లూ అణచివేయబడిన ప్రజలని మరో రూపంలో అపహాస్యం చెయ్యడం ప్రతిభావంతుల లక్షణం కాబోదు.

  మీరు చెప్పిన డెవలప్‌డ్ దేశాల్లో కులం ఉన్నదా? ఏ దేశం/దేశాల గురించి మీరు చెబుతున్నది?

 5. శేఖర్ గారు.. మీ పోస్ట్ నిజంగా కదిలింప చేసింది. తరతరాలుగా వివక్షను.. అణిచివేతను ఎదుర్కొని..ఇప్పటికీ మగ్గి పోతున్న దీన జనం గురించి బాగా రాశారు.

  ముందుగా మిమ్మల్ని ఒక విషయంలో అభినందించాలి. సినీ నటుల వ్యక్తిగత విషయాలు…సినీమా రివ్యూల పేరుతో చెత్తా చెదారం బ్లాగ్ల నిండా నింపుతున్న తరుణంలో….పబ్లిక్ టాయిలెట్ రాతలకు…బ్లాగ్ లకు తేడా లేని పరిస్థితుల్లో.. సామాన్యుడి గురించి కూడా పట్టించుకునే అతికొద్ది బ్లాగుల్లో మీదీ ఒకటి. మీ కమిట్మెంట్ కు నిజంగా ధన్యవాదములు.

  ఇక విషయంలోకి వస్తే…ఈ దేశంలో వర్ణవ్యవస్థ, కుల వ్యవస్థ, మనువాదం తాలూకు విష ఫలాల్లో ఈ సమస్య కూడా ఒకటి. వేల ఏళ్ళుగా ఈ దేశాన్ని పట్టి పీడించిన ఈ మహమ్మారి…ఇప్పట్లో కనుమరుగు కాదు.

  ఇక నా బాధంతా మన మిత్రుల స్పందన గురించి…

  మీరన్నట్లు.. ఇంతకాలంగా రిజర్వేషన్లు లేకుండానే కదా.. ఒలంపిక్స్ కు, ఆస్కార్ కు వెళుతున్నాం..? మరి ఏం పొడిచాం.. ? ఇస్రో లో రిజర్వేషన్ అంటూ ఎగతాళి చేస్తున్న వాళ్ళు…. ఇస్రో-లో దళితులు, గిరిజనులు లేరని అనుకుంటున్నారా.? ఒలంపిక్స్ లో దలితులు గిరిజనిలు పాల్గొనలేదనుకుంటున్నారా..? పతకాలు తెచ్చారని మర్చిపోయారా..?

  రిజర్వేషన్ల సమస్యను సానుభూతితో అర్ధం చేసుకుంటే తప్ప అర్ధం కాదు.

  మనం ఎవరం..? మన దేశ గత చరిత్ర ఏమిటి..? మనకు అవకాశాలు…లేదా అగ్ర వర్ణ హోదా.. లేక ఇతర సౌకర్యాలు ఎలా వచ్చాయి..? ఇదే హోదా, ఇవే సౌకర్యాలు దళితులకు.. గిరిజనులకు ఎందుకు లేవు..?

  కొందరు అమాయకంగా మన అమ్మ, నాన్న, తాతలు కష్టపడ్డారు కనుక మనకు ఇవన్నీ ఉన్నాయి. దళితులు, గిరిజనులు కష్టపడలేదు కాబట్టి వాళ్ళకు లేవు అనుకుంటారు ..! నిజానికి కష్టపడే వాళ్ళు ఎవరు..? దళితులా..? అగ్రవర్ణాల వాళ్ళా?

  మనం పుడుతూనే మంచి హాస్పిటల్లలో ఎందుకు పుడుతున్నాం? దళితుల పిల్లలు కుక్కి మంచాల్లో… చింకి చాపల మధ్య ఎందుకు పుడుతున్నారు..? అసలు పుట్టినా, బతికి బట్టకడుతున్న వాళ్ళు ఎంత మంది..? వాళ్ళు ఊరిబయట మురికి కాలవల మధ్య ఊరికి దూరంగా వెలివేయబడి ఎందుకు హీనంగా పురుగుల్లా జీవిస్తున్నారు..? వాళ్ళు అన్ని కష్టాల మధ్యన ఎందుకు బతుకు ఈడుస్తున్నారు..? మనం మత్రం హాయిగా ఎందుకు బతుకున్నాం..? ( మనకు సమస్యలు లేవని కాదు. మనకు గొప్పగా బతకడం ఎలా అన్నది సమస్య.. వాళ్ళకు బతుకే ఒక సమస్య.)

  ఎందుకంటే మన తాతలు..తండ్రులు వాళ్ళను అణిచివేశారు కాబట్టి. నాకు చరిత్రతో సంబంధం లేదు…వాళ్ళను అణిచివేసింది నేను కాదుగా..? అనే అతి తెలివికల వాళ్ళు ఉండొచ్చు. ప్రజాస్వామ్యంలో నువ్వంటే నువ్వు మాత్రమే కాదు. నీ నేపథ్యం, నీ చరిత్ర కూడా.

  నువ్వు స్వాతంత్ర్య పోరాటం చేస్తేనే స్వతంత్ర్యం రాలేదు. అవాళ మన తాతలు చేస్తేనే ఇవాళ మనం స్వేచ్చగా బతుకుతున్నాం. అంటే గతం తాలూకు మంచినే కాదు.. చెడును కుడా మనం అనుభవించక తప్పదు. వద్దనుకున్నా.

  రిజర్వేషన్లు లేక పోవడం వల్లనే కొన్ని దేశాలు అభివ్రుద్ధి చెందాయంటున్న వాళ్ళు…వెనుకబడ్డ దేశాల్లోను రిజర్వేషన్లు లేవని గుర్తించాలి..? ( దేశ) అభివ్రుద్దికి రిజర్వేషన్లకు సంబధం లేదు.

  ….మాకు మా గతంతో సంబంధం లేదనే వాళ్ళకు పరిష్కారం ఒకటే..

  మొదట కులాలు అన్నీ రద్దు చేయాలి.
  తర్వాత ఈ దేశంలోని అందరి ఆస్తులు…. ( ఎందుకంటే ఆస్తుల వెనుక కూడా కులం ఉంది కనుక.) కలిపేసి అందరికీ సమానంగా పంచాలి. అంతా జీరో నుంచి కొత్తగా జీవితాలు మొదలు పెట్టాలి.

  ఇది సాధ్యమేనా అనే విషయం పక్కన పెడితే.. ఆస్తులు కలపడానికి, కులం వదులుకోవడానికి అగ్రవర్ణాలు సిద్ధమేనా…?

 6. చందుతులసి గారూ, మీ ఆవేదనను అద్భుతంగా వ్యక్తీకరించారు.

  “నిజానికి కష్టపడే వాళ్ళు ఎవరు..? దళితులా..? అగ్రవర్ణాల వాళ్ళా?”

  “మనకు గొప్పగా బతకడం ఎలా అన్నది సమస్య.. వాళ్ళకు బతుకే ఒక సమస్య.”

  “నువ్వంటే నువ్వు మాత్రమే కాదు. నీ నేపథ్యం, నీ చరిత్ర కూడా.”

  “గతం తాలూకు మంచినే కాదు.. చెడును కుడా మనం అనుభవించక తప్పదు. వద్దనుకున్నా.”

  ఇవన్నీ మీ వ్యాఖ్యలోని వాక్యాలు. పరిస్ధితిని కళ్లకు కట్టిన వాక్యాలివి. ముఖ్యంగా రెండో వాక్యంలోనే దళితుల పరిస్ధితిని వివరించారు. మీ పరిశీలన, వ్యక్తీకరణ కొనసాగించగలరు.

  మీరు చివరలో ఉంచిన డిమాండు ఈ దేశ శ్రామిక ప్రజల ప్రాధమిక డిమాండు. ఆస్తులు పంచాలని మీరు చెబుతున్నా, దాని వెనుక సమానత్వం కావాలన్న డిమాండ్ ఉంది. దేశ ప్రజలంతా సమాన ప్రాతిపదికతో జీవించే పరిస్ధితి రావాలన్న న్యాయమైన డిమాండ్ ఉంది. తరతరాల అణచివేతనుండి దళితులు బైటపడాలన్న వాంఛ ఉంది. మీ డిమాండ్ కి నా పూర్తి మద్దతు ఇస్తున్నాను.

 7. తెలివితేటలకీ, కులానికీ మధ్య సంబంధం లేనప్పుడు అగ్రకులాలకి అధికారం ఇచ్చినా, దళితులకి అధికారం ఇచ్చినా అవినీతి అనేది ఉండనే ఉంటుంది. కనుక రిజర్వేషన్‌ల వల్లే అవినీతి పెరిగిందనే అగ్రకులాలవాళ్ళ వాదనలో నిజం లేదు అని అనుకోవాలి.

