నెం.1 స్ధానంలో రాహుల్ గాంధీ ఖర్చీఫ్


వారసత్వ రాజకీయాలకు భారత దేశం పెట్టింది పేరు. సొంత ప్రయోజనాల కన్నా నాయకుల పట్ల సానుభూతికి భారతీయులు ఎక్కువ విలువ కట్టబెట్టడం ఇక్కడ రివాజు. భర్త చనిపోతే భార్యకు, తండ్రి చనిపోతే కొడుకుకి సానుభూతి ఓట్లు కురిపించి పీకలమీదికి తెచ్చుకోవడానికి శ్రామిక జనం పెద్దగా ఫీలవరు. ఇక సానుభూతి రాజకీయాలను వ్యవస్ధాగతం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. నెహ్రూ, ఇందిర, సంజయ్ రాజీవ్ లు, సోనియా… ఇప్పుడు రాహుల్. తెలివిగా రాజకీయ వయసుకు ఎంతో ముందుగానే రంగం ప్రవేశం చేయించి ఆనక నేర్చుకోమంటూ ప్రజలమీదికి రాహుల్ ని వదిలారు. పార్టీని పటిష్టపరిచే అనేక మంది సెకండరీ నాయకులు, చోటా మోటా గల్లీ నాయకులు, కార్యకర్తలు ఉండగా, అదేదో జన్మ హక్కయినట్లు ప్రతీ విజయానికీ రాహుల్ ని బాధ్యుడిని చేశారు. ప్రతి అపజయానికి మాత్రం పార్టీని బాధ్యురాలుగా చేశారు.

ఈ ట్రైనింగ్ ప్రహసనం ఇక పూర్తయినట్లు కనిపిస్తోంది. నాయకత్వం స్వీకరించేదీ లేనిదీ రాహుల్ గాంధీయే స్వయంగా నిర్ణయించుకోవాలని సోనియమ్మ గారు రెండ్రోజుల క్రితం బోధిస్తే, మరునాడే తాను సిద్ధమేననీ నిర్ణయించాల్సింది పార్టీ నాయకురాలూ, ప్రధానీ మాత్రమేననీ యువరాజా వారు ముక్తాయించారు. అంటే పగ్గాలు చేపట్టడానికి రాహుల్ ని రెడీ చేశారన్నమాట. మధ్య మధ్యలో ప్రియాంక పేరు వినిపించినా ఆమెను ఇంకా రిజర్వ్‌డ్ పొజిషన్ లోనే ఉంచినట్లు కనిపిస్తోంది. నిజానికి రాహుల్ పగ్గాల స్వీకరణ ఎన్నడో సిద్ధమైపోయిన నిర్ణయం. కాంగ్రెస్ లో నెం.1 స్ధానానికి పోటీ ఎప్పుడూ లేదు. నెహ్రూ (గాంధీ) కుటుంబానికి ఆ స్ధానం రిజర్వ్‌డ్. ఎవరైనా పోటీ పడదలిస్తే రెండో స్ధానం నుండి మొదలు పెట్టవలసిందే.

కార్టూన్: ది హిందూ

One thought on “నెం.1 స్ధానంలో రాహుల్ గాంధీ ఖర్చీఫ్

  1. We Indians do not know the true spirit of democracy. We just copied it and are displaying our own inherent mindset as usual. Is it possible for an indian spouse to rule an European country,even in a disguise…? They will just kill…without any second…because a nation of Heroes only knew the value of freedom amd independence..!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s