ప్రేమ వద్దు! బైటికే రావద్దు!! మహిళలకు యు.పి పంచాయితీ ఫత్వా


ప్రేమ పెళ్ళిళ్ళు నిషేధిస్తూ ఉత్తర ప్రదేశ్ లోని భాగ్ పట్ జిల్లా అసారా గ్రామ పంచాయితీ ఫత్వా జారీ చేసింది. 40 యేళ్ళ లోపు మహిళలు ఒంటరిగా మార్కెట్ కి కూడా వెళ్లరాదంటూ నిషేధం విధించింది. ఆడ పిల్లలు రోడ్లపైన మొబైల్ ఫోన్లు ఉపయోగించకూడాన్నీ నిషేధించింది. ఆనక తమది ఫత్వా కాదని 36 కులాల వాళ్ళం కూర్చుని చర్చించి తీసుకున్న నిర్ణయమని పంచాయితీ పెద్దలు తమ రూలింగ్ ని సమర్ధించుకున్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ భాగ్ పట్ జిల్లా అధికారులనుండి ఈ రూలింగ్ పై నివేదిక కోరగా హోమ్ మంత్రి చిదంబరం ఫత్వాలు చెల్లవని ప్రకటించాడు.

జులై 11 న జరిగిన పంచాయితీ సమావేశంలో ఈ ఉత్తర్వులు ఆమోదించినట్లు ‘ది హిందూ’ తెలిపింది. కులాంతర వివాహం చేసుకున్న యువతీ, యువకులను పరువు పేరుతో హత్యలు చేయిస్తున్న ఖాఫ్ పంచాయితీలు అధికారికంగా, వ్యవస్ధాగతంగా పట్టు సాధించడానికి ప్రయత్నిస్తున్నట్లు తాజా పరిణామం ద్వారా స్పష్టం అవుతోంది. మహిళల ప్రజాస్వామిక భావనలు భరించలేని స్ధితిలో ఉంటూ వారిపై అణచివేతను కొనసాగించడానికి మరిన్ని మార్గాలు వెతుకుతున్నట్లు స్పష్టం అవుతోంది.

అసారా గ్రామ పంచాయితీ ఉత్తర్వులపై తక్షణం నివేదిక ఇవ్వాలని యు.పి రాష్ట్ర మహిళా కమిషన్ భాగ్ పట్ జిల్లా మేజిస్ట్రేటు ను కోరింది. ప్రేమ పెళ్లిళ్లపైనా, 40 సం.ల లోపు మహిళలు తోడు లేకుండా షాపింగ్ కి వెళ్లడం పైనా నిషేధం విధించడంతో పాటు మహిళలంతా ఇల్లు దాటి బైటికి వస్తే తలపై ముసుగు కప్పుకోవాలని కూడా అసరా పంచాయితీ ఆంక్షలు విధించింది. ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్నవారు గ్రామంలో నివశించడానికి అనర్హులని ప్రకటించింది. పొద్దు కుంకాక 40 లోపు మహిళలు అసలు బైటికే రావద్దని పంచాయితీ పెద్దలు చెప్పినట్లు ఎన్.డి.టి.వి తెలిపింది.

నోరు మెదపని అజిత్, ఖండించిన చిదంబరం

మహిళలపై ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన అసారా పంచాయితీ కేంద్ర విమానయాన మంత్రి అజిత్ సింగ్ నియోజకవర్గంలో ఉంది. అయితే పంచాయితీ ఉత్తర్వులపై వ్యాఖ్యానించడానికి అజిత్ సింగ్ రోజంతా నిరాకరిస్తూనే ఉన్నాడని ఎన్.డి.టి.వి తెలిపింది. బహుశా ఓట్లు పోతాయన్న భయం అజిత్ నోటిని మూసి ఉండవచ్చు.

