అమెరికాలో ఇతరులకంటే తగ్గిన తెల్లవారి జననాలు


Racial and ethnic minorities make up more than half the children born in the USఅమెరికా జననాలలో జాతి పరంగా చూస్తే తెల్లవారి జననాల సంఖ్య మైనారిటీలో పడిపోయింది. జులై 2011 తో ముగిసిన సంవత్సరంలో తెల్లజాతి ప్రజల్లో జననాల సంఖ్య మొత్తం జననాల్లో 49.6 శాతం నమోదయినట్లు బి.బి.సి తెలిపింది. నల్లజాతి ప్రజలు, హిస్పానిక్ లు, ఆసియా ప్రజలతో పాటు సమ్మిళిత జాతులలో జననాల సంఖ్య 50.4 శాతంగా నమోదయింది. హిస్పానికేతర తెల్లజాతి ప్రజలు మొదటి సారిగా జననాల్లో మైనారిటీలో ఉన్నారని బి.బి.సి తెలిపింది. తెల్లవారిలో జననాల సంఖ్య తగ్గిపోవడానికి ఆర్ధిక వ్యవస్ధలో నెలకొన్న తీవ్ర సమస్యలే కారణమని సోషలిస్టులు అభిప్రాయ పడినట్లు కూడా ఆ సంస్ధ తెలిపింది.

ఆగస్టు 2010 నుండి  జులై 2011 వరకూ మైనారిటీ ప్రజల్లో జననాలు 2.02 మిలియన్లని అమెరికా సెన్సస్ బ్యూరో తెలియజేసింది. వీరి వాటా మొత్తం జననంలో 50.4 శాతం కాగా 1990 లో 37 శాతం మాత్రమే. మొత్తంగా చూస్తే అమెరికాలో జననాల సంఖ్య తగ్గుతున్నప్పటికీ ఈ తగ్గుదల తెల్లవారిలో అధికంగా ఉందని సెన్సస్ బ్యూరో తెలిపింది. 2008 నుండి తెల్ల జాతి ప్రజల్లో జననాల సంఖ్య 11.4 శాతం పడిపోగా ఆ సంఖ్య మైనారిటీ జాతుల్లో 3.2 శాతం మాత్రమేనని న్యూ హామ్ షైర్ యూనివర్సిటీ లో సోషియాలజిస్టు కెన్నెత్ జాన్సన్ ని ఉటంకిస్తూ బి.బి.సి తెలిపింది.

“ఇది ముఖ్యమైన లాండ్ మార్క్. తమ పెద్దవారి కంటే మరింత వైవిధ్యపూరిత భిన్నత్వంలో ఇప్పటి తరం పెరగనుంది” అని హోవర్డ్ యూనివర్సిటీ కి చెందిన సోషియాలజిస్టు రోడరిక్ హేరిసన్ వ్యాఖ్యానించినట్లు అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. మొత్తం అమెరికా జనాభాలో మైనారిటీ ప్రజల జనాభా 36.6 శాతం గా ప్రస్తుతం ఉంది. అయితే హిస్పానిక్ ల జనాభా పెరుగుదల ఉచ్ఛ స్ధాయికి చేరుకుందనీ, ఇక ముందు వారి సంఖ్య తగ్గుతుందనీ మరికొందరు జనాభా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

లాటినో ప్రజల జనాభాలో ఎక్కువ మంది యువకులేననీ కనుక మునుముందు వారి సంఖ్య పెరగవచ్చనీ పాపులేషన్స్ బ్యూరో ప్రతినిధి మార్క్ మాదర్ తెలిపాడు. అయితే లాటినో ప్రజల్లో జననాల రేటు తగ్గిపోతున్నదనీ, దానితో పాటు వలసలు కూడా తగ్గుతున్న పరిస్ధితిని పరిగణిస్తే దేశంలో మరింత మార్పుకు దోహదం చేయవచ్చనీ మాదర్ తెలిపాడు.

