తమ సిరియా దుష్ప్రచారానికి తామే బలైన బ్రిటన్ విలేఖరులు


Set to be shot -Alex Thomsonసిరియా ‘కిరాయి తిరుగుబాటు’ పై వివాదాస్పద రీతిలో ఏకపక్షంగా వార్తలు ప్రచురిస్తున్న పశ్చిమ దేశాల విలేఖరులకు కాస్తలో చావు తప్పింది. దుష్ట బుద్ధితో తాము రాస్తున్న అవాస్తవ వార్తలకు సరిగ్గా వ్యతిరేక అనుభవం ఎదురై ‘చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు’ బైటపడ్డారు. తమ చావు ద్వారా అంతర్జాతీయంగా జరుగుతున్న దుష్ప్రచారంలో అదనపు పాయింట్లు కొట్టేద్దామనుకున్న కిరాయి తిరుగుబాటుదారుల అసలు స్వరూపం వెల్లడి చేయక తప్పని పరిస్ధితి చానెల్ 4 చీఫ్ కరెస్పాండెంట్ ‘అలెక్స్ ధాంసన్ ఎదుర్కొన్నాడు. కిరాయి తిరుగుబాటుదారుల నుండి తానెదుర్కొన్న చేదు అనుభవాన్ని చానెల్ 4 బ్లాగ్ లో ధాంసన్ వివరించాడు.

అలెక్స్ ధాంసన్ ప్రకారం సిరియా ప్రభుత్వ బలగాల కాల్పులకు తాము బలయ్యేలా ‘సో-కాల్డ్ రెబెల్స్’ అతన్నీ, అతని జర్నలిస్టు మిత్రులనూ ఉద్దేశ్యపూర్వకంగా ప్రయత్నించారు.  నరమానవులెవరూ సంచరించని ‘ఫ్రీ ఫైర్ జోన్’ లోకి వెళ్ళేలా తప్పుదారి పట్టించారు. కొత్త ‘హత్యాకాండ’ జరిగిందంటూ బి.బి.సి లాంటి పశ్చిమ దేశాల పత్రికలు కాకి గోల చేసిన ‘ఆల్-ఖుబీర్’ ప్రాంతంలోనే ఇది జరగడం విశేషం. కిరాయి తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న ఈ ప్రాంతంలో ఎనభై మందిని ప్రభుత్వానుకూల మిలీషియా చంపిందని పశ్చిమ పత్రికలు కోళ్లై కూస్తున్నాయి. అలాంటి తప్పుడు కూతలు కూస్తున్నది అలెక్స్ లాంటి పశ్చిమ విలేఖరులే. తమ తప్పుడు రాతల ఫలితం ఏమిటో వారే అనుభవించడం యాదృచ్ఛికం ఏమీ కాదు.

సోమవారం తాము ఈ విపత్కర పరిస్ధితి ఎదుర్కొన్నట్లు అలెక్స్ తెలిపాడు. ‘చానెల్ 4 న్యూస్’ కి చెందిన అలెక్స్ మరో ఇద్దరు విలేఖరులతో కలిసి ఐక్యరాజ్య సమితి మానిటర్లతో ‘ఆల్-ఖుబీర్’ కి ప్రయాణించడానికి బయలు దేరారు. ఆల్-ఖుబీర్ వెళ్ళాక విలేఖరులు తమ తిప్పలేవో తామే పడాలని సమితి వారిని ముందే హెచ్చరించింది. దశాబ్దాలుగా విదేశాల్లో, ముఖంగా లండన్ లో, నివశిస్తున్న సిరియా విద్రోహులు నిర్మించిన ‘ఫ్రీ సిరియన్ ఆర్మీ’ చేతుల్లో ‘ఆల్-ఖబీర్’ ప్రాంతం ఉన్నది. అక్కడి పరిస్ధితిని వాకబు చేయడం చానెల్ 4 విలేఖరులు భావించి సమితి సాయాన్ని కోరారు.

సమితి బృందంతో కలిసి ఆల్-ఖుబీర్ వెళ్ళాక చుట్టు పక్కల వాకబు చేయడానికి అలెక్స్ బృందం అక్కడ ఉన్నవారి సాయం కోరారు. తిరుగుబాటుదారులుగా చెప్పుకుంటున్న నలుగురు వారికి దారి చూపిస్తామని నల్ల కారులో బయలుదేరారు. అలెక్స్ బృందం వారిని అనుసరించింది. ‘నో-మేన్స్ లాండ్’ కి దారి తీసే రోడ్డు వెంట వెళ్ళమని చెప్పిన నల్ల కారు, వెనక ఆగిపోయింది. అయితే వారు చూపిన రోడ్డు తిన్నగా ‘ఫ్రీ-ఫైర్ జోన్’ (నో-ఫైర్ జోన్ కాదు) కే దారి తీసింది.  వారు చెప్పిన రోడ్డు వెంటే వెళ్ళిన అలెక్స్ బృందం ఆ రోడ్డు అర్ధాంతరంగా ఆగిపోగా మనుషులెవరూ సంచరించని ప్రదేశంలో తేలారు.