అయితే యు.పి ఓటర్లతో పని లేని చిదంబరం మాత్రం పంచాయితీ ఉత్తర్వులను ఖండించాడు. ప్రజాస్వామిక వ్యవస్ధలో అలాంటి ఆంక్షలకు తావులేదని చెబుతూ వారి ఉత్తర్వులను ఉల్లంఘించినవారిపై పంచాయితీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం నిరోధిస్తుందని తాను ఆశిస్తున్నానని తెలిపాడు. ఖాఫ్ పంచాయితీలు, ఫత్వా, డ్రస్ కోడ్స్ లాంటి పంచాయితీ ఉత్తర్వులకు ఎలాంటి చట్టపరమైన ఆమోదం లేదనీ ఆ మేరకు పోలీసులకు తగిన ఆదేశాలివ్వాలనీ ఆయన కోరాడు.

గ్రామస్ధుల మద్దతు

“ఈ నిర్ణయాన్ని మేము పూర్తిగా సమర్ధిస్తున్నాం. ఆడపిల్లలు ఒంటరిగా గ్రామంలో నడుస్తుంటే అనేక సమస్యలు తలేత్తుతాయి” అని ఒక గ్రామస్ధుడు వ్యాఖ్యానించినట్లు ఎన్.డి.టి.వి తెలిపింది. ఆడ పిల్లలు ఒంటరిగా నడుస్తున్నపుడు సమస్యలు సృష్టిస్తున్నవారిని వదిలేసి ఒంటరిగా నడవడాన్నే గ్రామస్ధులు తప్పు పడుతున్నారు. యువకులు కూడా ‘హేండ్స్-ఫ్రీ’ సౌకర్యం (చేతితో ఫోన్ పట్టుకోకుండా బ్లూ టూత్ సాయంతో మాట్లాడే సౌకర్యం) ఉన్న సెల్ ఫోన్లు వాడరాదని కూడా పంచాయితీ తీర్మానించిందని సదరు చానెల్ తెలిపింది.

పంచాయితీ నిర్వహించినవారిని అరెస్టు చేయడానికి పోలీసులు ప్రయత్నించినపుడు గురువారం రాత్రి గ్రామంలో పెద్ద యుద్ధమే జరిగినట్లు తెలుస్తోంది. ఇద్దరు పంచాయితీ సభ్యులను అరెస్టు చేసిన ఇద్దరు పోలీసులపై గ్రామస్ధులు దాడి చేసి కొట్టారు. పోలీసు వాహనానికి నిప్పు పెట్టారు. జాతీయ రహదారిపై వాహనాలు అడ్డుకున్నారు. బస్సుల్లోకి జొరబడి ప్రయాణీకులపై చేయి చేసుకున్నారు. దానితో అరెస్టు చేసిన వారిని పోలీసులు విడుదల చేయక తప్పలేదు. భాగ్ పట్ పోలీసులు ఇపుడు 10 మంది గ్రామస్ధూలపై కేసులు నమోదు చేశారు.

గ్రామస్ధుల అభిప్రాయాలు

బ్రిటన్ పత్రిక ‘డెయిలీ మెయిల్’ అసారా గ్రామస్ధుల్లో కొందరి అభిప్రాయాలు సేకరించింది. ఆ పత్రిక ప్రకారం ఈ తీర్మానాలను పంచాయితీ ఫిబ్రవరి నెలలోనే ఆమోదించింది. అయితే వాటిని గ్రామస్ధులు పెద్దగా పట్టించుకోనట్లు అనుమానం కలగడంతో జులై 11 న సమావేశమై మరోసారి గుర్తు చేసింది. “మా ఆదేశాలను కొందరు అమ్మాయిలు వారి తల్లిదండ్రులు సీరియస్ గా తీసుకోవడం లేదని మేము గమనించాము. అందుకే బుధవారం సమావేశం జరిపి ఆదేశాలను ఉల్లంఘించినవారిని మొదట వెలి వేయాలని అనంతరం గ్రామ బహిష్కరణ విధించాలని నిర్ణయించాం. ఆదేశాలు పాటించేలా చేయడానికి ఇంకా ఇతర మార్గాలు కూడా ఉన్నాయి. అలాంటి పరిస్ధితి వస్తే అప్పుడు చూస్తాం” అని పంచాయితీ సభ్యుడయిన 50 యేళ్ళ మహమ్మద్ మోహ్కామ్ డెయిలీ మెయిల్ తో అన్నాడు. గ్రామంలో 70 శాతం ముస్లింలు కాగా 30 శాతం హిందువులని, హిందువుల్లో ఎక్కువమంది జాట్ లనీ పత్రిక తెలిపింది.

