దళిత ద్వేషం, హిందూ ఉన్మాదంతో కుళ్లిపోతున్న బూతుగాడి బూతులివే


పాఠకులు ముందుగా నన్ను క్షమించాలి. బూతు వెధవల ‘బూతు దాడి’ ఎదుర్కోవడానికి నాకు మరో మార్గం కనిపించడం లేదు.

వీళ్లకి చదువు ఎలా అబ్బిందో తెలియదు గానీ ‘సమాచార విప్లవం’ ద్వారా సామాన్యులకి అందుబాటులోకి వచ్చిన బ్లాగింగ్ వేదికల్ని కూడా బూతులతో నింపేస్తున్నారు. సభ్యత మరిచి పదిమందిలో బూతులు మాట్లాడేవారిని నలుగురూ ఈసడించుకుంటారు. అలాంటివారు తోటివారి ఈసడింపులతోనయినా బుద్ధి తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కానీ ఈ బ్లాగ్బూతుగాళ్లకి ఆ అవకాశం లేకుండా పోతోంది. వీళ్ళ బూతుల్ని బహిరంగం చేస్తేనయినా ఫలితం ఉంటుందేమోనని బూతు వ్యాఖ్యానాల స్క్రీన్ షాట్లు ఇక్కడ ఇస్తున్నాను.

తల్లిదండ్రుల ప్రేమ విశ్వజనీయమైనది. వారు లేనిదే మానవ జన్మ సాధ్యం కాదు. అందువల్లనే తన తల్లిదండ్రులను గౌరవించే వారంతా ఇతరుల తల్లిదండ్రులనూ గౌరవిచాలని తెలుసుకుంటారు. తల్లితనానికీ, తండ్రితనానికీ ఉన్న పూజనీయతని గ్రహించి మసులుకుంటారు. కానీ ఈ బూతు వెధవ అలాంటి మానవీయ విలువలకు అతీతంగా తయారయ్యాడు. నేరుగా మా అమ్మనీ, నాన్ననీ, అక్కనీ, చెల్లెలినీ సంబోదిస్తూ బూతులు రాస్తున్నాడు.

నేను బైటపెడుతున్నవి, గత కొద్ది రోజులలో రాసిన బూతులు మాత్రమే. నా బ్లాగ్ మొదలు పెట్టినప్పటినుండీ ఇదే వరస. వీడొక్కడే కాదు. ఇంకా ఉన్నారు. ఈ మధ్య కాలంలో రెచ్చిపోతున్నది వీడే. ముఖ్యంగా ఫుకుషిమా ప్రమాదంపైనా, అణు ధార్మికత పైన రాస్తున్నప్పటినుండీ పేట్రేగిపోయాడు.

జపాన్ లో జరిగిన ఫుకుషిమా అణు ప్రమాదం గురించి నేను ఒక ఆర్టికల్ లో రాశాను. ఫుకుషిమా రేడియేషన్ అమెరికా, యూరప్ ల వరకూ వచ్చిందని నేను అందులో రాశాను. అది ఆధారరహితమనీ, ఆధారాలుంటే చూపాలనీ ఒక ఎకాలజిస్టు గారు నాకు సవాలు విసిరారు. నేను సవాలు స్వీకరించలేదు. ఫుకుషిమా లాంటి ప్రమాదాలు మనిషి భవిష్యత్తుకే సవాలు లాంటివి. పాఠకులు, బ్లాగర్లు ఉమ్మడిగా అధ్యయనం చేసి తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలను వ్యక్తిగత సవాళ్ళ స్ధాయికి కుదించడం నాకు ఇష్టం లేదు. అందుకే సవాలు స్వీకరించలేదు.

కానీ సమాచారం కోసం ఆధారాలు ఇస్తానని చెప్పాను. పాఠకుల కోసం అది అవసరమని భావించి మరో ఆర్టికల్ ఆధారాలతో రాశాను. ఎకాలజిస్టు గారు ఆ ఆధారాలకు శాస్త్రబద్ధత లేదన్నారు. శాస్త్రబద్ధత ఉందని నిరూపిస్తూ మరి కొన్ని ఆర్టికల్స్ రాశాను. అలా రాసిన ఆర్టికల్స్ క్రింద కూడా ఈ బుర్ర తక్కువ వెధవ బూతులు రాశాడు.

స్క్రీన్ షాట్ లో చివరి కాలమ్ (column) లో వీడి వ్యాఖ్యానాలు ఏ పోస్టు కింద రాశాడో చెబుతాయి. దానిని బట్టి ఈ వెధవలకి వస్తున్న బూతు ప్రేరేపణకి కారణం అర్ధం చేసుకోవచ్చు.  

ఇంటర్నెట్ లో అణు శాస్త్రవేత్తలు, అణు ధార్మిక శాస్త్రవేత్తలు, రాజకీయార్ధిక విశ్లేషకులు ఫుకుషిమా అణు ప్రమాదం గురించి చెప్పిన విషయాలు నేను రాస్తుంటే వాటి కింద వీడు బూతులు రాస్తాడు. గుజరాత్ ముఖ్యమంత్రి మోడి ని, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ విమర్శించిన విషయం నేను రాస్తే వీడికి నచ్చదు. బంగ్లాదేశ్ అని రాయబోయి మియాన్మార్ అని రాస్తే ఆ సంగతి కూడా బూతుల్తోనే చెబుతాడు. దేశ ఆర్ధిక సమస్యలని పక్కనబెట్టి భారత ప్రధాని మన్మోహన్ యూరోజోన్ ఆర్ధిక సమస్యల పైన పాఠాలు చెప్పడంపైన ‘ది హిందూ’ ఇచ్చిన కార్టూన్ ని ముద్రిస్తే పాపం వీడి రక్తం ఉడికిపోతుంది.  ‘ది హిందూ’ వెబ్ సైట్ లో ఓ కామెంట్ రాస్తే దాన్ని నా బ్లాగ్ లో మళ్ళీ ఎత్తి రాసి బూతుల్తోనే వీడు ఆశ్చర్యం వ్యక్తం చేస్తాడు.

ఈ కుసంస్కారికి రక్తం నిండా బూతులే ప్రవహిస్తాయి. ఎర్ర, తెల్ల రక్తకణాలకి బదులు వీడి రక్తం నిండా బూతు కణాలే ఉంటాయి కాబోలు. అక్కడ చోటు చాల్లేదేమో వీడి వేళ్లనుండి కీ బోర్డు ద్వారా నా బ్లాగ్ లో ఒలికిస్తున్నాడు.

