2జి స్పెక్ట్రం కుంభకోణంలో అసలు నష్టమే లేదని చెప్పి ‘జీరో లాస్’ వాదనతో టెలికాం మంత్రి కపిల్ సిబాల్ అప్రతిష్టపాలయ్యాడు. ‘వొళ్ళు దగ్గర పెట్టుకోమం’టూ సుప్రీం కోర్టు చేత చీవాట్లు కూడా తిన్నాడు. సిబాల్ అనుభవం నుండి ప్రధాని పాఠాలు నేర్చుకోనట్లు కనిపిస్తున్నది. అత్యంత కనిష్ట స్ధాయిలో నష్టాన్ని అంచనా వేసినప్పటికీ 1,87,000 కోట్లు ప్రభుత్వ ఖజానాకి నష్టం వచ్చిందని చెప్పిన కాగ్ లెక్కలు వివాదాస్పదమని ప్రధాని వ్యాఖ్యానించాడు. ‘జీరో లాస్’ వాదనకు మద్దతుగా వివిధ అంశాలను ప్రస్తావిస్తూ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్లమెంటుకి ఎనిమిది పేజీల సమాధానం పంపాడు.
ప్రధాని తన సమాధానంలో ప్రధాని లేవనెత్తిన అంశాలు లోపభూయిష్టమని పత్రికలు అప్పుడే తేల్చివేశాయి. మధ్య ప్రదేశ్ ప్రభుత్వం 2008 లో వేలం వేసిన బొగ్గు గనుల ద్వారా ఆర్జించిన ఆదాయాన్ని బట్టి చూసీనా కాగ్ లెక్కించిన నష్టానికి కనీసం మూడు నుండి నాలుగు రెట్లు (5,61,000 కోట్ల నుండి 7,48,000 కోట్ల వరకూ) వాస్తవ నష్టం ఉండవచ్చని ఫస్ట్ పోస్ట్ పత్రిక లెక్కించింది. పార్లమెంటుకి ఇచ్చిన సమాధానంలో కాగ్ లెక్కలపై దాడికే ప్రధాని మొగ్గు చూ. ఈ నేపధ్యంలో బొగ్గు కుంభకోణంలో ‘జీరో లాస్’ నిజమే అయితే, ‘రెడ్ టేపిజం’ తో బూజు పట్టిన పాలనా వ్యవస్ధ కూడా 100 శాతం సామర్ధ్యంతో పని చేస్తున్నట్లే అని ‘ది హిందూ’ కార్టూనిస్టు వేసిన కార్టూన్ సందర్భోచితం.