అక్కడికి చేరిన వెంటనే ఓ బుల్లెట్ వారి కారులోకి దూసుకొచ్చింది. క్రీచు మంటూ కారు మూడు మలుపులు తిరిగి రక్షణ కోసం దగ్గర్లో కనబడిన పక్క సందులోకి దూరింది. అక్కడ మరోసారి రోడ్డు అర్ధాంతరంగా (డెడ్ ఎండ్) ఆగిపోయింది. అదే రోడ్డులో వెనక్కి వచ్చి ‘ఫ్రీ ఫైర్ జోన్’ గుండా వచ్చిన రోడ్డునే వెళ్ళడం తప్ప మరొక దారి వారికి లేకపోయింది. అదే దారినే వేగంగా వెనక్కి వచ్చిన అలెక్స్ బృందానికి తిరుగుబాటుదారుల నల్ల కారు తమని తప్పుదారి పట్టించిన చోటనే ప్రత్యక్షం అయింది. అలెక్స్ కారు మళ్ళీ కనబడగానే అక్కడి నుండి నల్లకారు వేగంగా వెళ్లిపోయింది. సిరియన్ ఆర్మీ చేత కాల్పులకు గురి కావడానికే తమను తప్పుదారి పట్టించారని అలెక్స్ బృందానికి అర్ధం అయింది. అలెక్స్ ఇలా రాశాడు.

Predictably the black car was there which had led us to the trap. They roared off as soon as we re-appeared. I’m quite clear the rebels deliberately set us up to be shot by the Syrian Army. Dead journos are bad for Damascus.”

చనిపోయిన జర్నలిస్టుల శవాలను అడ్డుపెట్టుకుని సిరియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున ప్రచారం పొందవచ్చునని తిరుగుబాటుదారులు ఉద్దేశ్యపూర్వకంగానే తప్పుదారి పట్టించారని అలెక్స్ తెలిపాడు. తమ అనుమానం నిజమేనని మరి కొద్ది నిమిషాలకే అలెక్స్ బృందానికి అర్ధం అయింది. మళ్ళీ సమితి బృందాన్ని కలవడానికి చేరువవుతున్న కొద్ది నిమిషాల ముందు పక్క సందులో గుండా నల్ల కారు అలెక్స్ కారు ముందుకి అడ్డుగా వచ్చింది. అయితే వీరిని గమనించిన సమితి బృందం కారు విలేఖరులు ఉన్న చోటికి వచ్చి అక్కడి నుండి వెళ్లిపోయిందనీ అలెక్స్ తెలిపాడు. సమితి బృందం వెనకనే వెళ్ళిన అలెక్స్ బృందం ‘ఆల్-ఖబీర్’ నుండి బయటపడ్డారు.

జరిగిన సంఘటన గురించి “Set up to be shot in Syria’s no mans land” శీర్షికన అలెక్స్ కధనం ప్రచురించాడు. ప్రచురితం అయ్యాక అలాంటి అనుభవం ఎదుర్కొన్నవారు ఇంకా ఉన్నారని అలెక్స్ కి తెలిసొచ్చింది. ఆయన ఇలా రాశాడు.

“This morning I received the following tweet: ‘@alextomo I read your piece “set up to be shot in no mans land’, I can relate as I had that same experience in Al Zabadani during our tour.’ That was from Nawaf al Thani, who is a human rights lawyer and a member of the Arab League Observer mission to Syria earlier this year.”

జనవరిలో అరబ్ లీగ్ బృందం ఒకటి సిరియాలో పర్యటించింది. వారితో పాటు ప్రయాణించిన మానవ హక్కుల లాయర్ ‘నవాఫ్ ఆల్ ధాని’, ఆల్-జబదానీ పట్నంలో లో ఇదే అనుభవం ఎదుర్కొన్నానని ట్విట్టర్ లో రాశాడు. ధాని అరబ్ లీగ్ బృందంలో సభ్యుడు కూడా. తిరుగుబాటుదారులు విచక్షణారహితంగా సిరియా ప్రజలపై సాగిస్తున్న హత్యాకాండకు ప్రతిస్పందనగానే సిరియా పోలీసులు స్పందించారని అరబ్ లీగ్ బృందం నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ప్రచురించబడకుండా పశ్చిమ దేశాలు ఒత్తిడి తెచ్చి అడ్డుకున్నాయని పత్రికలు తెలిపాయి.

సిరియాలో తిరుగుబాటు ఎంత బూటకమో ఇప్పటికీ చాలా సార్లు వెల్లడయింది. లేని తిరుగుబాటు గురించి పుంఖాను పుంఖాలుగా వార్తలు ప్రచురిస్తున్న పశ్చిమ పత్రికలు. సౌదీ అరేబియా, బహ్రెయిన్ లాంటి మతోన్మాద ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నప్పటికీ పట్టించుకోవు. అసలైన ప్రజాందోళనల గురించి ఒక్క ముక్క కూడా అవి రాయవు. దానికి కారణం ఆ దేశాల ప్రభుత్వాలు అమెరికా, యూరప్ ల కంపెనీల దోపిడీకి స్వేచ్ఛ కల్పించడమే.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s