దళిత రక్తం రుచిమరిగిన అగ్ర కుల దురహంకారి ‘బ్రహ్మేశ్వర్ ముఖియా’ హత్య


ranvir-sena3‘బచర్ ఆఫ్ బీహార్’, స్త్రీలు, పిల్లలతో సహా రెండు వందలకు పైగా దళితులను పాశవికంగా చంపేసిన అగ్రకుల దురహంకారి ‘బ్రహ్మేశ్వర్ సింగ్ ముఖియా’ శుక్రవారం ఉదయం హత్యకు గురయ్యాడు. ‘మార్నింగ్ వాక్’ కి వెళ్ళిన ముఖియాను గుర్తు వ్యక్తులు సమీపం నుండి తుపాకితో కాల్చి చంపారని ఎన్.డి.టి.వి తెలిపింది. హత్య జరిగిన ‘అర్రా’ పట్టణం ఇప్పుడు కర్ఫ్యూ నీడన బిక్కు బిక్కు మంటోంది. దశాబ్దానికిపైగా బీహార్ అగ్రకుల భూస్వాముల తరపున రాష్ట్రం అంతటా రక్తపుటేరులు పారించిన ముఖియా హత్య ‘రాజకీయ హత్య’గా బీహార్ రాజకీయ పార్టీలు అభివర్ణించాయి.

ముఖియా హత్యను అడ్డు పెట్టుకుని అగ్రకుల సాయుధ ముఠాలు బీహార్ లో మరోసారి విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. ముఖియా శవాన్ని కదిలించ కుండా అడ్డుకుంటున్నారు. రాష్ట్ర అత్యున్నత పోలీసు అధికారి డి.జి.పి ని సైతం శవం దగ్గరికి చేరకుండా అడ్డుకున్నారు. డి.జి.పి ని గేలి చేసి వెనక్కి తరిమారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వస్తే తప్ప శవాన్ని కదలనీయమని భీష్మించారు. బీహార్ వాయవ్య మూలాన ప్రారంభమయిన విధ్వంసం, హింస లు రాష్ట్రం లోని ఇతర ప్రాంతాలకు విస్తరించిందని ఎన్.డి.టి.వి తెలిపింది. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, బస్సులను తగలబెట్టడం, ఆఫీసులకు నిప్పు పెట్టడం, పాట్నా రాజధాని ఎక్స్ ప్రెస్ ని తగల బెట్టడం మున్నగు విధ్వంసాలకు యధేచ్ఛగా పాల్పడ్డారని తెలిపింది.

Brahmeshwar Singh Mukhiyaసీనియర్ పోలీసు అధికారి నాయకత్వంలో పోలీసు బృందాన్ని ఏర్పరిచి హత్యను విచారిస్తున్నామని డి.జి.పి ఆనంద్ ప్రకటించాడు. కేసును పరిష్కరించేవారకూ అర్రాలోనే బృందం బస చేస్తుందని తెలిపాడు. నిందితులను పట్టుకోవడం ద్వారా ఉద్రిక్తలను తగ్గిస్తామని ప్రకటించాడు. ఇతర అన్నీ కేసుల్లాగానే ముఖియా హత్య కూడా దర్యాప్తు జరుపుతామని నితీశ్ ప్రకటించాడు. ముఖియా హత్య ‘రాజకీయ హత్య’ లా కనిపిస్తోందని నితీశ్ పార్టీ జనతాదళ్ (యునైటెడ్) ప్రకటించింది. దర్యాప్తు జరిపి నిందితులను శిక్షిస్తామని ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోడి ప్రకటించాడు. శాంతంగా ఉండాలని ప్రజలను కోరాడు. మాజీ ముఖ్యమంత్రి లాలూ యాదవ్ సి.బి.ఐ విచారణ కోరాడు.