“అబ్బాయిలు కూడా ఇయర్ ఫోన్లు వాడరాదని మేము కోరుతున్నాం. ఎందుకంటే రోడ్లపైన హారన్ లను వారు వినకుండా యాక్సిడెంట్లు చేస్తున్నారు. గ్రామంలో మహిళలు తమ తలపై ముసుగు వేయాలి. గ్రామం దాటి వెళితే వారు ముసుగు తొలగించవచ్చు” అని మోహ్కామ్ తెలిపాడు. “ప్రేమ పెళ్ళిళ్ళు సమాజానికి అవమానం. అవి తల్లిదండ్రులకు, ముఖ్యంగా అమ్మాయి కుటుంబాలకి చాలా బాధాకరం.  ఎందుకంటే వారి తల్లిదండ్రుల గౌరవాన్ని భంగం కలిగిస్తాయి. ప్రేమ పెళ్లి చేసుకునేవారినెవరినీ గ్రామంలో ఉండనీయం” అని మరో పంచాయితీ సభ్యుడు సత్తార్ అహ్మద్ అన్నాడు. 40 యేళ్ళ మహిళలు మార్కెట్ కి వెళ్లకుండా నిషేధించడాన్ని సమర్ధిస్తూ “దానివల్ల నేరాలు జరుగుతాయి” అని ఆయన వ్యాఖ్యానించాడు. తలకు ముసుగువేసుకుంటే అమ్మాయిలకే భద్రత అనీ సమర్ధించాడు.

గ్రామంలోని హిందూ, ముస్లిం ప్రజల్లో అత్యధికులు పంచాయితీ ఫత్వాకు మద్దతు ఇచ్చారు. “మహిళలు వాటిని పాటించి తీరాల్సిందే” అని విజేందర్ కశ్యప్ అన్నాడు. “అమ్మాయిలు మొబైల్స్ ఉపయోగించకుండా పూర్తి నిషేధం విధిస్తే నేనింకా సంతోషించి ఉండేవాడిని” అని తరుణ్ చౌదరి వ్యాఖ్యానించాడు. మహిళలు కూడా ఫత్వాకు మద్దతు పలికారు. “వారు నిర్ణయించినవి అన్నీ అనుసరించవలసిందే. వాదప్రతివాదాలకు స్ధానం లేదు” అని 40 యేళ్ళ గీతా దేవీ వ్యాఖ్యానించింది.

23 యేళ్ళ నీతూ సింగ్ అభిప్రాయం కొంచెం తేడాగా ఉంది. భాగ్ పట్ లో ఎం.ఏ చదువుతున్న నీతూ ఇలా అన్నది. “గ్రామంలో మహిళలు తలకు ముసుగు వేయాలన్న ఆదేశాన్ని నేను అంగీకరిస్తాను. కానీ మా తల్లిదండ్రులతో సంబంధంలో ఉండాలంటే మొబైల్ ఫోన్ చాలా అవసరం కదా.” స్వంత అవసరం తనపై ఆంక్షను వ్యతిరేకించేలా చేసినప్పటికీ మహిళలపై ఉన్న  సామాజిక వివక్షపై అవగాహన లేకపోవడం వల్ల సదరు అణచివేతకు మద్దతు పలికేలా నీతూను ప్రోద్బలించింది.

మరో పంచాయితీ సభ్యుడయిన 62 యేళ్ళ ఇస్లాముద్దీన్ ఇలా అన్నాడు, “అపరిపక్వంగా (immature) ఉండే మా అమ్మాయిలు గానీ, చెల్లెళ్ళు గాని మొబైల్ ఫోన్ వాడరాదని మా అభిప్రాయం. ఎందుకంటే అనేక సమస్యలకు అది దారి తీస్తుంది. ఎం.ఎం.ఎస్ క్లిప్ లు తీయడానికి ఫోన్ లు ఎలా దుర్వినియోగం చేస్తున్నారో తెలిసిందేకదా. ఏ తప్పులూ చేయకుండా వారిని నిరోధించాలని, చెడ్డవారి నుండి వారిని కాపాడాలనీ కోరుకుంటున్నాం” అని ఇస్లాముద్దీన్ అన్నాడు.

