మన కాలంలో గ్రేటెస్ట్ ఫిలాసఫర్ ‘కారల్ మార్క్స్’ -బిబిసి సర్వే (2005)


karl-marx-fishమన కాలంలో అత్యంత గొప్ప తత్వవేత్త ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి బి.బి.సి రేడియో 4, 2005 లో సర్వే నిర్వహించింది. 20 మంది ముఖ్యమైన తాత్వికులను బి.బి.సి షార్ట్ లిస్ట్ చేయగా వారిలో ‘కారల్ మార్క్స్’ అత్యధిక ఓట్ల శాతంతో ప్రధమ స్ధానంలో నిలిచాడు. అత్యంత గౌరవనీయమైన, ప్రభావశీలమైన ‘ఫిలసాఫికల్ ధింకర్స్’  లో ‘కారల్ మార్క్స్ ప్రధమ స్ధానంలో నిలిచాడని బి.బి.సి జులై 13, 2005 తేదీన ప్రకటించింది.

30,000 మంది ఓట్లను లెక్కించగా, అందులో 28 శాతం మంది తత్వశాస్త్రంలో  శ్రామికుడికి అగ్ర పీఠం అందించిన  ‘కారల్ మార్క్స్’ ను “In Our Time’s Greatest Philosopher” గా స్పష్టమైన మెజారిటీతో ఎన్నుకున్నారు. ఆయా ఫిలాసఫర్ల పేర్లను రేడియో 4 శ్రోతలే నామినేట్ చేశారని బి.బి.సి తెలిపింది. ప్రఖ్యాత రచయిత, జర్నలిస్టు ‘ఫ్రాన్సిస్ వీన్’, ‘కారల్ మార్క్స్’ ను గ్రేటెస్ట్ ఫిలాసఫర్ గా ప్రతిపాదించగా 27.93 శాతం మంది ఆయనతో అంగీకరించారు. కారల్ మార్క్స్ విజేత కావడం ‘astonishing’ గా బి.బి.సి అభివర్ణించింది.

రెండవ స్ధానంలో స్కాటిష్ తత్వవేత్త ‘డేవిడ్ హ్యూమ్’ నిలిచాడు. ఈయనను రచయిత, తత్వవేత్త ‘జూలియన్ బగ్గిని’ ప్రతిపాదించాడని బి.బి.సి తెలిపింది. రెండవ స్ధానంలో నిలిచిన హ్యూమ్ కు కారల్ మార్క్స్ కు వచ్చిన ఓట్లలో సగం కూడా రాకపోవడం విశేషం. ఆయన కు వచ్చిన ఓట్ల శాతం 12.7 మాత్రమే.

జోనాధన్ సాచ్స్, విల్ సెల్ఫ్ లాంటి వారు ప్రతిపాదించి సమర్ధించిన విట్గెన్ స్టీన్ 6.8 శాతం ఓట్లతో  మూడవ స్ధానంలో నిలవగా ‘ది గార్డియన్’ పత్రిక మద్దతు ఇచ్చిన కాంట్ 5.61 శాతం ఓట్లతో ఆరవ స్ధానంలో నిలిచాడు. సోక్రటీస్ 4.82 శాతం ఓట్లతో ఎనిమిదవ స్ధానంలోనూ, అరిస్టోటిల్ 4.52 శాతం ఓట్లతో తొమ్మిదవ స్ధానంలోనూ నిలిచారు.

Karl-Marx-Quotes-2మెల్విన్ బ్రాగ్ సమర్పించిన ‘In Our Time’ కార్యక్రమం ఐదు వారాల పాటు ఆన్ లైన్ పోల్ నిర్వహించింది. ఈ పోల్ కోసం ఏర్పాటు చేసిన వెబ్ సైట్ ఈ కాలంలో మిలియన్ కి పైగా హిట్లు సంపాదించిందని బి.బి.సి తెలిపింది. సెలబ్రిటీల దగ్గర్నుండి వార్తా పత్రికల వరకూ తమ తమ ఫేవరెట్ ఫిలాసఫర్లను ప్రతిపాదించారని తెలిపింది.

‘ది గార్డియన్’ పత్రిక కాంట్ కి మద్దతు ఇవ్వగా, ‘ది ఎకనమిస్ట్’ పత్రిక డేవిడ్ హ్యూమ్ కు మద్దతు ఇచ్చింది. ‘ది ఇండిపెండెంట్’ పత్రిక విట్గెన్ స్టీన్ కి మద్దతు ఇచ్చింది.

మొదటి రౌండ్ తర్వాత ఇరవై మందిని షార్ట్ లిస్ట్ చేసినట్లు బి.బి.సి తెలిపింది. మొదటి రౌండ్ లో అత్యధిక ఓట్లు వచ్చిన వారు రెండవ రౌండ్ లోకి ప్రవేశించారు. రెండవ రౌండ్ లో వివిధ ఫిలాసఫర్ల కు మద్దతుగా ప్రముఖులు, నిపుణులు ప్రసంగించే అవకాశం కల్పించినట్లు బి.బి.సి తెలియజేసింది. ఆయా తత్వవేత్తలకు ఎందుకు మద్దతు ఇవ్వాలో నిపుణులు వివరించగా కారల్ మార్క్స్ భావాలకు అత్యధికులు ఆమోదం ప్రకటించారు.

