ఉచ్ఛనీచాలు మరిచిన కొడుకుని చంపించిన తల్లిదండ్రులు


Parents get son murderedఇదో హృదయ విదారకమైన కధ. తాగి అరాచకం సృష్టించడమే కాక తల్లితోనే అసభ్యంగా ప్రవర్తిస్తున్న కొడుకుని ఎలా బాగు చేయాలో ఆ వృద్ధ దంపతులకు అర్ధం కాలేదు. కొడుకు తన జీవితం నాశనం కేస్య్కోవడమే కాక, తాగి వచ్చి కోడలిని విపరీతంగా కొడుతున్నా బలహీనులైన వృద్ధులు అడ్డుకోలేకపోయారు. దెబ్బలు తట్టుకోలేక కోడలు పిల్లలతో సహా పుట్టింటికి వెళ్ళిపోతున్నా ధైర్యం చెప్పి అండ నిలవలేకపోయారు. పనికి పోకుండా తాగి తందనాలాడుతూ డబ్బుల కోసం తమనే వేధిస్తుంటే సహిస్తూ బతికారు. చివరికి ఉచ్ఛనీచాలు మరిచి తాగిన మైకంలో తల్లితోనే అసభ్యంగా ప్రవర్తించడంతో వారు కఠినాతికఠినమైన నిర్ణయం తీసుకున్నారు. 

హయత్ నగర్ పోలీసులు వృద్ధ దంపతులైన కె.నర్సింహ (70), కె.రమణమ్మ (65) లను వారి కొడుకుని చంపించిన నేరానికి అరెస్టు చేశారు. వారితో పాటు కిరాయి హంతకులుగా భావిస్తున్న బి.మల్లయ్య (48), ఎస్.శ్రీను (38) లను కూడా శుక్రవారం అరెస్టు చేశారు. తామే కొడుకు వెంకటేశ్వర్లు ని చంపించామని అంగీకరించాక అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు.

నర్సింహా, రమణమ్మ దంపతులకు ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్ళు. పాము కరిచి ఒక కూతురు చనిపోయింది. అందరికీ పెళ్లిళ్లు చేశారు. వెంకటేశ్వర్లు కొడుకులు అందరిలో చిన్నవాడు. ఎల్.బి.నగర్ లో నివసిస్తున్నారు. దంపతులిద్దరూ బ్రతుకుతెరువు కోసం సిమెంటు ఇటుకలు తయారు చేస్తుంటారు. పెద్ద కొడుకులిద్దరూ వేరు ఇళ్ళలో నివశిస్తుండగా చివరి కొడుకు, కోడలు వారి పిల్లలు వారి వద్దే ఉన్నారు. వెంకటేశ్వర్లు తాపీ మేస్త్రి గా పని చేస్తున్నా పనికి వెళ్ళడం చాలా తక్కువని, పూర్తిగా తల్లిదండ్రుల సంపాదనపైనే ఆధారపడ్డాడనీ హయత్ నగర్ పోలీసులు చెప్పారు.

భర్త ప్రతిరోజూ తాగి వచ్చి విపరీతంగా కొడుతుండడంతో వెంకటేశ్వర్లు భార్య లక్ష్మి ఇద్దరు పిల్లలతో కలిసి కొద్ది నెలల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. వెంకటేశ్వర్లు మాత్రం తలిదండ్రులతో ఉండిపోయాడు. “అతను డబ్బుల కోసం తల్లిదండ్రులను వేధించడం మొదలు పెట్టాడు. కొన్ని సార్లు తల్లితో అసభ్యంగా ప్రవర్తించడం కూడా ప్రారంభించాడు” అని పోలీసు అధికారి చెప్పాడని ‘ది హిందూ’ తెలిపింది. నర్సింహా దీనిని సహించలేకపోయాడు. కానీ ఏమీ చేయలేని బలహీనుడుగా మిగిలిపోయాడు. ఇక చాలనుకుని ఇటుకలు రవాణా చేసే మల్లయ్య, శ్రీను లను సంప్రతించాడు. కొడుకుని చంపించడానికి రు. 1.4 లక్షలకు మాట్లాడాడని పోలీసులు తెలిపారు.

