ఏప్రిల్ మొదటివారంలో నేనొక వార్తలో ఫుకుషిమా అణు ప్రమాదం వల్ల వెలువడిన రేడియేషన్ అమెరికా, యూరప్ లకి కూడా వ్యాపించిందని ఒక వాక్యం రాశాను. దానికి అచంగ గారు అభ్యంతరం చెప్పారు. ఫుకుషిమా రేడియేషన్ అమెరికా, యూరప్ లవరకూ వచ్చిందనడానికి ఆధారాలు లేవనీ, ఆధారాలు చూపిస్తే తన అభ్యంతరాన్ని వెనక్కి తీసుకుంటానని రాశారు. తాను వృత్తిరీత్యా ఎకాలజిస్టు కావడమే తన సవాలుకు అర్హత అన్నారు. ఆయన సవాలును పక్కనబెట్టి ఆధారాలు మాత్రం ఇస్తానని చెప్పాను. చెప్పినట్లే ఏప్రిల్ 10 వ తేదీన ఫుకుషిమా రేడియేషన్ అమెరికా, యూరప్ లకి విస్తరించిందని చెబుతూ ఒక ఆర్టికల్ ఈ బ్లాగ్ లో ప్రచురించాను. దానికి ఒక ఆధారంగా కాలిఫోర్నియా పాల ఉత్పత్తుల్లో ఫుకుషిమా రేడియేషన్ కనుగొన్నట్లు కాలిఫోర్నియా యూనివర్సిటీ వెలువరించిన నివేదికను చూపాను. కాలిఫోర్నియా యూనివర్సిటీ కి చెందిన ‘డిపార్ట్ మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఇంజనీరింగ్’ తన వెబ్ సైట్ లో ఈ నివేదిక ప్రచురించింది. పాఠకుల సౌకర్యార్ధం ఆ లింక్ ని ఇక్కడ ఇస్తున్నాను. దానిని ఇక్కడ చూడవచ్చు.
ఈ నివేదిక ప్రారంభంలోనే పాలల్లో ఫుకుషిమా రేడియేషన్ కి సంబంధించిన ఆనవాళ్ళు కనుగొన్నట్లు పేర్కొన్నారు. కాలిఫోర్నియా పాలల్లో రేడియేషన్ కనుగొన్నామని ఆ నివేదిక మొదట్లోనే చెప్పింది. ప్రారంభ పేరా ఇలా ఉంది.
The following are results for milk samples obtained from a Bay Area organic dairy where the farmers are encouraged to feed their cows local grass. We have detected I-131, Cs-134, and Cs-137 and are tracking their levels.
I-134 (అయోడిన్ ఐసోటోప్), Cs-134, Cs-137 (సీసియం ఐసోటోప్ లు) న్యూక్లియర్ ఫిషన్ వల్ల ఉత్పత్తి అయ్యే రేడియో ధార్మిక పదార్ధాలు. సహజంగా పాలలో ఉండేవి కావు. వీటిని కాలిఫోర్నియా పాలల్లో కనుగొన్నామని యూనివర్సిటీ తెలిపింది. స్ధానికంగా ఉన్న గడ్డిని తినే పశువులు గడ్డితో పాటు దానిపై చేరిన ఫుకుషిమా రేడియేషన్ తినడం వల్ల అది పాలల్లో కూడా ప్రత్యక్షమయింది.
పాల ప్యాకెట్లపైన ఫలానా తేదీలోపు ఉపయోగిస్తే మంచిదన్న సూచన ఉంటుంది. ఉత్పత్తి తయారు చేసిన తేదీకి 17-19 రోజులు కలుపుకుని ‘best by’ తేదీని ముద్రిస్తారు. ఆ విషయం నివేదికలోనే చెప్పారు. అయితే, ఈ సంగతి మరిచిపోయి తాము కొన్ని రోజులు best by తేదీనే ‘తయారీ తేదీ’గా తీసుకున్నామని పొరబాటున అలా జరిగిందని వారు చెప్పుకున్నారు. అది ఒక సంగతి.
ఫుకుషిమా ప్రమాదం జరిగింది మార్చి 11, 2011 తేదీన. ‘best by 3/25’ (మార్చి 25) అని ఉన్న పాలలో యూనివర్సిటీ వారు రేడియేషన్ ని కనుక్కోలేదు. కానీ best by తేదీగా ఏప్రిల్ 4 ఉన్న ఉత్పత్తుల్లో రేడియేషన్ కనుగొన్నామని వారు తెలిపారు. ఆ సంగతి వారు ఇలా తెలిపారు.