  రిజర్వేషన్‌లు అమలు చెయ్యడం వల్ల పాలక వర్గంవాళ్ళ జేబు నుంచి టంకా కూడా పోదు. రిజర్వేషన్‌ల వల్ల అగ్రకులాలలోని మధ్య తరగతివాళ్ళకి అవకాశాలు తగ్గుతాయి, దళితులలోని మధ్య తరగతివాళ్ళకి అవకాశాలు పెరుగుతాయి. వాటి వల్ల అవకాశాల కోసం కొట్టుకునేది మధ్యతరగతివాళ్ళే. రిజర్వేషన్ కోటాలో ఉద్యోగాలు చెయ్యాల్సిన అవసరం లేని డబ్బున్నవాళ్ళకి ఏమీ పోదు, పై చదువులు చదువుకోవడానికి డబ్బులు లేక రిజర్వేషన్ కోటాలో ఉద్యోగం అందుకోలేని పేదవాళ్ళకి ఏమీ రాదు.

  రిజర్వేషన్‌లు మధ్యతరగతిలో మాత్రం అంతర్గతంగా చిచ్చు పెట్టాయి.

 8. Nothing is closed out in this world. You need not to pretend that you did not see my comments. And, I am also not so stupid that you would not have read them. I wanted you to read them and I knew that you would read them.

  Come on man, when you are writing outspokenly about castes and your views, why can’t others write about the same negotiations? So, you don’t have to pretend. Because, I believe you are proud of you what you are doing out here. And, I ask you to not to pretend because I am overwhelmingly believe I am right.

  You are talking about eradicating of castes (Even ChanduTualsi too) besides supporting caste based reservations. This is like you are taking vaccine for HIV (if at all it exists) while the syringe has transmitted active HIV. May be, my example is utterly so bad. You can comment on this. But my thought is only about your understanding about this.

  You can never ever eradicate differences among human beings. Every worst human needs them to show his presence over others. If not caste, unlike in India, it would become race – black or white. If not black or white, Jew or Christian. If not Jew or Christian it would be Sunni or Sufi. Yeah, a good human being may not need them. But, even you, Visekhar – the visionary 🙂 need caste for many things. At least to run this blog. I believe and strongly believe this.

  Just do not pretend that you really want to see a world where caste is eradicated. You want to see your caste people to be on top. If you really want to see castes to be eradicated you would not have written this article.

  Come out of illusions.

  Chandu

 9. @chandutulasi: తర్వాత ఈ దేశంలోని అందరి ఆస్తులు….కలిపేసి అందరికీ సమానంగా పంచాలి. Let us add all the marks of students in a test and let us average them and give the equal marks to all. That makes all people feel like everyone is same at their intelligent levels. 🙂

  Let us appraise all employees. Very few get Outstanding. Some will get Exceeded Expectations, many would get Meets expectation etc. etc. Why don’t we average all the ratings and assign same appraisal rating to everyone. After all, we are a team. 🙂 Let us give same hike to all. Heck, if a guy is intelligent and hardworking, after all, he is working for the team.
  —-
  ఆస్తులు కలపడానికి, కులం వదులుకోవడానికి అగ్రవర్ణాలు సిద్ధమేనా…?
  Let us leave those families who had got all their properties by suppressing people or looting or whatever by bad means. At least 10% of upper middle class or middle class people should have earned their money only by putting efforts, studied hard and should have got into good jobs and became little rich. You must have included them too!

  The big question is, the so called POOR people, will they dignifiedly accept your proposal to take the money for free by looting other’s hard efforts? It makes them to feel more and more inferior. Please do not demean efforts and results.

  ముందు పేద వాళ్ళని అంత తక్కువగా చూడటం ఆపండి.

  Not every reservation caste family is poor. Not every high caste family is rich.
  Why you all talk talk talk talk by caste? Why don’t you talk by their economic class and making them equated by these means?
  First change your outlook guys! Then talk about big words like caste, equality etc. etc.

  P.S.: While we were studying in our municipal school, my friend (a B.C. guy) used to feel very inferior to accept those free text books given by Government. Teacher would call all those people names having reservations in the class loudly. The would stand among all us, and then she would read the notice that Government is freely distributing books to you all and get them. He used to feel very inferior. Fortunately, he is very intelligent guy. He is happily working for a good company and drawing decent salary. Those who are actually not able to secure good marks and wins good job talk like you. Just understand the situations and talk.

  I know, and readers know – you and visekhar are not at all going to understand. Even though it is convincing you edify your brains to not to believe by recalling all your dogma and illusions. Back to blog writing.

  Please, when you talk about equality and eradication of caste, don’t write such articles and don’t write such sentences – ర్వాత ఈ దేశంలోని అందరి ఆస్తులు….కలిపేసి అందరికీ సమానంగా పంచాలి, ఆస్తులు కలపడానికి, కులం వదులుకోవడానికి అగ్రవర్ణాలు సిద్ధమేనా…?
  These kind of statements gives an easy impression about how matured your thinking is.

  Chandu

 10. రిజర్వేషన్‌లని ఉన్నట్టుండి రద్దు చెయ్యడం సాధ్యం కాదు. ఎందుకంటే ఇప్పటికీ దళితులతో పోలిస్తే అగ్రకులాలవాళ్ళకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రిజర్వేషన్‌లని ఎప్పటికైనా రద్దు చెయ్యాల్సిందే. కులం మీద నమ్మకం లేకపోయినా కేవలం రిజర్వేషన్‌ల కోసం కులం పేరు చెప్పుకునేవాళ్ళు కొందరైనా ఉంటారు. అయితే రిజర్వేషన్‌లని ఉన్నట్టుండి రద్దు చెయ్యాలని డిమాండ్ చేస్తున్న వర్గంవాళ్ళు నిజంగా ప్రతిభని కాపాడడానికి ఆ డిమాండ్ లేవనెత్తారని మాత్రం నమ్మలేము.

 11. విశేఖర్ గారు,

  మీరు కొన్ని ముఖ్యమైన విషయాలను లేవనెత్తారు.
  Apologies for writing in English. This post is too long for me to type in telugu.

  I think fundamentally there is a much bigger problem that has to be addressed, which unfortunately neither the politicians nor the general public seem to care about. It is the institutional discrimination of backward and lower castes. This bill might help a few govt employees get their long deserved promotion, but the discrimination won’t stop unless we make giant leaps in better educating populace about the disastrous consequences of following this anachronistic caste system.

  I’ve seen many educated people in higher castes talk demeaningly about lower caste people and the simple truth is that many people who were born in higher castes, take many advantages they have for granted and they just don’t seem to understand how discriminatory the entire system is towards lower castes.

  (Disclaimer – I’m referring to lower and higher castes as in the classification, but not that one is better than other).

  For people who argue that the reservation system inhibits people with merit to get better opportunities, I think that private educational institutions and their exploitation because of the lack of enough government educational institutions has done far more damage to the nation and people with merit than any reservation system.

  Another issue, is the lack of integrity in the reservation system. I’ve seen many people get fake caste certificates during my college years, just to get the reservation benefits. Without proper integrity, these benefits always end up going to the wrong people. We need a better system to evaluate their ‘backwardness’ in the current society, which considers financial and regional factors, not just caste. I think poor rural kids of any caste deserve to have a better life, not just the lower castes.

  Increasing the reservation quota is just a stop gap measure while the problem is far more complicated and deep rooted. None of the politicians seem to have any interest or courage or any incentive to fix it. They like playing the reservation and caste card just to get votes and polarize people.

 12. And also read this: https://plus.google.com/111113261980146074416/posts/jKvvYdrdCTy

  ఒరిస్సాలో ఒక మహిళా ఎమ్మెల్యే దొంగ ST ప్రమాణ పత్రంతో ST రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసింది. అనుమానం వచ్చిన ఆమె ప్రత్యర్థులు ఎంక్వైరీ చెయ్యగా ఆమె స్కూల్ సర్టిఫికేట్ దొరికింది. ఆమె స్కూల్ సర్టిఫికేట్ మీద ఆమె గొల్ల కులస్తురాలని వ్రాయబడి ఉంది. ఆమె భర్త గిరిజనుడు. ఆమె తన ప్రయోజనాల కోసం తన భర్త కులం పేరు ఉపయోగించుకుంది. ఇక్కడ కూడా జరిగేది అదే కదా. తల్లితండ్రులలో ఎవరిది ఎంత తక్కువ కులం అయితే పిల్లలు రిజర్వేషన్ కోసం ఆ కులం పేరే చెప్పుకుంటున్నారు. రిజర్వేషన్‌లు ఎప్పటికైనా రద్దు చెయ్యాల్సిందే. వాటి వల్ల వెనుకబడిన కులాలలోని డబ్బున్నవాళ్ళ పిల్లలకి తప్ప పేద పిల్లలకి ఎలాంటి ప్రయోజనం ఉండదు.

