‘సాక్షి’ కి ప్రకటనలు ఇవ్వొద్దు -ఎ.పి ప్రభుత్వం ఆదేశాలు


Sakshi officeమాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి స్ధాపించిన దిన పత్రిక ‘సాక్షి’ కి ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వరాదని ప్రభుత్వం సంబంధిత విభాగాలకు ఆదేశాలు జారీ చేసింది. వై.ఎస్.ఆర్ స్ధాపించిన ‘ఇందిర’ టి.వి కి కూడా ప్రకటనలు ఇవ్వడం ఆపాలని ప్రభుత్వం నిర్ణయించింది. కడప ఎం.పి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పై ‘అక్రమ ఆస్తుల’ కేసు విచారణకు సంబంధించి ఈ ఆదేశాలు జారీ చేశామని ప్రభుత్వం తెలిపింది. ఇరు సంస్ధలకు చెందిన బ్యాంకు ఖాతాలను సి.బి.ఐ స్తంభింపజేసిన ఒక రోజు తర్వాత ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.

రాష్ట్ర ప్రభుత్వ సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ ఆర్.వి.చంద్రవదన్ వివిధ ప్రభుత్వ విభాగాలకి ఈ మేరకి ఉత్తర్వులు జారీ చేశాడు. ‘జగతి పబ్లికేషన్స్’ సంస్ధ పైన సి.బి.ఐ ఛార్జీ షీటు దాఖలు చేసిన సంగతిని తమ ఆదేశాలకు కారణంగా చంద్రవదన్ చూపాడు. ‘ప్రజా ప్రయోజనాల’ రీత్యా వివిధ రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు, ఏజన్సీలు, ప్రభుత్వ రంగ సంస్ధలు, కార్పొరేషన్లు, ఇతర ఆర్గనైజేషన్లు “ప్రకటనలు, నోటిఫికేషన్లు విడుదల చేయడం ఆపివేయాలని” చంద్రవదన్ ఉత్తర్వులు పేర్కొన్నాయి. ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయి.

“సాక్షి తెలుగు దిన పత్రిక, టి.వి ఛానెల్ ల ప్రచురణా సంస్ధ ఐన ‘జగతి పబ్లికేషన్స్ (ప్రవేట్) లిమిటెడ్’ పైన సి.బి.ఐ మార్చి 31, 2012 తేదీన ఛార్జీ షీటు దాఖలు చేసినట్లు ప్రభుత్వ దృష్టికి వచ్చింది. ప్రయో ప్రయోజనాల రీత్యా విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించిన పిమ్మట వీటికి ప్రభుత్వ ప్రకటనలు, నోటిఫికేషన్లు మొదలయినవి ఇవ్వడం ఆపేయాలని నిర్ణయించాము” అని చంద్రవదన్ పేర్కొన్నాడు.

సాక్షి పత్రిక, ఛానెల్ ల పై ఆరోపణలు క్లియర్ అయేంతవరకూ ప్రకటనలపై నిషేధం కొనసాగుతుందని చంద్రవదన్ ఉత్తర్వులు తెలిపాయి. ప్రభుత్వ నియమ నిబంధనలు ఉల్లంఘిస్తూ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి, తాను ముఖ్యమంత్రి గా ఉండగా సాక్షి పత్రికకు ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వడానికి ఏప్రిల్ 24, 2008 తేదీన ఆదేశాలిచ్చాడు. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రభుత్వ నిబంధనలను ఆయన సడలించాడని ‘ది హిందూ’ తెలిపింది.

జగన్ అక్రమాస్తుల కేసు పై విచారణలో భాగంగా సాక్షి కి ప్రకటనలను ఇచ్చిన విషయానికి సంబంధించి ‘సమాచార పౌర సంబంధాల’ విభాగం నుండి 46 ఫైళ్లను సి.బి.ఐ స్వాధీనం చేసుకుంది. అవినీతి కేసులో విచారణ కు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న చర్యను జర్నలిస్టుల సంఘాలు ‘పత్రికా స్వచ్ఛ’ పై దాడిగా అభివర్ణిస్తూ ఖండించడమే ఆశ్చర్యం కలిగిస్తోంది. పత్రికా స్వేచ్ఛ అంటే పత్రికలకు ‘అవినీతికి పాల్పడే స్వేచ్ఛ’ ఉండాలని ఈ సంఘాలు భావిస్తున్నాయా?!  అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమానికి మద్దతు ఇవ్వడం, అదే అవినీతి విచారణ తమకు వర్తించదన్నట్లు ప్రవర్తించడం చూస్తే అవినీతి వ్యతిరేకతలో వీరి చిత్త శుద్ధి అర్ధం అవుతోంది.

కార్పొరేట్ కంపెనీల చట్ట విరుద్ధ కార్యకలాపాలతోనూ, కార్పొరేట్ కంపెనీల లాబీయిస్టులతోనూ పత్రికా ప్రముఖులు ఏ స్ధాయిలో పెనవేసుకుపోయారో నీరా రాడియా టేపులు బహిర్గతం చేశాయి. అనేక పత్రికా సంస్ధలను కొనుగోలు చేయడం ద్వారా భారత దేశ ధనికుడు ముఖేష్ అంబానీ భారతీయుల ఆలోచనలను ప్రభావితం చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. ఈ నేపధ్యంలో పత్రికల వార్తలను ఆచి తూచి నమ్మవలసిన పరిస్ధితికి భారత ప్రజలు నెట్టబడుతున్నారు.

166 thoughts on “‘సాక్షి’ కి ప్రకటనలు ఇవ్వొద్దు -ఎ.పి ప్రభుత్వం ఆదేశాలు

 1. పత్రిక స్వేచ్ఛ పేరుతో ఏమైనా చెయ్యొచ్చని అనుకోలేము. రాజశేఖరరెడ్డి అవినీతి వల్ల కాంట్రాక్ట్ సంపాదించిన తోటపల్లి బేరేజ్ కాంట్రాక్టర్ బేరేజ్ పనులు పూర్తి చెయ్యకుండా అధికారుల సహాయంతో తన యంత్రాలని తీసుకుని ఎలా ఉడాయించాడో “వార్త” దిన పత్రికలో వ్రాసారు కానీ “సాక్షి” దిన పత్రికలో వ్రాయలేదు.

 2. ఇది ఖచ్చితం గా అధికారదుర్వినియోగమే. జగన్ అవినీతికి ఇలా చేయడం అనేది కాంగ్రెస్ భయాన్ని మాత్రమే సూచిస్తోంది. కేవలం ఇది కక్ష సాధింపు చర్య మాత్రమే. నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లు జగన్ అనే వ్యక్తిని ఎదుర్కోవడానికి రాజ్యాధికారాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుంది. అసలు అవినీతి అంటే ఏమిటి ? అవినీతి పై పోరాటం అంటే కుట్రగా వ్యవహరించడమా ? తమకు అడ్డువచ్చిన అవినీతి పరులపై మాత్రమే రాజ్యాంగ వ్యవస్థలను వాడుకోవడమా ? రాజశేఖరరెడ్డిని – మంతృలను – వారి ద్వారా మూటలు ముడుపులుగా తీసుకున్న ఢిల్లీ పెద్దలను ఎందుకు వదిలేస్తున్నారు. సీ.బీ.ఐ అంటే కేవలం కుట్రపూరితమైన స్క్రిప్టుల డైరెక్షన్ లో మాత్రమే ఓవర్ యాక్షన్ చేయడమేనా ? ఈనాడు – ఆంధ్రజ్యోతి లు మాత్రమే పత్రికలన్నట్లు ఉన్న తరుణం లో సాక్షి వచ్చింది. ఇంకా చాలా దుకాణాలు వస్తే ప్రజలకు అసలు వార్తలు అంటే ఏమిటో – ప్రజాస్వామ్యం అంటే ఏమిటో మరి కొంత తెలుస్తుంది. అయినా సాక్షి పై ఇపుడు దాడి చేయడం – మరికొంత మంది దానిని సమర్ధించడం చాలా ప్రమాదకరమైన ధోరణే అవుతుంది. చంద్రబాబు అంత అవినీఎతిపరుడు లేడని తెహల్కా చెపితే దానిని ఆదర్శం గా తీసుకున్న వై.ఎస్ మరింత ధైర్యంగా తెలివిగా ఇంకా చెప్పాలంటే అతి తెలివిగా రాజ్యాంగ యంత్రాన్ని అడ్డుపెట్టుకుని బరితెగించి మరీ ప్రజాధనాన్ని లూఠీ చేశారు. ఇందుకు ఇపుడున్న మంతృలు – కాంగ్రెస్ అధిష్ఠానం తమవంతు వంత పాడారు. వాటా పుచ్చుకున్నారు. వారందరినీ వదిలేసి విధేయత ప్రదర్శించని జగన్ ను మాత్రమే టార్గెట్ చేస్తే ప్రజలు ఎంత అవినీతిపరుడైనా జగన్ కు మాత్రమే మద్ధతు పలుకుతారు. ఎందుకంటే అవినీతి కంటే కుట్ర మరింత ప్రమాదకరమైనది కనుక.

 3. కొండల్రావు గారు, అవినీతి, కుట్ర రెండూ నేరాలే. రెండింటినీ ప్రమాదకరంగానే చూడాలి తప్ప రెండు నేరాల్ని పోల్చి ఒకటి ఎక్కువ ప్రమాదం అని ఎలా చెబుతారు?

  ఇంకా చెప్పాలంటే, అవినీతి వల్ల ప్రజలు నేరుగా ప్రభావితం అవుతారు. కుట్ర ఆ పార్టీల మధ్య, అధికారం కోసం జరుగుతోంది కనుక దానివల్ల ప్రజలకి నేరుగా నష్టం ఉండదు. పైగా అవినీతి కంటే పార్టీల మధ్య జరిగే కుట్రల వల్ల ప్రజలకి జరిగే నష్టం తక్కువ కూడా.

  ఈనాడు, జ్యోతి మాత్రమే పత్రికలు కాదని చెప్పడానికి ప్రజాధనం దోపిడీ చేసి సాక్షి పెట్టాలంటారా? అసలు సాక్షి పెట్టడంలోనే పెద్ద కుట్ర లేదా? తన అవినీతిని కప్పి పుచ్చుకోవడానికి మీడియా శక్తివంతమైన సాధనం అని గుర్తించి వై.ఎస్.ఆర్ పత్రిక, టి.వి పెట్టుకున్నాడు. అలాంటి మీడియా రావడం వల్ల జనానికి అదనంగా వచ్చిన లాభం లేకపోగా జగన్ అవినీతి సామ్రాజ్యాన్ని ఎఫెక్టివ్ గా కప్పిపుచ్చడం వల్ల ప్రజలకి వాస్తవాలు అందకుండా పోతున్నాయి.

  ఢిల్లీ పెద్దలు మంత్రుల్ని, వై.ఎస్.ఆర్ ని వదిలి పెడుతున్నారని చెప్పడానికి సాక్షిని సమర్ధించాల్సిన అవసరం లేదు. ఒక్క సాక్షి భయమే ఖర్మ. కాంగ్రెస్ కి ఇంకా అనేక భయాలున్నాయి. ఆ భయాల వల్ల ఇతరుల అక్రమాలేవీ సక్రమాలు కానేరవు. మీ వ్యాఖ్యలో అసలు ప్రజా ప్రయోజనాల పట్ల పట్టింపు లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది. కాంగ్రెస్ కక్ష సాధిస్తే అది అవినీతి సొమ్ముతో పెట్టిన సాక్షికి సానుభాతిగా ఎందుకు మారాలి?

  బూర్జువా పార్టీల మధ్య జరిగే కుట్రలు ఆ పార్టీలకి ప్రజల పట్ల పట్టింపులేనితనాన్ని మాత్రమే చూపుతాయి తప్ప ఆ కుట్రల్లో ఒకరి పక్షం చేరవలసిన అవసరం ప్రజలకి లేదు. కుట్ర పార్టీని ద్వేషించి అవినీతి పార్టీ పక్షాన చేరవలసిన అవసరం అంతకన్నా లేదు. ఇరు పక్షాలూ ప్రజావ్యతిరేకమే అన్నదే ప్రజలకి కావలసింది.

  భూముల్ని ఇష్టానుసారం ప్రవేటు కంపెనీలకి అప్పజెప్పి ఒక్క నీటి చుక్క ప్రజలకి అందకుండానే కాంట్రాక్టర్ల దగ్గర్నుండి వేల కోట్లు గుంజి ప్రజల సంపదల్ని కొల్లగొట్టి అలాంటి కార్యక్రమాల్ని కప్పి పుచ్చడానికి పెట్టిన పత్రిక ఖాతాల్ని స్తంభింపజేస్తే అందులో గల్లంతయిన పత్రికా స్వేచ్చ ఏమిటో చెప్పగలరా?

 4. ఒక అవినీతి కాంట్రాక్టర్ వల్ల పెండింగ్ ఇరిగేషన్ ప్రోజెక్ట్ లేదా రైల్వే ప్రోజెక్ట్ ఆగిపోతే ప్రజలకి నేరుగా నష్టం కానీ ఒక అవినీతిపరుడు కుట్ర వల్ల ఇరుక్కుని చెరసాలకి వెళ్తే ప్రజలకి నష్టమా? అవినీతిపరులపై ప్రజలు సానుభూతి చూపిస్తారనుకోవడం క్రూడ్ జోక్ తప్ప ఇంకొకటి కాదు.

 5. కోర్ట్ ఏమీ పత్రికలలో వచ్చిన కథనాల ఆధారంగా విచారణ చెయ్యడం లేదు. ఒకవేళ పత్రికలలో వచ్చిన కథనాల ఆధారంగా విచారణ చేసే వ్యవస్థ ఉంటే జగన్ ఈ పాటికే చెరసాలలో ఊచలు లెక్కబెట్టుకుంటూ ఉండేవాడు.

 6. విశెఖర్ గారు. అవినీతి అనేది సాధారణమై పోయింది. ప్రజలు దాన్ని
  సహజంగా తీసుకుంటున్నారు. “ఇప్పుడు అవినీతి చేయంది ఎవరో చెప్పండి.
  ఆయన నలుగురికి పెట్టాడు, ఆయనా తిన్నాడు. అందులొ తప్పేముంది” అని బదులు
  చెప్పుతున్నారు. దీనికి సి.పి.యం. కార్య కర్త అయిన (అని
  నేననుకుంటున్నాను) కొండలరావుగారు కూడా అతీతుడేం కాదు. ఒకరిని
  వ్యతిరేకించే క్రమంలొ ఇంకొకరిని సమర్దిస్తున్నారు. బుర్జువా
  పార్టీలన్నీ ఒక తానులొ ముక్కలే. అదికారం కోసం ఒకరిని ఒకరు కలహించుకుంటుంటారు. శ్రామికవర్గాన్ని ఎదుర్కొనేటప్పుడు అందురూ యేకమౌతారు.

 7. జగన్ చేసినది సాధారణ అవినీతి కాదు. చంద్రబాబు తొమ్మిదేళ్ళలో చేసిన అవినీతిని జగన్ ఆరేళ్ళలోనే చేసి చూపించి చంద్రబాబు యొక్క రికార్డ్‌ని బద్దలుగొట్టాడు. చంద్రబాబు పెట్టిన జన్మభూమి కార్యక్రమం వల్ల వార్డ్ కౌన్సిలర్లు కూడా లాభం పొందారు. తన అవినీతిలో వాటాలు ఎక్కువ పంచింది మాత్రం చంద్రబాబు నాయుడే అయినా వ్యక్తిగతంగా ఎక్కువ తిన్నవాడు జగనే. కనుక చంద్రబాబు కంటే జగనే పెద్ద అవినీతిపరుడు. అవినీతి పాలనే కావాలనుకుంటే చంద్రబాబుకే వోట్లు వెయ్యొచ్చు. జగన్‌నే నమ్మాల్సిన అవసరం లేదు.

 8. చంద్రబాబు ప్రపంచ బ్యాంక్ నుంచి తెచ్చిన అప్పులు తీర్చడానికే ఔరంగజేబ్‌లాగ ప్రజల నుంచి జుత్తు పన్ను వసూలు చెయ్యాలి. ఇక జగన్ లాంటి అవినీతిపరులని కూడా మేపితే ఇంకెన్ని పన్నులు వసూలు చెయ్యాలో?

 9. ఎపి మీడియా కబుర్లు బ్లాగ్‌లో పోస్ట్ చెయ్యాల్సిన కామెంట్ ఇది. రాము ఈ కామెంట్ పబ్లిష్ చెయ్యడేమో అనే అనుమానంతో నేను ఈ కామెంట్ ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను.

  Studio N నుంచి 70 మందిని ఉద్యోగాల నుంచి పీకేసినప్పుడు ఈ సోకాల్డ్ పాత్రికేయ సంఘాలు ఆందోళనలు చెయ్యలేదు. ఎందుకంటే ఆ సంఘాల నాయకులు సీనియర్ జర్నలిస్ట్‌లు, వాళ్ళ ఉద్యోగాలు అంత తొందరగా పోవు కాబట్టి. ఇప్పుడు సాక్షి ఉద్యోగుల విషయంలో దొంగ కన్నీళ్ళు కారుస్తున్నారు. గతంలో నా కామెంట్లని వెంటనే పబ్లిష్ చేసిన రాము ఇప్పుడు నా కామెంట్లని పన్నెండు గంటల తరువాత అప్రూవ్ చేస్తున్నాడు. CBIవాళ్ళు ఫ్రీజ్ చెయ్యించినవి మూడు బ్యాంక్ అకౌంట్లే. జగన్‌కి మరో పంతొమ్మిది బ్యాంక్ అకౌంట్‌లు ఉన్నాయని సాక్షి పత్రిక ఇడియే చెప్పుకున్నాడు. మూడు బ్యాంక్ అకౌంట్‌లు ఫ్రీజ్ అయినంతమాత్రాన సాక్షి ఉద్యోగుల ఉద్యోగాలు పోవు.

 10. కొండల్రావు గారూ,

  గూగుల్ ప్లస్ లో ఈ పోస్టు పై మీరోక వ్యాఖ్య ఉంచారని మిత్రులు చెప్పారు. ఆ మేటర్ ని నాకు మెయిల్ చేశారు. నాకు గూగుల్ ఖాతా లేదు. పాతది ఉన్నా పాస్ వర్డ్ మర్చిపోయాను. కనుక బజ్ లో నేను రాయలేను. అందువలన మీకు ఇక్కడ సమాధానం ఇవ్వవలసి వస్తోంది.

  మీ వ్యాఖ్యలో నాపైన వ్యక్తిగతంగా ఘోరంగా రాసారు. నన్ను తూలనాడారు. నేను ఈనాడు ని మేనేజ్ చేసుకుని నా బ్లాగ్ మోసేలా చేశానని అనుమానం వ్యక్తం చేశారు. నా బ్లాగ్ లో వ్యాఖ్యలు రాసే మిత్రులను నన్ను కలిపి కంపెనీగా, బేచ్ గా అసభ్యంగా చిత్రీకరించారు. వింత నాటకం ఆడుతున్నామని ఆరోపించారు. ‘మేధావి వర్గం’ అని ఎగతాళి చేసారు. కామెంట్లు రాసుకుని ఆనందపడుతున్నామని మరో ఎకసక్కేం చేశారు.

  “ఏకం గా ఈ బేచ్ ఎదుటివాడికి లేని అభిప్రాయాన్ని అంటగడుతూ, సొంత పైత్యాన్ని వండి వార్చుతూ రాసి రాక్ససానందం పొందుతుంటారు. ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి. చాలా సందర్భాలలో గమనించినందునే రాయక తప్పటం లేదు. వీళ్లకు సీ.పీ.ఎం పై గుడ్డి వ్యతిరేకత తప్ప సోషలిజంపై గానీ , కార్మికవర్గం పై ప్రేమ గానీ కనపడదు.” అని రాసారు.

  సోకాల్డ్ మేధావులన్నారు. “సీ.బీ.ఐ తోనే ఈ మేధావులు భారతదేశం లో సోషలిజం తీసుకువచ్చేలా ఉన్నారు” అని రాసారు. నావి పైత్యపు వాదనలన్నారు. సి.పి.ఏం పార్టీ పైన గుడ్డి ద్వేషం అని రాశారు.

  పైన మీరొక వ్యాఖ్య రాశారు. దానికి నేను బదులిచ్చాను. దానికి సమాధానం మీరు ఇక్కడే ఇచ్చి ఉంటే బాగుండేది. లేదా ఫలానా చోట సమాధానం ఇచ్చాను చూడండని నాకు చెప్పినా బాగుండేది. అది చేయకుండా మీరు మీ వ్యాఖ్యలని నేను ప్రచురించడం లేదని ‘అబద్ధం’ రాశారు. పై వ్యాఖ్య తర్వాత మీరసలు నా బ్లాగ్ లో వ్యాఖ్యే రాయలేదు. స్పామ్ లో కూడా ఏ కామెంటూ లేదు. మీరేమీ రాయకుండా నేను ప్రచురించలేదని చెప్పవలసిన అవసరం మీకు ఎందుకు తలెత్తింది? నన్ను వ్యక్తిగతంగా దూషించడానికి అంత ఘోరంగా అబద్ధం చెప్పాలా? అబద్ధం పునాదిపైన దూషణలకు దిగాల్సిన అవసరం మీకేందుకు వచ్చింది?

  నా బ్లాగ్ లో నా పోస్టులను సమర్ధిస్తున్నవారినీ నన్నూ కలిపి ‘కంపెనీ’ గా, ‘బేచ్’ గా ఎందుకు రాయవలసి వచ్చింది? మీరు రాసినదాన్ని ఎవరైనా మెచ్చుకుంటే వారినీ మిమ్మల్నీ కలిపి కంపెనీగా, బేచ్ గా ముద్ర వెయ్యవచ్చా?

  ఈనాడులో మేనేజ్ చేసుకుంటే బ్లాగ్ గురించి రాయించుకున్నానన్న ఆరోపణ ఎందుకు చేయవలసి వచ్చింది? అసలీ ధోరణి ఏమిటి? రెండు మూడుసార్లు తప్ప మీతో నేరుగా సంభాషించినదే తక్కువ. మీతో నాకు పెద్దగా పరిచయం కూడా లేదు. ఏమీ లేకుండా ఇలా వ్యక్తిగతంగా నన్నెందుకు దూషించారు?

  పై వ్యాఖ్యలో నేను మీకిచ్చిన సమాధానం లో మీ విమర్శకి సమాధానం ఇచ్చాను. మిమ్మల్ని వ్యక్తిగతంగా ఏమీ అనలేదు. ఆ ఉద్దేశ్యం కూడా నాకు లేదు. కేవలం విషయాన్ని మాత్రమే చర్చించాను. మీరు చేసిన వాదనలో వైరుధ్యాన్ని ప్రస్తావించాను. అవినీతి, కుట్ర రెండూ బూర్జువా రాజ్యం లక్షణాలే కనుక, వాటివల్ల ప్రజలకే నష్టం కనుక, ఒకదానికొకటి పోటీ పెట్టరాదని వ్యాఖ్యానించాను. అవినీతి కంటే కుట్ర ప్రమాదకరమని మీ వ్యాఖ్యని ప్రస్తావిస్తూ సాక్షి పెట్టడంలో కూడా కుట్ర ఉందని గుర్తు చేశాను.

  ఈ విమర్శలో మిమ్మల్నేమన్నా బాధపెట్టానా? వ్యక్తిగతంగా దూషించానా? మీరు సి.పి.ఎం పార్టీ సానుభూతిపరుడన్న సంగతే నాకు తెలియదు. ఇక గుడ్డి ద్వేషం ప్రసక్తి ఎక్కడిది? పోనీ, సి.పి.ఎం రాజకీయాల గురించి చర్చించకుండా గుడ్డి ద్వేషం వ్యక్తం చేసినట్లు చూపగలరా? ఆ పార్టీ గురించి ఒకే ఒకసారి ఒక మిత్రుడు చర్చ పెట్టాడు. దానికి నేను లోతుగా చర్చించాలని ప్రయత్నించాను. కానీ ఆ మిత్రుడు మళ్ళీ చర్చించలేదు. అందువలన అది ముందుకు సాగలేదు. మీరేన్నడూ ఇక్కడ ఆ పార్టీ గురించి చెప్పనందున ఆ సంగతి మీతో చర్చించనేలేదు. ఇక ఆ పార్టీపై గుడ్డి ద్వేషం వ్యక్తం చేశానని ఎందుకు అన్నారు?

  ‘రామ్మోహన్ గారు మీరు సి.పి.ఎం పార్టీ అయి ఉండవచ్చని భావించారు. ఒకరిని వ్యతిరేకించే క్రమంలో మరొకరిని సమర్ధిస్తున్నారని రాశారు.’ అది విమర్శ. దానికి మీరు ఇక్కడే సమాధానం చెప్పడం సముచితం. కానీ ఆ విమర్శని మీరు సావధానంగా స్వీకరించలేకపోయారు. విమర్శను మీరు భరించలేకపోయారు. అవసరం లేని కోపం తెచ్చుకున్నారు? ‘కమ్యూనిజం’ నచ్చేలా చెప్పాలని బోధిస్తూ కూడా మీరే మీపై వచ్చిన ఒక చిన్న సాధారణ విమర్శని తట్టుకోలేకపోయారు. ఎకా ఎకిన ఒక అబద్ధాన్ని సృష్టించి దాని ఆధారంగా నాపైన, నా బ్లాగ్ సందర్శకులపైనా వ్యక్తిగత దూషణలకి దిగారు. కంపెనీ అన్నారు, బేచ్ అన్నారు, మేధావి వర్గం అని ఎగతాళి చేశారు. పైత్యం వండాం అన్నారు, రాక్షానందం పొందామని రాశారు.

  నిజానికి ‘కమ్యూనిజం నచ్చేలా’ చెప్పాలనీ, ‘భయపడేలా చెప్పరాదనీ’ మీరు చెప్పిన అభిప్రాయం తో నాకు ఏకీభావం ఉంది. ఆ సంగతే చెబుతూ నేను కొన్ని పోస్టులు ఈ బ్లాగ్ లో రాశాను. కానీ మీ ఈ వ్యాఖ్య మీరు వ్యక్తం చేసిన ఒక ప్రజాస్వామిక భావనను పూర్వ పక్షం చేసేలా ఉంది. “కమ్యూనిస్టులు నీతులు చెబుతారు తప్ప ఆచరించరు” అన్న విమర్శను మీరు మరోసారి రుజువు చేయాలని చూస్తున్నారా? మీ ప్రజాస్వామిక భావనకు మీ ఆచరణ అనుగుణంగా లేకపోవడం అత్యంత విచారకరం. కమ్యూనిస్టు లపై పచ్చి విద్వేషం వెల్లడవుతున్న నేపధ్యంలో మీ వ్యాఖ్య దానికి అనువుగా ఉందే తప్ప ఖండించేదిగా లేకపోవడం విచారకరం.

  సోషలిజం పై గానీ, కార్మికవర్గం పై గానీ ప్రేమ ఉందని మీరెలా గ్రహిస్తారు? జగన్ పత్రికలపై సి.బి.ఐ దాడిని ఖండిస్తే మీరు చెప్పిన ప్రేమ ఉన్నట్లా? సోనియా, జగన్ ల వైరుధ్యంలో ఒకరి పక్షం వహిస్తే ప్రేమ ఉన్నట్లా? ‘ఒకరిని వ్యతిరేకించే క్రమంలో మరొకరిని సమర్ధిస్తున్నారు’ అని మిత్రుడు చేసిన విమర్శని భరించలేకపోతే ప్రేమ ఉన్నట్లా? లేదా మీరు సమర్ధించే సి.పి.ఎం పార్టీని విమర్శించకుండా ఉంటే ప్రేమ ఉన్నట్లా?

  మీకు లేని అభిప్రాయాలని నేను అంటగట్టానని ఆరోపించారు. మీ అభిప్రాయాలను బట్టి మీకు కొన్ని ప్రశ్నలు వేశాను. మీరు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. ఫర్వాలేదు. కానీ మీ అభిప్రాయాలని కోరుతూ మిమ్మల్ని వేసిన ప్రశ్నలని మీకు అంటగట్టడంగా పెడార్ధం ఎందుకు తీశారు? సమాధానం చెప్పడం, చెప్పకపోవడం మీ యిష్టం. దాని బదులు ఈ విధంగా దూషణలకి ఎందుకు దిగారు?

  ఈ పోస్టు కింద మీరు చేసిన వ్యాఖ్యలో గానీ, ప్లస్ లోని మీ వ్యాఖ్యలో గానీ ప్రజలపై జగన్ అవినీతి ప్రభావం గురించిన ప్రస్తావనే లేకపోవడం తీవ్ర అభ్యంతరకరం. మీ వ్యాఖ్యకు నా సమాధానంలో ఆ సంగతి అడిగినప్పటికీ మీరు బదులివ్వడానికి పూనుకోలేదు. పైగా వ్యక్తిగత దూషణకి దిగారు. జగన్ అవినీతి వల్ల రాష్ట్ర ప్రజలే కాక, దేశ ప్రజలు కూడా నష్టపోయిన సంగతి ప్రస్తావించకుండా, ఆ అంశాన్ని విశ్లేషించకుండా జగన్ కేసుల గురించి ఒక అభిప్రాయానికి రాగలమా? జగన్ కేసుల విషయం కేవలం కాంగ్రెస్ కుట్రగా మాత్రమే చూస్తూ ప్రజలకి జరిగిన నష్టాన్ని చెప్పుకోకపోతే అది సోషలిజంపైనా, కార్మిక వర్గం పైనా ప్రేమ ఉన్నట్లు మీరు భావించగలరేమో గాని నాకు సాధ్యం కాదు.

  రాజ్యం కుట్ర గురించే చెప్పదలిస్తే ఎన్ని లేవు? జగన్ పై కేసులేనా? కేంద్రంలో గానీ, రాష్ట్రాల్లో గానీ రోజూ ఎన్ని జరగడం లేదు? అవన్నీ ప్రజావ్యతిరేకమైనవే. ఒక్క పార్టీలేనా? ఈ వ్యవస్ధలో ఉన్న అన్నీ రాజ్యాంగ వ్యవస్ధలూ ఏదో ఒకరూపంలో ప్రజావ్యతిరేక కుట్రలకు పాల్పడుతూనే ఉన్నాయి.

  జగన్ పై కేసులేనా కుట్ర? 2జి విచారణ కుట్ర కాదా? కేవలం రాజా ని మాత్రమే జైల్లో పెట్టడం కుట్ర కాదా? అన్నా ఉద్యమానికి ప్రతిపక్షాలు ఇస్తున్న మద్దతు కుట్ర కాదా? వై.ఎస్.ఆర్ కి కాంగ్రెస్ ఇచ్చిన సంపూర్ణ మద్దతు కుట్ర కాదా? వై.ఎస్.ఆర్ పార్టీ ఏర్పాటు కుట్ర కాదా? జగన్, కాంగ్రెస్ పార్టీల కుమ్ములాటలు కుట్ర కాదా? పాలక, ప్రతిపక్షాలు అనేక సందర్భాల్లో ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా కుమ్ముక్కవుతున్న ఉదాహరణలు కుట్ర కాదా?

  భూస్వామ్య, బూర్జువా పాలక వర్గాలు తమ మధ్య ఉన్న వైరుధ్యాల కారణంగా ఒకరిపై మరొకరు కుట్రలకు పాల్పడితే, ఆ క్రమంలో ఒకరి భాగోతం మరొకరు బయట పెట్టుకుంటే అంతిమంగా కొద్ది మేరకయినా ప్రజలకు మేలు జరుగుతుందన్నది ప్రజల ఆశ. కొద్ది మేరకయినా అవినీతి పరులకి శిక్ష పడితే అదొక అలవాటుగా, ప్రతీకారం కోసమైనా, మారకపోతుందా అన్న ఆశ. ఒకరికి శిక్ష పడినా పాలకవర్గాల భాగోతం ప్రజలు అర్ధం చేసుకుంటారనీ, అర్ధం చేసుకుని ఉద్యమాల్లోకి వస్తారనీ ఆశ. అలాంటి ఆశలు ఎంతవరకు నెరవేరుతాయన్నదీ, అసలు నెరవేరుతాయా లేదా అన్నదీ ఒక సంగతి.

  దానికి బదులు పాలకవర్గాల మధ్య వైరుధ్యాలలో ఒకరి పక్షం వహిస్తూ వారి తప్పులని నెత్తినేసుకుంటే ప్రజలకి వచ్చే ప్రయోజనం సున్న. పైగా దోపిడీ వ్యవస్ధలపైన వారికి మరింత భ్రమలు పెరగడమే జరుగుతుంది. ఒకరికి వ్యతిరేకంగా మరొకరిపైన భ్రమలు పెంచడమే జరుగుతుంది. ఈ విషయాన్ని భారత దేశ వామ పక్షాలు తమ ఆచరణలో నిర్ద్వంద్వంగా నిరూపించాయి. కాంగ్రెస్ ని గద్దె దించడానికి ప్రతిపక్ష బి.జె.పి తో జత కట్టడం, బి.జె.పి ని గద్దె దించడానికి కాంగ్రెస్ తో జత కట్టడం. ఆ పార్టీలతో జత కడుతూనే ఆ పార్టీల మోసాలపైనా, కుట్రలపైనా పుస్తకాలు రాస్తే ప్రజలేలా నమ్ముతారు? వీరి ఆచరణతో పాలక వర్గాల పై భ్రమలు పోవడం అటుంచి ‘కమ్యూనిజం’పైనే ఆసక్తి పోయేలా చేశారు. పాలక వర్గాల మధ్య వైరుధ్యాలను ఉపయోగించుకోవాలన్న మార్క్సిస్టు సూత్రీకరణని పాలక పార్టీలతో ఒకరికి వ్యతిరేకంగా మరొకరితో జత కట్టడంగా వీరు దిగజార్చారు. ఈ ఆచరణ ప్రతిఫలాన్ని భారత దేశ ప్రజలు అనుభవిస్తున్నారు. ఈ విమర్శకి సావధానంగా సమాధానం చెప్పగలిగితే ఎవరికైనా ఉపయోగం. దానికి బదులు సి.పి.ఎం పై గుడ్డి ద్వేషం అని మరోసారి వ్యాఖ్యానిస్తే అది మీ ఛాయిస్.