చట్టాల వైఫల్యం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. రక్షణ యంత్రాంగం పేరుతో నిర్మించిన వ్యవస్ధలన్నీ ప్రజలకు రక్షణ ఇవ్వడం కంటే పాలకులకు రక్షణ ఇవ్వడానికే సమయం అంతా గడిపేయడంతో చట్టాల గొప్ప ప్రజల వాకిటికి రావడం లేదు. ఆధునిక టెక్నాలజీ ద్వారా వచ్చిపడుతున్న నేరాలకు కూడా పంచాయితీలే రక్షణ కల్పించవలసి రావడాన్ని బట్టి పోలీసు వ్యవస్ధపై ప్రజలకి నమ్మకం లేదని గ్రహించవచ్చు. నిత్యావసర సరుకులను ప్రజలకు చేరవేయడంలో పూర్తిగా విఫలం అయిన పాలకులు రక్షణ ఇవ్వగలమన్న భరోసాను కూడా ప్రజలకు చేరవేయలేకపోయారు.

భారత దేశ గ్రామీణ వ్యవస్ధలో భూస్వామ్య అభివృద్ధి నిరోధక భావజాలం మహిళలపై అణచివేత కొనసాగిస్తున్నదనీ, తనపై రుద్దబడుతున్న దళారీ, సామ్రాజ్యవాద పెట్టుబడుల సామాజిక అనివార్యతలకు సైతం ప్రతిఘటన కొనసాగిస్తున్నదనీ, ఆ ప్రతిఘటనకు అంతిమంగా మహిళలు, దళితులు లాంటి బలహీన వర్గాల వారే బలవుతున్నారనీ అసారా పంచాయితీ ఉత్తర్వులు రుజువు చేస్తున్నాయి. ఆధిపత్య వ్యవస్ధల భావాజాలంలోతో అణచివేతకు గురవుతున్న వర్గాలు సైతం ఆమోదం ప్రకటించే వ్యవస్ధల సాధారణత్వాన్ని డెయిలీ మెయిల్ వెల్లడించిన గ్రామస్ధుల అభిప్రాయాలు తెలియజేస్తున్నాయి.

10 thoughts on “ప్రేమ వద్దు! బైటికే రావద్దు!! మహిళలకు యు.పి పంచాయితీ ఫత్వా

 1. విశేఖర్ గారూ…వాడు నామీదా పడ్డాడు…బూతులతో…కామెంట్ డిలీట్ చేశేసా….అవే బూతులూ..అవే పదాలూ…బహుశా మీ ఆర్టికల్కి స్పందించి వాడి చర్యలను ఖండించిన వారందరికీ ఈ టైపు కామెంట్లు పంపి ఉంటాడనుకుంటా…అదే ఐపీ ఎడ్రెస్…..బహుశా అది నకిలీ అయి ఉంటుంది…యూకే లోని నా మిత్రులను సంప్రదిస్తా….బిజీగా ఉండడం చేత ఆ విషయం పై టైమ్ వెచ్చించ లేక పోయా…..ఒకే కులాన్ని టార్గెట్ చేసుకుని, మా…**జా**..అని తిడుతున్నాడు…బహుశా ఆ కులపు వ్యక్తికి పుట్టి ఉండి(కర్ణుడి లా) వేరే పెరిగి, ఆ తండ్రి మీదా…ఆ తండ్రి కులస్తుల మీదా,(తండ్రి లేకుండా పెరగడం వల్లా) ఇప్పుడు ఉక్రోషంతో ఆ కులపోళ్ళ ను దూషించి తృప్తి పడాలనుకుని పిచ్చ పిచ్చ గా ప్రవర్తిస్తున్నా డనుకుంటా…
  కామెంట్ ఎక్కడ ఉంచాలో తెలీక ఇక్కడ ఉంచుతున్నా…

