ఆటల్లో పురుష దురహంకారం స్పష్టంగా కొనసాగుతోందని ఆసియన్ సీనియర్ స్క్వాష్ ఛాంపియన్ షిప్ సాధించిన దీపిక పల్లికల్ అభిప్రాయపడింది. సానియా మీర్జా, జ్వాలా గుత్తా ల అభిప్రాయాలకు దీపిక మద్దతు పలికింది. లండన్ ఒలింపిక్స్ లో పురుషుల టీం ఎంపికలో పురుష ఆటగాళ్ళ మధ్య తలెత్తిన వివాదాన్ని ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ (ఎ.ఐ.టి.ఎ) పరిష్కరించిన తీరు పట్ల సానియా తీవ్ర అసంతృప్తి ప్రకటించిన సంగతి విదితమే. సానియా మీర్జా అసంతృప్తికి జ్వాలా గుత్తా మద్దతు ప్రకటించిన కొద్ది రోజులకే దీపిక వారిద్దరి అభిప్రాయాలకు గొంతు కలిపింది.
“అనేక సంవత్సరాలుగా అది స్పష్టంగానే కనపడుతోంది. సానియా మాత్రమే కాదు, జ్వాల కూడా ముందుకు వచ్చింది. అవును, ఆటల్లో పురుష దురహంకారం ఎల్లప్పుడూ కొనసాగుతూనే ఉంది” అని దీపిక తోటి మహిళా క్రీడాకారులకు బహిరంగంగా తోడు నిలిచింది.
లండన్ ఒలింపిక్స్ కోసం టీం లను ఎ.ఐ.టి.ఎ ఎంపిక చేసిన అనంతరం సానియా మీర్జా అసోసియేషన్ కు లేఖ రాసింది. ‘అసంతృప్తితో రగులుతున్న ఒక సుప్రసిద్ధ భారత టెన్నిస్ క్రీడాకారుడిని శాంతపరచడానికి ప్రలోభంగా ఉపయోగపడవలసి రావడం చాలా అవమానకరంగా ఉంద’ని సానియా ఆ లేఖలో పేర్కొంది. లేఖలో సానియా లియాండర్ పేస్ ను ఉద్దేశించిందని ‘ది హిందూ’ తెలిపింది.
లండన్ ఒలింపిక్స్ లో పాల్గొనే పురుషుల టీం ఎంపికలో ఆటగాళ్ల మధ్య తీవ్ర విబేధాలు తలెత్తాయి. భూపతి, బోపన్న లు తాము లియాండర్ తో జట్టుగా ఆడేది లేదని పత్రికా ముఖంగా ప్రకటించడంతో వివాదం రచ్చకెక్కింది. దేశ ప్రయోజనాలకు ఆడడం కంటే వ్యక్తిగత విబేధాలకే ఆటగాళ్లు ప్రాముఖ్యత ఇస్తున్నారని వీరి వివాదం ద్వారా దేశ ప్రజలకు అర్ధం అయింది.
డేవిస్ కప్ తో పాటు వివిధ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్లలో లియాండర్ అనేక సంవత్సరాలుగా దేశానికి పేరు ప్రతిష్టలు సంపాదించినా ఆయనతో జట్టు కట్టడానికి ఇతర ఆటగాళ్లు సిద్ధపడకపోవడం ఒక ఆశ్చర్యకరమైన విషయం. ఒక విధంగా దేశ ప్రజలను ఇబ్బంది పెట్టిన విషయం కూడా. పేస్ తో జట్టు కట్టడానికి స్పష్టమైన కారణం ఏదీ భూపతి ఎన్నడూ చెప్పలేదని కూడా వివిధ పత్రికలు తెలియజేశాయి. ఆ విధంగా చూసినా ఆటగాళ్ల అభ్యంతరాలు వ్యక్తిగతమైనవని అనుకోవలసి వస్తోంది.
తాము ఆరు నెలలనుండి జట్టుగా ప్రాక్టీస్ చేస్తున్నామనీ ఇప్పుడు ఒలింపిక్స్ కి ముందు విడదీయడం భావ్యం కాదని భూపతి, బోపన్నలు అన్నట్లు కొన్ని పత్రికలు, చానెళ్లు తెలిపాయి. ఆడితే ఇద్దరమూ జతగా ఆడతామనీ లేదంటే అసలే ఆడబోమని వారు బహిరంగంగానే పేర్కొన్నారు. అంటే పరోక్షంగా బెదిరింపులకు కూడా దిగారన్నమాట. భూపతి, బోపన్న ల అభ్యంతరాలు దేశ ఉమ్మడి ప్రయోజనాల రీత్యా పక్కన పెట్టదగినవిగా కనిపిస్తున్నాయి. అయినా ఆటగాళ్లు అందుకు సిద్ధపడకపోవడం సమర్ధనీయంగా లేదు.
