ఇండియాకి ఒలింపిక్స్ మెడళ్ళు ఎందుకు రావు? -కార్టూన్


ఒలింపిక్స్ సంరంభం ప్రారంభమై ఐదు రోజులు గడిచిపోయాయి పొరుగు దేశం చైనా 13 బంగారు పతకాలతో అగ్ర స్ధానంలో ఉండగా ఇండియా ఇంకా బంగారు ఖాతా తెరవనే లేదు. బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా, షూటర్ గగన్ నారంగ్, బాక్సర్ విజేందర్ సింగ్ ల పై బంగారు ఆశలు ఉన్నా అవి మినుకు మినుకు మంటున్నవే. గగన్ ఇప్పటికైతే ఒక తామ్ర పతకాన్ని మాత్రం అందించాడు. గతంలో హాకీ లో బంగారు పతాకం గ్యారంటీ అన్నట్లు ఉండేది. ఇప్పుడలాంటి ఆటలేవీ ఇండియాకు లేవు.

120 కోట్ల భారత దేశానికి ఎందుకీ దీన స్ధితి? పాలకులు దృష్టి పెడితే బంగారు ఆటగాళ్లను తయారు చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. సొంత సహజన వనరులను వినియోగించుకోవడానికి సైతం విదేశీ కంపెనీల వంక మోరేత్తి చూస్తూ వాటికి అప్పజెప్పే భారత పాలకులకి సొంత క్రీడాకారులను తయారు చేసుకోవాలని ఎందుకుంటుంది? ఒలింపిక్స్ లో భారత పతాక సమున్నతంగా ఎదగాలన్న కోరిక దేశ ప్రతిష్టను నిలపాలన్న నిబద్ధతకు సంబంధీంచినది. ఆర్ధిక వనరులను విదేశీయుల గుప్పెట్లో బంధించడానికి అనుమతించేవారు దేశ ప్రతిష్టపై నిబద్ధత ప్రకటించలేరు. అందుకే దేశ ప్రతిష్టకు ఒకానొక రూపంలోనైనా ప్రతీకలుగా నిలిచే క్రీడాకారుల అభివృద్ధికి వారు పూనుకోలేరు.

దేశంలోని క్రీడాకారులకి తమ ప్రతిభను అభివృద్ధి చేసుకోవడం పైన దృష్టి పెట్టడానికంటే ముందు వివిధ కారణాలతో తమను తొక్కిపెట్టే ప్రయత్నాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆశ్రిత పక్షపాతం ఎల్లెడలా విస్తరించి ఉండే క్రీడా వ్యవస్ధలో ప్రతిభావంతులకు కొదవలేకపోయినా వెన్ను తట్టి ప్రోత్సాహరించేవారే కొరవ. కామన్ వెల్త్ క్రీడల్లో విచ్చలవిడి అవినీతికి పాల్పడి జైలులో గడుపుతున్న సురేష్ కల్మాడీ ని ఒలింపిక్స్ కి వెళ్లకుండా చేయడానికి కోర్టులు జోక్యం చేసుకోవాల్సిన పరిస్ధితి. ప్రతి కాంట్రాక్టులోనూ కింది నుండి పై వరకూ వాటాలు పంచుకునే దళారీ వ్యవస్ధలో క్రీడాకారుడి అభివృద్ధికి నిధులు ఖర్చయితే గొప్పే. సాధారణ పాలనా వ్యవస్ధలోని అవినీతి, ఆశ్రిత పక్షపాతం లాంటి జాడ్యాలే క్రీడా వ్యవస్ధను పట్టి పల్లారుస్తుంటే భారత క్రీడా ప్రతిష్ట ఎల్లప్పుడూ మినుకు మంటూనే ఉండడం తధ్యం.

18 thoughts on “ఇండియాకి ఒలింపిక్స్ మెడళ్ళు ఎందుకు రావు? -కార్టూన్

 1. విశెఖర్ గారూ. మీ ఈ టపా సారాంశాన్ని చుచినట్లయితె మన డేశానికి మెడల్స్ రాలేదని చాలావిశారపడినట్లు వున్నారు. మనిషికి క్రీడలు అవసరమే కానీ క్రీడా పొటీలు అవసరం లేదు.క్రీడాపొటీలనేటివి పూర్తిగా దొపిడీ వర్గ సంసౄతి . బానిస సమాజంలొ ఒకరిని ఒకరు చంపుకునే మల్లయుద్దాలనుంచి నేటి బుల్ పైట్ , బాక్షింగ్, వరకూ కొనసాగుతున్నాయి. ఒక పక్క ప్రజలు తిండికి అల్లాడుటుంటె మరొపక్క ప్రభుత్వం వేల కొట్ల రూపాయలు సునాయాసంగా కర్చుచేయగలదు. గెలుపొందిన క్రీడాకారుడికి లక్షల్లొ వీలైతే కొట్లరూయలను బహుమానంగా యిస్తుంది ప్రజలను మత్తులొ వుంచటానికి అనేక మత్తుల్లొ ఇదీ ఒకటి. పరువునష్టం లాంటి వాటిల్లొ ఎలాగైతే విలువ సుత్రం పనిచేయదొ అలాగే క్రీడారంగానికుడా అది వర్తిస్తుంది. అణుమాత్రమైనా విలువుండదు. క్రీడలనేటివి శ్రమకిందకు రావు. ఇది కేవలం ఒక జూదం లాంటిది. లేద ఒక వ్యాపారం.

  మనిషి ఉల్లాసానికీ, ఆరొగ్యానికీ , క్రీడలనేటివి అవసరమే అందులొ ఎమీ సందేహం లేదు. కానీ పొటీలనేటివి అలావుండవు ఒక మనిషి పరుగుపందెంలొ నైపున్యం సాదించాడనుకుద్దాం.అతను ఎక్కడికైనా వెళ్ళాలంటె ఏ బస్సులొనొ లేక ట్రైన్ లొనొ పొవాల్సందే కాని పరిగెత్తుకుంటూ వెళ్ళలేడు కదా!. అలాగే ఒక వేఇట్ లిప్టర్ గాని లేక మరే క్రీడాకారుడికైనా పైన చెప్పింది వర్తిస్తుంది. వాటిల్లొ ప్రత్యేక నైపున్యం సాదించడం ఎవిధమైన ఉపయొగమూ లేదు. కేవలం పొటీకొసం ఒక వ్యాపారం కొసం. అంతకుమించి మరేమీ లేదు.

  “ఒలింపిక్స్ లొ భారత పతాక సమున్నతంగా ఎదగాలన్న కొరిక దేశ ప్రతిష్ట నిలపాలన్న నిబద్దతకు సంభంధించినది”

  ఆ వ్యాపారంలొ దేశ ప్రతిష్ట కనిపిస్తుందా? పాలక వర్గ బావాలే పాలితుల బావాలు. ఈ సందర్బానికి ఇది బాగా సరిపొతుంది.

 2. రామ్మోహన్ గారూ క్రీడా పోటీలు అవసరం లేదని నేను అనుకోవడం లేదు. ఇపుడున్న ఫార్మాట్ లో అవసరం లేదంటే దానికి అర్ధం ఉంది. అసలు పోటీలే అవసరం లేదంటే అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. క్రీడా పోటీలు పూర్తిగా దోపిడీ వర్గ సంస్కృతి అనడం కూడా సరి కాదు.

  ఆటల్ని కూడా వ్యాపార సాధనాలుగా, ఉత్పత్తులకి ప్రచారం చేసిపెట్టే ఆటగాళ్ల ఉత్పత్తి ప్రక్రియలుగా, నిర్మాణ కంపెనీలకి, ఎంటర్ టైన్ మెంట్ పరిశ్రమకి కాంట్రాక్టులు తెచ్చిపెట్టే సాధనాలుగా ఉపయోగపడుతుండడం ఇప్పటి వాస్తవం. ఆటల పోటీలనుండి వ్యాపార ప్రయోజనాలని తీసేస్తే దైనందిన జీవితానికి అవి నిస్సందేహంగా ఉపయోగపడతాయి.

  ఆటలో పోటీ అంతర్భాగం. రెండింటినీ విడదీయలేము. పోటీ ని తీసేస్తే ఆటలో ఆనందించేదేమీ ఉండదు. చాలాసార్లు ఆడేదీమీ కూడా ఉండదు. చిత్రలేఖనం, నాట్యం, శిల్పం లాంటి కళల్లాగే ఆటలు, ఆటల పోటీలు కూడా సంస్కృతిలో భాగం. ఆధిపత్య వర్గాల సంస్కృతి చొరబడినంత మాత్రాన మానవ జీవితం నుండి సంస్కృతినిగానీ, అందులోని కొన్ని అంశాలను గానీ తీసివేయలేము.