ఈ బూతోత్తముడు హిందూ ఉన్మాదంతో కుళ్లిపోతుంటాడని వీడి వ్యాఖ్యల ద్వారా అర్ధం చేసుకోవచ్చు. మోడిని నితీశ్ విమర్శిస్తే వీడు ‘క్రిస్టియన్ …….’ అంటూ అసహ్యంగా రాస్తాడు. భారత దేశంలో క్రిస్టియన్లు అంటే దళితులే. దళితుడుగా నేను ఎదుర్కొన్న అవమానాలు నా బ్లాగ్ లో కొన్నిసార్లు ప్రస్తావించాను. నాపై వీడు కుమ్మరిస్తున్న ‘బూతు ద్వేషాని’కి అదొక కారణమన్నమాట. ‘దొమ్మరోడా’ అనడమూ అందుకే. దళితులు బ్లాగుల్లోకి వస్తున్నారన్న అక్కసుని వీడిలా వెళ్లగక్కుతున్నాడు.

దళితులంటే వీడికి ద్వేషం. హిందూ మతోన్మాదం తో కుళ్లిపోవడం అంటే పరమ ఇష్టం వీడికి. అందుకే మోడి లాంటి మతోన్మాద పాలకులను ఎవరైనా విమర్శించిన విషయం రాస్తే ఈ బురద సన్నాసి సహించలేడు. ఉచ్ఛ, నీచాలు మరిచి, అమ్మ, ఉపాధ్యాయుల చేత ‘ఓనమాలు’ దిద్దిన చేతుల్తోనే బూతులు టైప్ చేస్తున్నాడు. వీడి దరిద్రపు బుర్రలోని కంపునంతా డిజిటలైజ్ చేస్తున్నాడు. మానవ నాగరికత సాధించిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానానికి ఆ విధంగా అసహ్యం అంటిస్తున్నాడు.

ఈ దౌర్భాగ్యుడు కనీసం అలియాస్ పేరయినా పెట్టుకోలేని అంట్ల వెధవ. ఒంటి నిండా పూసిన కుల గజ్జి ని బ్లాగులకి కూడా అంటిస్తున్న ఈ సన్నాసి ఐ.పి.నెంబర్ ని బ్లాగర్లు నోట్ చేసుకోవలసిందిగా కోరుతున్నాను. వీడు ఇప్పటికే వివిధ బ్లాగుల్లో వివిధ పేర్లతో వ్యాఖ్యలు రాసి ఉండవచ్చు. ఐ.పి.నెంబర్ ద్వారా ఆ వ్యాఖ్యలను గుర్తించవచ్చు. అలా గుర్తించి వీడేవడో బయటపెడితే నా ఈ పోస్టు లక్ష్యం నెరవేరినట్లే. అలాంటి ఉత్తములకు ముందుగానే నా నమస్కారాలు.

స్క్రీన్ షాట్ ఇక్కడ ఇస్తున్నాను. బూతులు చదవలేనివారు దీనిపైన క్లిక్ చేయవద్దని హెచ్చరించడమైనది.

32 thoughts on “దళిత ద్వేషం, హిందూ ఉన్మాదంతో కుళ్లిపోతున్న బూతుగాడి బూతులివే

 1. వాడెవడో ఉన్మాదంతో వ్రాసినవాటిని ప్రచురించకుండా డిలీట్ చేయొచ్చు
  ఇక మీరు దళితులు అంతా క్రిశ్తియన్లుగా భ్రమపడవద్దు .దళితులూ అనేపదం ఇప్పటీ సౄశ్టేగాని వాస్తవానికి అందరం హిందువులమే. ఇక ఇతరుల ఉన్మాదాన్ని ఖండీంచడానికి హిందూ విద్వేషాన్ని ఇలా వెల్లగక్క వద్దు . విమర్షించాలంటే ఉన్మాదులస్థాయికి మనం దిగజారకూడదు . ఆపై మీబ్లాగు మీఇష్టం

 2. దుర్వేశ్వర్ గారూ,

  >>వాడెవడో ఉన్మాదంతో వ్రాసినవాటిని ప్రచురించకుండా డిలీట్ చేయొచ్చు.>>

  ఇన్నాళ్లూ చేసిందదే. నిరంతరం బూతులు పడుతూ, డిలిట్ చేస్తూ, ఏమీ జరగనట్లు ఉండడం నాకు సాధ్యం కాలేదు.

  >>ఇక మీరు దళితులు అంతా క్రిశ్తియన్లుగా భ్రమపడవద్దు .>>

  క్రిస్టియన్లంటే దళితులే అని నేను భ్రమించకపోయినా వాస్తవం ఎలాగూ అదే. క్రిస్టియన్, ముస్లిం మతాలు దళితుల ఆదరణ పొందడానికి ముఖ్య కారణం హిందూ మతంలో అణచివేతనుండి బైటపడాలని వారు కోరుకోవడమే. ఒకటీ, అరా తేడాలున్నంత మాత్రాన ఈ వాస్తవంలో తేడారాదు. దళితులు అన్నపదం ఇప్పటిది, అస్పృశ్యులు అన్న పదం అప్పటిది. పదం మారినా బతుకులు అలానే ఉన్నాయి.

  >>వాస్తవానికి అందరం హిందువులమే>>

  క్షమించాలి. అందరం మనుషులమే. శ్రమ చెయ్యడం చెయ్యకపోవడమే అసలు తేడా.

  >>ఇక ఇతరుల ఉన్మాదాన్ని ఖండీంచడానికి హిందూ విద్వేషాన్ని ఇలా వెల్లగక్క వద్దు>>

  హిందూ ఉన్మాదం ఖండిస్తే అది ఇతర మతోన్మోదమో లేక హిందూ విద్వేషమో అవుతుందంటే నేను అంగీకరించలేను.

  >>విమర్షించాలంటే ఉన్మాదులస్థాయికి మనం దిగజారకూడదు>>

  బూతులపై నిరసన తెలియజేయడం, బ్లాగర్ల మద్దతు కోరడం ఉన్మాదం అంటే ఎలాగండీ?