మే 25 తేదీన కొడుకుకి బాగా తాపించాడు. అనంతరం మల్లయ్య, శ్రీనులకు అప్పజెప్పాడు. మైకంలో ఉన్న వెంకటేశ్వర్లును వారు నిర్మానుష్యమైన చోటికి తీసుకెళ్లి ఇనుప రాడ్డుతో చచ్చేదాకా కొట్టారు. కుంటలూరు గ్రామంలో తట్టియన్నారం వద్ద శవాన్ని పడేసి వెళ్ళిపోయారు. గుర్తు తెలియని శవం ఎవరిదో తెలుసుకోవడానికి తాము అనేక ప్రయత్నాలు చేసిన సఫలం కాలేదనీ తర్వాత పత్రికలో ఫోటోలతో ప్రచురించాక అతన్ని కొందరు గుర్తుపట్టారనీ వారి ద్వారా కేసు ని ఛేదించగలిగామనీ పోలీసులు తెలిపారు.

నర్సింహా, రమణమ్మ లు చేసింది చట్టం ప్రకారం నేరమే.  కానీ న్యాయం మాట్లాడదలిస్తే తప్పు కాదేమో. వారి ఆలోచనా పరిధి స్వయం న్యాయాన్ని దాటి చట్టం సహాయం తీసుకోవడం వరకూ వెళ్లి ఉంటే బాగుండేది. ఆ విధంగా పోలీసుల సాయంతోనైనా కొడుకు వేధింపుల నుండి తప్పించుకో గలిగేవారేమో. కానీ వారు ఎదుర్కొన్నది కేవలం భౌతిక వేధింపులే అయితే పోలీసుల సాయం కోరి ఉండేవారేమో కూడా. కొడుకు అసభ్య ప్రవర్తన ఎంతగా గుండెల్ని కోసేస్తే, ఎంతగా అసహ్యం కలిగిస్తే, ఎంత పరువు తక్కువగా భావిస్తే ఈ నిర్ణయానికి వచ్చి ఉంటారు. పోలీసులు చెప్పినవే తప్ప ఇంకేవీ కారణాలు లేకపోతే వారి గుండె కోత అర్ధం చేసుకో దగ్గదేనా?!

పోలీసుల వద్దకు వెళ్ళి కొడుకు మీదే ఫిర్యాదు చెయ్యడం సమాజంలో ఆమోదయోగ్యం అవుతుందా లేదా అన్న అనుమానం సహజంగానే కలుగుతుంది. ఇరుగు, పొరుగు కి చెప్పుకునే ఫిర్యాదు కూడా కాని పరిస్ధితులను వృద్ధ దంపతులు ఎదుర్కొన్నారు. అలాగని కొడుకే గదా అని సహించి ఊరుకునే దౌర్జన్యం కూడా కాదు. తమ ముందు ఎక్కువ ఆప్షన్స్ కనపడని పరిస్ధితుల్లో కనపడిన ఆప్షన్స్ లో ఒకదానిని వారు ఎన్నుకున్నారు. ఎంత తాగినా, తల్లికీ పరాయి స్త్రీకి తేడా తెలియని స్ధితికి ఎవరైనా ఎలా వెళ్లగలరు? నైతికంగా పాతాళానికి పతనం అయితే తప్ప. అలాంటి కనీ వినీ ఎరగని పతనావస్ధలో కొడుకుని చూశాక ఇక ‘కొడుకే’ అన్న విచక్షణ మిగలడం అసాధ్యం కావచ్చు.

5 thoughts on “ఉచ్ఛనీచాలు మరిచిన కొడుకుని చంపించిన తల్లిదండ్రులు

  1. Murdering own son is worse than incest. Even committing incest is perhaps better than such an act. The parents’ behavior is worse than their son’s behavior. As we have no version other than the one offered by the murderers, their claim is suspect. The claim that they had no alternative other than murdering the son is not correct. Hang such parents. They are a blot to the entire parent-kind.

  2. This is a very tragic incident. I am an optimist but I have a feeling that such incidents become more frequent in Indian society because very few people know the harmful effects of excess alcohol ( or more scientifically called alcohol dependence ) at the same time more and more people are drinking in excess, which obviously affects thinking and behaviour and it will have a devastating effect on the individual, family and the society.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s