కారల్ మార్క్స్ ప్రతిపాదించిన తాత్విక, ఆర్ధిక, రాజకీయ, చారిత్రక, సామాజిక సిద్ధాంతం సర్వతోముఖమైనది. తాత్విక ఆయన వివరించిన ‘గత తారిక భౌతిక వాదం’ (Dialectical Materialism) తాత్విక చింతనలో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చింది. గతి తార్కిక భౌతిక వాద తత్వాన్ని మానవ చారిత్రక పరిణామానికి అన్వయించి ఆయన తయారు చేసిన ‘చారిత్రక భౌతిక వాదం’ (Historical Materialism) మానవ జాతి పరిణామాన్ని సమస్త కోణాల నుండి విప్పి చూపిన విధానం అత్యంత సమగ్రమైనది.

‘తత్వవేత్తలందరూ ప్రపంచం ఎలా ఉన్నదో వివిధ రకాలుగా చెప్పారు. కానీ అసలు విషయం దాన్ని మార్చుకోవడం ఎలా అన్నదే’ అని కారల్ మార్క్స్ చెప్పిన పలుకులు ప్రత్యక్షర సత్యమని అనాదిగా సాగుతూ వచ్చిన రాజకీయార్ధిక ప్రజా విప్లవాలు నిర్ద్వంద్వంగా నిరూపిస్తాయి.

Karl-Marx-Quotes-5అప్పటివరకూ తత్వ శాస్త్రం అంటే కులీన మేధావుల డ్రాయింగ్ రూమ్ లకూ, బానిస యాజమానుల భూస్వామ్య పెత్తందారుల పోషణలో సర్వ సుఖాలలో ఓలలాడే పండితోత్తముల చర్చా గోష్టులకూ మాత్రమే పరిమితమై ఉండేది. వారి తత్వశాస్త్రాలకు ఆధిపత్య వర్గాల విజయగాధలకు, క్రూరాతిక్రూరమైన అణచివేతల చరిత్రలకూ, తాత్విక సమర్ధనలు సమకూర్చడమే ప్రధమ కర్తవ్యం. బానిస శ్రమ సహజమే అని చెప్పినా, కనపడుతున్నదంతా భ్రమేననీ, అసలుది ఎక్కడో ఉందనీ ప్రవచించినా వారికే చెల్లు. మానవ ప్రపంచంలో పిడికెడు మంది ఆధిపత్య వర్గాలు కాసింతయినా శ్రమ చేయకుండా సమస్త భోగభాగ్యాలూ అనుభవించడం ‘పూర్వజన్మ సుకృతమే’ నని సిద్ధాంతీకరించి శ్రామికుల కష్టాలను తాత్వికంగా  శాశ్వతీకరింపజేసిన ఘనత వారిదే.

కారల్ మార్క్స్ ప్రతిపాదించిన తత్వ శాస్త్రం సర్వ సమగ్రం. ఆయన తత్వంలో మానవ ప్రపంచం మనుగడకు ప్రధాన ఆధారమైన ఉత్పత్తులకు మూలంగా ఉండే శ్రమకూ, శ్రామికుడికే అగ్రపీఠం. కులీనుల పడక్కుర్చీలకూ, పండితోత్తముల చర్చోపచర్చల లగ్జరీలకూ పరిమితమైన తత్వ శాస్త్రాన్ని మెడపట్టి లాక్కొచ్చి కష్ట జీవి పాదాలకు దాసురాలిగా చేసిన ‘కారల్ మార్క్స్’ సర్వకాల సర్వావస్ధలయందునా స్మరణీయుడు.

2 thoughts on “మన కాలంలో గ్రేటెస్ట్ ఫిలాసఫర్ ‘కారల్ మార్క్స్’ -బిబిసి సర్వే (2005)

  1. ఆ సర్వే వేస్ట్ వాళ్ల పొగరుకి ఒక నిదర్శనం. తూర్పు దేశాలవారికి చెందిన ఒక్కడి పేరు కూడా లేకుండా వాళ్లలో వాళ్లు యురోప్ కి చెందిన వారిని లిస్ట్ లో వేసుకొని గెలిపించుకొని వాళ్లని ప్రపంచ మేధావుల అనే పదం వఆది ఆసియా దేశాల వారి మీద రుద్దారు. ఆ లిస్ట్ లో ఉన్న వాrilO caalaa mandi కల్ట్ క్రియేటర్స్.ప్రత్యక్షంగానో పరోక్షంగానో, వారి ఫిలాసఫి రాజకీయాలకు ఉపయోగపడినవారు. అందువలన వారికి ఆ గుర్తింపు వచ్చింది. నిషే గారి ఫిలాసఫి హిట్లర్ ప్రభావితుడైనాడు.

  2. Europeans always ahead of us regarding mundane world.We should accept it. In every walk of life, they spearheaded.They gave least importance to so called family life.And they pursued the chosen field with utmost dedication and sacrifice.Karl Max undoubtedly a stalwart of our times.

    ……..Murthy

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s