వేయి తలల హైందవ విషనాగుడి మరో వికృత శిరస్సు, ‘అస్పృశ్య గర్భం’


‘కుల వివక్ష’, వేయ పడగల హైందవ విషనాగు వికృత పుత్రిక అన్న నిజానికి సాక్ష్యాల అక్షయ పాత్రలు బోలెడు. ఎంతమంది ఎక్కినా పుష్పక విమానంలో మరొకరికి చోటు ఉంటుందో లేదో గానీ కులాల కాల కూట విషమే రక్తనాడుల్లో ప్రవహించే హైందవ విష నాగు కాట్లకు బలైన సాక్ష్యాలకు అంతూ పొంతూ లేదు. అండం తమదే, అండ విచ్ఛిత్తి చేసే వీర్యకణమూ తమదే… అయినా అండ వీర్య కణాల సంయోగ ఫలితమైన పునరుత్పత్తి కణాన్ని మోసే అద్దె గర్భం కూడా అగ్ర కులానిదే కావాలని సంతాన భాగ్యం లేని నిరాశోపహత తల్లి దండ్రులు డిమాండ్ చేస్తున్నారు. అగ్ర కుల గర్భం కోసం ఏళ్లతరబడి ఎదురు చూడడానికైనా వారు వెనకాడడం లేదని ఒక సర్వేలో వెల్లడయింది. అండము, వీర్యకణాలకూ కులాలు అడుగుతున్నారని సర్వే తెలిపింది.

కుల గర్భాలను వెతికి పెడుతున్నది విద్యాధికులైన డాక్టర్లే కావడం చేదు నిజం. ఆర్ధిక సంపాదన మార్గంలో కూడా కులాల మెట్లు ఎక్కుతున్న వర్గ జీవుల వైనం ఇక్కడి చర్చనీయాంశం. ఓ వైపు ఆడ పిండాలపై వివక్ష, మరో పక్క ‘స్పృశ్య గర్భాల’ వేట జమిలిగా గుదిగుచ్చిన వికృతత్వానికి ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం పరమపదసోపానంగా మలచగలిగిన హైందవ సంస్కృతికి జోహార్లు చెప్పవలసిందే. హైందవ దేవుళ్ళ గర్భ గుడులకు దళిత మైల ఎలాగూ సోకనివ్వరు. కుల వైషమ్యానికి చోటివ్వ కూడని తల్లి గర్భానికి సైతం కులాన్ని అంటగట్టిన కుల జీవుల పవిత్రతకు ఏది కొలబద్ద?

“నా క్లినిక్ కి వచ్చే కొన్ని జంటలు, ఒక ఐదు శాతం అనుకుందాం, తమ కులం నుండే గర్భ దాతలు కావాలని డిమాండ్ చేస్తారు” ఆనంద్ (గుజరాత్) లోని ఆకాంక్ష ఫెర్టిలిటీ క్లినిక్ లోని డాక్టర్ నయ్నా పటేల్ చెప్పినట్లు ‘ది హిందూ’ తెలిపింది. భారత దేశంలో గర్భ దాతలకు ప్రధాన కేంద్రంగా గుజరాత్ భాసిల్లుతోందని సదరు పత్రిక తెలిపింది. “తమిళనాడు నుండి ఒక జంట వచ్చింది. వారి కులం నుండే గర్భాన్ని మోసే స్త్రీ వారికి కావాలట. అందుకోసం గత మూడు సంవత్సరాల నుండి వారు ఎదురు చూస్తున్నారు. ఇంకా ఎదురు చూడడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి వారిని నేను ప్రోత్సహించను. లింగ నిర్ధారణకు కూడా అనుమతించను” అని నయ్నా పటేల్ తెలిపింది.

ఒక్క గర్భమే కాదు. అండం, వీర్యకణాలకు కూడా కులాలు ఎంక్వైరీ చేస్తున్న ఉదాహరణలు ఉన్నాయి. తమ కులస్ధుల అండ కణం దొరుకుతుందా, ఫలానా కులం వీర్య కణం దొరుకుతుందా అంటూ బీహార్ నుండి ఎంక్వైరీలు వస్తున్నాయని ‘ది హిందూ’ తెలిపింది.

తల్లి ఆరోగ్యం లెక్క కాదు,  ఆడ బిడ్డ వద్దే వద్దు

కృత్రిమ గర్భ ధారణలో పెచ్చరిల్లుతున్న కుల వివక్షలు ఒక సంగతి కాగా ఆడ పిండాలపై పెరుగుతున్న పురుషాధిక్య వైషమ్యం మరొక సంగతి. పురుష పిండాలు మాత్రమే కోరుకుంటూ అనేక జంటలు ఆడ పిల్లలపై ప్రత్యక్ష వివక్ష పాటిస్తున్నారనీ, కృత్రిమ గర్భ కార్యక్రమాలను ఆద్యంతం పర్యవేక్షించే డాక్టర్లు వ్యాపార దృక్పధంతో స్త్రీల ఆరోగ్య సంక్షేమాలను గాలికి వదిలేస్తున్నారని ‘సమ నివేదిక’ వెల్లడించింది. లింగ వివక్ష, ఆరోగ్యము మరియు హక్కులు అంశాలపై ‘సమ’ ఢిల్లీ నుండి కృషి  చేస్తోంది. “Construction Conceptions: The Mapping of Assisted Reproductive Technologies in India” పేరుతో ఆ సంస్ధ 2008 నుండి 2010 వరకు ఒక అధ్యయనం నిర్వహించింది. ప్రవేటు వైద్యులు అనుసరిస్తున్న అనైతిక పద్ధతులను ఈ అధ్యయన నివేదిక వెల్లడి చేసింది. ఎ.ఆర్.టి (ఆసిస్టెడ్ రీ ప్రొడక్టివ్ టెక్నాలజీస్) పరిశ్రమపై నియంత్రణ విధించవలసిన ఆవశ్యకతను సదరు నివేదిక నొక్కి చెప్పింది.

అధ్యయనంలో భాగంగా 43 ఎ.ఆర్.టి క్లినిక్ లను, 86 మంది మహిళా వినియోగదారులను సంస్ధ ఇంటర్వ్యూ చేసింది. మెట్రో నగరాలకూ, చిన్న పట్టణాలకూ మధ్య గల అంతర్గత సంబంధాలను సంస్ధ పరిశీలించింది. తాము అందజేసే టెక్నాలజీ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి మహిళలకు ఏమీ చెప్పకుండానే క్లినిక్ లు వ్యాపారం నిర్వహిస్తున్నాయని అధ్యయనంలో తేలింది. తల్లికీ, బిడ్డకు కూడా తీవ్ర ప్రమాదాలు తెచ్చి పెట్టే బహుళ ప్రసవాలను తమ గొప్పగా క్లినిక్ లు ప్రచారం చేస్తున్నాయని తెలిసింది. హార్మోన్ లను భారీ డోసుల్లో ఇవ్వడం ద్వారా పదే పదే అండ విచ్ఛిత్తికి (ovulation) పాల్పడడం,  వెంట వెంటనే గర్భదానానికి ప్రోత్సహించడం క్లినిక్ లు చేస్తున్నాయనీ ఆ క్రమంలో స్త్రీలు, పిల్లల ఆరోగ్యాలను అవి ఏమాత్రం పట్టించుకోవడం లేదనీ, సంబంధిత ప్రతికూల పరిణామాల గురించి మహిళలను ఎడ్యుకేట్ చేయవలసిన బాధ్యతను పూర్తిగా విస్మరిస్తున్నారనీ అధ్యయనం తెలిపింది.

బిడ్డ సెక్సువాలిటీని ముందే ఎన్నుకోవడం, బహుళ పిండాలను గర్భంలో ప్రవేశపెట్టడం, మెనో పాజ్ దశ దాటాక కూడా మహిళల గర్భధారణకు పాల్పడడం మొదలైన అనైతిక, అనారోగ్య చర్యలకు క్లినిక్ లు పాల్పడుతున్నాయి. మగ బిడ్డ కోసం కొనసాగుతున్న డిమాండు నేపధ్యంలో లింగ నిర్ధారణకు ఎ.ఆర్.టి ప్రక్రియల వినియోగం తీవ్ర స్ధాయిలో ఉన్నట్లు అధ్యయనం గుర్తించింది. గర్భ ధారణ జరిగాక బిడ్డ లింగ నిర్ధారణ జరపడం ఒక విషయం కాగా, గర్భ ధారణకు ముందు కూడా లింగ నిర్ధారణ చేసి చికిత్స ప్రారంభించడం మరొక వైపరీత్యం. 1994, 2003 సంవత్సరాలలో చేసిన చట్టాల ప్రకారం ఇవన్నీ చట్ట విరుద్ధం అయినప్పటికీ నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయని అధ్యయనం గుర్తించింది.

‘సమ’ సంస్ధ నివేదిక ప్రకారం భారత దేశ మెడికల్ టూరిజం లో ఫెర్టిలిటీ పరిశ్రమ ఒక ముఖ్యమైన భాగంగా ఎదుగుతోంది. ప్రపంచంలో ‘సరోగసి ఔట్ సోర్సింగ్’ కు రాజధానిగా ఇండియా ఎదుగుతోంది. వాణిజ్య పరమైన సరోగసి (గర్భాదానం), అండ ప్రదాన కార్యక్రమాలకు సంబంధించిన సేవలను అందించడానికి భారత ఫెర్టిలిటీ పరిశ్రమ నిరభ్యంతరంగా ముందుకు వస్తోంది. ఈ పరిశ్రమలో వ్యాపార ప్రయోజనాలు, లాభాలు మాత్రమే ముఖ్యమైన నేపధ్యంలో తల్లి, బిడ్డల ఆరోగ్యం పక్కకు వెళుతోంది. అంతిమంగా మగ బిడ్డలను ప్రసాదించే పరిశ్రమగా భారతీయ ఎ.ఆర్.టి పరిశ్రమ మారుతోంది.

కుల వివక్ష, ఆడ పిల్లలపై వివక్ష మరణ శయ్యపై ఉండవలసిన అభివృద్ధి నిరోధక వ్యవస్ధల లక్షణాలు. సంతాన భాగ్యం లేని జంటలకు గర్భ దానం ప్రసాదించే ఎ.ఆర్.టి టెక్నాలజీ యేమో నాగరిక ప్రపంచం సాధించిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం. అనాగరిక వివక్షలను నాగరిక సాంకేతికతను ఒక చోటికి చేర్చి నాగరిక సాంకేతికతపై అనాగరిక వివక్షలే విజయం సాధించేలా చేయడంలో భారతీయ సామాజిక వ్యవస్ధ సఫలం అయింది. అభివృద్ధి కాముకులైన ప్రతి ఒక్కరూ సిగ్గుతో తల దించుకోవలసిన విషయం ఇది. ఇది ఒక సంగతి కాగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి అయ్యే కొద్దీ బలహీనపడవలసిన కుల మూఢత్వం బలహీనపడకపోగా శాస్త్ర, సాంకేతికతలను సైతం తన పాదాక్రాంతం చేసుకోవడం మరొక సంగతి. భూస్వామ్య వివక్షలు కొనసాగడానికి ఆధునికత సైతం సాధనంగా మారిన వికృత ఫలితమే ఈ విపరీత ధోరణులకు మూలం.

41 thoughts on “వేయి తలల హైందవ విషనాగుడి మరో వికృత శిరస్సు, ‘అస్పృశ్య గర్భం’

 1. ‘హైందవ నాగరాజు’ అనే వ్యక్తీకరణ చూడగానే జాషువా గబ్బిలంలోని పద్యం గుర్తొస్తుంది- ‘‘ ఆ యభాగ్యుని రక్తంబు నాహరించి యినుపగజ్జెల తల్లి జీవనము సేయు
  కసరి బుసకొట్టు నాతని గాలిసోక నాల్గుపడగల హైందవ నాగరాజు’’

  ‘కులం’ భావన పుట్టుకతోనే సంబంధమున్నది కదా? కులాన్ని చీదరించుకోకుండా పైగా అపేక్షగా ఆలింగనం చేసుకునే మనస్తత్వం ఉన్నవారు అద్దె గర్భాల విషయంలో మాత్రం ఉన్నతంగా ప్రవర్తిస్తారా! వీళ్ళు ఒకవేళ దత్తత చేసుకుంటే ఆ శిశువుల కులం ఏదని కూడా ఆరా తీస్తారు. ఇవన్నీ ఒకదానితో ఒకటి సంబంధమున్నవే.

 2. అవునూ, ‘హిందూ’ అనగానే బుర్ర అస్సలు పని చేయదేం మీకు?

  బుర్రలో గుజ్జు తక్కువై అర్ధం కాకపోతే, అనుమానం ఏమన్నా ఉంటే అడుగు, చెబుతా. నేనసలు అననివి నాకు అంటగడతావేం?

  మళ్ళీ ఒకసారి ఆర్టికల్ చదువు. మత మూఢత్వం వల్ల కళ్ళు మూసుకుపోతే తెరుచుకుని చదువు. అర్ధం కాకపోతే అడుగు. అంతే తప్ప నేను చెప్పనివి నాకు అంటగట్టకు.

  నువ్వు కూసిన కూతకి నీ వ్యాఖ్య ప్రచురించకూడదు. కానీ, నీలాగే ఎవరన్నా ఆలోచిస్తారేమోనని ఈ సమాధానం ఇస్తున్నా.

  ఇంకో సంగతి. నా ఇంటికి రావద్దు అని గెంటేశాక ఇక రాకుండా ఉండడం కనీస పద్ధతి. ఇప్పటికే ఒకసారి గెంటేశాను. మళ్లి గెంటిచ్చుకోకు. కనీసం ఇదైనా అర్ధం చేసుకో.

 3. సహస్రాబ్దాలుగా శ్రామికులను కులం పేరుతో సమస్త సుఖాలకూ, విజ్ఞానానికి దూరంగా ఉంచింది హైందవ మతమే. కుల అణచివేత ఇతర మతాల్లోనూ ఉన్నట్లయితే అవి కూడా ఆ కోవలోకి వచ్చేవి.

  ఫలనా మతానికి చెందిన గర్భమే కావాలని ఎవరైనా అన్నట్లుగా సర్వే చెప్పలేదు. చెబితే అది కూడా ఆలోచించవలసిందే. కులానికి ఉన్న బలం మతానికి లేదు. ముఖ్యంగా భారత దేశంలో లేదు.

  ఆది శంకరులు లాంటి ఆధ్యాత్మిక గురువులు కూడా నిరసించిన కులాన్ని హిందూ మతం ఇంకా కొనసాగిస్తోంది. హిందూ మతంలోని కుల సమస్యకు పరిష్కారం చెప్పకుండా, కనీసం చర్చించకుండా మతాన్ని వెనకేసుకురావడం వల్ల ఫలితం ఉండదు.

 4. శ్రామిక వర్గాన్ని హింసించే సంఘటనలు ప్రతీ మతం లోనూ ఉన్నాయి. మతానికీ దానికీ సంబంధం లేదు. అది భూమి మీద పుట్టిన ప్రతీ మానవుడి బుద్ధి లోనూ ఆ దుర్బుద్ధి ఉన్నది. తక్కువ వాడిగా చూడటం.