  మానవజీవితంలో ‘ఆటలు-పోటీలు’ అనే అంశంలో జరిగే అభివృద్ధి ఇతర అంశాలకు కూడా ఉపయోగపడతాయి. మనిషి జీవితంలో ప్రతి అంశమూ ఒకదానికొకటి ప్రభావితం చేసుకుంటూ మొత్తంగా సామాజిక అభివృద్ధికి దోహదం చేస్తాయన్నది మార్క్సిస్టు సూత్రం. ఉదాహరణకి చైనా విప్లవ పోరాటంలో కొన్ని సందర్భాల్లో టీం స్ఫూర్తిని అభివృద్ధి చేయడానికి ఆటల పోటీల్ని ఒక సాధనంగా ఉపయోగపెట్టారని నేను చదివాను. రెడ్ ఆర్మీలో కూడా టీం పని విధానంలో కేటలిస్టు గా పనిచేయడానికి ఆటలపోటీలని ఉపయోగపెట్టినట్లు కూడా చదివాను.

  కారల్ మార్క్స్ విలువ సూత్రం గురించి చెప్పాడంటే దానర్ధం మారకం విలువ లేని ప్రతీదీ తీసెయ్యాలని కాదు. మారకం విలువ ఉన్న ప్రతీదీ నిలుపుకోవాలనీ కాదు. మారకాన్ని వివరించడానికి చెప్పిన విలువ సూత్రాన్ని ప్రతిదానికి అప్లై చేస్తూ విలువ లేదు కనుక అవసరం లేదనలేము. క్రీడారంగం విషయంలో విలువ సూత్రం పని చేయదు అనడం నాకు అర్ధం కాలేదు.

  ఒలింపిక్స్ లో మీరు వ్యాపారం మాత్రమే చూస్తున్నట్లుంది. నేను ఆటల్ని కూడా చూస్తున్నాను. ఒక దేశంలో సోషలిస్టు వ్యవస్ధ ఉంటూ సమానంతరంగా పెట్టుబడిదారీ వ్యవస్ధ బలీయంగా కొనసాగుతున్నపుడు అంతర్జాతీయ సంబంధాల కోసం క్రీడాపోటీల్లో పాల్గొనడం తప్పనిసరి. ప్రపంచవ్యాపితంగా సొషలిస్టు వ్యవస్ధలు పని చేస్తున్నపుడు కూడా వివిధ దేశాలు, జాతుల మధ్య సాంస్కృతిక సంబంధాలు పెరగడానికి క్రీడల పోటీలు తప్పనిసరిగా ఉపయోగపడతాయని నా అవగాహన.

  ఈ పోస్టు ఉద్దేశ్యం ఏ సందర్భంలోనైనా దేశ ప్రతిష్ట పట్ల దళారీ పాలకవర్గాలకు పట్టింపు ఉండదు అని చెప్పడం. అంతే తప్ప ఒలింపిక్స్ సందర్భంగా మార్క్సిజం చెప్పడం కాదు. ప్రతీ సందర్భంలో మార్క్సిస్టు పరిభాషను ఉపయోగించాలన్నది నా నియమం కాదు. మెడికల్ పరిభాషని ఉపయోగిస్తే రోగులకి అర్ధం కాదు కదా. దైవకణం (హిగ్స్ బోసన్) గురించి సాధారణ పరిభాషలో చెప్పడానికి నేను అనేకరకాలుగా ప్రయత్నించి చేతగాక వదిలేశాను. సందర్భాన్ని బట్టి వివిధ అంశాల వివరణ ఉంటుంది. ప్రతి సందర్భంలోనూ, ప్రతి వివరణలోనూ మార్క్సిస్టు పరిభాషని వెతకనవసరం లేదు.

 3. విశెఖర్ గారూ.

  “ఆటలొ పొటీ అంతర్బాగం రొండింటినీ విడతీయలేము.పొటీని తీసివేస్తె ఆటలొ ఆనందమేదీ వుండదు చాలా సార్లు ఆడేదేమీ వుండదు”

  నా అర్దం పొటీలు లేకుండా ఆడమని కాదు.అందులొ డబ్బులు పెట్టే పొటీనే నేను విమర్శించేది ఆటలన్నాక రొండు జట్లు వుండం సహజం అందులొ పొటీ వుండం సహజం. అందులొ గెలుపొటములు సహజం.

  “” కారల్ మర్క్స్ విలువ సుత్రం చెప్పాడంటే దానర్దం మారకం విలువలేని ప్రతిదాన్నీ తీసెయ్యమని కాదు. మారకం విలువ వున్న ప్రతిదీ నిలుపుకొవాలని కాదు. మారకాన్ని వివరించడానికి చెప్పిన విలువ సుత్రాన్ని ప్రతిదానికీ అప్లై చేస్తూ విలువ లేదు కనుక అవసరం లేదనలేము క్రీడారంగంలొ విలువ సుత్రం పనిచేయ్యలేదనటం నాకు అర్దం కాలేదు””

  నేను అడిగిందానికీ మీరు చెప్పిందానికీ ఎమైన సంభంధం వుందా? నేను క్రీడా రంగంలొ విలువసుత్రం పనిచేయదన్నను. నేను క్రీడల్ని తీసివెయ్యమన్నట్టు లేదా ఆటలే ఆదొద్దున్నట్టు అర్దం చేసుకున్నారు. విలువ సుత్రానికి పైన ఉదాహరణకుడా ఇచ్చాను.ఒక ఒస్తువుకు విలువ ఎలా ఎర్పడుతుందనేదే అసలు విషయం ఇది తెలిస్తెనే అదనపు విలువ ఎలా వస్తుందొ తెలుస్తుంది . ఒక సారి కాపిటల్ మొదటి చాప్టర్ తిరగెయ్యండి. నిద్రపొవడం, కాలకుత్యాలు తీర్చుకొవడం , ఆటలాడం, శారీరకంగా కలవటం, ఇలాంటివి శ్రమకిందకు రావని పై కామెంట్లొ కుడా చెప్పినాను ఆవిషయాన్ని వదిలేసి సంభందం లేని విషయాలు మాట్లాడుతున్నారు. ఏది ఉంచాలొ ఏది తీయాలొ అది వేరే విషయం దాని గురించి మాట్లాడితే చాలాదూరం వెళ్ళవలసి వుంటుంది. ఎదైనా ఒక నిర్దిష్టమైన ఉపయొగపు విలువ వున్నదే విలువ సుత్రం వర్తిస్తుంది.

  ఒకదేశంలొ సొషలిస్టు వ్యవస్త వుండి ఇతర దేశాల్తొ సంభందం పెట్టుకొవాలంటె దాని క్రీడలే ప్రదానం కానవసరం లేదు.ఆర్దిక కారణాలే ముఖ్య పాత్ర వహిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా సొషలిస్టు వ్యవస్త వున్నప్పుడు అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సొషలిస్టు వ్యవస్త ఎప్పుడు వుండిందొ నాకు తెలియదు మీకేమైనా తెలిస్తె చెప్పండి.

  మీరు ప్రతివిషయలొ మార్కిస్టు పరిబాష ఉపయొగిస్తారా లేదా అనేది మీ వ్యక్తిగత విషయం నేను దానిగురించి మాట్లాడను. విషయం మార్కిజానికి బిన్నంగా ఉన్నప్పుడే నేను విమర్శించాను. మీకు బాద కలిగితే చెప్పండి నా కామెంట్ను వెనక్కు తీసుకొవడానికి సిద్దంగా వున్నాను.

 4. రామ్మోహన్ గారూ,
  మీ వ్యాఖ్యలో భాషకు సంబంధించిన లోపాలు అలాగే కొనసాగుతున్నాయి. ఇవి మీ కీయింగ్‌లో దోషాలా లేదా భాషా పరమైన లోపాలా తెలీటం లేదు. నా సందేహం మీరు కీయింగ్ సరిగా చేయలేదేమో ననిపిస్తోంది. మరి కాస్తా శ్రద్ధ పెడితే ఈ లోపాన్ని మీరు అధిగమించవచ్చేమో ఆలోచించండి. నా వ్యాఖ్యను పాజిటివ్‌గానే తీసుకోండి.

  మీ వ్యాఖ్యలో కొన్ని విలువైన అంశాలున్నాయి. “గెలుపొందిన క్రీడాకారుడికి లక్షల్లొ, వీలైతే కొట్లరూయలను బహుమానంగా యిస్తుంది.. (ప్రభుత్వం).

  ఆర్జన విషయంలో, సంపదను పొందే విషయంలో, విపరీతమైన తారతమ్యాలను పెంచి పోషించే సమాజం మాత్రమే గెలుపొందిన క్రీడాకారులకు లక్షల్లో, కోట్లల్లో కరెన్సీని బహుమానంగా ఇవ్వగలదు. రచయితలకు, నైపుణ్యం గల విశిష్ట వ్యక్తులకు కూడా ఇలాంటి సమాజాలు మాత్రమే రాయితీలను, రాయల్టీలను పెద్ద ఎత్తున బహూకరించగలవు. స్టాలిన్ పాలన ముగిసేవరకు సోవియట్ యూనియన్‌లో కాని, మావో పాలన వరకు చైనాలో కాని ప్రజలకు ఇన్సెంటివ్‌లను ఇచ్చి వారి ప్రతిభలను కొలిచిన ఘటనలు లేవు. శ్రమశక్తిని నైపుణ్యంగా ఉపయోగించడంలో ప్రతిభ చూపిన వారికి శ్రామికవర్గ కథానాయకుల పేరిట అవార్డులు, ప్రశంసా పత్రాలు మాత్రమే ఇచ్చారని అప్పటి సాహిత్యం చెబుతోంది. సమాజం పట్ల మెరుగైన బాధ్యత ప్రదర్శించిన శ్రామికజీవులకు అవార్డులు ఇవ్వడం కూడా సహజమైన విధానం కాదేమో మరి. సోషలిస్టు సమాజంలోనూ మనిషి శ్రమశక్తిని, ప్రతిభను కొలిచే పరిమితుల్లో ఇదీ ఒకటి అని చెప్పవచ్చు.