1990 లలో బీహార్ వ్యాపితంగా జరిగిన అనేక ‘దళిత హత్యాకాండ’ లకు బాధ్యురాలైన ‘రణవీర్ సేన’ కు బ్రహ్మేశ్వర్ ముఖియా నాయకత్వం వహించాడు. దళిత స్త్రీలనూ, పిల్లలను అత్యంత పాశవికంగా హత్య చేయడాన్ని బహిరంగంగా సమర్ధించుకున్న మృగ సమానుడు బ్రహ్మేశ్వర్ ముఖియా. దళిత తల్లులే నక్సలైట్లకు జన్మనిస్తారనీ, దళిత పిల్లలే భావి నక్సలైట్లుగా అవతరిస్తారనీ ముఖియా దురహంకారంతో సమర్ధించుకున్నాడు. తమను తాము రక్షించుకోలేని స్త్రీలు పిల్లల హత్యలను ముఖియా వీరోచిత కార్యంగా అమలు చేశాడు.

ముఖియా సంవత్సరాల తరబడి జైలులో ఉన్నప్పటికే అనేక యేళ్ళ పాటు కనీస చార్జి షీటు కూడా ఆయనపైన దాఖలు కాలేదు. జైలులో Butcher-of-Biharఉన్నప్పటికీ ముఖియాకి సమన్లు ఇవ్వడానికి విఫలమైన పోలీసులు ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియదని కోర్టులో చెప్పి భారత దేశ న్యాయ, రక్షణ వ్యవస్ధలని తీవ్రంగా అపహాస్యం చేశారు. అగ్రకుల దురహంకారులు సాగించిన హత్యాకాండలలో బలయిన దళితులకు భారత దేశంలో న్యాయం దక్కడం దుర్లభమేనని 58 మంది దళిత స్త్రీలు పిల్లలు అత్యంత పాశవికంగా హత్యకు గురయిన బటానీ తోలా హత్యాకాండలో శిక్ష పడిన దోషులందరినీ నిర్దోషులుగా వదిలేయడం ద్వారా బీహార్ హైకోర్టు గత సంవత్సరం చాటి చెప్పింది. కింది కోర్టు అనేకమందికి ఉరి శిక్షలు, యావజ్జీవ శిక్షలు వేసినప్పటికీ శిక్షలన్నింటినీ హై కోర్టు రద్దు చేసి వదిలిపెట్టింది.

1996 లో భోజ్ పూర్ గ్రామంలో 21 మందిని హత్య చేసినందుకు 2002 లో ముఖియా పాట్నాలో అరెస్టయ్యాడు. 9 సంవత్సరాలు జైలులో గడిపాడు. ఈ కాలంలో ముఖియా ఆచూకీ తమకు దొరకలేదనీ, అందుకే కోర్టు విచారణ కోసం సమన్లు ఇవ్వలేకపోయామనీ పోలీసు అధికారులు కోర్టుల్లో చెప్పారు. హత్యా నేరాలకు శిక్ష అనుభవించాల్సిన ముఖియా జైలులో ఆ విధంగా రక్షణ పొందాడు. ఒక దళిత హంతక అగ్రకుల భూస్వామ్య సాయుధ దురహంకారిని కోర్టు సమన్ల నుండీ, కోర్టు విచారణ నుండీ, పోలీసుల చార్జి షీట్ల నుండీ జైళ్ళు రక్షణ అందించాయి. చివరికి ప్రాణ భయం లేదనుకున్నాక మాత్రమే ముఖియాపై చార్జి షీటు దాఖలు చేయడం, అపహాస్యపూరితమైన విచారణ జరపడం, నిర్దోషిగా విడిచి పెట్టడం సాధ్యమయిందని ముఖియా విడుదల సందర్భంగా కొన్ని పత్రికలు వ్యాఖ్యానించాయి.