 2. కాబట్టి ఒక కుంతీ పుత్రిడు అయి ఉంటాడని… సానుభూతి చూపించండి వాడిపై…వచ్చే జన్మ లోనయినా వాడు తండ్రి దగ్గరే పెరగాలని కోరుకుందాం…

 3. ఇలాంటి భావజాలాన్ని నమ్మేవాళ్ళు మన రాష్ట్రంలో కూడా ఉన్నారు. ఈ లింక్ చదవండి: https://plus.google.com/111113261980146074416/posts/9vTmLUwzeFZ

  యాభై ఏళ్ళ క్రితం చాలా మంది తెలుగు రచయితలు స్త్రీ స్వేచ్ఛ గురించి మాట్లాడడమే ఆత్మహత్యా సదృశ్యం అనే అర్థంతో కథలు వ్రాసేవాళ్ళు. ఇప్పుడు అదే మోడ్‌లో కాకుండా కొత్త రకం మూఢ నమ్మకాలని ప్రోపగేట్ చేస్తున్నారు. సినిమాలలో హీరోయిన్ నిక్కర్ వేసుకుంటున్నట్టు, హీరో గారి అక్కాచెల్లెళ్ళు నిండు చీరతో ఉంటున్నట్టు చూపిస్తారు. ఎంత హిపోక్రిటిక్‌గా ఉండాలనుకున్నా తమ అక్కాచెల్లెళ్ళు కూడా గడపదాటుతారనే భయం మనవాళ్ళకి ఉంటుంది. అందుకే అటువంటి భావజాలాన్ని ప్రోపగేట్ చేసే సినిమాలని నిషేధించాలని డిమాండ్ చెయ్యకుండా, ‘వయసులో ఉన్న స్త్రీలు సెల్‌ఫోన్‌లు వాడకూడదు’ వంటి రూల్స్ పెడుతుంటారు.

 4. కె.వి.ఎస్.వి గారూ మీరు తాజా బాధితులన్నమాట. మీరన్నట్లు నా బ్లాగ్ లో స్పందించిన ఇతరులకి కూడా ఈ సన్నాసి ఇదే విధంగా రాసి ఉండవచ్చు కూడా.

  చీకటిగారు చెప్పినది అక్షరాలా వాస్తవం. వీడి బూతులు బహిరంగం చేస్తూ టపా రాసాక బూతు దాడిని రెట్టింపు చేశాడు. ఇంకా రోతగా రాస్తున్నాడు. చిన్న సైజు బూతుల వ్యాసం కూడా రాసాడు. చీకటి గారి మనో విశ్లేషణ ఎంతో పక్కా. ఆయన మనో విశ్లేషణలో వాస్తవాలు గ్రహించి తమను తాము సరి చేసుకోగలిగితే ఇలాంటి విష పురుగుల్లో విషం దూరమై కనీసం తమ కుటుంబాలకైనా పనికొచ్చే అవకాశం ఉంటుంది. లేదూ, ఆ బురదే కావాలనుకుంటే చేయవలసింది చెయ్యడమే.

  యు.కె లో మీ మిత్రుడిని సంప్రదించాక ఒక మార్గం దొరికి మీరు చర్యలకు సిద్ధపడితే ఆ ముక్క నాకూ చెప్పండి. నేను పూర్తి మద్దతు, వీలుంటే క్రియాశీలకంగా కూడా, ఇస్తాను.

  వర్డ్ ప్రెస్ వారిని నేను అడిగాను. ప్రాక్సీ నెంబర్లయినా సరే ఎక్కడున్నాడో పట్టుకుని ప్రాసిక్యూట్ చెయ్యొచ్చని చెప్పారు. నేనే ఆలోచిస్తున్నాను.