  యూదుల కాలం లో జరిగిన రక్తపాతం ప్రపంచానికి తెలియనిది కాదు. క్రిస్టియన్ లు చేసిన అఘాయిత్యాలు అన్నీ ఇన్నీ కాదు. ముస్లిం ల గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. ఏ మతమూ కూడా ఇంకొకడిని హింసించమని, వేరు చేయమని, తక్కువ వాడిగా చూడమనీ చెప్పదు. ఒక మతానికి చెందిన వాళ్ళు చేసిన తప్పు కి మతాన్ని నిందించటం చాలా బుద్ధి తక్కువ పని. అన్ని మతాలూ మంచే చెప్తాయి. కాకపోతే వాటిని ఆచరించే మనుషుల బుద్ధి తక్కువ తనం వల్ల వచ్చిన ప్రభావం అది. మతం ఎంత ప్రాచీనమైనది ఐతే అంత చెడిపోతుంది – కాలక్రమేణా మార్పులు వస్తాయి కాబట్టి. టెర్రరిస్ట్ లు చేసిన పని కి ముస్లిం లను దూషించటం లాంతిది ఈ పోస్ట్. చాలా మంది ముస్లింస్ మంచి వాళ్ళు కాదా? టెర్రరిస్ట్స్ అందరూ ముస్లింస్ కాబట్టి ముల్సిం మతాన్ని తిడతారా?

  మీరు బ్లాగ్ మయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఈ అఘాయిత్యాలను గూగుల్ చేయటం మీకు కష్టం ఏమీ కాదు. దయచేసి చూడండి.

  మీరు రాసిన పోస్ట్ లో కులం గురించి రాశారు. మతం గురించి రాశారు. హిందూ మతం ఎప్పుడూ కులం గురించి మాట్లాడలేదు. కుల వ్యవస్థ వేరు, వర్ణ వ్యవస్థ వేరు. వర్ణ వ్యవస్థ మీద చేసిన రెసేర్చ్ లు చాలా ఉన్నై. దానికి సపోర్ట్ చేసిన విదేశీ మేధావులు చాలా ఉన్నారు. ప్లీజ్ … గూగుల్ లో చూడండి. రాను రానూ కుల-వ్యవస్థ కూ వర్ణ వ్యవస్థ కూ తేడా లేకుండా పోయింది.

  మీరే అన్నారు గా… మతం ఎప్పుడూ చెప్పలేదు – కులాలు తో మనుషుల్ని చూడద్దు అని. అంటే మతం తప్పేమీ లేదు. కాకపోతే దానిని పాటించే మనిషులలో ఉంది తప్పంతా. మనుషులు చేసిన తప్పులకి మతాన్ని నిందించాలా?

  మతం గురించి మాట్లాడి, శ్రామిక వర్గాన్ని చేర్చి రభస చేయటం ఒక ఫ్యాషన్. Because, if you scold hinduism including one or two supporting words about “Sraamikulu”, you won’t become a visionary.

 5. చందు గారూ,

  మీ వ్యాఖ్యలో కొన్ని నిజాలు ఉన్నాయి. కొన్ని అపోహలు కూడా ఉన్నాయని నా అభిప్రాయం.

  శ్రామిక వర్గాన్ని హింసించే సంఘటనలు ప్రతి మతంలోనూ ఉన్నాయన్నది నిజం. మతానికీ దానికీ సంబంధం లేదు అనేకన్నా, మతాల్లో శ్రమ దోపిడి కి పరిష్కారం లేదు అనడం సబబుగా ఉంటుంది. పైగా పూర్వ జన్మలు, మరు జన్మలు, స్వర్గం, నరకం… ఇత్యాదుల పేరుతో శ్రమ దోపిడిని మతాలు సమర్ధిస్తున్నాయి కూడా.

  మతాలు వేరు, వాటిని అనుసరించే మనుషులు వేరు అని మీ వ్యాఖ్య ప్రధానంగా చెబుతోంది. మతాలన్నీ మంచే చెబితే దాన్ని అనుసరించే మనుషులు చెడు చేయడం తర్కించ వలసిన విషయం. మనుషుల నుండి వేరుగా ఉన్నట్లయితే మతమైనా మరేదయినా వృధా కాదా?

  కులం గానీ మతం గానీ, మంచి గానీ చెడు గానీ, పాత గానీ కొత్త గానీ, సనాతనం గానీ ఆధునికంగానీ… ఏవయినా సరే, మనుషుల ఆచరణ లేకుండా వాటికవే ఉండవు. మనుషులు, వారి ఆచరణా, వారి ఆలోచనలూ లేకుండా మనలేని కుల, మతాలు మనుషులకు అతీతంగా ఎలా ఉండగలవు? మనుషులు పుట్టుకతోనే దుష్టులు అని మీరు ఈసడించుకున్నా సరే, మానవ సమాజం లేకుండా మతం గానీ కులంగానీ లేవు. మనిషి తప్ప మరో జీవికి అవి లేకపోవడమే అందుకు ఒక రుజువు.

  ఎన్ని నీతులైనా చెప్పచ్చు, ఎన్ని బోధలైనా చెయ్యొచ్చు, వాటిని మనిషి చేత ఆచరింపజేయలేనప్పుడు ఎందుకవి? పుస్తకంలో ఉన్న శాస్త్రం మనుషుల మధ్య లేనపుడు అది శాస్త్రమేనా? శాస్త్ర, సిద్ధాంతాల అంతిమ లక్ష్యం మనిషే. ఈ రోజు కాకపోతే రేపయినా ఒక శాస్త్రం లేదా సిద్ధాంతం ఆచరణలోకి రావలసిందే. లేనట్లయితే అవి శాస్త్రం లేదా సిద్ధాంతం కాజాలదు.

  శ్రమ దోపిడితో బతికిన ఆధిపత్య వర్గాలకు మతం ఒక పని ముట్టుగా ఉపయోగపడుతూ వచ్చిందన్నది చారిత్రక సత్యం. అణచివేతలకు గురవుతున్న ప్రజల తరపున పుట్టిన క్రిష్టియన్, ముస్లిం మతాలు త్వరలోనే అణచివేతదారుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. హిందూ మతం మాత్రం పుట్టడమే ఆధిపత్య వర్గాల కోసం పుట్టిందని రొమిల్లా ధాపర్ లాంటి ప్రఖ్యాత చరిత్రకారులు చెప్పగా చదివాను. మతాల గురించి సాధారణ విషయాలు అని భావిస్తూ మీరు కొన్ని విషయాలు చెప్పినందున నేనీ విషయం ప్రస్తావిస్తున్నాను.

  టెర్రరిస్టులు అనగానే కేవలం ముస్లింలు మాత్రమే అన్నట్లు మీరు సూచిస్తున్నారు. అది నిజం కాదు. భారత దేశంలో హిందూ టెర్రరిస్టులు చేసిన అకృత్యాలు తెలిసినవే. మధ్య యుగాల్లో శైవ, వైష్ణవుల పరస్పర ఊచకోతల దగ్గర్నుండి, గుజరాత్ లో ముస్లింల మారణకాండల వరకూ జరిగినవన్నీ టెర్రరిస్టు చర్యలే కాదా? స్వామీ అసీమానంద, స్వామిని ప్రజ్ఞ లాంటి వారు పాల్పడిన మాలెగావ్ పేలుళ్లు టెర్రరిజం కాదా? సహస్రాబ్దాలుగా అస్పృశ్య కులాలపై సాగిన శారీరక, మానసిక, సాంస్కృతిక అణచివేత కంటే మించిన టెర్రరిజం మరొకటి ఉంటుందని నేననుకోను.

  అమెరికా, యూరప్ లలో క్రిస్టియన్ మత ఛాందసులు సాగిస్తున్న టెర్రరిస్టు చర్యల మాటేమిటి? కొన్ని నెలల క్రితం నార్వేలో డెబ్భై మందికి పైగా స్కూల్ పిల్లల్ని చంపేసిన క్రిస్టీయన్ టెర్రరిస్టు బ్రీవిక్ విషయం మీకు గుర్తుండే ఉంటుంది. అహింసను బోధించిన బౌద్ధమతం పేరు చెప్పుకుని మియాన్మార్ లాంటి చోట్ల రొహింగ ముస్లింలపై తీవ్ర అణచివేత, హత్యలు సాగిస్తున్నారు. వాళ్ల జనాభా పెరగకుండా ఉండడానికి యువతులు పెళ్ళిళ్లు చేసుకోకుండా అడ్డుకుంటున్నారని ఐక్యరాజ్య సమితి చెప్పింది. ఇవన్నీ టెర్రరిజమే. ప్రతిమతంలోనూ తీవ్రం వాదం ఉందని మీరు గుర్తించాలి.

  హిందూ మతం ఎప్పుడూ కులం గురించి చెప్పలేదనడం విడ్డూరం. మీరు వర్ణాలంటున్నారు. వాస్తవంలో అవి కులాలు. వర్ణ వ్యవస్ధే కుల వ్యవస్ధగా ఘనీభవించిందని డి.డి.కోశాంబి లాంటి సామాజిక చరిత్రకారులు నిగ్గుదేల్చిన సత్యం. భగవద్గీత ఆధారంగా కులాలు హిందూ మతంలో ఎంత విడదీయలేని భాగమో అంబేద్కర్ ససాక్ష్యాలతో చక్కగా వివరించారు. వీలయితే చూడగలరు.

  మతం ఒక మానసిక భావన. మానసిక భావనలు ఉండేది మనిషికే. కనుక మతం పేరుతో మనుషులు చేసే చర్యలకు మతమే బాధ్యత వహించక తప్పదు. హిందూ మతం కులాల గురించి చెప్పలేదన్న వాదన, కుల అణచివేతపై సమాధానం చెప్పవలసిన అగత్యం నుండి తప్పించుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుంది.

  కులం గురించీ, శ్రామికుల గురించీ చర్చించడానికి విజనరీ యే కావాలంటారా? మామూలు మనుషులంగా, కుల సమాజంలో బతుకుతున్నవారిగా కుల సమస్యను, అస్పృశ్య సమస్యను చర్చించలేమా? చర్చించవచ్చని నా అభిప్రాయం.

 6. 1. <<<>>>
  (శ్రామిక వర్గాన్ని హింసించే సంఘటనలు ప్రతి మతంలోనూ ఉన్నాయన్నది నిజం. మతానికీ దానికీ సంబంధం లేదు అనేకన్నా, మతాల్లో శ్రమ దోపిడి కి పరిష్కారం లేదు అనడం సబబుగా ఉంటుంది.)

  ఏ మతం లోనూ లేదు కాబట్టి, ఈ కాంటెక్స్ట్ లో నుంచి అన్ని మతాలను తీసేద్దాం. సో, జుదాయిజం, హిందూయిజం, క్రిస్టియానిటీ, ఇస్లాం లాంటి మతాలు ఏవీ పర్ష్కారం చూపలేవు.

  2. <<<>>>
  (మతాలు వేరు, వాటిని అనుసరించే మనుషులు వేరు అని మీ వ్యాఖ్య ప్రధానంగా చెబుతోంది. మతాలన్నీ మంచే చెబితే దాన్ని అనుసరించే మనుషులు చెడు చేయడం తర్కించ వలసిన విషయం. మనుషుల నుండి వేరుగా ఉన్నట్లయితే మతమైనా మరేదయినా వృధా కాదా?)

  అవును… వృధా నే. దీనిలో పెద్ద తర్కించవలసిన అవసరం లేదు. మనిషి కి స్వతహాగా వచ్చిన క్రూరమైన బుద్ధి అది. సంస్కారం తో దానిని జయించవచ్చు. ఈ మాటలు చెప్పటానికి చాలా బాధ గా ఉన్నా – మీరూ, నేను, మన స్నేహితులు ఇలా చేయకపోయినా – జనాలు ఎదుటి వాడు ఏ రకంగా తక్కువ వాడు ఐనా వాడిని వేపుకు తింటున్నారు. ఈ తక్కువ తనం ఎలాంటిదైనా కావచ్చు.

  3. <<<>>>
  (ఎన్ని నీతులైనా చెప్పచ్చు, ఎన్ని బోధలైనా చెయ్యొచ్చు, వాటిని మనిషి చేత ఆచరింపజేయలేనప్పుడు ఎందుకవి? పుస్తకంలో ఉన్న శాస్త్రం మనుషుల మధ్య లేనపుడు అది శాస్త్రమేనా?)

  మీరు ఒక ఫిజికల్ గా లేని అంశాన్ని దూషించారు – – “వాటిని మనిషి చేత ఆచరింపజేయలేనప్పుడు ఎందుకవి?” మనిషి చేత అవి ఆచరింపజేయలేవు. మనం మనకు గా పూనుకోని చేయాలి. కానీ ఇంత “గొప్ప బుద్ధి” లేని తనం ప్రతీ మనిషిలోనూ ఉంది.
  నిజమే – రండి. అన్ని మత గ్రంధాలనూ తగలపెడదాం. ఏ మతానికి చెందిన వారూ ఆ మతం చెప్పినట్టు నడుచుకోవటం లేదు. యూరప్ లో క్రిస్టియన్ లు దాడి – ముస్లిం మినార్లు తీసెయ్యాలని. సున్నీలు, సూఫీలు తగులాడుకోని ప్రపంచాన్ని నాశనం చేస్తున్నారు. అమెరికా క్రిస్టియానిటీ ఐతే… వేరొక మతాన్ని నాశనం చేసైనా సరే వారు పెరగాలి అని – చివరికి డబ్బులు ఆశ చూపించి ఐనా. బుద్ధిజం వారి కర్మ కాండలు చైనా లో… అబ్బో! అన్ని మతాలూ చెడ్డవా? ఒక్క విషయం ఇక్కడ కామన్… మనిషి. మనిషి దొంగనాయాలు. వాడి చెడుతనం వల్ల మతం చెడింది కానీ… మతం వలన చెడలేదు. మతం లోని అంశాలను వాడు తప్పు గా వాడుకున్నాడు. వర్ణా లను కులాలౌ చేసి హింసించాడు.
  కానీ దేవుడు మాత్రం – అందరి దగ్గరకూ వచ్చాడు. శంకరాచార్యుల కి, భక్తాగ్రేసరుడు కన్నప్ప కి – తేదా చూపించనే లేదు. ఆయన అందరి దగ్గరికీ వచ్చాడు.
  చేసిన తప్పు మనిషిది. మతానిది కాదు. మతాన్ని ఏమీ అనద్దు. ఏ మతం ఐనా సరే.

  4. <<<>>>
  (శ్రమ దోపిడితో బతికిన ఆధిపత్య వర్గాలకు మతం ఒక పని ముట్టుగా ఉపయోగపడుతూ వచ్చిందన్నది చారిత్రక సత్యం.)

  ఈ విషయం నేను పైన ప్రస్తావించాను.
  చిన్న కరెక్షన్. మతం ఒక పని ముట్టుగా తనంతట తాను ఉపయోగపడలేదు. మనిషి దానిని ఉపయోగించుకున్నాడు – కుబుద్ధితో. అయిన్-స్టీన్ ఇచ్చిన సిద్ధాంతం తో అటామిక్ బాంబ్ చేశారు. ఇప్పుడు మీరు శాస్త్రాన్ని తిడతారా? లేక దానిని చెడ్డగా వాడుకున్న మనిషిని తిడతారా?
  శాస్త్రం ఎప్పుడూ మంచిదే. దానిని వాడుకునే “మనిషి” ని బట్టి ఫలితాలుంటాయి.

  5. <<<>>>
  (అణచివేతలకు గురవుతున్న ప్రజల తరపున పుట్టిన క్రిష్టియన్, ముస్లిం మతాలు త్వరలోనే అణచివేతదారుల చేతుల్లోకి వెళ్లిపోయాయి.)

  “అణచివేతలకు గురవుతున్న ప్రజల తరపున పుట్టిన క్రిష్టియన్, ముస్లిం మతాలు” <- ఈ లైన్ చాలా బాగుంది. చరిత్ర అలానే ఉంది. యూదుల నుంచి వచ్చిన స్వాతంత్ర్యం. కానీ క్రైస్ట్ కి తెలియదు క్రిస్టియానిటీ ఒకటి ఏర్పడుతుంది అది నాశనం ఐపోతుంది ఈ మనిషి దురాచరణ వలన అని. మొహమ్మద్ కి కూడా.