Because the “best by” date on milk is approximately 17-19 days after the milk has been bottled, our milk sample with a date of 3/25 represents milk bottled on approximately 3/5. Since this is before the Fukushima crisis, we do not expect to see any fission product radioisotopes and do not see any within our sensitivity. Our first sample of milk showing any signs of radioisotopes has a date of 4/4, which means it was bottled around 3/18. This is approximately when the trace radioactive isotopes were first seen in the Bay Area. (color added)
(పాఠకుల సౌకర్యార్ధం పై భాగాన్ని స్క్రీన్ షాట్ తీసి పక్కన ఇస్తున్నాను. చూడగలరు.)
ఈ పేరా ద్వారా ఈ నివేదిక ఏం చెబుతోంది? ప్యాకెట్ పైన ‘best by’ తేదీ గా ‘మార్చి 25’ ఉన్న పాలు ‘మార్చి 5’ తేదీన ఉత్పత్తి చేసి ఉంటారు గనక అందులో ఫుకుషిమా రేడియేషన్ ఉంటుందని భావించలేమని చెప్పింది. ఆ సంగతి పైన ఆంగ్లంలో ఉన్న భాగంలోని నల్ల అక్షరాల్లో చూడవచ్చు. కానీ, ఆ తర్వాత అసలు విషయాన్ని నివేదిక చెప్పింది. ‘best by’ తేదీ ‘ఏప్రిల్ 4’ గా ఉన్న పాలు ‘మార్చి 18’ తేదీన ఉత్పత్తి చేసి ఉంటారనీ, ఆ పాలల్లో మాత్రం తాము ఫుకుషిమా రేడియేషన్ కనుగొన్నామనీ నివేదిక తెలిపీంది. కాలిఫోర్నియా యూనివర్సిటీ వారు ఫుకుషిమా రేడియేషన్ మొదటిసారి కనుగొన్న పాలు మార్చి 18 తేదీన ఉత్పత్తి చేసినవి. అంటే ఫుకుషిమా ప్రమాదం జరిగిన వారం రోజులకే అమెరికాలోకి అది ప్రవేశించినట్లు తెలిసిందన్నమాట.
కనుక ఇక్కడితో అమెరికాలో ఫుకుషిమా రేడియేషన్ కనుగొన్నట్లు అచంగ గారు గ్రహించి ఉండాలి. కానీ ఆయన వాస్తవాన్ని నిలబెట్టడానికి ఆసక్తి చూపలేదు. దానికంటే నేను స్వీకరించని సవాలును తాను నిలబెట్టుకోవడమే ముఖ్య కర్తవ్యంగా ఆయనకి తోచింది. అందువల్ల కాలిఫోర్నియా పాలల్లోని రేడియేషన్ కి ఫుకుషిమా ప్రమాదంతో సంబంధం లేదని ఎకాలజిస్టు అచంగ గారు చెప్పదలిచారు. తద్వారా పాఠకులనూ, తనను నమ్ముకున్నవారినీ తప్పుదారి పట్టించాలని తలపెట్టారు. పై పేరాను ఎర్ర భాగంతో సహా మొత్తంగా ఉటంకిస్తే కాలిఫోర్నియా పాలల్లో ఫుకుషిమా రేడియేషన్ చేరిందని ఇట్టే అర్ధం అవుతుంది. కానీ పాఠకులకు అలా అర్ధం కాకూడదు. అర్ధం కాకుండా ఉండాలంటే ఏమి చేయాలా అని ‘రెండు మూడువారాల పాటు ఆయన జుట్టు పీక్కున్నారు’. యూనివర్సిటీ చెప్పిన వాస్తవాలను నిరాకరించడం సాధ్యం కాదు గనక అవే వాస్తవాలకు ‘తనకు అనుకూలంగా ఉన్న భాగాన్ని మాత్రమే ఎత్తిరాయడం ద్వారా’ సొంత అర్ధాలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఆయన తన ఆర్టికల్ లో ఇలా అన్నారు.