 3. కామెంట్సు రాసిన వ్యక్తి UK లో నివసిస్తున్నట్లు Whois సెర్చి ద్వారా తెలుస్తున్నది. నాకు అంతుబట్టని విషయమేమిటంటే, పాశ్చాత్య దేశాలలో భారతీయులు ఎంతో వివక్షని ఎదుర్కొంటూ కుడా, స్వదేశం లో ఇతర కులస్తులపై ఇటువంటి అవమానాలు ఎందుకు చేస్తారో నాకు అర్ధం కాదు. కులం, మతం పేర్లతో హేళన చేయడం, మరియు కించపరచడం చాలా తేలిక. మానవ జాతి ఎంత ముందుకి వెళ్ళినా ఇటువంటి supremacist లు ఎప్పుడూ ఉంటానేవుంటారు.

 4. గౌతం గారూ,

  ఆర్ధిక స్ధాయిల్లోని నిచ్చెన మెట్ల అంతరాలు ఈ ధోరణికి దోహదం చేస్తున్నాయి. ఈ అంతరాలు యు.కె లో జాతి, రంగు, మతం లాంటి రూపాల్లో వ్యక్తం అవుతుంటే, ఇండియాలో కులం రూపంలో వ్యక్తం అవుతోంది. బహుశా ఈ (ఆర్ధిక) మౌలిక లక్షణం వల్లనే దేశాలూ, సముద్రాలూ దాటినా పైవారిని కొలిచే ధోరణి, కిందివారిని ఈసడించుకునే ధోరణీ కొనసాగుతున్నాయనుకుంటా.

  మీ మద్దతుకి ధన్యవాదాలు.

 5. నిజంగా దారుణంగా ఉన్నాయి. ఇలాంటి వాళ్ళు చేసే పనులు చూస్తుంటే అడ్డంగా నరికేయాలి అన్నంత కోపం వస్తుంది. బూతులే లోకంగా బతుకుతున్న వాడి జీవితం చుస్తే జాలేస్తుంది. అలంటి వాళ్ళని హిందూ మతస్ధులుగా చెప్పకండి, వాడొక జంతువు అని చెప్పండి సర్. విమర్శ లో కోపం ఉండవచ్చు, అసహనం ఉండవచ్చు కాని పరిధి దాటనంత వరకు మరియు వ్యక్తిగత స్థాయికి వెళ్లనంత వరకు పరవాలేదు. ఇలాంటి వాళ్ళు చేసే పనులు చూస్తే, వాడిని కన్న తల్లితండ్రులు కూడా ఉరేసుకుని చస్తారు.

 6. విశేఖర్ గారూ,
  ఇలా పోస్ట్ రాసి అందరికీ తెలియజేయడం వల్ల, ఆ రాసే బేవార్స్ గాడు ఇకపై ఇలాంటి కామెంట్లు రాయకుండా ఉంటాడని మీరు భావిస్తున్నారా? నాకైతే అలా అనిపించట్లేదు. పైగా వాడు రాసే చెత్త కామెంట్లకు మీరు రియాక్ట్ అవుతున్నారని తెలుసుకుని ఇకపై డోసు పెంచినా పెంచుతాడు. కాకపోతే ఈ ఐడిని వదిలేసి మరో కొత్త ఐడిని క్రియేట్ చేసుకుంటాడు. ఈ ఇంటర్నెట్ మాయాలోకం తీరే అంత. ముఖానికి ఓ ముసుగేసుకుని( ఓ ఐడి క్రియేట్ చేసుకుని) ఎవరినైనా తిట్టే, ఎవరిపై ఐనా బురదచల్లే అవకాశం ఉంది. ఎలాగూ ముసుగు ఉంది కాబట్టి ఆ తిట్టేదెవరనేది ఎవరికీ తెలీదు కాబట్టి వాడికి పోయేదేమీ ఉండదు. పోతే,గీతే మీ సహనమే నశించి,నిరుత్సాహంతో అలాంటి విషయాలపై రాయడం మానేస్తారు, లేక బ్లాగింగ్ పై విరక్తితో అసలు రాయడమే మానేస్తారు. ఆ బేవార్స్ గాల్లకి సరిగ్గా కావాల్సింది అదే.
  కార్చిచ్చులనేవి ఎన్నోసార్లు వస్తుంటాయ్,పోతుంటాయ్ కానీ అడవి మాత్రం స్థిరంగా ఉంటుంది.విలువలకి,ఆశయాలకి కట్టుబడినవాల్లు అడవిలా స్థిరంగా ఉండాలి. విలువలు లేని, అసలవేంటో కూడా తెలీని ఇలాంటి కార్చిచ్చు వెధవలు ఆటంకాలు కల్పించడం అనేది చాలా సహజం.
  (BTW, it may not always possible to find out exact location, based on IP address, because of the techniques such as NATing, Aliasing etc. for Ex. if any engineer sitting in hyd for a service based IT company, On a US client project, comments in your blog, then the IP address may show an US location, if the packet is being routed through his client’s server. And the IP address can vary each time, though he is commenting from a same machine, if their client has hired multiple public IP addresses)
  కాబట్టి, ఇలాంటి వాటికి ఏకైక పరిష్కారం – ‘ఇగ్నోర్’ చేయడమే. వీలైతే వీరి కామెంట్ ని ఓపెన్ కూడా చేయకుండా డిలీట్ కొట్టేయండి.

  తనని చూసి మొరిగే కుక్కల్ని ఏనుగు పట్టించుకోనట్లుగా, మీరు కూడా వీరిని లైట్ తీసుకుని, అద్భుతమైన మీ బ్లాగ్ ప్రవాహాన్ని కొనసాగిస్తారని ఆశిస్తున్నాను.

 7. వాడు HP కంపెనీలో పనిచేస్తాడు. బిజినెస్‌ అనలిస్ట్‌. లోగడ నీహారిక మీద కూడా ఇలాగే కారు కూతలు కూశాడు.
  HP మల్టీ నేషనల్‌ కంపెనీ పాలసీ ప్రకారం, మతోన్మాద భావాలు వ్యక్తపరచడం తప్పు. ప్రత్యేకంగా ఆకంపెనీ ఏ రకమైన మతోన్మాదాన్నీ, కాంట్రావర్షియల్‌ వ్యూ పాయింట్లనీ టాలరేట్‌ చేయదు.

