కువైట్ పై దాడికి 8 రోజుల ముందు, అమెరికా ఇరాక్ ల మధ్య ఏం జరిగింది?


Infamous meeting; April Glaspie and Saddamఆగస్టు 2, 1990 న కువైట్ పై ఇరాక్ దాడి చేసింది. ఇది దురాక్రమణ అని అమెరికా గగ్గోలు పెట్టింది. అకస్మాత్తుగా జరిగిన ఈ దాడి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తిందని బి.బి.సి లాంటి వార్తా సంస్ధలు ప్రకటించాయి. స్వేచ్ఛా ప్రపంచంలో ఇలాంటి దాడులు కూడదని, ఇరాక్ బలగాలు బేషరతుగా కువైట్ నుండి విరమించుకోవాలని అమెరికా అధ్యషుడు జార్జి బుష్ (సీనియర్) అమెరికా పార్లమెంటు లోపలా బయటా ఎదతెరిపి లేకుండా నీతులు, బోధలు కురిపించాడు. ఒక స్వతంత్ర దేశంపై అక్రమంగా దాడి చేయడమా అని ఆగ్రహం వెళ్ళగక్కాడు.

అయితే వాస్తవానికి జరిగిందేమిటి? కువైట్ పై దాడి చేయబోతున్న సంగతి అమెరికాకి ముందు తెలియదా? ఇరాన్-ఇరాక్ యుద్ధంలో సద్దాం వెన్నంటే నిలిచి, ఇరాక్ కి ప్రత్యక్షంగా, ఇరాన్ కి పరోక్షంగా ఆయుధాలు అమ్ముకుని లబ్ది పొందిన అమెరికాకి పశ్చిమాసియాలో ఏం జరగనున్నదో తెలియనంతగా కళ్ళు మూసుకుని ఉన్నదా? కువైట్ పై దాడి జరగడానికి ఎనిమిది రోజుల ముందు ఇరాక్ అధ్యక్ష భవనంలో అధ్యక్షుడు సద్దాం హుస్సేన్, ఇరాక్ లో అమెరికా రాయబారి ఏప్రిల్ గాస్పై ల మధ్య జరిగిన సంభాషణ చదివితే అమెరికా మోసం తెలుస్తుంది.

జులై 25, 1990, అధ్యక్ష భవనం, బాగ్దాద్:

అమెరికా రాయబారి ఏప్రిల్ గాస్పై: ఇరాక్ తో మా సంబంధాలను పెంచుకోవడానికి నాకు అధ్యక్షుడు బుష్ నుండి ప్రత్యక్ష ఆదేశాలున్నాయి. కువైట్ తో మీ ఘర్షణకు తక్షణ కారణం ‘అధిక ఆయిల్ ధరల కోసం మీకు ఉన్న కాంక్ష.’ ఆ కారణం పట్ల మాకు సానుభూతి ఉంది. (విరామం) సంవత్సరాలుగా నేనిక్కడ నివసించానని మీకు తెలుసు. మీ దేశాన్ని పునర్నిర్మించుకోవడానికి మీరు చేపట్టిన అసామాన్యమైన (extraordinary) ప్రయత్నాలు నాకు అచ్చెరువు గొలుపుతాయి. మీకు నిధులు కావాలన్న సంగతి మాకు తెలుసు. (విరామం) దక్షిణాన పెద్ద ఎత్తున సైన్యాన్ని నియోగించడాన్ని మేము చూస్తున్నాము. మామూలుగా అయితే ఆ విషయంతో మాకు పని లేదు. కానీ కువైట్ కి వ్యతిరేకంగా మీరు చేస్తున్న బెదిరింపుల నేపధ్యంలో ఇది జరగడాన్ని బట్టి చూస్తే మాకు ఆందోళన కలగడానికి ఆస్కారం ఉంది. ఈ కారణం వల్ల స్నేహ పూర్వకంగానే -ఘర్షనాత్మకంగా కాదు- మీ ఉద్దేశ్యాల గురించి అడగమని నాకు ఆదేశాలు వచ్చాయి: కువైట్ సరిహద్దులకు దగ్గరగా మీ సైన్యాలు ఎందుకు ఉన్నాయి?

సద్దాం హుస్సేన్: కువైట్ తో మాకు ఉన్న వివాదంకి సంబంధించి ఒక ఒప్పందానికి రావడానికి సంవత్సరాలుగా నేను ప్రతీ ప్రయత్నం చేశానని మీకు తెలుసు. రెండు రోజుల్లో సమావేశం జరగాల్సి ఉంది; ఈ ఒక్క సారి వరకే నేను చర్చలకు అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. (విరామం) మేము (ఇరాకీలం) వారితో (కువైటీలతో) కలిసినపుడు ఏమన్నా ఆశ కనిపిస్తే, ఏమీ జరగదు. కానీ మాకు పరిష్కారం దొరకనట్లయితే ఇరాక్ చావు ను అంగీకరించదన్నది సహజమే.

అమెరికా రాయబారి గ్లాస్పై: ఏ పరిష్కారాలు ఆమోదయోగ్యం కాగలవు?