  సి.బి.ఐ తో సోషలిజం తేవాలని చూస్తున్నట్లు మా పై మీరు చేసిన విమర్శ ఏ కోవలోనిది? మాకు లేని అభిప్రాయాలను, కనీసం ప్రస్తావించని అభిప్రాయాలని మాకు అంటగట్టడం కాదా? నేను చర్చ కోసం మీకు వేసిన ప్రశ్నలను మీకు అంటగట్టడంగా ఆరోపిస్తూనే మేము చెప్పని విషయాలని మాకు యధేచ్చగా అంటగట్టారు. తద్వారా మీపై విమర్శల పట్ల మీకున్న అసహనాన్ని రుజువు చేసుకున్నారు. ‘కమ్యూనిజాన్ని నచ్చేలా చెప్పాలన్న’ మీ బోధనకు మీరే తూట్లు పొడిచారు.

  మీ వ్యాఖ్యలు ప్రారంభంలో చూశాక కమ్యూనిస్టు సిద్ధాంతాలను నమ్మే మరో బ్లాగర్ తెలుగు బ్లాగింగ్ లోకి ప్రవేశించినందుకు బహుధా సంతోషించాను. మీ విద్వేషపూరిత వ్యాఖ్య ఆ సంతోషాన్ని ఆవిరి చేసింది. ఫర్వాలేదు. మీ గురించి మీరే తెలియజేసినందుకు సంతోషం.

 11. గూగుల్ ప్లస్‌లో కొండలరావు గారు నా మీద కూడా వ్యక్తిగత విమర్శలు చేశారు. కొండలరావు గారు CPM కార్యకర్త అని మొదట అనుమానించినది నేను. ఎందుకంటే నేను తెలంగాణావాదం విషయంలో CPM యొక్క స్టాండ్‌ని విమర్శించినప్పుడు కొండలరావు గారు చాలా అసహనం వ్యక్తం చేశారు. అతను CPM కార్యకర్త కాకపోతే అతనికి అంత అసహనం ఎందుకు ఉంటుందా అనే సందేహం వచ్చింది. నేను బోడి గుండుకీ, మోకాలికీ ముడి పెట్టినట్టు తెలంగాణావాదానికి గతితార్కిక భౌతికవాదంతో ముడి పెడుతున్నానని ఆయన అన్నాడు.

  నేను మార్క్సిస్ట్‌నని చెప్పుకుంటున్నాను కనుక నేను సమాజంలోని అన్ని ఘటనలనీ గతితార్కిక చారిత్రక భౌతికవాద దృష్టితో చూడాలి. అలా చూడకుండా మెటాఫిజికల్ దృష్టితో చూస్తే నేను మార్క్సిస్ట్‌ని కానట్టే అవుతుంది.

  1857 భారత స్వాతంత్ర్య సంగ్రామం ఏమీ వర్గ పోరాటం కాదు. మారాఠాలూ, ముస్లింల పాలనలో ఉన్న కొన్ని సామంత రాజ్యాలు (princely states)ని బ్రిటిష్ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం వల్ల వచ్చిన తిరుగుబాటు అది. ఆ తిరుగుబాటుని కూడా వేలాది మైళ్ళ దూరంలో జెర్మనీలో ఉంటోన్న మార్క్స్, ఎంగెల్స్ సమర్థించారు. అటువంటప్పుడు ఇండియాలోనే ఉంటోన్న నేను తెలంగాణా ఉద్యమాన్ని చూసీచూడనట్టు ఉండాలా?

  ఖమ్మం, నల్లగొండ జిల్లాలలో ఉండే కమ్మ కులస్తులు చంద్రబాబుతో ఉన్న అనుబంధం కారణంగా సమైక్యవాదాన్ని సమర్థిస్తున్నారనేది ఎప్పటి నుంచో తెలిసినదే. హాలియా దగ్గర చింతగూడెంలోని కమ్మ కుటుంబం నుంచి వచ్చిన నలమోతు చక్రవర్తి సమైక్యవాదాన్ని సమర్థించినప్పుడే ఈ విషయంలో అనుమానాలు వచ్చాయి.

  ఖమ్మం జిల్లాలో కృష్ణా జిల్లాకి సరిహద్దులలో ఉండే బోనకల్లు ప్రాంతానికి చెందినవాణ్ణి అని చెప్పుకున్న కొండలరావు గారు కూడా “నేను తెలంగాణాలో ఉంటున్నా సమైక్యాంధ్రనే సమర్థిస్తున్నాను” అని అంటే అనుమానాలు రావా?

  పైగా ఆయన తాను మార్క్సిస్ట్‌నని చెప్పుకుంటూనే ఓపెన్‌గా మా ఉత్తరాంధ్ర ప్రాంతంవాళ్ళని కించపరిచే భాషని ఉపయోగించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల కంటే ప్రకాశం జిల్లాలోని నల్లమల ప్రాంతం చాలా వెనుకబడిన ప్రాంతం. శ్రీకాకుళం జిల్లా ప్రజలే ఆయనకి అడవి మనుషులలాగ కనిపిస్తే ఇక నల్లమల ప్రాంతంలోని ప్రజలు ఆయనకి పందులలాగ కనిపిస్తారా?

  మనుషులని మనుషులలాగ చూడలేనివాళ్ళు ఇక మార్క్సిజం పేరు చెప్పుకోవడం ఎందుకు? గూగుల్ ప్లస్‌లో ఈ లింక్ పబ్లిక్ మోడ్‌లో ఉంది. లాగిన్ అవ్వనివాళ్ళకి కూడా ఈ లింక్ కనిపిస్తుంది.

  https://plus.google.com/111113261980146074416/posts/iXRUwAyWmdh

 12. విశేఖర్ గారికి , నేను మీ కామెంట్ కు 3 సమాధానాలు పంపినా పబ్లిష్ చేయలేదు. మీ కామెంట్ ను ఇపుడే చూశాను. నా సమాధానం ప్లస్ లో ఉంచుతాను . మీకూ పంపుతాను.

 13. ఇంకో విషయం. ఒక అవినీతిపరుణ్ణి అరెస్ట్ చేసినంతమాత్రాన సోషలిజం వస్తుందని ఎవరూ అనలేదు. సోషలిజం రావాలంటే అవినీతి నిర్మూలనతో పాటు ఇంకా చాలా చెయ్యాలి. “జగన్‌ని అరెస్ట్ చేస్తే సోషలిజం వచ్చేస్తుందా?” అని అడిగిన వ్యక్తికి “జగన్‌ని ముఖ్యమంత్రిని చేస్తే సోషలిజం వచ్చేస్తుందా?” అని అడగాలి. జగన్ ముఖ్యమంత్రి పీఠం కావాలనుకుంటున్నాడు కాబట్టే అతను కేసుల్లో ఇరుక్కున్నాడు. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ కొండ మీద కోతిని తెచ్చి ఇచ్చినంత సులభంగా ముఖ్యమంత్రి పీఠం ఇవ్వమంటే అంత సులభంగా ఎవరు ఇచ్చేస్తారు?

 14. కొండలరావు గారూ, మళ్ళీ అదే అబద్ధం చెబుతున్నారు. మీరసలు కామెంట్ రాయకుండా పబ్లిష్ చేయలేదనడం అస్సలు బాగాలేదు. సమాధానాలు ‘పంపడం’ ఏమిటో నాకు అర్ధం కాలేదు. ఎక్కడినుండి పంపారు? నా బ్లాగ్ లో టైప్ చేస్తే కదా పబ్లిష్ అయ్యేది.

 15. విశేఖర్ గారూ !

  అబద్ధం ఆడాల్సిన ఖర్మ గానీ , ఈ విషయం లో మీకు సమాధానం చెప్పలేని స్థితిలో నేను లేను. 3 కామెంట్లు పంపిన మాట నిజం. మళ్లీ ఆ మేటర్ లొ సారాంశాన్ని పంపుతున్నాను.

  మీరు – రాం మోహన్ గారు గురించి నాకు పూర్తిగా తెలియదు. నేను జగన్ అవినీతిని ఎక్కడ సమర్ధించాను చెప్పండి? నా కామెంట్ లో మీరు పబ్లిష్ చేసినదానిని పరిశీలించి చెప్పాలి మీరు.

  దానికి సమాధానం వదిలేసి నేను సీ.పీ.ఎం అని ఏదో అద్భుత విషయాన్ని కనిపెట్టినట్లు సీ.పీ.ఎం వాళ్లు ఒకరిని వ్యతిరేకించడానికి ఇంకొకరిని సమర్ధించడానికి చూస్తారు. కొండలరావు గారు దానికి అతీతుడేమి కాదని రాం మోహన్ గారు అన్నారు కదా? నా కామెంట్ లో దొంగలందరినీ శిక్షించాలన్నది కనబడలేదా మీకు? కావాలనే కళ్లు మూతలు పడతాయా? నేను ఎవడ్ని వ్యతిరెకించడానికి ఎవడిని సమర్ధించాను.

  ఓ పత్రికకు ప్రకటనలు ఆపడాన్ని దుర్మార్గమైన చర్యగా చెపుతున్నాను.

  ప్రవీణ్ గురించి తెలుసు ప్రవీణ్ ఎంత అసత్యమైనా చెప్పగలడు . తన వాదన కోసం లేని పోని అభూత కల్పనలు ఎన్నైనా చెప్పగలడు. నేను ఏ ప్రాంతం వారిని నిందించలేదు. ఎక్కడ ఆధారం చూపుతారు?

  వీటికి డొంక తిరుగుడుగా కాక మీరు సమాధానాలు చెపితే నేను చర్చకు సిద్ధం. వీటికి సమాధానాలు లేకుండా మరేదో చెపుతానంటే మీ బ్లాగు మీ ఇష్టం వచ్చినట్లు వ్రాసుకోండి? అయ్యా ప్రవీణ్ మహాశయా? మీరేమీ శాస్త్రవేత్తలా కనిపెట్టి కష్టపడాల్సిన అవసరం లేదు. నేను సీ.పీ.ఎం ను సమర్ధిస్తాను. రాష్ట్రం సమైఖ్యం గా ఉండాలనే కోరుకుంటాను. ఇది గతం లోనే చెప్పాను. దాచుకోవాల్సిన ఖర్మ కూడా లేదు. అనుమానరోగమూ అవసరం లేదు. శ్రీకాకుళం లో ఉన్నోడు తెలంగాణాను సమర్ధించ వచ్చు – కుల గజ్జిని రెచ్చకొట్టవచ్చు వేరెవరూ ఏ అభిప్రాయమూ కలిగి ఉండకూడదా?

 16. నేను మీపై వ్యక్తిగత విమర్శలు చెయ్యలేదు. నేను CPMని విమర్శిస్తే మీరు గుమ్మడికాయ దొంగలాగ భుజాలు తడుముకున్నారు కాబట్టే నేను మిమ్మల్ని CPM కార్యకర్తగా అనుమానించాల్సి వచ్చింది. తెలకపల్లి రవి గారు ప్రజాశక్తి ఎడిటోరియల్ బోర్డ్‌లో ఉన్నారనే విషయం ఆయనే స్వయంగా చెప్పుకున్నారు. తెలంగాణా విషయంలో CPM యొక్క స్టాండే ఆయనది. CPMని విమర్శించేటప్పుడు రవి గారిని కూడా కలిపి విమర్శించాను. నేను CPMనీ, రవి గారినీ టార్గెట్ చేసి వ్రాస్తే మీరే గుమ్మడికాయ దొంగలాగ భుజాలు తడుముకున్నారు. అంతే కానీ నేనేమీ మిమ్మల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చెయ్యలేదు.

 17. కొండల్రావు గారు

  మీకా ఖర్మ ఉందో లేదో నాకు తెలీదు. కాని కామెంట్లు రాసినా పబ్లిష్ చేయలేదని మీరు ఆరోపించారు. ఆ ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉందని గమనించగలరు.

  “3 కామెంట్లు పంపిన మాట నిజం.”

  మళ్లీ అడుగుతున్నాను. ఈ ‘పంపడం’ ఏమిటి? ఎక్కడినుండి ఎక్కడికి పంపారు? నా బ్లాగ్ లో టైప్ చేయలేదా మీరు? నా బ్లాగ్ లో టైప్ చేయడాన్నే పంపడం గా చెబుతున్నారా? అలా టైప్ చేసినవన్నీ నేను ప్రచురిస్తూనే ఉన్నాను. మీరు రాసినవి ఎలా మిస్ అవుతాయి?

  జగన్ అవినితి, సి.పి.ఎం రాజకీయాలు, తెలంగాణా ఉద్యమం, వీటి గురించి తప్పనిసరిగా చర్చిద్దాం. మీకు ఆసక్తి ఉంటే. దానికంటే ముందు నా పైన చేసిన వ్యక్తిగత ఆరోపణలకి సమాధానం చెప్పండి. రామ్మోహన్ గారు కూడా తన వ్యాఖ్యలో మిమ్మల్ని వ్యక్తిగతంగా దూషించలేదు. మీ అభిప్రాయాల్ని బట్టి అయి ఉండవచ్చని అన్నారు. ఆయన అంచనా తప్పేమీ కాలేదు. అందులో దూషణలు లేవు. మీ అభిప్రాయంపైన విమర్శ ఉంది. ఆ ఒక్క విమర్శ కారణంగా నన్ను నా బ్లాగ్ సందర్శకులను వ్యక్తిగతంగా విమర్శించడానికి కారణమా? అదే కారణమైతే అది సమంజసమేనా?

  మీరు నాతో పాటు దూషించినవారిలో ప్రవీణ్ కూడా ఉన్నారు. అందువలన ఆయన వ్యాఖ్యలని ఈ పోస్టు కింద ప్రచురించవలసి వస్తోంది.

  ప్రవీణ్ మీకొక విన్నపం. ఈ పోస్ట్ లో గానీ కొండల్రావు గారి దూషణలో గాని తెలంగాణ విషయం లేదు. మీరు చెప్పిన ఇతర అంశాలు లేవు. కనుక ఇప్పటికి ఆ అంశాలను పక్కనబెడదాం. జగన్ అవినీతి, కొండల్రావు గారి దూషణలు ప్రస్తుతం చర్చలో ఉన్న అంశాలు. వాటి వరకు పరిమితం అవుతూ వ్యాఖ్యలు రాయండి. అలాగే ఈ అంశం ముగిసే వరకూ ఇతర అంశాల జోలికి పోకండి.

  కొండల్రావు గారు, ఈ అంశం ముగిసేవరకూ దయచేసి నా వ్యాఖ్యలపైన కేంద్రీకరించండి. ఇతర అంశాలు కలవడం వల్ల మీరు ఎవరిని ఉద్దేశిస్తున్నారో అర్ధం కావడం లేదు.

 18. నేను గూగుల్ ప్లస్‌లో సమైక్యవాదంపై విమర్శలు వ్రాసేటప్పుడు అవి CPM & తెలకపల్లి రవి లాంటి సమైక్యవాద మేతావులని ఉద్దేశించిన విమర్శలు అని ఆ పోస్ట్‌లలోనే చెప్పాను. అంతే కానీ అవి కొండలరావు గారిని ఉద్దేశించిన విమర్శలు అని నేను అక్కడ చెప్పలేదు. తెలకపల్లి రవి గారు సీనియర్ పాత్రికేయుడు కాబట్టి సమైక్యవాద పాత్రికేయులపై విమర్శలు వ్రాసేటప్పుడు ఆయన పేరు compulsoryగా వ్రాయాల్సి వచ్చింది. ఇతరుల పేర్లు అక్కడ అనవసరం కాబట్టి నేను వ్రాయలేదు. కొండలరావు గారు కూడా గుమ్మడికాయ దొంగలాగ భుజాలు తడుముకుంటే ఆయనది కూడా అదే వర్గం అని అనుమానం వస్తుంది. గూగుల్ ప్లస్‌లో ఆయన ప్రొఫైల్‌ని బ్లాక్ చేసే ముందు ఎందుకు బ్లాక్ చేస్తున్నానో చెప్పడానికి ఆయన పేరుని డైరెక్ట్‌గా ఉపయోగించి పోస్ట్‌లు వ్రాయాల్సి వచ్చింది.

 19. ప్రవీణ్ ఈ లింక్ చదివాను. కొంత స్పష్టత ఉందని అనిపించింది. మీరు రాస్తున్న విషయాన్ని పేరాలుగా విడగొడితే మరికొంత స్పష్టత పెరిగే అవకాశం ఉంటుంది.

  వ్యక్తుల పేర్లు రాయడం ఎందుకో మీరు మానలేకపోతున్నారు. మా ఫ్రెండ్ అని చెబుతూ రాసి ఉండవచ్చు గదా. కుటుంబ ఐడేంటిటీ గురించి చెప్పవద్దని కోరినా ఆమె పేరు రాయడం బాలేదు. ఆమె తల్లిదండ్రులు ఫలానా అని చెప్పినా కుటుంబం ఐడెంటిటీ చెప్పినట్లే కదా. కుటుంబ ఐడేంటిటీలో పేరు భాగం కాదని మీరు భావించినట్లుంది. వారు కోరినా కోరకపోయినా జనరల్ అంశాలు చర్చించేటపుడు వ్యక్తుల పేర్లు రాయకపోవడమే మంచిది. మర్చిపోకుండా ఈ సూత్రాన్ని పాటించగలరు.

 20. విశేఖర్ గారూ !
  1) పంపడం అంటే తెలియకనే అడుగుతున్నారా ? మీ బ్లాగులోనే ఈ కామెంట్ల లాగానే అవీ పంపాను. లేదా మీకు అర్ధమయ్యే భాషే అదే అంటే టైప్ చేసి పంపాను. మిస్ కాకుండా నేను విమర్శించడానికి అక్కడ సమాధానం చెప్పలేని ప్రశ్నలు కావు కదా? నేను మీరడిగిన ప్రజల ప్రయోజనాలకు సంబంధించిన బాధ్యత గురించి సరైన ప్రశ్నగా భావించే దానికి కామెంట్ పంపాను.( టైప్ చేసే ) . కానీ అదీ పబ్లిష్ కాలేదు. ఎందుకో తెలియదు.
  2) మీరు సాక్షి కి ప్రభుత్వం ప్రకటనలు నిలిపివేసిన పోస్టు మీ బ్లాగులో పెట్టారు. దానికి నేను నా అభిప్రాయం కామెంట్ పెట్టాను. అందులొ నేను జగన్ అవినీతిని సమర్ధించినట్లు మీకు – రాం మోహన్ గారికి అనిపించడం సమంజసమా? ఇప్పుడు మళ్లీ చూసి చెప్పినా నాకు అభ్యంతరం లేదు .
  3)ప్రభుత్వ చర్యను సమర్ధించాలా? విమర్శించాలా? అనేది మీరు – రాం మోహన్ గారు అభిప్రాయపడినట్లు నేనూ అభిప్రాయ పడాల్సిన అవసరం లేదు కదా ?
  4) దానికి సీ.పీ.ఎం వాళ్లను విమర్శించడమెందుకు? సీ.పీ.ఎం కార్యకర్తలయితే ఒకరిని సమర్ధించడానికి ఇంకొకరిని వ్యతిరేకిస్తారంటూ రాం మోహన్ గారు విమర్శించడం దారుణమైనది . అప్రస్తుతమైనది కూడా. దానినేనా మీరు ఇపుడు ఋజువయింది అంటున్నారు ?
  5) నా కామెంట్ లు – మీ ప్రశ్నలకు సమాధానాలను పబ్లిష్ చేయకుండా ప్రవీణ్ కామెంట్లు + రాం మోహన్ గారు సీ.పీ.ఎం కార్యకర్తనంటూ అనుమానపడుతున్నాను – వాళ్లు అంతే అనడాన్ని బట్టే నేను నా ప్లస్ లో వ్రాశాను.
  6) ప్రజా ప్రయోజనాలకు సంబంధించి మీ పోస్టు పరిధి ప్రభుత్వం ప్రకటనలు నిలిపివేయడం అన్నప్పుడు అంతమేరకే చర్చ పరిధి ఉంటుంది తప్ప మీ కోణం లో చూడడం సరయినది కాదు. ప్రజా ప్రయోజనాలన్నప్పుడు రాజశేఖరరెడ్డి బ్రతికున్నప్పటినుండి మొత్తుకుంటూనే ఉన్నాము. ప్రకృతివనరులను దోచుకోవడం దారుణమని. ఇక్కడ మళ్లీ మొత్తుకుంటేనే ప్రజా ప్రయోజనాలను పట్టించుకున్నట్లా?

 21. ఆమె తన కుటుంబ సభ్యుల పేర్లు చెప్పవద్దని మాత్రమే కోరింది. 2005లో IRTR అనే ఇంగ్లిష్ వెబ్‌సైట్ ఉండేది. ఆ వెబ్‌సైట్‌లోవాళ్ళకి ఆమె పేరు తెలిసినదే. నేనేమీ కొత్తగా బయటపెట్టిందేమీ లేదు.

 22. ప్రవీణ్ గారూ ! మీ కంటే గుమ్మడి కాయల దొంగ ప్లస్ లో మరొకరు ఉండరు. నేను సీ.పీ.ఎం అని గతం లోనే అనేక సార్లు స్పష్టం చేసినా మీ వాదన మీదే అయితే నేను చేయగలిగేది ఏమీ లేదు.తెలంగాణా ఉద్యమాన్ని తెలకపల్లి రవి గారు కించపరిచారని రాశావు. ఎక్కడ అని అడిగితే ఇప్పటికి సమాధానం చెప్పలేదు. సీ.పీ.ఎం ను మీరు విమర్శించుకుంటూ పోతుంటే అవతలి వాళ్లు చోద్యం చూస్తూ ఉండాల్నా? పోనీ నేను మీ ప్రాంతం వారిని తూలనాడినట్లు ఎక్కడ చూపిస్తారు? ఎన్ని రోజులలో చూపిస్తారు? మీరు మీరు పొగుడుకుంటే నాకు అభ్యంతరం లేదు. అవతలి వారికి లేని అభిప్రాయాలు అంటకట్టే హక్కు ఎవరికీ ఉండదు. అది మంచిది కాదు.

 23. రాం మోహన్ గారు ఈ circumstancesలో అలా అనుమానించడం సహజమే. 1994లో కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా తెలుగు దేశానికీ, 2004లో తెలుగు దేశానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌కీ, 2009లో కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా మళ్ళీ తెలుగు దేశానికీ ఇలా ఒకరికి వ్యతిరేకంగా ఇంకొకరికి సపోర్ట్ ఇచ్చిన చరిత్ర CPMవాళ్ళకి ఉంది. కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా అంత కంటే అవినీతి పార్తీ అయిన వైకాపాకి సపోర్ట్ ఇవ్వడం వల్ల ఆ అనుమానం వచ్చి ఉంటుంది.

 24. కొండల్రావు గారూ, మీ ప్రశ్నలకి సమాధానం చెబుతాను. దాని కంటె ముందు నాకొక విషయం చెప్పండి.

  రామ్మోహన్ గారు మీరు సి.పి.ఎం కార్యకర్త అని అనుమానించారు. ఆయన ఎందుకలా అనుమానించారో నాకు తెలియదు. మీ ఇద్దరి మధ్య గతంలో ఏమి చర్చలు జరిగాయో నాకు తెలియదు గనక ఆ విషయం పై నేను చెప్పలేను. ఆ సంగతి రామ్మోన్ గారు చెప్పడం సముచితం.

  నా పైన మీరు చేసిన వ్యక్తిగత దూషణలకి పైన మీరు చెప్పిన ఐదవ అంశం సమాధానమా?

  మీపైన రామ్మోన్ గారు సి.పి.ఎం కార్యకర్త అంటూ వ్యక్తపరిచిన అనుమానం నాపై వ్యక్తిగత దూషణలకి ఎలా సమర్ధన అవుతుంది? ఆయన అనుమానానికి నాపై దూషణలకీ ఏమిటి సంబంధం?

  పోనీ రామ్మోన్ గారికి మీరు సమాధానం ఇవ్వదలిచారనుకుందాం. ఆ సమాధానంలో వ్యక్తిగతంగా దూషించాల్సిన అవసరం ఏమిటి? ఆయనతో పాటు నన్నూ, ప్రవీణ్ నీ ఎందుకు కలిపారు? నా బ్లాగ్ ని ఈనాడు మోసి ఉంటారని అనుమానించడం సందర్బోచితమా? అసలా అనుమానం ఏమిటి? నా వ్యక్తిగత ఇంటెగ్రిటీ ని ఎందుకు కించపరచారు? మేధావులనీ, పైత్యం అనీ, రాక్షసానందం అనీ సి.బి.ఐ తో సోషలిజం అనీ, నిందలకూ ఎగతాళికీ ఎందుకు దిగారు? రామ్మోహన్ గారి అనుమానం వల్ల మీరింతగా దారి తప్పి దూషించాలా?

 25. “మీరు మీరు పొగుడుకుంటే నాకు అభ్యంతరం లేదు.”

  కొండల్రావు గారు, దయచేసి సంయమనం పాటించండి. ఇలాంటివి రాకుండా చూడండి.

 26. … … … సీకాకు, సీకాకులం అనే పదాలు మీరు కూడా ఉపయోగించి ఇంకా ఏమీ తెలియనట్టు నటించడం ఎందుకు? ఆ పదాలు ఉపయోగించడం పై నేను అభ్యంతరం చెపితే నన్నే గుమ్మడికాయ దొంగలా భుజాలు తడుముకోవద్దు అని అంటూ గూగుల్ ప్లస్‌లో సలహాలు ఇచ్చారు.

 27. దొమ్మరి కులస్తులని కించపరిచే ‘దొమ్మరి గుడిసెలు‌’ అనే సామెత ఉపయోగించినప్పుడు కూడా నేను అభ్యంతరం చెప్పాను, నేను దొమ్మరి కులస్తుణ్ణి కాకపోయినా. ‘కోస్తా ఆంధ్రలో వ్యభిచారం చేసేవాళ్ళలో ఎక్కువ మంది భోగం కులస్తులే కానీ దొమ్మరి కులస్తులు కాదు, వాళ్ళు కూడా వేలాది సంవత్సరాల నుంచి ఉన్న దురాచారం నుంచి బయటకి రాలేక ఆ వృత్తిలో ఉంటున్నారు‌’ అని కూడా ఆ సామెత ఉపయోగించినవాళ్ళకి చెప్పేవాణ్ణి. ఏ కులంవాళ్ళని కించపరిచినా, ఏ ప్రాంతంవాళ్ళని కించపరిచినా నాకు అభ్యంతరం ఉంటుంది. మా ప్రాంతంవాళ్ళని కించపరిచే పదజాలం వాడితే నేను అభ్యంతరం చెప్పకుండా ఉంటానా?

 28. విశేఖర్ గారూ !

  మీరు అడగడం నేను చెప్పడం అయితే మీ అభిప్రాయాలు మీరు రాసుకోండి. నన్ను సమ్యమనం పాటించాలి అంటూ ప్రవీణ్ చెప్పేవి పబ్లిష్ చేయడం సరయినది కాదు.

  సీకాకుళం అని వాడింది భరద్వాజ్ గారు . నేను కాదు. ఆధారం చూపితే మాట్లాడదాము. సీ.పీ.ఎం ఏది చెప్పినా మీకు అనుమానమే వస్తుంది ప్రవీణ్.

  <>

  ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేస్తేనే మంచిది కాదు. ఒకడికి వ్యతిరేకంగా ఇంకొకడికి అని ఎవడికివాడు అనుకోవడం స్వీయమానసిక ధోరణి అవుతుంది. అసలు సాక్షి కి ప్రభుత్వ ప్రకటనలు అంశం వదిలేసి ఇలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడాన్ని చేసుకునే వారితో చర్చించడం వృధా. కేంద్రం లో పరిస్తితిని బట్టి విధానాలను బట్టి ఎన్నికల ఎత్తుగడలు అనుసరిస్తుంది సీ.పీ.ఎం . దానికి ప్రవీణ్ నో , మరొకరినో సంప్రదించి వారి ఆలోచనలమేరకు ఎన్నికల పొత్తులు తీసుకోవలసిన అవసరం సీ.పీ.ఎం కు లేదని మనవి. ఎన్నికలలో పాల్గొనడమే తప్పుగా భావించేవారికి ఎన్నికల ఎత్తుగడలు తెలుస్తాయని అనుకోను. సీ.పీ.ఎం ఎదుగుదలతో పాటు – దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆ పార్టీ విధానాలు ఉంటాయి. కే.సీ.ఆర్ తో కూడా పొత్తు పెట్టుకుంది సీ.పీ.ఎం . ఎన్నికలలో పాల్గొనాలనే ఎత్తుగడ తీసుకున్నాక పొత్తులు ఉంటాయి. అసలు ఎన్నికలలో పల్గొనొద్దు అనుకుంటే పొత్తులు ఉండవు. మీ వుద్దేశ్యం ఏమిటి ? ఎపుడు ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవాలా? జగన్ తో ఇంకా సీ.పీ.ఎం పొత్తు పెట్టుకోలేదు. పెట్టుకున్నా అది విధానాల ఆధారం గానే ఉంటుంది. ఒక పార్టీని ఒక వ్యక్తి ఆధారం గా, కులం ఆధారం గా చూడడం అంటే మూర్ఖత్వం అవుతుంది. సమర్ధించడం చేస్తానంటే నేను చెప్పేది ఏమీ లేదు.

 29. విశేఖర్ గారూ !
  మీరు అడగడం నేను చెప్పడం అయితే మీ అభిప్రాయాలు మీరు రాసుకోండి. నన్ను సమ్యమనం పాటించాలి అంటూ ప్రవీణ్ చెప్పేవి పబ్లిష్ చేయడం సరయినది కాదు. సీకాకుళం అని వాడింది భరద్వాజ్ గారు . నేను కాదు. ఆధారం చూపితే మాట్లాడదాము. సీ.పీ.ఎం ఏది చెప్పినా మీకు అనుమానమే వస్తుంది ప్రవీణ్.
  <>
  ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేస్తేనే మంచిది కాదు. ఒకడికి వ్యతిరేకంగా ఇంకొకడికి అని ఎవడికివాడు అనుకోవడం స్వీయమానసిక ధోరణి అవుతుంది. అసలు సాక్షి కి ప్రభుత్వ ప్రకటనలు అంశం వదిలేసి ఇలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడాన్ని చేసుకునే వారితో చర్చించడం వృధా. కేంద్రం లో పరిస్తితిని బట్టి విధానాలను బట్టి ఎన్నికల ఎత్తుగడలు అనుసరిస్తుంది సీ.పీ.ఎం . దానికి ప్రవీణ్ నో , మరొకరినో సంప్రదించి వారి ఆలోచనలమేరకు ఎన్నికల పొత్తులు తీసుకోవలసిన అవసరం సీ.పీ.ఎం కు లేదని మనవి. ఎన్నికలలో పాల్గొనడమే తప్పుగా భావించేవారికి ఎన్నికల ఎత్తుగడలు తెలుస్తాయని అనుకోను. సీ.పీ.ఎం ఎదుగుదలతో పాటు – దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆ పార్టీ విధానాలు ఉంటాయి. కే.సీ.ఆర్ తో కూడా పొత్తు పెట్టుకుంది సీ.పీ.ఎం . ఎన్నికలలో పాల్గొనాలనే ఎత్తుగడ తీసుకున్నాక పొత్తులు ఉంటాయి. అసలు ఎన్నికలలో పల్గొనొద్దు అనుకుంటే పొత్తులు ఉండవు. మీ వుద్దేశ్యం ఏమిటి ? ఎపుడు ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవాలా? జగన్ తో ఇంకా సీ.పీ.ఎం పొత్తు పెట్టుకోలేదు. పెట్టుకున్నా అది విధానాల ఆధారం గానే ఉంటుంది. ఒక పార్టీని ఒక వ్యక్తి ఆధారం గా, కులం ఆధారం గా చూడడం అంటే మూర్ఖత్వం అవుతుంది.
  నా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నన్ను ప్రశ్నిస్తే ఉపయోగం లేదు. నా ప్రశ్నలకు జవాబు చెప్పాక నేను వ్రాసినదాని మీద వివరణ ఇస్తాను.

 30. కొండల్రావు గారూ,

  నాపైన దూషణలకి సంబంధించి నేను పదే పదే అడుగుతున్న ఎందుకు దాటవేస్తున్నారు? నన్ను దూషించడం కరెక్టే అనుకుంటున్నారా? కనీసం అదయినా చెప్పండి.