  వీలైనంత మటుకు ఇగ్నోర్‌ చేయండి.మిమ్మల్ని మరీ ఇంతగా విసిగిస్తుంటే, ఆ కంపెనీ హెచ్‌ ఆర్‌ కి మైల్‌ రాయండి, ఈ స్క్రీన్‌ షాట్లతో, లేదా ఆకంపెనీకి లీగల్‌ గ్రీవియెన్స్‌ సెల్‌ ఉంటుంది, ఆ హెల్ప్‌ లైన్‌ నంబరు తీసుకుని సంప్రదించండి.

  కొత్తగా ఒక బెబ్బే మెమ్మే బ్లాగు పెట్టాడు, దాంట్లో రాసే చెత్తరాతలకి వాడి తైనాతీ గాళ్ళంగా ఆహా ఓహో అని చిందులేస్తున్నారు. ఎక్కడెక్కణ్ణించో గూగుల్‌ లింకులు తీసుకొచ్చి కమ్యూనిజాన్ని ఎండగడుతున్నాను అనుకుంటాడు ఆ మనిషి. బెగుళూరులో కూర్చుకి మొరిగే మొరుగుళ్ళకి సంవత్సరాలనాటి భావజాలం ఈకగూడా ఎగరదు అని వీడికీ వీడి తైనాతీ గాళ్ళకి అర్ధమయ్యేపాటికి భూమ్మీద మనుషులు మిగల్రు.

 8. వెంకట్ గారూ, అలాంటివారు హిందూ మతాన్ని సిన్సియర్ గా అనుసరిస్తున్నారన్న అభిప్రాయం నాకూ లేదు నిజానికి అందుకే అతన్ని హిందూ ఉన్మాది అన్నాను. ఉన్మాదులు మతస్ధులు ఎంతమాత్రం కాజాలరు. మతస్ధులు కొన్ని ప్రిన్సిపుల్స్ పాటించడం నేను అనేకసార్లు గమనించాను. అలాంటి వారు చాలామంది బ్లాగింగ్ చేస్తున్నారు కూడా. మీ మద్దతుకి ధన్యవాదాలు.

  చీకటిగారూ, మీరు చెప్పిన ప్రమాదం ఎలాగూ ఉందనుకోండి. అయినా, కొంచెం అన్నా విజ్ఞత మిగలకపోదా అని ప్రయత్నిస్తున్నాను. విజ్ఞతతో ప్రవర్తిస్తే అంతిమంగా వారికే ప్రయోజనం. లేదంటే ఎప్పుడో దిమ్మ తిరిగే బొప్పి కట్టడం ఖాయం.

  వీళ్ళ ఐ.పి యో లేక పేరు గానీ వస్తే వారి వ్యాఖ్య అసలు లోపలికి ప్రవేశించకుండా ఏర్పాటు ఉన్నట్లయితే బాగుంటుంది. వర్డ్ ప్రెస్ లో అది లేనట్లుంది. నేనయితే ఎక్కడికీ వెళ్ళే సమస్యే లేదు.

  మీ విలువైన సూచనలు ఆచరణీయం. ధన్యవాదాలు.

  ఎబిసిడి గారూ, హెచ్.పి కంపెనీలో బిజినెస్ ఎనలిస్టు స్ధాయికి వెళ్ళినవారికి ఈ విధంగా మతపిచ్చి ఉండడం ఆశ్చర్యమే. కస్టమర్లని వివక్షాపూరితంగా చూడడం బిజినెస్ ప్రయోజనాలకి విరుద్ధం. భూస్వామ్య వ్యవస్ధలని కూల్చివేయవలసిన అవసరం పెట్టుబడిదారీ వ్యవస్ధకి అందుకే వచ్చింది. అలాంటిది గ్లోబల్ కంపెనీలో బిజినెస్ విభాగంలో పనిచేస్తూ కూడా ఉన్మాద లక్షణాలని నిలుపుకోవడం దారుణం.

  మీరు, చీకటిగారూ చెప్పిన ప్రకారమే ఇన్నాళ్ళూ ఇగ్నోర్ చేస్తూ వచ్చాను. నేను ఎదుర్కొంటున్న పరిస్ధితి ఇతర బ్లాగర్లకు తెలిసి ఉండాల్సిన అవసరం కూడా ఉందని భావించాను. బూతులు రాస్తున్నారన్న ఆరోపణలు కేవలం ఆరోపణలే కాదని ఒక్కసారయినా చెప్పాల్సిన అవసరం ఉందనిపించింది. ఇంకా కొనసాగిస్తే మీరు చెప్పినట్లు హెచ్.పి కంపెనీకి ఫిర్యాదు చెయ్యడానికి కూడా నేను వెనకాడను.

  >>బెగుళూరులో కూర్చుకి మొరిగే మొరుగుళ్ళకి సంవత్సరాలనాటి భావజాలం ఈకగూడా ఎగరదు అని వీడికీ వీడి తైనాతీ గాళ్ళకి అర్ధమయ్యేపాటికి భూమ్మీద మనుషులు మిగల్రు.>>

  బాగా చెప్పారు. కమ్యూనిజం గురించి ఏమీ తెలియకుండా దాన్ని విమర్శిస్తున్నామనుకోవడం పెద్ద భ్రమ. విమర్శ చేసినపుడు దానికి కొంతయినా విలువ ఉండాలి. కమ్యూనిజం తెలుసుకుని విమర్శిస్తే దానికి విలువ వస్తుంది. ఆ విషయం వీరికెందుకు అర్ధంకాదో మరి.

 9. వీళ్ళు గ్లోబలైజేషన్ వల్లే తమకి వైట్ కాలర్ ఉద్యోగాలు వచ్చాయనుకుని గ్లోబలైజేషన్‌ని పొగుడుతూ కమ్యూనిస్ట్‌లని తిడుతుంటారు. వాస్తవానికి వీళ్ళు ఆచరించేది పల్లెటూర్లలో ఉండే భూస్వామ్య భావజాలం.

