బ్రిటిషర్లకు పిల్లల్ని కని పెడుతున్న భారత తల్లులు


surrogate_mothersగర్భాన్ని అద్దెకు ఇచ్చే పరిశ్రమకు ఇండియా కేంద్రంగా మారుతున్నట్లు ‘ది సండే టెలిగ్రాఫ్’ పత్రిక వెల్లడించింది. భారత దేశంలో ఇపుడు 1000 కి పైగా క్లినిక్ లు బ్రిటిషర్లు తల్లిదండ్రులు కావడానికి సహాయం చేయడంలో స్పెషలైజేషన్ సాధించినట్లు సదరు పత్రిక కధనం వెల్లడించింది. 1.5 బిలియన్ పౌండ్ల కు (దాదాపు 13,000 కోట్ల రూపాయలకు సమానం) ఈ వ్యాపారం అభివృద్ధి చెందిందని వెల్లడించింది.

ఒక్కో జంట లేదా వ్యక్తి ఒక్కో బిడ్డకు సగటున 25,000 పౌండ్లు చెల్లిస్తున్నారని పత్రిక తెలియజేసింది. బ్రిటన్ లో వ్యాపార ప్రాతిపదికన గర్భం ధరించడం నిషేధం కావడంతో వారు భారత తల్లులపై ఆధారపడుతున్నారు. గర్భాన్ని అద్దెకు తీసుకోవడం ద్వారా తల్లిదండ్రులు కావాలనుకుంటున్నవారు మరే దేశం కంటే కూడా బ్రిటన్ లో అత్యధికంగా ఉన్నారని ‘ది సండే టెలిగ్రాఫ్’ తెలిపింది.

గత ఒక్క సంవత్సరంలోనే బ్రిటిషర్ తల్లిదండ్రుల కోసం 1000 జననాలు భారత దేశంలో జరిగాయి. ఇలాంటి జననాలు అదే సంవత్సరంలో బ్రిటన్ లో కేవలం 100 మాత్రమే జరిగాయని పత్రిక పరిశోధనలో తేలింది. గత సంవత్సరం సరోగేట్ జననాలు భారత దేశంలో మొత్తం 2,000 జరిగాయని కూడా పత్రిక తెలిపింది. అండం దానం చేసినందుకూ, తమది కానీ గర్భం ధరించినందుకూ భారత మమహిళకు 6,000 పౌండ్లు (రు. 5.2 లక్షలు) చెల్లిస్తున్నట్లు తమ పరిశోధనలో తేలిందని పత్రిక వెల్లడించింది.

గర్భం వల్లా, పిల్లలు పుట్టేటప్పుడూ వచ్చే కష్టాలని తప్పించుకోవడం కోసం బ్రిటిష్ మహిళలు గర్భాదానం చేసేవారి పై ఆధారపడుతున్నారని టెలిగ్రాఫ్ తెలిపింది. వీరి వల్ల గర్భాన్ని అద్దెకు ఇచ్చే సంస్కృతి పెరిగిపోతున్నట్లు బ్రిటిష్ డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేశారని తెలిపింది.

గర్భాన్ని అద్దెకు ఇచ్చే పరిశ్రమ సంవత్సరానికి 1.5 బిలియన్ పౌండ్ల విలువ గలదిగా వృద్ధి చెందిందని భారత అధికారులు లెక్క కట్టారు. ఇది మరింత వేగంగా అభివృద్ధి చెందుతున్నదని భావిస్తున్న అధికారులు దీనిని నియంత్రించే ఆలోచనలో ఉన్నారనీ పత్రిక తెలిపింది.

బ్రిటిష్ డాక్టర్ల ప్రకారం బ్యాంకర్లు, సీనియర్ సివిల్ సర్వెంట్లు, బహుళజాతి సంస్ధలలో పని చేసే ఎక్జిక్యూటివ్ అధికారులు చివరికి ఎన్.హెచ్.ఎస్ అధికారులు కూడా ఇండియాలో సరోగసి ద్వారా తల్లిదండ్రులు అవుతున్నారు.

