బి.జె.పి కర్ణాటక ‘నాటకం’ ముగిసేటట్లు కనిపించడం లేదు. యెడ్యూరప్ప ఒత్తిడితో ముఖ్యమంత్రి పీఠం నుండి ‘సదానంద గౌడ’ ను తొలగించిన బి.జె.పి అధిష్టానం ఇప్పుడు సదానంద గౌడ నుండి తాజా డిమాండ్లు ఎదుర్కొంటోంది. శాసన సభా పక్ష సమావేశం ఏర్పాటు చేయవలసిన సదానంద ఆ పని వదిలేసి అధిష్టానం ముందు సొంత డిమాండ్లు ఉంచాడు. సదానందకు రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి, ఆయన శిబిరంలోని ఈశ్వరప్పకు ఉప ముఖ్యమంత్రి పదవి, ఇంకా మంత్రివర్గంలో సగం పదవులు కావాలని సదానంద శిబిరం డిమాండ్ చేస్తున్నట్లు ‘ది హిందూ’ తెలిపింది.
శాసనసభా పక్ష సమావేశం లోపు డిమాడ్లపై ఏ విషయమూ తేల్చాలని సదానంద శిబిరం కోరుతోంది. తమకు 70 మంది ఎం.ఎల్.ఏ ల మద్దతు ఉందని యెడ్యూరప్ప-జగదీష్ షెట్టర్ శిబిరం చెబుతుండగా, 50 మంది ఎం.ఎల్.ఏ లు సదానంద శిబిరంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఉదయం 11 గంటలకు సమావేశం జరిపి షెట్టర్ ను నాయకుడుగా ఎన్నుకోవలసి ఉండగా ఇంకా అదేమీ జరగలేదు. సంవత్సర కాలంగా బి.జె.పి గ్రామ్ ఫోన్ రికార్డు కర్ణాటక వద్ద అరిగిపోయి “కర్ణాటక… టక.. టక…” అని కొట్టుకుంటోందని కార్టూనిస్టు కేశవ్ ఇలా అభివర్ణించాడు.
–