 10. విశేఖర్ గారూ,
  మరో ముఖ్య విషయం.
  ఇలాంటి కామెంట్లు మీకు మాత్రమే వస్తున్నాయనుకోకండి. గతంలో నాకు కూడా వచ్చేవి. నా లెక్క ప్రకారం ఇంకా చాలామందికి వస్తుంటాయి.
  ఇలాంటి కామెంట్లు రాసే వారి మనస్తత్వాన్ని ఓ సారి విశ్లేషిస్తే..
  1. వీరు ‘ప్రేమ రాహిత్యం ‘ అనే జబ్బుతో బాధపడుతుంటారు. అంటే తల్లిదండ్రులు చిన్నప్పుడే బోర్డింగ్ స్కూల్లలో/హాస్టల్లలో పడేస్తే,కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాలకు నోచుకోక అక్కడే పెరిగిపెద్దైనోల్లు. కేవలం ఇలాంటి వారు మాత్రమే తల్లి,చెల్లి గురించి అలాంటి రాతలు రాయగలరు.
  2. ఇంజనీరింగ్ సీట్లు విపరీతంగా పెరిగిపోయాయి కాబట్టి, ఏదో ఓ జఫ్ఫా కాలేజీలో సీటు సంపాదించి BTECH/MCAలు చేసేసి IT బూం పుణ్యాన MNCల్లోకి ఎంటరైఉంటారు. అక్కడ వీరికి ఐదంకెల జీతాలుంటాయి కాబట్టి, దానితో వీరు నిజంగానే తాము మేధావులమనుకుంటూ, తమకు అన్నీ తెలుసనుకునే భ్రమల్లో బతుకుతుంటారు. నిజానికి సైన్స్ స్టూడెంట్లైన వీరికి కమ్యూనిజం/కుల-మత వాదాలు,చరిత్ర లాంటివి తెలిసే అవకాశం లేదు. ఐనా ఏవో ఒకటీ,రెండు తలా తోక లేని లింకులు,వెబ్సైట్లు చదివేసి మొత్తం తెలుసనుకుని వాదనలకి రెడీ ఐపోతారు. వీరికి ఏమీ తెలీదని ఎవరైనా ప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తే వారిపై ఇలా బూతులతో దాడి చేస్తారు.
  3.వీరివి చాలా వరకూ ఒంటరి బతుకులు. నలుగురు మిత్రుల్ని కలిగి ఉండి, పదుగురిలో పెరిగిన ఎవరికైనా.. వ్యక్తులకి వివిధ రకాల ఆలోచనలూ, అభిప్రాయాలు ఉంటాయనీ, అవి మనకు నచ్చనంత మాత్రాన ఆ వ్యక్తిని ద్వేశించాలిన అవసరం లేదనీ తెలిసే ఉంటుంది. ఎవరితో కలవకపోవడం వలన, పాపం వీరికి అది తెలిసే అవకాశం లేదు.
  4. ఆఫీసుల్లో కూడా వీరు చాలావరకూ పరాన్న జీవులుగా ఉంటారు. అంటే తమ పని మొత్తం వేరే వారిపై వేసి, వీరు మాత్రం ‘బ్లాగుల్లో’ టాలెంట్ నిరూపించుకునే పనిలో బిజీగా ఉంటారు. కాబట్టి, వీరికి కావలినంత తీరిక, ఓపికా ఉంటుంది.

  ఇలాంటి వారి గురించి ఇంతలా చర్చించటం టైం వేస్ట్ వ్యవహారం తప్ప మరోటి కాదు.
  ఇలాంటి కామెంట్లు రాసే వారికీ, వారి కుంటుంబసభ్యులకీ ప్రగాడ సానుభూతి తెలుపుతూ.. సెలవు.

 11. భిన్నాభిప్రాయాన్ని సహించలేనివాళ్ళూ, విషయాన్ని చర్చల ద్వారా సానపెట్టే ధోరణి గిట్టనివాళ్ళే ఇలా అసభ్య వ్యాఖ్యలు చేసి సంతృప్తి పడుతుంటారు. సంకుచిత మనస్కుల నిస్సహాయత ఈ రూపంలో బయటపడుతోందని అర్థం చేసుకోవాలి. ఆ బూతులను వాళ్ళ ఆక్రందనలుగా, ఓటమిగా అనువదించుకోవాలి!

  ఇలాంటి అసభ్య వ్యాఖ్యలను చదివినపుడు బాధ కలగటం సహజం. ‘ఇగ్నోర్’ చేయమనటం తేలికే కానీ, నిరంతరం వస్తుంటే వాటి ప్రభావం ఎంతో కొంత ఉండకపోదు. కానీ ఇలాంటి ధోరణులను పూర్తిగా నిరోధించటం సాధ్యం కానపుడు పట్టించుకోకుండా ఉండటానికి అలవాటు పడటమే మంచిది! .

 12. మిమ్మల్ని రెచ్చగొట్టి, మీ చేత బూతులు మాట్లాడించి, మిమ్మల్ని పిచ్చివానిగా నిరూపించడానికి వాళ్ళు వేసిన ప్లాన్ కావచ్చు. గూగుల్ ప్లస్‌లో కూడా బెంగళూరుకి చెందిన ఒక వ్యక్తి ఇలాంటి ప్రయోగమే నాపై చేసి విఫలమయ్యాడు.

 13. ప్రవీణ్ గారూ, అవును. గ్లోబలైజేషన్ పొర వీళ్ల దృష్టిని కమ్మేసింది.

  చీకటి గారూ, బూతు కామెంట్లు మీక్కూడా వచ్చాయని గతంలో మీరొకసారి తెలియజేశారు. అది నా దృష్టిలో ఉంది. అసలేవీ జరగనట్లుంటే వీళ్లకి బ్లాంక్ చెక్ ఇచ్చినట్లుంటుందని నాకనిపిస్తుంది. నెట్ వినియోగిస్తున్నవారు సహజంగానే విద్యాధికులై ఉంటారు. విద్యాధికులు సైతం ఇలాంటి వికృత ఆలోచనల్లో ఉండొచ్చనేది తెలుసుకోవలసిన విషయం. వీళ్ల గురించి ఇతరులు తెలుసుకోవడంతో పాటు వీరికి కూడా తమ గురించి తాము తెలుసుకోవడానికి ఇదొక అవకాశం అవుతుందేమో. మీరిచ్చిన మనో విశ్లేషణ కూడా వాళ్లకి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను.

  అంతే కాకుండా పైన చూడండి. మీతో సహా ఇతర మిత్రులు తమ విలువైన అభిప్రాయాలతో చర్చలో పాల్గొనడాన్ని బట్టి ఈ చర్చ వృధా కాదనే అర్ధమవుతోంది. ముఖ్యంగా మీరు చేసిన విశ్లేషణ ఇతర పాఠకులకి కూడా ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు.