  <>
  (హిందూ మతం మాత్రం పుట్టడమే ఆధిపత్య వర్గాల కోసం పుట్టిందని)

  నేనంటానూ… “కసబ్ గాడు మాత్రం పుట్టడమే మనుషుల్ని చంపటానికి పుట్టాదు.”
  ఈ రెండు వాక్యాల్లో నూ సారూప్యత ఉంది. అదేంటంటే ఎంఫసిస్. ఎంఫసిస్ దేని మీద ఉంది? మీకు ఇది అర్ధం చసుకోవటం కష్టం కాదు.
  వర్ణ వ్యవస్థ – ఒసు – అనే క్రిస్టియన్ లకు కూడా ఉంది. ప్లీస్ వికీ.

  నైసర్ అనే అంతర్జాతీయ ప్రొఫెసర్ ….

  The text, I paste here: “For example, Neisser notes that although the word caste is usually associated with India, India is not the only such society. Numerous other countries have caste-like minorities, who have been ostracized, discriminated, denied civil rights, forced to sit in the back of bus, asked to use designated toilets, considered impure or shunned in recent human history. Examples include Burakumin in Japan, Jews in certain parts of Europe, Afro-Americans in the United States, Oriental Jews in Israel, Al-Akhdam of Yemen, Baekjeong of Korea, Midgan of Somalia, Osu in Nigeria and West Indians in Great Britain.\ The extent of discrimination, exclusion, segregation and the details differed; for example, Maoris in New Zealand suffered less than Stolen Generations of Aborigines in Australia under the Half-Caste Act where children were systematically and forcibly removed from their parents, so that the British colonial regime could protect the children from their so-called inferior parents.”

  [() ఈ బ్రాకెట్లలో ఇచ్చినవి నా వ్యాఖ్య నుండి చందు గారు ఉటంకించినవి. పబ్లిష్ అవుతున్నపుడు కేరెక్టర్ల మధ్య ఉన్న అక్షరాలు మిస్ అయినందున కింద చందు గారి పునరుల్లేఖన ఆధారంగా మళ్ళీ కాపీ పేస్ట్ చేసాను -విశేఖర్]

  Contd…

 7. Contd…5. <<<>>>
  వీటన్నిటినీ నేను కాదనను. నేను ఏ మతాన్నీ వెనకేసుకు రావటం లేదు. నేను చెప్పేది ఒకటే… ఏ మతం ఐనా చెప్పేది మంచే… కానీ దానిని ఆచరించిన మనిషి వలన ఫలితాలు వేరు గా ఉన్నాయి. యెస్. మీరు చెప్పేది నిజమే.

  7. <<<>>>
  (మతం ఒక మానసిక భావన. మానసిక భావనలు ఉండేది మనిషికే. కనుక మతం పేరుతో మనుషులు చేసే చర్యలకు మతమే బాధ్యత వహించక తప్పదు.)

  బాస్… ఇది చాలా అడ్డగోలు గా ఉంది. మానసిక భావనలు ప్రతీ ప్రాణికీ ఉన్నాయి.
  మీరు చెప్పింది ఎలా ఉందంటే… వర్షం పడ్డప్పుడు నదులు పొంగటం సహజం. నదులు పొంగి నా ఊరిని ముంచేశాయి. పొంగింది నది కనుక … అదే భాద్యత వహించాలి అంటే ఎలా? దేనికి బాధ్యత వహించాలి? నది పొంగకుండా ఆనకట్ట కట్టు. గట్టు వేస్కో. మానసిక భావన! నీ మనసు అర్ధం లేకుండా ఆలోచిస్తే తప్పు మతానిదా – అది కూడా ఒక మానసిక భావన అయ్యింది కనుక? అస్సలు అర్ధం లేదు బాస్… మీరు చెప్పింది. మనిషి చేసే పనులకు మనిషి మాత్రమే బాధ్యత వహించాలి. మనిషికి వివేకం ఉంది. మతం చెప్పిన వివేకాన్ని నీ మనసుకు ఎక్కక – తప్పు చేస్తే మతం తప్పు చేసినట్టా? మందు తాగద్దు అని మతం చెప్పిందనుకోండి. మనం మందు తాగాం అనుకోండి. మనసు అధీనం లో ఉండదు. ఇది ఎవడి తప్పు? మతం వివేకం చెప్పింది. నువ్వు ఆచరించలేదు.

  రెండూ మానసిక భావనలైనంత మాత్రాన… మతం బాధ్యత వహించాలా? నీ మనసుని, వివేకాన్ని అధీనం లో ఉంచుకోవలసిన బాధ్యత నీదే!

  8. <<<>>>
  ( కులం గురించీ, శ్రామికుల గురించీ చర్చించడానికి విజనరీ యే కావాలంటారా? మామూలు మనుషులంగా, కుల సమాజంలో బతుకుతున్నవారిగా కుల సమస్యను, అస్పృశ్య సమస్యను చర్చించలేమా? చర్చించవచ్చని నా అభిప్రాయం.)

  లేదు… విజనరీ కావలసిన పని లేదు. నేను ఈ రోజుల్లో “కొంతమంది” కి ఉన్న ఫేషన్ గురించి ప్రస్తావించా. అంతే. ఆ ఫేషన్ మీకు లేకపొతే మీరు నిజం గా ఉత్తములు. కొంత మంది కి వీటి గురించి గుంపు లో మాట్లాడి ఇన్-స్టెంట్ రికగ్నిషన్ కోసం తాపత్రయపడతారు. నిజంగా ఆ మాట్లాడేవాడికి తర్కం, ఆలోచన, విచక్షన ఉన్నాయని నేననుకోను. తెలిసిపోతుంది అసలు వాడు నోరు ఎత్తి మాట మొదలు పెట్టగానే.
  – చర్చించవచ్చు. నొ ప్రాబ్లం.

  నేను మీకు ఇస్తాను అన్న లింక్స్ వెంటనే ఇస్తా.

  చందు

  [() ఈ బ్రాకెట్లలో ఇచ్చినవి నా వ్యాఖ్య నుండి చందు గారు ఉటంకించినవి. పబ్లిష్ అవుతున్నపుడు కేరెక్టర్ల మధ్య ఉన్న అక్షరాలు మిస్ అయినందున కింద చందు గారి పునరుల్లేఖన ఆధారంగా మళ్ళీ కాపీ పేస్ట్ చేసాను -విశేఖర్]

 8. చందు గారు, <> ఈ కేరక్టర్ల మధ్య ఉంచిన అక్షరాలు ప్రచురణ తర్వాత మిగలడం లేదు. ఒకే దిశలో (>> ఇలా) ఉంచినపుడు ఉంటున్నాయి. బహుశా కోడ్ వలన అయి ఉండవచ్చు. మీరు పైన ఒకటి నుండి ఎనిమిది వరకు కోట్ చేసినవి మరొకసారి ఇవ్వగలరేమో ప్రయత్నించండి. మీరు ఏవి కోట్ చేసారో నాకు అర్ధం అయింది. ఇతర పాఠకుల కోసం అడుగుతున్నాను.

 9. Yeah… here I paste the text …
  1. శ్రామిక వర్గాన్ని హింసించే సంఘటనలు ప్రతి మతంలోనూ ఉన్నాయన్నది నిజం. మతానికీ దానికీ సంబంధం లేదు అనేకన్నా, మతాల్లో శ్రమ దోపిడి కి పరిష్కారం లేదు అనడం సబబుగా ఉంటుంది.

  2. మతాలు వేరు, వాటిని అనుసరించే మనుషులు వేరు అని మీ వ్యాఖ్య ప్రధానంగా చెబుతోంది. మతాలన్నీ మంచే చెబితే దాన్ని అనుసరించే మనుషులు చెడు చేయడం తర్కించ వలసిన విషయం. మనుషుల నుండి వేరుగా ఉన్నట్లయితే మతమైనా మరేదయినా వృధా కాదా?

  3. ఎన్ని నీతులైనా చెప్పచ్చు, ఎన్ని బోధలైనా చెయ్యొచ్చు, వాటిని మనిషి చేత ఆచరింపజేయలేనప్పుడు ఎందుకవి? పుస్తకంలో ఉన్న శాస్త్రం మనుషుల మధ్య లేనపుడు అది శాస్త్రమేనా?

  4. శ్రమ దోపిడితో బతికిన ఆధిపత్య వర్గాలకు మతం ఒక పని ముట్టుగా ఉపయోగపడుతూ వచ్చిందన్నది చారిత్రక సత్యం.

  5. అణచివేతలకు గురవుతున్న ప్రజల తరపున పుట్టిన క్రిష్టియన్, ముస్లిం మతాలు త్వరలోనే అణచివేతదారుల చేతుల్లోకి వెళ్లిపోయాయి.
  Sub 5: హిందూ మతం మాత్రం పుట్టడమే ఆధిపత్య వర్గాల కోసం పుట్టిందని

  6. I missed it 🙂 😉

  7. మతం ఒక మానసిక భావన. మానసిక భావనలు ఉండేది మనిషికే. కనుక మతం పేరుతో మనుషులు చేసే చర్యలకు మతమే బాధ్యత వహించక తప్పదు.

  8. కులం గురించీ, శ్రామికుల గురించీ చర్చించడానికి విజనరీ యే కావాలంటారా? మామూలు మనుషులంగా, కుల సమాజంలో బతుకుతున్నవారిగా కుల సమస్యను, అస్పృశ్య సమస్యను చర్చించలేమా? చర్చించవచ్చని నా అభిప్రాయం.

  chandu

 10. విశేఖర్ గారూ,
  చందు గారు ఈ కథనంలో ప్రస్తావించిన అంశాలను చూశాను. కుల వివక్షత అనేక రూపాల్లో అనేక చోట్ల ఉందంటూ ఆయన ఇచ్చిన ఇంగ్లీష్ కొటేషన్ ఆలోచించదగిన విషయమే. కాని వర్ణధర్మం సహజమైన ధర్మంగా భావించడం, వర్ణవ్యవస్థ వివక్షా వ్యతిరేకమైనదిగా భావించడం చరిత్రకు భిన్నమైన భావనే అనుకుంటాను.

  వర్ణవ్యవస్థను కలిగి ఉన్న సమాజం మనుషులందరినీ సమానులుగా గుర్తించలేదు.
  దళితులకు వ్యతిరేకంగా అన్ని కులాలవారు ఏకం కావడానికి వర్ణధర్మ భావజాలమే కారణం.
  నేటి సమాజం వర్ణాలుగా విభజించబడి లేనప్పటికీ కులవ్యవస్థ దైవసృష్టి అనే భావనలో వర్ణధర్మం దాగి ఉంది.

  బాలగోపాల్ గారు దళిత సమస్యపై వివిధ సందర్భాల్లో పలు రచనలు చేశారు. ఆధునిక తెలుగు సమాజంలో సైతం కులం ఒక సజీవ సామాజిక సంబంధంగా, హింసా దౌర్జన్యాలు సాగించే పనిముట్టుగా.. అధికారాన్ని సంపదను, హోదాను సమకూర్చే సాధనంగా భిన్నరూపాల్లో ఎలా
  పనిచేస్తున్నదో బాలగోపాల్ దళిత సమస్యపై తాను రాసిన అనేక రచనల ద్వారా చూపించారు. కులం ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థతో మిళితమై, మళ్లీ కొత్తరూపాల్లో జీవం పోసుకున్న తీరును చూపించడంమే బాలగోపాల్ రచనల్లో ప్రత్యేకత.

  ఆయన పాతికేళ్లపాటు దళిత సమస్యపై తెలుగులోరాసిన అనేక రచనలను కింది లింకులో చూడండి,

  Click to access 6.DALITA.pdf

  అనే లింకులోంచి ఈ పుస్తకాన్ని డౌన్‌లోడ్ చేసుకోగలరు. ముఖ్యంగా ఈ పుస్తకంలోని కుల సమస్య రాజకీయ దృక్పథం అనే వ్యాసాన్ని తప్పక చదవండి.

 11. Chandu గారూ, మతమనేది మంచి గంధమో, మత్తుమందో దాని ప్రభావం చూసే నిర్ణయించాలి!
  మనిషి పుట్టకముందునుంచీ మొదలుపెట్టి చచ్చిపోయాక కూడా వదలకుండా వెంటాడే మతం మనిషిని మంచిగా మార్చటంలో ఏమీ చేయలేకపోతోందా? మతం ఒప్పుల కుప్ప అయితే దాని ప్రభావం ప్రతి మలుపులో అవిభాజ్యమైపోయిన మనిషి మాత్రం మీ దృష్టిలో దుర్మార్గుడెందుకవుతున్నాడు?

 12. మతం మనిషిలో నీతిని పెంచుతుందనేది మత గురువులు చెప్పే మాట. వాస్తవానికి మతం వేరు, నీతి వేరు అని మత భక్తులే ప్రవచించడం కనిపిస్తోంది. సోమవారం, శనివారం తప్ప మిగితా రోజులు నాన్ వెజ్ కక్కుర్తి పడి తినే మత భక్తులని చాలా మందిని చూసిన అనుభవంతో కూడా చెప్పగలను.

 13. @Venu Ch garu: “మనిషి పుట్టకముందునుంచీ మొదలుపెట్టి చచ్చిపోయాక కూడా వదలకుండా వెంటాడే మతం మనిషిని మంచిగా మార్చటంలో ఏమీ చేయలేకపోతోందా? ”
  —– నాకు దేవుడి గురించి అర్ధం కానివి చాలా ఉన్నాయండి. అది కొరకరాని కొయ్య. అలా అని కష్టం కూడా కాదు. మనిషికి మతం ఏ మతం అవసరం లేదు. ఏ మతం ఐనా సరే.
  నేను నా బ్లాగ్ లో ఇలా రాశానండి… ఒక మనిషి అడవి లో పుట్టాడు. అమ్మా నాన్నా ఎవ్వరూ లేరు. వాడికి ఈ దరిద్రమైన మనుష్య ప్రపంచం తో అస్సలు సంబంధం లేదు. వాడి బ్రతుకు వాడు బ్రతికాడు. దేవుడి గురించి కానీ… వాడిని పూజించాలి అని కానీ ఏమీ తెలియదు. వాడు మరణించాక వాడికి ఉత్తమ గతులుంటాయా లేదా? – ఖచ్చితంగా ఉండాలి. అన్నింటికంటే – వాడికి మతం అనేది ఒకటుందని అస్సలు తెలియదు.

  మరొక విషయం… నేను దేవుడిని దూషించను, పూజించను, అస్సలు పట్టించుకోను. నాకు దేవుడు ఉన్నా ఒకటే – ఆయన లేకపోయినా ఒకటే. కానీ నా పుట్టుకతో సహజం గా వచ్చిన కొన్ని ఫీలింగ్స్ – ఆనందన్, బాధ లు – అన్ని ప్రాణులకూ ఉంటాయని అర్ధం చేసుకోని నేను ఎవ్వరినీ నొప్పించకుండా చేతనైనంత సహాయం చేస్తూ… స్నేహితుడు ఏడిస్తే వాడితో కలిసి ఏడ్చి వాడితోనే కూర్చొని సమస్య పరిష్కరిస్తూ… చుట్టాలతో అందరితో హాయిగా ఉంటూ, ఎవరు నన్ను బాధ పెట్టినా పెద్ద మనసుతో వాళ్ళని క్షమిస్తూ చనిపోయాననుకోండి… ఒక వేళ దేవుడు, స్వర్గం ఉంటే… నాకు ఉత్తమ గతులు రావా?