 13. కాలేజి లో చదువుకొనే రోజులలో బి సి ల కు ప్రభుత్వం ఫీజు చెల్లించేది. ఒక సం|| దానిని చేలింపులలో ఎవో సమస్యలు తలేత్తితే వాళ్లు ఉద్యమం చేశారు. చాలా మంది డబ్బులు ఉన్న బి సి లు అందులో పాల్గొనటానికి నామోషి అయి హాస్టల్ బాత్రుంలో దాక్కొనేవారు. పల్లెటురు నుంచి వచ్చి చదివే వారు, డబ్బులు లేని బి సి లు అందులో పాల్గొని ప్రభుత్వ ఆఫీసుల చుట్ట్టు కాళ్లరిగేలా తిరిగి, వాడిని వీడిని పట్టుకొని స్కాలర్షిప్ తెచ్చుకొంటే, ఈ ఉద్యమంలో పాల్గొనని బి సి లు నిస్సిగ్గుగా ప్రభుత్వం ఇచ్చే, ఆ డబ్బులను తీసుకొనేవారు. వీరేప్పుడు అగ్రకులాల వారితో తిరుగూతూ, డబ్బు దర్పాన్ని ప్రదర్శిస్తూ, పేద బి సి లను వీరు చాలా తక్కువగా చూసేవారు. పైన ఎవరో చెప్పినట్లు అసలు ఈ బి సి లలో నిజమైనా వారేవరో, ఫేక్ సర్టిఫికేట్ పెట్టుకొని లబ్ది పొందేవారెవరో తెలుసుకోవటం చాలా ముఖ్యం. కొoతమందికి డబ్బులు మూలుగుతున్నా చదువులో రిసర్వేషన్ కొరకు, కాలేజిలో సీటు కొరకు బి సి గా కొనసాగటానికి ఇష్ట్టపడతారు.

 14. జాతి ప్రమాణ పత్రం (caste certificate) మీద సాక్షి సంతకాలు ఉండవు. తమకి పిల్లలు పుట్టక ముందు నుంచి కులం పేరు తప్పు చెప్పుకుని తిరిగేవాళ్ళ పిల్లలు ఎవరికైనా ఎటువంటి లంచం లేకుండానే దొంగ ప్రమాణ పత్రాలు వచ్చేస్తాయి. డెత్ సర్టిఫికేట్ మీద నలుగురు సాక్షుల సంతకాలు ఉంటాయి. బెయిల్ మీద విడుదలైన వ్యక్తి కోర్ట్‌కి హాజరు అవ్వకుండా తప్పించుకోవడానికి కోర్ట్‌లో దొంగ డెత్ సర్టిఫికేట్ పెట్టిస్తే అతనితో పాటు ఆ సర్టిఫికేట్ మీద సాక్షి సంతకాలు పెట్టినవాళ్ళ మీద కూడా కోర్ట్ ధిక్కారం కేస్ & ఫోర్జరీ కేస్ పడతాయి. దొంగ జాతి సర్టిఫికేట్‌తో ఉద్యోగం చేస్తే ఉద్యోగం పోతుంది కానీ జైలు శిక్ష మాత్రం పడదు. శతృచర్ల విజయరామరాజు గారి తమ్ముడు ST సర్టిఫికేట్‌తో టీచర్ ఉద్యోగం చేశాడు. అతని ఉద్యోగం పోయింది కానీ జైలు శిక్ష పడలేదు. మొన్న ST కాదని కోర్ట్ చేత డిక్లేర్ చెయ్యబడ్డ జనార్ధన్ థాట్రాజ్ అనే ఎమ్మెల్యే ఈ శతృచర్ల సోదరుల మేనల్లుడు (సొంత అక్కగారి కొడుకు).

 15. కుటుంబంలో అందరూ దొంగ సర్టిఫికేట్‌లతో ప్రయోజనాలు పొందినవాళ్ళే:

  శతృచర్ల ప్రతాపరుద్రరాజు – దొంగ ST సర్టిఫికేట్‌తో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాడు.

  శతృచర్ల విజయరామరాజు (ప్రతాపరుద్రరాజు గారి అన్నయ్య కొడుకు) – దొంగ సర్టిఫికేట్‌తో శానిటరీ ఇన్స్పెక్టర్ ఉద్యోగం చేసి ఆ తరువాత అదే సర్టిఫికేట్‌తో ఎమ్మెల్యే అయ్యాడు. కోర్ట్ ఇతను ST కాదని ప్రకటించింది.

  శతృచర్ల చంద్రశేఖరరాజు (విజయరామరాజు గారి సొంత తమ్ముడు) – దొంగ సర్టిఫికేట్‌తో బడి పంతులు ఉద్యోగం చేసి ఉద్యోగం పోగొట్టుకున్నాడు.

  థాట్రాజు నరసింహప్రియ (శతృచర్ల సోదరుల అక్క) – దొంగ సర్టిఫికేట్‌తో పార్వతీపురం మునిసిపాలిటీలో ST రిజర్వ్డ్ వార్డ్‌కి పోటీ చేసి గెలిచింది.

  జనార్ధన్ థాట్రాజ్ (నరసింహప్రియ కొడుకు) – దొంగ సర్టిఫికేట్‌తో ఎమ్మెల్యే అయ్యాడు. కోర్ట్ ఇతను ST కాదని ప్రకటించింది.
  _______________________________________

  కుటుంబంలో ఒకరు కులం పేరు తప్పుగా క్లెయిమ్ చేసినా ఆ కుటుంబంలోని మిగితావాళ్ళందరికీ సులభంగానే దొంగ సర్టిఫికేట్‌లు వచ్చేస్తాయి.

 16. చందు గారు
  ‘హిందూ మతం, కులానికి సంబంధించి దానికి ఉన్న బాధ్యత’ గురించి మీరు గతంలో చర్చ జరిపారు. ఆ చర్చలో నాతో పాటు ఇతర మిత్రులు పాల్గొన్నారు. మీరు చెప్పింది మీరు నమ్మారు. అందులో అభ్యంతర పెట్టవలసిందేమీ లేదు. అలాగే ఇతరులకి కూడా వారి అభిప్రాయాలూ వారికి ఉంటాయి. చర్చలో మీరు గానీ ఇతరుల గానీ కన్విన్స్ అయితే కావచ్చు, కాకపోనూ వచ్చు. మీరు చెప్పినదానికి తలూపకపోతే ఎదుటివారి గురించి పక్కకువెళ్ళి అమర్యాదగా, అసభ్యంగా మాట్లాడతారా? మీతో ఎంతో మర్యాదగా, ఓపికగా చర్చ జరిపినవారి గురించి మరో చోటికి వెళ్ళి అమర్యాదగా వ్యాఖ్యానించడాన్ని ఏమనాలి?

  ఈ విషయాన్నే నేను పైన అడిగాను. మీ అమర్యాద పట్ల అసంతృప్తిని నేనొక విధంగా వ్యక్తీకరించాను. దానికి సమాధానం చెప్పకుండా ‘Nothing is closed’ అంటూ ఏదో రాశారు. ఇక్కడ చర్చాంశం మీ అమర్యాద. మీరు మరో చోట చేసిన వ్యాఖ్య నేను గానీ ఇతరులుగానీ చూడొచ్చా లేదా అనో లేక చూడగలరా లేదో అనో కాదు. అసలు విషయాన్ని వదిలి ఏదేదో ఎందుకు రాస్తారు? ఇప్పటికయినా మీ అమర్యాద కి సమాధానం చెప్పగలరేమో చూడండి.

  ఇందులో అమర్యాద ఏముంది అంటారా? వేరొకరి బ్లాగ్ లో మీ వ్యాఖ్య చూడండి.

  Baaboy! Aa visaekhar, aayana gumpu oka tikka gumpu. Vaalla daantlo comments raasee raasee chachchipoyyanu!
  “Haindava Vishanaagu” anae aayana raasina post lo comments raasi raasi veegipoyaanu. Aayanaku nachchina comments maatrame unchutaadu. Mallee daanikoka “Comments Policy” ani oka page pettadu.
  Pedda taedaa gaadu!

  ఏమిటి ఈ అసభ్యత? ఇంత అసహ్యంగా మీరు రాయగలరని నేను ఊహించలేదు. ఇంత అసభ్యతను ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్న మీరు నీతి సూత్రాలు ఎందుకు వల్లిస్తున్నారు?

  ఉత్తరం గురించి రాసిన పోస్టు కింద మీ తండ్రిగారి ఉత్తరాల జ్ఞాపకాలు కూడా మీరు పంచుకున్నారు (జులై 23న). అదే రోజున మీకు సమాధానం ఇచ్చి మీ జ్ఞాపకాలను నేనూ షేర్ చేసుకున్నాను. కానీ అత్యంత ఆశ్చర్యకరంగా జులై 27 న పై కామెంట్ రాశారు. ఓ పక్క మీ తండ్రిగారి జ్ఞాపకాలు పంచుకుంటూ మరో పక్క అలా పంచుకునే వ్యక్తి గురించి ఇంత అసభ్యంగా ఎలా రాయగలరు మీరు? (మిత్రుడోకరు పంపగా ఈ కామెంట్ ఈ రోజే నేను చూశాను. చెప్పీ చెప్పీ విసిగిపోయాను అంటూ మరోకచోట రాసిన వ్యాఖ్య మాత్రమే ఇప్పటివరకూ నా దృష్టిలో ఉంది.)