  వేణు గారు, మీరన్నది నిజం. సంకుచిత మనస్కుల ఓటమి నుండి వెలువడిన ఆక్రందనలే ఇవి.

 14. చీకటి గారు చెప్పినది నిజమే. సైన్స్ విద్యార్థులకి కమ్యూనిజం, మతం, చరిత్ర లాంటివాళ్ళ గురించి తెలిసే అవకాశం లేదు. అవి కేవలం టెక్నికల్ విద్యలే కదా. రంగనాయకమ్మ గారు వ్రాసిన “నీడతో యుద్ధం” పుస్తకం చదవండి, అర్థమవుతుంది.

 15. మీ ధైర్యానికి అభినందనలు. మిమ్మల్ని చాలా నీచంగా తిట్టాడు. పట్టించుకోకండి. చీకటి గారు ఆ వెధవని చక్కగా విశ్లేషణ చేశారు. తెలుగు బ్లాగర్లందరం ఇట్లాంటి బూతులరాయుళ్ళని ఇగ్నోర్ చేస్తూ (అప్రమత్తంగా కూడా ఉంటూ) హాయిగా మన మన పోస్టులు రాసేసుకుందాం!

 16. విశేఖర్ గారూ,
  కొంచెం ఆలస్యంగా మీ ఈ కథనం చూస్తున్నాను. నేర్చుకున్న భాషను ఇంత జుగుప్సతో, కులవ్యతిరేకతతో రాస్తారని, రాయవచ్చని ఇంత వరకు చూడలేదు. తెలియదు కూడా. చీకటిగారన్నట్లు ప్రేమ రాహిత్యంతో సహా సర్వభ్రష్టత్వం చెందితే తప్ప భాషను ఇలా ఉపయోగించడం మనుషులకు మాత్రం సాధ్యం కాదు.

  ఇలాంటి కంపు వ్యాఖ్యలను మీరు చూసినప్పుడల్లా ఎంత క్షోభించి ఉంటారో బయటినుండి కూడా అనుభూతి చెందుతున్నాను. ఇలాంటి కంపును వెదజల్లుతున్నవాళ్లు హిందువులా, మనుషులా, మృగాలా అనే చర్చకు వెళ్లొద్దు. ఇలాంటి సందర్భాలతో పోలిస్తే మృగం కూడా కించపడవచ్చు.

  ఇప్పటికి జరిగింది చాలు.

  ఇకపై ఇలాంటి వ్యక్తి కేంద్రక వ్యాఖ్యలకు, బూతు కూతలకు గడ్డిపోచ విలువ కూడా ఇవ్వవద్దు. మీ లక్ష్యాన్ని, రచనలను దారిమళ్లించే రకం వ్యాఖ్యలకు మీరు ఇక ఏమాత్రం విలువ ఇవ్వవద్దు.

  వాటి ఉనికిని కూడా ఇగ్నోర్ చేయడమే మీరు చేయవలసిన పని.

  కొన్ని సందర్భాల్లో నేను కూడా ఇలాంటి పరిణామాలకు బాధితుడినే. కాని ఇంత ఘోరమైన భాషా ప్రయోగాలకు నేను గురి కాలేదు కాబట్టే వాటిని అలా పడేసి నా పాటికి నేనుండి పోయాను.

  సంవత్సర కాలంగా మీరు పడుతున్న వ్యక్తిగత క్షోభకు నా సహానుభూతి తెలుపుతున్నాను.

  చివరగా ఒక అభ్యర్థన.

  ఇకపై మనిషికి సంబంధించిన విషయాన్ని మాత్రమే మీరు పట్టించుకోండి.

  ఇంతకు మించి నేనేమీ చెప్పలేను.

  బాధతో.

 17. ఇకపై మనిషికి సంబంధించిన విషయాన్ని మాత్రమే మీరు పట్టించుకోండి…
  ఒక స్టేజ్ దాటాక భాద కలగడం సహజం….ఇలాంటి పిచ్చి వ్రాతలను పట్టించ్కోకండి…పై బ్లాగర్ల అభిప్రాయామే నాదీనూ…..నెటిజన్లంతా ఒకటే కులం….

 18. ఇప్పుడే చుశాను మీ పొస్టు. ఇలాంటి వాళ్ళు అలాంటి దుషణలకు అలవాటు పడిపొయి వుంటారు.అందుకే ఎదుటి వారిని చాలాసులభంగా దూషిస్తారు. అవి వారికి ఏమాత్రం భాధకలిగించవు. శ్రికాంత్ దీని పైన ఒక పొస్టు రాసినాడు ఒక పక్క దుషించే వాళ్ళను విమర్శిస్తూ మరొ పక్క మీపై విషం కక్కుతున్నాడు.

 19. విశేఖర్ గారూ,
  డిపార్ట్మెంట్లో తెలిసిన వారి ద్వారా, సైబర్ క్రైం బ్రాంచ్ లోని ఓ DSPగారితో ఇవాల ఈ విషయం గురించి మాట్లాడాను. ఫార్మల్ గా ఓ కంప్లైంట్ రాసి ఇవ్వమన్నాడు. ఇలాంటివి డీల్ చేయడం వారికి చాలా మామూలు విషయంలా ఉంది.
  వీరికి దేశంలోని అన్ని ISPలు అందుబాటులో ఉంటాయట. బ్లాగ్ URL, మరియు యాక్సెస్ చేసిన టైం లాంటి విషయాల్ని వీరు సంబంధిత ISPకి గాని, లేక సర్వర్ మైంటైన్ చేసే యాజమాన్యానికి(WordPress) గానీ ఫార్వర్డ్ చేసి, వారి నుండే పూర్తి విషయాలు రాబడ్తారట.
  కాబట్టి, సాధ్యమైనంతవరకూ ఇగ్నోర్ చేయడానికి ప్రయత్నించండి. లేక, ఏమాత్రం మనసుకి కష్టంగా అనిపించినా ఈ లీగల్ ఆప్షన్ తో ప్రొసీడ్ అవుదాం.

