క్లుప్తంగా… 09.05.2012


జాతీయం

పరువు హత్యలకు యు.పి డి.ఐ.జి మద్దతు

తన కూతురు ఇంటి నుండి పారిపోయి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుందనీ, అబ్బాయిపై చర్య తీసుకోవాలనీ ఫిర్యాదు చేసిన వ్యక్తికిhonour killing కూతురిని చంపెయ్యమని అత్యున్నత పోలీసు అధికారి సలహా ఇవ్వడం సంచలనం రేపింది. తండ్రి స్ధానంలో తానున్నట్లయితే కూతురిని చంపేయ్యడమో లేదా తానే ఆత్మహత్య చేసుకోవడమో చేసేవాడినని సలహా ఇస్తుండగా సంభాషణను కేమెరాలు బంధించడంతో డి.ఐ.జి ఎస్.కె.మాధుర్ వ్యవహారం లోకానికి వెల్లడయింది. రెగ్యులర్ చెకింగ్ కోసం ఓ పోలీసు స్టేషన్ సందర్శించినపుడు మాధుర్ కి ఓ తండ్రి తన కూతురి సంగతి చెప్పి చర్య తీసుకోవాలని కోరాడు. ఫిర్యాదు పై మాధుర్ స్పందనను ఆయన తనిఖీ ని కవర్ చేయడానికి వచ్చిన చానెన్ కెమెరా రికార్డు చేయడంతో జాతీయ చానెళ్లలో వార్త ప్రసారం అయింది. సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు యు.పి పోలీసులు చెప్పారు. జాతీయ మహిళా కమిషన్ ఎస్.కె.మాధుర్ ని ఉద్యోగం నుండి తొలగించాలని కోరింది. న్యాయం చేయాల్సిన అధికారి ఈ విధంగా చెప్పడం తగదని అతనిపై చర్య తీసుకుంటామని యు.పి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రకటించినట్లు ఎన్.డి.టి.వి తెలిపింది. ఫిర్యాదిదారు కూతురు వాస్తవానికి మేజర్ అనీ, తాను ఇష్టపడిన వ్యక్తిని వివాహం  చేసుకుందనీ, తన వివాహం నచ్చని తండ్రి తనపై ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడనీ చెప్పినట్లు ‘ది హిందూ’ తెలిపింది.

ప్రవేటు విద్య అమ్మాయిల చదువుకు ఆటంకం -సర్వే

Private Ed Indiaఆంద్ర ప్రదేశ్ లో ప్రవేటు విద్య పట్ల పెరిగిన మక్కువ అమ్మాయిల విద్యకు ప్రతి బంధకంగా మారిందని ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ సర్వే వెల్లడించింది. ప్రజలు ఇంగ్లీషు మీడియం చదువులకు మొగ్గు చూపుతుండడం వల్ల ప్రభుత్వ పాఠశాలకు ఆదరణ పడిపోయిందనీ, ఇంగ్లీషు చదువుల వల్ల తమ బిడ్డలు మంచి స్ధాయికి చేరుకుంటారని వారు నమ్ముతున్నారని సర్వే తెలిపింది. ధనికులతో పాటు పేదలు కూడా కొన్ని త్యాగాలు చేసయినా తమ పిల్లలను ప్రవేటు ఇంగ్లీషు పాఠశాలల్లో చేర్చుతున్నారని ఇటువంటి త్యాగాలు అమ్మాయిల చదువులను బలి తీసుకుంటున్నాయని సర్వే వెల్లడించింది. దీనివల్ల విద్యావకాశాల్లో లింగ వివక్షత పెరిగిపోయిందని తెలిపింది. కూతుళ్ల కంటే కొడుకలకు ఉన్నత విద్య అందించడానికే తల్లిదండ్రులు ప్రాముఖ్యత ఇస్తున్నారని సర్వే తెలిపింది. ప్రవేటు పాఠశాలల విద్య ఖరీదు కావడం వల్ల అనేకమంది తల్లిదండ్రులు తమ పిల్లల్లో ఒకరికే ఖరీదు విద్య అందించడానికి నిర్ణయించుకుంటున్నారనీ, ఆ నిర్ణయంలో ఆడపిల్లలు విద్యావకాశాలు కోల్పోతున్నారనీ ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ రీసర్చ్ డైరెక్టర్ ప్రొఫెసర్ వుడ్ హెడ్ తెలిపాడు.