  హైందవ విషనాగు ఆర్టికల్ కింద మీరు వ్యక్తం చేసిన భావాలని నేను గౌరవంలోకి తీసుకున్నాను. అంటే ఆమోదించానని కాదు. హిందూ మతం పట్ల ఫిలసాఫికల్ గౌరవం ఉన్నవారికి ఎందుకు ఆ గౌరవం ఉంటుంది అన్న అంశానికి సంబంధించి మిమ్మల్ని రిఫరెన్స్ గా తీసుకోవచ్చని నమ్మాను. కానీ ఆ నమ్మకాన్ని మీ అసభ్య రాతలతో వమ్ము చేశారు. మీరు వ్యక్తం చేసిన నీతి భావాల పట్ల మీకే గౌరవం లేదని ఇపుడు అర్ధం అవుతోంది.

  ఈ బ్లాగ్ లో హైందవ విషనాగు ఆర్టికల్ కింద మీరు వారం రోజులు (జులై 17 నుండి 24 వరకు) ఒక పద్ధతిలో చర్చ జరిపారు. జులై 27న మరో చోటికి వెళ్ళి అసభ్య రాతలు రాశారు. నాపైనా, నా బ్లాగ్ సందర్శకులపైనా నానా కూతలూ కూశారు. మళ్ళీ సెప్టెంబరు 12 కల్లా ఇక్కడికి వచ్చి ఏమీ ఎరగనట్లు వ్యాఖ్యలు చేస్తున్నారు. మీరన్న ‘Pedda taedaa gaadu!’ ఎవరో ఇక్కడే తెలుస్తోంది.

  ఒక అంశం గురించి కొద్ది మంది చర్చించుకుంటున్నపుడు ఆ చర్చకు సంబంధించి ఏమి చెప్పదలిచినా ముఖ్యంగా నెగిటివ్ గా చెప్పదలిచినప్పుడు చర్చ జరిగే చోటనే చెప్పడం మర్యాద. మీరు పాజిటివ్ గా రాస్తారా, నెగిటివ్ రా రాస్తారా అన్నది తర్వాత విషయం. కానీ దాన్ని చర్చ జరిగే చోట రాయడమే మర్యాద. ఆ మర్యాద పాటించకపోగా అసభ్య రాతలకు మీరు దిగారు. మీ రాతలను, భావాలను మీరే అపహాస్యం చేసుకున్నారు.

  ‘కాదు, నా యిష్టం వచ్చింది, ఇష్టం వచ్చిన చోట రాస్తాను. ఆ హక్కు నాకుంది.’ అంటారా? నిస్సందేహంగా రాసుకోవచ్చు. అలా కొంతమంది రాస్తున్నారు కూడా. మీరూ అదే కోవలోని వారయితే ఇక మీతో చర్చలు ఉండవు. ముఖ్యంగా పై విధంగా రాయాలంటే ఆ స్ధాయికి నేనూ దిగజారాలి. అది నాకు సాధ్యం కాదు. నేను దిగజారడానికి ప్రోత్సహించే వ్యాఖ్యలను తొలగిస్తాను తప్ప ప్రచురించను. అలాగని మడి కట్టుకోవడం కూడా నా విధానం కాదు. అదేపనిగా వచ్చి బూతు కూతలు కూస్తే వారి స్ధాయికి వెళ్లకుండానే తగిన సమాధానం ఇవ్వకుండా మాత్రం ఉండను.

  చర్చలో ఉన్న వ్యక్తులకి మర్యాద ఇవ్వనివారితో ఎవరూ చర్చించరు. ఆ అవసరం ఎవరికీ ఉండదు. (వ్యంగ్యాలకూ, బూతులకూ దిగి అందులోనే ఆనందం అనుభవించేవారి గురించి నేను మాట్లాడడం లేదు) ఒకరికొకరు విలువ, గౌరవం ఇచ్చేచోటనే సజావుగా చర్చలు జరుగుతాయి తప్ప, వ్యంగ్యం చేస్తాను పడండి అంటే ఎవరూ పడరు. బహుశా మీరు కూడా. ఒకరి స్వేచ్ఛ మరొకరి ముక్కు వరకూ రాకూడదన్న సూత్రాన్ని అన్నీ చోట్లా అమలు చేస్తేనే ఎవరికైయినా మర్యాద దక్కుతుంది. లేకుంటే మర్యాద పోతుంది.

  మీరు ఈ ఆర్టికల్ కింద రాసిన బూతు గురించి నేను అడిగినా ఎందుకు జవాబు చెప్పరు? మీ రంగు బయటపెట్టే అంశాలనుండి ఎందుకు తప్పించుకుంటున్నారు? పైగా ఆయనకి నచ్చిన కామెంట్లే ఉంచుతాడు అంటూ అబద్ధాలా?

  మనుషుల మధ్య సహజ నాగరిక సంబంధాలు ఎలా ఉంటాయో, ఎలా ఉండాలో ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. మనిషి ముందు ఒక మాట వెనుక మరొక మాట చెప్పడం సరికాదని మీరెప్పుడయినా భావించి ఉంటే దాన్నోకసారి గుర్తు తెచ్చుకోండి. విజనరీ అనీ, ఇల్యూషన్స్ అనీ ఎదుటివారి అభిప్రాయాలకు వక్ర భాష్యాలు ఇవ్వకండి. మీ అభిప్రాయాలైతే గొప్పవి, మీకు నచ్చని అభిప్రాయాలైతే ఇల్యూషన్స్ అనీ భ్రమలు ఉంటే వాటినుండి బైటికి రాగలరేమో చూడండి.

 17. హిందూత్వం గురించి చర్చ జరుగుతున్నప్పుడు నేను కొన్ని విషయాలు స్పష్టంగానే చెప్పాను. నమ్మకాలు అనేవి వ్యక్తిగత కాంక్షలకి అనుగుణంగా ఎలా పడితే అలా మార్చుకోగలిగేవి. అందుకే మద్యమాంసాలు ముట్టుకోకూడదు అనే నమ్మకం పోయి శని, సోమవారాల నాడు మాత్రమే మద్యమాంసాలు ముట్టుకోకూడదు అనే నమ్మకం వచ్చింది. మనిషి తన భౌతికపరమైన ఆకాంక్షల కోసం నమ్మకాలు ఏర్పాటు చేసుకుంటాడు కానీ నమ్మకాల కోసం భౌతికపరమైన ఆకాంక్షలని ఏర్పాటు చేసుకోడు. భావం అనేది ఎప్పుడూ భౌతిక పునాదుల ఆధారంగానే ఉంటుంది కానీ అది భౌతిక పునాదులని శాసించే స్థాయికి ఎన్నడూ ఎదగదు. మనిషి తన భౌతిక అవసరాల కోసం బతుకుతున్నాడు కానీ నమ్మకాల కోసం బతకడం లేదు కదా.

  పూర్వం యూరోపియన్‌లు సముద్రంలో జలకన్యలు ఉంటాయని నమ్మేవాళ్ళు. వందల సంవత్సరాలు గడిచినా ఎవరికీ జలకన్యలు కనిపించకపోవడం వల్ల జలకన్యలు ఉంటాయనే నమ్మకం పోయింది. కానీ దేవుడు అనే నమ్మకం ఇప్పటికీ ఉంది. మనిషి “అద్భుతాలు” అనే ఆకర్షణ నుంచి పూర్తిగా బయటపడకపోవడం వల్లే కదా ఇదంతా. లేని అద్భుతాలని ఉన్నట్టు ఊహించుకుని ఆ ఊహలతో సంతృప్తి పడే స్థాయిలో మనిషి ఉండకూడదు అనే కోరుకోవాలి.

 18. మతం అనేది చాలా సందర్భాలలో సెకండరీ విషయం లేదా అనవసరమైన విషయం. ఒక సింపుల్ లాజిక్ చెపుతాను. ముస్లింలని అడ్డమైన తిట్లు తిట్టి, సమైక్యవాదం విషయానికొచ్చేసరికి మజ్లిస్ పార్టీని పొగిడేవాళ్ళు మన బ్లాగుల్లోనే చాలా మంది కనిపిస్తారు. మనిషిని నమ్మకాలు కంటే భౌతిక పరిస్థితులే ఎక్కువగా ప్రభావితం చేస్తాయని ఇక్కడే అర్థం కావడం లేదా?

 19. “మనిషి తన భౌతికపరమైన ఆకాంక్షల కోసం నమ్మకాలు ఏర్పాటు చేసుకుంటాడు కానీ నమ్మకాల కోసం భౌతికపరమైన ఆకాంక్షలని ఏర్పాటు చేసుకోడు. భావం అనేది ఎప్పుడూ భౌతిక పునాదుల ఆధారంగానే ఉంటుంది కానీ అది భౌతిక పునాదులని శాసించే స్థాయికి ఎన్నడూ ఎదగదు.”

  సరైన మాట ప్రవీణ్ గారు.