  కార్మికులకు బోనస్‌లూ, భౌతిక ప్రోత్సాహాకాలూ అనేవి ఇవ్వడం అంటేనే విప్లవానికి పూర్వపు సమాజం నుంచి, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే దోపిడీ పునాదిగా కలిగిన సమాజం నుంచి వచ్చిన అలవాట్లు అని “చైనాలో సాంస్కృతిక విప్లవమూ, పరిశ్రమల నిర్వహణా” పుస్తకంలో రంగనాయకమ్మగారు వ్యాఖ్యానించారు. చివరకు మిలటరీలో అంతస్తుల -రాంక్స్- విధానమూ, యూనిఫారాలూ శాల్యూట్సూ, మెడల్సూ, బిరుదులూ వగైరా బూర్జువా లక్షణాలన్నీ ప్రవేశించి సోవియట్ రష్యా సలహాదారుల, అధికారుల ప్రభావంతో 1951 చివరినాటికి చైనాలో రెడార్మీ స్వభావమే మారిపోయిందని కూడా ఈ పుస్తకంలో అనువాదకుల ముందుమాటలో వివరించారు. లక్ష తప్పులతో కొనసాగినప్పటికీ తర్వాత చైనాలో సాగిన సాంస్కృతిక విప్లవం ఇలాంటి బూర్జువా పద్ధతులకు వ్యతిరేకంగా భావజాల రంగంలో, ఆచరణాత్మకంగా కూడా పోరాడింది.

  ‘క్రీడా రంగానికి కూడా విలువ సూత్రం పనిచేయదు, క్రీడలనేవి శ్రమ కిందకు రావు ఇవి కేవలం ఒక జూదం లేదా వ్యాపారం లాంటివి’ అనే మీ వ్యాఖ్యను అర్థం చేసుకోవడానికి మరింత స్పష్టమైన అధ్యయనం అవసరం. ఒలింపిక్ తరహా ఆధునిక క్రీడలు బూర్జువా పోటీ స్వభావంతో ఉంటున్నాయి కనుక వాటితో సమాజానికి ఒరిగేదేమీ ఉండదు అనే భావన మౌలికంగా సరైందే. కానీ శుద్ధ వ్యక్తిగత ప్రతిభ, అవధులు మీరిన పోటీ స్వభావానికి భిన్నంగా క్రీడలను మల్చుకోవడం పెట్టుబడిదారీ అనంతర సమాజాలకు కూడా అవసరం. క్రీడలను పూర్తిగా సమాజ యవనిక నుంచి తీసివేయలేము.

  “ఒక దేశంలో సోషలిస్టు వ్యవస్ధ ఉంటూ సమాంతరంగా పెట్టుబడిదారీ వ్యవస్ధ బలీయంగా కొనసాగుతున్నపుడు అంతర్జాతీయ సంబంధాల కోసం క్రీడాపోటీల్లో పాల్గొనడం తప్పనిసరి. ప్రపంచవ్యాపితంగా సోషలిస్టు వ్యవస్ధలు పని చేస్తున్నపుడు కూడా వివిధ దేశాలు, జాతుల మధ్య సాంస్కృతిక సంబంధాలు పెరగడానికి క్రీడల పోటీలు తప్పనిసరిగా ఉపయోగపడతాయని నా అవగాహన.”

  విశేఖర్ గారి పై అభిప్రాయాన్ని ఈ కోణంలో మాత్రమే చూస్తే బాగుంటుంది. కానీ మెడల్స్ కోసం క్రీడా ప్రదర్శనను, వ్యక్తిగత ప్రతిభా ప్రదర్శనను రాక్షసంగా మారుస్తున్న తరహా క్రీడలను ఏ మేరకు ఆమోదించాలి, ఏ మేరకు వ్యతిరేకించాలి అనే విషయం చర్చనీయాంశమే.

 5. విశేఖర్ గారూ,
  మీ కథనం సారానికి సంబంధం లేని విషయాన్ని ప్రస్తావిస్తున్నాను. దైవకణం (హిగ్స్ బోసన్) గురించి మీరు ఎందుకు రాయలేదో ఇప్పుడు తెలిసింది. తెలుగు పత్రికలలో కాస్తంత సులువుగా హిగ్స్ బోసాన్ నిగూఢ కణం గురించి చెప్పిన వ్యాసాలు వచ్చాయి. వాటిలో ఎబికె ప్రసాద్ గారి కథనందే అగ్రస్థానం. దైవ కణం భావనకు వ్యతిరేకంగా విశ్వరహస్యానికి సంబంధించిన ఆదికణం గురించి తాత్విక స్థాయిలో వివరించిన ప్రతిభావంత రచన ఇది.

  కింది లింకులో చూడండి.

  విశ్వరహస్యం విప్పిన ఆదికణం!
  విశ్లేషణ
  ఎబికె ప్రసాద్
  http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=45905&Categoryid=1&subcatid=18

  అలాగే మూడున్నర సంవత్సరాల క్రితమే హిగ్స్ బోసాన్ కణం గురించి వార్తలు తొలిసారిగా వెలుగులోకి వచ్చినప్పుడు మిత్రులు వెన్నెలకంటి రామారావు గారు “‘దైవ’ కణాల మహాన్వేషణ” అనే వ్యాసంలో చక్కటి విశ్లేషణ చేశారు. కింది లింకులో దీన్ని చూడగలరు.

  దైవకణాలా? దైవ ధిక్కార కణాలా?
  http://blaagu.com/chandamamalu/2012/07/04/%E0%B0%A6%E0%B1%88%E0%B0%B5%E0%B0%95%E0%B0%A3%E0%B0%BE%E0%B0%B2%E0%B0%BE-%E0%B0%A6%E0%B1%88%E0%B0%B5-%E0%B0%A7%E0%B0%BF%E0%B0%95%E0%B1%8D%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0-%E0%B0%95%E0%B0%A3%E0%B0%BE/

 6. రామ్మోహన్ గారూ,

  “మనిషికి క్రీడలు అవసరమే కానీ క్రీడా పొటీలు అవసరం లేదు. క్రీడాపొటీలనేటివి పూర్తిగా దొపిడీ వర్గ సంసౄతి .”

  ఇది మీ మొదటి వ్యాఖ్యలోని ఒక వాక్యం. అదే వ్యాఖ్యలో ఇంకో వాక్యం చూడండి.

  “మనిషి ఉల్లాసానికీ, ఆరొగ్యానికీ , క్రీడలనేటివి అవసరమే అందులొ ఎమీ సందేహం లేదు. కానీ పొటీలనేటివి అలావుండవు.”

  ఈ రెండు వాక్యాల్లో మీరు చెప్పింది క్రీడా పోటీలు పూర్తిగా దోపిడీ వర్గ సంస్కృతి కనక వద్దనే. కానీ మీ తర్వాతి వ్యాఖ్యలో ఇలా అంటున్నారు.

  “నా అర్దం పొటీలు లేకుండా ఆడమని కాదు.అందులొ డబ్బులు పెట్టే పొటీనే నేను విమర్శించేది ఆటలన్నాక రొండు జట్లు వుండం సహజం అందులొ పొటీ వుండం సహజం. అందులొ గెలుపొటములు సహజం. ”

  మొదటి రెండు వాక్యాలకు అర్ధం మూడో వాక్యం అని మీరంటున్నారు గానీ నాకలా అర్ధం కాలేదు. మీరు రాసిన దానినిబట్టే మీరేంచెప్పాలనుకున్నారో గ్రహించగలను తప్ప మీ మనసులో ఇంకేమన్నా ఉందేమో ఊహించి స్పందించలేను కదా.

  “నేను అడిగిందానికీ మీరు చెప్పిందానికీ ఎమైన సంభంధం వుందా? నేను క్రీడా రంగంలొ విలువసుత్రం పనిచేయదన్నను. నేను క్రీడల్ని తీసివెయ్యమన్నట్టు లేదా ఆటలే ఆదొద్దున్నట్టు అర్దం చేసుకున్నారు. ”

  మీరు చెప్పిందే నేను అర్ధం చేసుకుని తదనుగుణంగా స్పందించానని పై ఉటంకనలను బట్టి మీరే గమనించవచ్చు.

  * * * * * *

  మీరు రాసిన మరొక వాక్యం తీసుకుందాం.