ఇదంతా ఒక ఎత్తు కాగా పురుష ఆటగాళ్ల వివాదాన్ని పరిష్కరించడానికి ఎ.ఐ.టి.ఎ ఎంచుకున్న పరిష్కారం మరొక ఎత్తు. భూపతి, బోపన్నల తిరుగుబాటు ను గౌరవిస్తూ వారిని జంటగా కొనసాగడనికి ఎ.ఐ.టి.ఎ అనుమతించింది. మరో వైపు మిక్స్ డ్ డబుల్స్ లో సానియాను జతగా ఎంపిక చేసి లియాండర్ ను సంతృప్తిపరచడానికి ఎ.ఐ.టి.ఎ ప్రయత్నించిదన్నది సానియా ఆరోపణ. లియాండర్ సేవలు దేశానికి అవసరమని భావిస్తే, ఇతర ఆటగాళ్ల తిరుగుబాటును తిరస్కరించయినా సరే, తాను భావించిన పురుషుల టీం నే ఎ.ఐ.టి.ఎ ఎంపిక చేసినట్లయితే సంస్ధతో పాటు, మహిళా ఆటగాళ్ల వ్యక్తిగత సమగ్రతకు కూడా గౌరవనీయంగా ఉండేదేమో. దాని బదులు అందరినీ సంతృప్తిపరిచే ప్రయత్నం చేయడంతో ఇద్దరి పురుష ఆటగాళ్ల తిరుగుబాటుని గౌరవించి మహిళా ఆటగాళ్ల గౌరవాన్ని తేలిక చేసినట్లయింది.
ఈ నేపధ్యంలో, మహిళా క్రీడాకారుల అసంతృప్తిలో న్యాయం స్పష్టమే.
LOl మహిళా క్రీడాకారులు కూడా పురుషాధిక్యతని నమ్మడం లేదా? ఈ క్రీడాకారుణి మగవాళ్ళని ఆకర్షించడానికి స్లీవ్‌లెస్‌లు వేసుకుని పోజెస్ ఇచ్చిన ఫొటోలు ఇంటర్నెట్‌లో ఉన్నాయి. ఉదయం ఈ క్రీడాకారిణి పేరు సెర్చ్ ఇంజిన్‌లో వెతుకుతున్నప్పుడు కనిపించాయి. మగ క్రీడాకారులు ఎవరూ అలా శరీరాన్ని చూపించరు. మోడలింగ్ చేసేవాళ్ళలాగ అలా చూపించాల్సిన అవసరం మహిళా క్రీడాకారిణి ఏమొచ్చింది?
ప్రవీణ్ గారు, స్లీవ్ లెస్ అనేది ఒకానొక డ్రస్సింగ్ పద్ధతి. దానిని అలాగే చూడాలి. మగవారిని ఆకర్షించడానికి మాత్రమే స్లీవ్ లెస్ ధరిస్తారని భావించడం పొరబాటు. దీపిక స్పోర్ట్స్ లో ఉన్నత స్ధాయికి చేరుకున్న అమ్మాయి. అలాంటి వ్యక్తి మగవారిని ఆకర్షిస్తోందని ఎలా భావిస్తారు? ఆమెను వ్యక్తిగతంగా అవమానించేదిగా మీ వ్యాఖ్య ఉంది. ఆర్టికల్ సారాంశాన్ని కూడా మీ వ్యాఖ్య అపహాస్యం చేస్తోంది.
శరీరాన్ని చూపించి ఆకర్షించడం మగవారు చేయరనడం సత్య దూరం. సల్మాన్ ఖాన్ వ్యవహారం మీకు తెలియదా? చాతీ, కండలు ప్రదర్శించేవారు ఎందరు లేరు? రెండు మూడు గుండీలు విప్పేసి ఛాతీ ప్రదర్శించేవారు నిత్యం తారసపడుతుంటారు. సినిమాల్లో, యాడ్స్ లో మాస్క్యులినిటీని ప్రదర్శింపజేయడానికి వ్యక్తిత్వం కంటే కండల ప్రదర్శనపై ఆధారపడడం సర్వ సాధారణం. ఇవన్నీ మీ దృష్టిలో ఉన్నట్లు లేదు.