  దేవుడిని మనం చాలా తప్పు గా వాడుకుంటున్నాం. కులం పట్టి బుద్ధి ఉండదు. ప్రతి కులం లోనూ తుక్కు నాయాళ్ళున్నారు. మంచి వాళ్ళున్నారు. ఆ తుక్కు నాయాళ్ళు వాళ్ళకి తగ్గట్టు మతాన్ని వాడుకున్నారు. ఏ దేశ చరిత్రలోనైనా ఇది నిజం. కులం కాకపోతే మతం. దేవుడు అందరి సొత్తు.

  మతం ఎప్పుడూ మనిషి వెంట పడదు. అలా మనుషుల వెంట పడి ఆకర్షించే మతమే ఉంటే అది మతం కాదు. దెయ్యం. ఆనందన్ని ఇవ్వలే ని మతం వద్దు.

  కానీ… ఎవ్వరు ఏమి చెప్పినా నేను గట్టిగా నమ్మేది ఒకటే… మనిషిని మనిషిగా చూడమే ఏ మతం ఐనా చెప్పింది. ప్రతి ఒక్కడికీ బాధ, సంతోషం ఒక్కతే. అది ఎరిగి మనం నడుచుకోవాలి. మనిషి వలన మతం చెడింది. మతం చెప్పిన “అసలు విషయాల” వలన చెడిన కొడుకు ఎవ్వడూ లేడు.

  ఒక వేళ నీకు మతం హెల్ప్ చెయ్యట్లేదు అనుకుంటే… మతం మూలాలకు వెళ్ళి వెతుకు. అప్పటికీ హెల్ప్ చేయలేదు అనుకుంటే… అది సమాజం తప్పు. ఎందుకంటే సమాజం వలన మతం చెడింది కాబట్టి.

 14. @Venu Ch: మతం ఒప్పుల కుప్ప అయితే దాని ప్రభావం ప్రతి మలుపులో అవిభాజ్యమైపోయిన మనిషి మాత్రం మీ దృష్టిలో దుర్మార్గుడెందుకవుతున్నాడు?

  —- మతం ఒప్పుల కుప్ప అయితే దాని ప్రభావం ప్రతి మలుపులో అవిభాజ్యమైపోయిన మనిషి మాత్రం మీ దృష్టిలో దుర్మార్గుడెందుకవుతున్నాడు?

  మనిషి ఎందుకు దుర్మార్గుడౌతున్నాడంటే… వాడు ఇంకొకడిని ఇబ్బంది పెడతాడు కాబట్టి.
  ఒక విషయం చెప్పంది… దేవుడు ఇబ్బంది పెడతాడా? దేవుడు ఇబ్బంది పెట్టనప్పుడు, ఇంక మిమ్మల్ని ఇబ్బండి పెట్టే విషయం ఏంటీ? – ఐతే మీ మనసు. లేదా వేరొక మనిషి. అందులోనూ… మతం చెప్పిన మంచిని వదిలేసి మరీ ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి మనిషే దుర్మార్గుడు. ఇందులో పెద్ద ఆలోచించవలసిన విషయం ఏముంది?

  నేను దీనిని ఏ మతం విషయం లో ఐనా సమర్ధించగలను. ఎక్కడ మనుషులుంటే అక్కడ జాతులు ఏర్పడతాయి. ఎందుకంటే… మనిషి వేరొక వాడిని అధీనం లో ఉంచుకోవాలని తాపత్రయ పడతాడు. దానివలన దేవుడికి వేరొక మనిషికీ దూరం ఐపోతున్నాడన్న విషయన్ని గ్రహించడు. దీనికీ కారణం ఉంది. ఈ ఆలోచన వాడికీ ఉంటుంది… నేను దూరం ఔతున్నాను అని… కానీ ఈ పైన చెప్పిన తాపత్రయం ఈ ఆలోచనని అధిగమిస్తుంది. ప్రతీ మతం లో నూ జరిగేది ఇదే. అందుకే కులాలేర్పడ్డాయి. హిందూ మతం దరిద్రమా అని వర్ణాలు కాస్తా కులాలైనాయి. వర్ణాలకు, కులాలకూ తేడా నేను త్వరలోనే చెప్తానండి.

  మనిషి బ్రతుకు చాలా సులువైనది… చాలా కష్టమైనదీ కూడా… కాకపోతె… It entire depends on his perception and practice.

  కానీ… ఇదే విషయాన్ని కష్టాలలో ఉన్న వాడికి చెపితే చెప్పు తీసుకొని కొడతాడు.
  ఉపనిషద్ లలో ఉన్నది ఇదే… కష్టం వచ్చిన వాడి కి సాయం చెయ్యి. కానీ దేవుడి గురించి మాట్లాడకు అని. హిందూ ధర్మం చాలా లోతైన విషయం సార్. తెర లు తెర లు గా ఉంటుంది. ఉల్లి పాయ లాగా. మనందరికీ చాలా సుళువైన మార్గాలు మాత్రమే మిగిలాయి. నిజం గా ఎవడికి వాడు అంతర్ముఖుడు కావాలని ఉపనిషద్స్ చెప్తాయి. అప్పుడు సోహం…నేనే దేవుడు అని అర్ధం ఔతుంది అంటాడు… ఉపనిషద్కారుడు. అక్కడ నేనే దేవుడు అంటే – దేవుడి మొదటి కర్తవ్యం కష్టాలను తీసెయ్యటం. ఈ విషయం నాకు ఎందుకు నచ్చిందీ అంటే… వేరొక దేవుడు ఎవ్వడూ లేడు… నువ్వే దేవుడై సాటి మనిషి కి సాయం అని చెప్పినట్టుంటుంది.

  మన సమాజం చెడింది సార్. లేకపోతే హైందవ ధర్మం చెడు చెప్తుందా? ఆలోచించండి. చెడిన సమాజం దానిని తప్పుగా ప్రజల ముందుంచుంది. ప్రజలు ఎప్పుడూ వాడి కష్టాల ను దాటాలి అని అనుకున్నాడే కానీ… పాపం వాడికి సరిగ్గా మనసు నిలకడగా ఉంచి హాయిగా పూజించే టైం ఎక్కడుంది?

  ప్రతీ మతమూ మంచిదే సార్. ఇప్పుడు అమెరికాకి వెళితే వర్ణ-వివక్ష లేదా? నల్లవాళ్ళని ఎలా చూస్తారు వాళ్ళు? పాపం… వాళ్ళల్లో కూడా మంచి వాళ్ళు లేరా? మరి క్రిస్టియానిటీ అధికంగా ఉన్న వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు? జీసస్ తన రక్తం మానవాళిని శుభ్రం చేస్తుందని ప్రాణాలు విడిస్తే ఈ ముండా కొడుకులు అలా ప్రవర్తిస్తారా?

  మనిషి బాస్… మనిషి లో తేడా! మతం ఎప్పుడూ మంచిదే.

  Chandu

 15. @ ప్రవీణ్ గారు: మతం మనిషిలో నీతిని పెంచుతుందనేది మత గురువులు చెప్పే మాట. వాస్తవానికి మతం వేరు, నీతి వేరు అని మత భక్తులే ప్రవచించడం కనిపిస్తోంది. సోమవారం, శనివారం తప్ప మిగితా రోజులు నాన్ వెజ్ కక్కుర్తి పడి తినే మత భక్తులని చాలా మందిని చూసిన అనుభవంతో కూడా చెప్పగలను.

  పైన చెప్పిన విషయం మళ్ళీ చెప్తానండీ. మీరు “నీతిని పెంచుతుంది” అన్నారు. అంటే నీతి అనేది ఒకటుంది గా – సహంజా, స్వతహాగా – మనిషికి. మతం దానిని పెంచటానికి తోడ్పడుతుంది. ఏ మతం ఐనా.

  – మన దగ్గర బస్సు (మతం) ఉంది. మనం ఎగుడు దిగుడుల దారి ని దాటాలి. డ్రైవర్ (మనిషి) లేనిదే బస్సు నడవదు. కానీ బస్సు లేకపోయినా మనిషి నడిచి వెళ్ళగలడు. బస్సు అవసరం లేదు. ఆ బుద్ధి (నీతి) నా దగ్గర ఉంది – సహజంగా.

  మతం మనిషికి ససేమిరా అవసరం లేదు. కాకపోతే అది మనసును పెంచుతుంది. బుద్ధి ని పెంచుతుంది. హాయి గా జీవితాన్ని దాటే మార్గాలను చూపిస్తుంది. మనిషి మనిషి గా… సమాజం లో ఒక బాధ్యత ఉన్నవాడిగా ఉండటానికి తోడ్పడుతుంది.
  మనిషి ఆచరణ ముఖ్యం.
  ఇది ఎలా అంటే… టీచర్ గారు తిడతారు… గొడవ చేయకు అని.. కానీ పిల్లవాడి వయసు బుద్ధి ఏంటి – గొడవ చేయటం – ఆటకాఇ తనం. కొంచం వయసు పెరిగి “మంచి బుద్ధి” వస్తే తరువాత వాడే చిరు నవ్వు నవ్వుకోని కొంచం బాధ పడి… వాడి కొడుకు కి కూతురుకీ చెప్తాడు… టీచర్ గారు చెప్పింది చేయండి అని… అదే వయసు పెరిగినా బుద్ధి రాని వాడు “టీచర్ ని మనం లెక్క చేసిందే లేదు. రాజా. నేను క్లస్ లో రాజ అంటాడు.” ఇదే తేడా.

  మతం వేరు, నీతి వేరు అంటే మీరెలా నమ్మారు సార్? అది బుద్ధి తక్కువ వ్యాఖ్య కదా? అలాంటి వాడిని అక్కడే కొట్టాలి. ఎందుకంటే తప్పుడు వ్యాఖ్య వలన మళ్ళీ మతానికి చెడ్డ పేరు. ikkaDa kooDaa maniShae cheDDa vaaDu.

  — సోమవారం, శనివారం తప్ప మిగితా రోజులు నాన్ వెజ్ కక్కుర్తి పడి తినే మత భక్తులని చాలా మందిని చూసిన అనుభవంతో కూడా చెప్పగలను.
  ఇది చాలా తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ – జీవ హింస పాపం. అందులోనూ సబ్సిడీ. శంకరాచార్యుల వారు చెప్పారు గా… మాంసం ముట్టద్దు అని… మరి పాటించలేదే? ఇక్కడ మతం మంచే చెప్పింది. మళ్ళీ అది మనిషి వలననే ఆచరణ లో లేదు. సో… మీరే ప్రూవ్ చేశారు నా మాటని – ‘మతం మంచిదే. మనిషి దొంగనాయాలు.’

  చందు

 16. ఇంకొక విషయం నాకు గట్టిగా మనసులో ఎప్పుడూ ఉంటుంది…
  ఏ మతం ఐనా, ఏ జాతి ఐనా, ఏ వర్ణం ఐనా, ఏ కులం ఐనా, ఏ గుంపైనా, ఏ ఇల్లైనా, ఏ మనిషిలో ఐనా…. చెడు, మంచి రెండూ ఉంటాయి.

  అణగదొక్కపడినవాడు, పాపం వాడేం చెయ్యగలడు. భయపడతాడు. ఏడుస్తాడు. ఇంక భరించలేనప్పుడు, ఎదురు తిరుగుతాడు. విప్లవం ఫలిస్తే సుఖిస్తాడు. లేకపోతే మళ్ళీ షరా మామూలే. ఇది ఏ దేశ చరిత్ర లో లేదు? ఇక్కడ మతం పోషించిన పాత్ర ఏదైనా ఉంటే మంచి చెప్పటం మాత్రమే.
  కానీ మనుషులు మాత్రం కష్టపడ్డారు, కష్టపెట్టారు. మతం చెప్పింది వినలేదు. కష్టపడిన వాళ్ళు దేవుడిని పూజించారు సుఖాలకోసం. పాపం – సుఖాల కోసం కాదు, కష్టాలను మాత్రం తొలగించమని. కొంతమంది దేవుడిని తిట్టి నాస్తికులైనారు. కొంతమంది సిద్ధాంతాలను రాశారు.

  ఎన్ని దేశాలలో ఎన్ని మతాలున్నాయ్? ఎన్ని జాతులున్నాయ్? మరి ఎవ్వరూ సుఖం గా లేరే? ఎందుకంటే మనిషి మనిషిని హింసించాడు. ఇందులో హిందూత్వాన్ని అనాల్సిన పనే లేదు. నేను ఇలా రాసినంత మాత్రాన హిందూత్వ వాదిని కాదు. నేను మాత్రం ఏ మతాన్నీ వెనకేసుకు రాను. ఏ మతాన్నీ పొగడను. తిట్టాల్సొస్తే తిడతా. నిజం గా గొప్ప విషయం ఉంటే పొగుడుతా.
  chandu

 17. Chandu గారూ, మీ అభిప్రాయాల్లో పరస్పర వైరుధ్యాలు గమనించారా?

  ‘మనిషి వలన మతం చెడింది’ అంటారు ఒకసారి. ‘సమాజం వలన మతం చెడింది’ అని మరోసారి అంటారు. అంతటితో ఆగకుండా ‘మన సమాజం చెడిందం’టారు మరోసారి!

  దేవుడూ, స్వర్గ నరకాలూ, ఉత్తమ గతులూ… ఇవన్నీ ప్రబోధించే మతాలు వాస్తవాలే చెపుతున్నాయా? అని కూడా ఆలోచించి చూడండి!

  మరో విషయం- దేవుణ్ణి తిట్టేవారు నాస్తికులు కారు. తిట్టటం అంటే దేవుడి ఉనికిని అంగీకరించినట్టే. ‘లేని’ దైవాన్ని దూషించటంలో అర్థం లేదు కదా!

 18. @Venu Ch: 1. సమాజం. మనిషి. మీరు అడిగిన ప్రశ్న అస్సలు బాలేదు సార్. మనుషులైతే ఏంటి? సమాజం ఐతే ఏంటి? మనుషులందరి సమితే కదా సమాజం. They are so interdependant. మీరు ఈ ప్రశ్న ఎందుకు అడిగరో నాకర్ధం కాలేదు సార్.
  Yes…మన సమాజం చెడిందన్నాను. అందులో తప్పేముంది?
  మనిషి వలన సమాజం చెడింది కాబట్టే – సమాజం చెడింది అన్నాను. Why did they sound so different or absurd to you. మీరు నిజం గా దీని ని ఎందుకు మెన్షన్ చేశారో నాకు అర్ధం కాలేదండి.
  Please be more clear.

  2. You mentioned… దేవుడూ, స్వర్గ నరకాలూ, ఉత్తమ గతులూ… ఇవన్నీ ప్రబోధించే మతాలు వాస్తవాలే చెపుతున్నాయా? అని కూడా ఆలోచించి చూడండి!
  ఇవన్నీ మీరు లేవంటే నా వాదన కు ఇంకా మంచిది. ఎందుకంటే మనం మాట్లాడే మతాలు, దేవుళ్ళు అస్సలు లేవని దీనర్ధం కావచ్చు. సో… మతం అనేది లేకపోతే… “హైందవ విష నాగు” అనే మాటకు అర్ధం లేదు. సో… మతం ఎప్పుడూ మనిషిని చెడకొట్టలేదు. Thanks for asking this question.

  3. You said….మరో విషయం- దేవుణ్ణి తిట్టేవారు నాస్తికులు కారు. తిట్టటం అంటే దేవుడి ఉనికిని అంగీకరించినట్టే. ‘లేని’ దైవాన్ని దూషించటంలో అర్థం లేదు కదా!