సద్దాం హుస్సేన్: ‘షట్ ఆల్ అరబ్’ ని మొత్తంగా మేము కాపాడుకోగలిగితే -ఇరాన్ తో యుద్ధంలో మా వ్యూహాత్మక లక్ష్యం అదే- మేము రాయితీలు ఇస్తాము (కువైటీలకు). కానీ, షట్ లో సగభాగం మాత్రమే కాపాడుకోవడం లేదా ఇరాక్ మొత్తాన్ని (సద్దాం దృష్టిలో కువైట్ తో కలిపి) కాపాడుకోవడం… ఈ రెండింటిలో ఒకటే కోరుకునే పరిస్ధితి వస్తే, కువైట్ పై మా హక్కులు రక్షించుకుని మేము కోరుకుంటున్న రూపంలో ఇరాక్ మొత్తాన్ని కాపాడుకోవడానికి మేము షట్ మొత్తాన్ని వదులుకుంటాము. (విరామం) దీనిపై అమెరికా అభిప్రాయం ఏమిటి?

[సద్దాం హుస్సేన్ చెబుతున్న షట్ ఆల్ అరబ్, నది పేరు. ఇది ఇరాన్, ఇరాక్ ల సరిహద్దు గుండా ప్రవహించి పర్షియల్ గల్ఫ్ లో కలుస్తుంది. ఈ నది గుండా వెళ్ళే జల రవాణా మార్గంపై హక్కుల వివాదం వల్లనే ఇరాన్, ఇరాక్ ల మధ్య ఎనిమిది సంవత్సరాలు (1980-88) యుద్ధం నడిచింది. 1980 కి ముందరి పరిస్ధితి యధాతధంగా కొనసాగాలన్న ఒప్పందంతో ఆ యుద్ధం ముగిసింది.]

April Glaspieఅమెరికా రాయబారి గ్లాస్పై: కువైట్ తో మీ వివాదం లాంటి మీ అరబ్-అరబ్ తగాదాలపై మాకే అభిప్రాయమూ లేదు. ఒక సూచన ను నొక్కి చెప్పాలని సెక్రటరీ (ఆఫ్ స్టేట్ జేమ్స్) బేకర్ నన్ను ఆదేశించాడు. 1960లలో ఇరాక్ కి ఇచ్చిన సూచనే అది. అదేమంటే, కువైట్ అంశంతో అమెరికాకి సంబంధం లేదు.

(సద్దాం నవ్వు).

ఆగస్టు 2, 1990 తేదీన సద్దాం సేనలు కువైట్ పై దాడి చేసి ఆక్రమించాయి. ………………….

బాగ్దాద్, సెప్టెంబర్ 2, 1990, అమెరికా ఎంబసీ:

నెలరోజుల తర్వాత బ్రిటిష్ జర్నలిస్టులకి పై సంభాషణతో కూడిన టేప్ అందింది. దానితో పాటు జులై 29, 1990 తేదీన సద్దాం, గ్లాస్పై ల మధ్య జరిగిన సంభాషణ టేప్ కూడా అందింది. దిగ్భ్రమ చెందిన జర్నలిస్టులు మేడమ్ గ్లాస్పై తో వాగ్వివాదానికి దిగారు. బాగ్దాద్ లో అమెరికా ఎంబసీ నుండి నిష్క్రమిస్తున్న గ్లాస్పై ని వారిలా అడిగారు.

జర్నలిస్టు 1: ఈ ట్రాన్ స్క్రిప్టు లు (పైకి ఎత్తి చూపుతూ) కరెక్టెనా మేడమ్ అంబాసిడర్?

(అంబాసిడర్ గ్లాస్పై బదులివ్వలేదు)

జర్నలిస్టు 2: సద్దాం (కువైట్ పై) దాడి చేయబోతున్నాడని మీకు ముందే తెలుసు కానీ వద్దని మీరు సద్దాంని హెచ్చరించలేదు. కువైట్ ని అమెరికా కాపాడుతుందని మీరు సద్దాంకి చెప్పలేదు. సరిగ్గా దానికి వ్యతిరేకంగా చెప్పారు – కువైట్ అంశంతో అమెరికాకి సంబంధం లేదని.

జర్నలిస్టు 1: ఈ దురాక్రమణని, అతని దాడిని మీరు ప్రోత్సహించారు. మీరేం ఆలోచిస్తున్నారు?

అమెరికా అంబాసిడర్ గ్లాస్పై: ఖచ్చితంగా, నేను ఆలోచించలేదు, ఇంకేవ్వరూ ఆలోచించలేదు. కువైట్ మొత్తాన్ని ఇరాకీలు తీసేసుకుంటున్నారని.