 31. మీరు నేను అడిగిన దానికి చెప్పకుండా అదే ఎందుకు అడుగుతున్నారు ? జగన్ అవినీతిని నేను సమర్ధించానా? నేను దానికి అతీతుడిని కానా? ఎవరిని ఎవరు దూషించినా తప్పే అవుతుంది. నేను మిమ్ములను ప్రత్యేకం గా దూషించలేదు. వ్యంగ్యంగా నా వ్యాఖ్యలు వ్రాశాను. ఈనాడు లో వార్తకు సంబంధించి నా అనుమానం వ్యక్తం చేశాను. అది అనుమానమే. నా కామెంట్లు పబ్లిష్ చేయకుండా, సంబంధం లేని మేటర్ ను నా పై కామెంట్లు పబ్లిష్ చేస్తే మీకు బాధ్యత లేదా? మీరు నేను కామెంట్లు పంపలేదంటున్నారు. నేను పంపానంటున్నాను. ఇప్పుడు కూడా ప్రవీణ్ కులం పేరుతో సీ.పీ.ఎం ను విమర్శిస్తుంటే మీరు అతని వాదనను సమర్ధిస్తున్నారు. ఓ.కే . మీ బ్లాగు మీ ఇష్టం . మీరు నా కామెంట్లు అందక పబ్లిష్ చేయక పోతే నా వ్యాఖ్యలు ఉపసమ్హరించుకుంటున్నాను.

 32. విశేఖర్ గారు, నాది ఒక సందేహం. మీరు ఇంతకుముందు ఎప్పుడైనా ‘… …’ అనే వ్యక్తి యొక్క వ్యాఖ్యలని స్పామ్ బాక్స్‌లోకి తోశారా? అలా స్పామ్ మార్కింగ్ చేస్తే కొండలరావు గారి వ్యాఖ్యలు కూడా స్పామ్ బాక్స్‌లోకి వెళ్ళిపోతాయి. ఎందుకంటే వాళ్ళిద్దరూ ‘… …’. గూగుల్ ప్లస్‌లో నేను ‘……’ ఐడిని బ్లాక్ చేసినప్పుడు అతను ‘… ….’ అకౌంట్‌తో లాగిన్ అయ్యి, చాట్‌లో కనెక్ట్ అయ్యి తనని బ్లాక్ లిస్ట్ నుంచి తీసెయ్యాలని అంటూ ‘……’ నాకు రిక్వెస్ట్ చేశాడు.

 33. కొండల్రావు గారూ, మీరు

  నన్ను ప్రత్యేకంగా దూషించలేదనడం నిజం కాదు. ప్రవీణ్, రామ్మోహన్, విశేఖర్ అని మీరు ముగ్గురు పేర్లు ప్రస్తావించారు. వింత నాటకం, పైత్యం, రాక్షసానందం అన్నారు. కంపెనీ, బేచ్ అన్నారు. ఇవన్నీ దూషణలు కావా? కేవలం వ్యంగ్యం అని భావించమంటున్నారా?

  మీరు పెద్ద మనుషులు. కమ్యూనిస్టు సిద్ధాంతం గురించి చెబుతున్నారు. ఒక రాజకీయ పార్టీ తరపున మద్దతుగా నిలిచారు. అలాంటి వ్యక్తి దూషించారు అని చెప్పడానికి బూతులు వాడాలా? ఆయా వ్యక్తుల పెద్దరికాన్ని బట్టి, ఆలోచనా ధోరణిని బట్టి, చెప్పే సిద్ధాంతాలని బట్టి ఆ వ్యక్తి దూషిస్తున్నారా? వ్యంగ్యం రాస్తున్నారా అనేది నిర్ణయం అవుతుంది. మన ఇద్దరికి పెద్ద గా పరిచయం లేదు. ఉన్న పరిచయం కూడా సానుకూలమే తప్ప ప్రతికూలం కాదు. ఆ పరిస్ధితుల్లో మీ కామెంట్స్ పబ్లిష్ చెయ్యలేదనిపిస్తే గతంలో ప్లస్ లో చెప్పినట్లు చెప్పవచ్చు. అది చేయకుండా మీరు పట్టలేని కోపంతో దూషణలకి దిగారు. శత్రువుకి కూడా చెప్పగలిగే పద్ధతులు కొన్ని ఉంటాయంటూ మీరు ప్లస్ లో చేసిన మీ ప్రజాస్వామిక అభిప్రాయాలకి మీరే భిన్నంగా వ్యవహరించారు. నన్ను తీవ్రంగా బాధించినది ఈ అంశమే.

  ఇక రామ్మోహన్ గారి వ్యాఖ్య నాకెందుకు ఆపాదిస్తున్నారు? నేను పోస్ట్ లో రాసిన అంశాలు గానీ, మీ వ్యాఖ్యకి నేనిచ్చిన సమాధానమ్ గానీ మీరు జగన్ అవినీతిని సమర్ధిస్తున్నట్లు నేను రాయలేదు కదా. రామ్మోన్ గారి అభిప్రాయంతో నన్నూ కలిపి ముగ్గుర్నీ కలిపి కంపెనీగా బేచ్ గా అసభ్యంగా చిత్రీకరించడానికి మీరు పూనుకోవడం సరి కాదు.

  మీరు రాసిన మొదటి వ్యాఖ్యని నేను ప్రచురించాను. ఈ రోజు రాసినవి కూడా ప్రచురించాను. మీరు రాసానంటున్న మూడు వ్యాఖ్యలు ప్రచురించలెదని ఇప్పటికీ భావిస్తున్నారా? నా పైన వ్యంగ్యంగా రాస్తున్న వారి వ్యాఖ్యలను కూడా సందర్భాన్ని బట్టి ప్రచురిస్తున్నాను. అలాంటిది ఆరోగ్యకరమైన చర్చకు అవకాశం ఉంటుందని భావిస్తున్న మీ వ్యాఖ్యలని ప్రచురించకూడదన్న నిబంధన నాకేమీ లేదు. నా బ్లాగ్ లో వ్యాఖ్యలు పోస్ట్ చేయడం కష్టంగా ఉందన్న ఫిర్యాదులు మిత్రులు చేయగా చూశాను. బూతులు రాసి ప్రచురించడం లేదన్న ఫిర్యాదులు చూసాను. బూతుల్ని నేనే ప్రచురించలేదు గనక వారి ఫిర్యాదుకి ఒక అర్దం ఉంది. నాకు తెలియని సాఫ్ట్ వేర్ సమస్యల్ని నేను పరిష్కరించలేదు గనక వర్డ్ ప్రెస్ వారికి చెప్పడం తప్ప నేనేమీ చేయలేకపోయాను. కానీ కామెంట్ పోస్ట్ చేసినా పబ్లిష్ చేయలేదన్నది మీరొక్కరే.

  ఈనాడు కవరేజ్ కి సంబంధీంచి మీ వద్ద ఆధారం ఉంటె అది చూపి అనుమానం వ్యక్తం చెయ్యవచ్చు. అదేమీ లేకుండా ఈనాడు చందాదారుడ్ని కూడా కాని నేను ఈనాడు ని మేనేజ్ చేసేనని అనుమానించడం, అనుమానమే కదా అని దాట వేయడం సమంజసమే అని భావిస్తున్నారా? సమంజసమే అంటె నేనిక చెప్పేదేమీ లేదు. అది మీ విజ్ఞతకి వదిలేస్తున్నా.

  పై వ్యాఖ్యలో కూడా ప్రవీణ్ కులం పేరుతో సి.పి.ఎం ను విమర్శిస్తె నేను సమర్ధిస్తున్నానని రాసారు? ఎలా అనుకుంటారండీ ఇవన్నీ? ఆయన కుల విమర్శని నేను సమర్ధించానా? ప్రవీణ్, రామ్మోహన్ లని నాతో కలిపి కంపెనీ గా మీరు భావించడం వల్ల మీకీ అనుమానాలు వస్తున్నాయా? నా బ్లాగ్ లో మీరెలా వ్యాఖ్యలు రాస్తున్నారో వారూ అలానే రాస్తున్నారు. కొన్ని సార్లు మీరు నాకు మద్దతుగా నిలిచారు. ఇక మీరు కూడా నాతో కలిపి కంపెనీ సభ్యులని ఇతరులు అనుకోవచ్చా?

  రామ్మోహన్ గారి వ్యాఖ్యలో మీపై దూషణ లేదు. మీ అభిప్రాయాల్ని బట్టి మిమ్మల్ని సి.పి.ఎం పార్టీగా అనుమానిస్తే (అంచనా వేస్తె) అది తప్పు కాదు. సి.పి.ఎం ఫలానా రాజకీయాలు చేస్తుంది గనక ఆ రాజకీయాల ప్రకారం మీరు కూడా ఒక అభిప్రాయాన్ని చెప్పారని ఆయన తెలియజేసారు. అందులో విమర్శ తప్ప వ్యంగ్యం లేదు. దూషణ లేదు. కాని ఆ విమర్శని తట్టుకోలేకపోవడం వల్లనే మీకది కానిది గా కనిపించి ఆయనతో నన్నూ కలిపి దూషించడానికి పూనుకున్నారు. మీరు తరచుగా చెప్పే ‘నచ్చ జెప్పే విధానం’ ఇక్కడ ఎందుకు పని చేయలేదు. శత్రువుకి కూడా నచ్చజెప్పే పద్ధతులు ఉంటాయని చెప్పిన మీరు సి.పి.ఎం పై విమర్శని ఎందుకు భరించలేకపోయారు? సి.పి.ఎం రాజకీయాలని రామ్మోహన్ గారికీ, ప్రవీణ్ గారికీ నచ్చజెప్పి ఒప్పించవచ్చనీ, ఎకా ఎకిన కంపెనీగా ముద్ర వేయరాదనీ మీరెందుకు భావించలేకపోయారు?

  ‘నా కామెంట్లు అందక పబ్లిష్ చేయకపోతే నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని’ చెబుతున్నారే తప్ప మీ దూషణలు సమంజసం కాదని మీరు చెప్పలేకపోతున్నారు. అయినా సరే. నా వైపు నుండి ఈ చర్చని ఇంతటితో ముగిస్తాను. ఇప్పటికీ మీరు లేవనెత్తిన అంశాలపై నాతో చర్చించాలని మీరు భావిస్తే అంశాల వారిగా చర్చకు సిద్ధం.

 34. ప్రవీణ్ మీరు చెప్పిన పేరుతో ఇంతవరకూ నా బ్లాగ్ లో వ్యాఖ్య చెయ్యలేదు. కొండల్రావు గారి వ్యాఖ్య స్పాం లోకి వెళ్లినా అది అక్కడే ఉంటుంది గనక నేను చూడగలను.

  ఇక్కడికి రాని వ్యక్తి ఐ.డి ని బహిరంగం చేసేది గా ఉన్నందున మీ వ్యాఖ్యలో కొన్ని చోట్ల ఎడిట్ చేసాను. గమనించగలరు. రెండో వ్యాఖ్య కూడా అందుకే ప్రచురించడం లేదు.

 35. నేను ఇంతకు ముందు మిసన్ తెలంగాణా బ్లాగ్‌లో వ్యాఖ్యలు వ్రాసినప్పుడు అవి అలాగే స్పామ్‌లోకి వెళ్ళాయి. నాది డైనమిక్ ఐపి. మిసన్ తెలంగాణా వెబ్‌సైట్ నిర్వాహకుడు తెలియక డైనమిక్ ఐపిని స్పామ్ మార్క్ చేశాడు.

 36. ఆ ఐపి అడ్రెస్ వైజాగ్ BSNL బ్యాక్‌బోన్‌కి చెందినది. ఆ ఐపి అడ్రెస్‌ని విశాఖపట్నంలోనూ వాడుతారు, విజయనగరంలోనూ వాడుతారు, పార్వతీపురంలోనూ వాడుతారు, శ్రీకాకుళంలోనూ వాడుతారు, పలాసలోనూ వాడుతారు. విశాఖపట్నంకి చెందిన వ్యక్తి ఒక వెబ్‌సైట్‌లో అఫెన్సివ్ వ్యాఖ్య వ్రాసిన తరువాత ఆ ఐపి అడ్రెస్ బ్లాక్ చెయ్యబడి, తరువాత అది ఇంకో కంప్యూటర్‌కి అసైన్ అయ్యి ఉండొచ్చు. డైనమిక్ ఐపి అడ్రెస్‌లు ఇలాగే మారుతాయి. ఆ ఐపి అడ్రెస్ నా కంప్యూటర్‌లోకి అలాగే వచ్చి ఉండొచ్చు.

 37. విశేఖర్ గారూ !
  మిమ్ములను మాత్రమే దృష్టిలో పెట్టుకుని దూషించలేదు. అయినా నేను అలా తొందరపడకుండా ఉంటే బాగుండేది. మిమ్ములను బాధించినందుకు సారీ. ఒకటి మాత్రం నిజం . మీరు ఇప్పుడు ఇచ్చిన వివరణలో కూడా రామ్మోహన్ గారు నన్ను దూషించలేదు అని సరిపెట్టడం బాగాలేదు. సీ.పీ.ఎం కార్యకర్త అనుకుంటున్నాను . ఆయన అతీతుడేమీ కాదు అని అసందర్భంగా అవసరం లేకుండా ఆయన కామెంట్ పెట్టడం నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. సాక్షికి ప్రభుత్వం ప్రకటనలు ఆపడం దారుణం . అది వ్యక్తిగత కక్షతో ప్రభుత్వం చేస్తున్న పని కనుక మీ అభిప్రాయం తో నేను ఏకీభ్వించను. దానిని అంతమేరకే చూడాలి . సీ.పీ.ఎం కార్యకర్త అంటూ + వాల్లు ఒకరిని వ్యతిరేకించడానికి మరొకరిని సమర్ధిస్తారంటూ అనడం సరయినదా ? పైన కామెంట్ లోనే జగన్ అవినీతిని , చంద్రబాబు అవినీతినై , రాజసేఖరరెడ్డి , కాంగ్రెస్ అధిష్టానం అవినీతిని ప్రస్థావించాక కూడా అలా వ్యాఖ్యానించడం దూషణకంటే కూడా ప్రమాదమే. దానికి సంబంధించి + మీరడిగిన ప్రజలపట్ల బాధ్యత గురించి నేను మీకు కామెంట్లు పంపానన్నది నిజం. అవి కావాలనే మీరు పబ్లిష్ చేయలేదనుకున్నాను. ఆ తరువాత ప్రవీణ్ కామెంట్లు పబ్లిష్ కావడం , జగన్ అవినీతిని నేను సమర్ధిస్తున్నట్లు రావడం నాకు ఇబ్బందే కదా? నా కామెంట్ లోనే నేను జగన్+వై.ఎస్+చంద్రబాబు అవినీతిల గురించి ప్రస్థావించాను. గతం లోనే రామ్మోహన్ గారు ఒకసారి నాతో వాదనకు దిగారు. ప్రవీణ్ గారు అయితే అసంబద్ధంగానే వాదించారు. నేను ప్రవీణ్ ని సీకాకుళం అని అనలేదు.

 38. కొండలరావు గారు,
  దూషణల గురించి నా వైపు నుండి చర్చ ముగిస్తానని చెప్పాను. అందువల్ల ఆ విషయం నేనిక ప్రస్తావించను.

  రామ్మోహన్ గారిది దూషణా? పరిశీలిద్దాం. ఆయన ఇలా రాశారు.

  >>>అవినీతి అనేది సాధారణమై పోయింది. ప్రజలు దాన్ని సహజంగా తీసుకుంటున్నారు. “ఇప్పుడు అవినీతి చేయంది ఎవరో చెప్పండి. ఆయన నలుగురికి పెట్టాడు, ఆయనా తిన్నాడు. అందులొ తప్పేముంది” అని బదులు చెప్పుతున్నారు. దీనికి సి.పి.యం. కార్య కర్త అయిన (అని నేననుకుంటున్నాను) కొండలరావుగారు కూడా అతీతుడేం కాదు. ఒకరిని వ్యతిరేకించే క్రమంలొ ఇంకొకరిని సమర్దిస్తున్నారు. బుర్జువా పార్టీలన్నీ ఒక తానులొ ముక్కలే. అదికారం కోసం ఒకరిని ఒకరు కలహించుకుంటుంటారు. శ్రామికవర్గాన్ని ఎదుర్కొనేటప్పుడు అందురూ యేకమౌతారు.<<<

  పై వ్యాఖ్యలో అవినీతిని సాధారణం అయిపోయిందని చెబుతూ సి.పి.ఎం కూడా దానికి అతీతురాలు కాదని చెప్పారు. సి.పి.ఎం సభ్యులయిన మిమ్మల్ని కూడా అలా అతీతులు కాని జాబితాలో చేర్చారు. ఇలా వ్యాఖ్య చేస్తూ రామోహన్ గారు మరో వాక్యం జత చేశారు. ‘ఒకరిని వ్యతిరేకించే క్రమంలో మరొకరిని సమర్ధిస్తున్నారన్నది’ ఆయన జత చేసిన వాక్యం.

  ఇందులో మీరు అవినీతిని సమర్ధిస్తున్నట్లు ఆయన చెప్పారా? కాదని నా అవగాహన. ఎందువల్ల నంటే సి.పి.ఎం పైన ఆయన చేసిన ప్రధాన విమర్శ, ‘ఒకరిని వ్యతిరేకించే క్రమంలో మరొకరిని సమర్ధించడం’. ఇక్కడ డబ్బు రూపంలోని అవినీతి పైన కంటే సి.పి.ఎం పైన చేసిన రాజకీయ విమర్శే ప్రధానం. మిగిలింది అప్రధానం. కాంగ్రెస్ కుట్రని వ్యతిరేకీంచే పేరుతో జగన్ పార్టీని సమర్ధిస్తున్నారన్నది ఆయన విమర్శ. ఇది రాజకీయ విమర్శ. దానికి సమాధానం చెప్పడమో లేదా తిరస్కరించడమో చేయాలి తప్ప దారుణం అనీ, అప్రస్తుతం అనీ చెప్పడానికి వీల్లేదు. తిరస్కరించడం కూడా సకారణంగా తగిన వివరణ ఇచ్చి మాత్రమే చేయాల్సి ఉంటుంది. రాజకీయ పార్టీలకీ, ఆ పార్టీల సభ్యులకీ లేదా మద్దతుదారులకీ అది బాధ్యత.

  సి.పి.ఎం పార్టీ ఒక బూర్జువా పార్టీకి వ్యతిరేకంగా మరొక బూర్జువా పార్టీతో పొత్తు పెట్టుకోవడం ఒక విధానంగా అమలు చేస్తోంది. ఆ విధానంపైనే ఈ విమర్శ. ఒక పార్టీకి వ్యతిరేకంగా మరొక పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నపుడు అనివార్యంగా ‘పొత్తు పార్టీ’కి మద్దతుగా మాట్లాడవలసి వస్తుంది. ఆ పార్టీపై వచ్చే కొన్ని విమర్శలకు తానే సమాధానం చెప్పవలసి వస్తుంది. అది వామ పక్షాలు చేస్తున్నాయి కూడా. పొత్తు పెట్టుకున్నపుడు ఆ పొత్తు వెనక ప్రజల ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నపుడు అలా సమర్ధించడం వారి రాజకీయ అవసరంగా మారిపోతుంది.

  ఈ విధంగా ‘ఒకరికి వ్యతిరేకంగా మరొకరిని సమర్ధించే పనిలో’ భాగంగానే సి.పి.ఎం పార్టీ మద్దతుదారు అయిన మీరు కూడా జగన్ అవినీతి ని సమర్ధిస్తున్నారన్నది రామ్మోహన్ గారి విమర్శ. ఇక్కడ అవినీతిని సమర్ధించడం అంటే ‘జగన్ వేల కోట్ల అవినీతి సంపాదన కరెక్టే’ అని మీరు చెబుతున్నారని కాదు. కాంగ్రెస్ కుట్రని వ్యతిరేకించే పనిలో జగన్ అవినీతి లెక్కకు తీసుకోవడం లేదన్నది ఇందులో వ్యక్తం అవుతోంది.

  వేరుగా చెబుతున్నపుడు జగన్ అవినీతి కరెక్టు కాదు అని మీరు చెప్పవచ్చు. అన్నీ పార్టీల అవినీతిని ఖండించవచ్చు. కానీ ఆ ఖండన, వ్యతిరేకత ఒకరికి (కుట్రకు) వ్యతిరేకంగా మరొకరిని సమర్ధించే పనిలో క్యారీ కావడం లేదు. కాదు కూడా. ఆ రాజకీయ ఎత్తుగడలలో ఉన్న ప్రధాన లోపమే అది.

  సాక్షి పై దాడుల సంగతినే చూద్దాం. దాడులు ఎందుకు జరిగాయి? సాక్షిలో అవినీతి సొమ్ము ఉందని సి.బి.ఐ ఆరోపిస్తోంది. బ్యాంకు ఖాతాలు స్తంభింపజేసింది. అవి కూడా కొన్ని మాత్రమే. ఆ స్తంభన వల్ల ఉద్యోగుల వేతనాల చెల్లింపులకు ఆటంకం లేదని సాక్షి మేనేజ్ మెంట్ చెప్పిందని హిందూ పత్రిక రాసీంది. ప్రకటనలు ఇవ్వవద్దనడానికి ప్రభుత్వం కారణం చెప్పింది. సాక్షి లో అక్రమ సంపాదన ప్రవహించినట్లు సి.బి.ఐ కేసు పెట్టింది కనుక ‘ప్రజా ప్రయోజనాల’ దృష్ట్యా ప్రకటనలు ఆపుతున్నామనీ, ఆరోపణలు క్లియర్ అయ్యాక తిరిగి ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. ఇదంతా చట్టం ప్రకారమే జరిగింది. అవినీతి ఆరోపణలు వచ్చి విచారణ జరిగినపుడు సహజంగా ప్రభుత్వం ఏమి చేయాలో అది చేసింది. ఇందులో ప్రత్యేకంగా ‘కక్ష సాధింపు చర్య’ ను ఎలా వెతకగలం?

  సాక్షి పత్రికే. దాని కంటే ముందు అది ఒక వ్యాపార సంస్ధ. ఒక వ్యాపార సంస్ధలోకి అక్రమ పెట్టుబడులు వస్తే విచారణ సమయంలో ఖాతాలు స్తంభింపజేయడం నియమం. నైతికం కూడా. అవినీతి చేసిన వ్యాపార సంస్ధకి ప్రభుత్వ సొమ్ము అందకుండా చేయడం ప్రభుత్వ బాధ్యత. ఆ బాధ్యతని నెరవేర్చడం కక్ష సాధింపు చర్య గా, కుట్ర గా చెప్పడం సరి కాదు. ఆ పని చేసింది కాంగ్రెస్ కాదు. రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతగా ప్రజల సొమ్ముని అవినీతి సంస్ధకి వెళ్లకుండా కట్టడి చేసింది.

  జగన్ (వై.ఎస్.ఆర్ అండతో) అవినీతి చేశాడనడంలో ఎవరికీ అభ్యంతరం లేదు. ఈ అవినీతిలో ఢిల్లీ వరకూ భాగస్వామ్యం ఉంది. అలా భాగస్వామ్యం లేకుండా ఏ ముఖ్యమంత్రీ అవినీతి చేయలేడు. మరి ఆ అవినీతి పై విచారణ జరగాలి కదా. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి కదా. మొదటి ముద్దాయి జగన్ అరెస్టు కాకుండానే రెండో ముద్దాయి సాయి జైల్లో గడుపుతున్నాడు. ఇది కుట్ర కాదా? జగన్ అరెస్టు తో వచ్చే ఓట్లు కూడా రావేమోనని ఆయన పై విచారణకి సి.బి.ఐ (కాంగ్రెస్) జంకుతోంది. జగన్ అరెస్టు కాకుండా కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు అడ్డుపడుతున్నారన్న అవగాహన కూడా ఉంది. ఈ భయాల వల్లనే జగన్ అవినీతి పైన జరగవలసినంతగా విచారణ సాగడం లేదు. ఇందులో తమ గుట్టుమట్లు కూడా బైటికి వస్తాయన్న భయాలు కాంగ్రెస్ పెద్దలకు కూడా ఉండడం వల్ల జగన్ విషయంలో నిర్ణయాత్మకంగా వ్యవహరించలేకపోతున్నారు.

  ఇన్ని బలహీనతల మధ్య, ప్రజల్లో అవినీతి పైన వ్యతిరేకత ప్రబలినందున, కొన్ని అవినీతి కేసుల్ని విచారిస్తున్నట్లు కాంగ్రెస్ నాటకం ఆడుతోంది. అదే సమయంలో ఎ.పి లో వివిధ పరిస్ధితుల వలన కాంగ్రెస్ బలం కోల్పోతోంది. జగన్ ని పూర్తిగా తిరస్కరించి, వై.ఎస్.ఆర్ లోటుని మరొకరితో పూడ్చలేని పరిస్ధితిలో ఉంది. కానీ కాంగ్రెస్ లో ని అనేక గ్రూపుల్లో, పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ లో, జగన్ సి.ఎం కోరికని ఒప్పుకోలేకపోయింది. కానీ ఆ పార్టీ జగన్ ని దూరం పెట్టే పరిస్ధితి ఉందా? లేదన్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. మరో ప్రత్యామ్నాయం కోసం వెతకడం అది మానకుండా, జగన్ ని పూర్తిగా నెట్టేయకుండా దాగుడు మూతలు ఆడడానికి కారణం ఏమిటి? సెంటర్ కి తీసుకెళ్లి జగన్ ని సంతృప్తి పరచడానికీ ఆ పార్టీ ప్రయత్నించింది. అది కుదర లేదు.

  ఈ పరిస్ధితిని విస్మరించగలమా? విస్మరించి కాంగ్రెస్, జగన్ ల మధ్య వైరుధ్యాన్ని మాత్రమే ప్రధానం చేసి చూడగలమా? ఐక్యతని తేలిక చేయగలమా? వారి మధ్య ఐక్యత ఘర్షణలు కేవలం వారి ప్రయోజనాలకి సంబంధించినవే తప్ప ప్రజల ప్రయోజనాలకి ఎ మాత్రం సంబంధం లేదు. కనుక వారి వైరుద్యాలను ఉపయోగించుకునే పని పెట్టుకుంటే అనివార్యంగా ఒకరికి వ్యతిరేకంగా మరొకరిని సమర్ధించే పనే మిగులుతుంది.

  ఇదంతా ఒక రాజకీయ అవగాహన. సి.పి.ఎం రాజకీయ ఎత్తుగడల పట్ల ఉన్న విమర్శనా పూర్వక అవగాహన. ఆ అవగాహన లో భాగంగానే మీ వ్యాఖ్యపైన రామ్మోహాన్ గారి విమర్శని చూడాలి తప్ప వ్యక్తిగతంగా చూడడానికేమీ లేదు.

  జగన్ తో సి.పి.ఎం కి పొత్తు లేదు. కానీ పొత్తు పెట్టుకోబోమనీ, అవినీతి జగన్ తో పొత్తు కుదరదనీ నిర్ద్వంద్వంగా చెప్పడానికి తిరస్కరిస్తోంది. ఆ విధంగా భవిష్యత్తులో పొత్తు పెట్టుకోవడానికి గల అవకాశాలను కాపాడుకుంటోంది. (కాంగ్రెస్, టిడిపి లతో పొత్తు పెట్టుకున్నపుడు జగన్ తో పెట్టుకోవడానికి వెనకాడాల్సిన అవసరం లేదు) రాష్ట్రంలో ఇపుడా రాజకీయ పరిస్ధితి ఉంది. అందువల్లనే సాక్షి పై దాడుల విషయంలో మీరు వ్యక్తం చేసిన అభిప్రాయంలో సి.పి.ఎం రాజకీయ ఎత్తుగడల అవగాహన క్యారీ అయిందన్నది రామ్మోహాన్ గారి అభిప్రాయం.

  అయితే జగన్ తో పొత్తు సంగతి ఇదమిద్ధంగా తేలేవరకూ సి.పి.ఎం రాజకీయ అవగాహనని ఇలా అప్లై చేయడానికి త్వర పడకూడదన్నది నా అవగాహన.

 39. ఇంకో విషయం. కేవలం మతతత్వాన్ని ఓడించడానికే మేము కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నాము అని CPMవాళ్ళు అంటున్నారు. బిజెపి మతతత్వపార్టీ అయితే కాంగ్రెస్ అవినీతి పార్టీ. మతతత్వం మీద ఉన్న అసహ్యం అవినీతి మీద ఉండదా అనే సందేహం వస్తుంది. ఇండియాలో మతతత్వం పెద్ద సమస్య కాదు. ఎందుకంటే ఇది పాకిస్తాన్ లేదా ఇరాన్‌లాగ మత చట్టాలు ఉన్న దేశం కాదు. పల్లెటూర్లలో మత సంప్రదాయాలు కంటే కులం కట్టుబాట్లు బలంగా కనిపించడం మనం గమనించొచ్చు.

 40. విశేఖర్ గారూ !
  ఆరోగ్యకరమైన చర్చ అన్నారు కనుక దూషణలు లేకుండా నేనూ ప్రయత్నీస్తాను. భావోద్వేగం లో వాడే పదాలు కొన్ని ఉంటాయి. ఆ లోపం కూడా లేకుండా చూసుకోవాలనే మీ ఎపిసోడ్ తరువాత పాఠం గా తీసుకున్నాను.
  1-రాం మోహన్ గారిని సమర్ధిస్తూ మీరు ఇచ్చిన వివరణను నేను ఏకీభవించను. 2-సాక్షి పై ప్రభుత్వం ముమ్మాటికీ కక్ష సాధింపుకే పాల్పడుతుంది. 3-సీ.పీ.ఎం ఎన్నికల ఎత్తుగడల పైన మీ అవగాహన లోపభూరితం అని చెప్పదలచుకున్నాను.
  1) రాం మోహన్ గారు అసలు సీ.పీ.ఎం నే ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను జగన్ అవినీతితో సహా అక్కడ ప్రస్థావించాను. ఇక్కడ పోస్టు సారాంశం ప్రభుత్వం సాక్షికి ప్రకటనలు నిలిపివేయడం అన్నప్పుడు , చర్చ దాని చుట్టూ ఎంత తిరిగినా తప్పు లేదు. మీ వాదనను సమర్ధించక పోతే ఎదుటివాడి గొంతు నొక్కడానికి వాడే చీప్ ట్రిక్ అవుతుందది. దానిని మీరు సమర్ధించడం కూడా చర్చను దారి తప్పించడమే అవుతుంది. ఆలోచించండి. ఇంతకు మించి ఇక ఇందులో ఏమి వాదించినా – ఏమి సమర్ధించినా ఉపయోగం లేదు చర్విత చరణం తప్ప.
  2) గతితార్కికంగా ఈ సమస్యను తీసుకుందాం . సమాజం లో ప్రతీదీ విడివిడిగా కలివిడిగా చూడాలి కదా? జగన్ అనే వ్యక్తిని టార్గెట్ చేసే విధానం రాజకీయం గా అయితే వేరు. వ్యక్తిగా ఎంత అవినీతి పరుడైనా ప్రభుత్వం రాజ్యాంగ యంత్రాన్ని అడ్డుపెట్టుకుని ఇలా చేయడం కక్ష సాధింపే . వ్యక్తిగత ఆస్థితో ముడిపడి ఉన్న అవినీతి అనేది వ్యస్థలో మార్పు – అదీ స్వానుమతం గా స్వంత ఆస్థి రద్ధయ్యే వరకూ సోషలిస్టు దేశాలలో అయినా ఉంటుంది. జగన్ ను తమ మాట వినడం లేదు కాబట్టి ప్రత్యేకించి ఇలా చేయడం సరైనది కాదు. అది రాజ్యాంగయంత్రాన్ని దుర్వినియోగపరచే ప్రమాదకరమైన ప్రక్రియగా చూడాలి తప్ప రాజకీయ కోణం లో కాదు. ఇవ్వాల జగన్ ను కట్టడి చేయడం వెనుక కాంగ్రెస్ కుట్ర దాగి ఉంది. అది జగన్ కే మేలు చేస్తుంది తప్ప ప్రజలకు కాదు. దీని అడ్డం పెట్టుకుని జగన్ ప్రజల సానుభూతిని పొందే ప్రయత్నమే చేస్తాడు. సాంస్కృతిక అంశాలు డ్రైవింగ్ ఫోర్స్ గా సమాజం లో ఉన్నప్పుడు ప్రజలు సానుభూతికి ఇచ్చిన ప్రాధాన్యత అవినీతికి ఇవ్వరు. ఒక వ్యక్తిని అవినీతి ప్రక్షాలన చేస్తే ఉపయోగం లేదు. మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని టార్గెట్ చేయాలి. అలా లబ్ధి పొందిన వారు తగుదునమ్మ అంటూ ద్వంద్వ వైఖరితో రాజ్యాంగ వ్యవస్థలైన సీ.బీ.ఐ ని వాడుకోవడం సమాజానికి ప్రమాదమే. ప్రభుత్వ పరం గా సాక్షి పై చర్యలు ప్రమాద కరమే. సాక్షి పెట్టుబడుల అవినీతిని – జగన్ అవినీతిని చట్టపరం గా , కోర్టుల పరం గా దర్యాప్తులు జరుగుతున్నందున వాటిని సాగనివ్వాలి. ఆ మేరకు జగన్ కూడా జైలుకు వెళ్లినా ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. దానికి ప్రజాధానం తో ప్రజలకు సేవలు అందించాల్సిన అధికార యంత్రాంగాన్ని అడ్డమైన సేవలకు వాడుకోవడాన్ని ఒకే గాటన కట్టడం అవగాహానా రాహిత్యం – సమస్యను లోతుగా చూడలేక పోవడమే అవుతుంది.
  3)మార్క్సిజం అనేది ఒక శాస్త్రం. ససమాజాన్ని సాధించేందుకు అందులో మూలాలను మాత్రమే ప్రధానం గా తీసుకోవాలి . మక్కీకి మక్కి పుస్తక అధ్యయనం – చరిత్రలో లెనిన్-మావో …. ఇలా వారు చేసింది యథాతధంగా చేయడం కాదు. చరిత్రను గమనం లో ఉంచుకుని నిరంతరం చలనం లో ఉండే సమాజాన్ని గతితార్కికంగా పరిశీలిస్తూ ప్రజల మద్ధతుతో చరిత్ర గమనాన్ని దోపిడీకి వ్యతిరేకం గా మార్చాలి. ఇందుకు ప్రజల మద్ధతు అవసరం. ప్రజలే చరిత్ర నిర్మాతలు.పోరాట పద్ధతులను స్థానిక పరిస్తితులకు అనుకూలం గా తీసుకుని చేయాలి. ఆ మేరకు భారత కమ్యూనిస్టులు అందరూ ఫెయిల్ అయ్యారనేదే నా వ్యక్తిగత అభిప్రాయం. వేదభూమి – భిన్న సంస్కృతులు – కులం వంటి ప్రత్యేక సమస్యలను కలిగిన భారత దేశం లో కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం మిగతా ఏ ఇతర దేశాలకన్నా సంక్లిష్టమైనదే అవుతుంది. ఈ అంశం లోనే కమ్యూనిస్టుల మితిమీరిన కొట్లాటలు హేళనకు గురయ్యేదాకా , సామాన్యుడు తల గోక్కుని సానుభూతి ప్రకటించే స్థాయికి దిగజారడం బాధాకరం. అంతే తప్ప కమ్యూనిస్టులు వ్యక్తిగత ఆస్థులు పెంచుకోవడానికి పోటీపడడం లేదు . అవినీతిలో కూరుకు పోవడం లేదు. అన్ని కమ్యూనిస్టుపార్టీలు త్యాగాలు-పోరాటాలు చేస్తున్నాయి. ఒకరిపై ఒకరు మాత్రం కత్తులు దూసుకుంటారు. అదీ అత్యంత వాడిగా – వేగం గా. ఇది మారాలి. సాపేక్షంగా కమ్యూనిస్టులే మన దేశం లో ఆదర్శం గా ఉన్నారు. ఇందులో సీ.పీ.ఎం కూడా విశిష్ట పాత్రనే పోషిస్తోంది. ఒకడికి వ్యతిరేంకా ఇంకొకడిని మోయడం లేదు. కాంగ్రెస్ అణు ఒప్పందం పై మద్ధతు ఉపసమ్హరించుకుంది. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తున్నది. ఎన్నికలలో పాల్గొనడం అనేది ఒక ఎత్తుగడ మాత్రమే. సాయుధ పోరాటానికి ప్రజలు సంసిద్ధులు కాకుండా – ప్రజల భాగ స్వామ్యం లేకుండా విప్లవం జయప్రదం కాదు. సాయుధ పోరాటం దాకా ఎందుకు ? సమస్యలపై పోరాటాలకే రావడం లేదు ? ఇంటా – బయటా పరిస్థితులను దృష్టిలో ఉంచుకోవాలి. ఇక జగన్ పార్టీ అంటే జగన్ ఒక్కడిదా? దాని విధానాలను బట్టే సీ.పీ.ఎం వైఖరి ఉంటుంది. ఎన్.టీ.ఆర్ పెట్టిన పార్టీనే ఆయన వదలాల్సి వచ్చింది. వ్యక్తుల ప్రాధాన్యత ఉన్నా ప్రజలు ఎప్పుడూ వాటినే సమర్ధించరు. ఇందిరను-ఎన్.టీ.ఆర్ ను కూడా ఓడించిన ఘనత ప్రజలకు ఉంది.