  ఔను… దేవుణ్ణి తిట్టేవారు నాస్తికులు కారు. కరెక్టే… తొందర లో అలా రాశాను. నా భావన అర్ధం చేస్కుంటే చాలు. దేవుడిని నమ్మని వారు నాస్తికులు. సారీ! just understand the inner meaning. Yes, my statement about this is misleading, a little.

  Most importantly…. I don’t understand how above things fetched your interest.

  I request you all to read my comments from the context of this post title.

  Chandu

 19. రాజు గారు

  చందు గారు ఉటంకించిన నైసర్ కొటేషన్ ప్రకారం భారత దేశంలోని కుల వివక్ష ఇతర దేశాల్లో కూడా ఇతర రూపాల్లో ఉంది.

  ఇది పూర్తి నిజం కాదు. కనీసం పోల్చదగింది కూడా కాదు. అయితే ఈ వివక్షల అంతిమ ఫలితం వర్గ దోపిడిని లేదా ఆర్ధిక దోపిడి ని కొనసాగించడమే. శ్రామికులను వివిధ పేర్లతో విభజించి ఐక్యం కాకుండా చేస్తూ వర్గ దోపిడిని ప్రతిఘటన లేకుండా ఆధిపత్య వర్గాలు కొనసాగించగలుగుతున్నాయి. ఈ ఉమ్మడి లక్షణం వల్ల అవన్నీ ఒకటే అనో లేక ‘కులం లాంటి అణచివేత’ ఇతర చోట్ల కూడా ఉందనో చెప్పడానికి ఆస్కారం కలుగుతోంది.

  శ్రామికుల విభజన, ఆర్ధిక దోపిడి కి ఉపయోగపడడం అనేవి అన్ని వివక్షలకూ ఆపాదించగల ఉమ్మడి లక్షణాలు, ఈ సాధారణ ఉమ్మడి లక్షణాల ద్వారా వివక్షలు ఒకటే అని చెప్పడానికి వీలు కాదు.

  నిర్దిష్ట లక్షణాలను పరిశీలిస్తే కుల సమాజ లక్షణాలు ప్రత్యేకమైనవి. లెక్కకు మిక్కిలిగా గల కులాలు, దాదాపు ప్రతి కులానికీ తమ కింద మరొక కులం ఉందన్న సంతృప్తి, ఒక కులం నుండి మరొక కులానికి మారడానికి వీలులేని శాశ్వత అడ్డుగోడలు, అంబేద్కర్ చెప్పినట్లు పరస్పర విరుద్ధమైన ఎక్జోగమీ, ఎండోగమీ లను మిళితం చేయగలిగిన అ(సు)సాధ్యత, బాల గోపాల్ చెప్పినట్లు ఆధునిక ఉత్పత్తి వ్యవస్ధల్లోనూ చొరబడి నూతన శక్తిని సంతరించుకోవడం… ఇవన్నీ కుల సమాజ ప్రత్యేకతలే.

  ఆ మాటకొస్తే కుల వివక్ష, స్త్రీ వివక్ష లు కూడా ఒకటే అని చెప్పవచ్చు.

  మీరు చెప్పినట్లు వర్ణ వ్యవస్ధ కూడా మనుషుల సమానత్వాన్ని గుర్తించలేదు. నిజానికి మను స్మృతిలో గానీ, భగవద్గీతలో గానీ చెప్పిన విధంగా వర్ణ వ్యవస్ధ మక్కీకి మక్కీగా అప్పటికి సమాజంలో అమలులో ఉన్నదనీ, మరో విధంగా లేదనీ భావించలేము. వర్ణ విభజన విశాల ప్రాతిపదికన చేసిన సాధారణ విభజన కావచ్చు. వర్ణ విభజనలో పునాదులు లేకుండా ఒక్క సారిగా ఎవరో వచ్చి రుద్దినట్లు కుల విభజన జరగడం సాధ్యం కాదు కదా. వర్ణ విభజన అనేది సిద్ధాంతం అయితే, కుల వ్యవస్ధ దాని క్రమానుగత వాస్తవిక ఆచరణ. వర్ణ విభజన సామాజిక ఆచరణకు అనివార్య ఫలితంగానే కుల వ్యవస్ధను చూడాలి తప్ప ఒకదాని కొకటి పూర్తి భిన్నమైనవిగా (ఒకటి మంచిది మరొకటి చెడ్డది గా) భావించలేము.

  కనుక హిందూ మతం భగవద్గీత ద్వారా ప్రభోధించిన వర్ణ వ్యవస్ధను ఆచరణీయంగానూ. ఆ తర్వాత మనుషుల చెడ్దతనం వల్ల వచ్చినది గనుక కుల వ్యవస్ధ మాత్రమే చెడ్డదిగానూ చందు గారు చెప్పినది వాస్తవ విరుద్ధం. అది కేవలం స్వీయాత్మక ఆలోచన మాత్రమే. కుల వ్యవస్ధను సమర్ధించుకోలేక అలాగని విస్తృత ఆచరణలో ఉన్నందున దానిని వ్యతిరేకించనూ లేక హిందూ మత వాదులు చేస్తున్న ఎస్కేపిస్టు వాదనల్లో అదొక అంశం. (తాను హిందూమత వాదిని కానని చందుగారు చెప్పిన విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నాను.)

  కుల వ్యవస్ధ హిందూ మతం చెప్పలేదని చెప్పి తప్పుకోవడం చాలా తేలిక. కాని కుల వ్యవస్ధను హిందూ మతంలో భాగంగా సమర్ధిస్తూ వచ్చిన హిందూ ప్రముఖులు, మేధావులు, బోధకులకు కుల అణచివేతను హేతు బద్ధంగా సమర్ధించడం (ఆ మాటకొస్తే ఖండించడం కూడా) చాలా కష్టం. ఈ పరిస్ధితి నుండే కులాన్ని హిందూ మతం నుండి వేరు చేసి చూపడానికి సైద్ధాంతిక ప్రయత్నాలు జరుగుతున్నాయి. చందు గారి వాదనలన్నీ అందులో భాగమే. తాను హిందూ వాదిని కానని చెప్పినా చందుగారి వాదనల అంతిమ ఫలితం అదే.

  వేణు గారు చెప్పినట్లు మతం మంచిదా కాదా అన్నది ఆచరణలో దాని ప్రభావాన్ని చూసే నిర్ణయించాలి తప్ప పుస్తకాల్లో బోధనల్లో అలా లేదని తప్పించుకోరాదు. వేల సంవత్సరాల ఆచరణలో ఉన్నది బోధనల్లో లేదు కనుక మత ప్రభావం కాదని చెప్పడం బాధ్యతారాహిత్యం కూడా. హిందూమతాన్ని సమర్ధించుకున్న తర్వాత దాని ఆచరణ ఫలితానికి తప్పనిసరిగా బాధ్యత వహించాల్సిందే లేదా తగిన సమాధానం ఇవ్వవలసిందే.

  చందుగారు ఆచరణలోకి తెస్తున్న మనుషులదే తప్పు అనీ, వారే చెడ్డవారు అని పదే పదే చెబుతున్నారు. అంటే మతాన్నీ, మనుషులనూ విడదీస్తున్నారు. ఇది కరెక్టు కాదు. మతం అనే ఒక సిద్ధాంతం యొక్క బౌతిక రూపమే మనిషి ఆచరణ. రెండూ పరస్పర అవిభాజ్యాలు.

  ఒక వ్యక్తి ఆలోచన మంచిదే, అతని చేష్టలే చెడ్డవి అనడం సాధ్యమేనా? వ్యక్తి ఆలోచనకు ఆచరణాత్మక బౌతిక రూపమే అతని చేష్టలు. మతమూ అలాంటిదే. మతం అన్నది ఒక వ్యవస్ధలోని ఆధిపత్య వర్గాల సామూహిక ఆలోచన. దాని ఆచరణ రూపమే వివక్షా పూరిత పాలన.

  సరే. ఆలోచన గానీ, మత సిద్ధాంతం గానీ ఎక్కడ నుండి వస్తాయి? సమాజంలోని పరిస్ధితుల నుండి మనుషుల జ్ఞానేంద్రియాలద్వారా మానవ సమాజ ఉమ్మడి బుద్ధిపై పడిన ప్రతిబింబ ఫలితమే ఏ సామాజిక సిద్ధాంతం ఐనా. మతం కూడా మనుషుల కోసమే గనుక అది కూడా ఒక సామాజిక సిద్ధాంతమే. మనుషుల మధ్య ఉన్న ఉత్పత్తి సంబంధాలను ఆధిపత్య వర్గాలకు అనుకూలంగా సిద్ధాంతీకరించిన ఫలితమే మతాలు. మనిషి సామాజిక ఆచరణ ప్రతిబింబం అయిన మత సిద్ధాంతాలను మనిషి ఆచరణ నుండి వేరు చేయడం కరెక్టు కాదు. ఈ విషయాన్ని చందుగారు గుర్తించాలి.

 20. @కుల గర్భాలను వెతికి పెడుతున్నది విద్యాధికులైన డాక్టర్లే కావడం చేదు నిజం..

  ఏదో విషయం సొసైటీలోని దిగజారిపోతున్న విలువల గురించి మాట్లాడుతూ ఉండగా..అందరూ ఇంతేనా డాక్టర్ గారూ..అన్న నా మాటకు లేదండీ..
  మన సొసైటీ లో దీ వరస్ట్ అంటూ మొదలు పెడితే…మన డాక్టర్ల అంత చెండాలం మరోకళ్ళు ఉండరు…అన్ని చెంఢా….లపు పనుల్లో మన వాళ్ళంత(డాక్టర్లు) దారుణంగా మరొకళ్ళు ఉండరు…అన్నది ఆయన జవాబు..(మాఫియాలూ.. సారాకొట్ల లాంటి చెత్త తీసేయండీ..వాటి పుట్టుకే మనుష్యుల రక్తం తాగడం)

 21. విశేఖర్ గారూ,
  మీ సుదీర్ఘ వ్యాఖ్య చూశాను. చందు గారితో సహా ఈ కథనంలో వ్యాఖ్యలు కొనసాగించిన క్రమం చాలా సంయమనంగా నడిచింది. భిన్నాభిప్రాయాల మధ్యనే భావాలు పంచుకోవడం ఎలా సాగాలో చెప్పడానికి ఇది నిదర్శనం.

  పోతే….
  “నైసర్ కొటేషన్ ప్రకారం భారత దేశంలోని కుల వివక్ష ఇతర దేశాల్లో కూడా ఇతర రూపాల్లో ఉంది.”

  పోతే, నేను చందు గారు ప్రస్తావించిన కొటేషన్‌కు మాత్రమే పరిమితం కాలేదు. రేసిజం, వర్ణ వివక్షత, జాత్యహంకారం, సంబంధిత అసహనాలపై -intolerence?- యునైటెడ్ నేషన్స్ వరల్డ్ కాన్ఫరెన్స్‌కు గాను 2001లోనే హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్థ సమర్పించిన 90 పేజీల వ్యాసంలో ఇతర దేశాల్లో కుల వివక్షకు సంబంధించిన సమాచారాన్ని వివరంగా పొందుపర్చారు. ఇక్కడ పొందుపరుస్తున్న దానిలోని కొన్ని భాగాలు దీర్ఘంగానే ఉన్నప్పటికీ తప్పక పరిశీలించగలరు.

  ఆసియాలో చాలా ప్రాంతాల్లో, ఆఫ్రికాలోని కొన్ని భాగాల్లో కులం ఉనికిలో ఉందని, 25 కోట్లమందికిపైగా ప్రజలు ప్రపంచమంతటా అదృశ్య వర్ణ వివక్షత బారినపడి నలుగుతున్నారని ఈ నివేదిక చెబుతోంది. భారత్ లోనే కాకుండా నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్ వంటి దక్షిణాసియా దేశాల్లో, జపాన్ లోని బురాకు ప్రజలు, నైజీరియాలోని లొబు ప్రజలు, సెనెగల్, మౌరిటానియాలలోని కొన్ని బృందాలలో కూడా దళితులు లేదా అస్పృశ్యులుగా చెప్పబడుతున్నవారు ఉన్నారని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. ఇక్కడ వర్ణం కంటే కులం అనే భావనే ఈ నివేదికలో స్పష్టం చేయబడింది.

  అదే సమయంలో భారతీయ కులవ్యవస్థ ప్రపంచంలోనే అతి సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న సామాజిక అధికార క్రమం -hierarchy-గా ఉంటోందని, మతపరమైన పవిత్రత ప్రాతిపదికనే హిందూయిజంలో వివిధ బృందాలతో కూడిన సంక్లిష్ట క్రమంగా కులం ఏర్పడుతోందని ఈ నివేదిక పేర్కొంది కూడా.

  CASTE DISCRIMINATION: A GLOBAL CONCERN
  http://www.hrw.org/legacy/reports/2001/globalcaste/
  “Discriminatory and cruel, inhuman, and degrading treatment of a vast global population has been justified on the basis of caste. In much of Asia and parts of Africa, caste is the basis for the definition and exclusion of distinct population groups by reason of their descent. Over 250 million people worldwide continue to suffer under what is often a hidden apartheid of segregation, modern-day slavery, and other extreme forms of discrimination, exploitation, and violence. Caste imposes enormous obstacles to their full attainment of civil, political, economic, social, and cultural rights.

  Caste is descent-based and hereditary in nature. It is a characteristic determined by one’s birth into a particular caste, irrespective of the faith practiced by the individual. Caste denotes a system of rigid social stratification into ranked groups defined by descent and occupation. Under various caste systems throughout the world, caste divisions also dominate in housing, marriage, and general social interaction-divisions that are reinforced through the practice and threat of social ostracism, economic boycotts, and even physical violence.

  Among the communities discussed in this report are the Dalits or so-called untouchables of South Asia-including Nepal, Bangladesh, India, Sri Lanka, andPakistan-the Buraku people of Japan, the Osu of Nigeria’s Igbo people, and certain groups in Senegal and Mauritania. The prominence of caste as a social and economic indicator for the widespread South Asian diaspora is also discussed. These communities share many features; features that have allowed even the most appalling practices to escape international scrutiny.

  In many cases, caste systems coexist with otherwise democratic structures. In countries such as India and Nigeria, governments have also enacted progressive legislation to combat abuses against lower-caste communities. Despite formal protections in law, however, discriminatory treatment remains endemic and discriminatory societal norms continue to be reinforced by government and private structures and practices, in some cases through violent means.”

  “Untouchability” and Segregation
  http://www.hrw.org/legacy/reports/2001/globalcaste/caste0801-03.htm#P133_16342
  “India’s caste system is perhaps the world’s longest surviving social hierarchy. A defining feature of Hinduism, caste encompasses a complex ordering of social groups on the basis of ritual purity. A person is considered a member of the caste into which he or she is born and remains within that caste until death, although the particular ranking of that caste may vary among regions and over time. Differences in status are traditionally justified by the religious doctrine of karma, a belief that one’s place in life is determined by one’s deeds in previous lifetimes.

  Traditional scholarship has described this more than 2,000-year-old system within the context of the four principal varnas, or large caste categories. In order of precedence these are the Brahmins (priests and teachers), the Ksyatriyas (rulers and soldiers), the Vaisyas (merchants and traders), and the Shudras (laborers and artisans). A fifth category falls outside the varna system and consists of those known as “untouchables” or Dalits; they are often assigned tasks too ritually polluting to merit inclusion within the traditional varna system.7 Almost identical structures are also visible in Nepal.8

  Despite its constitutional abolition in 1950, the practice of “untouchability”-the imposition of social disabilities on persons by reason of birth into a particular caste- remains very much a part of rural India. Representing over one-sixth of India’s population-or some 160 million people-Dalits endure near complete social ostracization. “Untouchables” may not cross the line dividing their part of the village from that occupied by higher castes. They may not use the same wells, visit the same temples, or drink from the same cups in tea stalls. Dalit children are frequently made to sit at the back of classrooms. In what has been called India’s “hidden apartheid,” entire villages in many Indian states remain completely segregated by caste.9″

  ఇంగ్లీష్ ఉల్లేఖనలు ఎక్కువ స్పేస్ తీసుకుంటే లింక్ మాత్రమే ఇచ్చి ఆ ఉల్లేఖనలను తీసేయగలరు.

