అత్యాచారం ఆరోపణలపై వుమెన్ అధ్లెట్ ‘పింకీ ప్రామాణిక్’ అరెస్ట్


Pinkiతనతో సహజీవనం చేస్తున్న మరో మహిళపై అత్యాచారం చేసిన ఆరోపణలపై భారత మాజీ అధ్లెట్ పింకీ ప్రామాణిక్ ను పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. పింకీ ప్రామాణిక్ వాస్తవానికి మహిళ కాదనీ, మగవాడేననీ బాధితురాలు ఆరోపించినట్లు బెంగాల్ పోలీసులు తెలిపారు. తనను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి ఇప్పుడు నిరాకరిస్తోందని బాధిత మహిళ ఫిర్యాదు చేసిందని వారు తెలిపారు. సౌత్ ఆసియా గేమ్స్, ఆసియాడ్, కామన్ వెల్త్ లాంటి పోటీల్లో భారత దేశానికి వివిధ గోల్డ్ తో సహా వివిధ మెడళ్ళు పింకీ సంపాదించినట్లు తెలుస్తోంది.

పింకీ అనేక టోర్నమెంట్లలో భారత్ కు పతకాలు సంపాదించింది. 2006 లో దోహా లో జరిగిన ఆసియన్ గేమ్స్ లో 4×400 మీటర్ల రిలే పోటీల్లో బంగారు పతాకం, అదే సంవత్సరం మెల్ బోర్న్ కామన్ వెల్త్ గేమ్స్ లో వెండి పతకం, 2005 ఆసియా ఇండోర్ గేమ్స్ లో బంగారు పతాకం పింకీ సంపాదించి పెట్టింది. 2006 సౌత్ ఆసియా గేమ్స్ లో ట్రిపిల్ గోల్డ్ (400, 800, రిలే) సంపాదించి వార్తల్లో నిలిచింది. తూర్పు రైల్వేలో టి.టి.ఈ గా పని చేస్తున్న పింకీ 2007 లో అద్లేటిక్స్ నుండి రైటర్ అయింది.

బెంగాల్ లోని నార్త్ 24-పరగణాల జిల్లా, బాగిహతి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు నమోదయింది. ఫిర్యాదు అందుకున్నాక పోలీసులు గురువారం పింకీని అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షలకు నిరాకరించడంతో పింకీని అరెస్టు చేయలేకపోయినట్లు పోలీసులు చెప్పారని ఇండియా టుడే పత్రిక తెలిపింది. అయితే ఆమెను శుక్రవారం అరెస్టు చేశారని బి.బి.సి తెలిపింది. పింకీ పై వైద్య పరీక్షలు నిర్వహించడానికి పోలీసులు కోర్టు అనుమతి కోరారు. అధ్లెట్ గా కెరీర్ లో అనేక వైద్య పరీక్షలు తనపై జరిగాయనీ ఇపుడీ అర్ధం లేని ఆరోపణలపై మళ్ళీ వైద్య పరీక్షలేమిటని పింకీ ప్రశ్నిస్తున్నట్లు ఏ.ఎఫ్.పి వార్తా సంస్ధ తెలిపింది.

“పింకీ ప్రామాణిక్ ను గురువారం ఉదయం అదుపులోకి తీసుకున్నాం. బాధితురాలు తనను పింకీ రేప్ చేసినట్లు చెబుతోంది. పింకీ వాస్తవంగా మగవాడనీ, గత కొన్ని నెలలుగా పింకీతో సహజీవనం చేస్తున్నాననీ ఆమె చెబుతోంది” అని బాగిహతి పోలీస్ స్టేషన్ అధికారి చెప్పినట్లు ఇండియా టుడే తెలిపింది. బాధితురాలిని వివాహం చేసుకుంటానని చెప్పి ఇప్పుడు అందుకు నిరాకరిస్తోందని కూడా చెప్పినట్లు పోలీసు అధికారులు తెలిపారు. పింకీ తనను పదే పదే అత్యాచారం చేసిందనీ బాధితురాలు ఆరోపిస్తున్నదని వారు తెలిపారు.

పింకీ పురూలియా జిల్లాలోని అత్యంత పేద కుటుంబం నుండి వచ్చినట్లు తెలుస్తోంది. జార్ఖండ్ రాష్ట్ర సరిహద్దులోని తిలాక్దిహ్ ఆమె స్వగ్రామం. కనీస సౌకర్యాలు ఆ గ్రామంలో ఉండవు. ఆ గ్రామంలో శిక్షణ అంటే అక్కడి నది పక్కన రోజు పది కి.మీ పరిగెత్తడమే. కోల్ కతా వచ్చాక మార్చి 2002 లో ఆమె ప్రతిభను గుర్తుంచారని ఇండియా టుడే తెలిపింది. 100 మీ, 200 మీ, 400 మీ పరుగుపందెంలో మూడు రాష్ట్ర రికార్డులు నెలకొల్పడంతో పలువురి దృష్టిని ఆకర్షించింది. అనంతరం స్పోర్ట్ ఆధార్టీ ఆఫ్ ఇండియా ఆమెను తన ఆధ్వర్యంలోకి తీసుకుని శిక్షణ ఇచ్చింది.

“శారీరకంగా అబ్బాయే అయినప్పటికీ తర్వాత కాలంలో హార్మోన్ మార్పుల ద్వారా అమ్మాయి లక్షణాలు వచ్చిన కేసేమో మాకు పూర్తిగా తెలియదు. అలాంటివి జరిగే అవకాశం ఉంది” అని అధ్లేటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ సి.కె.వాసన్ తెలిపాడని ఫ్రెంచి వార్తా సంస్ధ ఎ.ఎఫ్.పి, పి.టి.ఐ ని ఉటంకిస్తూ తెలిపింది. వైద్య నివేదికల కోసం ఎదురు చూడవలసిందేనని ఆయన తెలిపాడు.

అత్యాచారం కేసు కాకపోయినప్పటికీ ఇదే విధమైన కేసు ను ఎ.ఎఫ్.పి ప్రస్తావించింది. 2009 లో సౌత్ ఆఫ్రికా దేశస్ధురాలు కాస్టర్ సెమెన్యా 800 మీ పరుగు పందెంలో ప్రపంచ ఛాంపియన్ షిప్ గెలుచుకుంది. ఆ తర్వాత ఆమె జెండర్ పై అనుమానంతో 11 నెలలపాటు పోటీలకు దూరంగా ఉంచారు. అయితే పరీక్షల అనంతరం ఆమెను స్త్రీగా తేల్చారు. రానున్న లండన్ ఒలింపిక్స్ లో ఆమె గోల్డ్ మెండల్ గెలుచుకుంటుందని పలువురు భావిస్తున్నట్లు ఎ.ఎఫ్.పి తెలిపింది. పింకీ ప్రామాణిక్ విషయంలో ఇదే రుజువు కావాలని ఆశించడంలో తప్పు లేదేమో.

One thought on “అత్యాచారం ఆరోపణలపై వుమెన్ అధ్లెట్ ‘పింకీ ప్రామాణిక్’ అరెస్ట్

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s