  >>>>>>

  “ఒలింపిక్స్ లొ భారత పతాక సమున్నతంగా ఎదగాలన్న కొరిక దేశ ప్రతిష్ట నిలపాలన్న నిబద్దతకు సంభంధించినది”

  ఆ వ్యాపారంలొ దేశ ప్రతిష్ట కనిపిస్తుందా? పాలక వర్గ బావాలే పాలితుల బావాలు. ఈ సందర్బానికి ఇది బాగా సరిపొతుంది.

  >>>>>

  నేను రాసిందాన్ని ఉటంకిస్తూ మీ స్పందన రాశారు. నేను రాసినాదానిలో వ్యాపారంలో దేశ ప్రతిష్ట ఉందని ఎక్కడన్నా ఉన్నదా? అలా రాయకుండా నాకా ప్రశ్న ఎందుకు వేశారు? పాలకవర్గాల భావాలు పాలితుల భావాలు అన్నారు తప్ప ఈ సందర్భానికి దానిని సరిగ్గా కనెక్ట్ చేయలేదు. దానివల్ల ఇతర అర్ధాలు కూడా వచ్చే అవకాశం ఉంది.

  ఇంకొకటి చూడండి.

  “ఆవిషయాన్ని వదిలేసి సంభందం లేని విషయాలు మాట్లాడుతున్నారు. ఏది ఉంచాలొ ఏది తీయాలొ అది వేరే విషయం దాని గురించి మాట్లాడితే చాలాదూరం వెళ్ళవలసి వుంటుంది. ”

  ఏమిటి దీనర్ధం? తీసేయడం, దూరం వెళ్ళడం ఏమిటో ఏమైనా వివరం రాసారా? దీనిని చదివినవెంటనే మీరు నన్నేదో బెదిరిస్తున్నట్లుగా ఉంది తప్ప ఏదైనా ఒక విషయాన్ని చర్చిస్తున్నట్లు ఉన్నదా? (మీరు బెదిరిస్టున్నట్లు నేను అనుకోవడం లేదులెండి. విషయం కోసం చెబుతున్నాను.)

  * * * * * *

  “విషయం మార్కిజానికి బిన్నంగా ఉన్నప్పుడే నేను విమర్శించాను.”

  అందుకే ప్రతి సందర్భంలో మార్క్సిస్టు పరిభాష వెతకనవసరం లేదని రాశాను. అది నా సూచన మాత్రమే. ఇంకో విషయం ఏమిటంటే పాఠకులంతా మార్క్సిజం తెలిసి ఉంటుందని భావిస్తూ నేను ఈ బ్లాగ్ లో ఆర్టికల్స్ రాయడం లేదు. మార్క్సిస్టు పాఠకులకు నేను ఉపయోగించే పరిభాష ఖచ్చితంగా ఉంటుంది. అక్కడ నేను కొలతలు పాటిస్తాను. నిజానికి మార్క్సిస్టు విశ్లేషణే వాస్తవిక విశ్లేషణ. కానీ ఆ విషయం నాన్-మార్క్సిస్టులకు తెలియదు గనక సాధారణ పరిభాషనే నేను ఉపయోగిస్తున్నా. నా ఉద్దేశ్యంలో ఇదొక ప్రయోగం. దీని గురించి మరింత విపులంగా ఇక్కడ నేను రాయలేను.

  “మీకు బాద కలిగితే చెప్పండి నా కామెంట్ను వెనక్కు తీసుకొవడానికి సిద్దంగా వున్నాను.”

  అదేమీ లేదు. అయితే పరిమితులు గుర్తించమని నా సూచన. మార్క్సిజానికి భిన్నంగా ఉందంటూ అన్నీ సందర్భాల్లోనూ కత్తి పట్టుకుని రావద్దన్నదే నా సూచన. ఈ ఆర్టికల్స్ లో కొన్నింటిని మార్క్సిస్టు పాఠకుల కోసం ఇచ్చేటపుడు నేను కొన్ని మార్పులు చేసి ఇస్తాను. నా బ్లాగ్ కి ఉన్న పరిమితులు అలాంటివి. వాటిని మీరు గుర్తించాలి.

  “ప్రపంచ వ్యాప్తంగా సొషలిస్టు వ్యవస్త వున్నప్పుడు అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సొషలిస్టు వ్యవస్త ఎప్పుడు వుండిందొ నాకు తెలియదు మీకేమైనా తెలిస్తె చెప్పండి. ”

  నేను రాసింది “ప్రపంచ వ్యాపితంగా సోషలిస్టు వ్యవస్ధలు ఉన్నపుడు” అని. దానర్ధం అలా ఇప్పటికే ఉన్నదనో, ఒక సారి ఎప్పుడయినా ఉన్నదనో కాదు. అలా ఉన్నపుడు కూడా ప్రపంచ స్ధాయి క్రీడలు అవసరం అని. అయితే ఇపుడున్న ఫార్మాట్ లో ఉండవు. అవి వివిధ దేశాల మధ్య, జాతుల మధ్య సాంస్కృతిక సంబంధాలను పెంచే ఒక సాధనంగా మాత్రమే ఉండవచ్చని నా అర్ధం. రష్యా లో స్టాలిన్ మరణం వరకూ, చైనాలో మావో మరణం వరకూ మాత్రమే సోషలిస్టు నిర్మాణం జరిగిందని వివిధ సందర్భాల్లో నేను చాలాసార్లు చెప్పాను. కనుక ప్రపంచ వ్యాపితంగా సోషలిస్టు వ్యవస్ధ ఉన్నదని నేను భావించే ప్రశ్న తలెత్తదు.

 7. రాజుగారూ, లింక్ లు వెతికి ఇవ్వడంలో మీకున్న ఓపిక అనుసరణీయం. ఆదర్శప్రాయం. మీకది తక్కువ సమయం తీసుకున్నా నిబద్ధత లేకుండా సాధ్యం కాదు.

  రెండవ లింక్ ఇప్పటికే మీరు ఒకసారి ఇచ్చారు. చదివాను కూడా. ఎ.బి.కె గారి ఆర్టికల్ కూడా ఇప్పుడే చదివాను. రెండూ అద్భుతంగా ఉన్నాయి.

  శాస్త్ర విషయాలని సాధారణ మాటల్లో చెప్పడం కత్తి మీది సాము. ఎ.బి.కె లాంటివారు భాషా పండిత సమానులు కనక వారికది సులభం. నాకది సాధ్యం కాలేదు. చాలాసార్లు రాసి, డిలిట్ చేసి, మార్చి రాసి ఎన్ని తిప్పలు పడ్డా సంతృప్తి రాలేదు. ఆంగ్లపదాలే రాయవలసి రావడంతో ఆ ప్రయత్నం మానుకున్నాను.

 8. విశేఖర్ గారూ,
  ధన్యవాదాలు. మంచి కథనాల లింకులు వెతకడానికి ఎక్కువ సమయమే పడుతుందండి. కాని వాటిని పొందలేనప్పుడు కలిగే నష్టం కంటే పొందిన తర్వాత కలిగే ప్రయోజనం ఎక్కువ కాబట్టి లింకుల వెతుకలాటకు ఎక్కువ సమయమే కేటాయిస్తుంటాను. నా సిస్టమ్‌లో తెలుగు, ఇంగ్లీష్ కంటెంట్ డజన్ల కొద్దీ కేటగిరీలలో సేకరించబడి ఉంటుంది. సందర్భానుసారం వాటిని ఇలా లింకుల రూపంలో ఇస్తుంటానంతే. వ్యక్తిగతంగా నాకూ అవసరాన్ని బట్టి మిత్రులకూ ఇది ఉపయోగపడుతోంది.

  పోతే చిన్న సందేహం. కొన్ని బ్లాగులలో లింకులు -యుఆర్ఎల్‌లు- చాలా పొడవుగా ఉంటాయి. వాటిని మీ వ్యాఖ్య బాక్స్‌లో ప్రచురించేటప్పుడు వ్యాఖ్య, దాని లింకు మీ వ్యాఖ్య బాక్స్ పరిధిని దాటి పక్కకు పోతోంది. దీనికి పరిష్కారం వెతికితే బాగుంటుందేమో కదా.

  దైవకణంపై నేను పంపిన లింకు, దాని పాఠం కూడా ఇలాగే బాక్స్ గీతను దాటి పక్కకు పోయింది చూడండి. నా బ్లాగులో కూడా ఒకోసారి ఇలా జరుగుతోంది. Notepad ఫైల్‌లో wordwrap ఆప్షన్‌ను సెలెక్ట్ లేదా డీసెలెక్ట్ చేసిన సందర్భాలలో ఏదో తేడా జరుగుతోంది. అదేంటో నాకు సరిగా అర్థం కాలేదు.

  రామ్మోహన్ గారు ఎందుకో ఈ మధ్య చిర్రుబుర్రలాడుతున్నారు. కారణం అడిగి తెలుసుకోండి. భావాల పంపిణీకి సంబంధించి మనది మిత్రవైరుధ్యమే కదా. మన ఘర్షణ ఆ పరిధిని దాటిపోరాదన్నదే నా భావన.