ప్రభుత్వ పాఠశాలల్లో అందించే విద్య క్వాలిటీ పెంచడంతో పాటు ప్రవేటు పాఠశాలలను నియంత్రించాల్సిన అవసరం ఉండని ఆయన అభిప్రాయపడ్డాడు. అయితే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం దృష్టిలో ప్రభుత్వ పాఠశాలల్లో క్వాలిటీ పెంచడం అంటే తెలుగు మీడియం బదులు ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడం గా కనిపిస్తోంది. అధిక వేతనాలు ఇవ్వడం ద్వారా టీచర్ వృత్తి గౌరవాన్ని పెంచితే నిపుణులైన వారు టీచింగ్ వృత్తిని చేపట్టడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఆట స్ధాలాలు, ల్యాబ్ సౌకర్యాలతో పాటు ఇతర కనీస సౌకర్యాలను అభివృద్ధి చేసి ప్రభుత్వ పాఠశాలలనుండి మంచి ఫలితాలు సాధించినట్లయితే అందులో తమ పిల్లలను చేర్పించడానికి ప్రజలు వెనకాడే అవకాశాలు ఉండవు. ప్రభుత్వాలకి ఈ దృష్టి లేకపోవడమే ప్రభుత్వ పాఠశాలలపై ఆసక్తి తగ్గిపోవడానికి అసలు కారణం.

అంతర్జాతీయం

ఆల్-జజీరా విలేఖరిని బహిష్కరించిన చైనా

Melissa-Chanఆల్-జజీరా ఇంగ్లీషు చానెల్ విలేఖరి మెలిస్సా చాన్ ను చైనా బహిష్కరించింది. 1998 తర్వాత ఒక విదేశీ విలేఖరిని చైనా బహిష్కరించడం ఇదే మొదటిసారి అని పత్రికలు తెలిపాయి. దేశ రహస్యాలు బైటికి చేరవేస్తున్న ఆరోఫణతో 1998 లో జపాన్ విలేఖరిని చైనా ప్రభుత్వం బహిష్కరించింది. అప్పటినుండి 2008 లో ఒలింపిక్స్ జరిగే వరకూ చైనా విదేశీ విలేఖరులపై ఉన్న నిబంధనలను సడలించుకుంటూ వచ్చిందనీ గత రెండు సంవత్సరాలుగా ఈ నిబంధనలు మళ్ళీ కఠినం చేస్తోందనీ ‘ది హిందూ’ తెలిపింది. టిబెట్ ఉద్యమకారుల  మానవ హక్కుల ఉద్యమాలు లాంటి సున్నిత సమస్యలపై వార్తలు కవర్ చేసే విలేఖరుల వీసాలను రద్దు చేస్తామని చైనా బెదిరించడం ఎక్కువయిందని పత్రిక తెలిపింది. మెలిస్సా చాన్ వీసాను రద్దు చేసిన చైనా మళ్ళీ పునరుద్ధరించలేదు. మెలిస్సా బహిష్కరణకు చైనా విదేశాంగ శాఖ వివరణ ఇవ్వడానికి ఆసక్తి చూపలేదు. కారణం విలేఖరికి తెలుసని చెప్పి ఊరుకుంది.