 20. లేని దాన్ని ఉన్నట్టు ఊహించుకుంటే ఏమీ రాదు. అలా వస్తుందనుకుంటే యూరోపియన్‌లు ఇప్పటికీ జలకన్యలని ఊహించుకుంటూ ఉండేవారు.

  సినిమాలలో హీరో స్వర్గానికి వెళ్ళి రంభ, మేనకలతో నాట్యం చేసే కథలు చూసినప్పుడు మనం ఆహా-ఓహో అని ఆనందిస్తాం. కానీ నిజ జీవితంలో ఎవరైనా తాను స్వర్గానికి వెళ్ళి వచ్చానని చెపితే మనం నమ్మము. ‘స్వర్గం-నరకం నిజంగా ఉంటాయా?’ అని ఆ సందర్భంలో డైరెక్ట్‌గా అడిగేస్తాం. ఎందుకంటే లేని దాన్ని ఉన్నట్టు నమ్మితే మనకి ఏమీ రాదని మనకి తెలుసు కాబట్టి. కానీ ఈ సెన్స్‌ని అన్ని సందర్భాలలోనూ ఉపయోగించము. అందుకే కొన్ని సందర్భాలలో భావవాదం అభివృద్ధి నిరోధకంగా పని చేస్తుంది.

 21. @Visekhar Garu: Okay. I understand. You may accept my apologies for my comments in other blogs. But, I mean it sir! What can I do?

  1. You guys are blindly reluctant (I can explain this if you want.) to see the hairline differences. I really felt it. Everyone has their thresholds in holding emotions.
  Can you just place your hand on your heart and tell you did not comment badly about a person in his absense. Everyone does. And, I told you that I wanted you to see that. If I had done that expecting that you should not see that, then it is as good as commenting on your back. What I did was as good as I had told you directly. Because, I wanted you to see that.

  But, even my friend warned me to not to write like that. But I did. My apologies.

  2. And, I did not use that f*(k word in BOOTU sense. Its like how we tell sh!t. Dont take it wrongly boss! When you are growing by age nothing is bootu. Because everthing is known to us. There is nothing bootu for elders. If at all, if someone tells you in agony, then that would become offensive. Yes, if under 18 are reading this article, my comment would become, definitely, a bootu. You can delete that comment. But I request you to keep that. Do not erase history. Let some things happen the way they happen.

  3. Nenu koodaa taedaa gaanni kaadu sir! Whatever I wrote in that “Hyndava Vishanaagu” were truly from my bottom of heart and I am concretely firm on what I have written and wanted to speak to you all in person so that I can convince you. But that is not at all possible.

  But all of us are “కొంచం తేడా.” You always keep emphasis on “Caste Equality.” where as you always post about non-equality. Isn’t it like totally totally totally different from what you want to see? So… కొంచం తేడా. Everyone is కొంచం తేడా.

  4. I thoroughly enjoy your blog and views. But only thing is I always dont comment. I suggested my friends to see your blog and discuss a lot. YOu should know that many of my friends are dalit. And some of these dalits exactly oppose you and support me. Its like… not all dalits want reservation because they understood the notion that thier fathers have already got settled and they dont need any reservation at all and they want their kids to be non-reservation category ones. Because, they feel inferior to use that category because they are financially okay! That’s the outlook I want to see. And, I have that outlook. That is why those dalits and myself are enjoying each other’s company.

  5. Its not like you always poke poke poke the government or dalits to be forward. Educate them boss! The days are gone to be proud of having reservation. These days are of self dignity. Everyone is capable of doing something great. No one needs some percentage of advantage from government in the form of reservation.

  6. I thoroughly believe you understood me. Its time to bring up lower economy familes. Not those – socially wrong word – lower caste people.

  After all, this world is a better place to live in. Happy reservations. Happy fucking by government.

  Chandu

 22. చందు గారూ! ‘వేయితలల హైందవ విషనాగుడి’ చర్చలో నేనూ పాల్గొన్నాను. ఆ చర్చ సామరస్యపూరితంగా, ఆరోగ్యకర ధోరణిలో సాగింది. చర్చలో పాల్గొన్న రాజశేఖరరాజు గారు ఏమని రాశారో గుర్తు చేసుకోండి- ‘ చందు గారితో సహా ఈ కథనంలో వ్యాఖ్యలు కొనసాగించిన క్రమం చాలా సంయమనంగా నడిచింది. భిన్నాభిప్రాయాల మధ్యనే భావాలు పంచుకోవడం ఎలా సాగాలో చెప్పడానికి ఇది నిదర్శనం.’

  కానీ మీకు అలా ఏమాత్రం అనిపించలేదనీ, పైగా ఈ చర్చ చాలా చిరాకు కలిగిందనీ కూడా వేరే బ్లాగులో మీరు రాసిన కామెంట్ చూస్తే తెలుస్తోంది. ఈ చర్చలో పాల్గొన్నవాళ్ళను విశేఖర్ గుంపుగా, పైగా oka tikka gumpu.గా ముద్ర వేసేశారు. ఇప్పుడు విశేఖర్ గారు నిలదీసేసరికి… వేరే బ్లాగులో రాసినందుకు ‘మాత్రమే’ ఆయన్ను అపాలజీ అడుగుతున్నారు కానీ, చర్చలో
  పాల్గొన్నవారిని శాపనార్థాలతో రాసినందుకు మీకేమీ విచారం లేదు! మీ సంస్కారం ఎలాంటిదో మీరే బాగా రుజువు చేసుకున్నారు!

 23. @Venu Ch: Yes, I have proved my samskaaram! How does that matter? If an unordered guy asks you to not to touch flame because it burns you. Would you just ignore the truth because he was unordered? It does not matter to me how you judge me. What should matter to you is just what I said. It should be clear now Venu gary!

  Chandu

 24. విశేఖర్ గారూ,
  ఇదేమిటి ఇలా జరిగింది? అయినా ఆ గుంపు ఈ గుంపు అంటూ ముఠాలో భాగంగా మనుషులను వర్గీకరించడం సమంజసం కాదనుకుంటాను. వారు చెప్పిన మీ ‘గుంపు’ లోని వారు చాలా సందర్భాల్లో మీతో విభేదించారనుకుంటాను. నాతో సహా… చూస్తుంటే గుంపులో భాగంగా కాకుండా మనిషి విడిగా ఉనికిలో ఉండటం, అభిప్రాయాలలో ఏకీభవించడం, విభేదించడం కూడా అపార్థానికి, నిందలకు గురవుతోందేమో మరి. ఏమయినా, ఒకరి గుంపులో నేను ఉన్నానని ముద్ర పడటం నా మట్టుకు నాకు అవమానకరంగా అనిపిస్తోంది.

  మనిషిని ఇలా ‘గుంపు’ కట్టేస్తే ఎలాగండీ.

  చందమామ నుంచి బయటపడుతూ జీవిక కోసం ప్రయత్నిస్తున్నాను కాబట్టి మీ ‘గుంపు’ లోకి రావటం ఆలస్యమయిందండీ. నేను చెన్నయ్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నాను. అందుకే చర్చల్లోకి రాలేకపోతున్నాను.

 25. పది సం|| క్రితం హైదరాబాద్ లో నా మిత్రుడితో పాటుగా సాఫ్ట్ ట్రైనింగ్ తీసుకొనే వారు కొంతమంది పరిచయం అయ్యారు. అందులో ఒకతను తనకు పెళ్లి కుదిరింది, కాబోయే భార్య డాక్టర్, కట్నం 30+ లక్షలు, పెళ్లి చేసుకొని అమేరికాకు పోతున్నాను అని చెప్పాడు. నా మిత్రుడు తెలంగాణా వాడు. అతను ఆంధ్రా లో కొంతమంది దళితుల దగ్గర డబ్బులు మా వూరిలో రేడ్ల దగ్గర కన్నా ఎక్కువగా ఉన్నాయి అని చెప్పాడు. కారణం ఈ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ దళితుడు, చదువుకొన్నవాడు, అమేరికాకు పోతున్నవాడు కావటమే.

  శేఖర్ గారు 60సం|| లలో రిసర్వేషన్స్ వలన అభివృద్దిచెందినవారు ఎంతో మంది ఉన్నారు. వారేమి తాము అభివృద్ది చెందాము రిసర్వేషన్స్ వద్దు అని ఎక్కడా చెప్పరు. స్వచ్చందంగా వదులుకోరు. ఇక మీరు రాసే విధానం చూస్తే దళితులంతా బీదవారికి, వెనుకబడినవారికి పర్యా పదం లాగా వాడుతారు. ఈ అభివృద్దిచెందిన దళితులు అగ్రవర్ణాల వారి పంథాను వారికన్నా ఎక్కువగా అనుసరించటం ఈ రోజు చూస్తున్నాము. వారి కులంలోని బీద వర్గాల వారిని పైకి తేవటానికి అసలికి దళితులు చేస్తున్న కృషి ఎమీ? ఒకవేళ కృషి చేయలేకపోయినా కనీసం అభివృద్దిచెందిన వారు రిసర్వేషన్లను వదులుకోవచ్చుకదా!