తెల్లవారి జననాలు మైనారిటీ లో పడవచ్చునని చాలా కాలంగా అనుకుంటున్నదేనని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. మరి కొద్ది కాలం వరకూ తెల్లవారే మెజారిటీ గా కొనసాగినప్పటికీ మైనార్టీ పిల్లలు ఎక్కువగా ఉన్నందున భవిష్యత్తులో దేశ ఆర్ధిక వ్యవస్ధపై విస్తృత ప్రభావం పడనున్నదని ఆ పత్రిక అభిప్రాయపడింది. డిస్ట్రిక్ట్ కొలంబియా తో పాటు మరో నాలుగు రాష్ట్రాలలోనూ, న్యూయార్క్స్, లాస్ వేగాస్, మెంఫిస్ లాంటి మెట్రో నగరాల్లోనూ తెల్లవారు మైనారిటీ జనాభాగా ఉన్నారనీ ‘బ్రూకింగ్స్ ఇనిస్టిట్యూషన్’ లో సీనియర్ జనాభా శాస్త్రవేత్త విలియం ఫ్రే చెప్పాడని టైమ్స్ తెలిపింది. యువకుల సంఖ్య వైవిధ్యంగా ఉంటే ఆ వైవిధ్యం మరికొన్ని తరాల పాటు కొనసాగుతుందని ఫ్రే అభిప్రాయంగా టైమ్స్ తెలిపింది.

మైనారిటీ ప్రజల్లో హిస్పానిక్ లలో జననాలే ఇతరుల కంటే అధికంగా ఉన్నాయని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. జులై 2011 తో ముగిసిన సంవత్సరంలో హిస్పానిక్ లలో జననాలు 26 శాతం ఉండగా, 15 నల్లవారిలోనూ, 4 శాతం ఆసియన్లలోనూ సంభవించాయి. ఇతర జననాలు సమ్మిళత జాతులుగా తెలుస్తోంది. జాతుల పరంగా చూస్తే తెల్లవారిదే (49.6%) ఇప్పటికీ అగ్ర స్ధానం. కానీ తెల్లవారి సగటు వయసు 42 సంవత్సరాలు. అంటే ఎక్కువమంది ముదిమి వయసులో ఉన్నారనీ, మహిళల్లో అధిక శాతం జన్మనిచ్చే వయసు దాటిపోయారనీ అర్ధం.

లాటినో ప్రజల సగటు వయసు 27 సంవత్సరాలు మాత్రమేనని ప్యూ హిస్పానిక్ సెంటర్ లో జనాభా శాస్త్రవేత్త జెఫ్రీ పాస్సెల్ తెలిపాడు. 2000, 2010 మధ్య దేశంలోకి వలస వస్తున్న హిస్పానిక్ ల కంటే అమెరికాలో జన్మిస్తున్న హిస్పానిక్ లు ఎక్కువగా ఉన్నారని ఆయన తెలిపాడు.

4 thoughts on “అమెరికాలో ఇతరులకంటే తగ్గిన తెల్లవారి జననాలు

  1. ఇదంతా అమెరికాలో జాతి విద్వేషాలని రెచ్చగొట్టడానికి కుట్ర. ఇండియాలో ముస్లింల జనాభా పెరుగుతోందని చెప్పి ఇలాంటి కుట్రే చేశారు.
    http://americannaziparty.com వెబ్‌సైట్ చదవండి. విషయం కొంత వరకు అర్థమవుతుంది.

  2. ప్రవీణ్, మీ సూచన పరిశీలనార్హం. ఇది అమెరికాలో ఉంటున్న భారతీయుల ఉనికికి కూడా ప్రమాదకరమైన పరిణామం. కుట్ర అని ఇప్పుడే అనలేము గానీ, ఈ వార్తని పశ్చిమ దేశాల వార్తా పత్రికలన్నీ పెద్ద ఎత్తున ప్రచురించాయి. కొన్ని పత్రికలు పేజీల కొద్దీ విశ్లేషణలు నింపాయి. ఇతర జాతీయుల జనాభా పెరగడం వల్ల మరిన్ని సమస్యలు రావచ్చని కూడా ఎన్.వై.టైమ్స్ ఒక మాటగా రాసింది. ఆర్ధిక సంక్షోభం తీవ్రం అవుతున్నపుడు ప్రజల్ని సామాజిక అంతరాల మీదికి దృష్టిని మళ్ళించి రెచ్చగొట్టడం పెట్టుబడిదారీ వర్గం లాంటి ఆధిపత్య వర్గాలకి అలవాటే. యూరప్ దేశాల్లో అదిప్పటికే జరుగుతోంది. లండన్ అల్లర్లు దానికొక ఉదాహరణ.

  3. అమెరికన్ నాజీ పార్టీ అనేది ఒక మూతపడిన పార్టీ. ఆ పార్టీ పేరుతో ఒక వ్యక్తి వెబ్‌సైట్ మెయింటెయిన్ చేస్తున్నాడు. నియో-నాజీ వెబ్‌సైట్‌లలో వచ్చే వార్తలు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చాయేమిటా అని నాకు ఆశ్చర్యం కలిగి మీకు లింక్ ఇచ్చాను.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s