 22. విశేఖర్ గారూ,
  మీ సుదీర్ఘ వ్యాఖ్య చూశాను. చందు గారితో సహా ఈ కథనంలో వ్యాఖ్యలు కొనసాగించిన క్రమం చాలా సంయమనంగా నడిచింది. భిన్నాభిప్రాయాల మధ్యనే భావాలు పంచుకోవడం ఎలా సాగాలో చెప్పడానికి ఇది నిదర్శనం.

  పోతే….
  “నైసర్ కొటేషన్ ప్రకారం భారత దేశంలోని కుల వివక్ష ఇతర దేశాల్లో కూడా ఇతర రూపాల్లో ఉంది.”

  నేను చందు గారు ప్రస్తావించిన కొటేషన్‌కు మాత్రమే పరిమితం కాలేదు. రేసిజం, వర్ణ వివక్షత, జాత్యహంకారం, సంబంధిత అసహనాలపై -intolerence?- యునైటెడ్ నేషన్స్ వరల్డ్ కాన్ఫరెన్స్‌కు గాను 2001లోనే హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్థ సమర్పించిన 90 పేజీల వ్యాసంలో ఇతర దేశాల్లో కుల వివక్షకు సంబంధించిన సమాచారాన్ని వివరంగా పొందుపర్చారు. ఇక్కడ పొందుపరుస్తున్న దానిలోని కొన్ని భాగాలు దీర్ఘంగానే ఉన్నప్పటికీ తప్పక పరిశీలించగలరు.

  ఆసియాలో చాలా ప్రాంతాల్లో, ఆఫ్రికాలోని కొన్ని భాగాల్లో కులం ఉనికిలో ఉందని, 25 కోట్లమందికిపైగా ప్రజలు ప్రపంచమంతటా అదృశ్య వర్ణ వివక్షత బారినపడి నలుగుతున్నారని ఈ నివేదిక చెబుతోంది. భారత్ లోనే కాకుండా నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్ వంటి దక్షిణాసియా దేశాల్లో, జపాన్ లోని బురాకు ప్రజలు, నైజీరియాలోని లొబు ప్రజలు, సెనెగల్, మౌరిటానియాలలోని కొన్ని బృందాలలో కూడా దళితులు లేదా అస్పృశ్యులుగా చెప్పబడుతున్నవారు ఉన్నారని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. ఇక్కడ వర్ణం కంటే కులం అనే భావనే ఈ నివేదికలో స్పష్టం చేయబడింది.

  అదే సమయంలో భారతీయ కులవ్యవస్థ ప్రపంచంలోనే అతి సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న సామాజిక అధికార క్రమం -hierarchy-గా ఉంటోందని, మతపరమైన పవిత్రత ప్రాతిపదికనే హిందూయిజంలో వివిధ బృందాలతో కూడిన సంక్లిష్ట క్రమంగా కులం ఏర్పడుతోందని ఈ నివేదిక పేర్కొంది కూడా.

  CASTE DISCRIMINATION: A GLOBAL CONCERN
  http://www.hrw.org/legacy/reports/2001/globalcaste/
  “Discriminatory and cruel, inhuman, and degrading treatment of a vast global population has been justified on the basis of caste. In much of Asia and parts of Africa, caste is the basis for the definition and exclusion of distinct population groups by reason of their descent. Over 250 million people worldwide continue to suffer under what is often a hidden apartheid of segregation, modern-day slavery, and other extreme forms of discrimination, exploitation, and violence. Caste imposes enormous obstacles to their full attainment of civil, political, economic, social, and cultural rights.

  Caste is descent-based and hereditary in nature. It is a characteristic determined by one’s birth into a particular caste, irrespective of the faith practiced by the individual. Caste denotes a system of rigid social stratification into ranked groups defined by descent and occupation. Under various caste systems throughout the world, caste divisions also dominate in housing, marriage, and general social interaction-divisions that are reinforced through the practice and threat of social ostracism, economic boycotts, and even physical violence.

  Among the communities discussed in this report are the Dalits or so-called untouchables of South Asia-including Nepal, Bangladesh, India, Sri Lanka, andPakistan-the Buraku people of Japan, the Osu of Nigeria’s Igbo people, and certain groups in Senegal and Mauritania. The prominence of caste as a social and economic indicator for the widespread South Asian diaspora is also discussed. These communities share many features; features that have allowed even the most appalling practices to escape international scrutiny.

  “Untouchability” and Segregation
  http://www.hrw.org/legacy/reports/2001/globalcaste/caste0801-03.htm#P133_16342
  “India’s caste system is perhaps the world’s longest surviving social hierarchy. A defining feature of Hinduism, caste encompasses a complex ordering of social groups on the basis of ritual purity. A person is considered a member of the caste into which he or she is born and remains within that caste until death, although the particular ranking of that caste may vary among regions and over time. Differences in status are traditionally justified by the religious doctrine of karma, a belief that one’s place in life is determined by one’s deeds in previous lifetimes.

  ఆంగ్ల ఉల్లేఖనలు ఎక్కువయ్యాయనుకుంటే లింకులు మాత్రమే ఉంచి కొటేషన్లు తీసేయగలరు.

 23. చందుగారు ‘మతం చెడ్డది కాదు. మతంలోని మంచిని పాటించని మనిషే చెడ్డవాడు’ అనే భావనను తన వ్యాఖ్యలన్నింటిలోనూ కేంద్ర స్థానంలో ఉంచుతూ వచ్చారు.

  కాని వివిధ వర్ణాలుగా, కులాలుగా మనుషులను చీల్చిన ఘనత ప్రధానంగా మతానిదే అయినప్పుడు మనిషిలోని చెడ్డనే ప్రధానంగా తీసుకోవడం అంటే రెండువేల సంవత్సరాల మన సామాజిక వాస్తవాన్ని లెక్కించకపోవడమే అవుతుంది. అలాగే ఆయన ప్రస్తావించిన ఉపనిషత్తులలో కొన్ని ఆ కాలపు పరిమితుల్లోనే అయినప్పటికీ భౌతికవాదపు చింతనను స్పష్టంగా ప్రకటించాయి. ఇవి మత లేదా భావవాద చింతనలో భాగం కావు. ఆ పరిమిత స్థాయిలోని భౌతికవాద ప్రతిపాదనలను కూడా డామినేట్ చేసిన క్రమంలోనే, భారతదేశంలో వర్ణ, కుల వ్యవస్థలు వేల సంవత్సరాలుగా పటిష్టంగా కొనసాగుతూ వచ్చాయి.

  “సోమవారం, శనివారం తప్ప మిగతా రోజులు నాన్ వెజ్ కక్కుర్తి పడి తినే మత భక్తులని చాలా మందిని చూసిన అనుభవంతో కూడా చెప్పగలను.”
  “ఇది చాలా తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ – జీవ హింస పాపం. అందులోనూ సబ్సిడీ. శంకరాచార్యుల వారు చెప్పారు గా… మాంసం ముట్టద్దు అని… మరి పాటించలేదే?”

  ప్రవీణ్ గారి వ్యాఖ్య చందూగారి ప్రతి వాఖ్య ఇవి. నా ఉద్దేశ్యంలో ప్రవీణ్ గారు చాలా మొరటు వ్యాఖ్య చేశారిక్కడ. సోమ, శనివారాలు తప్ప మిగతా రోజుల్లో మత భక్తులు మాంసం తినడంలో కక్కుర్తి ఉందా? బ్రాహ్మణులు తప్ప మిగతా మత భక్తులు మాంసం ముట్టకూడదని ఏ హిందూ ధర్మశాస్త్రాలయినా చెప్పాయా? తమ పరిసరాలలో దొరికే ఆహారం తినే పరిస్థితి కూడా మనుషులకు లేకపోతే ఎలా? మత భక్తులు అన్ని కులాల్లోనూ ఉంటారు కాబట్టి వారు వారంలో రెండు రోజులు మాంసం తినకూడదు అనుకుంటే వారి ఆలోచనా స్థాయిలో అది తప్పెలా అవుతుంది? మిగిలిన రోజుల్లో వారు మాంసం తింటే అది కక్కుర్తి ఎలా అవుతుంది? జీవహింస బోధించిన బుద్దుడే జీవితాంతం మాంసాహారాన్ని ఆరిగిస్తూనే వచ్చాడు మరి. ప్రవీణ్ మీ బాణం ఎవరిమీద గురిపెట్టారో చూడండి మరి.

  చందూ గారు ఇక్కడే “జీవహింస పాపం అని, మాంసం ముట్టవద్దని శంకరాచార్యులవారు సైతం చెప్పారు గదా మరి పాటించలేదే” అంటూ మరీ అమాయకంగా ప్రకటించేశారు. ఏ జీవ హింస పాపం? జంతు జీవ హింసేనా లేక మొక్కలు, వృక్షాల ఉత్పత్తుల రూపంలోని జీవ హింస కూడా ఈ వర్గీకరణలోకి వస్తుందా? ఈ లెక్కన భూమ్మిద మనిషి తినడానికే ఏమీ మిగలదు మరి? అసలు శంకరాచార్యులవారు విధినిషేధాలు విధించిన పూజారి వర్గంలోని వారే చాలామంది ఇవ్వాళ మాంసాహారంతోపాటు మద్యపాన మత్తును కూడా గ్రోలుతున్న ఘటనలు లెక్కలేనన్ని ఉన్నాయి మన కళ్లముందే. ఇంకా ఎక్కడ వీరిలో పవిత్రత? పవిత్రతకు నిర్వచనం ఏమిటసలు?

  చరిత్రలో ఏ విధి నిషేధమూ పూర్తిగా అమలయిన క్రమం లేదు. పూజారి వర్గం కూడా దీనికి మినహాయింపు కాదు. శాకాహారులు పైకి ఎన్ని మాటలు చెప్పినా రహస్యంగా మాంసాహారాన్ని రకరకాలుగా ఎలా తెచ్చుకుని తింటారో చెప్పడానికి గ్రామీణ సమాజంలో వందల సంవత్సరాలుగా సామెతలు కొల్లలుగా పుట్టుకొచ్చాయి. శాకాహారుల ఆహార అలవాట్లను పరిహసించడం ఇక్కడ ఉద్దేశం కాదు.

  ‘శాకాహారులు ఎక్కువగా ఉండే చెన్నయ్ మైలాపూర్ ప్రాంతంలో ఏ మాంసం దుకాణం చూసినా చెన్నయ్ నగరం మొత్తంలో ఎక్కడా లేనంత ధరతో మాంసం, చేపలు అమ్ముతారు. ఇదేం రహస్యం’ అని మా బ్రాహ్మణ మేనేజర్‌ను ప్రశ్నిస్తే ‘బ్రాహ్మణ కులం కూడా గబ్బుపట్టిపోయిందం’టూ చీత్కరిస్తారామె. ‘మీరు కూడా తింటే సరిపోయె. ఓ పనయిపోతుందని’ జోక్ చేస్తే వెంటనే ముక్కు మూసుకుంటారామె. ఇది వేరే కథ.

  ఇది తినొద్దు, ఇది తాగొద్దు, ఇది చేయవద్దు అని చెప్పిన ప్రతి ధర్మసూత్రమూ చరిత్ర క్రమంలో శంకరగిరిమాన్యాలు పడుతూనే పోయింది మరి. ఆహార నిషేధాలు చరిత్రలోని ఏ దశలో కూడా మనుషులపై విజయం సాధించిన నిదర్శనం లేదు.

  ఒక్కమాటలో చెప్పాలంటే…. సమాజంలోని అధికశాతం ప్రజలు తీసుకునే ఆహారాన్ని జీవహింసగా భావించడం అంటేనే, వారికి తమ పరిసరాలలో దొరికే ఆహారాన్ని తినే హక్కును వ్యతిరేకించడమే అవుతుందేమో మరి ఆలోచించండి చందుగారూ…!

 24. చందు గారు, వారానికి రెండు సార్లు మద్యం, మాంసం మానెయ్యడం ఏ రకంగా నీతిని పెంచుతుంది? ఇంతకు ముందు మా ఇంటిలో ఓ పెద్ద గొడవ జరిగింది. చేపలు ఎక్కువగా తినడం వల్ల నాకు కడుపుకి సంబంధించిన సమస్యలు వచ్చాయి. శనివారం, సోమవారం తప్ప మిగితా రోజులు చేపలూ, మాంసమూ వండి ఇలా ఆరోగ్యంతో ఎందుకు చెలగాటమాడుతున్నారు? అని నేను మా వాళ్ళని అడిగాను. శనివారం నాడు వెంకటేశ్వరస్వామి పూజ అనీ, సోమవారం నాడు శివపూజ అనీ వాళ్ళకి తెలియదు. కేవలం ఒక జ్యోతిష్యుడు చెప్పాడని శని, సోమవారాలనాడు వీళ్ళు మాంసం ముట్టుకోరు, అంతే. కానీ ఆ రెండు రోజులు తప్ప మిగితా రోజులు మాంసం, చేపలూ వండుతూ ఉండడం వల్ల సమస్యలు వచ్చాయి. నేను గొడవ చెయ్యడం వల్ల ఇంటిలో మాంసం వండడం తగ్గింది.

  జైనులు మాంసం ముట్టుకోరు కానీ మద్యం, సిగరెట్‌లు తాగే జైనులని చూశాను. మార్వాడీ జైనులు ఆర్థికంగా ముందున్నవాళ్ళు కావడం వల్ల వాళ్ళు మద్య పానం & ధూమ్రపానం తమకి ఒక ఆర్థిక సమస్య అని అనుకోరు. మాంసం కంపుకొడుతుంది కాబట్టి వాళ్ళు మాంసం ముట్టుకోరు. బాక్టీరియా కాంటెంట్ తక్కువగా ఉండే & తక్కువ వాసన వెదజల్లే మద్యం ముట్టుకోవడానికి మాత్రం వాళ్ళకి అభ్యంతరం ఉండదు. మాంసం ముట్టుకోనివాళ్ళందరూ అహింసావాదులు కాదు. అటువంటప్పడు ఇక వారంలో రెండు రోజులు మాత్రమే మాంసం ముట్టుకోకుండా ఉండేవాళ్ళు అహింసావాదులు అయిపోతారా?

  మతం అనేది కేవలం ఊహాజనిత విశ్వాసం. దాని కోసం తమ భౌతిక కాంక్షలని ఎవరూ వదులుకోరు.

 25. శని, సోమవారాల నాడు మాత్రమే కాకుండా ఏ రోజైనా మద్యమాంసాలు ముట్టుకోకూడదు అని రూల్ పెడితే జైన మతంలాగే హిందూ మతంలో కూడా మిగిలేవాళ్ళ సంఖ్య బహు స్వల్పమైపోతుంది. శ్రీలంకలో బౌద్ధులు మాంసాహారులు. వాళ్ళు కేవలం మఠాలు (monasteries)లో మాంసం వండరు, అంతే. టిబెట్, హిమాచల్ ప్రదేశ్‌లలో బౌద్ధులు ప్రాథమికంగా మాంసాహారులు. వాళ్ళు మఠాలలో కూడా మాంసాహారం వండుతారు. ఇది తినకూడదు, ఇది తాగకూడదు లాంటి strict rules పెడితే ఏమతమైనా జైన మతంలాగ విశ్వసించేవాళ్ళు కొద్ది మందే మిగిలే స్థితికి చేరుకుంటుంది.

