లిధుయేనియా, గ్రీసు, ఇటలీ లలో ఫుకుషిమా రేడియేషన్


Damaged Fukushima reactors 3, 4

జపాన్ లో మార్చి 11 తేదీన ఫుకుషిమా అణు కర్మాగారంలో ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం వల్ల మూడు రియాక్టార్లలో ‘మెల్ట్ డౌన్’ జరిగి ఇంధన రాడ్లు పూర్తిగా కరిగిపోగా, మరొక రియాక్టర్ లో పాక్షికంగా ‘మెల్ట్ డౌన్’ జరిగింది. దీనివల్ల రేడియేషన్ వాతావరణంలోకి ప్రవేశించింది. రేడియేషన్ వల్ల కలుషితమైన నీటిని పెద్ద ఎత్తున సముద్రంలో కలపడంతో సముద్ర నీరు కూడా కలుషితం అయింది. గాలిలోకి ప్రవేశించిన రేడియో ధార్మిక పదార్ధాలు, ముఖ్యంగా అయోడిన్, సీసియం లకు చెందిన ఐసోటోప్ లు అమెరికా, యూరప్ లకు కూడా వ్యాపించాయి.

కాలిఫోర్నియా లో పశువులు రేడియో ధార్మిక పదార్ధాలు చేరిన గడ్డి తినడంతో అది పాల ఉత్పత్తులను కూడా కలుషితం చేసిన సంగతిని ఇంతకుముందు ఒక ఆర్టికల్ లో వివరించడం జరిగింది. ఫుకుషిమా రేడియేషన్ అమెరికాకే కాక యూరప్ కి కూడా వ్యాపించిన సంగతిని పరిశోధనలు వెల్లడి చేశాయి.

పబ్ మెడ్ అని ‘డేటా బేస్’ తో కూడిన ఒక వెబ్ సైట్ ఉంది. దీనిని అమెరికాకి చెందిన ‘యునైటెడ్ స్టేట్స్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ (ఎన్.ఎల్.ఎం), ‘నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్’ (ఎన్.ఐ.హెచ్) నిర్వహిస్తున్నాయి. లైఫ్ సైన్సెస్ కీ, బయోమెడికల్ అంశాలకీ సంబంధించిన డేటా బేస్ ను ఈ సైట్ నిర్వహిస్తోంది. లిధుయేనియా, గ్రీసు, ఇటలీ లలో ఫుకుషిమా రేడియేషన్ కనుగొన్న పరిశోధనా నివేదికలను ఇది ప్రచురించింది.

లిధుయేనియా:

మార్చి, ఏప్రిల్ (2011) నెలల్లో గాలి నుండి సేకరించిన శాంపిల్స్ లో ఫుకుషిమా రేడియేషన్ ని కనుగొన్న నివేదికని పబ్ మేడ్ ప్రచురించింది. నివేదిక abstract లో ఉన్న అంశాల ప్రకారం విల్నియస్ (లిధుయేనియా రాజధాని) లో ఈ శాంపిళ్ళు సేకరించారు. వీటిలో I-131, Cs-137 ఐసోటోపులను కనుగొన్నారు. వీటి పరిమాణం: I-131 పరిమాణం 12 మైక్రో బిక్యూరల్స్/m3 నుండి 3700 మైక్రో బిక్యూరల్స్/m3 (లేదా 3.7 మిల్లీ బిక్యూరల్స్) వరకూ రికార్డు కాగా, Cs-137 పరిమాణం 1.4 మైక్రో బిక్యూరల్స్/m3 నుండి 1040 మైక్రో బిక్యూరల్స్/m3 వరకూ రికార్డు అయింది.

విల్నియస్ లో ప్లూటోనియమ్ ఐసోటోపులు కూడా కనుగొన్నట్లు తెలుస్తోంది. 23 మార్చి నుండి 15 ఏప్రిల్ వరకూ సేకరించిన ఒక శాంపిల్ లో ఈ రేడియేషన్ కనుగొన్నారు. దీని పరిమాణం చాలా తక్కువ. అది 44.5 నానో బిక్యూరల్స్ మాత్రమే. సదరు నివేదిక ఇలా పేర్కొంది.

The two maxima found in radionuclide concentrations were related to complicated long-range air mass transport from Japan across the Pacific, the North America and the Atlantic Ocean to Central Europe as indicated by modelling.

దీని ద్వారా ఫుకుషిమా రేడియేషన్, పసిఫిక్ మీదుగా ఉత్తర అమెరికా వరకూ ప్రయాణించింది. అంతే కాకుండా ఈ రేడియేషన్ అట్లాంటిక్ సముద్రం దాటి మధ్య యూరప్ వరకూ కూడా ప్రయాణించింది. అయితే ఇవేవీ హానికరం కాదు. ఒక చోట అణు ప్రమాదం జరిగితే దాని ప్రభావం సగం కంటే ఎక్కువే ప్రపంచాన్ని చుట్టేస్తుందని ఇది తెలియజేస్తోంది. నివేదిక abstract ఇంకా ఇలా అంటోంది.