జర్నలిస్టు 1: దానిలో (కువైట్) కొద్ది భాగాన్నే అతను (సద్దాం) తీసుకుంటున్నాడని మీరనుకున్నారా? కానీ అలా ఎలా అనుకున్నారు? చర్చలు విఫలం అయితే ఇరాక్ మొత్తం, తాను కోరుకుంటున్న ఇరాక్ రూపం కోసం, తన ఇరాన్ లక్ష్యాన్ని (షట్ ఆల్ అరబ్ వాటర్ వే) వదులుకుంటానని సద్దాం మీకు చెప్పాడు కదా? అందులో కువైట్ కలిసే ఉందని మీకు తెలుసు. కువైట్, ఇరాక్ లో చారిత్రక భాగంగా ఇరాకీలు ఎప్పుడూ భావిస్తారని మీకు తెలుసు!

జర్నలిస్టు 1: దాడికి అమెరికన్లు పచ్చ లైటు చూపారు. కనీసం కొద్ది దురాక్రమణ వరకి ఓ.కె అని, ఆల్-రుమిలాహ్ ఆయిల్ ఫీల్డు, వివాదాస్పద సరిహద్దు భాగం, గల్ఫ్ ద్వీపాల (బుబియాన్ తో సహా) వరకు చేజిక్కించుకోవడాన్ని అమెరికా వ్యతిరేకించదనీ, మీరు సద్దాంకి సిగ్నల్ ఇచ్చినట్లు ఒప్పుకుంటున్నారు. ఇవే కదా తమవేనని ఇరాక్ అంటున్నది?

(అంబాసిడర్ గ్లాస్పై ఏమీ బదులివ్వలేదు. తన వెనుక లిమౌసిన్ డోర్ మూసుకుపోగా ఆమె ఎక్కిన కారు ముందుకు దూసుకుపోయింది.)

అదీ సంగతి. మధ్య ప్రాచ్యంలో అప్పటి వరకూ సద్దాం హుస్సేన్ అమెరికాకి నమ్మకమైన మిత్రుడు. అమెరికా కూడా తనకి నమ్మకమైన మిత్రుడనే సద్దాం భావించాడు. కువైట్ పై దాడి చేయబోతున్నానని అమెరికాకి ముందే చెప్పాడు. అంబాసిడర్ గ్లాస్పై ఇచ్చిన గ్రీన్ సిగ్నల్ ప్రోత్సాహంతో ఆయన కువైట్ ని ఆక్రమించాడు. అయితే ఆక్రమించిన తర్వాత గాని ఆయనకి అమెరికా దుర్బుద్ధి లోతులు అర్ధం కాలేదు. తనను ప్రోత్సహించడం వెనుక తనను, తన దేశాన్నీ మొత్తంగా కబళించే పన్నాగం అమెరికాకి ఉందని ఆ తర్వాతే అర్ధం అయింది. అర్ధం అయ్యాక అమెరికాతో శాంతికి సద్దాం పలు విధాలుగా ప్రయత్నించాడు. కువైట్ నుండి బైటికి రావడానికి అంగీకరించాడు. కానీ కువైట్ నుండి బైటికి రావడం కాదు అమెరికాకి కావలసింది. దానికి కావలసింది ఏదో ఒక సాకు చూపి మధ్య ప్రాచ్యంలో ప్రత్యక్షంగా, సైనికంగా తిష్ట వేయడమే. జరిగిందదేనని అందరి ముందూ ఉన్న సత్యం. ఇప్పుడు సిరియా, ఇరాన్ లపై అమెరికా కన్ను పడింది. కేవలం కన్నే కాదు ఆయుధాలు, గూఢచారులూ, కిరాయి తిరుగుబాటుదారులూ, టెర్రరిస్టులకు ప్రోత్సాహం అన్నీ పడ్డాయి.

2 thoughts on “కువైట్ పై దాడికి 8 రోజుల ముందు, అమెరికా ఇరాక్ ల మధ్య ఏం జరిగింది?

 1. China & Russia need to take action against America to protect their own interests.

  If Americans were to succeed in having their way in Afghanistan and Pakistan it would seriously threaten China bearing in mind that India is already friendly towards America. It would be a serious setback to Chinese in that oil supply routes could be closed by America at will.

  China & Russia are probably the only two militaries that can afford to take America on and make Americans think twice. I say this because China & Russia are the only two countries that can threaten the American mainland with nuclear weapons.

  I am not suggesting that they would necessarily win against America but they could certainly cause Americans unacceptable damage.

  One can not help notice that when Russia took action against Georgia who Americans and Nato were making friendly overtures to Americans and Nato did little to help Georgia who they had earlier encouraged to be boisterous towards Russia.

  American sabre rattling on Iran is not missed. Both China & Russia have prevented Iran from being completely isolated. The Chinese and Russians were not happy with what happened in Libya and are unlikely to be conned again. The movement towards Syria by Russia and and noises about missile shields in Europe are something that can not be ignored.

  With Putin about to be re-elected in Russia makes the way for a more assertive Russia when it comes to America.

  The danger is that Americans and Europe are in financial crisis and may need to get more adventurous in their search for stealing third world resourses and influence and may use force. Will they risk the ire of China and or Russia? Will they accept a new order that is not dominated by American, European and White English speaking countries? Will they risk WW3 with nukes?

  I believe that the Chinese & Russians are keeping a close eye on what is happening and may coordinate their actions to prevent this.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s