 26. Again and Again you all are proving my points. Here they go…
  – @Rajasekhara Raju: పూజారి వర్గంలోని వారే చాలామంది ఇవ్వాళ మాంసాహారంతోపాటు మద్యపాన మత్తును కూడా గ్రోలుతున్న ఘటనలు లెక్కలేనన్ని ఉన్నాయి మన కళ్లముందే.
  So… here also, its the sin of the people who did not care to follow that have been told. Is it mistake of Religion to say something or the one who followed?

  – @Praveen Mandangi- చందు గారు, వారానికి రెండు సార్లు మద్యం, మాంసం మానెయ్యడం ఏ రకంగా నీతిని పెంచుతుంది?
  First we should know if it has been told like that or not. It was told only to not to eat non-veg. ఈ శని వారం ఆది వారాలు ఈ తుక్కు మనుషులు ఏర్పరచుకున్న వెసులుబాటు.
  ఇది ఎలాంటిది అంటే… జాన్ అధ్యాయం లో… ఒక మంచి క్రిస్టియన్ తన ఆదాయం లో తప్పని సరిగా కొంత భాగం (దానిని టియత్ అంటారు). కానీ ఎంత మంది క్రిస్టియన్స్ దాన్నిని పాటిస్తున్నారు? విశ్రుంఖల శృంగారం వద్దు అన్నాడు సెయింట్ మేథ్యూ బైబిల్ లో. మరి అమెరికా, యూరప్ లు పార్న్ మయం. ఇది అన్నింటికంటే దారుణం. ఎందుకు అలా లేదు. ఎందుకంటే… a human being tend to lose his pulses. So, he will step into those bad things. Not every Hindu is non-vegetarian and not every christian is bad. Its upto oneself to follow the words of saints or god or whatever. Here again, its the sin of Human Being only.
  Again the points I put forward are proved.

  One more thing, its can be suppoted if muslims are non vegetarian. Because their lands and countries are not so supportive for cultivation because of their geographical conditions. Where as India, the rice bowl of World as they say – people can have many alternatives for food. Here, because Islam came into India from those countries and thus, their habits and rituals also came. One of them is excessive usage of Non veg. This again proves one of my point – in the course of time religions would get changed by the practice. Here who puts them into practice? Answer is just society and people. So… again its the sin or mistake of people who failed to to put them properly into practice. Again my point is proved.

  I take immense pleasure to repeat my words – every saint, every religion, whatever they told is good and the best. Its the people’s mistake who failed to put them in practice.

  @Praveen: “తమ భౌతిక కాంక్షలని ఎవరూ వదులుకోరు.” THis is what I told about controlling one’s pulses. Yes… that is why porn and illegal sex is more in wester countries where as Christianity more. besides their pristine saint ordered them to not to do such activities. This the point Islam people raise also against Christianity.

  And also, I am not denying that these kind of junk activities are there through out the world. But excessive in western and northern lands.

  Isn’t it again the

  Chandu

 27. Here again, you are breathing more oxygen into my points. Here is how…
  Before that, I should present you one article from Fox Journalists. Its all about how a person is spoiling the sanity of a religion. Its about excessive premarital, post-martial and teen illegal sex in USA and Europe. I felt sad to see its about their religions.
  It’s us.
  The snippet of article is here from the verses of “His Holiness” St.Paul. But who know about those people how they crave for such things. And also, at the same time we should not deny that good beings are also there. For this matter of their majority people who is involving in those ***** activities, we can’t blame their religion. Isn’t it? Here is snippet of Fox article.
  ============
  It’s us. We people.

  In order to understand this, we must first understand the underlying cause of all the problems in this world: sin.

  In the Bible, Paul says of the human condition:

  For although they knew God, they did not honor him as God or give thanks to him, but they became futile in their thinking, and their foolish hearts were darkened. Claiming to be wise, they became fools, and exchanged the glory of the immortal God for images resembling mortal man and birds and animals and creeping things.
  ===========
  @Praveen: చందు గారు, వారానికి రెండు సార్లు మద్యం, మాంసం మానెయ్యడం ఏ రకంగా నీతిని పెంచుతుంది? I never told this would increase moral values of any person. I did not understand why you mentioned. But I can expect in what context you had mentioned it. చాలా మంది రెండు రొజులు నాన్-వెజ్ ముట్టరు. ఇదే కదా?
  అన్నింటికంటే ముందు… ఇలా రెండు రోజులు నాన్-వెజ్ ముట్టద్దని ఏ సన్యాసి ఐనా, గురువైనా చెప్పాడా లేదా అని ఆలోచించండి. ఇది నిజంగా వాళ్ళ మత ధర్మమా కాదా ఆలోచించండి. బుద్ధి ఉన్న ఎవ్వడూ అది చెప్పడు. వివేకం ఉన్న ఎవ్వడూ దీనిని మత ధర్మం అని నమ్మడు. ఇది కేవలం వాళ్ళ వెసులుబాటు కోసం మాత్రమే.
  ఇది ఏ సన్యాసీ చెప్పనప్పుడు అది మతానికి సంబంధించినది ఎందుకౌతుంది. I already told this, in the course of time as centuries pass, things get changed, values will be changed. That too in India kind of countries which was invaded culturally also by Islam and Christians, isn’t it obvious that values get contaminated or changed? Its just obvious for every moron on this earth.
  కొంత మంది కలిసి ఇంట్లో ఆదివారం, శని వారం మందు తాగుతూ ఉంటే… ఆ మతం లో అలానే చెప్పారు అని అనుకుంటామా? We just dismiss that, because we have enough intelligence to make enough contrast between truth and falsity. Its just a thing of our maturity boss!

  ——–

  @Praveen: ఇది తినకూడదు, ఇది తాగకూడదు లాంటి strict rules పెడితే ఏమతమైనా జైన మతంలాగ విశ్వసించేవాళ్ళు కొద్ది మందే మిగిలే స్థితికి చేరుకుంటుంది.

  —ఖచ్చితంగా తినకూడదు అని చెప్పకుండా… కొంచం తినండి పరవాలేదు అని చెప్పాలా? దీనికంటే బుద్ధి తక్కువ పని ఉండదు.

  Whatever the holy scriptures are telling, Bible, Qurran, Geeta or whatever, they have to be followed strictly. If you don’t follow strictly then religions get to spoiled state. They will decay as decades and centuries pass.

  ఒక సిద్ధాంతాన్ని, ఒక మత గ్రంధాన్ని, ఒక మతాన్ని అందులోని ఆలోచనలను ప్రశ్నించే ముందు… చాల విచక్షణతో ఆలోచించాల్సి ఉంటుంది.
  ఏ మతమూ చెడు చెప్పదు. నేను పదే పదే ఇది చెప్తాను.
  హిందూ మతం ఇస్లం కంటే, క్రిస్టియానిటీ కంటే ఎంతో ప్రాచీనమైనది కదా? మిగతా మతాలే అలా ఐపోతుంటే… హిందూ మతం ఇన్ని శతాబ్దాలలో ఎన్ని మార్పులకి లోనయ్యి ఉంటుందో ఆలోచించండి. ఎన్నెన్ని వేరే విశ్వాసాలు, ఎన్నెన్ని మతాల వాళ్ళు హిందూ మతం మీద దాడి చేశారు? మరి అసలైన హిందూ మతానికీ ఇప్పటి మతానికీ తేడా ఉండదా?

  అన్ని మతలూ కోల క్రమేణా మార్పులకు గురౌతాయి. జీసస్ అనుచరులు చెప్పిన క్రిస్టియానిటీ, మొహమ్మద్ చెప్పిన ఇస్లం, వేదాలు చెప్పిన హిందూ ధర్మం ఉంటే ఇన్ని బాధలు దేనికి?
  ఈ మతాల ఖర్మ మాత్రమే – ప్రతి ఒక్కడూ వేరొక మతాన్ని దూషించటం.

  మతాన్ని మతం గా అర్ధం చేసుకున్న నాడు మాత్రమే మనిషి సుఖన్ గా ఉండేది.

  But I don’t think this will happen. because, as Hebrew and Christians believe, మానవుడు పుట్టుకతో పాపి. and this all continue.

  Chandu

 28. ఇంకొక ఉదాహరణ. మన రాజ్యాంగం మతమైతే … మన అంబేద్కర్ దేవుడు. ఆయన ఆధ్వర్యం లో రాయబడిన రాజ్యాంగం మన దేశం లో సరిగా అమలుకాక శ్రామికుల జీవితాలు ఇంకా బాగు పడక, అవినీతి తరగక, ప్రాజెక్టులు పూర్తి గాక, న్యాయస్థానాలు సరిగా లేక పోతే మనం ఆయన్ని, రాజ్యాంగాన్ని దూషిస్తామా? ఈ విషయం లో ఆయనని దూషించినవాడి నాలుక కొయ్యాలి.
  సిక్షాస్మృతి strict గా నే ఉండాలి.strict గా ఉంటేనే దేశం ఇలా తగలడింది. ఇంక కొంచం లీనియన్స్ ఇస్తే అంతే.

  రాజ్యాంగం కరెక్టే… కానీ దాని అమలులో ఉంది. దాని అమలులో పెట్టాల్సిన బాధ్యత అధికారులది, ఐ-ఏ-ఎస్ మొదలైన వారిది. దేశం బాగా లేదు అని రాజ్యాంగాన్ని, ఆయనని తిడతామా? మతం కూడా అంతే. మతాన్ని ఆచరణ లో పెట్టలేనప్పుడు మతాన్ని తిడతామా?

 29. జాతకాలు చెప్పేవాడు ఎవడైనా తన దగ్గరకి వచ్చిన కస్టమర్ పోకుండానే జాగ్రత్తపడతాడు. అది అతని జీవనోపాధి కాబట్టి. నువ్వు మద్యం, మాంసం పూర్తిగా మానెయ్ అని కస్టమర్‌లకి చెప్పి కస్టమర్‌లని పోగొట్టుకునే ధైర్యం ఏ జ్యోతిష్యునికి మాత్రం ఉంటుంది? శనివారం, ఆదివారం అనేవి వెసలుబాట్లు మాత్రమే. నిజమే. కానీ మనిషికి రూపాయి కూడా ఇవ్వలేని ఊహాజనిత నమ్మకాలని పూర్తిగా ఆచరించలేక వాటిలో ఏవో వెసలుబాట్లని ఏర్పాటు చేసుకోవడం ఆ నమ్మకాలలో ఇమడలేని & వాటి నుంచి పూర్తిగా బయటకి రాలేని వారికి విచిత్రం కాదు. జ్యోతిష్యులైనా, ఇతర మత పండితులైనా తమ patronisation పోకుండా ఉండేందుకు అలాంటివాళ్ళని సంతృప్తిపరిచే విధంగా మాట్లాడుతూ ‘మీరు కేవలం శని, సోమవారాల నాడు మద్యం, మాంసం మానేస్తే సరిపోతుంది‌’ లాంటి సలహాలు ఇస్తుంటారు.

 30. చందు గారు, మీ కామెంట్ డిలిట్ చేశానని ఎందుకు అనుకున్నారు? నేను నెట్ దగ్గర లేకపోతే ఆలస్యం అవుతుంది. గుర్తించగలరు.

 31. రాజు గారు,

  జపాన్ బురాకు ప్రజలపై జరుగుతున్న వివక్షకు, భారత దేశంలోని కుల వివక్షకు పోలికలు కనిపించడం లెదు. సమకాలీన పరిస్ధితుల్లో భారత దేశంలోని దళితుల పరిస్ధితికీ, బురాకు ప్రజల పరిస్ధితికీ సామీప్యం ఉండడం వల్ల రెండింటినీ కేస్ట్ అప్రెషన్ గా ప్రస్తావిస్తున్నారు తప్ప, చారిత్రకంగా గానీ, సామాజికంగా గానీ చాలా విషయాల్లో రెండింటికీ పోలిక కనిపించడం లేదు.

  బురాకు అంటే జపనీస్ భాషలో ఊరి బయట నివాసం ఉండే చోటు (హామ్లెట్ లాగా) అని అర్ధం ట. జపాన్ లో ఫ్యూడల్ కాలంలో తోలు పని, శవ సంస్కరణ లాంటి దుర్వాసన వచ్చే కొన్ని పనులు చేసేవారిని ఊరికి దూరంగా ఉంచడం నుండి బురాకు లు ఏర్పడ్డాయి. క్రమంగా మురికి పనులన్నీ వారిపైనే రుద్ధడం ప్రారంభించారు. ఆ విధంగా బురాకు అంటేనే ఒక ఇన్ఫీరియర్ సామాజిక హోదా స్ధిరపడిందని వికీ పీడియా ద్వారా అర్ధం అవుతున్నది.

  జపాన్ జనాభా 127.8 మిలియన్లు. 1993 లో ప్రభుత్వ పరిశోధన ప్రకారం బురాకు జనాభా 0.9 మిలియన్లు. బురాకు ఆర్గనైజేషన్ లెక్క ప్రకారం వారి సంఖ్య 3 మిలియన్లు. బురాకు వారి లెక్క తీసుకున్నా జపాన్ జనాభాలో బురాకు జనాభా 2.35 శాతం. భారత దేశంలో ప్రతి ఒక్కరూ ధనికులైనా, పేదలైనా ఏదో ఒక కులంలో ఉండవలసిందే. కాని బురాకు అనేది మొత్తంగా ఒకే కులం లాగా పరిగణించగలమేమో గానీ అందులో ఉప కులాలేవీ లేవు. మిగిలిన 125 మిలియన్ల జనాభాలో కూడా కుల విభజన లేదు. దాదాపు 97.5 శాతం ఒక పక్క, 2.5 శాతం మరొక పక్కా ఉంటే అది కుల వ్యవస్ధ ఎలా అవుతుంది? భారత దేశంలో వలే కుల విభజనకు దైవత్వాన్ని ఆపాదించిన పరిస్ధితి కూడా బురాకు ప్రజలకు లేదు.

  భారత దేశంలో దళితుల పరిస్ధితినే బురాకు ప్రజలు ఎదుర్కొంటున్నారని చెప్పడానికీ, జపాన్ లో బురాకు ప్రజలు బహిష్కృతులు అని చెప్పడానికీ కుల అణచివేతతో బురాకు ప్రజల అణచివేతను పోల్చారు తప్ప జపాన్ లోనూ కుల వ్యవస్ధ (కొన్ని చొట్లయినా) ఉందని చెప్పడానికి కాకపోవచ్చు.

  ఆఫ్రికా ఉదాహరణలు కూడా దాదాపు అలాంటివే. భారత దేశం లాగా దేశం మొత్తం ఉన్న జనాభాలో ప్రతిఒక్కరూ కుల వ్యవస్ధలో సభ్యుడుగా ఉండకుండా, ప్రజల సామాజిక, అర్ధిక జీవనంలోని ప్రతి అడుగులోనూ కులం పాత్ర ఉండే పరిస్ధితులు లేకుండా ఒక దేశంలో కుల వ్యవస్ధ ఉందని చెప్పడం సరికాదు. కాకపొతే ఫలానా చోట ఫలానా గ్రూపు ప్రజలు భారత దేశంలోని దళితులు ఎదుర్కొంటున్న అణచివేతనే ఎదుర్కోంటున్నారు అని ఒక స్టేట్ మెంట్ ఇవ్వవచ్చు. హెచ్.ఆర్.డబ్ల్యు నివేదిక కూడా పోలిక తెచ్చినట్లుంది తప్ప ఆయా ప్రాంతాల్లో కూడా కుల వ్యవస్ధ ఉందని చెప్పలేదు. ఆ నివేదిక ప్రధానంగా అణచివేతను పోల్చింది. వ్యవస్ధను కాదు.