 41. కొండలరావు గారు

  భావోద్వోవేగంలో ఉన్నా దూషణలు లేకుండానే చర్చించుకోవచ్చు. నేను అన్నా అనకపోయినా ఆరోగ్యకరమైన చర్చే అభిలషణీయం.

  1. అభిప్రాయాలు ఏర్పడడం వెనుక మనకున్న రాజకీయ అవగాహన పని చేస్తుంది. సి.పి.ఎం ప్రస్తావన అందువల్లనే జరిగింది. అయితే రామ్మోహన్ గారి సి.పి.ఎం ప్రస్తావన మీ ఆమోదానికి లోబడి ఉండాల్సి ఉంది. నేనిచ్చిన వివరణ ద్వారా మీ ఆమోదం ఉండవచ్చని అనుకున్నాను. లేదంటున్నారు గనక దాన్నంతటితో వదిలేద్దాం. రామ్మోహన్ గారు చర్చలో లేకపోవడం ఇక్కడొక లోపంగా ఉంది.

  పోస్టుల సారాంశం తో సంబంధం లేకుండా ఆ పోస్టులో ఉన్న అంశాల ఆధారంగా కొన్ని వ్యాఖ్యలు వస్తాయి. అది సహజం. మీ వ్యాఖ్యనే తీసుకుందాం. అవినీతి, కుట్రల్లో ఏది ప్రమాదకరం అన్నది మీరు ప్రస్తావించారు. అవినీతిపై పొరాటం,ఢిల్లీ పెద్దల అవినీతి, ఈనాడు-ఆంధ్రజ్యోతి, చంద్రబాబు, తెహెల్కా, రాజ్యాంగ యంత్రం, జగన్ కి ప్రజల మద్దతు ఇవన్నీ మీ ప్రస్తావనలో ఉన్నాయి. నా పోస్టు తో ఏదో రూపంలో వీటికి సంబంధం ఉందని మీరు భావించారు గనక ప్రస్తావనకు వచ్చాయి. పై వ్యాఖ్యలో కూడా ఈ పోస్టు పరిధి నుండి చాలా దూరం మీరు వెళ్లారు. గమనించారా?

  అలాగే ఏదో ఒక సంబంధం చూడబట్టే ఇతర వ్యాఖ్యాతలు కూడా కొన్ని ప్రస్తావనలు తెస్తారు. వాటికి నా సంసిద్ధతను బట్టి ప్రచురిస్తాను. కొన్ని వ్యాఖ్యలు అసలే సంబంధం ఉండవు. నాతో చర్చించాలన్న ఉద్దేశ్యంతో సంబంధం లేకపోయినా తాజా పోస్టు కీంద రాస్తుంటారు. కొన్ని సార్లు వ్యాఖ్యాతల మధ్యనే చర్చలు జరుగుతుంటాయి. అందులో నా పాత్ర ఉండదు. ఐనా వారి మధ్య చర్చ కొనసాగడానికి ప్రచురిస్తాను. తద్వారా వారి చర్చకు ఒక వేదిక కల్పించడమే అందులో ప్రయోజనం. అయితే అలాంటి చర్చల్లో ఇద్దరి వ్యాఖ్యాతల సంసిద్ధత అవసరం. సి.పి.ఎం రాజకీయాలకీ మీ అభిప్రాయాలకీ ఉన్న సంబంధాన్ని మీరు చర్చించడానికి సిద్ధంగా లేరు గనక దాన్ని వదిలేద్దాం.

  ఒక్కోసారి పోస్టు తో సంబంధం లేకపోయినా కొన్నిచర్చలు ఉపయోగకరంగా ఉంటాయి. అలాంటివి నా బ్లాగ్ లో కొంచెం ఎక్కువగానే జరుగుతుంటాయి.

  2. జగన్ అవినీతిని కేవలం ఒక వ్యక్తి అవినీతి గా మీరు చూస్తున్నారు. అది కరెక్టు కాదు. అసలు అవినీతికి పాల్పడింది వై.ఎస్.ఆర్. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా అది జరిగింది. మీరు చెప్పిన రాజ్యాంగ యంత్రాన్ని వినియోగించుకుని వై.ఎస్.ఆర్ అవినీతికి పాల్పడ్డాడు. జల యజ్ఞం అంటూ ప్రభుత్వ విధానాల్ని అవినీతికి వినియోగించాడు. సెజ్ చట్టాల్ని వినియోగించి భూముల్ని పందేరం పెట్టాడు. నూతన ఆర్ధిక విధానాల ద్వారా సరళీకరించబడిన పన్నుల చట్టాలు, ఫైనాన్స్ చట్టాలు వినియోగించి మనీ లాండరింగ్ కి పాల్పడ్డాడు. చట్టాల్ని వినియోగించి రైతుల భూముల్ని గుంజాడు. ఆ భూముల్ని రియల్ ఎస్టేట్ కి అప్పజెప్పి కమిషన్లు తిన్నాడు. వాన్ పిక్ అని భూముల్ని అప్పజెప్పి పెట్టుబడులు పొందాడు. వీటన్నింటికీ పోలీసుల్ని, చట్టాల్ని వినియోగించాడు. తిరగబడ్డ జనం పైన నిర్బంధం ప్రయోగించాడు. కాల్పులు జరిపించాడు. వై.ఎస్.ఆర్ నిర్బంధం పైన సి.పి.ఎం కూడా కొన్ని పోరాటాలు నడిపింది. మిగులు భూముల వెల్లడి కోసం సి.పి.ఐ, సి.పి.ఎం లు ఉద్యమాలు నిర్వహించి అసెంబ్లీ సభ్యులు ఎన్ని లక్షల ఎకరాల భూములపైన కూర్చుని ఉన్నారో వెల్లడిచేశాయి.

  ఇవన్నీ ఏమి సూచిస్తున్నాయి? జగన్ అవినీతి వెనుక జగన్ ఒక్కడే లేడు. జగన్ అవినీతి వెనుక రాజ్యాంగ యంత్రం పాత్ర చూడకుండా వ్యక్తిని మాత్రమే చూడడం లోతైన అవగాహనా? జగన్ నీ కాంగ్రెస్ నీ ఒకే గాటన కట్టే అవగాహనా రాహిత్యమా? ఆ పేరుతో మీ అవగాహన ఎక్కడ ఉందో ఓ సారి పరిశీలించండి. జగన్ డబ్బు వై.ఎస్.ఆర్ ముఖ్యమంత్రిత్వంలో రాజ్యాంగ యంత్రాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా కూడినది. అలాంటి అవినీతిపైన చర్య తీసుకుంటే కక్ష సాధింపు చర్యగా చూడడం హ్రస్వ దృష్టి. జగన్ అవినీతిపై చర్య అంటే వై.ఎస్.ఆర్ ముఖ్యమంత్రిగా చేసిన అవినీతిపైన చర్య. రాజ్యాంగ యంత్రాన్ని వినియోగించి ప్రజాధానాన్ని సొంతానికి మింగిన ఘోరమైన అవినీతి పై చర్య. మొత్తం ప్రభుత్వ వ్యవస్ధలన్నింటినీ సొంత సంపాదనపైనే కేంద్రీకరింపజేసిన దారుణంపై చర్య. తన అవినీతి సాగడం కోసం మంత్రులందర్నీ, ఎమ్మెల్యేలందర్నీ విచ్చలవిడి అవినీతికి ప్రోత్సహించిన ‘ప్రజావ్యతిరేక దుర్మార్గాల’ పై చర్య. ఆ చర్యని కక్ష సాధింపుగా చూడడం లోతైన పరిశీలన కానే కాదు.

  కక్ష సాధింపుగా చూసి అవినీతి పరులకి ప్రజాధనం అందకుండా చేయడాన్ని వ్యతిరేకిస్తే ఇక ఏ చర్యని సమర్ధించాలి? యెడ్యూరప్ప పైన బి.జె.పి ప్రభుత్వంది కక్ష సాధింపా? రాజా పైన కాంగ్రెస్ ది కుట్రా? గాలి పైన కాంగ్రెస్ ది కక్షా? చట్టం తన పని తాను చేయడంలో ప్రభుత్వం ప్రజాధనాన్ని ప్రజలకి అందకుండా చేయడం కలిసి ఉండదా?

  ఇప్పుడు చూసినా జగన్ వ్యక్తి కాడు. ఒక పార్టీకి సారధి. ఆ పార్టీ వెనుక భూస్వామ్య, బూర్జువా వర్గాలు ఉన్నాయి. జగన్ పార్టీ ద్వారా తమ దోపిడీ కొనసాగించడానికి అవి చూస్తున్నాయి. ఇప్పటికే చేస్తున్నాయి కూడా. ఎన్నికలు జరిగితే సీమాంధ్రంలో ఆయన పార్టీయే నెగ్గుతుందన్న అంచనాలు కూడా ఉన్నాయి. ఆ పార్టీలో జగన్ మాటకి తిరుగులేదు. అలాంటి జగన్ ని వ్యక్తిగా చూడడం సమస్యని లోతుగా చూడడం కాదు. ఆయన వ్యక్తి కాదు గనకే కాంగ్రెస్ సర్వ శక్తులూ ఒడ్డుతోంది.

  గతి తార్కికం అంటూనే మీరు పూర్తిగా దాన్ని విస్మరించారు. కేవలం రాజ్యాంగ యంత్ర వినియోగం అన్నంత మాత్రానే అది గతి తార్కిక దృస్టి అయిపోదు. ‘కలివిడిగా విడివిడిగా’ చూడాలంటూనే మొత్తాన్ని కలివిడిగా కలిపేసారు. జగన్ అవినీతి వెనుక కాంగ్రెస్ సాగించిన కుట్రనీ, మద్దతునీ చూడలేదు. జగన్ అవినీతి వెనుక కాంగ్రెస్ అధికారమే ఉందనీ, అలాంటి అధికారంతో ‘రాజ్యాంగ యంత్రంపై సాధించిన పట్టు’ ఉందన్న సంగతిని విస్మరిస్తున్నారు.

  సోషలిజం లో వ్యక్తిగత ఆస్తి కొనసాగుతుందన్నది నిజమే. కాని అది క్రమంగా సమిష్టీకృతం అవుతూ ఉంటూంది. కాని వ్యక్తిగత ఆస్తి ఉన్నందున అవినీతీ ఉంటుదని చెప్పడం సత్యదూరం. మావో తర్వాత కూడా సోషలిస్టు నిర్మాణం కొనసాగిందనీ, డెంగ్ విధానాలు కూడా సోషలిజం లో భాగమనీ నమ్మితే ఇలాంటి తప్పుడు అభిప్రాయాలు వస్తాయి. సోషలిస్టు వ్యవస్ధలో అవినీతి ఉంటే అది సోషలిస్టు వ్యవస్ధ ఎలా అవుతుంది?

  3. మార్క్సిజం శాస్త్రమే కాదు. ఆచరణీయ సిద్ధాంతం. పడక్కుర్చీలకి పరిమితమైన తత్వ శాస్త్రాన్ని మెడపట్టి లాక్కొచ్చి కార్మిక వర్గం కాళ్ళపై పడేసిన సమున్నత సిద్ధాంతం.

  భారత దేశంలో ఆచరణలో ఉన్న ఒక చిన్న సమస్యనే మక్కీకి మక్కీ సిద్ధాంతంగా చెబితే ఇక ఏది సిద్ధాంతం? ఏది ఆచరణ? ఇక సిద్ధాంతం దరిదాపుల్లోకి కూడా వెళ్లేది లేదా?

  చరిత్ర గమనాన్ని దృష్టిలో పెట్టుకోవడం అంటే బూర్జువా పార్టీలతో నిరంతరం పొత్తులు పెట్టుకుంటూ పోవడమా? ఒక బూర్జువా గ్రూపుని కూల్చడానికి మరొక బూర్జువా గ్రూపుకి తోకగా మారడమా? ప్రజల సంసిద్ధత దానంతట అదే వస్తుందా లేక కార్మిక వర్గ పార్టీలు సంసిద్ధుల్ని చేయాలా? కార్మిక వర్గ పార్టీలు ఉన్నదే ప్రజల్ని సంసిద్ధుల్ని చేయడానికి. బూర్జువా వర్గ రాజకీయాల్లో పీకల్దాకా కూరుకుపోయి దానికి ప్రజల సంసిద్ధతని అడ్దుపెట్టుకోవడం దేనికి?

  ప్రజల సంసిద్ధత లేకనే కేంద్ర ప్రభుత్వం కంటే ముందుగానే నూతన ఆర్ధిక విధానాల వెలుగులో ‘బెంగాల్ పారిశ్రామిక విధానాన్ని’ రూపొందించారా? రైతుల సంసిద్ధత లేకనే వారి భూముల్ని గుంజుకుని టాటాకి సలీం కీ అప్పజెప్పారా? వారి సంసిద్ధత లేకనే వారిపైనే దుర్మార్గమైన నిర్భంధాన్ని ప్రయోగించారా?

  కార్మిక వర్గంలో కాళ్లు, బూర్జువా వర్గంలో తలకాయ పెట్టినవాళ్ళకి అన్నీ సానుకూలమే. ప్రజల సంసిద్ధత లేదని బూర్జువా రాజ్యాంగ యంత్రాన్ని వినియోగించి రైతుల భూముల్ని కంపెనీలకి అప్పగించవచ్చు. ఎన్నికల ఎత్తుగడల పేరు చెప్పి బూర్జువా పార్టీలతో సమానంగా పార్లమెంటరీ రాజకీయాల్లో తలమునకలు కావచ్చు. కార్మిక వర్గ రాజకీయాలు చెప్పి కమ్యూనిస్టులన్న ప్రతిష్టా పొందవచ్చు.

  బూర్జువా వర్గం అవినీతి ని చూపి సాపేక్షికంగా కమ్యూనిస్టులు ఆదర్శంగా ఉన్నారని సంతృప్తి పడితే చాలదు. బూర్జువా రాజకీయాలే పరమావధిగా ఉంటే అలాంటి సంతృప్తితొ సరిపెట్టుకోవలసి వస్తుంది. కమ్యూనిస్టు పార్టీల కర్తవ్యం బూర్జువాలతో పోలిస్తె ఆదర్శంగా ఉండడం కాదు. ప్రజలని సాయుధ విప్లవానికి సంసిద్ధులని చేయడం. ఎన్నికల్లో పాల్గొన్నా, బహిష్కరించినా, ఎన్ని ఉద్యమాలు చేసినా అదే అంతిమ కర్తవ్యం. సాయుధ విప్లవం వచ్చినపుడు చేద్దాం అంటె తెచ్చేదెవరు?

 42. ప్రైవేట్ ఆస్తి వ్యవస్థ ఉన్నంత వరకు అవినీతి ఉంటుంది. అంతమాత్రానికే ప్రైవేట్ ఆస్తి రద్దవ్వనంత వరకు అవినీతి వ్యతిరేక పోరాటం చెయ్యకూడదనో, జగన్ లాంటి అవినీతిపరులని బయట ఉండనివ్వాలనో అంటే అది హాస్యాస్పదమే అవుతుంది. జగన్‌ని అరెస్ట్ చేసినంతమాత్రాన అవినీతి తగ్గదు అని చెప్పి అతనికి ముఖ్యమంత్రి పీఠం ఇవ్వాలా?

  కాంగ్రెస్ కుట్ర చేసిందని ప్రజలకి తెలుసు. అవినీతి కంటే కుట్రే ప్రమాదకరం అని వాదిస్తే అది విషయాన్ని పక్కదారి పట్టించడమే అవుతుంది. కొండ మీది కోతి కావాలన్నంత సులభంగా ముఖ్యమంత్రి పదవి అడిగితే అది ఇచ్చేస్తారని జగన్ ఎలా అనుకున్నాడు?

 43. మీ వివరణ లో మీ స్వభావమే కనబడుతుంది. అది 1) సీ.పీ.ఎం పై గుడ్డి వ్యతిరేకత 2) రాం మోహన్ గారికి సమర్ధింపు 3) నేను జగన్ మాత్రమే అవినీతి చేశాడు కాంగ్రెస్ కు – రాజశేఖరరెడ్డికి సంబంధం లేదన్నానా ? అని మీరు అన్నది పై నుండి కామెంట్లు పరిశీలించేవారికి అర్ధమవుతుంది. 4) బెంగాల్ లో సీ.పీ.ఎం వైఖరి – ఎన్నికలలో పొత్తులు అనేవి గతం లో వందల సార్లు వాదించినవే. ఇపుడు వాదించి ఉపయోగం లేదని మీ సమాధానం ను బట్టే అవగతమవుతుంది. బూర్జువా పార్టీలతో పొత్తుపెట్టుకోవడం ఎన్నికల ఎత్తుగడ మాత్రమే. బెంగాల్ లో మమతతో అంటకాగి ఆ తరువాత ఇబ్బంది పడ్డదెవరో , సీ.పీ.ఎం ఓడి పోతే హర్షాతిరేకాలు చేసుకున్నదెవరో? ఆ తరువాత జరుగుతున్నదేమిటో చూస్తూనే ఉన్నాము. 5) వ్యక్తిగత ఆస్థి రద్దు కానంతవరకూ అవినీతి ఆలోచన ఉంటుంది.6) ఏది సిద్ధాంతం అనేది ఎవరికి వారికే నేను చెప్పేదే సిద్ధాంతంలా భావిస్తారు. ఆచరణ ఋజువుచేస్తుంది దానిని. సిద్ధాంతాన్ని స్థానిక పరిస్థితులకు అన్వయించకుండా పుస్తకాలలో మాత్రమే చూస్తే ఉపయోగం ఉండదు. ఇంతకు మించి ఈ విషయం లో వాదించేది ప్రత్యేకం గా లేదు . పైన నేను వివరించినవి చూస్తే చాలు కనుక ముగిస్తున్నాను.

 44. విశెకర్ గారు. చర్చ నిన్నటి నుంచి జరుగుతున్నట్టు వుంది. ఈ చర్చలొ నేను పాల్గొనకపొవడం కొంచం బాదగానే వుంది. కొండలరావు గారు, మీరు వేసిన ప్రశ్నెలకు దేనికీ సుటిగా సమాదానం చెప్పలేదు. సి.పి.యం.పార్టీలొ ఆయన పీకలలొతు మునిగిపొయారు. ఆయన దానిలొకి వెళ్ళి తలుపులు ముసుకున్నారు. దానిలొనుంచి బయటకు వచ్చె ప్రసక్తే లేదు. ఆ పార్టి ఏం చెపితె అది సిరసా వహిస్తాడు. ఆ పార్టిని ఏమాత్రం విమర్శించినా భరించ లేడు. బుర్జువా పార్టీలతొ పొత్తు పెట్టుకొవడం అవసరమనీ, ఆ పొత్తు పెట్టుకొవడంలొ విధివిదానాలు వుంటాయని అన్నారు. ఆ విధి విధానాలేమిటొ ప్రజలకు ఏమైనా చెప్పారా? ఆ పొత్తుల విషయంలొ ప్రజలు ఏమనుకుంటున్నారొ ఎప్పుడైనా ఆలొచించారా? వాళ్ళ అభిప్రాయం కనుక్కున్నారా? యాబై యెళ్ళ నుంచి పనిచేసున్నా ప్రజలలొ ఏమాత్రం పట్టు సాధించలేదు ఎందువల్ల?

  ప్రజలలొ ఈ నాటికీ 100 కి 99 మందికి మార్క్స్ అన్న పేరే వినలేదు. సిద్దాతం తెలుసుకొవటం తర్వాత విషయం.

  మీలొ నేను సి.పి.యం. పార్టీని చుస్తూన్నాను. ఆ పార్టీ వల్లించే చిలక పలుకులనే మీరు వళ్ళిస్తున్నారు. నిజం చెప్పాలంటె మీలాంటి వాళ్ళ వల్లనే కమ్యునిస్టు పార్టి అంటేనే బుర్జువా పార్టీ స్తాయికి దిగజార్చారు. విధి విదానాలుంటే దేనితొనైనా పొత్తు వుంటుదన్నారు అసలు విధివిదానాలు ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తారొ చెప్పండి

 45. కొండల్రావు గారూ, అవును. నా వివరణలొ నా స్వభావమే కనిపిస్తుంది. మీ స్వభావంతో నేనెందుకు రాస్తాను? నేనెందుకు ఆలోచిస్తాను?

  సి.పి.ఎం రాజకీయాలపై నేను చర్చ చేస్తున్నా. నా చర్చాంశాల్ని వదిలేసి స్వీపింగ్ స్టేట్ మెంట్స్ ఇస్తున్నారు. మీ స్టేట్ మెంట్స్ లోనే బోలెడు సిద్ధాంతం ఉందని, చర్చ ఉందనీ నమ్మమంటున్నారు.

  ‘గుడ్డి వ్యతిరేకత’, ‘రాం మోహన్ గారికి సమర్ధింపు’ ‘ఇపుడు ఉపయోగం లేదు’ లాంటి పదజాలాన్ని అడ్డు పెట్టుకుని పలాయన మంత్రం జపిస్తున్నారు. చర్చిద్దాం అంటూనే చర్చా పద్ధతులకు వ్యతిరేకమైన పదజాలాన్ని పదే పదే ఆశ్రయిస్తున్నారు.

  మీరు చెప్పినా నేను చెప్పినా కమ్యూనిస్టు సిద్ధాంతం ఒకటే. దాన్ని అన్వయించుకోవడంలో తేడాల వల్లే ఇన్ని విభేదాలు. విభేదాల పరిష్కారం కోసం చర్చలు జరపడం ఒక పద్ధతి. ఆ పద్ధతిపైన మీకు నమ్మకం లేదు. ‘శత్రువుకి కూడా నచ్చజెప్పేలా చెప్పొచ్చు’ అనడం లో మీకు నిజాయితీ లేదు. కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని నమ్ముతున్న ఒక బ్లాగర్ తోనే చర్చించలేని వారు శత్రువుకేం నచ్చజెబుతారు? వారితో కలిసి పోయి కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని నమ్మేవారిని దూషించడం తప్ప.

  సి.పి.ఎం పార్టీ, కార్మిక వర్గ రాజకీయాలు చేస్తే ప్రజలు హర్షం వ్యక్తం చేయవచ్చు. కమ్యూనిస్టు సిద్ధాంతాలు చెబుతూ బూర్జువా రాజకీయాలు చేస్తున్నపుడు కాంగ్రెస్, టిడిపి ల ఓటమితో సమానమే సి.పి.ఎం ఓటమి కూడా. అందులో ప్రజలు బాధపడేందుకేమీ లేదు.

  ఆదర్శాలు స్టేట్ మెంట్స్ లో ఉండవు. ఆచరణలో ఉంటాయి.

  మీ కోరిక ప్రకారమే చర్చను ముగిద్దాం.

 46. సీ.పీ.ఎం అంటే గుడ్డిగా వ్యతిరేకించేవారికి ఇంతకంటే ఏమీ కనపడదు. సీ.బీ.ఐ ని – కాంగ్రెస్ ని మోసేస్తేనే మార్క్సిజం అనుకుంటే నేను చెప్పగలిగేదేమీ లేదు.

  సీ.పీ.ఎం వల్ల 100 కి 99 మందికి మార్క్స్ గురించి తెలియదంటున్నారు. మీలాంటివాళ్ల – ఇలాంటివాటివల్ల మార్క్స్ గురించి తెలుస్తుందా?

  అతివాదం – మితవాదం రెండూ కవల పిల్లలు అని మార్క్స్ చెప్పింది గుర్తుకు వస్తుంది ఈ సందర్భంగా నాకు.

  సీ.పీ.ఎం ను విమర్శించడానికి బూర్జువాపార్టీలతో అంటకాగడానికైనా వెనుకాడరని మీ వాదనలు అవగతమవుతున్నాయి. బెంగాల్ లో జరిగింది అదే. ఇక్కడ వాదనల సారమూ అదే.

  నేను సాక్షి ప్రకటనలకు సంబంధించి ఉంచిన కామెంట్ ను సహించలేక మీరు సీ.పీ.ఎం ను డొంకతిరుగుడుగా వాదనలోకి తెచ్చి నేను పీకల్లోతు సీ.పీ.ఎం లో కూరుకు పోయానంటూ ఆనందపడడం చూస్తుంటే జాలిపడుతున్నాను. సీ.పీ.ఎం అనేది లాగింది మీరు కాదా ? పైగా ఎదురుదాడి ఎందుకు ?

  ఈ పోస్టుకు నా కామెంట్ కు సీ.పీ.ఎం ను లాగాక ఇపుడు ఈ విధం గా వాదించడం – పైన విసేఖర్ గారి సమర్ధనలు చూశాక ఇక్కడ కామెంట్ పెట్టడమే తప్పుగా భావిస్తున్నాను.

  మీకు మీరే మేధావులుగా భావించుకుని మీ వాదనకు అనుకూలం గా వాదనలు లేకపోతే ఇలా ఎదురుదాడి చేయడం కూపస్థ మండూకాలను తలపిస్తోంది.

  విశేఖర్ గారి ప్రశ్నలకు సమాధానం మీరు అనుకున్నట్లు చెపితే తప్ప అర్ధం కాదని నాకు అర్ధం అవుతుంది. ఓ.కే. మీ అభిప్రాయాలు మీరు చెప్పారు. నా అభిప్రాయాలు నేను చెప్పాను.

  ఈ పోస్టులో కామెంట్ లను వరుసగా చదివిన వారికి మీ అభిప్రాయాలు – నా అభిప్రాయాలు ఏవి సరయినవో అవగతమవుతాయి. ఒక అభిప్రాయం తలకీక్కించుకున్నాక ఇంతకు మించి ఏ వాదన చేసినా ఉపయోగముండదు. ఈ పద్ధతిలో వాదించడానికి నాకు ఆసక్తి లేదు.

  ఇక మీరు ఏది వ్రాసుకున్నా నాకు అభ్యంతరం లేదు. నేను చెప్పదలచుకున్నవి – చెప్పగలిగేవి చెప్పినందున ముగిస్తున్నాను.

 47. కొండలరావు గారు. గతితార్కికంగా చుడాలంటూ జగన్ పై దాడినీ , వ్యెక్తిగత ఆస్తికీ ముడిపెడుతున్నారన్నమాట !! అంటె జగన్ ఆస్తి రద్దు అయితె వ్యెక్తిగత ఆస్తి రద్దదైనట్టు బావిస్తారా?

  రాజ్యాంగ యంత్రం దుర్వినియొగం కానిది యప్పుడు?. అసలు రాజ్యాంగ యంత్రాన్ని ఆ వర్గంకొసం వాళ్ళు తయారు చేసుకున్నారు. వాళ్ళకు అనుకూలంగా చట్టాలలొ అనేక మార్పులు చెసుకుంటూ పొతారు. ఇందులొ సమస్యను లొతుగా చుడకపొవడమేమిటి? మీరు చుసిందేమిటి ?

  ఏ విషయానైనా ఒక దానికి ఇంకొకదానికి అన్వయించుకొనేటప్పుడు. ఆయా పరిస్తుతులనుపట్టిగాక యదాపధంలా తీసుకుంటే దాన్ని మక్కీకి మక్కీ అన్వయించుకొవటమంటారు. ఇక్కడ మక్కీకి మక్కీ యక్కడ తీసుకున్నారొ చెప్పండి? పుస్తక పటనం గురించి గతంలొనూ ఒక కామెంట్ చేశారు. అదేదొ పెద్ద నేరమైనట్టు. వ్యెక్తిగతంగా తెలుసుకునేది చాలా తక్కువ చాలా పరిమితి వుంటుంది. ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకొవాలంటె పేపరొ లేక పుస్తకాలే మార్గం. ఇప్పుడైతె ఇంటెర్ నెట్ వుంది. మీరు పుస్తకాలు చదవకుండానే ఇవన్నీ చర్చిస్తున్నారా?

  ఇతరుల అవగాహన తర్వాత ప్రశించుదురు ముందు మీ అవగాహన ఎలా వుందొ చుసుకొండి. మీ బ్లాగును ఒక్కసారి చుస్తె తెలుస్తుంది. మీ అవగాహన మీరు. స్తానిక పరిస్తితులకు గతం నుంచి మీ పార్టీ వాళ్ళు ఏమి అన్వయించుకున్నారు. మీరేదొ పెద్ద మేధావిలా ఫీలవుతున్నారు. నేచెప్పిందే వేదం అనేలాగ. భ్రమలు తగ్గించుకొండి

 48. కొండల్రావు గారు, ఏమిటండీ ఇది? ఇంత చీప్ గానా? మీరు చర్చ ముగించారు, నేనూ ముగించాను. మళ్లీ వచ్చి ఎకసక్కెం చేయడానికి ఎలా మనసొప్పుతుంది మీకు?

 49. రాం మోహన్ గారూ !

  అసలు పోస్టు ఏమిటి ? నా కామెంట్ ఏమిటి ? దానికి మీ కామెంట్ ఏమిటి ? ఇపుడు ఈ చర్చ ఏమిటి ?

  జగన్ ఆస్తి రద్దయితే వ్యగ్తిగత ఆస్తి రద్దయినట్లని నేను ఎక్కడ చెప్పాను?

  రాజ్యాంగ యంత్రం గురించి రాష్ట్ర ప్రభుత్వం పై – మంతృలపై వదిలేసి ,కేవలం జగన్ మీద దాడిని , సాక్షి కి ప్రభుత్వం ప్రకటనలు నిలిపివేయడాన్ని , ఇవి రెండూ రాజ్యంగ బద్ధంగా లేని దానిని నేను విమర్శిస్తున్నాను. మీరు సమర్ధిస్తున్నారు.

  నేను మేధావినని చెప్పలేదు. ఆ భ్రమలూ లేవు. నేను కమ్యూనిజం గురించి నాకు తెలిసింది మాత్రమే వ్రాస్తున్నాని అక్కడే చెప్పాను. ఒక వేళ మీరు మొత్తం మార్క్సిజాన్ని అవపోసన పట్టి ఉంటే మీ దగ్గర నేనుర్చుకునేందుకూ సిద్ధమే.(నాకు మార్క్సిజం సంప్పూర్ణంగా తెలియదు) కానీ అది మాకు అర్ధం కావాలి తప్ప అవహేళన చేయడం మంచిది కాదు.

  బ్లాగును బట్టి అంచనా వేస్తారా? ఏమి తప్పులు ఉన్నాయి నా బ్లాగులో. దీనిబట్టి అర్ధం కావడం లేదా? ఎవరు మేధావిలా ఫీల్ అవుతున్నారని.