—అంటే వారు పరిశోధనకు తీసుకున్న పాల నమూనా 5-3-11 లేదా అంతకుముందు ఉత్పత్తి చేయబడి బాట్లింగ్ చేసి ఉండాలి. ఫుకుషిమా ప్రమాదం జరిగింది 11-3-11 న అయితే మరి దానికీ ముందు ఉత్పత్తయ్యిన పాలల్లో రేడియేషనుకూ సంబంధం ఎలా అంటగట్టారో ఆయనకే తెలియాలి!—
కానీ యూనివర్సిటీ వారు ప్రమాదం జరగడానికి ముందు పాలల్లో రేడియేషన్ లేదనే చెప్పారు తప్ప ఉందని చెప్పలేదు. కనుక లేని రేడియేషన్ తో ఫుకుషిమా కు సంబంధం అంటగట్టే అవకాశమే నాకు (చెప్పాలంటే యూనివర్సిటీకి కూడా) లేదు. రేడియేషన్ కనుగొన్న శాంపిళ్ళు ప్రమాదం జరిగాక మార్చి 18 న సేకరించినవేనని (ఎర్ర అక్షరాల్లో హైలైట్ చేసినది) స్పష్టంగానే పేర్కొన్నారు. అయితే ఆ భాగాన్ని అచంగ గారు తీసేసి ఒక్క నల్ల అక్షరాల్లో ఉన్న భాగాన్ని మాత్రమే తన ఆర్టికల్ లో ప్రచురించి పాఠకులను ఘోరంగా దారి తప్పించడానికి ప్రయత్నించారు.
ఫుకుషిమా రేడియేషన్ అమెరికా వరకూ విస్తరించిందని చెప్పడానికి కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధనని నేను ప్రస్తావించాను. అమెరికా వరకూ ఫుకుషిమా రేడియేషన్ వ్యాపించిందనడానికి ఆధారాలు లేవని అచంగా గారు వాదించారు. అప్పటికి తానా విషయాన్ని నమ్మారు గనక అలా వాదించడంలో తప్పు లేదు. కాకపోతే దానికి ఆధారాలు దొరికాకయినా తన అభిప్రాయాన్ని ఆయన మార్చుకోవాలి. ఎకాలజిస్టు గా అది అవసరం. ఆధారాలు నేను చూపినపుడు తన అభిప్రాయాన్ని సవరించుకోవడానికి బదులు ఆధారాలకే మాసిపూయాలని ప్రయత్నించడం సరికాదు.
చర్చలో ఉన్న అంశం ‘ఫుకుషిమా రేడియేషన్ అమెరికా, యూరప్ లకి వ్యాపించిందా లేదా’ అన్నది. అంతే తప్ప ఎంత రేడియేషన్ అయితే మనిషికి ప్రమాదం అన్నది నేను చర్చించలేదు. నేను చర్చించ లేదు గనక అచంగ అభ్యంతరం చెప్పే సమస్య తలెత్తదు. కానీ చర్చలో లేని అంశాన్ని, నేను ప్రస్తావించని అంశాన్నీ వివరిస్తూ తన ఎకాలజీ పరిజ్ఞానాన్ని వెళ్ళబుచ్చుకునే ప్రయత్నం అచంగ చేశారు. దానికి తనకు తానే ఒక అవకాశాన్ని సృష్టించుకున్నారు. ‘అమెరికాకి రేడియేషన్ వచ్చిందే అనుకుందాం’ అంటూ అవసరంలేని పాండిత్యాన్ని ఆయన ప్రదర్శించారు.
‘అమెరికాకి రేడియేషన్ వచ్చిందే అనుకుందాం’ అని ఊరకనే అనలేదీయన. కాలిఫోర్నియా పాల నివేదికను ఈయన పూర్తిగా చదివారు. (ఒక పేరాను సగం చదివి కంక్లూజన్ కి రావడం ఎవరూ చేయరు. ఎకాలజిస్టు అయితే అసలు చేయరు.) దాని ద్వారా ఫుకుషిమా రేడియేషన్ అమెరికా కి చేరిందన్న సంగతి ఈయనకి అర్ధం అయింది. ఎకాలజిస్టు గనక అర్ధం కాకుండా ఉండదు. కానీ దానిని ఒప్పుకోవడానికి ఎకాలజిస్టు గారికి ‘అహం’ అడ్డు వచ్చింది. అంతేకాక సవాలు ‘ఎలాగయినా’ నిలబెట్టుకునే బృహత్తర కర్తవ్యం తన భుజాలపై తానే వేసుకున్నారీయన. అందుకని తనకు తానే అవకాశాన్ని సృష్టించుకుని చెర్నోబిల్ లో ఎంత రేడియేషన్ విడుదలయిందీ, ఫుకుషిమాలో ఎంత విడుదలయిందీ, అసలు ఎంతయితే మనిషికి ప్రమాదం అంటూ చర్చకి అవసరం లేని పాండిత్యం చూపారు.
