హుబ్లి-బెంగుళూరు హంపి ఎక్స్ ప్రెస్ పెనుగొండ వద్ద ప్రమాదానికి గురయింది. ఆగి ఉన్న గూడ్స్ రైలు ఢీకొని మంటల్లో చిక్కుకోవడంతో 13 మంది మంటల్లో చిక్కుకుని చనిపోగా మిగిలినవారు గాయాలతో చనిపోయారని ‘ది హిందూ’ తెలిపింది. 3 గంటలకి ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వేగంగా ఢీకొట్టడం వల్ల ఇంజను వెనక ఉన్న బోగీకి నిప్పు అంటుకుని ఆ తర్వాత మూడు బోగీలు పట్టాలు తప్పాయి.
ప్రమాదం జరిగిన నిమిషాల్లోనే పెనుగొండ డి.ఎస్.పి కి కబురు అందిందనీ వెంటనే ఆయన సిబ్బందితో చేరుకున్నా అప్పటికే జరగాల్సింది జరిగిందని తెలుస్తోంది. చనిపోయినవారిలో ఎక్కువమంది మొదటి రెండు బోగీల్లో ఉన్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరగచ్చని తెలుస్తోంది. షాక్ నుండి తేరుకునే లోపు మంటలు చుట్టుముట్టడంతో తప్పించుకోలేకపోయారని పత్రిక తెలిపింది. ప్రమాదం గురించి తెలిసిన మంత్రులు, ఎం.పి లు, ఎమ్మేల్యేలు ప్రమాద స్ధలికి చేరుకున్నారు.
సిగ్నల్ సిబ్బంది, డ్రైవర్ ల వల్ల జరిగిన తప్పుల వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చని సౌత్ వెస్ట్రన్ డివిజన్ రైల్వే మేనేజర్ మణి చెప్పాడని ‘ది హిందూ’ తెలిపింది. సిగ్నల్ ని చూడకుండా డ్రైవర్ ముందుకొచ్చాడని కూడా చెబుతున్నారు. మృతులకు 5 లక్షలు, తీవ్ర గాయాలయినవారికి 1 లక్ష, కొద్ది గాయాలయినవారికి 25,000 నష్టపరిహారాన్ని రైల్వే మంత్రి ముకుల్ రాయ్ ప్రకటించాడు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ప్రమాద స్ధలిని సందర్శించాడు.
కింది ఫోటోలను ‘ది హిందూ’ పత్రిక అందించింది.