  నా బ్లాగు మార్క్సిజం కోసం పెట్టలేదని మీకు గతం లోనే చెప్పాను.పనిలేక బ్లాగులో సీ.పీ.ఎం సభలను ఎద్దేవా చేస్తూ రాసిన సందర్భం లో జరిగిన చర్చకు సమాధానంగా అది రాస్తున్నాను. అపుడే చెప్పాను నేను మేధావిని కాదని.

  నా బ్లాగు గురించి ఇంతక ముందు కామెంట్ చేశారు. ఇది రెండోసారి. అప్పుడే నేను మీకు సమాధానం చెప్పాను.పోనీ ఇప్పుడు చెప్పండి నా బ్లాగులో సమాజానికి నష్టం కలిగించే అంశాలేమిటో? నాకు సరయిన సూచన అనిపిస్తే మార్చుకునేందుకు సిద్ధం.

  మీరు సీ.పీ.ఎం ను విమర్శించడం (అదీ నా పేరు పెట్టి ) తోటే మొదలయింది మీరు ఏదైనా మాట్లాడవచ్చు ఎదుటివాడు ఏమీ మాట్లాడకూడదా? అలాంటప్పుడు కామెంట్లు అనుమతించకుండా ఉండాల్సింది.

  పుస్తకాల అద్యయనం గురించి లెనిన్ అభిప్రాయమే నా అభిప్రాయం. పుస్తకాలు చదవకుండా ఎలా తెలుస్తాయి? కానీ చదివినదానిని పరిస్తితులకు అన్వయించుకుని ఋజువు పరచుకోవాలనే దానిమీదనే అ పుస్తక అధ్యయనం కు సంబంధించి.

  మొదట్నించీ మీరు పూర్తి విద్వేషం తోనే వాదిస్తున్నారు. అలాంటప్పుడు వాదించడం కష్టమే.

 50. నేనడిగిన వాటికి చేతనైతె సమాదానం చెప్పండి డొంకతిరుగుడుగా లాగితేనేం ఎలా లాగితేనేం.

  పార్టీ స్ధాపన నుంచి ఇప్పటివరకు బుర్జువా పార్టీలతొ పొత్తులో ఎలాంటి విధివిదానాలు పాటించారు. ఏం సాధించారు? భవిష్యత్తులొ ఏంచేయబొతున్నారు?

  కార్మిక వర్గాన్ని సాయుద పొరాటానికి ఎలా సన్నద్దం చేయబోతున్నారు. ఏమైనా ఇలాంటి కార్యక్రమాలు వున్నాయా?

  బుర్జువా పార్టీలకు కమ్యునిస్టు పార్టీలకు వున్న తేడా ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు లక్ష వేయవచ్చు. కమ్యునిస్టు ముసుగులొ చేసిన తప్పులకు మరో లక్ష ప్రశ్నెలు వేయవచ్చు.

  సి.బి.ఐ. ని, కాంగ్రెస్ ని యవరు మొశారు? కమ్యునిస్టు పార్టి ఏంచేసినా విమర్శించకూడదు. గుడ్డిగా అనుచరించాలి. గంగిరెద్దు లాగ అన్నిటికి తల ఊపుతూ వుండాలి. లేకపొతె సి.బి.ఐ.ని, కాంగ్రెస్ ని. మొసినట్టు. కదా?

  విశెఖర్ గారు, మీ అబిప్రాయాలను వ్యతిరేకించారు. కాబట్టి ఇక్కడికి రావడం తప్పుగా భావిస్తారు. మీ అభిప్రాయాలను సమర్ధించి వుంటె ఒప్పుగా భావిస్తారన్న మాట? ఒక వ్యక్తి సమర్ధించాడా, వ్యతిరేకించాడా అనేది కాదు చూడవలసింది. అందులొ తార్కికంగా వుందా లేదా అనేది చుడాలి, మన అభిప్రాయాలు తప్పుగా వున్నట్టు అయితె దాన్ని అంగీక రించాలి. దాన్ని ఓటమిగా భావించకుడదు. మనమీద అభిమానంతొ తప్పును సమర్దిస్తె ఆ వ్యెక్తి మనకు హానిచేసినట్టె. సత్యాన్ని తొక్కిపెట్టినట్టు.

 51. Even I did criticise panileka blogger ramana when he ridiculed dialectical materialism. Society runs according to material needs of people. There is nothing such as inability in understanding dialectical materialism if he really reads it.

 52. రాం మోహన్ గారూ !

  మీరడిగినవాటికి నా చేతనైన సమాధానాలే చెప్పాను.చేతగానివి తెలుసుకునేందుకు అభ్యంతరం లేదు. ఆ అవసరం వచ్చినప్పుడు మిమ్ములను అడిగి తెలుసుకునేందుకూ ఫీల్ కాను.

  ఇంకా ఏమి చెప్పాలి? మీరడిగిన వాటికి నేను చెప్పాలా ? పోస్టు పరిధిలో చెప్పాలా? మీరు ఇప్పుడడిగిన వాటికి కూడా సమాధానం చెప్పాలంటే ఒక్కోదానికి ఒక్కో పోస్టు వ్రాయాలి. అది మీకూ తెలుసు.

  కార్మికవర్గాన్ని సాయుధ పోరాటాన్ని ఎలా సన్నద్ధం చేయబోతున్నారు? ఒక్క వాక్యం లో చెప్పాలంటే జనతప్రజాస్వామిక విప్లవం ద్వారా.

  వున్న వ్యవస్థలోనే ప్రజలకు మేలు చేయవచ్చనేది బూర్జువా పార్టీల అంచనా. వ్యవస్థను సమూలంగా మార్చడం ద్వారా కార్మిక వర్గ నియంతృత్వం తో సోషలిజాన్ని తీసుకువచ్చేవి కమ్యూనిస్టు పార్టీలు. వ్యక్తిగత ఆస్తి రద్దు ద్వారా మాత్రమే అది సాధ్యం. అప్పుడే వర్గరహిత సమాజం ఏర్పడుతుంది.

  కమ్యూనిస్టు ముసుగు అనేది మీరు ద్వేషంతో పెట్టిన పేరు . దానిని మనసులో ఉంచుకునే ప్రతీది వాదిస్తున్నారు. నా అభిప్రాయాలను సమర్ధించాల్సిన అవసరం లేదు. అసందర్భంగా వాదించాల్సిన అవసరం లేదంటున్నాను.

  తార్కికత అంటే చర్చ పరిధిని దాటి వ్యక్తిగతం గా టార్గెట్ చేయడమా? తప్పు అయితే అంగీకరించాలి అంతే గానీ ఎదుటివాడు బలవంతం తోనో . ఎద్దేవతోనో కాదుగా.

  బూర్జువా పార్టీలతో పొత్తులతో తలబొప్పికట్టే స్థాయిలో అనుభవాలు వచ్చాయి సీ.పీ.ఎం కు. కొన్ని పార్లమెంటరీ భ్రమలూ తలకెక్కాయి. కొందరికి. అంత మాత్రాన . సీ.పీ.ఎం కు బూర్జువా పార్టీలకు తేడా లేదని ఒకే గాటన కడతారా? ఏ అవినీతికి – స్వంత ఆస్థిని పెంచుకోవడానికి పాల్పడ్డారు సీ.పీ.ఎం ప్రజాప్రతినిధులు. ప్రజాసమస్యలపైనా పోరాటాలు వర్గపోరాటాల పరిధిలోకి రావా? నోడల్ పాయింట్ కు , బాహ్య పరిస్తితులు అనుకూలించకుండానే తుపాకీ గొట్టం ద్వారానే విప్లవం వస్తుందా? ఇప్పటి పోరాటాలలోనే అనేకమంది ప్రాణాలు త్యాగం చేయలేదా? ఏ పదవులకోసం ఏ బూర్జువా పార్టీతో అంట కాగారు. పార్లమెంటరీ రంగం లో పోరాటాల ద్వారా కూడా తాత్కాలిక విజయాలు – కొన్ని చట్టలు సాధించుకోవచ్చనేదే సీ.పీ.ఎం అంచనా. అది నక్షలైట్లకు నచ్చక పోవచ్చు. అనచనాలో తేడా తప్ప అసలు సోషలిజం వద్దనేది కాదుగా. ఏది రైట్ అనేది ఆచరణ కాలం ఋజువు చేస్తాయి.

  ఏ కమ్యూనిస్టు పార్టీలో లేవు తప్పిదాలు. తప్పులు లేకుండా కార్యాచరణ ఉంటుందా? అయినా ఇవేవీ ఈ పోస్టుకు సంబంధంలేని ప్రశ్నలు. నేను ఫలాయనవాదం అంటున్నారు గనుక క్లుప్తం గా చెప్పాను. ఇవన్నీ ఎలాగూ జనవిజయం లో వస్థాయి కనుక అప్పుడు చర్చించడానికి నేను సిద్ధమే.

  సీ.పీ.ఎం ను గుడ్డిగా ముసుగు కమ్యూనిస్టులూ అనే భావనలో మీరూ – నేను సీ.పీ.ఎం ను గుడ్డిగా సమర్ధించడం కాకుండా , మన దేశ పరిస్తితులకు మార్క్సిజాన్ని ఎలా అన్వయించాలో తేల్చుకునేందుకు ఆ చర్చ ఉపయోగపడితే సంతోషం.

  కేవలం అదే కాదు మార్కిజానికి ప్రత్యామ్నయం ఉందా? అందులో లోపాలున్నాయా? ప్రపంచ వ్యాపితం గా ఎదురుదెబ్బలు అన్నీ ఆరోగ్యకరం గా చర్చించడానికి నేను సిద్దం. కానీ ఏ అంశానికి అంశం చర్చిద్దాము.

  నేను వ్రాస్తున్నాను కాబట్టి అని కాదు. నేను ఎలాగూ వ్రాస్తున్నాను కాబట్టి ఆహ్వానిస్తున్నాను. సిద్ధాంతం ఒక్కటే కదా? ఆచరణ అంచనాలలో లోపాలను విద్వేషం తో విమర్షించుకోవాల్సీన అవసరం – వ్యక్తులనే విద్వేషం గా చూడాల్సిన అవసరం లేదు కదా ?

  నాకు సీ.పీ.ఎం ఆచరణ మాత్రమే అవగాహన తెలుసు. మిగతా వాటి గురించి తెలియదు. అందుకే ఎక్కడా ఇతర కమ్యూనిస్టు పార్టీలను విమర్శించలేదు. సోషలిజం కంటే ఒక కమ్యూనిస్టుపార్టీని మరో కమ్యూనిస్టు విమర్షించడానికే ఎక్కువ ప్రాధాన్యత – ఆశక్తి చూపిస్తున్నారనేదే నా బాధ. మీరూ అదే చేస్తున్నరనేదే నా విమర్శ.

  నా బ్లాగు పై మీరు చేసిన కామెంట్లు కు సమాధానం చెప్పలేదు. నా బ్లాగును మార్కిజం బోధన తో పోల్చవద్దని మనవి. అలా కాకుండా సమాజానికి ద్రోహం చేసే అంశాలుంటే చెప్పండి. లేదా మీ అభిప్రాయాలు మెయిల్ చేయండి. అలా కాకుండా ఆరోపిస్తున్నారు.

 53. కొండల్రావు గారూ, పోస్ట్ కి సంబంధం ఉందా లేదా అన్నది ఇక వదిలేయండి. పోస్టుతో సంబంధం లేకుండా మీరు నిన్ననే చాలా విషయాలు చర్చించారు. రామ్మోహన్ గారు రాకముందు కూడా ఆ సంగతి ప్రస్తావించాను. వాటికి మీరు స్పందించలేదు గనక గుర్తించారనుకున్నా. రామ్మోహన్ గారు వచ్చాక మళ్లీ ‘పోస్టు తో సంబంధం’ లోకి వెళ్లిపోయారు.

  మీ చర్చను కొనసాగించండి. ఎలాగూ చర్చ జరుగుతోంది కదా.

 54. FYI, My hatred on CPM didnt start with Jagan’s issue or Telangana issue. I developed hatred on CPM while reading the book ” Insurrection to Agitation” written by Paramjit S Judge. CPM never motivated people to do class struggle but depended more on collaborating with bourgeois class.

 55. విశేఖర్ గారూ !

  ఏ చర్చనుండీ ఫలాయనం కావాల్సిన అవసరం నాకు లేదు. మీరా పదం వాడారు. నా స్వభావంతోనే వ్రాస్తానన్నారు కాబట్టి నేనూ మీకు సరే వ్రాసుకోండి అని చెప్పాను. దానిని మీరు ఇంత చీప్ గానా అన్నారు. పిర్రగిల్లి జోలపాడడం పద్ధతి కాదు.

  మీ పట్ల నా తొందరపాటుకు నేను విజ్ఞతతోనే సారీ చెప్పాను. మీరు మాత్రం వాదనకు దిగారు. ఉదయం నుండి చెపుతూనే ఉన్నాను. నాకు తెలిసీ అన్నీ మీరడగడం నేను చెప్పడం కాదు. ఏ చర్చకైనా ఒక పద్ధతి ఉంటుంది.

  మీరు మీ బ్లాగులోకి లాగి ఇష్టం వచ్చినట్లు దాడి చేస్తూ , ఫలాయనం అంటూ రెచ్చగొట్టడం బాగాలేదండీ. కమ్యూనిజం గురించి బ్లాగులు వ్రాసేవారెవరు అని నేను వెతికినప్పుడు నాకు మొదట తగిలింది ప్రవీణ్ గారు. రాం మోహన్ గారు నా బ్లాగులో కూడా ద్వేషం తోనే వాదనకు దిగారు. అప్పటినుండి అదే భావం తో ఉన్నారు. మీగురించి విన్నాక బహుశా 3 సార్లు కామెంట్లు పెట్టాను. అదీ మీకు మద్దతుగానే.

  ఈ రోజు వాదన అంతా దాడి పద్ధతిలో , రెచ్చగొట్టే పద్ధతిలోనే ఉంది. నేనేమీ సీ.పీ.ఎం ను అన్నింట్లో వెనుకేసుకు రావడం లేదు. మీరే గుడ్డి ద్వేషం తో ఉన్నారని విమర్శిస్తున్నాను. అది నిజం కాకపోయినా ఎలాగో కూడా చర్చిద్దాము. అంశాలవారీగా.మీరు విమర్శించవచ్చు కానీ ఎదుటివాడు విమర్శిస్తే అసహనం ఎదురుదాడికి దిగితే ఎలా?

  ఇప్పుడు చర్చలో వచ్చిన అంశాలన్నీ జనవిజయం బ్లాగులో చర్చకు వస్తాయి కనుక అక్కడే చర్చిద్దాము విసేఖర్ గారూ! రెండు చోట్లా సమయం కేటాయించలేను. ఈ అంశాలేవో ఆషామాషీగా వ్రాసుకునేవి కాదని మీ మూగ్గిరికీ తెలుసు.

  చర్చ తప్పనిసరిగా చేద్దాము. ఒక్కటే షరతు. ఎవరూ గుడ్డి వ్యతిరేకత గానీ – గుడ్డి అనుకరణ కానీ ఉండకూడాదు. వ్యక్తిగత టార్గెట్ లు , లేని అభిప్రాయాలు అంటకట్టకూడదని మనవి.

  ఈరోజు కోటిరత్నలు బ్లాగులో ప్రవీణ్ గారు ఒక వ్యాక్య వ్రాశారు. నాకు వేరే మితృలు చెప్పేదాక తెలియదు.దానికి కౌంటర్గా కామెంట్ ఇచ్చాను. మీరు చూసి అభిప్రాయం చెప్పండి వీలుంటే.

 56. కొండలరావు గారు. నేనడిగిన దానికి మీరు సిద్దాంత పరంగా చెపుతున్నారు. అదికాదు. నేనడిగింది. ప్రస్తుతం ఆపార్టీలు అలాంటి ప్రయత్నాలు ఏమైనా చెస్తున్నాయా? బుర్జువాలపై పొరాటం నేను యెకంగా తుపాకీ గొట్టంతొ సాగాలనడం లేదు. చిన్న చిన్న పొరాటాలు చెస్తునే తాత్కాలిక ఉపశవనంతొ పాటు సంపూర్నమైన ఉపశవనానికి ప్రణాళికలు వుండాలి. అలా దీర్ఘ కాలిక పొరాటానికి సన్నద్దం కావాలి. ముఖ్యంగా కార్మిక వర్గంలొ వర్గచైతన్యం నింపాలి.

  అనివార్య పరిస్తులవల్ల వెల్లవలసి వచ్చింది. మిగతాది రేపు చర్చించుకుందాం.

 57. కొండల్రావు గారూ, సి.పియం గురించి నేను కొన్ని అంశాలు చర్చించాను. ఆ చర్చకు మీరు స్పందించారా? స్పందించకపొగా గుడ్డి ద్వేషాన్ని నాకు అంటగట్టారు. రామ్మోహన్ గారిది రాజకీయ విమర్శ అని వివరిస్తే దాన్ని రామ్మోహ గారికి సమర్ధింపు అని ముద్ర వేశారు. అక్కడికి ఆయన్ని సమర్ధించడమే నేరం అయినట్లు.

  జగన్ పైన రాజ్యాంగ యంత్రాన్ని ఉపయోగించి కక్ష సాధిస్తున్నారు అని మీరు చేసిన విశ్లేషణకి సమాధానం చెబుతూ జగన్ సంపాదన మొత్తం రాజ్యాంగ యంత్రాంగాన్ని వినియోగించే సంపాదించిందని నేను విశ్లేషిస్తే “నేను జగన్ మాత్రమే అవినీతి చేశాడు కాంగ్రెస్ కు – రాజశేఖరరెడ్డికి సంబంధం లేదన్నానా ? అని మీరు అన్నది పై నుండి కామెంట్లు పరిశీలించేవారికి అర్ధమవుతుంది” అంటూ చర్చను పక్కదారి పట్టించారు.

  బెంగాల్ లో సి.పి.ఎం ప్రజావ్యతిరేక విధానాల్ని ప్రస్తావిస్తే, “వందలసార్లు వాదించినవే, ఇపుడు వాదించి ఉపయోగం లేదని మీ సమాధానం ను బట్టే అవగతమవుతుంది” అని నాపైన నాకు తెలియని నేరం మోపి చర్చను దాట వేశారు. “బెంగాల్ లో మమతతో అంటకాగి ఆ తరువాత ఇబ్బంది పడ్డదెవరో , సీ.పీ.ఎం ఓడి పోతే హర్షాతిరేకాలు చేసుకున్నదెవరో? ఆ తరువాత జరుగుతున్నదేమిటో చూస్తూనే ఉన్నాము” అంటూ మరో అసందర్భ ప్రస్తావన చేశారు. మమతతో అంటకాగిందెవరో, ఇబ్బంది పడ్డదెవరో గాని దాన్ని తెచ్చి మన చర్చలో అసందర్భంగా తేవడం ఏమిటీ? పోస్టుకి సంబంధం లేకుండా ఎన్నైనా మీరు చెప్పవచ్చు. రామ్మోహన్ గారు మాత్రం మీ అభిప్రాయం వెనుక సి.పి.ఎం అవగాహన ఉందని చెబితే మాత్రం అదో పెద్ద తప్పవుతుంది. మీరు కూడా పోస్టునుండి పక్కకు వెళ్లారని చెబుతున్నా చూడనట్లు దానిగురించే మాట్లాడరు. రామ్మోహగ్ గారికి మాత్రం పోస్టు పరిధి గురించి పదే పదే హెచ్చరిస్తారు.

  సి.పి.ఎం ఆచరణ గురించి నేను విమర్శ చేస్తే చర్చలోకి రావడానికి బదులు “ఏది సిద్ధాంతం అనేది ఎవరికి వారికే నేను చెప్పేదే సిద్ధాంతంలా భావిస్తారు. ఆచరణ ఋజువుచేస్తుంది దానిని. సిద్ధాంతాన్ని స్థానిక పరిస్థితులకు అన్వయించకుండా పుస్తకాలలో మాత్రమే చూస్తే ఉపయోగం ఉండదు. ఇంతకు మించి ఈ విషయం లో వాదించేది ప్రత్యేకం గా లేదు . పైన నేను వివరించినవి చూస్తే చాలు కనుక ముగిస్తున్నాను” అని ఎంచక్కా తప్పుకుని పోతారు. ఓ వైపు సూత్రాలు చెబుతారు. ఆ సూత్రాల్ని యధేచ్చగా ఉల్లంఘిస్తారు. ఉల్లంఘిస్తున్నారు కదాని చెబితే దాడి అంటారు.

  మళ్లీ ఒకసారి మీ వ్యాఖ్యలు చూడండి. ఎవరు దాడి పద్ధతిలో చర్చ చేసారో. నేను మీపైన వ్యక్తిగతంగా చేసిన దాడి ఎక్కడయినా ఉందా? అసలు ఈ చర్చ మొదలయిందే మా పైన వ్యక్తిగత దాడి వల్లే కదా.

  ఇవి చూడండి.

  “సీ.పీ.ఎం ఎన్నికల ఎత్తుగడల పైన మీ అవగాహన లోపభూరితం అని చెప్పదలచుకున్నాను.”

  “మీ వాదనను సమర్ధించక పోతే ఎదుటివాడి గొంతు నొక్కడానికి వాడే చీప్ ట్రిక్ అవుతుందది. దానిని మీరు సమర్ధించడం కూడా చర్చను దారి తప్పించడమే అవుతుంది. ఆలోచించండి. ఇంతకు మించి ఇక ఇందులో ఏమి వాదించినా – ఏమి సమర్ధించినా ఉపయోగం లేదు చర్విత చరణం తప్ప.”

  “అధికార యంత్రాంగాన్ని అడ్డమైన సేవలకు వాడుకోవడాన్ని ఒకే గాటన కట్టడం అవగాహానా రాహిత్యం – సమస్యను లోతుగా చూడలేక పోవడమే అవుతుంది.”

  “మక్కీకి మక్కి పుస్తక అధ్యయనం – చరిత్రలో లెనిన్-మావో …. ఇలా వారు చేసింది యథాతధంగా చేయడం కాదు.”

  ఇవన్నీ ఏమిటి చెప్పండి? నా అవగాహన లోపపూరితం అయితే ఆ లోపం ఏమిటో చెప్పాలి గాని లోపపూరితం అని స్వీపింగ్ స్వేట్ మెంట్ ఇస్తే? చీప్ ట్రిక్ అనీ, చర్చను దారి తప్పించడం అనీ, వాదించినా ఉపయొగం లేదనీ అనవలసిన అవసరం లేదు గదా. అవసరం లేకపొతే వాదన ఎందుకిక. వాదన మొదలు పెట్టాక వాదన అవసరం లేదనడం ఎందుకు? అవగానా రాహిత్యం? లోతుగా చూడకపోవడం? ఇలాంటి పదాలని యధేఛ్చగా మీరు వాడారు గాని నేను కాదే. నేనేమన్నా కటువుగా వ్యాఖ్యానిస్తే సి.పి.ఎం రాజకీయాలపైన వ్యాఖ్యానించాను గానీ మీ అవగాన లేదనీ, లోతుగా చూడలేదనీ అనలేదు గదా. ఇవన్నీ కాక మేము కేవలం పుస్తకాన్ని మక్కీ కి మక్కీ చెబుతున్నట్లు మరో వ్యాఖ్య. చర్చని కొనసాగించకుండా, చర్చాంశాల జోలికి పోకుండా మా అభిప్రాయాలపైన తీర్పులివ్వడం ఏమిటి?

  ఇవి కాక నా వివరణలో నా స్వభావం అంటూ మాట్లాడడం. చర్చని వదిలేసి నా స్వభావం గురించి ఎందుకు మీకు? అయినా దానికి నేను మర్యాదగానే బదులిచ్చా. మీగు ముగిస్తున్నారు గనక నేనూ ముగిస్తున్నానని చెప్పా. మళ్ళీ వచ్చి మీ స్వభావంతోనే రాయండి అని ఎగతాళి చేయలా? ఎగతాళి చేసేది మీరు, మళ్లీ ఎగతాళి చేస్తున్నారని మాపైనే ఆరోపణలు! ఇదేమి చర్చ? చర్చ జోలికి పోకుండా నా స్వభావం గురించి మళ్లీ ఎగతాళి చేయడాన్నే చీప్ గా చెప్పా. కాదా?

  ఆ తర్వాత కూడా?!

  జనంలో తొంభై తొమ్మిది మంది మార్క్సిజం విననే లేదని రామ్మోహన్ గారంటే సి.పి.ఎం వల్ల తొంభై తొమ్మిది మందికి తెలియకుండా పోయిందన్నారంటూ అంటగట్టడం.

  రామ్మోహన్ గారికి మీరిచ్చిన సమాధానంలోనూ ఇలాంటివే. సి.బి.ఐ ని కాంగ్రెస్ ని మోస్తున్నట్లు ఆరోపణ. ఎక్కడ మోసారని అడిగితే సమాధానం ఉండదు. సి.పి.ఎం ను విమర్శించడానికి బూర్జువాలతో అంటకాగుతున్నారని మరో ఆరోపణ. బెంగాల్ లో జరిగిందే ఇక్కడా జరుగుతోందని విషయం లేకుండా తీర్పిచ్చేస్తారు. మాము మేము మేధావులుగా భావిస్తున్నామనీ, కూపస్తమండూకాలమనీ అన్నది ఎవరు? మీరు కాదా? అన్నీ అయ్యాక మళ్లీ పోస్టుతో సంబంధం లేదని మళ్లీ మొదటికొస్తారు.

  మీరు సారీ చెప్పాక నేను వాదనకి దిగానా? ఏమిటండీ మీరు? మీరు చర్చకి సిద్ధపడితే మీరు చెప్పిన అంశాలపైన చర్చ మొదలు పెట్టాను తప్ప మళ్లీ మీ దూషణల జోలికి వెళ్ళానా? నేను ప్రస్తావించిన అంశాల జోలికి పోకుండా ఇంతకు మించి వాదన చేసేదేమీ లేదని మీరన్నారు గనక పలాయనవాదం అన్నాను. అలా ఎందుకన్నానో అక్కడే చెప్పాను. మళ్లీ ఇక్కడ?

  నేను ప్రస్తావించిన అంశాల్లొ గుడ్ది వ్యతిరేకత లేదు. చర్చించాను. లేదా చర్చకోసం ప్రస్తావనలు చేసాను. దాన్ని మీరే గుడ్డి వ్యతిరేకతగా ముద్ర వేసి స్టేట్ మెంట్స్ ఇస్తున్నారు.

  నా వ్యాఖ్యలని అర్ధం చేసుకోవడంలో మీరెక్కడో పొరబడుతున్నట్లుంది. మళ్లీ ఒకసారి నా వ్యాఖ్యలు చూడండి. సి.పి.ఎం రాజకీయాలపైన నా విమర్శలు కటువుగానే ఉంటాయి. కాని నేనెప్పుడూ కటువుగా మిమ్మల్ని అనలేదు. మీరే నన్ను అనరాని మాటలూ అంటున్నారు.

 58. ఓకే విసేఖర్ గారూ !
  అన్ని అంశాలూ జనవిజయం బ్లాగులో వస్తాయి. అక్కడే చర్చిద్దాము.ఇప్పుడే ఇక్కడే అంటే సాధ్యం కాదు. అవేమీ సింపుల్ విషయాలు కావు.సీ.పీ.ఎం మీద మీరేమీ గుడ్డి ద్వేషం తో ఉన్నారా? లేదా? చర్చ పరిధి – ఎవరు దాటారు? అనేది మీ విజ్ఞతకి వదిలేస్తున్నాను. మరోసారి పైనుండి క్రిందికి చదవండి. అప్పటికీ నేనే తప్పుగా వాదించాను మీరు సరిగా వాదించారు అంటే మీ ఇష్టం. వాదించుకుంటూ పోవడం వల్ల ప్రయోజనమూ లేదు. నాకు అంత తీరికా లేదు. జనవిజయం లో చర్చిద్దాము అని ఎందుకంటున్నానంటే అక్కడ ఎలాగూ చర్చ నడుస్తుంది కనుక. అదేమీ పద్ధతి తప్పడం కాదు కనుక మిమ్ములనూ అక్కడికే ఆహ్వానిస్తున్నాను.

 59. రాం మోహన్ గారూ !

  సంపూర్ణమైన ప్రణాలిక సీ.పీ.ఎం కార్యక్రమం లోనే ఉంది.

  ఎన్నికలలో ఎత్తుగడలు లో కొన్ని లోపాలు ఉన్నమాట వాస్తవం. బూర్జువాలతో పొత్తుల వల్ల కొన్ని ప్రమాదకరమైన లోపాలు వచ్చిందీ నిజం. పార్టీలోనూ కెరీరిజం ఝాడ్యం ప్రవేశించింది. గతం లో లా స్వచ్చంగా ఉందీ అని చెప్పడానికి లేదు.

  అయితే ఈ లోపాలు సరిదిద్దుకోవాలి తప్ప బూర్జువా పార్టీలకు సీ.పీ.ఎం కు తేడా లేనంతగా ఉన్నాయని నేను అనుకోవడం లేదు. సరిదిద్దుకోకపోతే అది మార్కిజం లోపం కాదు.

  కార్మిక వర్గం లో చైతన్యం నింపే క్రమం లో బాగానే లోపాలున్నాయి. అవి ఆచరణకు సంబంధించి సరిచేసుకోవాలి. సమాజం లోని పోకడల ప్రతిబింబాలు పార్టీలో ప్రమాదకరం గానే ఉన్నాయి.

  పార్లమెంటరీ భ్రమలు – కెరీరిజం అనేవి ముందుగా సీ.పీ.ఎం అధిగమించాల్సిన సవాళ్లు అని నా వ్యక్తిగత అభిప్రాయం.

  పార్టీ ఆంతరంగిక పోరాటమూ వర్గపోరాటమే కనుక ప్రస్తుతం అంతర్జాతీయంగా – జాతీయంగా ఉన్న పరిస్థితుల రీత్యా కూడా ప్రభావాలు అన్ని కమ్యూనిస్ట్ పార్టీల మాదిరిగానే సీ.పీ.ఎం మీదా ఉన్నాయి.

 60. కొండల్రావు గారూ, మళ్లీ అదే ధోరణి. మీరేమి వ్యాఖ్యానీంచారో సోదాహరణంగా చెప్పినా నా పైనే ఆరోపణలు. మీరు వెనక్కి వెళ్లకుండా ఉండడానికి కొన్ని ఉదాహరించినా ‘నేనేమీ అన్లేదు’ అనడం. మీ వ్యాఖ్యలనుండి కాపీ చేసి చెప్పినా అదే పద్ధతి. అన్నీ అయాక విజ్ఞత గురించి ఎందుకు లెండి.

  నాకు నా బ్లాగ్ మెయింటెయిన్ చెయ్యడం ప్రధాన బాధ్యత. నా మిత్రుల బ్లాగుల్లోకి కూడా వెళ్లలేకపోతున్నాను. కనీసం చదవలేకపోతున్నాను. నాకు ఖాళీ ఉన్నపుడు తప్పకుండా మీ బ్లాగ్ కి వచ్చి చర్చలో పాల్గొనడానికి ప్రయత్నిస్తాను. రాలేకపోతే ఏమీ అనుకోవద్దు దయచేసి. నేను ఉద్యోగం చేసుకుంటూ ఈ బ్లాగ్ నిర్వహిస్తున్నాను. గత కొన్ని రోజులుగా అనారోగ్యం వల్ల లీవ్ లో ఉన్నాను. అందువల్ల మీతో ఇంత తీరిగ్గా చర్చించడం కుదిరింది.

  నన్ను మీ బ్లాగ్ కి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. నేను రావడం తప్పనీ, పద్ధతి కాదనీ నేననుకోను. తప్పకుండా వస్తాను. కాని తరచుగా రాలేనని మనవి.

 61. విశేఖర్ గారూ!

  నిజం చెప్పాలంటే నాకు ఆ వ్యాఖ్యలు పైనుండి క్రిందకు తిరిగి చూసే ఓపిక కూడా లేదు.

  ఉదయం నుండి ఇదే పని. మీమీద నాకు గుడ్డి ద్వేషం అయితే లేదు. ఆ అవసరం లేదు. మార్కిజం కు సమబంధించి నేను సీ.పీ.ఎం లో కూడా కార్యకర్త లా పనిచేయడం లేదు. నేను బిజినెస్ చేస్తాను. జనవిజయం బ్లాగు కూడా మార్కిజం కోసం పెట్టింది కాదు. నాకు మార్క్సిజం మొత్తం తెలీదు.

  సీ.పీ.ఎం ఎన్నికల ఎత్తుగడ వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కుంటుంది. ఆ విషయాలు ప్రత్యక్షం గా నాకు తెలుసు. అవి కొన్ని తల బొప్పి గట్టే అనుభవాలూ ఉన్నాయి. ప్రస్తుతం ఏ ఎత్తుగడ అనేది నిర్ధారణ కాలేదు. అయితే బూర్జువా పార్టీలకు సమానం గా పోల్చడం దారుణమే.

  రెండోది మార్క్సిజం లో లోపాలుండబట్టే సోషలిస్టు దేశాలు కూలుతున్నాయా? అసలు మార్క్సిజానికి ప్రత్యామ్నయం ఉందా? మార్క్సిజం ఫెయిల్ అయిందా? ప్రస్తుత స్థితి ఏమిటి? ఇలాంటి వాటి మీద కూడా వ్యక్తిగతం గా నాకు కొన్ని భిన్నాభిప్రాయాలూ ఉన్నాయి.