 9. రాజు గారూ, నెట్ లో లింక్ లని కురచన చేసే సైట్లు అందుబాటులోకి వచ్చాయి. అందులో ఒకటి
  https://bitly.com/

  ఇందులో మన లింక్ ని వారిచ్చిన బాక్స్ లో పేస్ట్ చేస్తే దాన్ని కురచన చేసి ఇస్తుంది. ఉదాహరణకి మీరిచ్చిన రెండో లింక్ కి షార్ట్ చేస్తే వచ్చిన లింక్ ఇది.
  http://bit.ly/OBRn7E

  నా కంప్యూటర్ లో చూస్తే మీరిచ్చిన లింక్ గీత దాటిపోలేదు. కాని కొన్నిసార్లు వ్యాఖ్యలు కూడా గీత దాటి కనిపిస్తున్నాయి. అదొక బగ్ అయి ఉండవచ్చు.

 10. క్రీడలు అనేది కేవలం వినోదం కోసం అని అనుకున్నప్పుడు ప్రభుత్వం క్రీడాకారులకి కోట్ల పారితోషికాలు ఎందుకు ఇస్తోంది? అది కూడా డబ్బున్న కుటుంబాల నుంచి వచ్చిన క్రీడాకారులకే డబ్బులూ, ఇళ్ళ స్థలాలూ బహుమతులుగా ఎందుకు ఇస్తోంది? కాకినాడలో గాలి సుధాకర్ అనే పేద బాడీ బిల్డర్ ఉండేవాడు. క్రీడాకారుల కోటాలో ఉద్యోగం రాలేదని అతను డబ్బుల కోసం రెండు సార్లు హత్య కేసుల్లో అరెస్ట్ అయ్యాడు. సానియా మీర్జాకీ లేదా సౌరవ్ గంగూలీకీ అలా డబ్బుల కోసం చెరసాలలకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుందా?

 11. రాజశెఖర రాజు గారూ. అవును భాషకు సంభంధించి కొన్ని లొపాలు వున్నాయి నేను లెఖిని ఉపయొగిస్తున్నాను అందువల్ల సమయం చాలాపడుతుంది.అశ్రద్దకుడా కొంత కారణం. మీరనట్టు నావాఖ్య లేదా విమర్శ సున్నితంగా లేదు . కాని వ్యక్తిగత దూషనలు లేకుండా వుంటె విమర్శ ఎంత ఖటినంగా వున్నా ఆహ్వానించవచ్చు. విమర్శలు లేకుంటె మనం నేర్చుకునేదేమీ వుండదు. . లేదా మనం చెప్పేదేమీ వుండదు.

 12. విశెఖర్ గారూ. నేను నెట్ దగ్గర లేనందున చాలా ఆలస్యంగా స్పందిస్తున్నాను. దేశ ప్రతిష్ట సంభంధించిన వ్యాఖ్య, మీరు వ్యాపారంలొ దేశ ప్రతిష్ట వుందని మీరు అనలేదు కాని దానికి అలాంటి అర్దం వస్తుందని నేను విమర్శించాను. ఎందుకంటె అది అలాంటిదే కాబట్టి. ఆ బావజాలాన్నే మీరు తీసుకున్నారు కాబట్టి.నేచెప్పింది ఆ సందర్బానికి సరిపొయింది. పాలక వర్గబావాలే పాలితుల బావాలు.

  ఇక నేను వాడిన ఏది వుంచాలొ ఏది తీయాలొ అనే వ్యాఖ్య బెదిరిస్తున్నట్టుగా వుందని అన్నారు.అలా ద్వనిస్తె పూర్తి బాద్యత నాదే. కాని నా అర్దం అది కాదు. సొషలిస్టు దశలొ సమాజం వున్నాప్పుడు కొన్ని రద్దులు త్వర త్వరగా జరిగేటివి కొన్ని ఆలస్యంగా జరిగేటివి కొన్ని వుంటాయి ఉదాహరణకు స్టాక్ మార్కెట్, జూద శాలలు, రాత్రి పని, ఇలాంటివి త్వరగానే తీసివేయవచ్చు.మారకాలు లాంటివి తీసెయ్యాలంటె ఆలస్యం అవుతుంది. దాని గురించి చెప్తూ చాలా దూరం వెళ్ళవలసి వుంటుందని అన్నాను.

  మీరు మార్కిస్టుల కొసం రాసినా లేక నాన్ మార్కిస్టుల కొసం రాసినా రొండింటికీ పొంతన ఉండేటట్లు చుసుకొండి. ఒకే విషయాన్ని మార్కిస్టులకు ఒక దిధంగా రాసి కాని వాళ్ళకు ఒక విధంగా రాస్తె అప్పుడు పాఠకుడు దేన్ని తీసుకొవాలి? ఉదాహరణకు ఈ పొస్టునే తీసుకొండి.మార్కిస్టుల దౄష్టిలొ ఇది చాలా పొరపాటైన విషయం. మార్కిస్టులు కానివారికి మంచివిషయం .ఏమిటిది ఒకే విషయాన్ని రొండు విదాలుగా చెప్పలేము కదా?
  పై కామెంట్ లొ నేను వివరణ ఇవ్వకపొవడం వలన చాలా అపార్దాలకు దారితీసింది.ఈ కామెంట్ కుడా అలా అపార్దాలకు దారితీస్తె దీని గురించి రేపు చర్చించుకుందాం.

 13. రామ్మోహన్ గారూ, మీ ధోరణి కొనసాగుతోంది.

  నేనిలా రాశాను. “ఒలింపిక్స్ లో భారత పతాక సమున్నతంగా ఎదగాలన్న కోరిక దేశ ప్రతిష్టను నిలపాలన్న నిబద్ధతకు సంబంధించినది” అని.

  దానికి మీరేమంటున్నారో చూడండి. “దేశ ప్రతిష్ట సంభంధించిన వ్యాఖ్య, మీరు వ్యాపారంలొ దేశ ప్రతిష్ట వుందని మీరు అనలేదు కాని దానికి అలాంటి అర్దం వస్తుందని నేను విమర్శించాను.”

  నేను వాడిన ఏ పదజాలానికి వ్యాపారంలో దేశ ప్రతిష్ట ఉందన్న అర్ధం వస్తుంది? నాకయితే బోధపడలేదు. పైగా దానికి వివరణగా మీరు చెప్పిందేమిటంటే, “ఎందుకంటె అది అలాంటిదే కాబట్టి. ఆ బావజాలాన్నే మీరు తీసుకున్నారు కాబట్టి.”

  ‘అది అలాంటిదే’ అని వేగ్ గా రాస్తే నాకేలా అర్ధం అవుతుంది? నేను ఆ భావజాలం తీసుకోవడం ఏమిటి? నిజానికి అది మీరు తీసుకున్న అర్ధం. నేను చెప్పిన అర్ధం కాదు. ఆర్టికల్ కి ముఖ్య ఉద్దేశ్యం నేను చెప్పాను. ఇలా:

  “ఈ పోస్టు ఉద్దేశ్యం ఏ సందర్భంలోనైనా దేశ ప్రతిష్ట పట్ల దళారీ పాలకవర్గాలకు పట్టింపు ఉండదు అని చెప్పడం. ”

  వివిధ సందర్భాల్లో మీరు రాసినదాన్ని బట్టి మీకు దళారీ పెట్టుబడిదారీ వర్గంపై అవగాహన లేనట్లు/లేదా తక్కువ ఉన్నట్లు నాకు అనిపిస్తోంది. దానివల్లనే నేను నా ఉద్దేశ్యం రాసినప్పటికీ మీ అవగాహనలోకి అది చేరలేదు.

  మావో ధాట్ పై నేనొక ఆర్టికల్ రాశాను. దానిలో దళారీ వర్గం గురించిన అవగాహన స్ధూలంగా రాశాను. సందర్భం వచ్చినందున కొంత భాగాన్ని మళ్ళీ రాస్తున్నాను.

  “మూడో ప్రపంచ దేశాల్లో పెట్టుబడిదారీ వర్గం స్వతంత్ర వర్గంగా అభివృద్ధి కాలేదు. దానికి కారణం వలస శక్తులే. వీరిని మనం సామ్రాజ్యవాదవర్గం అంటున్నాం. అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ వర్గం ఇతర పెట్టుబడిదారుల్ని ఎదగనివ్వదు. తనకు పోటీ రాకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎదగనివ్వకుండా అణచివేస్తుంది. లేదా తనకు అనుచరులుగా, జూనియర్ పార్టనర్లుగా చేసుకుంటుంది. తన ప్రయోజనాలకి లోంగి ఉండేలా చేసుకుంటుంది. మూడో ప్రపంచ దేశాల్లోని పెట్టుబడిదారీ వర్గాన్ని వలస వాదులు (సామ్రాజ్యవాదులు) ఇలాగే అణచివేశారు. లేదా తమకు లొంగి ఉండేలా చేసుకున్నారు. భారత దేశ పెట్టుబడిదారీ వర్గం కూడా ఇలాగే బ్రిటిష్ సామ్రాజ్యవాదుల కనుసన్నల్లో ఎదిగారు తప్ప స్వతంత్రంగా ఎదగలేదు. ”

  ఈ విధంగా స్వతంత్రంగా వ్యవహరించలేని పెట్టుబడిదారీ వర్గం అవడం వల్ల వీరికి నేషనలిస్టు (జాతీయ) సెంటిమెంట్లు ఉండవు. జాతీయత పట్ల గౌరవం లేనివారు జాతి ప్రతిష్ట ను కూడా గౌరవించరు. అందువల్లనే అంతర్జాతీయ క్రీడల ద్వారా వచ్చే ప్రతిష్ట కోసం కూడా దళారీ బూర్జువాలయిన భారత పెట్టుబడిదారీ వర్గం ప్రయత్నించదు అని నేను చెప్పాను.