 26. రాజు గారు,

  అదే సమస్య గా ఉంది. ఏకీభవిస్తే భజన అనడం, విభేదిస్తే తేడాగాడు అనడం జరుగుతోంది.

  ఒక వ్యక్తిని తీసుకున్నా, సందర్భాన్ని బట్టి, పరిస్ధితులను బట్టి ఒకే అంశంపై వివిధ ఆలోచనలు అతనికి కలుగుతాయి. స్ధల, కాలాల్ని బట్టి అభిప్రాయాల్లో కొన్ని మార్పులు వస్తుంటాయి. అవి ఒక్కోసారి పూర్తి విభిన్నంగా కూడా ఉండవచ్చు. ఎన్ని మార్పులు చోటు చేసుకున్నా తమ చుట్టూ ఉన్న భౌతిక పరిస్ధితులకు లోబడే అవి ఉంటాయి. ఈ పరిస్ధితులని పరిగణనలోకి తీసుకోకుండా వ్యక్తులపైన నెగిటివ్ జడ్జిమెంట్ ఇచ్చెయ్యడం, దూషించడం సరైన ధోరణి కాదు. పరిస్ధితులతో సంబంధం లేకుండా అవకాశవాదంతో అభిప్రాయాలూ మార్చుకుంటే అది చర్చనీయాంశం.

  ఇటువంటి సమస్యలపైన వైరుధ్య సూత్రం చక్కటి అవగాహన కలిగిస్తుంది. మిత్ర వైరుధ్యాలను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలనీ, శత్రు వైరుధ్యాలతో రాజీ లేకుండా తలపడాలనీ చెప్పే వైరుధ్య సూత్రం సదా అనుసరణీయం.

  చందుగారు ‘అపాలజీ’ చెప్పడం ఆహ్వానించదగిన పరిణామం. ఆ మేరకు ఆయన తన గౌరవాన్ని నిలుపుకున్నారు. అయితే అపాలజీకి కండిషన్స్ పెట్టడమే బాలేదు. తిక్క గుంపు అనీ, తేడా గాడు అనీ దూషించడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేయలేదు. పైగా ‘ఐ మీన్ ఇట్’ అంటున్నారు. ఆయన ఇచ్చిన వివరణలోనే వైరుధ్యాలు ఉన్నాయి. బహుశా ఇది ఉద్దేశ్యపూర్వకంగా జరగలేదేమో. ఆయన తాను చెప్పదలుచుకున్నదాన్ని (అపాలజీ కూడా) తగిన రీతిలో ఎక్స్ ప్రెస్ చెయ్యలేకపోయారేమో అనిపిస్తోంది. వ్యక్తీకరణలో సమగ్రత ఉండేలా చూడడంలో విఫలం చెందారేమో అనిపిస్తోంది.

  అలాంటప్పుడు అటు ఇటు తిప్పి చెప్పే బదులు నేరుగా స్పష్టంగా చెబితే సరిపోతుంది. దూషణ చెయ్యకుండా ఉండాల్సిందనో, అలా అనకుండా ఉండాల్సింది అనో చెబితే సరిపోతుంది. మామూలుగా చెప్పదగిన విషయాన్ని కూడా సూత్రబద్ధంగానో, ఆయనే చెప్పినట్లు ‘విజనరీ’ తరహాలోనో చెప్పడానికి ప్రయత్నిస్తుండడం వల్ల అసలు విషయం పక్కకుపోయి చెప్పాలనుకున్న విషయం కూడా ఎక్స్ ప్రెస్ కావడం లేదు.

  ఇవన్నీ ఎలా ఉన్నప్పటికీ తిరస్కరణకి గురయిన ఒక ధోరణిని ఉపసంహరించుకోవడానికి ఆయన సంసిద్ధత ప్రకటించడమే ప్రధానంగా గుర్తించవలసిన విషయం.

  (చందుగారూ, ఈ విషయం మీక్కూడా చెప్పినట్లు భావించగలరు.)

 27. శ్రీ గారు, ఒక విషయం గమనించాలి. ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి నూటికి ఒకరికో, ఇద్దరికో వస్తాయి కానీ అందరికీ రావు. రిజర్వేషన్ కోటాలో పోటీ పడినా, ఓపెన్ కోటాలో పోటీ పడినా నూటికి ఒకరిద్దరికి మాత్రమే ఆ అవకాశాలు వస్తాయి. ఈ కొద్ది పాటి అవకాశాల కోసం దళితులూ, అగ్రకులాలవాళ్ళూ ఎందుకు కొట్టుకుంటున్నారు అనే సందేహం రావచ్చు. ప్రభుత్వ ఉద్యోగానికి ఉన్న ఉద్యోగ భద్రత ప్రైవేట్ ఉద్యోగానికి ఉండదు. అందుకే ప్రతివాడూ ప్రభుత్వ ఉద్యోగమే కావాలంటాడు. ఇప్పటికీ దళితులతో పోలిస్తే అగ్రకులాలవాళ్ళలో చదువుకున్నవాళ్ళు ఎక్కువ. రిజర్వేషన్‌ల వల్ల అగ్రకులాలవాళ్ళకే అవకాశాలు తగ్గిపోతాయి. దేశీయ ఫాక్టరీలు పెట్టి ఉద్యోగావకాశాలు పెంచకుండా, వ్యవసాయానికి ఋణాలు ఇవ్వకుండా, ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించడం కంటే గొప్ప భాగ్యం లేదు అనే అభిప్రాయాన్ని వ్యాప్తిలో పెడితే జనం కొద్ది పాటి అవకాశాల కోసం కొట్టుకోకుండా ఏమి చేస్తారు?

 28. Sri గారు,

  ఒక తెలంగాణ దళిత సాఫ్ట్ వేట్ ఇంజనీరు ఆయన ఊరిలోని రెడ్లను, ఆంధ్రాలో కొద్దిమంది దళితులను పోల్చుకుని ఒక వ్యాఖ్య చేస్తే దానిని మీరు జనరలైజ్ చెయ్యడం ఏమిటో నాకు అర్ధం కాలేదు. ఆయన విశ్లేషణని నన్ను కూడా స్వీకరించమని చెప్పడం ఇంకా అర్ధం కాలేదు.

  అగ్రకులాల వారంతా ధనికులు కాకపోయినా సామాజిక హోదా పరంగా వారందరూ ధనవంతులే. వారు కులం చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సిన పరిస్ధితి లేదు. పైగా గర్వపడవచ్చు. అగ్రకులాల పేదల సమస్య ప్రధానంగా ఆర్ధిక సమస్య.

  కానీ దళితులు తరతరాలుగా సామాజికంగా, ఆర్ధికంగా పేదవారే. రాచరికాలు నశించి, ప్రజాస్వామ్యం పేరుతో ప్రజాప్రాతినిధ్య వ్యవస్ధలు ప్రవేశించాక ప్రజలందరి ఓట్లు ధనిక పాలకులకు అవసరం అయ్యాయి. అందుకోసం దళితులను మచ్చిక చేసుకోవడానికి కొందరు దళిత ధనవంతులను సృష్టించి తమలో కలుపుకున్నారు. భూస్వామ్య ఆర్ధిక సంబంధాలు బలహీనపడడం, విద్యా సౌకర్యాలు అందుబాటులోకి రావడం తదితర కారణాలవల్ల దళిత కులాల్లో చైతన్యం పెరిగి తమ హక్కులను కోరడం పెరిగింది. ఆ విధంగా వచ్చినదే రిజర్వేషన్ సౌకర్యం. ఇది కంటితుడుపు చర్యే తప్ప పరిష్కారం కాదు. దళితుల్లో మధ్యతరగతిని సృష్టించినంతమాత్రాన రిజర్వేషన్ కుల సమస్యకు పరిష్కారం కాదు.

  వ్యవస్ధీకృతమైన కులం ప్రధాన సమస్య. పెద్ద సమస్య. వ్యవస్ధాగతమైన సమస్య. ఈ సమస్యని వదిలి ఫలానావారు అలా ఉన్నారు, ఇంకొకరు ఇలా ఉన్నారు అని చెప్పుకోవడం వల్ల ఫలితం ఏమిటి చెప్పండి?

  నేనో ఉదాహరణ చెబుతాను. మా స్నేహితుడొకరు కులాంతర వివాహం చేసుకున్నాడు. దళితుడైన అతను కమ్మ స్త్రీని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. మామూలుగానే అతని భార్య తరపువారు ఎవరూ పెళ్ళికి ఒప్పుకోలేదు. పెళ్లి ఇష్టం లేదని చెప్పేశారు. మాదిగోడిని ఎలా పెళ్ళి చేసుకుంటావ్ అని అతని అత్తామామలు తమ కూతురిని నిలదీశారు. మురికోళ్ళని బంధువులుగా తెస్తావా అని నిరసించారు. ఆస్తిలో చిల్లి గవ్వ ఇవ్వం అని బెదిరించారు. ఇవేవీ వారి కూతురిపై పని చేయలేదు. తెలిసినవారు వారికి మీటింగ్ పెళ్ళి జరిపించారు.