  కానీ ఇవీ ప్రత్యామ్నయాలు అని చెప్పగలిగే చైతన్యం లేదు. బ్లాగులో వ్రాయడం మొదలెట్టాక తెలిసింది మరోసారి చదివి రాయాలని. అందుకే ప్రస్తుతం గతితార్కిక భౌతిక వాదం చదువుతున్నాను. మీరు చర్చలో ఉంటే నాకు వ్యక్తిగతం గా ఉపయోగం ఉంటుందనే ఆహ్వానించాను.

  సీ.పీ.ఎం దే రైట్ అని వాదించాల్సిన అవసరం గానీ, మార్క్సిజానికి మించినది లేదని గానీ వాదించాలని లేదు. కానీ అంతకంటే మంచివి ఇదిగో ఇలా అని చెప్పకుండా అనలేము కదా? విజ్ఞత అంటే మీరు బాధపడుతున్నారు. ఓ.కే నా మటుకు మళ్లీ ఇవన్నీ చూసి ఏది రైట్ ? ఏది తప్పు? అనే ఈగోలు వదలి సిద్ధాంత చర్చ వరకూ చేద్దామని మనవి.

 62. కొండల్రావు గారు, మార్క్సిజం సర్వమానవ సమానత్వాన్ని కోరుతుంది. ఒక మనిషిని మరొక మనిషి దోపిడి చేయని సమాజాన్ని స్ధాపించడానికి ఆచరణీయ మార్గాన్ని చూపింది. సర్వ మానవ సమానత్వానికి ప్రత్యామ్నాయం ఏముంటుంది చెప్పండి? ఏమన్నా ఉంటే మార్క్సిజానికి కొనసాగింపు ఉంటుందే కాని ప్రత్యామ్నాయం ఉండబోదని నా అవగాహన.

  పారిస్ కమ్యూన్ విఫలం అయింది. అయినా సమానత్వం కోసం ప్రయత్నాలు ఆగలేదు. రష్యాలో విప్లవం మొదట విఫలం అయింది. మరో పన్నెండేళ్లకు విజయం పొందింది. ఆ విజయం చైనాకి పాకింది. ఈ లోపు రష్యాలో పెట్టుబడిదారీ వర్గాలు పై చేయి సాధీంచి సోషలిస్టు నిర్మాణాన్ని ఆపేసి వెనక్కి ప్రయాణం కట్టారు. ఫలితంగా రష్యా పరిస్ధితి మన కళ్లముందుంది. చైనాలో డెంగ్ నాయకత్వంలో మళ్లీ పెట్టుబడిదారీ ప్రయాణం మొదలయింది. ఇప్పుడు చైనా పక్కా పెట్టుబడిదారీ దేశం. ఒకటిన్నర ట్రిలియన్ల ఫైనాన్స్ ని గుప్పిట్లో పెట్టుకుని అమెరికాని, యూరప్ ని ఆర్ధికంగా ఆశపెడుతోంది.

  పదార్ధం పుట్టిన దగ్గర్నుండి మొత్తం విశ్వపరిణామ క్రమాన్ని తాత్వికంగా వివరించగలిగిన సిద్ధాంతం మార్క్సిజం. దానికి ప్రత్యామ్నాయం మరొకటి ఉండజాలదు. ఏదయినా ఉంటే మార్క్సిజానికి కొనసాగింపే ఉండగలదు. అంటే: మార్క్సిజానికి కొనసాగింపు మార్క్సిజం-లెనినిజం, దానికి కొనసాగింపు ‘మార్క్సిజం-లెనినిజం-మావో ధాట్’. మరొకటి వస్తే దీనికి కొనసాగింపు రావాల్సిందే.

  సామ్రాజ్యవాద యుగంలో సోషలిస్టు విప్లవం ఎలా వస్తుందో లెనిన్ వివరించినందున అది లెనినిజం అయింది. లెనినిజం చేరికతో మార్క్సిజం-లెనినిజం సంపూర్ణ సమగ్ర సిద్ధాంతంగా అవతరించింది. కాని మూడో ప్రపంచ దేశాల్లో భూస్వామ్య వ్యవస్ధ ఇంకా కొనసాగుతున్న దేశాల్లో ప్రజాస్వామిక విప్లవానికి నాయకత్వం వహించలేని పరిస్ధితుల్లో పెట్టుబడిదారులు ఉన్న దేశాల్లో నేరుగా సోషలిస్టు విప్లవం రాదని మావో సూత్రీకరించాడు. ప్రజాస్వామిక విప్లవానికి పెట్టుబడిదారీ వర్గం నాయకత్వం వహించలేదు గనక కార్మికవర్గమే నేరుగా నాయకత్వం వహించే ‘నూతన ప్రజాస్వామిక విప్లవం’ అవసరమని మార్క్సిజం-లెనినిజాన్ని మావో సైద్ధాంతిక అన్వయం ఇచ్చాడు.

  మూడో ప్రపంచ దేశాల్లో గుణాత్మకంగా పరిస్ధితులు మారాయని ఎవరైనా సిద్ధాంతీకరిస్తే తప్ప ‘మార్క్సిజం-లెనినిజం-మావోధాట్’ కి ప్రత్యామ్నాయం లేదు. కొత్త సిద్ధాంతం ఏదయినా దీనికి కొనసాగింపుగా ఉంటుందే తప్ప మార్క్సిస్టు సామాజిక సూత్రాలని మరో ప్రత్యామ్నాయం లేదు. అంటే కొత్త సిద్ధాంతం అంటూ ఏదయినా ఉంటే దానికి పునాది మార్క్సిజమే అవుతుంది.

  మార్క్సిజం అంటే ఇవన్నీ పరిగణలోకి వస్తాయి. మార్క్సిజానికి మించింది లేదని నేను వాదిస్తాను. అందుకోసం నిలబడతాను. వెనకంజ వేయను. ఎందుకంటే అది అనుభవపూర్వకంగా నాకు అర్ధమయింది గనక.

 63. CPI upheld the Khrushchev’s theory of peaceful collaboration with capitalism. So, Maoists criticised CPI. CPM upheld parliamentary election system. So, Maoists criticised CPM. There is nothing such as personal criticism here to say that one leftwing party is interested in criticising another leftwing party.

 64. విశేఖర్ గారూ !

  మార్క్సిజానికి మించింది లేదు అని వాదించను. ప్రస్తుతానికి నాకు తెలిసినంత మేరకు మార్క్సిజానికి మించింది లేదు. మీరన్నదీ వాస్తవం కావచ్చు అనడానికి నాకు అభ్యంతరం లేదు.

  కొనసాగింపు అనేదానిలో మీతో నేను ఏకీభవిస్తాను. కొనసాగింపు – ప్రత్యామ్నయం లలో కొనసాగింపునే నేను ప్రత్యామ్నయం గా వాడాను. మార్క్సిజం పునాదులను మరచి అని నా ఉద్దేశ్యం కాదు. పాతది లేకుండా కొత్తది లేదు కదా ? కొనసాగింపు అనేది సరైన పదం. ప్రత్యామ్నయం అంటే మార్క్సిజం తప్పు అని అర్ధం వస్తుందేమో?

  మావో ఆలోచనా విధానం – నూతన ప్రజాస్వామిక విప్లవం గురించి నాకు పరిమితమైన నాలెడ్జ్ మాత్రమే ఉంది. వాటిగురించి సాధికారికంగా వాదించే జ్ఞానం ప్రస్తుతానికి లేదు. వీటికి సంబంధించి బుక్స్ ఏమి ఉన్నాయి?

  మనిషి కి బుద్ధి అనేది ఎలా ఏర్పడుతుంది? మనిషిని నడిపించే డ్రైవింగ్ ఫోర్స్ లలో కీలకమైన అంశాలు ఏమిటి? మార్క్సిస్టులలో కెరీరిజం సమస్య – నెగెటివ్ ధోరణి ఈ సమస్యలకు పరిష్కారం ఏమిటి?

  పదార్ధాన్ని బట్టే ఆలోచన అన్నప్పుడు ఒకే విషయం పై విభిన్న మానవ ధృక్పధాలు ఎలా కలుగుతున్నాయి? మంచి – చెడు – విచక్షణ – బుద్ధి అనేవి మనిషికీ మనిషికీ మధ్య తేడాగా ఎందుకుంటున్నాయి? ఇలాంటి కొన్ని ప్రశ్నలకు పరిపూర్ణమైన సమాధానాలు కావాలి.

  మీరు మార్క్సిజం ను ఎలా అధ్యయనం చేశారు? ఒక ఆర్డర్ లో బుక్స్ (తెలుగులో) సూచించగలరు. జనవిజయం లో కమ్యూనిజం గురించి సవ్యం గా చర్చిద్దాం కు వాటి అవసరం ఉంది. ప్రస్తుతం నేను బిజినెస్ చేసుకుంటున్నందున ఎక్కువ సమయం కేటాయించలేక పోతున్నాను. తక్కువ సమయం లో మార్క్సిజాన్ని ఒక శాస్త్రం లా ఈజీగా బోధించడమే దాని గోల్. దానికీ సీ.పీ.ఎం కు సంబంధం లేదు.

  నేను సీ.పీ.ఎం లో మాత్రమే పనిచేశాను. అంతకు ముందు టీ.డీ.పీ లో ఉన్నాను. మార్క్సిజం అధ్యయనం చేశాక మాత్రమే సమాజం మీద నికరమైన ఆలోచన ఏర్పడింది. దానిని మరింతగా పరిపుష్టి చేసుకునేందుకు ఎవరి దగ్గర నేర్చుకునేందుకైనా నాకు ఈగో ప్రాబ్లం లేదండి. ఇలా చెపుతున్నప్పుడే కొంచెం సమస్య వస్తున్నది. నేను చెప్పేది మాత్రం తెలుసుకోవడానికే . నిజంగా నాకు మార్క్సిజం పరిపూర్ణం గా తెలియదు. జనవిజయం బ్లాగు ప్రారంభించింది సరదాగా మాత్రమే. ఈ మధ్యనే దానిని సీరియస్ గా తీసుకుని మార్పులు ప్రారంభించాను. మీ బ్లాగును – కామెంట్ పాలసీని కొంత గమనిచాను. మార్క్సిజం ఒక ఆర్డర్ లో ఈజీగా అర్ధం చేసుకునేందుకు మీ అనుభవం మేరకు బుక్స్ సూచించగలరా? నాకు మెయిల్ చేసినా సంతోషం.

 65. కొండలరావు గారు. మిమ్మలను అంచనా వేయడానికి మీ బ్లాగే మార్గం. వేరే మార్గం లేదు. ఎందుకంటె అందులో వుండే ఆలోచనలు అభిప్రాయాలు మీవే కదా. ఒక పక్క కమ్యూనిజం గురించి మాట్లాడతారు. అంతలొనే భక్తి మార్గంలోకి వెళ్ళి చర్చ చేస్తారు. అసలు దేనిగురించి మీకు ఒక స్పస్టమైన అవగాహన లేదు. స్పస్టమైన అవగాహన వుంటె, ‘మార్క్సిజంలో లొపాలు వుండబట్టె సోషలిస్టు దేశాలు కూలుతున్నాయా? అసలు మార్క్సిజానికి ప్రత్యామ్నాయం వుందా? మార్క్సిజం ఫెయిల్ అయిందా?’ (అన్న ప్రశ్నలు వచ్చేవి కాదు.) ఇలాంటివే చాలా ప్రశ్నలు గతంలోనూ వేశారు. ఏదైనా ఒక విషయం పైన స్పస్టమైన అవగాహన వుంటె ఖచ్చితమైన అభిప్రాయాలు కలిగి వుండేవారు. ఇలా వూగిసలాట వుండదు. మీరు దానిగురించి తెలియకుండా మాట్లాడితే అది చదివిన వాళ్ళకు తప్పుడు సంకేతాలు వెళ్ళతాయి.

  ఒక పక్క కమ్యూనిజం, మార్క్సిజం గురించి మాట్లాడతారు. పుంఖానుపుంఖాలుగా సినిమా వ్యాసాలు రాస్తారు. దీన్ని యలా అర్దం చేసుకొవాలి? సినిమా వాళ్ళు కేవలం కళాకారులు మాత్రమే కాదు. వాళ్ళూ దొపిడీ వర్గానికి చెందిన వాళ్ళే. వందల కోట్లు దోస్తున్నారు. వాళ్ళ వర్గ భావజాలాన్ని నిరంతరమూ ప్రజలలో ప్రవేశ పెడుతున్నారు. ప్రజలు వాళ్ళను ఆరాధిస్తున్నారంటే వాళ్ళ కళను చూసి ఆరాధించడం లేదు. దాని వెనుక కీర్తి ప్రతిస్టలు, డబ్బు, కులము, మొదలగునవి వున్నాయి. ఒక్క పది నిమిషాలకు కోటి రూపాయలు తీసుకుంటె అది విలువ సూత్రం ప్రకారం కరక్టేనా? ఆ ఇచ్చేవాడు కార్మికవర్గం నుంచి లాగిన అదనపు విలువలోనుంచే ఇస్తాడు. ప్రజలను ఇద్దరూ కలసి దోచుకుంటున్నారు.

  కమ్యూనిస్టు పార్టీలు ఇప్పటి వరకూ బుర్జువా సంస్కరణ వాదానికే పరిమితమైనాయి. ఏపని చేసినా ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే చేస్తున్నాయి. అంతకు మించి వేరే గమ్యం అంటూ లేదు. యం.ఎల్.ఎ గా వున్న వాళ్ళపైన ఎన్ని ఆరోపణలు రాలేదు!

  చివరిగా ఒక ప్రశ్న. కమ్యూనిజం, మార్క్సిజం, సినిమాలు, భక్తి వీటన్నిటినీ ఒకే గాటన కట్టేశారా? నిన్న కుడా రామాయణం గురించి భక్తిపారవశ్యంలో మునిగి రాశారు. అన్నీ రామాయణంలొ వున్నాయని. ఇకనుంచి కమ్యూనిజం, మార్క్సిజం అంటూ మాట్లాడకండి. మీ ఇష్టం ఏ మైనా రాసుకోండి. మిమ్మలను అడగవలసిన అవసరం లేదు.

 66. నిన్న నేను ట్రైన్‌లో ఉండడం వల్ల కంప్యూటర్ లేక ఫోన్‌లో టైప్ చేస్తూ కామెంట్లు వ్రాయాల్సి వచ్చింది. అందుకే ఇంగ్లిష్‌లో కామెంట్లు వ్రాసాను. ఒక కమ్యూనిస్ట్ పార్టీ ఇంకో కమ్యూనిస్ట్ పార్టీని ఎందుకు విమర్శిస్తోంది అని నిన్న కొండలరావు గారు అడిగారు. ఆయన గూగుల్ ప్లస్‌లో కూడా కమ్యూనిస్ట్ పార్టీలన్నీ ఐక్య వేదికగా ఏర్పడాలని వ్రాసారు. వర్గ పోరాటాన్ని బలంగా సమర్థించే CPI(మావోయిస్ట్) పార్టీ, వర్గ సహకారాన్ని అడ్వొకేట్ చేసే CPI, CPMలతో కలిసి ఐక్య వేదికగా ఏర్పడడం సాధ్యం కాదు అని నేను ఇంతకు ముందే చెప్పాను. ఆయన ఆ విషయం చదివారో, చదివినా అర్థం కాలేదో నాకు తెలియదు. CPM కార్యకర్తలు సాయుధ పోరాటానికి ప్రజలని సంసిద్ధం చెయ్యకపోవడం వల్లే 1967లో CPM చీలిపోయి నక్సలైట్ ఉద్యమం వచ్చింది. ఆ పార్టీతో కలిసి మావోయిస్ట్‌లు ఐక్య వేదికగా ఏర్పడే అవకాశం లేదని నేను ఖచ్చితంగా చెప్పగలను.

 67. రామమోహన్ గారు, సినిమాలలో ఆడవాళ్ళని అర్థనగ్నంగా చూపించేవాళ్ళు ఎవరూ తాము మార్క్సిస్ట్‌లమని చెప్పుకోరు. వాళ్ళు చేసేది వ్యాపారం అని వాళ్ళకి తెలుసు, ఆ సినిమాలు చూసేవాళ్ళకి కూడా తెలుసు. దానికి మార్క్సిజం ముసుగు వేసుకోగలమని ఎవరూ అనుకోరు. ఈ విషయం కూడా నేను గూగుల్ ప్లస్‌లో వ్రాసాను. తెలంగాణావాదం గొడవలో నేను కొండలరావు గారిని బ్లాక్ చెయ్యకముందు గూగుల్ ప్లస్‌లో నా పోస్ట్‌లన్నీ కొండలరావు గారికి కనికించేవి. ఆయన ఆ విషయం చదివారో, చదివినా అర్థం కాలేదో నాకు తెలియదు. కొంత మంది సినిమావాళ్ళు తాము చేస్తున్నది వ్యాపారమే కానీ సమాజ సేవ కాదని బహిరంగంగా చెప్పుకున్నారు. సమాజ సేవ కోసం సినిమాలు తీస్తే ప్రజలు చూడరు అని కూడా వాదించి ఆ సినిమావాళ్ళు తమని తాము జస్టిఫై చేసుకున్నారు. మూఢ నమ్మకాలని నేను విమర్శిస్తూ వ్రాసినప్పుడు కొండలరావు గారు అభ్యంతరం చెపుతూ “ఆ నమ్మకాలని మనం విమర్శించకూడదు, వాటిని నమ్మేవాళ్ళ నమ్మకాల స్థాయి అలాగే ఉంటుంది” అని వాదించేవాళ్ళు. కోట్లకి కోట్లు అవినీతి చేసేవాళ్ళకి కూడా ఒక నమ్మకం బలంగా ఉంటుంది “డబ్బంటే ఎవరికి చేదు” అని. అలాగని జగన్, గాలి జనార్ధనరెడ్డిల నమ్మకం స్థాయి కూడా అలాంటిదే అనుకోగలమా?

 68. భక్తి విశ్వాసాలు ఉన్నవాళ్ళు కూడా నిరంతం అవే నమ్మకాలని పట్టుకుని వేలాడరు. మత భక్తులని కించపరిచే సామెతలైన “పంగనామాలు పెట్టుకున్నాడు”, “చెవుల్లో పువ్వులు పెట్టుకున్నాడు”, “కొత్త వైష్ణవునికి పంగనామాలు ఎక్కువ” తదితర వాక్యాలు ఉపయోగించేది కూడా మత భక్తులే. మత భక్తులకే మత విశ్వాసాలపై అంత గౌరవం లేనప్పుడు మార్క్సిస్ట్‌లు మాత్రం వాటిని పట్టించుకోవడం అవసరమా?

 69. రామ్మోహన్ గారూ, సినిమా సంపాదన గురించి చక్కగా వివరించారు. సినిమాల్లో ప్రవహిస్తున్న సొమ్మంతా ‘మనీ లాండరింగ్’ తో సమానం. అందువల్లనే మాఫియాల డబ్బు కూడా బాలీ, టాలీ, కాలీ… ఇలా అన్ని వుడ్స్ లోకి ప్రవహిస్తూ మరిన్ని కోట్లు పోగేస్తోంది. రెండు గంటల ‘అపవిత్ర ఆనందాన్ని’ అందించి పేద ప్రజల కష్టార్జితాన్ని కళ పేరుతో దోచుకుంటున్నారు.

 70. సినిమాల సంగతి చాలా మందికి తెలిసినదే. కుటుంబాలతో కలిసి సినిమాలకి వెళ్ళే ప్రేక్షకులు (క్లాస్ ప్రేక్షకులు)ని ఆకర్షించడానికి హీరో గారి అక్కాచెల్లెళ్ళని ఒంటినిండా చీరతో చూపిస్తారు. మాస్ ప్రేక్షకులు (కాలేజ్ స్నేహితులతో కలిసి సినిమాలకి వెళ్ళేవాళ్ళు )ని ఆకర్షించడానికి హీరోయిన్‌ని అర్థనగ్న దుస్తులలో చూపిస్తారు. ఆ సినిమావాళ్ళ మనసులో ఏముందో ఆ సినిమాలు చూస్తే అర్థమైపోదా?

 71. సాక్షి పత్రిక యొక్క బ్యాంక్ అకౌంట్‌లు ఫ్రీజ్ చెయ్యడాన్ని CBI కోర్ట్ సమర్థించింది. ఆ అకౌంట్‌లలో ఉన్నవి చట్టబద్ధమైన (బూర్జువా చట్టాల ప్రకారం సంపాదించిన) డబ్బులు అనడానికి కూడా ఆధారాలు లేవు. సాక్షి పత్రిక పై ఉన్న కోర్ట్ కేసులు ఋజువులు కాకపోతే అప్పుడు ఆ అకౌంట్‌లని తిరిగి యాక్టివేట్ చెయ్యొచ్చని కూడా ప్రకటించింది. జగన్‌పై బూర్జువా వర్గంవాళ్ళకి కూడా లేని సానుభూతి మార్క్సిస్ట్‌లకి మాత్రం అవసరమా?

 72. కొండల్రావు గారు,

  కొన్ని ప్రాధమిక విషయాలు చెబుతాను. నూతన ‘ప్రజాస్వామిక విప్లవం – మావో ధాట్’ వివరణకి ఇవి అవసరం అని భావిస్తూ ఇవి రాస్తున్నాను.

  ఇప్పుడు ప్రపంచంలో రెండు ప్రధాన వ్యవస్ధలు ఉన్నాయి. ఒకటి సంపూర్ణ పెట్టుబడిదారీ వ్యవస్ధలు, రెండు అర్ధ భూస్వామ్య అర్ధ వలస వ్యవస్ధలు.

  సాధారణంగా బయటి దేశాల జోక్యం లేకుంటే భూస్వామ్య వ్యవస్ధలను కూల్చివేయాల్సిన కర్తవ్యం పెట్టుబడిదారీ వర్గంపై ఉంటుంది. ఇతర వర్గాలను కలుపుకుని తన నాయకత్వంలో పెట్టుబడిదారీ వర్గం అభివృద్ధి నిరోధక భూస్వామ్య వర్గాన్ని ఆధిపత్యం నుండి కూలదోసి వ్యవస్ధ పగ్గాలను చేజిక్కించుకుంటాయి. దీనిని ‘ప్రజాస్వామిక విప్లవం’ అంటారన్నది మీరు ఎరిగినదే. ఇలాంటి విప్లవాలు ఫ్రాన్సు, బ్రిటన్, అమెరికా, రష్యా, జర్మనీ లాంటి దేశాలలో జరిగాయి. అందువల్లనే అవి పక్కా పెట్టుబడిదారీ దేశాలుగా పరిపక్వం చెందాయి.

  మూడో ప్రపంచ దేశాల్లో ప్రజాస్వామిక విప్లవాలకు వలస దురాక్రమణ దేశాలు అడ్డు పడ్డాయి. బ్రిటన్, ఫ్రాన్సు, హాలండ్, పోర్చుగల్ లాంటి దేశాలు వ్యాపారం కోసం వచ్చి ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలను ఆక్రమించి వలసలుగా చేసుకున్నాయి. ఇది మీరెరిగినదే. వీరిలా రావడం వల్ల మూడో ప్రపంచ దేశాల్లో పెట్టుబడిదారీ వర్గం స్వతంత్ర వర్గంగా అభివృద్ధి కాలేదు. దానికి కారణం వలస శక్తులే. వీరిని మనం సామ్రాజ్యవాదవర్గం అంటున్నాం. అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ వర్గం ఇతర పెట్టుబడిదారుల్ని ఎదగనివ్వదు. తనకు పోటీ రాకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎదగనివ్వకుండా అణచివేస్తుంది. లేదా తనకు అనుచరులుగా, జూనియర్ పార్టనర్లుగా చేసుకుంటుంది. తన ప్రయోజనాలకి లోంగి ఉండేలా చేసుకుంటుంది. మూడో ప్రపంచ దేశాల్లోని పెట్టుబడిదారీ వర్గాన్ని వలస వాదులు (సామ్రాజ్యవాదులు) ఇలాగే అణచివేశారు. లేదా తమకు లొంగి ఉండేలా చేసుకున్నారు. భారత దేశ పెట్టుబడిదారీ వర్గం కూడా ఇలాగే బ్రిటిష్ సామ్రాజ్యవాదుల కనుసన్నల్లో ఎదిగారు తప్ప స్వతంత్రంగా ఎదగలేదు.

  స్వతంత్ర పెట్టుబడిదారీ వర్గం అంటే ఏమిటి? పెట్టుబడిదారులు సర్వ స్వతంత్రులయితే తమ దేశ వనరులని ఇతర దేశాల పెట్టుబడిదారీ వర్గం దోచుకోవడానికి అనుమతించరు. వారికి నేషనలిస్టు సెంటిమెంట్స్ ఉంటాయి. జాతీయత వారిలో ఉట్టిపడుతుంది. జాతీయ భావనలతో సామ్రాజ్యవాద పెట్టుబడి తమ దేశంలోకి రాకుండా అడ్డుకుంటారు. మా దేశంలోకి రావడానికి మీరెవరని ప్రశ్నిస్తారు. వారిని దేశం నుండి పారద్రోలడానికి నడుం కడతారు. దురాక్రమణలకి వ్యతిరేకంగా సాయుధ యుద్ధానికి దిగుతారు. సామ్రాజ్యవాదులను లేదా వలస వాదులను దేశం నుండి తరిమి కొట్టేదాక నిద్రపోరు. వారలా చేయకపోతే వారి వారి దేశాల్లో వారే స్వతంత్రంగా తమ కార్మికవర్గాన్ని దోపిడీచేసే స్వేచ్ఛ వారికి ఉండదు.

  కాని మూడో ప్రపంచ దేశాల్లోని పెట్టుబడిదారీ వర్గం స్వతంత్రంగా ఎదగడానికి వలస సామ్రాజ్యవాదం అడ్డుపడింది. వారి స్వతంత్ర ఆకాంక్షలను అణచివేసి తమకు లొంగి ఉండేలా చేసుకున్నారు. ఫలితంగా పేద దేశాల పెట్టుబడిదారీ వర్గం వలస సామ్రాజ్యవాదులకు లొంగిపోయారు. తద్వారా తమ దేశ ప్రజల స్వతంత్ర ఆకాంక్షలకు ద్రోహం చేశారు. దేశ వనరులను సామ్రాజ్యవాదులు కొల్లగొడుతుంటే వారికి సహకరిస్తూ దోపిడీ సొత్తు లో జూనియర్ భాగం పంచుకున్నారు.

  తమ తమ దేశాల్లో భూస్వామ్య వర్గాన్ని కూలదోసిన పెట్టుబడిదారులు (ప్రధానంగా పశ్చిమ దేశాల్లో) మూడో ప్రపంచ దేశాల్లో భూస్వామ్య వర్గాన్ని కూలదోసే పని పెట్టుకోలేదు. అది వారికి అనవసరం. తమ దేశాల్లొ తమ ఆధిపత్యానికి, పెట్టుబడిదారీ వర్గం అభివృద్ధికీ భూస్వామ్య వర్గం అడ్డుపడింది గనక దాన్ని కూలదోయవలసిన అవసరం వారికి తలెత్తింది. కాని మూడో ప్రపంచ దేశాల్లో వారికా అవసరం లేదు. అప్పటికే ఆ దేశాలని వలసలుగా చేసుకున్నందున అక్కడి ఆధిపత్య వర్గాలన్నీ వారి ఆధీనంలోనే ఉన్నాయి. కనుక మూడో ప్రపంచ (మూ.ప్ర) దేశాల్లో భూస్వామ్య వర్గాన్ని వారు కొనసాగింపజేసారు. కాని భూస్వామ్య వర్గానిది పూర్తి ఆధిపత్యం కాదు కనక అది అర్ధ భూస్వామ్య వ్యవస్ధ అయింది వలసగా ఉంది గనక వలస వ్యవస్ధ అయింది. ఆ విధంగా ‘సో కాల్డ్’ స్వతంత్రం వచ్చేవరకూ అవి వలస-అర్ధ భూస్వామ్య దేశాలుగా కొనసాగాయి.

  అర్ధ భూస్వామ్య వ్యవస్ధ అంటే భూ సంబంధాలన్నీ భూస్వామ్య వ్యవస్ధ రీతిలోనే కొనసాగడం. భూమిలో అధిక భాగం కొద్ది మంది చేతిలో కేంద్రీకృతం కావడం. భూమి కేంద్రంగా ఉన్న శ్రామికవర్గం (రైతులు, కూలీలు) చేతిలో భూమి లేకపోవడం. భూమిపై వారు శ్రమలో అధికభాగం భూస్వాముల పరం కావడం. వలస వ్యవస్ధ అంటె దేశ వనరుల సంపద అంతా విదేశాలకు తరలి వెళ్లడం దేశంలోని ఏ వర్గానికి స్వతంత్రత లేకపోవడం. వలస శక్తుల దయాదాక్షిణ్యాలపైనే దేశీయ వర్గాలన్నీ ఆధారపడడం.

  (ఇంకా వుంది)

 73. ఒకవేళ సాక్షి పత్రిక మూతపడినా జగన్‌కి పెద్ద నష్టం ఉండదు. ముఖ్యమంత్రి అవ్వకముందే రాజశేఖరరెడ్డి కుటుంబం బేరైట్స్ వ్యాపారంలో సంపాదించిన డబ్బు ఉంది. జగన్ కుటుంబ సభ్యులు తమ పాత వ్యాపారమైన బేరైట్స్ వ్యాపారం చేసుకుని విలాసంగా బతకగలరు.

 74. ప్రవీణ్ గారు. కొండలరావు లాంటి వాళ్ళవల్ల మార్క్సిజానికి అంతొ ఇంతొ నష్టం వాటిల్లుతుంది. వాళ్ళ మాటల్లోను, చేతల్లోను ఏమాత్రం పొంతన వుండదు. మార్కిజం మాట్లాడే వ్యక్తి, భక్తి గురించి మాట్లాడుతున్నాడంటె ఇక మార్కిజాన్ని ఏమి అర్దం చేసుకున్నట్టు? ఆయన ఏదో కాలక్షేపానికి రాసుకున్నట్టు వుంది. నిబద్దత లేదు.

  అవును శేఖర్ గారు. మీరన్నట్టు మాఫియా డబ్బు అన్ని వుడ్లలోకి ప్రవహిస్తుంది. ఆ బూతు సినిమాలనే మన మార్క్సిస్టు కొండలరావు గారు మహదానందంగా వాళ్ళను పొగుడుతూ పుంఖానుపుంఖాలుగా వ్యాసాలు రాశారు.

 75. రామ్మోహన్ గారూ, కొండల్రావుగారిపై మీ విమర్శలు కొంత ఘాటుగా హర్టింగ్ గా ఉంటున్నాయి. చర్చ సజావుగా సాగడానికి చర్చలో ఉన్న వ్యక్తుల్ని హర్ట్ చేయకుండా ఉంటే బాగుంటుంది. ఆఫ్ కోర్స్, మీ విమర్శలో వాస్తవాలున్నాయి. అవే వాస్తవాలని మరి కొంత సరళంగా చెప్పవచ్చునేమో చూడండి.

 76. రాం మోహన్ గారూ !

  నా బ్లాగు గురించి ఇదేనా మీరనుకునేది. మీ సూచనలకు సంతోషం. నా బ్లాగులో వచ్చేవన్నీ నేను వ్రాసేవి కావు. అయినా నా పేరుతో వచ్చేవాటికి నేనే బాధ్యత వహించాలి. మీరు చెప్పిన వాటి గురించి తప్పక ఆలోచిస్తాను. అవసరమైన మార్పులు చేస్తాను. ఇలాంటి సూచనలు మీరు ఎపుడైనా చేయవచ్చు.

  నన్ను అంచనా వేయడానికి నా బ్లాగే మార్గం అన్నదానిని నేను పాజిటివ్ గానే తీసుకుంటున్నాను. ఆ మేరకు నా బ్లాగులో మార్పులకు ప్రయత్నిస్తాను. బ్లాగును ఇంతగా అబ్సర్వ్ చేస్తారని ఊహించలేదు. ఇకపై ఎవరు వ్రాసిన పోస్టులకు వారి పేర్లు వచ్చేలా చూస్థాను. శక్తివంతమైన మీడియాగా ఉన్న సినిమాలగురించి వ్రాయడం తప్పని నేననుకోను. కాకపోతే సినిమాలలో మార్పుకోసం వ్రాయాలి. ఆ స్థాయిలో లేవు. నాణ్యత పెరగాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ప్రయోగ దశలోనే ఉంది నా బ్లాగు. మీతో పాటు మరొకరు కూడా నా బ్లాగులో మార్పులగురించి సూచించారు. బ్లాగును ఒక పద్ధతి ప్రకారం మెయింటెయిన్ చేయడానికి నాకు 2 నెలల సమయం పడుతుంది.

  మార్క్సిజం – సోషలిస్టు దేశాల గురించి ప్రశ్నించడం తప్పు కాదు. ఆ పరిణామాలపై నేను వ్రాశాక మీ అభిప్రాయం చెప్పండి. రామాయణం గురించి మీరు చెప్పిన సూచన మంచిదే. అది నాకు కూడా అనిపించినదే. ఇలాంటి వైరుధ్యాలు చాలా ఉన్నాయి నా బ్లాగులో .

  దీనికి మీరు చెప్పినవి కొన్ని అంశాలు నాకు ఉపయోగపడేవి+ సరయినవి కూడా కనుక వాటి గురించి ఆలోచిస్తాను.ఇవన్నీ నాకు ఉపయోగ పడేవే కానీ ఇతరులకు నష్టం కాదు.