 20. రమణ గారూ, మీ విలువైన మద్దతుకి ధన్యవాదాలు. మీరన్నట్లు ఇగ్నోర్ చేయడంతో పాటు అప్రమత్తంగా ఉండడం కూడా అవసరమే.

  రాజుగారు, అవును. చీకటి గారి విశ్లేషణ ఇలాంటివారికి కొంతయినా కళ్ళు తెరిపించాలి. దానికి విరుద్ధంగా జరిగినా ఆశ్చర్యం లేదు. మీ సహానుభూతికి ధన్యవాదాలు.

  కె.వి.ఎస్.వి గారికి, నెటిజన్లంతా ఒకే కులమన్న మీ ఆదర్శాన్ని అంతా గుర్తించాలి. ధన్యవాదాలు.

  రామ్మోహన్ గారు, ఈ సులభ దూషకులు ఇప్పుడయినా విషయం గ్రహిస్తారని ఆశిద్దాం.

 21. చీకటి గారూ, గొప్ప సమాచారం ఇచ్చారు. మళ్ళీ వస్తే గనుక పోలీసులకి ఫిర్యాదు చేయడానికి నేను సిద్ధం. ఇంటర్నెట్ విషయంలో ఆంధ్ర పోలీసులు ఇంత ముందంజలో ఉన్నారని తెలియదు సుమా. మీరిచ్చిన సమాచారం బ్లాగర్లందరికీ ఉపయోగపడుతుంది. బోలెడన్ని ధన్యవాదాలు.

 22. బూతులు వ్రాసేవాళ్ళకి ఆఫీస్‌లోని కంప్యూటర్‌లే సురక్షితంగా ఉంటాయి. ఇంతకు ముందు ఒకాయన దొంగ పేర్లతో విద్వేషపూరితమైన వ్రాతలు వ్రాసి, ఆ వ్రాతలు తన ఆఫీస్‌లోని కొలీగ్ వ్రాసాడని వాదించాడు. దాని గురించి మహేశ్ గారి బ్లాగ్‌లో పెద్ద చర్చే జరిగింది: http://parnashaala.blogspot.in/2009/06/blog-post_22.html

 23. ఒక మంచి పని చేసేవాళ్లని encourage చేయాలి. ఈ బిజీ లైఫ్ లో మీ లాంటి వాళ్ల విశ్లేషణ చాలా బాగుంది. ప్లీజ్, ఇక్కడ హిందు, క్రిస్టియన్, ముస్లిం అనే భేదం లేదు. బూతులు రాసే వెధవలకి జాతి, కులం తో పని లేదు. మీరు చేసే ఈ మంచి పనిలో వీడు చెంచాగాడు. Just ignore him. Don’t concentrate on him. ఎందుకు అంటె, వాడి బూతు పురాణంలో పడి మీరు వాడికి ఎక్కడ లేని ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. వాడి పోస్ట్ రాగానే జస్ట్ డిలిట్ చేసి, మీ విశ్లేషణ కంటిన్యూ చెయండి. You are the Leader, never think about non-sense. Keep it up!

 24. Sorry to Cheekati garu,
  science students కి only (సైన్స్) మాత్రమే తెలుసు అని చెబుతున్నారు, may be నేను wrong అనుకుంటున్నాను. ఎందుకంటె, I like all to learn all of the subject matters, No matter whatever it is. ఏదైనా తెలుసుకోవడానికి ట్రై చేస్తాను. Yes, ఒక విషయంలో మీతో ఏకీభవిస్తాను. Science studies లో మానవతా విలువల గురించి అసలు ఉండవు, మాస్ కమ్యూనికేషన్ ఉండదు.

  శేఖర్ గారు,
  నేను తెలుగులో టైప్ చేయాలంటె ఏమి చేయాలి?

  Sekhar garu,
  nenu telugu lo type cheyali ante emi cheyali?

 25. సుభాష్ గారూ, మీ మద్దతుకి ధన్యవాదాలు. మీ పై వ్యాఖ్యలను తెలుగు లిపిలోకి నేనే అనువదించాను. గమనించగలరు.

  లేఖిని వెబ్ సైట్ (http://lekhini.org/) ని ఉపయోగించి మీరు తెలుగులో టైప్ చెయ్యొచ్చు. పైన టైప్ చేసినట్లే లేఖినిలో టైప్ చేస్తే అక్కడ కింది బాక్స్ లో తెలుగు లిపి లో కనపడుతుంది. దానిని కాపీ లేదా కట్ చేసి ఇక్కడ లేదా ఎక్కడైనా పేస్ట్ చెయ్యొచ్చు.

  పోతే, చీకటి గారి విశ్లెషణ సైన్స్ స్టూడెంట్స్ ని అందరినీ ఉద్దేశించినది కాదని నా అభిప్రాయం. ఇలా తెలుగు బ్లాగుల్లో బూతులతో పాటు, ఇతర అసభ్య పద్ధతుల్లో రాస్తున్నవారిని మాత్రమే ఉద్దేశించినది. తెలుగు బ్లాగుల్లోకి ఇంకా రానివారికి మరి కొందరికి కూడా అది వర్తించవచ్చు.

 26. పని ఒత్తిడిలో పూర్తి వివరాలు చెప్పలేకపోతున్నా…..82.28.154.58
  ఈ ఐపీ కి ప్రయత్నించినప్పుడు నా మొబైల్ ద్వారా… 82.28.154.58 is located @ united kingdom cheshire Biddulph following is ip
  82.28.154.58 location map view
  అని వచ్చిన దగ్గర ….following is ip 82.28.154.58 ఒక బాక్స్ లా వచ్చింది… ఆ బాక్స్ పై క్లిక్ చేయగానే

  అది ఒక ఫోన్ కాల్ కి అనుమతి అడిగింది..నేను ఒకే ..చేసినప్పుడు అది ఐఎస్డీ కా అవటం వల్ల కాల్ చేయడానికి అనుమతించలేదు…నా సెల్ ప్రీ పైడ్ టాటా ఇండికాం….సాదారణంగా ఫేస్ బుక్ లో ఇలా జరుగుతుంది…ఫ్రెండ్స్ ఆప్షన్స్ చూస్తున్నపుడు…కాల్ చేసుకోమని చూపబడుతుంది… fail అయిన ఆ ఫోన్ నెంబర్ 822815458
  తర్వాత పేజెస్ లో .. june 19, 2010 view records అని ఉంది…

  మీరు కూడా గూగుల్ సెర్చ్ లో చూసే ఉంటారు.. నేను mobail browser lo 82.28.154.58 ip address అని చేసి సెర్చ్ చేస్తే ఈ రిజల్త్ వచ్చింది…మీరు కూడా మళ్ళీ try చేయండి…

 27. కె.వి.ఎస్.వి గారు, చూడబోతే ఐ.పి.నెంబర్ నే ఫోన్ నెంబర్ గా భావించడంలో మీకు కనబడిన రిజల్ట్ వచ్చినట్లుంది. మీరు ఫోన్ నెంబర్ గా చెబుతున్నది ఐ.పి.నెంబరే కదా.