  పిల్లలు పుట్టాక మా స్నేహితుడు, అతని అత్తమామల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి. (వారి ఇతర కూతుళ్ళకి ఎవరికీ పిల్లలు లేరు. ఏకైక కుమారుడు అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్. అందువల్ల మనవరాళ్లతో ఎంజాయ్ చేసే అవకాశం వారికి దక్కలేదు. మనవడి కోసం వారి ఎదురు చూపులు ఫలించలేదు.) ఓ పదేళ్ళ తర్వాత అతన్ని అల్లుడిగా కూడా స్వీకరించారు. అంటే తమని అత్తయ్యా, మామయ్యా అని పిలవమని స్వయంగా అల్లుడిని కోరారు.

  కానీ అల్లుడి తల్లిదండ్రులని వియ్యంకులుగా స్వీకరించలేదు. అతని అన్న దమ్ములని కానీ, ఇతర బంధువులని గానీ బంధువులుగా స్వీకరించలేదు. కూతురి కుటుంబానికి అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉన్నారు గానీ అల్లుడి కుటుంబంతో బంధుత్వ సంబంధాలు పెట్టుకోవడానికి నిరాకరించారు. పెళ్ళిళ్ళకు ఆహ్వానాలు ఇవ్వలేదు. చావులకు కబుర్లు వెళ్లలేదు. వియ్యంకుడు చనిపోయినపుడు వెళ్లడానికి ఇష్టపడలేదు. ఇవన్నీ జరిగినా వారు అల్లుడికి చాలా గౌరవం ఇచ్చారు.

  మా స్నేహితుడు ఆదర్శాలను పాటించాలని భావిస్తాడు. దళితుల్లో అభివృద్ధి చెందినవారు రిజర్వేషన్లు వదులుకుని పేద దళితులకు అవకాశం ఇవ్వాలని భావిస్తాడు. తన ఆదర్శానికి తగ్గట్టుగానే తన పిల్లలకి కుల రిజర్వేషన్ వాడకూడదని నిశ్చయించుకున్నాడు. స్కూల్ లో అసలు కులం లేదని చెప్పడానికి ప్రయత్నించాడు. కానీ అతనికి తన తల్లిదండ్రులతో పాటు అగ్రకులానికి చెందిన అత్తమామల నుండీ కూడా మద్దతు దొరకలేదు. తీవ్రంగా వ్యతిరేకించారు. పిల్లలకు అన్యాయం చేస్తారా అని భావోద్వేగంతో ప్రశ్నించారు. వాళ్ళు పెరిగి పెద్దయ్యాక ‘తమకు అన్యాయం ఎందుకు చేశావు నానా అని అడిగితే వాళ్ళకి ఏమని సమాధానం చెబుతావ్?’ అని అడిగారు. ఆదర్శాలు కూడు పెట్టవు అని యధాశక్తి బోధలు చేశారు. ఇన్ని ఒత్తిడుల మధ్య మా స్నేహితుడి ఆదర్శం గాలిలో కలిసిపోయింది.

  ఇందులో ఎవరిది తప్పని పిన్ పాయింట్ చెయ్యాలి?

  మా స్నేహితుడుకి ఆదర్శాలు, వాటిని అమలు చేయాలన్న కమిట్ మెంటు ఉన్నా అమలు చేయ్యలేకపోయాడు. అల్లుడి కులాన్నీ, అతని బంధువులను ఇప్పటికీ ఈసడించుకునే అతని అత్తామామలు అతని కులం ద్వారా వచ్చిన రిజర్వేషన్ ని సమర్ధించడానికి, మనవళ్ళకి ఉపయోగపెట్టడానికి సిగ్గుపడలేదు. తన దళిత మనవళ్ళు రిజర్వేషన్ వదులుకుంటే కమ్మ బంధువుల పిల్లలు లబ్ది పొందుతారని వారేమీ అనుకోలేదు. ఈ పరిస్ధితుల్లో “వారి కులంలోని బీదవర్గాల వారిని పైకి తేవడానికి అసలికి దళితులు చేస్తున్న కృషి ఏమి?” అని మీరడిగిన అమాయక ప్రశ్న సమంజసం కాదని అర్ధం అవుతుంది.

  అగ్ర కులాల్లో అభివృద్ధి చెందినవారిలో పేదవారికి చేయూతనిచ్చి పైకి తెచ్చే లక్షణం ఏమన్నా ఉందా? లేదు కదా? అగ్రకులాలు పాటించలేని ఆదర్శాలు దళితులు ఎలా పాటిస్తారు? వనరులు, అధికారాలు అన్నీ చేతుల్లో ఉన్న అగ్రకులాలే తమ కులాల్లో పేదలను పైకి తీయరు. ఏ అవకాశమూ, ఆస్ధులూ లేని దళితులు తోటి దళితుల్ని పైకి ఎలా తెస్తారు? దళితులే దళితులని పైకి తెచ్చుకోవాలని చెప్పడం పైకి బాగానే ఉంటుంది. భూములు ఇవ్వకుండా, ఉద్యోగాలు ఇవ్వకుండా, స్వయం ఉపాధికి అప్పులు కూడా ఇవ్వకుండా మిమ్మల్ని మీరే అభివృద్ధి చేసుకోండి అనడంలో అర్ధం ఉందా?

  దళిత కులమే ఒక సామాజిక, ఆర్ధిక అణిచివేత. ఆర్ధిక దోపిడీకి ఒక పనిముట్టు. శ్రామికులను విడదీసే విచ్చినకర శక్తి. దానినుండి బైటపడడానికి దళితులకి అందుబాటులో ఉన్న రిజర్వేషన్ అత్యంత పరిమితమైన, బలహీనమైన సాధనం మాత్రమే. కుల అణచివేతనుండి కొద్దిగా స్వాంతన మాత్రమే ఇచ్చే రిజర్వేషన్ ని పెద్ద సమస్యగా చూడడం నుండే ‘అభివృద్ధి చెందిన దళితులు రిజర్వేషన్ వదులుకోవచ్చు గదా?’ అని ప్రశ్న వస్తుంది. అవును వదులుకోవచ్చు. ఎందుకు కూడదు?

  దానితో పాటు మీరు మరో ప్రశ్న కూడా వెయ్యాలి. అగ్రకులాల పేదల కోసం అగ్రకులాల కోటీశ్వరులు వారి లక్షల కోట్ల ఆస్తులు వదులుకోవచ్చు కదా! అంబానీ తన కులంలోని పేదల కోసం కనీస సగం ఆస్తి ఇచ్చినా వారు తరాలు తిని బతుకుతారు. బ్రాహ్మణ పేదల కోసం అల్లాడే బ్రాహ్మణ శత కోటీశ్వరులు తలా ఒక లక్షయినా ఇవ్వమనండి. కమ్మ, రెడ్డి, కాపు ఇత్యాదిగా గల శూద్ర అగ్రకులాల భూస్వాములు తమ కులాల్లోని భూమిలేని పేదలకు భూములు పంచి ఇవ్వమనండి. (అగ్రకుల భూస్వాములు కమ్యూనిస్టులుగా మారాక అలా పంచి ఇచ్చారని ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవడం సముచితం.) 3000 ఎకరాలు అదనంగా ఉంది, ప్రభుత్వానికి ఇచ్చేస్తానని అసెంబ్లీలో ప్రకటించిన వై.ఎస్.రాజశేఖర రెడ్డి, పేద రెడ్లకు ఎందుకు ఇవ్వలేదు? (ప్రభుత్వానికి కూడా ఇవ్వకపోవడం వేరే సంగతి.)

  వంద కోట్లు ఉన్నవాడు యాభై కోట్లు చాల్లే అని యాభై మంది పేదలను పిలిచి తలా ఒక కోటి ఎందుకు ఇవ్వడో అభివృద్ధి చెందిన దళితుడు తన కొడుక్కి/కూతురికి అందుకే రిజర్వేషన్ వదులుకోడు. ఆదర్శాలు దళితులకు ఒకరకంగా, అగ్రకులాలకు మరొక రకంగా పని చేయవు.

  అభివృద్ధి చెందిన దళితులు అగ్రకులాలను అనుసరించినా, కులం పట్ల సిగ్గుపడినా, అగ్రకులాలు దొంగ సర్టిఫికెట్లు తెచ్చి చదువు, ఉద్యోగాలు పొందినా వారి వారి ఆర్ధిక అవసరాలే అందుకు ప్రేరేపిస్తాయి. ఆర్ధిక వెనుకబాటుతనానీకీ, సామాజిక అగ్ర/తక్కువ హోదా కి మధ్య తలెత్తిన వైరుధ్యాన్ని పరిష్కరించుకోలేని నిస్సహాయత అందులో ఇమిడి ఉంటుంది. కుల వైరుధ్యం, ఆర్ధిక వైరుధ్యం వ్యవస్ధ స్ధాయిలో పరిష్కారం కావాలి తప్ప వ్యక్తి స్ధాయిలో పరిష్కారం కావు.