Fukushima data were compared with the data obtained during the Chernobyl accident and in the post Chernobyl period. The activity concentrations of (131)I and (137)Cs were found to be by 4 orders of magnitude lower as compared to the Chernobyl accident. The activity ratio of (134)Cs/(137)Cs was around 1 with small variations only. The activity ratio of (238)Pu/(239,240)Pu in the aerosol sample was 1.2, indicating a presence of the spent fuel of different origin than that of the Chernobyl accident.

దీని ప్రకారం ఫుకుషిమా ప్రమాదం వల్ల లిధుయేనియాకి చేరిన రేడియేషన్, 1986 లో జరిగిన చెర్నోబిల్ (ఉక్రెయిన్) ప్రమాదం వల్ల చేరిన రేడియేషన్ కంటే నాలుగు రేట్లు తక్కువగా ఉంది. ఈ సమాచారం ద్వారా మనకు మరో సంగతి అర్ధం అవుతోంది. అదేమంటే, చెర్నోబిల్ ప్రమాదం వల్ల కూడా రేడియేషన్ లిధూయేనియా చేరిందని. అదే గాక ఫుకుషిమా రేడియేషన్ కంటే చెర్నోబెల్ రేడియేషనే నాలుగు రెట్లు అధికంగా ఉండని కూడా అర్ధం అవుతోంది.

“చెర్నోబిల్ ప్రమాదం జరిగినప్పుడే పక్కనే ఉన్న లిధుయేనియాకి రేడియేషన్ చేరకపోతే వేలమైళ్ళ దూరాన ఉన్న ఫుకుషిమా రేడియేషన్ అక్కడికి ఎలా చేరిందబ్బా” అంటూ ఆశ్చర్యపోయిన ఎకాలజిస్టు అచంగ గారి ఆశ్చర్యం అంతరార్ధం ఏమిటి?

ఫుకుషిమా రేడియేషన్ ఫిన్లాండ్ అడవుల్లోని నాచు (ఫంగై)లో కనుగొన్నట్లు అక్కడి టి.వి చానెల్ ప్రకటిస్తే దానిని ఆధార రహితంగా కొట్టిపారేయడం అర్ధరహితం. ప్రభుత్వాలు కంపెనీలు చెప్పేవే ఆధార సహితాలనీ, మిగిలినవన్నీ ఆధార రహితాలేననీ పొరబాటు పడడం వల్ల ఇలా అకారణంగా ఆశ్చర్య పడవలసి వచ్చింది. లిధుయేనియా లో ఫుకుషిమా రేడియేషన్ కనుగొన్న పరిశోధనలు ఇవే కాక ఇంకా ఉన్నాయి. వాటిలో కొన్ని పబ్ మెడ్ కూడా ప్రచురించింది. పై నివేదిక ఇక్కడ చూడవచ్చు.

లిధుయేనియా లో ఫుకుషిమా రేడియేషన్ కనుగొన్న నివేదికను ఇంకా చాలా వెబ్ సైట్లు ప్రచురించాయి. హేపీ స్మైల్ వెబ్ సైట్ ఈ నివేదిక పూర్తి పాఠాన్ని పి.డి.ఎఫ్ డాక్యుమెంటు రూపంలో అందించింది. ఇందులో సవివిరమైన విశ్లేషణ ఉంది. కాకపోతే అందరికీ అర్ధం కాదు (నాక్కూడా). డాక్యుమెంటులో చివర ఉన్న ముగింపు భాగాన్ని స్క్రీన్ షాట్ తీసి కింద ఉంచాను. పి.డి.ఎఫ్ డాక్యుమెంటు పూర్తి భాగం పై ఎవరికైనా ఆసక్తి ఉన్నట్లయితే ఇక్కడ చూడవచ్చు.

గ్రీసు:

ఫుకుషిమా రేడియేషన్ గాలి ద్వారా ఉత్తరార్ధ గోళంలో చాలా దేశాలకు వ్యాపించింది. మార్చి 24 నుండి ఏప్రిల్ 28 వరకు సేకరించిన శాంపిళ్లలో ఫుకుషిమా రేడియేషన్ కనుగొన్నట్లు ఏథెన్స్ కి చెందిన ‘ఎన్విరాన్ మెంటల్ లేబొరేటరీ’ నివేదిక రూపొందించగా దానిని పబ్ మెడ్ ప్రచురించింది. ఈ లేబొరేటరీ ‘ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ టెక్నాలజీ-రేడియేషన్ ప్రొటెక్షన్’ కి చెందినది. ఇక్కడ కూడా రేడియేషన్ ని స్వల్ప పరిమాణంలోనే కనుగొన్నారు.