గూగుల్ ఇమేజేస్‌లో దీపిక పల్లికల్ ఫొటోలు చూస్తే అవి మగవాళ్ళని ఆకరిషించడానికి మోడలింగ్ చేసేవాళ్ళు వేసుకునే దుస్తులలాగా కనిపించాయి. కరణం మల్లేశ్వరి వెయిట్‌లిఫ్టింగ్ చేసే సమయంలోనే బనియన్ వేసుకునేది. ఇతర సందర్భాలలో సాధారణ దుస్తులే వేసుకునేది. కానీ దీపికా పల్లికల్ వస్త్రధారణ చూస్తే అలా లేదు.
పెళ్ళైన స్త్రీలకి ప్యాంట్-షర్ట్‌లు వేసుకునే స్వేచ్ఛ ఉండాలని వాదించిన మొట్టమొదటి తెలుగు బ్లాగర్‌ని నేనే. నేను నిజం తెలుసుకోకుండా వస్త్రధారణ విషయంలో prejudicial statements ఇచ్చే అవకాశం లేదు. కావాలంటే మీరు గూగుల్ ఇమేజెస్‌లో దీపికా పల్లికల్ ఫొటోలు మళ్ళీ చూడండి.
ప్రవీణ్, వస్త్రధారణకి సంబంధించి కొన్ని విపరీత ధోరణులు మెట్రో నగర సంస్కృతిలో కొనసాగుతున్నాయి. వ్యక్తిత్వ ప్రదర్శన కంటే శరీర ప్రదర్శన చేసి ఆకర్షించడం అలాంటి ధోరణిలో ఒక భాగంగా ఉంది. దీపిక ఆ సంస్కృతిని నమ్ముతోంది గనక ఆమె వస్త్రధారణ అలాగే ఉండడంలో ఆశ్చర్యం లేదు. కాని ఆ సంస్కృతిలో ఉంది గనక పురుష దురహంకారాన్ని తిరస్కరించే అర్హత లేదన్నట్లు వ్యాఖ్యానించడం సరైనదా? కాదని నా అభిప్రాయం. కొన్ని బలహీనతలు ఉన్నాయి గనక సామాజిక ఆధిపత్యాన్ని ప్రశ్నించే అర్హత లేదన్నట్లుగా మీ వ్యాఖ్య అర్ధం వస్తుంది.
I didn’t say that half dressed women are not privileged to talk about male chauvinism. Any way, those improperly dresses women can gain nothing by criticising male chauvinism while they themselves prefer to do things such as dressing improperly to divert the attention of men.
ప్రవీణ్, పై వ్యాఖ్యలో రెండు వాక్యాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి.
మేల్ ఛావునిజం ని వ్యతిరేకించడానికి వస్త్రధారణని అర్హతగా పెట్టడం అస్సలు బాగాలేదు. యౌవనంలో సహజంగా ఉండే స్త్రీ పురుష ఆకర్షణకీ, పురుష దురహంకారాన్ని వ్యతిరేకించే చైతన్యానికీ లేని వైరుధ్యాన్ని మీరు బలవంతంగా చొప్పిస్తున్నారు.
Usually male sports players do not wear such costumes to divert attention of women. If female sports players do so, should we understand it as norm of the age? Usually, men ignore such women who cry on men while they themselves are experienced in diverting the attention of men.
“ఎవరూ అలా శరీరాన్ని చూపించరు. మోడలింగ్ చేసేవాళ్ళలాగ అలా చూపించాల్సిన అవసరం మహిళా క్రీడాకారిణి ఏమొచ్చింది?”
ప్రవీణ్ గారు, మోడలింగ్ చేయాలా, వద్దా అనేది ఆ అమ్మాయి నిర్ణయం. మోడలింగ్ చేసినంత మాత్రాన, ఆ అమ్మాయి కి పురుషాదిక్యం గురించి మాట్లాడే అర్హత లేదనుకోవటం లేక అపహాస్యం చేయటం తప్పు.
” Any way, those improperly dresses women can gain nothing by criticising male chauvinism”
What’s properly dressed? It’s all subjective. Any western clothing was considered *improper* a few decades ago. Fashion and dressing cultures change over time. One cannot be the moral police and dictate women what to wear.
“Usually, men ignore such women who cry on men while they themselves are experienced in diverting the attention of men.”
Isn’t that the whole point? That men still control/influence our society? Even if she wears skimpy clothing, does that mean she doesn’t have to be taken seriously? I’m sorry, but your views on this topic are very anachronistic and sexist.