  పైన చందుగారి ద్వారా మరొక ధోరణి వ్యక్తం అయింది. అదేమిటంటే రిజర్వేషన్ కోరితే అది కూడా కులతత్వంగా చెప్పడం, కుల అణచివేతను ప్రశ్నించడాన్ని కూడా కుల స్వభావంగా గుర్తించడం. ఇది చాలా అసంబద్ధ ధోరణి. అన్యాయమైన ధోరణి. ఒక విధంగా దురహంకారపూరితమైన ధోరణి. దానికి ఏ పేరు పెట్టుకున్నా, ఎంతగా సూత్రీకరించినా అంతిమ ఫలితంలో అది దళిత సమస్యను గుర్తించకపోగా ‘స్టేటస్ కో’ ను కోరుతుంది.

  దళితుడిగా నన్ను అణిచివేస్తున్నారు అని దళితుడు అడిగితే నీకు దళిత కుల ఫీలింగ్ ఉంది గనక, దళిత కులం అగ్రస్ధానం పొందాలని ఉంది గనక అలా అడుగుతున్నావు అనడం ఏమిటి? నేను దళితుడిని గనక అవకాశాలు ఇవ్వడం లేదు అని అడిగితే అతనికి తగిన అవకాశం ఇవ్వడం పరిష్కారం. అలా కాకుండా అసలలా అడగడమే దళిత కులతత్వంగా ఆపాదించడం ఏమిటి? అంటే దళిత కులాలకి దళితులనే ప్రత్యర్ధులుగా నిలపడం అన్నమాట. దళిత సమస్య లోంచి వ్యక్తుల్ని బైటికి లాగి వారిని దళితతత్వానికి వ్యతిరేకంగా నిలపడం ఇది. సమస్యను పరిష్కారం కోసం చేసే ఆలోచన కాదని నా అభిప్రాయం. దీనివల్ల ఏ ఫలితమూ ఉండబోదు.

 29. విశేఖర్ గారు, సామాజిక హోదా అనేది ప్రధానంగా ఆర్థిక పరిస్థితి ఆధారంగా నిర్ణయించబడుతుంది.

  ఆ మధ్య మా చిన్న మామయ్యకి పెళ్ళి సంబంధం చూశారు. అమ్మాయి తండ్రి బ్యాంక్‌లో అటెండర్. అతని జీతం ఎక్కువే కానీ అతను చేసేది అటెండర్ ఉద్యోగం కనుక అతను తమ స్టేటస్‌కి సరిపోడని చెప్పి ఆ సంబంధం నిరాకరించారు. కులాన్ని చూసి ఎవరూ గౌరవం ఇవ్వరు. ఉద్యోగం, ఆర్థిక హోదా లాంటివి చూసి గౌరవం ఇస్తారు.

  దళితులలో ఇప్పటికీ ఎక్కువ మంది ఊరి చివర గుడిసెలలో ఉంటున్నారు. రిజర్వేషన్‌ల వల్ల నూటికి ఒకరిద్దరు దళితుల ఆర్థిక పరిస్థితి మారినంతమాత్రాన కులం ముద్ర అనేది పోవడం జరగదు. అందుకే కుల వ్యవస్థ ఇంకా సజీవంగా ఉంది. ఒరిస్సాలో మా బంధువులకి చెందిన ఒక గ్రామంలో ఇప్పటికీ మా బంధువులకి తప్ప ఇతర గిరిజనులెవరికీ రెండెకరాల కంటే ఎక్కువ వ్యవసాయ భూమి లేదు. ఆ గ్రామంలో మా బంధువుల కుటుంబాలైన రెండు కుటుంబాలకి మాత్రం పదెకరాల చొప్పున భూములు ఉన్నాయి. రెండెకరాలు భూమి దున్నుకుని బతికే గిరిజనులని కులాన్ని బట్టి వెలివేసినట్టు చూస్తారా లేదా ఆర్థిక హోదాని బట్టి వెలివేసినట్టు చూస్తారా?

 30. ప్రవీణ్ గారు, మీరు ప్రస్తావించిన విషయం భారత దేశంలో వర్గ పరిశీలనలోని ఒక మౌలిక సమస్య. సామాజిక హోదా నిస్సందేహంగా ప్రధానంగా ఆర్ధిక వర్గ ఫలితమే.

  అయితే కులాలు ఆర్ధికమైనవా కావా అని ప్రశ్నించుకుని ప్రారంభంలో కావచ్చు గానీ ఇప్పుడు కాదు అని కమ్యూనిస్టులు ఒక ఏకాభిప్రాయానికి వచ్చారు. దళిత అస్తిత్వ ఉద్యమాలు తలెత్తాక కమ్యూనిస్టులు కుల సమస్యని వాయిదా వెయ్యడాన్ని (విప్లవం వచ్చాక కులం రద్దవుతుంది అని చెప్పడాన్ని) దళిత ప్రజలు నిరసించారు. దానితో కమ్యూనిస్టులు రివ్యూ చేసుకుని కులం పునాది నుండి ఉపరితలం వరకూ విస్తరించిన సమస్య అని సూత్రీకరించారు. ఈ సూత్రీకరణ ఫలితంగానే సి.పి.ఎం నుండి మావోయిస్టుల వరకూ కుల (నిర్మూలన) సంఘాలు నిర్మించడం ప్రారంభించారు. వర్గ పోరాట క్రమంలో అదొక ముఖ్య పరిణామం.

  కులం పునాది, ఉపరితలాల్లో రెండింటిలో ఎలా ఉంటుందన్నది ఒక ప్రశ్న. ఇదింకా సమగ్రంగా విశ్లేషణకు, విచికిత్సకూ గురికావలసిన సమస్య అని నా ఉద్దేశ్యం. కులం, పునాది ఉపరితలాలకు రెండింటికి సంబంధించినది అన్న నిర్ధారణ సమగ్ర వివరణకూ, విశ్లేషణకు నోచుకోలేదని నా అభిప్రాయం. ఈ అంశాన్ని నేను కూడా అధ్యయనం చేస్తున్నాను.

 31. “రిజర్వేషన్‌ల వల్ల నూటికి ఒకరిద్దరు దళితుల ఆర్థిక పరిస్థితి మారినంతమాత్రాన కులం ముద్ర అనేది పోవడం జరగదు” అనే విషయం మనం దళితులకి చెప్పాలి. అంతే కానీ దళితులు వర్గంతో సంబంధం లేకుండా కుల నిర్మూలన పోరాటాలు జరుపుతున్నారని మనం ఆ విషయంలో రాజీపడి మనం కూడా వర్గ పోరాటాల నుంచి పక్కకి తప్పుకోకూడదు.

  స్త్రీవాదం విషయానికొస్తే డబ్బున్న కుటుంబానికి చెందిన స్త్రీకి వరకట్న వేధింపులు ఒక్కటే ప్రధాన సమస్యగా కనిపిస్తుంది. పేద కుటుంబానికి చెందిన స్త్రీకైనా ఇంటా, బయటా అనేక సమస్యలు ఉంటాయి. స్త్రీవాదులమని చెప్పుకునేవాళ్ళలో కూడా స్త్రీల సమస్యలని వర్గ దృష్టితో చూడనివాళ్ళు ఉన్నారని మనం కూడా స్త్రీల సమస్యలని వర్గ దృష్టితో చూడడం మానెయ్యలేము.

  డబ్బున్న దళితుడికి ఒకటే సమస్య ఉంటుంది. “తాను IAS అధికారి కొడుకునైనా కేవలం మాదిగ కులం నుంచి వచ్చాను కనుక నన్ను వేరుగా చూస్తున్నారు” అనే అభద్రత భావం ఒక్కటే అతని సమస్య. ఆర్థిక అసమానతలు అతనికి ఒక సమస్యగా కనిపించకపోవచ్చు. ఆర్థిక సమానత్వం అవసరం లేదు అని భావించే వ్యక్తి ఆర్థిక సమానత్వం కోరుకునేవాళ్ళతో కలిసి పని చెయ్యడానికి ముందుకి వస్తాడా? అతను “ఈ వర్గ పోరాటాలు నాకెందుకు, నా వ్యక్తిగత జీవితం నేను చూసుకుంటాను” అని అనుకుంటే వర్గ పోరాటాలు చేసేవాళ్ళు అతన్ని ఎలా పిలవగలరు?

 32. విశేఖర్ గారు, తుంబిగూడ గిరిజనుల గురించి మళ్ళీ ఎంక్వైరీ చేశాను. రెండెకరాలు కూడా కాదు, ఒకటిన్నర ఎకరాయే ఎక్కువ అక్కడ. అర ఎకరా నుంచి ఒకటిన్నర ఎకరా వరకూ ఒక్కో కుటుంబం ఆధీనంలో ఉన్నాయి. ఆ standard of livingలో బతుకుతున్నవాళ్ళకి రిజర్వేషన్‌ల గురించి తెలిసే అవకాశం కూడా లేదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s