  బూర్జువా క్రీడలైనా, సోషలిస్టు క్రీడలైనా, అంతర్జాతీయ స్ధాయిలో జరుగుతున్నపుడు, వాటి ద్వారా జాతికి ప్రతిష్ట వచ్చి చేరుతుంది. అది కుంటిదైనా, నికరమైనదైనా సరే. ఆ ప్రతిష్టను ప్రజలు కూడా అనుభవిస్తారు. అది సహజం. ప్రజలు పట్టించుకునే ప్రతిష్టను ‘బూర్జువా ప్రతిష్ట’ అని, వ్యాపార క్రీడల ద్వారా వచ్చిన ప్రతిష్ట అనీ ఈసడించుకుంటే ఎవరో ఎందుకు, ప్రజలే మెచ్చరు. అది కరెక్టు కూడా కాదు. ప్రజలకు సంబంధించిన ప్రతి విషయాన్నీ మార్క్సిస్టులు పట్టించుకోవలసిందే. పట్టించుకుంటూ అందులో మంచి, చెడూ వేరు చేసి ఆచరణ ద్వారా చూపించవలసిందే.

  మీకిప్పుడు మరొక అనుమానం రావచ్చు. ‘ఇదంతా నేను ముందు చెప్పలేదు’ అని. అందుకోసమే ఆ విషయం కూడా చెప్పడానికి పైన ప్రయత్నించాను. ఇలా:

  “ప్రతీ సందర్భంలో మార్క్సిస్టు పరిభాషను ఉపయోగించాలన్నది నా నియమం కాదు. మెడికల్ పరిభాషని ఉపయోగిస్తే రోగులకి అర్ధం కాదు కదా. దైవకణం (హిగ్స్ బోసన్) గురించి సాధారణ పరిభాషలో చెప్పడానికి నేను అనేకరకాలుగా ప్రయత్నించి చేతగాక వదిలేశాను. సందర్భాన్ని బట్టి వివిధ అంశాల వివరణ ఉంటుంది. ప్రతి సందర్భంలోనూ, ప్రతి వివరణలోనూ మార్క్సిస్టు పరిభాషని వెతకనవసరం లేదు.”

  ఇలా నేను చెప్పిన ఈ విషయాన్ని అర్ధం చేసుకోవడం వదిలేసి మీరేమంటారంటే “మీరు ప్రతివిషయలొ మార్కిస్టు పరిబాష ఉపయొగిస్తారా లేదా అనేది మీ వ్యక్తిగత విషయం నేను దానిగురించి మాట్లాడను. ” అని.

  మీరు ప్రస్తావించిన అంశాలపై చర్చిస్తూ సమాధానంగా నేనొక విషయం చెప్పినపుడు దాన్ని మీరు పరిగణించి అది ఎందుకు చెబుతున్నానో అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అర్ధం అయ్యేటట్లు నేను రాయకపోతే మీరు మళ్ళీ అడగొచ్చు. అలా కాకుండా ‘అది మీ వ్యక్తిగత విషయం’ అని తీసిపారేస్తే నేను ఎందుకు రాసినట్లు? నా వ్యక్తిగత విషయం అయితే మీకు వివరణగా ఎందుకు చెబుతాను? బహుశా ‘కొంత అ శ్రద్ధ’ తో మీరు పదానికో తప్పుతో టైప్ చేస్తున్నట్లే నేనూ ఆలోచన లేకుండా చేతికి వచ్చింది టైప్ చేస్తున్నట్లు మీరు భావించినందువల్లనే తీసిపారేయగలిగారా?

  *** *** *** ***

  ఇక్కడ విషయం ఏమిటంటే, నాకు అర్ధం అయినంతవరకూ, ఒలింపిక్స్ క్రీడా పోటీల పట్ల మీకు పూర్తి వ్యతిరేకత ఉంది. అవి సామ్రాజ్యవాద, పెట్టుబడిదారీ ప్రభుత్వాలు నిర్వహిస్తున్న క్రీడా పోటీలు గనక, వ్యాపారం కోసం నిర్వహిస్తున్న పోటీలు గనక అవి అవసరం లేదనీ, వాటి గురించి చర్చించనవసరం లేదనీ, ఇలా ప్రత్యేకంగా ఒక పోస్టు రాయనవసరం లేదనీ మీ అవగాహన. దేశానికి మెడల్స్ ఎందుకు రావు అని నేనంటే “మీ ఈ టపా సారాంశాన్ని చుచినట్లయితె మన డేశానికి మెడల్స్ రాలేదని చాలావిశారపడినట్లు వున్నారు” అని మీరు వ్యంగ్యం చెయ్యడం కూడా అందుకే.

  మీరే పైన చెప్పినట్లు “…క్రీడా పొటీలు అవసరం లేదు. క్రీడాపొటీలనేటివి పూర్తిగా దొపిడీ వర్గ సంసౄతి. … … … మనిషి ఉల్లాసానికీ, ఆరొగ్యానికీ , క్రీడలనేటివి అవసరమే అందులొ ఎమీ సందేహం లేదు. కానీ పొటీలనేటివి అలావుండవు.” అంతటితో ఆగలేదు మీరు. తర్వాత వ్యాఖ్యలో ఇంకా ఇలా అంటున్నారు. “…ఉదాహరణకు ఈ పొస్టునే తీసుకొండి.మార్కిస్టుల దౄష్టిలొ ఇది చాలా పొరపాటైన విషయం. మార్కిస్టులు కానివారికి మంచివిషయం. ఏమిటిది ”

  ఎంతసేపటికీ మీ ధోరణే తప్ప నేను చెప్పేది ఎందుకు పరిగణించరు? క్రీడా పోటీలపై (క్రీడలపై కాదు) మీకున్న అభిప్రాయమే మార్క్సిస్టులందరికీ ఉండితీరాలన్న మీ పోరబాటు అభిప్రాయం వల్ల మీరిలా ఎదుటివారిపైన త్వరత్వరగా ముద్రలు వేయడానికి సాహసిస్తున్నారు. సామాజికాంశాల్లో మార్క్సిస్టు దృష్టి అనేది ఎవరు నిర్ణయించాలి? రామ్మోహన్ గారో, విశేఖరో లేక రాజుగారో, లేదా రంగనాయకమ్మ గారో నిర్ణయిస్తారా? కాదు కదా! మార్క్సిస్టు దృష్టిని సుసంపన్నం చేసుకోవడానికే అంతో ఇంతో చర్చించుకుంటున్నాం. సామాజిక జీవనం ఎలా నిరంతరమో, సుసంపన్నం చేసుకోవడం అనేది కూడా నిరంతరమే. రంగనాయకమ్మ గారి ‘కేపిటల్ పరిచయం’ తో అది ముగిసిపోలేదు.

  వివిధ సందర్భాలలో, అంటే… సమాజం, సంస్కృతి, దైనందిన జీవితం మొదలైన అన్నింటిలో మార్క్సిస్టు దృక్పధం అన్వయించడం అనేది నిరంతర చర్చ, ఆచరణల ద్వారా తేలవలసిన విషయం. ముఖ్యంగా “ఆచరణ” (practice) ద్వారా తేలవలసిన విషయం. ఎందుకంటే మౌలిక సిద్ధాంతం ఇప్పటికే ఉన్నది గనక. ఎంత గింజుకున్నా సిద్ధాంత చర్చల్లో తేలేది కొంతవరకే. ఆచరణలోకి వెళ్ళాక దాని అనుభవాల ద్వారా సిద్ధాంత విశ్లేషణలో (సిద్ధాంతంలో కాదు) కూడా కొన్ని మార్పులు, చేర్పులు చేసుకోవలసి వస్తుంది. లేదంటే సిద్ధాంతం గుడ్డిదిగా, పిడి వాదంగా మారిపోతుంది. అందువల్ల చర్చల ద్వారా ఇప్పటికిప్పుడే క్రీడా పోటీల విషయంలో మార్క్సిస్టు దృష్టి ఏమిటన్నదీ తేల్చదలిస్తే అది పొరబాటు అవుతుంది.

  *** *** *** ***

  నేను చెప్పింది చెప్పినట్లుగా అర్ధం చేసుకోవడానికి బదులు మీకు అర్ధమైనవి మీరు తీసేసుకుని, అంతటితో ఆగకుండా నన్ను వివరణ కోరుతున్నారు. ఉదాహరణకి ఇది చూడండి.