 5. వర్డ్ ప్రెస్స్ లో మీ డిస్కషన్ చూసానండి…మన బ్లాగుకు కామెంట్ చేరకుండా ఉండే మార్గాలు లేవని స్పష్టమవుతూంది…
  ఒకే ఐపీ నుండి పంపటానికి కారణం అది నిజమయినది కాకపోవడమే అనుకుంటున్నా…
  సమయం చూసి మితృలతో మాట్లాడుతా…మీకు విషయాన్ని తెలియ చేస్తా
  మానసిక విశ్లేషణల ప్రకారమైతే వాడి మనస్తత్వం పై ఒక పుస్తకమే తయారవుతూంది…
  నిజమే తల్లి తండ్రులను నిందించకూడదు..అదే సమయం లో ఎందరు తల్లి తండ్రులు పిల్లలకు మంచి విషయాలను చెపుతున్నారో?మా ఇంట్లో మాత్రం ఏ మాత్రం టైమ్ దొరికినా పిల్లలకు అందరితో సమానంగా ఉండమని ఎప్పుడూ చెపుతూ ఉంటామ్…లక్కీగా మా కుటుంబమ్ ఒక మినీ భారత దేశమవడం మాకు కలసి వచ్చిన అంశం…ఇరవై నాలుగ్గంటలూ సంపాదనా అని ఏడుపే తప్పా మంచి పిల్లల్ని తయారు చేస్తున్నామా…వాళ్ళల్లో మానవతా విలువలు నాటుతున్నామా అని ఆలోచించే తల్లి తండ్రులే లేరు…
  ఈ దేశం లో పుట్టిన వాళ్ళకు ప్రక్క మనిషిని ప్రేమించే గుణమైతే మాత్రం లేదు…
  నేను అన్ని బ్లాగులూ చూస్తా…కామెంట్ పెట్టడానికి కొంచెం బిడియపడి… పెట్టను…ఎంత అర్ధరాత్రి వచ్చినా నాబ్లాగ్మిత్రులు ఏం మాట్లాడుతున్నారో చూడాలన్న అభిమానం నా మనసులో ఉంటుంది…ఎవరితో పరిచయం లేకపోయినా….బ్లాగర్లందరితో గొప్ప అనుభందం ఉందన్న ఫీల్ నాకు ఎప్పుడూ ఉంటుంది…
  మన సమాజం లో ప్రస్తుతం కనబడుతున్నది మాత్రం….. డబ్బూ…ఆడంబరాలూ…కుల పిచ్చితో …సఫర్ అవుతున్న…రోబోట్లు మాత్రమే…

  శ్రావ్య గారు పరిచయం చేసిన stupid guy goes to india పుస్తకం లో.. …
  మన గ్రేట్ భారత్ గురించి….ఎంక్వయరీ చేస్తున్న జపనీయునితో మరొకాయన …ఇలా చెపుతాడు…
  ITS A CASTE BASED-SOCIETY.IF YOU DONT UNDERSTAND MUCH ABOUT IT,I THINK YOURE GOING TO STRUGGLE.
  బయటి వాళ్ళ దృష్టిలో మనం ఎలా ఉన్నామో…ఎంత అద్వానమో…నాలుగు పేజీలు చదవగానే నాకు అర్ధం అయ్యింది…పూర్తిగా చదవలేదు ఇంకా…నా మటుకు నాకు ప్రతీ భారతీయుడూ చదవాల్సిన పుస్తకమేమో అనిపించింది.
  (ప్రతీ సమాజం లో కొన్ని లోపాలుండవచ్చు.. మనది మరీ దారుణమెమో అనిపిస్తూ ఉంటుంది.. మనకంటే దిగువున నాలుగైదు దేశాలు ఉంటాయేమో)
  మరీ పెద్ద కామెంట్ అయ్యిందేమో..ఎడిట్ చేయండి…!!!