గ్రీసులో రేడియో ధార్మిక పధార్ధాలయిన I-131, Cs-137, Cs-134 ఐసోటోపు లను కనుగొన్నారు. ఏప్రిల్ 6, 2011 తేదీన అధిక పరిణామంలో వీటిని కనుగొన్నారు. I-131 ఐసోటోపులని 490+/-40 మైక్ర్లో బిక్యూరల్స్/m3 , Cs-137 పరిమాణం 180+/-40 మైక్రో బిక్యూరల్స్/m3 మేరకు, Cs-134 పరిమాణం 160+/-30 మైక్రో బిక్యూరల్స్/m3 మేరకు కనుగొన్నారు. గడ్డి, మట్టి, గొర్రె పాలు, మాంసం లలో కూడా రేడియేషన్ కనుగొన్నామని ఈ నివేదిక తెలిపింది. అయితే ఏప్రిల్ 28 తర్వాత రేడియేషన్ కనుక్కోలేదని నివేదిక తెలిపింది. ఈ రేడియో ధార్మిక పదార్ధాలు మూడూ సహజంగా ప్రకృతిలో ఉండేవి కావు. న్యూక్లియర్ ఫిషన్ వల్లనే ఉత్పత్తి అవుతాయి. అంటే ఇలా అణు ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే రేడియేషన్ వాతావరణంలోకి ప్రవేశిస్తాయి. ప్రకృతి సహజంగా జరిగే రేడియో ధార్మికతతో పోలిస్తే గ్రీసుకి చేరిని ఫుకుషిమా రేడియో ధార్మికత పరిగణించదగినదేమీ కాదనీ నివేదిక ప్రస్తావించింది. అయితే ఫుకుషిమా రేడియేషన్ అమెరికా, యూరఫ్ ల వరకూ వ్యాపించడమే ఇక్కడి చర్చాంశం. గ్రీసు నివేదికను ఇక్కడ చూడవచ్చు.

ఇటలీ

అరిస్టోటిల్ యూనివర్సిటీ ఆఫ్ థెస్సాలోనికి, మిలాన్ యూనివర్సిటీ లు సంయుక్తంగా ఈ నివేదిక ఇచ్చినట్లు పబ్ మెడ్ లో ప్రచురితమైన నివేదిక బట్టి తెలుస్తోంది. నివేదిక ఇలా తెలిపింది.

The radionuclides (131)I, (137)Cs and (134)Cs were observed in the Milano region (45°) of Italy early after the nuclear accident in Fukushima, Japan. Increased atmospheric radioactivity was observed on an air filter taken on 30 March 2011, while the maximum activity of 467 μBq m(-3) for (131)I was recorded at April 3-4, 2011. The first evidence of Fukushima fallout was confirmed with (131)I and (137)Cs measured in precipitation at two sampling sites at Milano on 28 March, 2011, with the concentrations of (131)I and (137)Cs in the rainwater equal to 0.89 Bq L(-1) and 0.12 Bq L(-1), respectively.

ఈ రేడియేషన్ చాలా తక్కువనీ, ప్రమాదకరం కాదని నివేదిక తెలిపింది. నివేదికను ఇక్కడ చూడవచ్చు.

4 thoughts on “లిధుయేనియా, గ్రీసు, ఇటలీ లలో ఫుకుషిమా రేడియేషన్

  1. ఎక్కడో అమెరికా, ఇటలీ లకు వ్యాపించిన రేడియేషన్ మన ఇండియాలో కనిపించలేదా? ఇండియా, చైనా, పాకిస్తాన్ లాంటి సమీప దేశాలలో రేడియేషన్ తాలూకూ చిహ్నాలు లేవా? లేక ఇది గాలివాటు లాంటి అంశాల మీద ఆధారపడుతుందా?

  2. మీ వ్యాఖ్య స్పాం లో ఉంది. ఇప్పుడే చూసాను.

    అదే మరి. ఇటెందుకు రాలేదో ఎక్కడా చదవలేదు. ప్రయత్నించినా దొరకలేదు. మీరూ ఓ సారి ప్రయత్నించండి.

  3. విశేఖర్ గారు, గతంలో అదే కంప్యూటర్ నుంచి వచ్చిన వ్యాఖ్యని స్పామ్ మార్క్ చేసినా తరువాత వచ్చే వ్యాఖ్యలన్నీ స్పామ్ బాక్స్‌లోకి వెళ్ళిపోతాయి. వర్డ్‌ప్రెస్‌లో ఈ సెట్టింగ్ ఉంది. గతంలో నేను ఉపయోగించినది వర్డ్‌ప్రెసే కనుక నేను ఈ విషయం చెప్పగలను.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s