  మార్క్సిజం గురించి ఊగిసలాట అనేకంటే నేను పునస్చరణ క్రింద తీసుకుంటున్నాను. నేను ఊగిసలాటతో ఉన్నా మార్క్సిజం ఒక వ్యక్తి ఊగిసలాటకు తత్తరపాటు పడేది కాదు. మార్క్సిజం గురించి ఎంత చర్చిస్తే అంత ఉపయోగమే తప్ప నష్టం లేదు. కనుక నేను తప్పు వ్రాసినా భయపడాల్సిన అవసరం లేదు. సరిచేసే వారు చాలామందే ఉంటారు. నేను మార్క్సిజం ను ఈజీగా చెప్పే ప్రయత్నం చేస్తున్నానే తప్ప నాకు మార్క్సిజం సంపూర్ణం గా తెలుసని కాదు. నా బ్లాగు కి మార్క్సిజం ప్రచారానికి , నా బ్లాగును మార్క్సిటు బ్లాగుగా ఇక ముందు కూడా చూడొద్దు. బ్లాగు అనేది అన్ని విషయాల సమాహారం గానే ఉంటుంది ఇక ముందు కూడా.

  అందులో మార్క్సిజం అనేది ఒక చర్చగా ఉంది. అదీ పనిలేక బ్లాగులో చర్చ పరిణామాలతో వచ్చింది. దానివల్ల నేను మళ్లీ మార్క్సిజాన్ని చదువుతున్నందున నాకు వ్యక్తిగతంగా ఉపయోగమే జరిగింది.

  కమ్యూనిస్టు పార్టీల వైఖరి కూడా అక్కడే చర్చిద్దాము. ద్వేషం ప్రదర్శిస్తున్నట్లుగా ఉంటోందనేది నా ఆరోపణ . అది నిజమనిపిస్తే సరిచేసుకోవడానికి ప్రయత్నించాలని విజ్ఞప్తి. లేదనుకుంటే మీ ఇష్టం.

 77. నక్షలైట్లు సాధించిందేమిటి ప్రవీణ్ గారూ ! నక్షలైట్లు సాయధపోరాటం చేస్తున్నారా?

 78. జగన్ పై దాడికి బూర్జువాలతో గొంతు కలపాలా? అని నేనంటే సరిపోతుందా? ఏ అంశానికి ఆ అంశం మాట్లాడుకుంటే మంచిది. జగన్ పైన సానుభూతి ప్రకటించాల్సిన అవసరం మార్క్సిస్టులకు లేదు. మార్క్సిస్టులపై గుడ్డి ద్వేషం తో అలా ప్రచారం చేయాల్సిన అవసరం లేదు.

 79. రాం మోహన్ గారూ ! మీ వల్ల – ప్రవీణ్ గారి వల్ల మార్క్సిజానికి కలిగిన మేలు ఏమిటో చెప్పండి. మీ ఆచరణ ఏమిటో చెప్పండి. దానిని బట్టి పోల్చుకుని చూసి నా వల్ల నష్టమా? మీ వల్ల నష్టమా ? ఆలోచిస్తాను.

 80. మూ.ప్ర దేశాల్లో జాతీయ విముక్తి ఉద్యమాలు బద్దలయాక వలస పాలకులకు ప్రత్యక్ష దోపిడిని కొనసాగించడానికి వీలు లేకుండా పోయింది. అశేష శ్రామిక ప్రజలు విదేశీ పాలనకు వ్యతిరేకంగా నిర్ణయాత్మకంగా ఉద్యమించడంతో వలస పాలకులు కొత్త ఎత్తుగడ వేశారు. ప్రత్యక్షంగా వలస దేశాల్లో ఉంటూ దోపిడికి పాల్పడడం కాకుండా ఆయా దేశాల్లో తమ ప్రతినిధులను నియమించుకోవడం వారి కొత్త ఎత్తుగడ. మూ.ప్ర దేశాల భూస్వామ్య, పెట్టుబడిదారీ వర్గాలు అప్పటికే విదేశీ వలస పాలకుల కనుసన్నల్లో అభివృద్ధి చెంది ఉన్నాయి. తమ అదుపులో ఉన్న దేశీయ పాలకవర్గాలకే ఆయా దేశాల్లో అధికార పగ్గాలను వలస పాలకులు కట్టబెట్టారు. ఆ విధంగా ‘అధికార మార్పిడి’ కి వారు పూనుకున్నారు. అలాంటి ‘అధికార మార్పిడి’ కే ‘స్వాతంత్ర్యం’ గా దేశీయ పాలకవర్గాలు ఇప్పటికీ చెప్పుకుంటున్నాయి.

  ‘పెట్టుబడిదారీ వ్యవస్ధ అత్యున్నత దశే సామ్రాజ్యవాదం’ అంటూ సామ్రాజ్యవాద దశ గురించి లెనిన్ చేసిన సూత్రీకరణ ఎంతటి సుప్రసిద్ధమో అందరికీ తెలిసినదే. అలాంటి సామ్రాజ్యవాద దశ ప్రవేశించాక ‘ఫైనాన్స్ పెట్టుబడి’ మూ.ప్ర దేశాలను కొల్లగొట్టడానికి శక్తివంతమైన సాధనంగా ముందుకు వచ్చింది. ఫైనాన్స్ పెట్టుబడిని మూ.ప్ర దేశాలకు ఎగుమతి చేసి అక్కడి ఆధిపత్య వర్గాలను లొంగదీసుకుని సామ్రాజ్యవాద దోపిడిని యధేచ్ఛగా కొనసాగించడం ఈ దశలో ముఖ్య లక్షణం. ఈ లక్షణం ఇప్పటికీ కొనసాగుతోంది. భారత దేశం అందుకు మినహాయింపు కాదు.

  సామ్రాజ్యవాద దశలో దేశీయ పెట్టుబడిదారులు, భూస్వాములు స్వతంత్రులు కారు. వారి ఆర్ధిక ప్రయోజనాలన్నీ సామ్రాజ్యవాదుల ప్రయోజనాలతో కట్టివేయబడి ఉంటాయి. సామ్రాజ్యవాద కంపెనీలు పెట్టుబడులతో, టెక్నాలజీతో మూ.ప్ర దేశాల వనరులను, శ్రమ శక్తిని కొల్లగొడుతుండగా వారి దోపిడిలో భాగం తీసుకుంటూ దేశ బూర్జువాలు, భూస్వాములు ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలను, తిరుగుబాట్లను అణచివేస్తూ ఉంటాయి.

  ఈ దశలో మూ.ప్ర దేశాల్లో విప్లవాలకి ఎవరు నాయకత్వం వహిస్తారు? మామూలుగానైతే భూస్వామ్య వర్గాలను కూలదోసి సమాజాన్ని ప్రజాస్వామిక యుగం వైపుగా విప్లవీకరించవలసిన బాధ్యత పెట్టుబడిదారీ వర్గంపైనే ఉంటుంది. కాని మూ.ప్ర దేశాల పెట్టుబడిదారీ వర్గం స్వతంత్రులు కాకపోవడం వల్ల వారికి జాతీయ ఆకాంక్షలు లేకపోవడం వల్ల, వలస సామ్రాజ్యవాదులకు లొంగి ఉండడం వల్ల ప్రజాస్వామిక విప్లవాలకి నాయకత్వం వహించే శక్తి, అర్హత లేవు. ప్రజాస్వామిక విప్లవాలు భూస్వామ్య వ్యవస్ధలను కూల్చి పెట్టుబడిదారీ సమాజ ఏర్పాటుకి అవకాశం కల్పిస్తాయి. అయితే అలాంటి ప్రజాస్వామిక విప్లవాలకి నాయకత్వం వహించే శక్తి పెట్టుబడిదారీ వర్గానికి లేకపోవడం వల్ల తదుపరి విప్లవకర వర్గమైన కార్మికవర్గమే ఆ బాధ్యతను నెత్తిన వేసుకోవలసి ఉంటుంది.

  భూస్వామ్య వర్గాలపైన పెట్టుబడిదారీ వర్గం నాయకత్వంలొ చెలరేగే తిరుగుబాటు ప్రజాస్వామిక విప్లవం. అదే ప్రజాస్వామిక విప్లవానికి కార్మిక వర్గం నాయకత్వం వహించడమే ‘నూతన ప్రజాస్వామిక విప్లవం’ పెట్టుబడిదారీ వర్గం తన చారిత్రక కర్తవ్యాన్ని నిర్వర్తించలేని పరిస్ధితుల్లో ఉన్నందున ఆ బాధ్యతని కార్మిక వర్గం నెత్తిన వేసుకోవడమే నూతన దశ. అయితే కార్మిక వర్గం నాయకత్వం వహించి తిరుగుబాటు విజయవంతం చేశాక అధికారాన్ని పెట్టుబడిదారీ వర్గానికి అప్పగిస్తుందా? చస్తే ఇవ్వదు. సమాజాన్ని విప్లవకరంగా నూతన ప్రజాస్వామిక విప్లవ దశకి తీసుకెళ్లి ‘సోషలిస్టు నిర్మాణాన్ని’ ప్రారంభిస్తుంది.

  పెట్టుబడిదారీ వర్గం విదేశీ సామ్రాజ్యవాదుల చేతుల్లోకి వెళ్లిపోయి, దళారీ పెట్టుబడిదారీ వర్గంగా మారిపోయాక, వారు భూస్వామ్య వర్గం నుండి అధికారం చేపట్టి సమాజాన్ని విప్లవకరంగా పునర్నిర్మించే కర్తవ్యాన్ని నిర్వర్తించరు. ఆ కర్తవ్యాన్ని ఇక కార్మికవర్గమే చేపట్టాలి. కార్మిక వర్గం సమాజంలో ఆధిపత్యాన్ని చేజిక్కించుకున్నాక ఇక పెట్టుబడిదారీ వర్గాన్ని దేశంలో ఉండనివ్వదు. దాన్ని సమూలంగా పెరికివేస్తుంది. ఉంటే దేశంలో ఉంటూ శ్రమలో భాగం పంచుకోవాలి, లేదా బిచాణా ఎత్తివేసి తమ మాస్టర్ (సామ్రాజ్యవాద దేశాలు) వద్దకు పారిపోవాలి.

  పెట్టుబడిదారీ వర్గం నిర్వర్తించాల్సిన ‘ప్రజాస్వామిక విప్లవం’ స్ధానంలో కార్మికవర్గం నాయకత్వంలో ‘నూతన ప్రజాస్వామిక విప్లవం’ సాధించడమే మావో ధాట్ లో ప్రధాన అంశం. ఈ సూత్రీకరణ వెనుక మార్క్స్, లెనిన్, స్టాలిన్ లు సాగించిన మహత్తర విప్లవాత్మక కృషి పునాదిగా ఉంది. మార్క్సిజం-లెనినిజం కూ, దానికి మహోపాధ్యాయుడు స్టాలిన్ జోడించిన ఆచరణాత్మక అభివృద్ధి లకు మావో ధాట్ గొప్ప కొనసాగింపు. దక్షిణార్ధ గోళంలో వ్యాపించి ఉన్న అనేక మూ.ప్ర దేశాలలో కార్మికవర్గం నాయకత్వంలో విప్లవాలు సాధించడానికి ‘మావో ధాట్’ కరదీపిక.

  ఇదొక్కటే మావో ధాట్ కాదు. మూడో ప్రపంచ దేశాల్లో ఉండే అనేకానేక వైరుధ్యాలను విపులీకరించి వైరుధ్య సూత్రాన్ని విస్తృత స్ధాయిలో అభివృద్ధి చేయడంలో, శత్రువులను మిత్రులను గుర్తించడంలో, ఎత్తుగడలను వ్యూహాలను వేరు పరిచి సమ్మిళతం చేయడంలో, వ్యూహాత్మక ప్రాంతాలను అభివృద్ధి చేయడంలో, అశేష రైతాంగాన్ని కార్మికవర్గం నాయకత్వంలోని ‘నూతన ప్రజాస్వామిక విప్లవం’లో అత్యంత ముఖ్యమైన నమ్మకమైన భాగస్వామిగా చేయడంలో, మావో సాగించిన సైద్ధాంతిక కృషి అనితర సాధ్యం.

  మావో కృషికి ఇంతవరకూ జోడింపు లేదు. కొత్త పరిస్ధితులు లేవు గనక జోడింపు లేదు. కాని ‘సోషలిస్టు నిర్మాణం’ లో భాగంగా, సాంస్కృతిక విప్లవం ద్వారా చైనా బూర్జువా, భూస్వామ్య వర్గాలని నిర్దాక్షిణ్యంగా అణచివేసినందున ఆయనపై అనేక దుర్మార్గ ప్రచారాలు సాగాయి. చైనాకి చెందిన భూస్వామ్య, పెట్టుబడిదారీ వర్గాలే ఈ ప్రచారానికి దోహదం చేశాయి. చైనాలాంటి వెనకబడిన సామాజిక వ్యవస్ధల్లో అభివృద్ధి నిరోధక శక్తులు బలంగా ఉన్నందున వారిని ఎదుర్కొని విజయం సాధించడానికి మావోకి అనేక ప్రతికూల పరిస్ధితులు ఎదురయ్యాయి. చైనా కమ్యూనిస్టు పార్టీలోకే పెట్టుబడిదారీ శక్తులు జొరబడి సోషలిస్టు నిర్మాణానికి ఆటంకం కలిగించాయి. అడ్డుకున్నాయి. కేంద్ర కమిటీని సైతం తమ వశంలోకి తెచ్చుకున్నాయి.

  సాంస్కృతిక విప్లవ దశలో మేధో-శ్రామిక వైరుధ్యాలనీ, పట్టణ-గ్రామీణ వైరుధ్యాలనీ, స్త్రీ-పురుష వైరుధ్యాలనీ, రైతు-కూలీ వైరుధ్యాలనీ పరిష్కరించడానికి చేసిన కృషిని ప్రారంభంలోనే ఆయా వైరుధ్యాలలోని ఆధిపత్య పక్షాలు తీవ్రంగా ఆటంక పరిచాయి. డాక్టర్లని రోడ్లను ఊడ్వాలి రమ్మంటె వారికి కోపం. ఆడవాళ్లని సమానంగా చూడాలంటె పురుష పుంగవులకి కోపం. పట్టణాల్లో పేరుకుపోయిన జనాన్ని గ్రామాలకి తరలించి ఉత్పత్తి కార్యక్రమాల్లో భాగస్వామ్యుల చేయాలంటే అదొక తీవ్ర సమస్య. మధ్య తరగతి అభిజాత్యాన్ని వదులుకొమ్మంటే అదొక నేరం. ఇలాంటి చిన్న చిన్న అసంతృప్తులని ఆర్గనైజ్ చేసి మావో ‘మాస్ లైన్’ కి ప్రతిగా నిలబెట్టడంలో చైనా కమ్యూనిస్టు పార్టీలోని ప్రతికూల శక్తులు సఫలం అయ్యాయి. ఫలితమే పార్టీలో డెంగ్ ముఠా ఆధిపత్యం. అదొక చర్చ.

 81. ఫ్రెంచ్ విప్లవానికి ముందు ఫ్రెంచ్ పాలక వర్గంవాళ్ళు కూడా ఇలాగే అనుకున్నారు కొండలరావు గారు, “పెట్టుబడిదారులు భూస్వామ్య వ్యవస్థపై తిరుగుబాటు చేసి సాధించేది ఏమీ ఉండదు” అని. హేరీ మెగ్‌డాఫ్ అనే అమెరికన్ మార్క్సిస్ట్ రచయిత అన్నాడు “సోషలిజం సాధ్యం అని పెట్టుబడిదారులు ఎన్నడూ ఒప్పుకోరు. అలా ఒప్పుకుంటే పెట్టుబడిదారులే భయంతో రోజులు లెక్కబెట్టుకుంటూ గడియారం వైపు చూడాల్సి వస్తుంది” అని.

 82. నేను ఎన్నడూ మార్క్సిస్ట్‌లని ద్వేషించలేదే. “మార్క్సిస్టులపై గుడ్డి ద్వేషం తో అలా ప్రచారం చేయాల్సిన అవసరం లేదు” అనే వాక్యం నాకెందుకు చెపుతున్నారు? మార్క్సిజం గురించి ఏమీ తెలియని ఒకాయన గూగుల్ ప్లస్‌లో “రష్యన్‌లు స్వేచ్ఛ కోసమే సోషలిజంని కూల్చారు” అని వ్రాస్తే ఆ వ్యాఖ్యని మెచ్చుకున్నది మీరు, నేను కాదు. సోషలిజంలో స్వేచ్ఛ ఉండదు అని వాదించేవాళ్ళ వాదన అరిగిపోయిన రికార్డే అని తెలియక మీరు అతని కామెంట్‌ని +1 మార్క్ చేశారా? “నేను +1 మార్క్ చెయ్యలేదని మీరు అంటారని నాకు తెలుసు. నా గూగుల్ ప్రొఫైల్‌లో ఆయన కామెంట్‌లు నాకు కనిపిస్తాయి కాబట్టి నేను స్క్రీన్‌షాట్ తీసి అక్కడ మీరు పెట్టిన +1 మార్క్ చూపించగలను.

 83. విశేఖర్ గారు ఇక్కడ పేర్లు వ్రాయొద్దు అని చెప్పినా పేర్లు వ్రాయాల్సిన అవసరం నాకు వచ్చేలా కొండలరావు గారు సృష్టిస్తున్నారు. పోనీ నిక్‌నేమ్స్ వ్రాయాలా? … గారు (అది ఆయన అసలు పేరు కాదు కాబట్టి వ్రాస్తున్నాను) గూగుల్ ప్లస్‌లో సోవియట్ యూనియన్ యొక్క డిసొల్యూషన్‌ని సమర్థిస్తూ వ్యాఖ్యలు వ్రాసినప్పుడు అతని వ్యాఖ్యలని మెచ్చుకున్నది కొండలరావు గారే కానీ ఎవరో మార్క్సిస్ట్ వ్యతిరేకి కాదు. ప్రైవేట్ ఇన్‌ఫర్మేషన్‌కి స్క్రీన్‌షాట్ తీసి ఇక్కడ పెట్టడానికి విశేఖర్ గారు అనుమతి ఇస్తే ఆ స్క్రీన్‌షాట్‌లు ఇక్కడ పెడతాను.

 84. ప్రైవేట్ ఇన్‌ఫర్మేషన్ బహిర్గతం చెయ్యకూడదు అని తెలిసినా బహిర్గతం చెయ్యాల్సిన అవసరం వచ్చింది. ఈ రెండు స్క్రీన్‌షాట్‌లు చూడండి. తెలిసితెలియ(కుండా) … … … వ్రాసిన ఒక వ్యాఖ్యని మెచ్చుకున్నది ఎవరో తెలుస్తుంది.
  ….
  ….

  నేను మార్క్సిస్ట్‌లని ద్వేషిస్తున్నానని కొండలరావు గారు నా మీద లేనివి వ్రాయడం వల్ల ప్రైవేట్ సమాచారం బహిర్గతం చెయ్యాల్సి వచ్చింది.

 85. ప్రవీణ్, కొండల్రావు గారు మిమ్మల్ని అన్న వ్యాఖ్యని మీరు తప్పుగా అర్ధం చేసుకున్నట్లు అనిపిస్తోంది. ఆయన అర్ధంలో ‘మార్క్సిస్టులు’ అంటె సి.పి.ఎం కి చెందినవారు అని అర్ధం. ‘మార్క్సిజాన్ని నమ్మినవారు’ అని కాదని అనుకుంటున్నాను.

  మీరు నిరంతరం మార్క్సిస్టు సూత్రాలను మీ శక్తి మేరకు రాస్తున్నారు. ప్రతి సందర్భంలోనూ మార్క్సిజాన్ని గుర్తుకు తెస్తూ రాస్తున్నారు. అలాంటి మీరు మార్క్సిస్టులకి వ్యతిరేకంగా రాస్తారని ఎవరూ అనుకోలేరు. ఆ విషయాన్ని అంత సీరియస్ గా తీసుకోవలసిన అవసరం లేదులెండి.

  స్క్రీన్ షాట్స్ లింక్స్ తొలగించాను. ఏమీ అనుకోవద్దు. ఇప్పటికే ఆ సంగతి చెప్పారు కదా.

 86. CPM ఏ రకంగా మార్క్సిస్ట్ పార్టీ అవుతుంది? నిన్న ఉదయం నేను విశాఖపట్నంలో ఉన్నాను. GVMC ఆఫీస్ ఎదురుగా CPMవాళ్ళు మీటింగ్ పెట్టారు. కిరణ్ కుమార్ రెడ్డి ఎంత అవినీతి చేశాడు, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎలా కూలుద్దాం లాంటి విషయాలే వాళ్ళు మాట్లాడారు కానీ ప్రజలలో వర్గ చైతన్యం పెంచేలా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మహారాణిపేటలో పెట్టిన మీటింగ్‌లో CPIవాళ్ళు మురికివాడల ప్రజల హక్కుల గురించి మాట్లాడారు. GVMC ఆఫీస్ ఎదురుగా పెట్టిన మీటింగ్‌లో అది కూడా మాట్లాడలేదు.

 87. కొండలరావు గారు. నేను మీ బ్లాగు పరంగా చుడలేదు. మీరు కామెంట్లకు ఎలా స్పందిస్తున్నారు, మీరు ఎలాంటి ప్రశ్నెలు వేస్తున్నారు అనేది నేను చుడలేదు. నేను దాన్ని వెనక్కు తీసుకుంటున్నాను. అయితే ఇప్పుడు ప్రవీణ్ గారు చెప్పినదాని ప్రకారమైతె మీరు ఆ విధంగా ఆమోదించడం (రష్యన్ స్యెచ్చ కొసమే కమ్యునిజాన్ని కుల్చారని), ఇది ఒక విదంగా నష్టమే కదా?

  శక్తివంతంగా వున్న సినిమా గురించి రాయటం తప్పని యవరూ అనరు. అయితే ఆ రాయటం ఎలా రాస్తున్నారనేదే ముఖ్యం. వాళ్ళ మీద చాలా ఆరాధనతో రాస్తునట్టు వుంది. వర్గ స్పృహతొ రాస్తునట్టు లేదు.

  సినిమాల గురించి, దేవుళ్ళ గురించి చాలామంది రాస్తున్నారు. వాళ్ళ అందరినీ అడగలేము కదా. మీరు కమ్యునిజం, మార్కిజం గురించి మాట్లాడు తున్నారు కాబట్టి మిమ్మలను అడుగుతున్నాము.

 88. GVMC కమిషనర్ నగరంలో ఉన్న మురికివాడలని కూల్చడానికి ప్లాన్ వేశాడు. మురికివాడల నిర్మూలన పేరుతో మురికివాడల ప్రజలకి పునరావాసం కల్పించకుండా వాళ్ళని నగర శివార్లలోకి తరలించడానికి వేసిన పథకంలో భాగంగా GVMC కమిషనర్ మురికివాడల నిర్మూలన కోరే ఒక సంస్థవాళ్ళని తెచ్చి వైజాగ్‌లో మీటింగ్ పెట్టించాడు. వామపక్ష పార్టీలకి అనుమానం వచ్చి నగరంలో కొన్ని చోట్ల ఆందోళనలు చేశారు. అయితే GVMC ఆఫీస్ ఎదురుగా పెట్టిన మీటింగ్‌లో మాత్రం అసలు విషయం వదిలేసి రాజకీయ ప్రత్యర్థులపై విమర్శనా బాణాలు ఎక్కుపెట్టారు. అయితే TV చానెళ్ళవాళ్ళు కవరేజ్ చేసిన చోట్ల మాత్రం వర్గ చైతన్యం గురించి మాట్లాడారు. మిగితా చోట్ల ఇతర పాలక వర్గ పార్టీలలాగే ప్రత్యర్థి పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టారు.

 89. రామ్మోహన్, ప్రవీణ్, కొండల్రావు గార్లకు

  ఈ ఆర్టికల్ కింద కామెంట్స్ తొంభై దాటాయి. ఈ పేజ్ వెంటనే లోడ్ అవుతుందా మీకు? ఒకవేళ ఆలస్యంగా లోడ్ అయితే ‘మావో ధాట్’ పైన రాసిన ఆర్టికల్స్ కింద మీ చర్చను కొనసాగించవచ్చేమో చూడగలరా?

 90. ప్రవీణ్, కొండలరావు గారికి తమ పార్టీ పట్ల గౌరవం ఉండడం సహజం. తమ పార్టీని మార్క్సిస్టు పార్టీ అనే ఆయన నమ్ముతున్నారు. కనుక ఆ నమ్మకాన్ని గౌరవించడం అవసరం. కాకపోతే సి.పి.ఎం రాజకీయాల పైనా, సిద్ధాంతాలపైన ఎంత ఘాటుగానైనా విమర్శలు చేయవచ్చు. పైన మీరు చెప్పినట్లు వారి ఆచరణలో తప్పులనుకుంటే వాటినీ విమర్శించవచ్చు. కానీ ఆయన నమ్మకం పైన దాడి చేయడం గాయపరిచినట్లవుతుంది. గమనించగలరు.

 91. నేను కొండలరావు గారిపైన వ్యక్తిగతమైన దాడి ఎన్నడూ చెయ్యలేదు. అయితే CPM పార్టీనీ, ప్రజాశక్తి ఎడిటోరియల్ బోర్డ్ సభ్యుడు తెలకపల్లి రవి గారినీ మాత్రం తీవ్రంగా విమర్శించాను. ఆ విమర్శలకే కొండలరావు గారు భుజాలు తడుముకున్నారు. కొండలరావు గారు భుజాలు తడుముకోవడం వల్లే నాకు ఆయన మీద అనుమానం వచ్చింది. లేకపోతే నేను ఆయన గురించి పట్టించుకునేవాణ్ణి కాదు. నాకు అమెరికన్ నల్ల జాతీయులు పెట్టిన Maoist Internationalist Movement అనే పార్టీతో ఒకప్పుడు సంబంధం ఉండేది. మావో జెడాంగ్ గురించీ, సాంస్కృతిక విప్లవం గురించీ నేను వాళ్ళ ద్వారానే తెలుసుకున్నాను. అయితే నల్ల జాతీయవాదం, స్త్రీవాదం విషయంలో ఆ పార్టీ సభ్యుల మధ్య విబేధాలు వచ్చి ఆ పార్టీ మూతపడింది. ఆ పార్టీ మూత పడిన తరువాత నేను ఏ పార్టీతోనూ ఆన్‌లైన్‌లో గానీ ఆఫ్‌లైన్‌లో గానీ సంబంధాలు పెట్టుకోలేదు. సిద్ధాంతాలని చదవకుండా ఒక పార్టీని గుడ్డిగా విశ్వసించడం లాంటివి మాత్రం నేను ఎన్నడూ చెయ్యలేదు.

 92. నేను ఇప్పుడు ఒరిస్సాలో ఉన్నాను. నా ఫోన్‌లో మాత్రం నెమ్మదిగా లోడ్ అవుతోంది. అందుకే నేను ఇంటర్నెట్ కేఫ్‌కి వచ్చి కామెంట్లు పోస్ట్ చేశాను.

 93. నేను ఊర్లో లేకపోవడం వల్ల మీరు వ్రాసిన ఆ ఆర్టికల్స్ చదవలేదు. నేను ఎప్పటికప్పుడు ఫోన్‌లో పాత పోస్ట్‌ల కామెంట్‌లు మాత్రం చదువుతున్నాను.

 94. నేనడిగిన దానికి పెట్టుబడిదారులగురించి ప్రస్థావించాల్సిన అవసరం లేదు. నక్షలైట్ల వైఖరి వల్ల వర్గపోరాటం – సోషలిజం కోసం జరిగిన పరిణామాల గురించి చెప్పండి.

 95. మీరు ఏదైనా అనగలరు. ఇంటర్నెట్ లో కులాలు వెతకి కులాల్ని రెచ్చగొట్టే ప్రబుద్ది గలవారు ఏమైనా చెప్పగలరు. మీ వాదన నెగ్గించుకోవడానికి కులం పేరుతో రెచ్చగొట్టే కమ్యూనిస్టుని మిమ్ములను మాత్రమే చూశాను ఇంతవరకు. మీరు డిలీట్ చేసినట్లు నేను కామెంట్లను డిలీట్ చేయను. ప్లస్ కొడితే కొట్టాననే చెప్తాను. నా అభిప్రాయాలు నాకుంటాయి. నా అభిప్రాయాలలో దూరి , నాకు లేని అభిప్రాయాలను లెక్కకు మించి అంటగట్టిన సందర్భాలు ఉన్నాయి. చాలా సందర్భాలలో మీ కామెంట్లు నవ్వు తెప్పించే విధంగా ఉంటాయి. నిన్న కోటిరతనాలు బ్లాగులో అలాగే రాశారు. నవ్వు వస్తుంది. మీ వాదనలు చూస్తే. నేను ప్లస్ కొట్టి కొట్టలేదు అని చెపుతాను అని జడ్జిమెంట్ ఇవ్వడం లోనే అసహనం కనపడుతుంది. <> ఇది మీరు వ్యాఖ్యానించినదే. మార్క్సిష్టులు అంటే సీ.పీ.ఎం అనేకదా మీ వాదన. నేనూ అదే దృష్టితో వాడాను.

 96. రాం మోహన్ గారు సినిమాల గురించి నేను రాసే పద్ధతిలో మీ సూచనని పాటించాల్సిన అవసరం ఉంది . అందులో తప్పులేదు. కానీ ముందు నేను సినిమాలను ఒకేసారి కాకుండా మెల్లగా ఆ ప్రయత్నం చేస్తాను. భక్తికి సంబంధించి నేను ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. సంస్కృతికి సంబంధించి చర్చ చేయాలి. ఆ వ్యాసం ఆంధ్రప్రభలోది కాపీగా పెట్టాను. రష్యన్ల విషయం లో మీరు ప్రవీణ్ చెప్పింది మాత్రమే నమ్మవద్దు. నాకు తెలిసినంతవరకు సోషలిజం అమలులో వ్యక్తుల లోపాలే తప్ప మార్క్సిజం లోపం అని నేను ఎక్కడా చెప్పలేదు. ప్రవీణ్ కు ముక్కలు ముక్కలుగా పెట్టే అలవాటు – అసత్యాలు చెప్పే అలవాటు ఉంది. అసత్యాలు అనే కంటే ఒక రకమైన తొందరలో మనకు లేని అభిప్రాయాలను , అదీ ఒకోసారి దారుణం గా వ్రాస్తారు. ఉదాహరణకు కోటిరతనాలు బ్లాగులో సగటు సమైఖ్యవాది ఆలోచనలు పోస్టులో నేను కమ్మ కాబట్టి చంద్రబాబుకు తొత్తుగా సమైఖ్యవాదాన్ని సమర్ధించినట్లుగా వ్రాశారు. ఆయన అక్కడ వ్రాసిన విధానం చూడండి . సరయినదని మీరు భావిస్తారా? వీలయితే చూసి చెప్పండి. ప్రవీణ్ ఒక్క వ్యాఖ్యను కూడా వెనుకకు తీసుకోవడానికి బాగా ఇబ్బంది పడతాడు. పైగా తన వాదన సమర్ధనకు నాకు లేని అభిప్రాయాన్ని – కులాన్ని రెచ్చగొడతాడు. ఒక కమ్యూనిస్టుకి ఇది తగినదేనా?

 97. విశేఖర్ గారూ ! మీ పోస్టును కాపీ చేసి పెట్టాను . తప్పని సరిగా చదువుతాను. అయితే కొంత సమయం పడుతుంది. మీరు నాకు బుక్స్ సూచించలేదు. బుక్స్ కూడా సూచించగలరు.

 98. కొండలరావు గారూ, నిజమే బుక్స్ విషయం మరిచాను. నేను మావో రచనల నుండి మావో ధాట్ గురించి తెలుసుకున్నాను. ఆ పుస్తకాలు ఇప్పుడు ప్రచురణలో లేవనుకుంటాను. అనుకుంటాను కాదు లేవనే చెప్పొచ్చు. ఇంగ్లీషులో పుస్తకాలు వస్తున్నాయి గానీ, తెలుగు ముద్రణలో లేవు. ఇంగ్లీష్ కూడా చాలా పరిమితంగా ఎక్కడో కొన్ని షాపుల్లోనే దొరుకుతున్నాయని మిత్రులు చెప్పారు.

  మీకు ఇంగ్లీషు కావాలనుకుంటె నెట్ లో కూడా ఉన్నాయి. వైరుధ్యాల పైన ఆయన వివరణ కింది లింక్ లోచూడవచ్చు. ఈ వ్యాసంలో కొన్ని ముఖ్యమైన విషయాలు చూడవచ్చు.

  http://www.marxists.org/reference/archive/mao/selected-works/date-index.htm

  మావో వర్క్స్ కావాలంటె ఇదే వెబ్ సైట్ లో ఈ లింక్ చూడవచ్చు. http://www.marxists.org/reference/archive/mao/index.htm

  బహుశా పుస్తకాలయితెనే మీకు సంతృప్తిగా ఉండవచ్చు. కాని అందుబాటులో లేవు. వెతుక్కుని కొనవలసిందే. మావో ధాట్ వివరించేది మావో రచనలే. మరో సోర్స్ లేదు.