పాశ్చాత్య దేశాలలో బ్రహ్మాండమైన ప్రజాస్వామ్యం ఉందనీ, వ్యక్తి స్వేచ్ఛ పరిఢవిల్లుతోందనీ గొప్పలు పోయే బుద్ధి జీవులు భారత దేశంలో అశేష గ్రామీణ శ్రామిక జనం పాలిట మృత్యు పీఠంగా వ్యవహరిస్తున్న అగ్రకుల దురహంకార భూస్వామ్య వ్యవస్ధను ఖండించి దునుమాడడంలో ఎలాంటి ఆసక్తీ ప్రదర్శించరు. పెట్టుబడిదారీ వ్యవస్ధ తెచ్చి పెట్టిన సార్వజనీన ఆస్తి హక్కు గానీ, ప్రజాస్వామిక స్వేచ్ఛ గానీ భారత దేశంలోని కోట్లాది దళితులకు, వెనక బడిన కులాలకు ఎందుకు మృగ్యమైందో ఆలోచించలేని ఉదాసీనతతో వారు వ్యవహరిస్తున్నారు. సహస్రాబ్దాల భూస్వామ్య అణచివేతల నుండి పుట్టిన నక్సలైట్ల హింసను ఖండించడంలో మేధోత్సాహం కనబరిచే వీరికి నానాటికీ కునారిల్లుతున్న దళితుల జీవన ప్రమాణాలు పట్టవు. భారత దేశ ప్రవేటు, ప్రభుత్వ ఆఫీసు కార్యాలయాల నుండి అత్యున్నత అధికార కేంద్రాలయిన పార్లమెంటు, బ్యూరోక్రసీ వరకూ విస్తరించి భారత దేశ సామాజిక అభివృద్ధికి మోకాలడ్డుతున్న భూస్వామ్య వ్యవస్ధ చీడ పురుగులను అంతం చేసే ఆలోచనలు వీరి వద్ద ఉండవు.

దేవతలు దేవుళ్ళలో అగ్రకుల ప్రతీకలను వెతికి సంతోషపరులయ్యే ఈ మేతావులు, గ్లోబలైషన్ లో రాలిన ఎంగిలి మెతుకుల వర్షంలో మునిగి పరవశించడమే తప్ప ప్రాక్పశ్చిమాల దాకా వ్యాపించిన అత్యున్నత శాస్త్ర, సాంకేతిక వ్యవస్ధలు భారత దేశ అశేష శ్రామిక జనానికి ఎందుకు చేరలేదో విశ్లేషించగల ‘కలత హృదయాలను’ డాలర్ల మంచులో ఘనీభవింపజేసుకున్నారు. శ్రామిక జన సామాన్యం నుండి నాలుగు మెట్లు ఎదిగి ఎగువ మధ్య తరగతిగా ప్రమోట్ అవడంతోనే దోపిడీ వ్యవస్ధల అధిపతులకు సమర్ధకులుగా మారి తాము పుట్టి పెరిగిన శ్రామిక వ్యవస్ధకు పచ్చి విద్రోహులుగా వీరు మారిపోయారు. ఫలితంగా అశేష శ్రామిక జనానికి దోపిడీ అణచివేతల నుండి విముక్తి మార్గాన్ని చూపించవలసిన వీరు ఆధిపత్య వ్యవస్ధల ఎంగిలి కాసులు భోంచేస్తూ వెకిలి విశ్లేషణలకు సిద్ధపడుతున్నారు. అందువల్లనే ఈనాడు ముఖియా లాంటి సామాజిక విధ్వంసకులు, అభివృద్ధి నిరోధక చీడ పురుగులు సమస్త రక్షణ, రాజకీయ వ్యవస్ధల్లోకి జొరబడి సామాన్య జనానికి న్యాయం అందకుండా నిరోధిస్తున్నారు. ఫలితంగానే బ్రహ్మేశ్వర్ ముఖియా లాంటి హంతకులకు వారు ఎన్నుకున్న పద్ధతుల్లోనే ముగింపు ఎదురవుతోంది.

2 thoughts on “దళిత రక్తం రుచిమరిగిన అగ్ర కుల దురహంకారి ‘బ్రహ్మేశ్వర్ ముఖియా’ హత్య

  1. today , dalits are also surpressing the fellow dalits , some times even the forward caste people , dont take the sterio type slogans that DALITS ARE HERASSED , even they are herassing the others with S.C , S.T attracity acts

  2. Don’t take shelter in others harrassment. One harrassment can’t nullify the other one. Also, misuse of attrocity act can’t be harrassment. Rampant and systemic harrasment can’t take shelter under the pretence of ‘misuse’. There are plenty of powers preventing implementation of attrocities’ act.

    Try to understnad the caste problem in terms of contradiction between ‘ownership of vast swaths of land’ and ‘not owning single iota of land.’

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s