  “మీరు మార్కిస్టుల కొసం రాసినా లేక నాన్ మార్కిస్టుల కొసం రాసినా రొండింటికీ పొంతన ఉండేటట్లు చుసుకొండి. ఒకే విషయాన్ని మార్కిస్టులకు ఒక దిధంగా రాసి కాని వాళ్ళకు ఒక విధంగా రాస్తె అప్పుడు పాఠకుడు దేన్ని తీసుకొవాలి? ”

  మీరిలా ఆరోపించడానికి కారణం నేను రాసిన ఈ వాక్యం. “ఈ ఆర్టికల్స్ లో కొన్నింటిని మార్క్సిస్టు పాఠకుల కోసం ఇచ్చేటపుడు నేను కొన్ని మార్పులు చేసి ఇస్తాను.”

  దీనర్ధం నేను మార్క్సిస్టులకు ఒకటి, నాన్ మార్క్సిస్టులకు మరొకటి రాస్తున్నానని నేను చెప్పినట్లా? ఈ విషయమై నేనిలా వివరించాను.

  “మార్క్సిస్టు పాఠకులకు నేను ఉపయోగించే పరిభాష ఖచ్చితంగా ఉంటుంది. అక్కడ నేను కొలతలు పాటిస్తాను. నిజానికి మార్క్సిస్టు విశ్లేషణే వాస్తవిక విశ్లేషణ. కానీ ఆ విషయం నాన్-మార్క్సిస్టులకు తెలియదు గనక సాధారణ పరిభాషనే నేను ఉపయోగిస్తున్నా. ”

  మార్క్సిస్టు పాఠకుల కోసం మార్క్సిస్టు పరిభాషనీ, నాన్-మార్క్సిస్టు పాఠకుల కోసం సాధారణ పరిభాషనీ ఉపయోగిస్తున్నాననీ నేనిక్కడ చెప్పాను. దానికి ‘హిగ్స్ బోసన్’ ఉదాహరణ కూడా ప్రస్తావించాను. నేను స్పష్టంగా చెప్పిన విషయాన్ని వదిలేసి చెప్పని అర్ధాన్ని మీరు తీసేసుకుని దానికి మళ్ళీ నన్నే బాధ్యుడిని చేయడం ఏమిటి? పైగా ‘మార్క్సిస్టుల కోసం రాసినా నాన్ మార్క్సిస్టుల కోసం రాసినా రెండింటికీ పొంతన ఉండేలా చూడండి’ అంటూ అసందర్భంగా సలహా పడేయడం ఒకటి.

  *** *** *** ***

  భారత దేశంలో ఉన్నది అర్ధ వలస, అర్ధ భూస్వామ్య వ్యవస్ద. ఆ వ్యవస్ధలో అన్నీ రంగాల్లోనూ అసమ అభివృద్ధి ఉంటుంది. కళ్ళు చెదిరే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఓ పక్క మిరుమిట్లు గొలుపుతుండగా దాని పక్కనే, దాని సొంతదారుల్లోనే అనేక వెనుక పాటు భావనలు ఉంటాయి. సరైన కృషి చేస్తే వీరిలో అనేకులు విప్లవ కార్యాచరణలోకి వస్తారు. దానివల్ల ఫలానాది బూర్జువా అనో ఫలానాది వ్యాపారం అనో తృణీకరించే దృక్పధాన్ని విప్లవాన్ని కాంక్షిచేవారు ప్రదర్శించడానికి వీలు లేదు. అలా చేస్తే ప్రజలనుండి వేరు పడడమే మిగులుతుంది. చూటే లాంటి పచ్చి భూస్వామి కూడా చైనా రెడ్ ఆర్మీ కి సర్వసైన్యాధ్యక్షుడుగా ఎదిగాడంటే కారణం చైనా కమ్యూనిస్టు పార్టీ అనుసరించిన ఆచరణాత్మక దృక్పధం వల్లనే. విప్లవాన్ని కాంక్షించే మార్క్సిస్టు-లెనినిస్టులకి ఈ దృక్పధం అవసరం.

  ఒలింపిక్స్ క్రీడలు ఈ నాటివి కావు. శతాబ్దాల తరబడిన చరిత్ర వాటికి ఉంది. క్రీస్తు పూర్వం 6 వ శతాబ్దం నుండే ఒలింపిక్స్ క్రీడలు జరిగినట్లు చరిత్ర చెబుతోంది. వ్యవస్ధలతో పాటే అంతర్జాతీయ క్రీడలు కూడా అభివృద్ధి చెందుతూ, వివిధ రూపాలు మార్చుకుంటూ వచ్చాయి. ఏ దోపిడీ సమాజం నిర్వహించినా క్రీడా పోటీలలో ప్రజల పాత్ర ఉంది. ప్రజల భావోద్వేగాలు కూడా అందులో ఉన్నాయి. ప్రజల పాత్ర లేకుండా దోపిడీ సమాజాలైనా సరే, ఒక అంశాన్ని వ్యవస్ధ స్ధాయికి అభివృద్ధి చేయలేవని గుర్తించాలి.

  ఆదిమ వ్యవస్ధ నుండి మనిషి సోషలిస్టు వ్యవస్ధ వరకూ అభివృద్ధి సాధించాడంటే అందులో దోపిడీ సమాజాల పాత్ర కూడా ఉంది. బానిస, ఫ్యూడల్, పెట్టుబడిదారీ సమాజాలు లేకుండా ఒకేసారి సోషలిజం లోకి మనిషి రాలేదు. ఉన్నతమైన సోషలిస్టు వ్యవస్ధలోకి ప్రవేశించడానికి దానికి ముందరి దోపిడీ సమాజాలే మెట్లుగా పని చేశాయి తప్ప అవి లేకుండా సోషలిస్టు భావజాలమే లేదు. పెట్టుబడిదారీ వ్యవస్ధ లేకుండా సహకార శ్రమ సోషలిస్టు వ్యవస్ధకు తెలిసేది కాదు. వ్యవస్ధలోని అనేక అంశాల్లో పెట్టుబడిదారీ సమాజం క్వాలిటీని అభివృద్ధి చేసింది. ఆ విధంగా పాత దోపిడీ సమాజాలు అభివృద్ధి చేసిన వ్యవస్ధల్లో అంతర్జాతీయ క్రీడా వ్యవస్ధ కూడా ఒకటి. అలాంటి క్రీడా పోటీల వ్యవస్ధను మెరుగుపరిచి నిలుపుకోవాలి తప్ప వ్యాపారమయం అని తిరస్కరించడానికి వీలు లేదు.

  *** *** *** ***

  ఈ వ్యాఖ్యలో కొంత కఠినత్వాన్ని జోడించాను. దానికి కారణం ఉంది. పదే పదే మీ ధోరణి రిపీట్ అవుతుండడం ముఖ్య కారణం కాగా, “వ్యక్తిగత దూషనలు లేకుండా వుంటె విమర్శ ఎంత ఖటినంగా వున్నా ఆహ్వానించవచ్చు” అంటూ రాజుగారికి మీరు చేసిన బోధన కూడా ఒక ప్రేరణ. ఈ వ్యాఖ్యలో రాసిన అంశాలన్నీ అవసరం అని భావిస్తూ రాసినవే. మీరిక్కడ రాసిన నాలుగు వ్యాఖ్యల్లోని అంశాలను పరిగణలోకి తీసుకుంటూ, గతంలో ఇతర ఆర్టికల్స్ కింద మీ వ్యాఖ్యలలోని అభిప్రాయాల నేపధ్యంలో, అవసరం అని భావిస్తూ రాసినవి.

 14. విశెకర్ గారూ.
  “రామ్మొహన్ మీ దొరణి కొనసాగుతుంది”
  ఈ వాఖ్యం నన్నేదొ బెదిరిస్తున్నట్టు వుంది . నేను కుడా పైన “చాల దూరం వెళ్ళవలసి వుంటుంది” అనేది కుడా అలగే వుంది ఇలాంటివి అనుకొకుండ దొర్లుతూ వుంటయి సహజమే అవి.