మా గ్రామీణ బ్యాంక్ లో క్లింటన్ జోక్యం తగదు –బంగ్లాదేశ్

muhammad yunusబంగ్లా దేశ్ ప్రభుత్వ చర్యల వల్ల గ్రామీణ బ్యాంకు పని ప్రభావితం కారాదన్న హిల్లరీ క్లింటన్ వ్యాఖ్యలను బంగ్లా దేశ్ తిరస్కరించింది. మహమ్మద్ యూనస్ ను తొలగించినందువల్ల బ్యాంకు పని సామర్ధ్యం ఏమీ తగ్గలేదని క్లింటన్ వ్యాఖ్యలను తిప్పికొట్టింది. మైక్రో ఫైనాన్స్ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాడంటూ మహమ్మద్ యూనస్ కి 2006 లో నోబెల్ బహుమతి ఇచ్చారు. అయితే ఆయన దాతల డబ్బుని వారికి చెప్పకుండా ఇతర ఉపయోగాలకి తరలించాడనీ, రిటైర్ మెంట్ వయసు మించి పోయిందనీ చెబుతూ బంగ్లా దేశ్ ప్రభుత్వం యూనస్ ని మేనేజింగ్ డైరెక్టర్ పదవి నుండి తొలగించింది. తిరిగి ఎం.డి పదవి పొందడానికి ఆయన ప్రయత్నించినా సఫలం కాలేదు. ఈ విషయంలో కూడా జోక్యం చేసుకోవడానికి హిల్లరీ క్లింటన్ ప్రయత్నించింది. బంగ్లా దేశ్ పేదల నుండి సేకరించిన డిపాజిట్లు, వారి రక్తం పిండి వసూలు చేసిన వడ్డీలు గ్లోబల్ ఫైనాన్స్ కంపెనీలకు రుచిగా మారడమే హిల్లరీ క్లింటన్ జోక్యానికి కారణం. భారత దేశంలో కూడా మైక్రో ఫైనాన్స్ రంగంలోకి వాల్ స్ట్రీట్ కంపెనీలు ప్రవేశించడంతో అధిక వడ్డీల భారం భరించలేక అనేకమంది పేదలు ఆత్మహత్యలు చేసుకున్నారు.

12 thoughts on “క్లుప్తంగా… 09.05.2012

  1. ప్రభుత్వ పాఠశాలలలో చదువేవాళ్ళలో ఎక్కువ మంది పేదవాళ్ళ పిల్లలు. పేదవాళ్ళకి చదువు ఎందుకు అనుకుని టీచర్‌లు ఆ పిల్లలకి చదువు సరిగా చెప్పరు. మా అమ్మగారు బిటివాడ హై స్కూల్‌లో చదివే రోజులలో వాళ్ళ స్కూల్ టీచర్‌లు బ్రాహ్మణ & కరణం కులాలకి చెందినవాళ్ళు. బిటివాడ, అడారు, వండువ గ్రామాలలో ఎక్కువ మంది కాపు కులానికి చెందినవాళ్ళు. కాపుల పిల్లలు బాగా చదువుకుంటే వాళ్ళు వ్యవసాయం మానేసి టీచర్ ఉద్యోగాలలో చేరుతారు, అప్పుడు తమ పిల్లలు వ్యవసాయం చేసుకుని బతకాల్సి వస్తుంది అని ఆ టీచర్‌లు అనుకునేవాళ్ళు. అందుకే ఆ టీచర్‌లు పిల్లలకి చదువు సరిగా చెప్పేవాళ్ళు కాదు. అయినా మా అమ్మగారు ఎలాగోలాగ స్కూల్ చదువు పూర్తి చేసి, తరువాత +2 కూడా పూర్తి చేసి, యూనివర్సిటీకి వెళ్ళి సైన్స్ చదివారు.

  2. ప్రవీణ్, టీచర్లు స్కూల్ ఎగ్గొట్టడం తాము ప్రవేటు స్కూళ్లు ఎంచుకోవడానికి కారణమని తల్లిదండ్రులు చెప్పినట్లు సర్వే తెలియజేసింది. టీచర్ల సంఘాలు, విద్యార్ధి సంఘాలు ఈ అంశాన్ని పరిశీలించాల్సి ఉంది.