 6. @Praveen Mandangi…
  ఇలాంటి భావజాలాన్ని నమ్మేవాళ్ళు మన రాష్ట్రంలో కూడా ఉన్నారు. ..
  ఉన్నారు…ఉంటూనే ఉంటారు…
  ఈ విషయాన్ని నేను చాలా కాలం క్రితమే ఎక్కడో చూసినట్టు గుర్తు…
  చాలా మంది ఎండగట్టటమ్ జరిగింది కూడా….ఆయన రాతల్ని అప్పటికే ..(.నేను చదివిన నాటికి )

 7. “మన బ్లాగుకు కామెంట్ చేరకుండా ఉండే మార్గాలు లేవని స్పష్టమవుతూంది…”

  రెండు పరిష్కారాలు ఉన్నాయిండీ blaagu.com లో. ఒకటి మోడరేషన్‌ పెట్టి అన్ని కామెంట్లను మీ ఆమోదంతో అనుమతించడం. మరొకటి మీకు అసభ్య కామెంట్ పంపిన వారి యుఆర్ఎల్‌ను అలాగే కాపీ చేసి మీ సైట్ లేదా బ్లాగ్ అడ్మిన్‌లోని ఒక ఆప్షన్ కేటగిరీలో దాన్ని పేస్ట్ చేసి సేవ్ చేస్తే ఆ యుఆర్ఎల్ నుంచి మీకిక చచ్చినా ఏ కామెంట్లూ, ప్రమోషన్ యాక్టివిటీస్ పేరిట సెక్స్ ప్రకటనలూ రావు. ఎవడెవడో వచ్చి ఇది కొను, అది కొను అంటూ వాయించడం కూడా జాస్తీ అయిపోయిందిప్పుడు.

  “ఈ దేశం లో పుట్టిన వాళ్ళకు ప్రక్క మనిషిని ప్రేమించే గుణమైతే మాత్రం లేదు…”

  గుండెపట్టేస్తోంది నాకయితే.. చిన్న సవరణ. ఏ దేశంలోనూ తోటి మనిషిని ప్రేమించే గుణం లేదిప్పుడు. పరమ స్వార్థ జీవితం అందరికీ అలవాటైపోయాక సమాజం కోల్పోయిన గుణాన్ని తల్చుకుంటూ ఇలా ఎవరికి వారు ఏడ్చుకోవటం తప్ప.

  అయితే ప్రేమ, సానుభూతి నశించిన ఈ కొత్త గుణాన్ని సార్వత్రీకరించలేమనుకుంటాను.

  “మన సమాజం లో ప్రస్తుతం కనబడుతున్నది మాత్రం….. డబ్బూ…ఆడంబరాలూ…కుల పిచ్చితో …సఫర్ అవుతున్న…రోబోట్లు మాత్రమే…”

  మానవతా విలువలు ఎక్కడినుంచి వస్తాయిక.

  మొత్తం మీద బూతు వ్యాఖ్యల బారిన మీరూ పడ్డారన్నమాట. ఇలాంటి కామెంట్‌ను వచ్చింది వచ్చినట్లుగా ఊడ్చి పారేయండి చాలు. అంతకు మించిన ప్రాధాన్యతను ఇవ్వొద్దు.

 8. @రాజశేఖర రాజు…
  చిన్న సవరణ. ఏ దేశంలోనూ తోటి మనిషిని ప్రేమించే గుణం లేదిప్పుడు…

  అంతేనంటారా??మన వాళ్ళే పక్క కమర్షియల్ గా తయరయ్యారేమో అనుకున్నా…ఉదయమ్ ఆరుకో-ఏడు గంటలకో వృత్తిలోకి పోయి ఏ అర్ధరాత్రో ఇంటికి చేరుకుని చాలా బిజీ గా ఉన్నమని గర్వంగా ఫీల్ అయిపోతూ, తన కుటుంబ సభ్యులు ఏమైపోతున్నారో కూడా తెలియ కుండా బతికేస్తూ…..ఈ మాత్రానికి బతకడం ఎందుకూ అని మన లాంటి వాళ్ళకు అనిపించి…నిశ్పృహ …డిప్రెషన్ వచ్చేస్తున్నాయండీ…వాళ్లతో పాటు మనకూ పరిగెట్టక తప్పని పరిస్తితులు….
  మన ఇంట్లో మనమే గెస్ట్ లయిపోయిన రోజులు దాపురించాయి….

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s