  దేశ ప్రతిష్ట విషయం నేను ఒక్క బారతదేశం గురించే అనలేదు. అది అన్ని దేశాలకూ వర్తిస్తుంది. కొన్ని కొట్లమంది జనాబా వుండగా వాళ్ళతరుపున ఏ ఒక్కరొ ఇద్దరొ లేక కొంతమందొ వాళ్ళను పట్టుకుని ప్రటిష్ట అంటూ వూగులాడం అసహజంగా లేదూ. ఏ క్రీడల్ని తీసుకున్న నిరంతరమైన సాదన వుంటే తప్ప వటిల్లొ గెలవలేరు.అవి ఏఉపయొగం కిందకూ రావు కేవలం పొటీకొరకు సహజమైన మానవ జీవితానికి ఎవిధంగనూ ఉపయొగపడని కేవలం కొన్ని గంటల్లొ ముగిసిపొయే పొటీ కొరకు జీవితాన్ని ఇలా అసహజ మైన వాటికొరకు తర్పీదునివ్వడం . మీలంటివాళ్ళకు ఎమీ అనిపించకపొవచ్చు. ఎదైనా ఒక నిర్దిష్టమైన ఉపయొగపువిలువను తీసుకొండి అది ఎంతమంది నేర్చుకున్నా అంతమందీ చెయావచ్చు .అదీకక ఓడిపొయామనే వేదనతొ కాళ్ళుచేతులూ సచ్చుపడిన వాళ్ళూ వున్నారు. ఒక యేడాది క్రితం తెలుగు TV చానల్లొ ఇలాగే జరిగింది తేదీ గుర్తు లేదు కొన్ని క్రీడల్లొ ప్రమాదల గురించి చెప్పనవసరం లేదు. జీవితం వ్యర్దమైన వాళ్ళు వున్నారు. ఈపొటీకొసం తర్పీదు పొండేవాళ్ళు అందులొ వచ్చే కీర్తి డబ్బుకొసం నిరంతరం తపనపడుతూ వుంటారు. ప్రతిష్ట అనేదానిలొ ఇవన్నీ ఇమిడి వున్నాయి .ఒక దేశంలొని ప్రబుత్వం తనకు వ్యతిరేకమైన దేశంపైకి ప్రజలను బావజాలపరంగా ఎవిధంగా అయితే తప్పుదారి తట్టిస్తాయొ {అందులొ న్యాయం వుండవచ్చు అన్యాయం వుండవచ్చు ఆయాసందర్బాన్ని బట్టి వుంటుంది} ఇవి కుడా అంతె ఇందులొ న్యాన్యాలు అంటూ ఏమీ వుండవు పొటీ తప్ప. నేను చెప్పవలసిన బావాన్ని సరీగా వ్యక్తపరిచానొలేదొ గాని దీనిగురించి ఇంకా కొంచం వివరించి చెప్పవచ్చు.

  ప్రజలు ప్రతిష్టను అనుభవిస్తున్నారు కనుక దాన్ని వ్యతిరేకిస్తె ప్రజలు మెచ్చరు అంటున్నారు. అయితె ప్రజలు మెచ్చనాటివి చానావున్నయి వాటిని కుడా వ్యతిరేకించకండి. నేను అలా అన్ననా అంటారు కాని వాటికి అదే అర్దం వస్తుందని నా అభిప్రాయం .

  మార్కిస్టు బావజాలం రాయడం గురించి మీరు చెప్పిందనికి తప్పుగా అర్దం చేసుకున్నాను. వప్పుకుంటను. పైన నేను చెప్పినదనిని కుడా తప్పుగా అర్దం చేసుకున్నరు. వివరాలు ఎక్కువలేనందువల్ల. అది సహజం.

  మీరన్నట్టు నాకు క్రీడ పొటీలపైన వ్యతిరేకత వుంది అది ఒలింపిక్స్ అయినా సరే జాతీయమైన సరే.

  ” ఎంతసేపటికీ మీ దొరణే తప్ప. నేచెప్పేది ఎందుకుపరిగనించరు”

  నేనూ అదే అంటున్నాను నేచెప్పినాటివి ఎమైన పరిగనిస్తున్నారా?. ఎంత చేపటికీ దళారీ ప్రభుత్వం అంటూ నేను సార్వత్రికంగా మాట్లాడిన దాన్ని పట్టుకుని సంభందం లేని విషయలు మాట్లాడుతున్నారు. నేను చెప్పిందే అందరికీ వుండాలని నేను అనలేదు. నా అభిప్రాయం మాత్రమే చెప్పినాను. అభిప్రాయాలు యవరొ నిర్నయించలని నే అనలేదే . నేను అనని దాన్ని మీరెలా అంటున్నారు?.”రంగనాయకమ్మ కాపిటల్ పరిచయంతొ అది అయిపొలేదు” దీనర్దం ఏమిటి? నేను అనలేదు అనవచ్చు. కాని మీ మనసులొవున్న అభిప్రాయం ఎమిటంటే నీవు రంగనాయకమ్మ పరిచయం చదివి నన్నే ప్రశ్నిస్తావా? నీవెంత నీ పరిచయమెంత అన్నట్టువుంది. గతంలొ రంగనాయకమ్మ కాపిటల్ పరిచయం గురించి మీతొ మాట్లాడి వున్నాను దాన్ని దౄష్టిలొ పెట్టుకుని అన్నట్టువున్నారు.

  చివర కొంత చారిత్రక బౌతికవాదం గురించి చెప్పి చివరిపేరాలొ దానిగురించి నాకు సరైన అవగాహన లేనందువల్ల చెప్పినానన్నారు. చారిత్రక బౌతికవాదం గురించి నాకు తెలుసునా లేదా అనేది ఇక్కడ అప్రమత్తం. నేను విషయానికి మాత్రమే పరిమితమౌతాను.

  ఇక చివరిగా ఒక మట మనిద్దరిమద్య అభిప్రాయ బేదాలు ఎర్పడినాయి కాబట్టి ఈ చర్చ అనంతంగా సాగే అవకాశం వుంది. ఈ చర్చను ఇంతటితొ ముగిద్దాం.
  మీరు కఠిననగ రాయడని పదే పదే రిపీట్ కావడం కారణం అన్నరు. పదే పదే ప్రశ్నిస్తున్నాననా? మీరు చెప్పిందనికి బజనచెయలేదనా.

 15. రామ్మోహన్ గారూ,

  ప్రశ్నించడం గొప్పా కాదు, మెచ్చుకోలు భజనా కాదు. మీకు ఎదురయ్యే ప్రశ్నలు కూడా ప్రశ్నలే. చర్చల్లో వచ్చే ఏకీభావాన్ని, అంగీకారాన్ని భజనగా చెప్పడం, అలా అని వారిని అవమానించడం సరికాదేమో.

  ఈ పోస్టు భారత దేశానికి సంబంధించినది. భారత దేశం దళారీ బూర్జువాలు, భూస్వాములు, సామ్రాజ్యవాదుల చేతుల్లో ఉంది. కనుక ‘దళారీ ప్రభుత్వం’ అన్న విషయమే ఇక్కడ ప్రస్తుతం. ఈ పోస్టుకి అదే ప్రస్తుతం. పోస్టుకే కాకుండా భారత దేశ ప్రజలకి కూడా అదే ప్రస్తుతం. అందువల్లనే నా టపాలు దాని చుట్టూ తిరుగుతుంటాయి.

  భారత దేశంలో విప్లవం గురించి మాట్లాడుకోవాలంటే ఇక్కడ వ్యవస్ధ, అందులో వైరుధ్యాలనే ప్రధానంగా చర్చించాల్సి ఉంటుంది. మార్క్సిజం వెలుగులో భారత దేశ ప్రజల ప్రధాన శత్రువులను గుర్తించి వారిపై పొరాటం ఎక్కుపెట్టవలసి ఉంటుంది. భారత దేశ ప్రజల ప్రధాన శత్రువులు బడా దళారీ బూర్జువాలు + బడా భూస్వాములు + వీరిద్దరి మాస్టర్లయిన సామ్రాజ్యవాదులు. అందువల్ల ‘అప్రస్తుతం’ అనే బదులు, ఇప్పటికైనా ఆ వైపుగా చర్చను తీసుకెళ్తే ఉపయోగం.

  భారత ప్రజల ప్రధాన శత్రువులను గుర్తించకుండా, చర్చించకుండా మార్క్సిజం పై చర్చ శుద్ధ దండగ. అది మార్క్సిజాన్ని మళ్ళీ పడక్కుర్చీలకు పరిమతం చేయడం అవుతుంది.

  ఈ చర్చ ఇంతవరకూ నడిచిందంటే దానికి కారణం మీ ప్రశ్నలే. అయితే, ఆ చర్చలో భాగంగా తేలిన ‘దళారీ ప్రభుత్వం’ విషయాన్ని అప్రస్తుతం చేయడం అంటే అసలు విషయాన్ని వదిలేయడమే.

  మీ కోరిక ప్రకారమే చర్చను ముగిద్దాం. ఎప్పటిలాగే మరో చర్చకు మీరు ఆహ్వానితులు.

 16. You didnt undetstand Ramamohan’s questions. If few dalits become politicians or IAS officers by reservations, caste associations consider it as superior change though these things do not change lives of many dalits. Even the case of victory in sports in same. If few players win medals, our media considers it asnation’s glory though many people are no way benefited by these competitions.

 17. @Praveen

  It might not benefit many people in a direct way, but it definitely inspires a lot of people and sets a great example. The authenticity of those sports and the authority of those who organize them are another debate, but the bottom line is success/achievement in any field inspires a whole new generation.

 18. కానీ వాస్తవికంగా జరుగుతున్నది వేరు. పది మంది మధ్య పోటీ ఉంటే ఒక్కడే గెలుస్తాడు. అది చూసినవాళ్ళలో “గెలుపు గుఱ్ఱం కొందరికే దక్కుతుంది” అనే కర్మవాద (fatalistic) అభిప్రాయం కలుగుతుంది కానీ “నేను కూడా గెలవగలను” అనే confidence కలగదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s