  3. కొంత మంది టీచర్‌లు సైడ్ బిజినెస్‌లు పెట్టుకుని స్కూల్ ఎగ్గొడుతుంటారు. ఒక ప్రభుత్వ టీచర్ రైస్ మిల్ నడుపుతున్నాడు, ప్రభుత్వ ఉద్యోగులు సైడ్ బిజినెస్‌లు చెయ్యకూడదు అని రూల్ ఉన్నా రూల్స్ ఎవడు పాటిస్తాడులే అని అనుకున్నాడు. అతను సంతకాలు పెట్టడానికి మాత్రమే స్కూల్‌కి వస్తాడు కానీ అతను ఎక్కువగా ఉండేది రైస్‌మిల్‌లోనే.

  4. చాలామంది ఉద్యోగులతో ఇదే సమస్య అనుకుంటా. విధులు తప్పనిసరిగా నిర్వర్తించే సిన్సియారిటీ ఉంటే బిజినెస్ చేసుకున్నా తప్పు పట్టాల్సిన పని లేదు. సిన్సియారిటీ ని ప్రోత్సహించే పరిస్ధితులు కూడా లేకపోవడం ఒక లోపం.

  5. అందరు ప్రభుత్వ ఉద్యోగులూ అలా కాదు. మా అమ్మానాన్నలు చేసినది బ్యాంక్ ఉద్యోగం. బ్యాంక్‌లో ఒకడు ఫ్రాడ్ చేసినా, ఆ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇతర ఉద్యోగుల ఉద్యోగాలు పోతాయి. మా అమ్మగారు పని చేసే బ్యాంక్‌లో గోల్డ్ లోన్‌లు ఇవ్వడం మా అమ్మగారికి తెలిసే జరుగుతుంది. పొరపాటున నకిలీ బంగారం ఇచ్చినవాళ్ళకి లోన్ ఇస్తే మా అమ్మగారి ఉద్యోగమే పోతుంది. స్కూల్‌లలో స్ట్రిక్ట్ నియమాలు ఉండవు కాబట్టి స్కూల్ టీచర్‌లు సరిగా పని చెయ్యరు.

  6. ఇంకో విషయం. 35% మార్కులని కూడా పాస్ మార్క్‌లుగా గుర్తించే విద్యా విధానం ఉంటే పిల్లలైనా సరిగా చదువుతారా?

  7. అవును. విద్యా విధానంలో కూడా మార్పులు చాలా రావలసి ఉంది. ఇప్పుడు చాలా ప్రవేటు స్కూళ్లు, ఇంజనీరింగ్ కాలేజీలతో సహా, మార్కుల ప్రాతిపదికన ర్యాంకులు ఇవ్వడం ఆపేశాయి. చాలావరకు గ్రేడింగ్ పద్దతి ప్రవేశ పెట్టారు. మార్కులు ఇస్తూనే ఇతర ప్రాక్టికల్ అంశాలతో కలిపి గ్రేడ్స్ ఇస్తున్నారు.

  8. మార్కులు పబ్లిష్ చేస్తే తమ కాలేజ్ విద్యార్థులకి ఇన్ని మార్కులు వచ్చాయని చెప్పి విద్యా సంస్థలు తమ మధ్య పోటీ పెంచుకుని అనారోగ్యకరమైన వ్యాపారం చేస్తాయి. అందుకే మార్కులు బహిరంగంగా పబ్లిష్ చెయ్యకూడదని ప్రభుత్వం రూల్ పెట్టింది.

  9. ప్రవీణ్ మీ ఆర్టికల్ చదివాను. కామెంట్ పబ్లిష్ చేశాక కాప్చా కనిపిస్తోంది. ఒక కాప్చా కి స్పందించినా తర్వాత మరో కాప్చా కనిపిస్తోంది. కాప్చా పట్టించుకోనవసరం లేదా? (ఇంకో సంగతి: నిన్నటి నా మెయిల్ కి ఇంకా స్పందించలేదు మీరు.)

  10. నేను ఒక మెయిల్ పంపాను. ఆ మెయిల్ పంపడానికి సొంత మెయిల్ సాఫ్ట్‌వేర్ ఉపయోగించాను. అది స్పామ్ బాక్స్‌లోకి వెళ్ళలేదేమో చూడండి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s