By the way, what’s wrong with modeling? I did google her images and I found nothing inappropriate.
Hi Gotham, you’re in time. Your comment is somewhat more detailed.
Gowtam, Tell me who is the male sports person who exhibits his shoulders and the upper part of the chest?
“మగ క్రీడాకారులు ఎవరూ అలా శరీరాన్ని చూపించరు. మోడలింగ్ చేసేవాళ్ళలాగ అలా చూపించాల్సిన అవసరం మహిళా క్రీడాకారిణి ఏమొచ్చింది?” అనే వాక్యంలో “మగ క్రీడాకారులు” అనే ఫ్రేస్ తీసేసి, “ఎవరూ అలా శరీరాన్ని చూపించరు. మోడలింగ్ చేసేవాళ్ళలాగ అలా చూపించాల్సిన అవసరం మహిళా క్రీడాకారిణి ఏమొచ్చింది?” అని వ్రాసి, అసలు విషయాన్ని మింగెయ్యాల్సిన అవసరం మీకేమి వచ్చింది?
గౌతమ్, పల్లెటూర్లలో ఆడవాళ్ళు ప్యాంట్-షర్ట్‌లు వేసుకోవడాన్ని అశ్లీలం అనుకునేవాళ్ళ గురించి నేను మాట్లాడలేదు. అలా అనుకునే మూర్ఖులకి నేను చెప్పేది ఏమీ ఉండదు. అరగంట క్రితమే నేను ట్రైన్ దిగి ఇంటికి వచ్చాను. నిన్న మా పూర్వికుల ఊరిలో ఉన్నప్పుడు విన్న వార్త ఇది. ఒక మండంగి వారి అమ్మాయి అదే ఇంటి పేరు ఉన్న ఇంకో అబ్బాయిని ప్రేమించి లేచిపోయింది. ఆ అబ్బాయి ఆమెకి వరుసకి అన్నయ్య అవుతాడని భావించి ఆమె తల్లితండ్రులు ఆమెని ఇంటికి పట్టుకొచ్చి, ఆమెని ఇంకో అబ్బాయికి ఇచ్చి పెళ్ళి చేశారు. మండంగి అనే ఇంటి పేరు ఉన్నవాళ్ళందరూ మా బంధువులు కాదు, కనీసం ఒకే కులంవాళ్ళు కూడా కాదు. అనేక తరాలుగా కులాంతర వివాహాలు చేసుకోకుండా ఉన్న రెండుమూడు హెటెరోగేమస్ జాతులలో అదే ఇంటి పేరు ఉన్నవాళ్ళు అనేక మంది ఉన్నారని తెలిసింది. అయినా ఇంటి పేరు ఒకటేనని చెప్పి, ఆమె ప్రేమించిన అబ్బాయి ఆమెకి వరుసకి అన్నయ్య అవుతాడని కాంక్లూజన్‌కి వచ్చారు. ఇలాంటి మూర్ఖులని చూసిన నాకు మూఢ నమ్మకాల యొక్క రియల్ ఫేస్ ఎలా ఉంటుందో తెలియనిది కాదు. కానీ నువ్వు నన్నే మూఢ నమ్మకాలని నమ్మేవాణ్ణి చూసినట్టు చూస్తున్నావు. పల్లెటూర్లలో ఒకప్పుడు లంగా వేసుకోకుండా మడి చీర కట్టుకునే పద్దతి ఉండేది. అప్పట్లో లంగా వేసుకోవడాన్ని బూతు అనుకునేవాళ్ళు. వస్త్రధారణ విషయంలో ఎలాంటి మూఢ నమ్మకాలు ఉన్నాయి, ఎన్ని మూఢ నమ్మకాలు ఉన్నాయి వంటి విషయాలు పల్లెటూర్లు తిరిగి వచ్చిన నాకు ప్రత్యక్షంగా చూసిన అనుభవమే ఉంది. వాటి గురించిన ఉదాహరణలు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. సిటీలో ఉంటూ, ఇంటర్నెట్‌లో బూతు బొమ్మలు చూస్తూ, తమ భార్యలూ, అక్కాచెల్లెళ్ళు మాత్రం అలాంటి దుస్తులు వేసుకోకూడదు అని అనుకునే హిపోక్రైట్‌లకి ఆ విషయం చెప్పాలి.
