యు.పి.ఎ రాష్ట్రపతి అభ్యర్ధి ఎవరు? -కార్టూన్


కేంద్ర ప్రభుత్వంలో అధికారం నెరుపుతున్న యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయెన్స్ తమ రాష్ట్రపతి అభ్యర్ధిని ప్రకటించలేక మల్లగుల్లాలు పడుతోంది. కూటమి నాయకురాలు కాంగ్రెస్ కి, రెండవ అతి పెద్ద పార్టీ త్రిణమూల్ కాంగ్రెస్ నుండే షాక్ ట్రీట్ మెంట్ ఎదురయింది. కాంగ్రెస్ తన అభ్యర్ధిగా ప్రణబ్ ముఖర్జీని ప్రమోట్ చేస్తుండగానే, త్రిణమూల్, మాజీ రాష్ట్రపత్రి అబ్దుల్ కలాం ను తన ఫేఫరెట్ గా ప్రకటించింది. పనిలో పనిగా ప్రధాని మన్మోహన్ సింగ్ ను కూడా రాష్ట్రపతి పదవికి ఒక అభ్యర్ధిగా ప్రతిపాదించి ఆయన ప్రధాని పదవికి తగడు పొమ్మంది. కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్న సమాజ్ వాదీ పార్టీ నాయకుడు ములాయం సింగ్ యాదవ్ సైతం కలాం, మన్మోహన్ అభ్యర్ధిత్వాలకు బుధవారం మద్దతు ఇచ్చినా, గురువారం నాటికి మాట మార్చి కాంగ్రెస్ ఫేఫరెట్ ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇవ్వడానికి అభ్యంతరం లేదనీ అయితే తమ పార్టీని మరింత బాగా చూసుకోవాలన్నదే తమ కోరికనీ చెప్పినట్లు తెలుస్తోంది. ఉత్తర ప్రదేశ్ కి ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించడం, ములాయం పై ఉన్న అవినీతి కేసులకు ముగింపు పలకడం, వీలయితే ఉప రాష్ట్రపతి పదవికి తమ పార్టీనుండి అభ్యర్ధిని నిలపడం… ఇవన్నీ ములాయం కాంగ్రెస్ ముందుంచిన కోరికలుగా భావిస్తున్నట్లు ‘ది హిందూ’ తెలిపింది. ప్రస్తుతానికి మమతా బెనర్జీ ఒంటరి అయినట్లుగానూ, ములాయం ను తన బుట్టలో వేసుకోవడం లో కాంగ్రెస్ సఫలం అయినట్లుగానూ కనిపిస్తొంది. ప్రతిపక్ష బి.జె.పి మాత్రం చిద్విలాసంగా ‘తొందరేముంది, వేచి చూస్తున్నాం’ అని ప్రకటిస్తోంది. ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, కాంగ్రెస్ కు రెండవ చాయిస్ గా ఉన్నా, ఇప్పటికైతే సోదిలో కూడా కనిపించడం లేదు.

-కార్టూన్: ది హిందూ

2 thoughts on “యు.పి.ఎ రాష్ట్రపతి అభ్యర్ధి ఎవరు? -కార్టూన్

  1. “So that north eastern people get main streamed in India.”

    మూర్తి గారూ, సంగ్మా రాష్ట్రపతి అయితే ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు మేలు జరుగుతుందా లేదా అన్నది పక్కన బెట్టినా, ఈ వాక్యంలో మీరు వ్యక్త పరిచిన భావన ఆలోచింపజేసేదిగా ఉంది. ఈశాన్య రాష్ట్రాల ప్రజలను, వారి భౌతిక రూపం వల్ల, వేరు మనుషులుగా చూసే పరిస్ధితి మన దేశంలో ఉంది. సంగ్మా అభ్యర్దిత్వం ద్వారా ఆ పరిస్ధితిని కొంతవరకైనా అధిగమించవచ్చనీ, భారత దేశ ప్రధాన స్రవంతిలో వారిని ఒక భాగంగా చూడవలసిన అవసరం ఉందనీ మీ వ్యాఖ్య గుర్తు చేస్తోంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s