  చట్ట పరమైన చర్యలు తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయనేది స్పష్టం. కాకపోతే అంత అవసరం ఉన్నదా అనే ఆలోచించాలి. కులాలు నిండిన సామాజిక వాతావరణంలో పెరిగినవారు ఇలాంటి బలహీనతలు ప్రదర్శించడం సామాన్యమే. అయితే ఉన్నత చదువులు చదివి కూడా బలహీనతలు దూరం చేసుకోలేకపోవడం ఖండనార్హం.

 28. హా…చూడనే లేదండీ…నిజమే..సెల్లో చూసి ఇంటికి వచ్చాక హడావిడి గా మీకు కామెంట్ పెట్టా…అంకెలను గమనించనే లేదు…బిజీ గా ఉండి..

  మన సొసైటీ లో వీళ్ళతో సమస్య మరింత ఎక్కువవుతూంది…చదువుకోని వాళ్ళ కంటే వీళ్ళలో మరింత కుల గజ్జి…విపరీతమైన బలహీనతలూ గమనించవచ్చు…కాళీ లేక పోస్ట్ పెట్ట లేక పోతున్నా గానీ…..చదువుకున్న వాళ్ళుగా చెప్పబడుతున్న జనం ఎంత నీచంగా బిహేవ్ చేస్తారో నేను చూసినంతగా ఎవరూ చూసి ఉండరు.. వృత్తి రీత్యా చాలా ఎక్కువ అనుభవాలు నాకు ఎదురవుతాయి….మిగతా సమాజాలు…దేశాల్లో ఎలా ఉంటుందో గానీ నాకు చూసీ చూసీ అసహ్యం వేస్తుంది మన జనాలంటే…

  చిన్న ఉదాహరణ చెపుతా…

  నాకు తెలిసిన ఒక అమ్మయి.,ఇద్దరు పిల్లలున్నా….అయోమయం రకం…భర్త వదిలేసాడు… ఒక డాక్టరు దగ్గర పని చేస్తుంది…ఉదయం ఎనిమిది నుండి రాత్రి తొమ్మిది వరకూ ఇంటి పనీ హాస్పటల్ పనీ..మొత్తం ..నిమషం కాళీ ఉండదు…చివరికి డాక్టరు గారి భార్యకు కాలి మీద దురద వేసినా బెల్లు కొట్టి పిలిపించుకుని మరీ గోకించుకుంటారు.. ఎంత దారుణం గా ఉంటుందంటే చివరకు టిష్యూ పేపర్ తో ఈ అమ్మయే తుడవాలేమో … ఆ మద్యలో ఓ గంట బోజనానికి ఇంటికి పోనిస్తాడు ఆయన …ఇంతకూ ఇచ్చే జీతమ్ఎంతో తెలుసా మీకు…1000 రూపాయలు…అందులో నే అద్దె….పిల్లలూ..ముసలి తల్లిని చూసుకోవాలి..

  ఎప్పుడైనా ఆ పనిమనిషి కం నర్స్ కు జ్వరం వచ్చినా సాంపిల్స్ అమ్మేసుకుంటాడే గానీ రెండు మాత్రలు కూడా ఇవ్వడు ఆ సోకాల్ద్,రోజుకు 30-40 వేల రూపాయలు వరకూ సంపాదించే ఆ డాక్టరు..
  ఆమె దురవస్థ చూసి మేమె అప్పుడప్పుడూ ఓ యాబయ్యో..వందో..చెతిలో పెట్తేస్తుంటాం.. ఒక వేళ మేము ఇవ్వడం ఆయన చూస్తే మాత్రం ..ఆ మేరకు ఆమె జీతమ్ లో కట్..తన వల్లే ఆమెకు ఆ డబ్బులు వచ్చాయని ఆయన భావన…ఇంతకంటే నీచులున్నారు..కాళీ ఉన్నపుడు ఒక పోస్ట్ పెట్టాలని ఉంది…

 29. కె.వి.ఎస్.వి గారు మీరు చెప్పిన ఉదాహరణ నిజంగా హృదయ విదారకంగా ఉంది. రోజుకి 12 గంటలు పని చేయించుకుని వెయ్యి రూపాయిలు చేతిలో పెడతాడా? వెట్టి చాకిరీ కంటే ఘోరం.

  సామాజిక వివక్షల గురించి మీలాంటి వారు ఇచ్చే సమాచారం ఉపయోగంగా ఉంటుంది, రోజుకి అనేకమందిని చూస్తుంటారు గనక. ప్రజల బలహీనతలు, బలాలు ఏదో మేరకు మీకు తెలుస్తుంటాయి. మీ వ్యాఖ్య ఆ విషయాన్ని రుజువు చేస్తోంది. ఆ విషయాల్ని బ్లాగ్ లో రాసినట్లయితే అదొక ఎడ్యుకేషన్. ఎలా ఉంటున్నామో, ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో కొంతయినా తెలుస్తుంది. సామాజిక అపసవ్యతలపైన మీ అనుభవాలని వీలయినప్పుడల్లా రాస్తే తప్పనిసరిగా బ్లాగర్లకు, పాఠకులకు ఉపయోగపడుతుంది.

 30. … .సమయం కుదరక కానీ ఎప్పటికైనా పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తా.
  @ఎలా ఉంటున్నామో, ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో కొంతయినా తెలుస్తుంది.
  నాకైతే మాత్రం భరించలేని విధంగా ఉంది…
  నాకే ఎందుకు ఇలాంటివి కళ్ళలో పడతాయీ అని మధన పడుతుంటా..
  ఒక విధమైన ఏహ్యభావం జనాల మీద ఏర్పడి పోయింది….

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s