అసలీయన సవాలు విసిరిందే ‘ఫుకుషిమా రేడియేషన్ అమెరికా, యూరప్ ల దాకా రాలేదని.’ దాన్ని వదిలి ‘ఎంతయితే ప్రమాదం’ అంటూ చర్చను ఎత్తుకున్నారు. తాను చేసిన సవాలు నిలవదని అర్ధం అయ్యాక దాన్ని వదిలి తనకు తెలిసిన మరో అంశం చెప్పడం మొదలు పెట్టారు. చర్చాంశం నుండి పాఠకులను పక్కదారి పట్టించడానికి ప్రయత్నించారు. పాఠకులను ‘పక్కదారి’ మాత్రమే కాక, ‘తప్పుదారి’ కూడా పట్టించడానికి ప్రయత్నించారు. చర్చలో లేని అంశం గురించి పాండిత్యం ప్రదర్శించడం ‘పక్కదారి పట్టించడం’ కాగా, యూనివర్సిటీ నివేదికలోని ప్రధాన అంశాన్ని రాకుండా చూస్తూ తన అసత్య వాదనకు మద్దతుగా ఉన్న భాగాన్ని మాత్రమే పునర్ముద్రించడం ‘తప్పుదారి పట్టించడం.’
అసలు సంగతి ఉన్న భాగాన్ని పాఠకుల దృష్టి నుండి తప్పించి వారిని తప్పు దారి పట్టించడం ఎవరికీ తగని పని. ఎకాలజిస్టు కి అయితే అసలే తగదు. అలా చేస్తే వారి వృత్తికే ద్రోహం చేసినట్లు అర్ధం. సమస్త వృత్తులూ ప్రజా జీవనాన్ని సౌకర్యవంతం చేయడానికి తప్ప తమ వృత్తి ద్వారా చేకూరిన జ్ఞానాన్ని ప్రజలను, బ్లాగర్లను తప్పు దారి పట్టించడానికి కాదు. ‘అసత్య ప్రచారాన్ని’ బైట పెట్టే పేరుతో ఇలాంటి పనికి దిగడం పాఠకులకు జుగుప్సను కలిగించేదిగా ఉంది. బ్లాగర్లకు, పాఠకులకు ఒక ముఖ్య సమాచారాన్ని ఇచ్చే అవకాశాన్ని ఆయన ఆ విధంగా ‘ఫుకుషిమా రేడియేషన్’ తరహాలో కలుషితం చేశారు.
అచంగ గారు తన ఆర్టికల్ లో అనవసర విన్యాసాలు ఇంకా ప్రదర్శించారు. స్వతంత్ర బ్లాగర్లు శ్రమకోర్చి ఒక చోటికి చేర్చిన సమాచారాన్ని ‘శాస్త్రబద్ధత’ పేరుతో తిరస్కరించారు. ఆయా అంశాలకు తగిన శాస్త్రబద్ధ ఆధారాలను లింక్ ల ద్వారా సమకూర్చినప్పటికీ అవి చూడకుండా బ్లాగర్లను కించపరచడానికి సైతం పూనుకున్నారు. ‘షూటింగ్ ద మెసెంజర్’ సూత్రాన్ని పాటిస్తూ సమాచారం వెనుక ఉన్న శాస్త్రబద్ధతను గుడ్డిగా నిరాకరించారు. సమాచారాన్ని పాఠకుల ముందుకు తెచ్చిన వారి ‘క్రెడిబిలిటీ’ ని శంకించడానికి సాహసించారు. సమాచారం తెచ్చినవారి ‘క్రెడిబిలిటీ’ పై బురద చల్లి తద్వారా శాస్త్రబద్ధ సమాచారంపైన పాఠకులకు నమ్మకం లేకుండా చేయడానికి పూనుకున్నారు. అచంగ గారి ఇతర విన్యాసాలను మరో పోస్టు ద్వారా చర్చిస్తాను.
ఇదంతా పాత ప్రయోగమే. ఇంతకు ముందు వాళ్ళు “అసైన్స్ కబుర్లు” అనే బ్లాగ్ పెట్టి నా మీద అలాంటి ప్రయోగమే చేసి వ్యాసాలు వ్రాసారు. ఆ బ్లాగ్‌లో ఒక్క పేజ్ మాత్రమే చూసి తరువాత ఇగ్నోర్ చేశాను. ఆ బ్లాగ్‌కి శ్రీకాకుళం, రాయగడల ఐపి అడ్రెస్‌ల నుంచి హిట్స్ దాదాపుగా రాకపోవడం వల్ల ఆ బ్లాగ్‌ని నేను చదవడం లేదనే అనుమానం వచ్చి ఆ బ్లాగ్ మూసేశారు.
I have to wonder if we would be facing this crisis if the International Atomic Energy Agency had focused on inspecting the safety of the very real power stations of the world instead of wasting all their time and resources trying to find the fantasy nuclear weapons of Iraq Iran syria and North korea