ఫెర్టిలిటీ క్లినిక్ లను నియంత్రించడానికి భారత ప్రభుత్వం ఒక అధ్యయన కమిటీని నియమించింది. దానికి డా.రాధే శర్మ నాయకత్వం వహిస్తున్నాడని టెలిగ్రాఫ్ తెలిపింది. శర్మ ప్రకారం ఇండియాలో ఎన్ని ‘బేబీ ఫ్యాక్టరీలు’ ఉన్నాయో ఎవరికీ ఖచ్చితంగా తెలియదు. తన వద్ద 600 ఐ.వి.ఎఫ్ క్లినిక్ ల జాబితా ఉన్నదనీ మరో 400 క్లినిక్ లు తన దృష్టికి రాకుండా ఉండవచ్చనీ శర్మ తెలిపాడు. ఒక్క హైద్రాబాద్ లోనే 250 క్లినిక్ లు ఉన్నట్లు ఒక పత్రికను ఆయన ఉటంకించాడు. వాటిలో 11 మంది మాత్రమే రిజిస్టర్ చేసుకున్నాయని వెల్లడించాడు.

ఢిల్లీలో సరోగసీ సేవలు అందించే చట్ట విరుద్ధ క్లినిక్ ల ప్రకారం గే జంటలు సరోగసీ ద్వారా బిడ్డలు సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వారేలాగూ బిడ్డలు కనలేరు గనక సరోగసీ ద్వారా కుటుంబం నిర్మించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని క్లినిక్ లు తెలిపాయి. బ్రిటన్ తో పాటు ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్ లాంటి దేశాల వారు కూడా భారత బిడ్డల కోసం భారత సరోగసీ పై ఆధారపడుతున్నారు.

సంపాదన పట్ల, అందం పట్ల ఉన్న మక్కువ, ప్రకృతి సిద్ధమైన గర్భం పట్ల విముఖత, ప్రకృతి విరుద్ధమైన విశృంఖల లైంగిక, సామాజిక సంబంధాలు భారత స్త్రీలకు సంపాదన మార్గంగా మారడం గర్హనీయం. కంపెనీల విశృంఖల దోపిడి నుండి ప్రజల దృష్టి మరల్చడానికి విశృంఖల సెక్స్ ఉద్యమం పశ్చిమ దేశాల ప్రభుత్వాలకు అక్కరకు రావడంతో దాని నియంత్రణ కంటే ప్రోత్సాహానికే అవి మొగ్గు చూపుతున్నాయి. అది చివరికి భారత దేశంలో గర్భాదాన పరిశ్రమ అభివృద్ధికి దారి తీయడం సామాజిక విచ్ఛేదన దేశాల ఎల్లలు దాటుతున్న పరిస్ధితికి అద్దం పడుతోంది.

2 thoughts on “బ్రిటిషర్లకు పిల్లల్ని కని పెడుతున్న భారత తల్లులు

  1. “మానవ సమాజం” పుస్తకంలో రంగనాయకమ్మ గారు దీని గురించి ఒక వ్యాసం వ్రాసారు. ఈ రకం దానాన్ని దానం అని అనలేము. పిల్లలు పుట్టకపోతే అనాధ పిల్లలని పెంచుకోవాలి కానీ ఈ రకంగా దానాన్ని ప్రోత్సహించకూడదు.

  2. ప్రేమ, మాననసిక స్ధితిగతులు కాలానుగుణంగా మారతాయనడానికి ఇది ఒక ఉదాహరణ. ప్రకృతిలో ప్రతి జీవి తమ బిడ్డలపైన మమకారాన్ని, ప్రేమను, కలిగి వుంటుంది. అది ప్రకృతి ధర్మం. కాని మనుషులు ఆ ప్రకృతి ధర్మాన్ని కూడా ఎప్పుడో దాటిపోయారు. ఆర్ధిక స్ధితిగతులే ప్రేమను గాని మమకారాన్ని గానీ నిర్ణయిస్తున్నాయి.

    అద్దె పేరుతొ తమ శరీరాన్నీ, గర్భాన్నీ, బిడ్డనూ ఇచ్చి తనకూ ఆ బిడ్డకూ ఎమీ సంభంధం లేనట్టు వెళ్ళిపోతుంది. ఇక్కడ ప్రకృతి ధర్మం ఎక్కడ పనిచేసినట్టు?

    పెట్టుబడిదారీ సమాజంలో కొన్ని సార్లు విలువ సూత్రం పని చేయదు. బిడ్డలను కనడం ప్రకృతి ధర్మం, అది శ్రమ కిందకు రాదు. కాని దానికీ ఇక్కడ విలువ లెక్కలు వున్నాయి. అలాగే పరువుకు కుడా విలువకట్టేరు. పెట్టుబడిదారీ సమాజంలో దానికీ, దీనికీ అనే తేడా లేదు, ఇక్కడ అన్నిటికీ విలువ వుంది.

    (ఈ వ్యాఖ్యలో కొన్ని టైపింగ్ తప్పుల్ని సవరించి ప్రచురిస్తున్నాను -విశేఖర్)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s