 32. @Visekhar Gaaru: సారీ అండి. మీరు ఆ కమెంట్ ను డెలీట్ చెయ్యగలరనుకుంటా. దయచేసి తీసెయ్యండి. Actually I was seeing an un-refreshed page.

  @Praeen Mandangi: Yes. What you told was correct. మీరు ఏదో వ్యక్తిగత అనుభవాన్నో, లేక మీరు విన్న, చూసిన విషయం గురించో ప్రస్తావించారు. ఎందుకంటే ఇక్కడ మన డిస్కషన్ కి పెద్ద గా పొసగవనుకుంటా.
  కానీ అవి అసలు వెసులుబాటు కే అని మీరూ నమ్మినాక, మళ్ళీ మీరే అది వాడి జీవనోపాధి ki ఏదో ఒకటి చెప్తూ ఉంటారు అన్నారు గనుక , దీనికీ మతానికీ సంబంధం లేదు. ikkada mataaniki okadi valla chedda paeru cheppindi.
  వాడి && patronisation పోకుండా ఉండటానికి ఇచ్చిన సలహాలకు, మతానికి ఏమీ సంబంధం లేదు కదా? మన దర్గా ల దగ్గల పీర్ లు కూడా ఇలాంటి మేజిక్కులే చేస్తుంటారు. దెయ్యం వదలకొడతాం, భూతం పట్టింది నీకు అని. ఇవన్నీ ప్రతీ మనిషికీ వచ్చే కష్టాలను సొమ్ము చేసుకునే ట్రిక్కులు. ఇక్కడ కూడా మనిషి, వాడి కష్టాలు మాత్రం కామన్ కానీ… ఒక మతం చేసిన తప్పు లేదు. మీ కామెంట్ ని నా వాదనకు బలం గా తీసుకున్నాను. థేంక్స్.

  And, also let us actually discuss on the context of this post.

  అసలు కులాలే వద్దు అన్నారు. నిజానికి ఏ వర్గాలూ అక్కరలేదు. మతాలు కూడా.
  జీసస్ ని పూజించాలంటే నువ్వు క్రిస్టియానిటీ లో కి మారాల్సిన అవసరం లేదు. నాకు అల్లాహ్ యొక్క ఆసీస్సుల్లుండాలంటే ముస్లిం ని కావలసిన అవసరం లేదు. ఎవ్వడు ఏ దేవుడినైనా పూజించవచ్చు. సర్టిఫికేట్ మీద ఉన్న మతం, లేదా మేము “ఈ మతం” అని చెప్పుకోవటం వలన దేవుడి దగ్గర నుంచి మనకేమీ స్పెషల్ దీవెనలు రావు. మంచిగా ఉండి మంచిని పెంచితేనే ఆయన చూపు మన మీద పడేది. ఆయన కరుణ మన మనసులకి చేరేది.

  Chandu

 33. మనిషిని నీతివంతునిగా మార్చగల శక్తి ఊహాజనితమైన మతానికి ఉండదు. ఊహాజనిత నమ్మకాల స్థాయి భౌతికతని ప్రభావితం చేసే స్థాయికి ఎన్నడూ వెళ్ళదు. మతం మంచిదనీ, మత పండితులు మాత్రమే డబ్బుల కోసం ప్రజలని ఫూల్ చేస్తారనీ అనుకోవడం ఒక జోక్.

  మతానికి మనుషుల వల్ల చెడ్డ పేరు రాదు. మనుషుల స్వభావం ఎలా ఉంటే మత స్వభావం అలాగే ఉంటుంది. తాను శుద్ధ శాకాహార అలవాట్లతో ఉండగలను అనుకునే వాడు శుద్ధ శాకాహారం mandatoryగా ఉన్న జైన మతంలో చేరగలడు. హిందూ మతంలో శుద్ధ శాకాహారం mandatory కాదు కనుక మాంసాహారానికి అలవాటు పడినవాడు హిందూ మతంలో కొనసాగుతాడు. హిందూ మత పండితులు కూడా భక్తులని దూరం చేసుకోవడం ఇష్టం లేక మద్యమాంసాలని పూర్తిగా మానెయ్యమని చెప్పకుండా, శని & సోమవారాల నాడు మాత్రమే అవి ముట్టుకోకూడదు అని చెపుతారు. ఇందుకు కారణం మతం మంచిది కావడం, మత గురువులు చెడ్డవాళ్ళు కావడం కాదు. మనిషి యొక్క వ్యక్తిగత కాంక్షలని ప్రభావితం చేసే శక్తి మతానికి లేదు అని మత గురువులందరికీ తెలుసు. అటువంటప్పుడు మత పండితులు భక్తులు తమకి దూరం కాకుండా ఉండేందుకు వెసలుబాట్లు ఇవ్వడంలో విచిత్రం ఏముంది?

 34. @Praveen Mandangi: “మనిషిని నీతివంతునిగా మార్చగల శక్తి ఊహాజనితమైన మతానికి ఉండదు. ” ఈ లైన్… త్రివిక్రం శ్రీనివాస్ డైలాగ్ లాగా వినటానికి, వాక్య నిర్మాణం బాగుంది కానీ… లాజిక్ లేదు.
  మతం నీతి మంతుడి గా చేస్తుంది. కాకపోతే నువ్వు పూనుకోవాలి. మతం చెప్పింది వినకపోతే నువ్వు నీతి మంతుడివి కాదు అనలేదు. కాకపోతే అది సాయం చేస్తుంది. ఊహాజనిత మైన మన ఆలోచలన్లు మన భవిష్యత్తుకు పునాదులు వేస్తుంటే… మతం యొక్క ఆలోచనలు భౌతికం గా పని చేయకపోవటం ఏమిటి? ఊహ, ఆలోచన లేనిదే మనం ఏమైనా చేస్తామా? యాంత్రికం గా మీరు పనులు చేస్తారా? లేకా ఆలోచించి ఊహించి చేస్తారా?

  “మతానికి మనుషుల వల్ల చెడ్డ పేరు రాదు.”
  వస్తుంది. చెడ్డపేరు వస్తుంది. వాటికన్ సిటీ లో నన్స్ గర్భవౌతులైనప్పుడు… బీ.బీ.సీ క్రిస్టియానిటీ ని ఏకి పెట్టింది. మన నిత్యానంద గారు రాసలీలలాడినప్పుడు… దానిని వాడి వ్యక్తిగతమైనది గా కాకుండా… హిందూ ధర్మాన్ని హేళన చేస్తూ ఎన్ని చానెల్స్ “హల్చల్” చేసాయి?
  ఫ్లీజ్ సీ దిస్ లింక్ ఆల్సో
  http://bhadradriexpress.blogspot.in/2012/07/catholic-church.html
  ఈ లింక్ యొక్క ఒరిగినల్ పోస్ట్ హెడ్లైన్ – The Heart of a Priest.

  నెల్లూరు దర్గా లో వేరు మందు ఇస్తానని ఒక పీర్ ఆడవాళ్ళని exploit చేసిన సంగతి మనకు తెలుసు.

  ఈ సంఘటనలన్నీ విన్నప్పుడు ఒక మామూలు వ్యక్తికి ఆ పీర్ కానీ, నిత్యానంద గానీ, బిషొప్ లు కానీ మనసులోకి రారు. మతం, సమాజం చెడిపోతున్నాయనే ఆలోచన మనసులో వస్తుంది. ఇంక మన చనెల్స్ నిత్యం స్క్రోలింగ్ నడుపుతూ ఈ ఆలోచనని రెట్టింపు చేస్తారు.

  కాబట్టి… మతానికి మనుషుల వల్ల చెడ్డ పేరు వస్తుంది.

  ====
  ఇంకొక విషయం… మా అత్తయ్య వాళ్ళ ఊరిలో… ఒక క్రిస్టియన్ ప్రచార సమితి వారు వాళ్ళ మతం లో చేరమని అడిగారు. కొంతమంది వాళ్ళ శిబిరాలకు వెళ్ళారు. సరే … మామూలుగానే డబ్బులిస్తాం అన్నారు. కాకపోతే ఎక్కడ తేడా పడిందంటే… మొదట వాళ్ళు ఆడవాళ్ళని బొట్టు తీసెయ్యమన్నారు. కొంత మంది తీసేశారు. తీసేసిన వాళ్ళను చూసి మరి కొంత మంది కూడా బొట్టు తీసేశారు. తరువాత మెట్టెలు, నల్ల పూసలు తీసెయ్యమన్నారు. బాగా సంకోచించినా తీసేశారు. శిబిరం ఐపోయే టైం లో… తాళిబొట్టు తీసెయ్యమన్నారు. వీళ్ళు తీసెయ్యం అంటే ఒక ఆడ మనిషి ఆ శిబిరం తరుఫున వచ్చి గట్టిగా చెప్పి తీసెయ్యమనింది. ఆ ఆడావిడని పిచ్చ కొట్టుడు కొట్టారు.

  ఈ వెళ్ళిన ఆడవాళ్ళకి ఇంటికి రాగానే విపరీతమైన తెలివి తేటలు వచ్చి – తాళి ఉంటే ఏసు ని పూజించ కూడదా అని ప్రశ్నించుకొని, ఆ శిబిరం నడిపిన వాళ్ళని తిట్టి (చిన్న బూతులు), “ఏం… ఆ శిబిరం లో చేరకపోతే మనం ప్రార్ధన చేసుకోలేమా అని” సమాధానపడ్డారు.

  ఈ విషయం వలన ఆ శిబిరం యొక్క ఉద్దేశ్యానికి చెడ్డ పేరు వచ్చిందా రాలేదా?
  =======
  …..ప్రజలని ఫూల్ చేస్తారనీ అనుకోవడం ఒక జోక్. so, I did not crack any joke. In fact, you did boss.

  —మనిషి యొక్క వ్యక్తిగత కాంక్షలని ప్రభావితం చేసే శక్తి మతానికి లేదు అని మత గురువులందరికీ తెలుసు. అటువంటప్పుడు మత పండితులు భక్తులు తమకి దూరం కాకుండా ఉండేందుకు వెసలుబాట్లు ఇవ్వడంలో విచిత్రం ఏముంది?

  I had already answered for this in my previous comments.

  Chandu

 35. మతం ఊహాజనితమైనప్పుడు దాని పేరుతో వ్యాపారం జరగడం విచిత్రం కాదు. దేవుడు ఉన్నాడు, ఆత్మలు ఉన్నాయి కానీ జ్యోతిష్యులే మనుషుల వ్యక్తిగత బలహీనతలనీ, కోరికలనీ ఉపయోగించుకుని వ్యాపారాలు చేస్తున్నారు అని జస్టిఫికేషన్ ఇచ్చుకుంటే ప్రయోజనం ఉండదు.

 36. చందు గారూ. మతానికి స్వంత అస్తిత్వం అంటూ లేదు. మనిషిని మంచివాడిగా గాని లేక చెడ్డ వాడిగా గాని మార్చె శక్తి దానికి లేదు . అన్ని మతాలలొనూ, యజమాని, బానిస వున్నారు, పాప పున్యాలూ, వున్నయి. అంటె సమాజం అప్పటికే వర్గలుగా విడిపొయివుందని అర్దం. ఒక మనిషి మంచివాడిగానూ, ఒక మనిషి చెడ్డ వాడిగానూ ఎందుకు వున్నాడు? ముందు దీనికి సమాదానం చెప్పాలి మీరు . ఒక మనిషి ధనికుడి గానూ ఒక మనిషి పేదవాడిగనూ ఎందుకు వున్నడు. ?? మతం పేద, ధనిక తేడాలకు కర్మ ఫలితమని అతని కస్టాలకు అతన్ని ఎదురుతిరగనివ్వకుండ చెస్తుంది. అంతిమంగా అది ధనికులకే సాయపడుతుంది.

  మతం నీతి వాఖ్యాలు చాలా వల్లించింది ఆ నీతి వాఖ్యలని మనిషి ఆచరించలేదు కనుక మనిషి చెడ్డవాడుగా కనబడుతున్నాడు మీకు. అసలు నీతి వఖ్యాల వల్ల ఒక మనిషి మారడం సాద్యమా? చరత్రను గమనించినా లేక మన రొజూవారి వ్యవహారలను గమనించినా, మనకు తెలిసిపొతుంది.బౌతిక పరిస్తితులు ఒకలా వుంటె మనిషి ఇంకొలా ప్రవర్తించడం సాద్యంకాదు. బౌతిక పరిస్తితులనుంచి మంచినీ, చెడ్డనూ వేరుచెయలేం. ఉత్పత్తి సంభందాలను పట్టె ఉపరితలమైన న్యాయ రాజకీయ వ్యవస్తలు ఎర్పడతాయి. మార్క్స్ అన్నట్టు ఆనాటి పాలక వర్గ బావాలే పాలితుల బావాలు. కాబట్టి పునాదిని బట్టె బావజాలం ఎర్పడుతుంది. ఆయా నిర్దిష్ట సమజాలను బట్టి ఆయా నిర్దిష్టమైన నీతి వుంటుంది అన్ని సమజాలకు ఒకే నీతంటూ ఎమీ లేదు. అది నిరంతరం మారుతూ వుంటుంది. విశెఖర్ గారు. తపొప్పులకు మతమే బాద్యత వహించాలన్నరు. మతం తపొప్పులకు బాద్యత ఎలా వహిస్తుంది? అది పరాన్న జీవి వంటిది పునాదిపైన ఆదారపడి బతుకుతూ వుంటుంది. దానికిఏశక్తి సామర్ద్యాలూ లేవు. సమాజంలొ అసమానతలు ఉన్నంతకాలం మతం వుంటుంది. సమాజం ఎంత పురొగమించినా.

 37. నేను కుల వ్యవస్థని ఎంత విమర్శించినా కుల వ్యతిరేక పోరాటాల వైపు మాత్రం ఇంక్లినేషన్ కలగడం లేదు. ఎందుకంటే నేను అగ్రకులాలవాళ్ళలో కూడా చాలా మంది పేదవాళ్ళని చూశాను. ఒరిస్సాలోని రాయగడ పట్టణంలో ఒకప్పుడు కమ్మవాళ్ళూ గుడిసెల్లోనే ఉండేవాళ్ళు, వెలమ దొరలు కూడా గుడిసెల్లోనే ఉండేవాళ్ళు. ఆర్థికంగా అభివృద్ధి చెందిన తూర్పు గోదావరి జిల్లాలో కూడా గుడిసెల్లో ఉండే కాపులనీ, రెడ్లనీ చూశాను. పూర్వం ఇండియాలో warrior tribes ఉండేవి. కమ్మ, రెడ్డి, వెలమ కులస్తులు కాకతీయుల సైన్యంలోనూ, ముస్లిం రాజుల సైన్యాలలోనూ పని చేసేవాళ్ళు. ఈ కులాలకి చెందిన కొంత మంది రాజుల కింద సామంత రాజులుగా, టాక్స్ కలెక్టర్‌లుగా కూడా పని చేశారు. ఈ చరిత్ర వల్ల ఈ కులాలకి అగ్రకుల హోదా వచ్చింది. కానీ వర్తమానంలో వీళ్ళ పరిస్థితి మారింది. ఈ పరిస్థితిలో కుల పోరాటాల కంటే వర్గ పోరాటాలకే ఎక్కువ ప్రాముఖ్యత ఉండాలనే నేను అంటాను.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s