భుజాలూ, తొడలూ కనిపించే దుస్తులు కావాలని వేసుకుని, పురుషులని వేశ్యలలాగ ఆకర్షించి, ఆ రకంగా పురుషాధిక్యతని పాట్రొనైజ్ చేసి, ఆ తరువాత పురుషులు మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు అని వాదించే రకంవాళ్ళ గురించి నేను ఇక్కడ మాట్లాడాను. అంతే కానీ అన్ని రకాల పాశ్చాత్య దుస్తులనీ అశ్లీల దుస్తులు అని అనుకునే రకం మూర్ఖుల గురించి నేను ఇక్కడ మాట్లాడలేదు.
ప్రవీణ్ గారూ, ‘మగ క్రీడాకారులు’ అన్న ఫ్రేజ్ తీసివెయ్యడం బహుశా గౌతమ్ గారు ఉద్దేశ్యపూర్వకంగా చేసింది కాదు కావచ్చు. దానివల్ల గౌతమ్ గారు చెప్పిన విషయంలో అదనపు మార్పులు ఏమీ రావడం లేదనుకుంటాను. కనుక ఆ అంశాన్ని వదిలేయగలరు.
ఆయన మాట్లాడినది “శరీరం సఘం కనిపించే దుస్తులు కావాలని వేసుకుంటూ, మగవాళ్ళు తమని చిన్న చూపు చూస్తున్నారని వాదించే రకం” క్రీడాకారిణులకి అనుకూలంగా. కరణం మల్లీశ్వరి వెయిట్‌లిఫ్టింగ్‌లో గెలవకుండా చెయ్యడానికి కొంత మంది భారతీయ మాస్టర్‌లే ప్రయత్నించినప్పుడు నేను మల్లీశ్వరినే సమర్థించాను. ఆమె క్రీడలని క్రీడల కోసమే ఆడింది కాబట్టి ఆమె పక్షాన ఉండడంలో తప్పనిపించలేదు. దీపికా పల్లికల్ విషయం అది కాదు. మోడలింగ్ చేసేవాళ్ళలాగ శరీరాన్ని చూపిస్తూ, అది కూడా క్రీడలతో సంబంధం లేకుండా – అలా క్రీడలని ‘పురుషులని రంజింపచెయ్యడానికి డెడికేటెడ్ అయిన మోడలింగ్ స్థాయికి’ దిగజార్చి, క్రీడా రంగంలోనూ పురుషాధిక్యత కొనసాగుతోంది అని ఏడిస్తే ఎలా అర్థం చేసుకోవాలి.
“ఆయన మాట్లాడినది “శరీరం సఘం కనిపించే దుస్తులు కావాలని వేసుకుంటూ, మగవాళ్ళు తమని చిన్న చూపు చూస్తున్నారని వాదించే రకం” క్రీడాకారిణులకి అనుకూలంగా.”
ప్రవీణ్, ఇది నిజం కాదు. అసలు మీ వ్యాఖ్యానంలోనే దోషం ఉంది. కావాలని శరీరం సగం కనిపించే దుస్తులు వేసుకుంటున్నారన్న మీ వ్యాఖ్య సరికాదు. మీరు ముందు దుస్తుల ధారణ నుండి పురుష దురహంకార వ్యతిరేకతను వేరు చేయవలసిన అవసరం బాగా ఉంది. ఆ రెండింటికీ లంకె పెట్టడం వల్ల తప్పు భావాలు వ్యక్యం చేస్తున్నారు. పాశ్చాత్య సంస్కృతికో, మరో సంస్కృతికో ప్రభావితం కావడం ఒక అంశం. పురుష దురహంకారం అనే సామాజిక చెడుగును వ్యతిరేకించడం మరొక అంశం. ఈ రెండింటినీ కలిపేసి అయోమయంలో ఉంటూ ఒక క్రీడాకారిణిపై అర్ధం లేకుండా వ్యతిరేక వ్యాఖ్యానం చేస్తున్నారు.
ఈ విషయంలో మీ అభిప్రాయం మార్చుకోవడానికి ఇష్టపడకపోతే, దాన్ని అలా ఉండనివ్వండి. మరింత పొడిగించి దీపిక లాంటి మహిళా క్రీడాకారిణులపై అసంగత వ్యాఖ్యానాలు చేయడం సమర్ధనీయం కాదు.
అభిప్రాయాన్ని మార్చుకోవడం ఇష్టం లేకపోవడం కాదు. విమర్శకులలో ఉన్న తప్పులని బయటపెట్టడంలో తప్పేమీ లేదు కదా.
Read this: http://streevimukti.mlmedia.net.in/143691426
ఈ లింక్ చదవండి: http://streevimukti.mlmedia.net.in/143691426