 99. ప్రవీణ్ గారూ ! తెలకపల్లి రవిగారు తెలంగాణా ఉద్యమాన్ని కించపరిచారు అని మీరో లింక్ ఇచ్చారు. ఆయన ఎక్కడా అలా కించపరచలేదు అంటే ఇంతవరకూ సమాధానం లేదు. అది వేణూ గారు కూడా మీకు సూచించారు. కమ్మ కులం ప్రస్థావన తెచ్చి కులాన్ని రెచ్చగొడుతూ వ్రాశారు. మార్క్సిజాన్ని ప్రచారం చేస్తూ ఇలా చేయొచ్చా? నేను గతం లోనే చెప్పాను. ఇపుడూ చెపుతున్నాను. మరోసారి మీ మితృలను అడిగి మీ కామెంట్లపై ఒక నిర్ధారణకు రండి. పోనీ విశేఖర్ గారి సలహా అయినా తీసుకోండి. తెలంగాణా – సమైఖ్యాంధ్రా – సాయుధపోరాటం- ఎన్నికలలో పాల్గొనడం ఏదైనా కావచ్చు. విధానపరం గా విమర్శించడానికి కులం పేరుతో రెచ్చగొట్టడాం ఏమిటండీ ? అది మార్కిజం ఎలా అవుతుంది ? భావోద్వేగం లో వాదనలో విసిగి బహుశా నేనే మిమ్ములను ఎక్కువ తిట్టి ఉంటాను. వాటిని వదిలేయండి. విషయం పైన వాదనలో ఎవరు నేర్చుకున్నా తప్పులేదు. ఈ రోజు విశేఖర్ గారితో చర్చ వల్ల ప్రత్యామ్నయం-కొనసాగింపు అనే పదాలు చిన్నవే అయినా నేనో కొత్త పదం నేర్చుకున్నాను. సిద్ధాంత అసలేమీ తెలియకుండా సీ.పీ.ఎం అండం లేదు ప్రవీణ్ గారూ. మొత్తం సిద్ధాంతం మాత్రం తెలియదు. నా బ్లాగులో వ్రాస్తున్నందున ఇపుడు తప్పనిసరిగా చద్వాల్సి వచ్చింది. గతం లో మీ బ్లాగులో వాటిని వాడుకుంటానని అడిగాను. గుర్తుందా? మార్క్సిజం ప్రచారం చేసే వారిలో ముందు పరిచయం అయింది నేను గమనించింది మీరే. అయితే ఇప్పటికీ మీరు – మీ వాదనాపద్ధతి నాకు అర్ధం కావడం లేదు. ఇది పాజిటివ్ గానే వ్యాఖ్యానిస్తున్నాను.

 100. నాకు ఇంగ్లీష్ రాదు విశేఖర్ గారూ ! నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాను. మీరు చెప్పిన లింక్ మీద ఇంతకు ముందే ఐడియా ఉంది. అయినా ప్రయత్నం చేస్తాను.

 101. ప్రవీణ్ గారూ ! ఏ రకం మీటింగ్ లో ఆ మాటలే మాటాడడం లో తప్పు లేదు. వర్గపోరాటం గురించి ప్రత్యేక క్లాసులు – కార్యక్రమాలు ఉంటాయి. పార్లమెంటరీ రాజకీయలలో ప్రజలకు డైరెక్టుగా మార్క్సిజం ఎక్కదు. కమ్యూనిస్టు ప్రజాప్రతినిధులు వ్యక్తిగత ఆస్థుల పెంపుకో అవినీతికో పాల్పడితే చెప్పండి. మీ అంచనా వేరు – సీ.పీ.ఎం అంచనా వేరు. అటువంటప్పుడు మీ కోణం లో ఆలోచిస్తూ సీ.పీ.ఎం మార్క్సిస్టు పార్టీ కాదనడం సరయింది కాదు.

 102. ప్రవీణ్, ఇక వివాదాల్ని వదిలేద్దురు. విషయం పైన చర్చ ముఖ్యం గానీ గతంలో ఎవరేమన్నదీ వదిలి పెట్టండి. ఇతర బ్లాగ్స్ లో, ఇతర బ్లాగర్లతో, వ్యాఖ్యాలతో జరిగిన వివాదాలు ఇక మరిచిపోండి. ఒక బ్లాగ్ లో జరిగింది మరొక బ్లాగ్ లోకి తేవడం వల్ల ఉపయోగం ఉండకపోగా వివాదాలు మరింత ముదరడం తప్ప ప్రయోజనం ఏముంటుంది? సావధాన పూర్వకంగా చర్చించుకుని ఏదైనా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం.

  వివాదాల్ని లాగే కొద్దీ అవి పెరగడం తప్ప తరగడం ఉండదు. అలాగని మీరు లాగుతున్నారని కూడా కాదు. ఏదో ఒక చోట ముగించాలి కదా. చూశారు కదా. మార్క్సిజం గురించి చెబుతున్నవారిలో మీరే మొదట బ్లాగ్స్ లో తెలుసని కొండల్రావు గారన్నారు. మీరు రాసినవి తాను ఉపయోగించాలని భావించినట్లూ చెప్పారు. అలాంటి సానుకూలతలని పెంపొందించుకుందాం.

  ఏదైనా ఒక సిద్ధాంతం పైన గానీ, పార్టీల సిద్ధాంతాల పైన గానీ చర్చ చేసుకోవడం వల్లనే విషయాలు తెలుస్తాయి కదా. అప్పుడప్పుడూ పొరపాటునో, గ్రహపాటునో ఒకటీ రెండూ మాటలు అందరూ తూలడం సహజం. వాటిని వదిలించుకుని ముందుకుపోవడమే కదా కావలసింది.

 103. అవునాండి, సారీ. తెలుగులో ఇంకేమన్నా పుస్తకాలు ఉన్నాయేమో అడిగి తెలుసుకుంటాను. తెలిసాక మీకు మెయిల్ చెయ్యడమో ఇక్కడే చెప్పడమో చేస్తాను.

 104. That meeting was about slum dwellers welfare that is directly related to class consciousness. But CPM leaders concentrated more on attacking political rivals rather than talking about class struggle. In Gplus Mr Kondalarao openly praised them who made unknowingly remarks on Russian system. I didnt cut argument in to pieces. Remember that I was the first person in the telugu blogosphere who wrote about Marxism in clear language 3 years ago.

 105. విశేఖర్ గారూ, చాలా ఆలస్యంగా మీ సైట్ చూస్తున్నాను. ఒక అనుకోని అనివార్య అనువాద పని వచ్చిపడి వారం రోజులకు పైగా నేను నెట్‌లోకి రావడం లేదు. అస్సలు వీలుపడలేదు అంటే బాగుంటుంది.

  “ఏదైనా ఒక సిద్ధాంతం పైన గానీ, పార్టీల సిద్ధాంతాల పైన గానీ చర్చ చేసుకోవడం వల్లనే విషయాలు తెలుస్తాయి కదా. అప్పుడప్పుడూ పొరపాటునో, గ్రహపాటునో ఒకటీ రెండూ మాటలు అందరూ తూలడం సహజం. వాటిని వదిలించుకుని ముందుకుపోవడమే కదా కావలసింది.”

  ఈ మొత్తం చర్చలో కీలకమైన ప్రకటన ఇది. పార్టీల, సిద్ధాంతాల మధ్య విభేదాలు, లోపాల గురించి చర్చిస్తున్నప్పుడు వెంటనే అది వ్యక్తిగతంగా మారిపోయి వ్యక్తుల మద్య మనస్పర్థలకు దారి తీసే పరిణామాలు బ్లాగ్ ప్రపంచంలో చాలా తరచుగా వస్తున్నట్లున్నాయి.

  ఇంత చర్చ జరిగిన తర్వాత మీ ప్రకటన కొండలరావు గారికి స్వాంతన కలిగించేలాగుంది. సిపిఎం రాజకీయ ఆచరణకు, కొండలరావుగారి సానుభూతి, లేదా బలమైన మద్దతుకు మధ్య తేడా గమనించాలి. మూడునాలుగు దశాబ్దాలపాటు ఇలాగే నువ్వు రివిజనిస్టు అంటే నువ్వు చెట్టుమూతి పిందెవు అంటూ తిట్టుకుంటూనే వస్తున్నాము అందరమూ.. పార్టీల సిద్దాంత పత్రికలలో కూడా ఇదే ధోరణి. ఇటీవల కాస్తంత మంచు కరుగుతున్న సూచనలు ప్రధానంగా సాహిత్య రంగంలో కనబడుతోంది కాని పార్టీ ప్రాతిపదికన చోటు చేసుకున్న అవాంఛనీయ విభేదాలు, దూషణలు ఇప్పటికీ ఎవరినీ వదలలేదనుకుంటాను.

  మీ పై ప్రకటన ఇలాంటి ధోరణుల పట్ల చెక్ పెట్టేలా ఉంది. పరస్పరం మాట్లాడుకుంటే, పంచుకుంటే, చర్చించుకుంటేనే కదా ఏదయినా పరిష్కారమయేది,. మరిత స్పష్టత వచ్చేది. మన దేశ వాతావరణంలో ఇదే లోపిస్తున్నదేమో. కమ్యూనిస్టు పార్టీలో విభేదాలు, ఘర్షణలు అంటే కుక్కల కాట్లాటలా ఉండరాదని 1980ల మధ్యలో కొండపల్లి సీతారామయ్య గారు డజన్ల కొద్దీ క్లాసులలో ఆనాటి ఉద్యమ కీలక నాయకత్వానికి చెబుతూ వచ్చారు. కాని ఎవరికయినా తనదాకా వచ్చేసరికి ఈ గొప్ప సూత్రం గాల్లో ఎగురుతూనే వచ్చింది చరిత్రలో ప్రతిదశలోనూ..

  కొండలరావు గారు గతంలో నా చందమామలు బ్లాగులో బాలగోపాల్ సాహిత్య రచనలు రూపం సారంపై టపాలో వ్యాఖ్య చేస్తూ బాలగోపాల్ పుస్తకాల కోసం వెతుకుతుండగా తన రచనల ఆన్ లైన్ లింకులు అన్నీ చందమామలు బ్లాగులో పెట్టినందుకు సంతోషించారు. అధ్యయనం మీద ఆయనకున్న ఆసక్తిని అప్పుడే గమనించాను. ఇలాంటి వారని మనం ఎన్నటికీ దూరం చేసుకోకూడదని నా సూచన.

  ఎవరు ఏ పార్టీలో ఉన్నా, ఏ భావజాలాన్ని నమ్ముతున్నా భావాలను పంచుకోవడం ఎన్నటికీ చెడు చేయక పోకా ఏర్పడిన మంచును కాస్తా తొలగిస్తుందనే అనుభవం చెబుతోంది. జీవితమంతా అరసం మీదా, రాచమల్లు రామచంద్రారెడ్డి గారి మీద విరుచుకుపడుతూ వచ్చిన విరసం నేత త్రిపురనేని మదుసూధనరావు గారు చివరి దశలో కన్‌ఫెస్ చేసుకున్న వైనం చరిత్రలో ఉంది. అందుకే మన అభిప్రాయాలు, ప్రకటనలు, సైద్దాంతిక చట్రాలు కూడా శాశ్వతత్వం కలిగి ఉండవని, అవి ఒక దశ దాటిన తర్వాత ఘర్షణ ఐక్యత ఘర్షణ ప్రాతిపదికన మార్పు చెందుతాయని నా ప్రగాఢ అభిప్రాయం. అలాగని సిద్ధాంతాన్నే తల్లకిందులు చేసేంత మార్పు కాదనుకోండి.

  ఇప్పటికే పెద్ద వ్యాఖ్య అయిందండి. ఇక పోతే మీరు మావో రచనలు తెలుగులో దొరకవేమో అన్నారు కదా. దొరుకుతాయండి. వాటిగురించి ఇక్కడే మరో వ్యాఖ్యలో చూడండి

 106. మావో రచనలు 9 సంపుటాలు సంపూర్ణంగా క్రాంతి ప్రచురణల తరపున అప్పటి పీపుల్స్ వార్ పార్టీ 2002 నాటికే తెలుగులో అచ్చేసింది. అవన్నీ నేను పోగొట్టు కోగా రెండు మూడు సంపుటాలు నా వద్ద ఉన్నట్లున్నాయి. చైనా కమ్యూనిస్టు పార్టీ అధికారికంగా మావో రచనలను అయిదు సంపుటాలుగా వేయగా అమెరికాలో ఒక ప్రచురణ సంస్థ వాటికి పొడిగింపుగా మరికొన్ని సంపుటాలు వేసింది. ఇకపోతే పీపుల్స్ వార్ పార్టీ 1970ల మద్యనుంచి 2002 వరకు అమూల్యమైన మావో రచనలను అమెరికానుంచి తదితర దేశాల నుంచి సేకరించి మొత్తం 9 సంపుటాలు తెలుగులో ప్రచురించినట్లు చదివాను. అదే సమయంలో ఇంగ్లీషులో కూడా మావో రచనల 6.7.8.9 సంపుటాలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చాయి.

  1920లలో చైనా కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించినప్పటినుంచి 1972లో అనుకుంటాను ఎడ్గార్ స్నోతో మావో బేటీ వరకు మావో సమగ్ర రచనల వివరాలు ఈ సంకలనాలలో చూడవచ్చు. ముఖ్యంగా సాంస్కృతిక విప్లవ కాలంలోని మావో అరుదైన రచనలు క్రాంతి ప్రచురణల 9వ సంపుటిలో తీసుకొచ్చారు. ఇది ప్రస్తుతానికి ఒకటే కాపీ నా వద్ద ఉంది. మీరూ మిత్రులూ ప్రయత్నిస్తే ఇప్పటికీ ప్రగతి శీల ప్రచురణ సంస్థల వద్ద మావో సంపుటాలు దొరకవచ్చు. లేదా ఆ ఉద్యమాన్ని ఇప్పటికీ సమర్థిస్తున్న, ఆచరిస్తున్న ప్రజా సంఘాల వారివద్ద విరసం వారి వద్ద అవి దొరకవచ్చు.

  దాదాపుగా మీకు తెలియని ఒక చరిత్ర కోణం కూడా ఈ మావో 9 సంపుటాల ప్రచురణ వెనుక ఉంది. మావో 9 సంపుటాలు తెలుగులోకి తీసుకురావడానికి చేసిన మొత్తం కృషిలో ఒకే ఒక వ్యక్తి పాత్ర అధ్వితీయంగా కనబడుతుంది మనకు. ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడిగా పనిచేసి విప్లవ జీవితం ఎంచుకున్న శరత్ తానొక్కడై ఈ 9 సంపుటాలను అనువదించి, తెలుగులోకీ తీసుకువచ్చారు. ఈ క్రమంలో దాదాపు పాతికేళ్ల ఉద్యమ జీవితాన్ని ఈయన ఈ సంపుటాల అనువాదానికే, ప్రచురణకే వెచ్చించారు. మావో రచనల అనువాదంతోటే తలపండిపోయిన కమ్యూనిస్టు రుషి ఈయన.

  మావో రచనలు 5,6 సంపుటాలను క్రాంతి ప్రచురణల కోసం బాలగోపాల్, విరసం సంస్థాపక సభ్యుడు కెవిఆర్ గార్లు అనువదించారని అప్పట్లో వార్తలు వచ్చినా వీటికి ఆధారాలు లేవు. కాని మొత్తం ప్రూఫ్ రీడింగ్, అనువాద సవరణ, అత్యంత తేలిక భాషలో మావో రచనలను తీసుకురావడం వెనుక యావజ్జీవిత కృషి అంటూ ఉందంటే అది శరత్ గారికే ఇవ్వాలి.

  మీకు నెల రోజుల ముందు పంపిన ఆ లింకులో మావోయిస్టు పార్టీ అరుదైన డాక్యుమెంట్లతో పాటు క్రాంతి, వాన్‌గార్డ్, పీపుల్స్ మార్చ్ వంటి పత్రికల సంపుటాలు కూడా కొన్ని సంవత్సరాల వరకు ఉన్నవి లభ్యమవుతాయి మరోసారి చూడండి. కోరిన వారికి ఆ లింకును అందజేయండి.

  నా ఈ టపా ఇప్పటికే చాలా పెద్జదయింది. ఈ సమాచారాన్ని మన మిత్రులందరికీ ఇవ్వండి.

  గమనిక:’
  ప్రజాశక్తి, ఇతర ప్రచురణ సంస్థలు కూడా ఇటీవల మావో జీవితం గురించి, చూటే ఏరిన రచనల గురించి పుస్తకాలు వేశాయి. అవి ఇప్పుడూ అందుబాటులో ఉన్నాయి. ఇటీవలే ప్రజాశక్తివారే అనుకుంటాను మోర్గాన్ ప్రామాణిక రచన “పురాతన సమాజం” ని మళ్లీ ప్రచురించారు. ఇది అయిపోక ముందే మిత్రులందరినీ తీసుకోమని చెప్పండి. మార్క్స్, ఎంగెల్స్ లను కుటుంబ పరిణామ చరిత్రపై విశేషంగా ఆకర్షించిన గొప్ప రచన ఇది. తప్పక కొని చదవండి.

 107. రాజు గారూ, మావో రచనలు (తెలుగు) ఎక్కడన్నా దొరుకుతాయా? దొరికితె, మీకు అందుబాటులో ఉంటె, నేను డబ్బు ఇస్తాను, కొని పంపగలరా? నేను వీటి కోసం ప్రయత్నించినా దొరకలేదు. మిత్రుల దగ్గర తీసుకుని చదవడమే తప్ప నా వద్ద లేవు.

 108. విశేఖర్ గారూ,
  తెలుగులో మావో రచనలు అంటే క్రాంతి ప్రచురణలు మాత్రమే అనుకుంటాను. ఇవి కాక మావో ప్రజాయుద్ధ సిద్ధాంత రచనలలో ముఖ్యమైనవాటిని పాతికేళ్లకు ముందే చండ్రపుల్లారెడ్డి పక్షం వారు రెండు సంపుటాలుగా వేశారు. అవి గెరిల్లాయుద్ధానికి సంబందించిన అమూల్యమైన రచనలు. వీటిని చండ్రపుల్లారెడ్డిగారే అనువదించి వేశారనుకుంటాను.

  ఇవే శరత్ గారి అనువాదంతో క్రాంతి ప్రచురణలలో భాగంగా తేదీలవారీగా క్రమానుగతంగా అచ్చయ్యాయనుకోండి. మావో సంపుటాలు 1-9 వరకు మనకు దొరకాలంటే విరసం వారిని లేదా ఇతరులను పట్టుకోవలసిందే.

  తెలుగులో వచ్చిన ఇంత అపురూపమైన పుస్తకాలు కూడా ఆన్‌లైన్లో అందుబాటులో ఉంచకపోవడం, ఆ విజన్ లేకపోవడం నిజంగా ఉద్యమాభిమానులకు, సానుభూతిపరులకు కూడా నష్టదాయకమే. నేను కూడా నా వైవు ప్రయత్నించి అవి దొరుకుతాయేమో చూస్తాను. అయితే 9వ సంపుటి మాత్రం నావద్ద ఉంది అది కూడా ఒరిజనల్ నుంచి జిరాక్స్ తెచ్చుకున్నదే. కొంచెం ఆలస్యమయినా మీకు అందుబాటులో ఉంచే ఏర్పాటు చేస్తాను. కొంచెం ఓపిక పెట్టి ప్రయత్నిస్తే 9 సంపుటాలు కూడా దొరికే అవకాశం ఉంది. చూద్దాము.

  నేను పనిమీద బయటకు వెళుతున్నాను. మళ్లీ ఒక రెండు మూడు గంటల తర్వాతే కలుద్దాం.

 109. రాజశేఖరరాజు గారూ! మీ వివరణ బాగుంది. కొన్ని కొత్త విషయాలు తెలిశాయి. ధన్యవాదాలు.మీ దగ్గర తీసుకున్న లింకులు బాలగోపాల్ గారి గురించి తీసుకున్నవి నా కంప్యూటర్ హార్డ్ డిస్క్ ఫెయిల్ కావడం తో బేకప్ తీసుకోనందున డిలీట్ అయ్యాయి. వాటిని మళ్లీ ఇవ్వగలరా? అలాగే త్రిపురనేని మధుసూధన రావు గారి గురించి ఈ రోజే ఖమ్మం లో ఓ మితృడు (ట్రాట్స్కీయిస్టు) చెప్పారు. ఆయన మార్క్సిజం పై ఒక సిలబస్ తయారు చేశాడని. ఆ సిలబస్ వివరం మీ వద్ద ఉంటే ఇవ్వగలరు.

 110. కొండలరావు గారూ,
  ధన్యవాదాలు.
  మీరు కోరిన బాలగోపాల్ రచనలపై ఆన్‌లైన్ లింకుల కోసం నా బ్లాగ్ లింక్ చూడండి. ప్రధాన వ్యాసం కాకుండా కింది వ్యాఖ్యల్లో బిజి రచనల పూర్తి లింకులు ఉన్నాయి. మళ్లీ డౌన్ లోడ్ చేసుకోండి.

  http://blaagu.com/chandamamalu/2012/03/08/%E0%B0%B8%E0%B0%BE%E0%B0%B9%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B0%82%E0%B0%AA%E0%B1%88-%E0%B0%AC%E0%B0%BE%E0%B0%B2%E0%B0%97%E0%B1%8B%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B2%E0%B1%8D/

  అలాగే ఆంధ్రజ్యోతి పత్రికలో బాలగోపాల్ రాసిన అన్ని రచనలూ ఆ పత్రిక వెబ్‌సైట్‌లో కిందిలింకులో ఉన్నాయి

  http://andhrajyothy.com/MainNewsshow.asp?qry=dailyupdates/balagopal

  తెలుగు సమాజం బాలగోపాల్ ఆకస్మిక మరణంపై స్పందించిన నేపధ్యంలో వివిధ పత్రికలలో వచ్చిన 25 పైగా విలువైన కథనాలను నేను గతంలో లింకులతో సహా కాపీ చేసి ఉంచాను. అవి ఇప్పుడు కనబడలేదు. దొరకగానే మీకు పంపుతాను.

  ఇక మీరు త్రిపురనేని మధుసూదన రావు గారు 2002-03లో రూపొందించిన మార్క్సిజం పై ఒక సిలబస్ గురించి ఇప్పటికైతే నాకు తెలీదు. రాష్ట్ర వ్యాప్తంగా మార్క్సిస్ట్ మెథడాలజీని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని ఆసక్తి ఉన్నవారికోసం ఆయన ఈ సిలబస్ కొల్లా వెంకయ్య గారితో కలిసి రూపొందించారు. తీరా ఈ సిలబస్ ప్రాతిపదికన శిక్షణా తరగతులు ఎన్నటికీ మొదలు కాలేదనుకుంటాను. ఆ తర్వాత త్వరలోనే త్రిపురనేని మాస్టారు గారు పోయారు.

  దీని గురించి వివరాలు ప్రస్తుతం సాక్షి దినపత్రికలో ఎడిటోరియల్ బృందంలో పనిచేస్తున్న -ఎడిట్ పేజీ- మిత్రుడు ఎస్. సుధాకర్ గారికి తెలుసనుకుంటాను. ఆ సిలబస్ ఉంటే ఆయన వద్ద ఉండవచ్చు కూడా. తన పోన్ నెంబర్ మిస్సయింది. వీలయితే మీరు తనకోసం ప్రయత్నించగలరు.

  ఇవి కాక 2010 లేదా 2011 సంవత్సరాలలో వీక్షణం మాసపత్రిక సంపాదకులు… ‘తెలుగు వారు తప్పక చదవవలసిన ప్రామాణిక పుస్తకాలు, ప్రగతిశీల పుస్తకాలు’ అంటూ దాదాపు అయిదారు పేజీల కొద్దీ లిస్టు ప్రకటించారు. వీలయితే వీక్షణం పాత కాపీల ఆన్‌లైన్ ఎడిషన్ కోసం వారి వెబ్ సైట్ లింకు చూడగలరు.
  http://www.veekshanam.wordpress.com

  వీక్షణం పత్రిక వారు ప్రచురించిన అన్ని పుస్తకాలనూ వీలయితే తెప్పించుకుని చదవగలరు.
  ముఖ్యంగా మార్క్సిస్ట్ మెథడాలజీని భారతీయ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాలకు అన్వయించి ముప్పై సంవత్సరాల పొడవునా ఆర్ఎస్. రావు గారు రాసిన అరుదైన రచనల సంకలనం “కొత్తచూపు” పుస్తకాన్ని, ముదునూరి భారతి గారి ‘అభివృద్ధిని ఇలా చూద్దాం’ పుస్తకాన్ని తప్పక తెప్పించుకుని చదవగలరు. భారతదేశంలో అర్థవలస అర్థభూస్వామ్య వ్యవస్థ ప్రాధమిక లక్షణాల గురించిన నక్సలైట్ సూత్రీకరణలకు ప్రామాణిక రూపమే ఆర్ఎస్ రావు గారి “కొత్తచూపు” దీన్ని మిస్ కావద్దు.

  అలాగే మీరు ఇప్పటికే అరసం వారి అభ్యుదయ, ప్రజాశక్తి వారి ప్రస్థానం సాహిత్య మాస పత్రికలను చదువుతుంటే మీ జాబితాలో అరుణతార, ప్రజాసాహితి, వీక్షణం పత్రికలను కూడా తప్పకుండా ఫాలో కండి. ముఖ్యంగా వీక్షణం పత్రిక రాజకీయార్థిక సామాజిక పత్రిక. భారతీయ గ్రామాల చరిత్రపై, గ్రామాల అధ్యయనాల చరిత్రపై, ఆంధ్రప్రదేశ్‌లో రెవిన్యూ పరిపాలనపై, రైతు వ్యవసాయంపై పెట్టుబడిదాడిపై అరుదైన వ్యాసాలను వీక్షణం పత్రిక వరుసగా ప్రచురిస్తోంది.

  తెలుగులో మనకున్న ప్రత్యామ్నాయ పత్రికలలో ఇవి కొన్ని. అరుదైన పత్రికలు కూడా. ఒక్కొక్కటి 15 రూపాయలు మించని ఈ మాసపత్రికలను కొని చదవటం మీకు పెద్ద కష్టమేం కాదనుకుంటాను.

  ప్రజాసాహితి వెబ్ సైట్ లింక్ ఇక్కడ చూడండి.
  http://www.prajaasaahithi.com

  అరుణతార మాసపత్రిక -విరసం అధికారపత్రిక- వెబ్ సైట్ ఇంకా రాలేదనుకుంటాను. కాని చదివే ఆసక్తి కలవారికోసం వారు పీడీఎఫ్ కాపీలు ఇమెయిల్ ద్వారా పంపిస్తున్నారు.

  అరుణతార పీడీఎఫ్ కాపీలు కావాలంటే కింది ఇమెయిల్‌కి సమాచారం పంపగలరు.
  arunatara1977@gmail.com

  లేదా
  ఎస్ రవికుమార్ – అరుణతార మేనేజర్
  మొబైల్ 9866021257

  గుంటూరు కేంద్రంగా లెప్టిస్ట్ స్టడీ సర్కిల్ వారు మార్కిస్ట్ సిద్ధాంతం దానిలోని వివిధ కేటగిరీలపై ఇంతవరకు 30 పైగా క్లాసిక్ పుస్తకాలను ప్రచురించారు. అధ్యయనంపై ఆసక్తి కలవారు తప్పక చదవవవలసిన పుస్తకాలివి. వీటికోసం ప్రయత్నించండి.

  ఈ వివరాలు మీకు ఉపయోగపడతాయనే అనుకుంటున్నాను.

 111. నేను రాజకీయాలలో తలపండినవాణ్ణి కొండలరావు గారు. మావోయిజంకీ, ట్రాట్స్కీయిజంకీ మధ్య ఉన్న తేడా ఏమిటో ముందుముందు నేను వ్రాయబోయే వ్యాసాలతో అర్థమవుతుంది.

 112. తలపండడం ఏమిటి ప్రవీణ్? మీ గురించి మీరు అలా చెప్పుకోవడం ఎబ్బెట్టుగా ఉంటుంది గదా? ఎందుకలా చెబుతారు?

 113. నేను 2002 నుంచి ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నాను. తల పండడం అంటే 2005 నుంచి ఇంగ్లిష్ డిస్కషన్స్ బోర్డ్‌లలో చర్చించడంలో ఉన్న అనుభవం. ఇదేమీ hype కాదు.

 114. హైపా కాదా అన్నది పక్కన పెట్టండి. తన గురించి తాను చెప్పుకోవడం ఎబ్బెట్టుగా ఉంటుంది కదా.

  డిస్కషన్స్ బోర్డ్స్ లో ఎంత చర్చిస్తే ఎంత విజ్ఞానం వస్తుంది. వాటి వల్ల ఉపయోగం తప్పనిసరిగా ఉంటుంది. అదే సమయంలో తలపండేంత అనుభవం రావడం మాత్రం సాధ్యం కాకపోవచ్చు. కాదా?

 115. ఇంకో విషయం. మావోయిస్ట్ ఇంటర్నేషనలిస్ట్ మూవ్‌మెంట్ వారికి IRTR అనే అనుబంధ డిస్కషన్స్ బోర్డ్ ఉండేది. అందులో నేను యాక్టివ్‌గా కామెంట్లు వ్రాసేవాణ్ణి. అయితే MIM-IRTR వారు నన్ను ట్రాట్స్కీయైట్ ఫోర్త్ ఇంటర్నేషనలిస్ట్‌గా అనుమానించి వారి వెబ్‌సైట్‌లో కామెంట్‌లు పోస్ట్ చెయ్యకుండా నన్ను బ్లాక్ చేశారు. చైనా సాంస్కృతిక విప్లవం గురించి నాకు మొదట బోధించినది వారే కాబట్టి నేను ఇప్పటికీ వారి అభిమానిగానే ఉంటున్నాను. నా మీద ఎన్ని విమర్శలు వచ్చినా నేను మార్క్సిజం-లెనినిజం గురించి ధైర్యంగా మాట్లాడగలుగుతున్నానంటే అందుకు కారణం MIM-IRTR వారు ఇచ్చిన ట్రైనింగే.

 116. రాజశేఖరరాజు గారు,
  వివరంగా విలువైన సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నాకున్న మితృలపరిధిలో ఏడాదికాలం గా అడుగుతున్నా ఈ మాత్రం సమాచారం అందలేదు. ఎవరికి వారే వారు నమ్మిన భావజాలం పై వాదనలు మాత్రమే వాదిస్తున్నారు. అది తప్పని కాదు గానీ ఎవరూ సంపూర్ణ అధ్యయనం చేయడం గానీ – కనీస అధ్యయనం చేయడం కానీ చేయకుండానే వాదనలకు దిగుతున్నారనిపిస్తోంది. నాకు తారసపడిన వారి ని బట్టి నాకు ఏర్పడిన అభిప్ర్యాయం మాత్రమే ఇది. గుంటూౠ లెఫ్టిస్ట్ స్టడీ సర్కిల్ వారితో కొంత పరిచయం ఉంది. ఒక సారి మాట్లాడాను. కొన్ని బుక్స్ వారివి ఉన్నాయి.

 117. ప్రవీణ్ గారూ ! ఇదే లింక్ నాకు సీ.పీ.ఎం కేంద్రకమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం గారు ఇచ్చారు. అది నడిపేది ట్రాట్స్కీయిస్టులని మీరన్నడి నిజమా ? కాదా ? అందులో వ్యాసాలు లేదా ఆర్టికల్స్ ఒక వైపు వాదనలుగా ఉంటాయా ? అనేదానికోసం అడిగాను. తలపండడం అనేది నాకు తెలిసీ ఎవరైనా చనిపోయేదాకా నేర్చుకోవలసిందే. రాజశేఖరరాజు గారు అభిప్రాయపడినట్లు మూల సిద్ధాంతాం మారకుండా ఎప్పడికప్పుడు అభిప్రాయాలలో ఘర్షణ-ఐక్యతతో మెరుగుపరుచుకోవడం అంటే ఓటమి – గెలుపు అన్న స్వీయాత్మకధోరణికి లోను కాకూడదు. మీ వ్యాసాలు చదువుతాను. సోషలిస్టు దేశాల పరిణామాలతో ట్రాట్స్కీయిస్టుల వాదనలు కూడా అబ్సర్వ్ చేస్తున్నాను. కానీ ఇంతవరకు నేను చూసినంతవరకు ఆ వాదనలు – లెనిన్ అంచనాల కంటే ఇప్పటికీ మెరుగైనవని అనిపించడం లేదు. కానీ ఆ వాదనలు – మావో ఆలోచనావిధానం చదవాల్సి ఉంది.

 118. ప్రవీణ్ గారూ!
  ఈ లింక్ అంశాన్నీ క్రింద కామెంట్లనూ పరిశీలించాక విశేఖర్ గారిని – ప్రవీణ్ గారినీ గతం లో నేను అసహనంతో ఒకే గాటన కట్టినందుకు బాధపడుతున్నాను.

  ప్రవీణ్ వాదనలు ఎపుడూ ఇలాగే ఉంటాయి. వెనుకకు రావడానికి చాలా ఇబ్బంది పడతారు ప్రవీణ్ మీరు. అది స్వీయమానసిక ధోరణే తప్ప మరోటికాదు.

  నాకు తెలిసిన జ్ఞానం తో అడుగుతున్నా? ఎవరో ఏదొ చెపితే వెంటనే మీకు ఫలానా విషయం పై జ్ఞానోదయమై అవతలివారి అజ్ఞానం అవగతం అవుతుందా? ఎన్నికలపైనా – విప్లవానికి పనికివచ్చే ప్రతి అంశాన్నీ ఉపయోగించుకోవాలని లెనిన్ , మావోలు చెప్పిన దాని పైనా విశేఖర్ గారి ప్రశ్నకు మీ సమాధానం ఏమిటి ?

  ఇప్పటికైనా ఒక పార్టీని – ఒక లైన్ ను విమర్శించే ముందు దానిని కనీసమైనా తెలుసుకోవాలి. ఎదుటివాడు చెప్పేది వినాలి. ఎదుటివాడికి చెప్పడం రాకపోయినా ఆ లైన్ ను మనమే చెక్ చేసుకుని విమర్శించాలి. ఉన్నతమైన మానవసమాజం లక్ష్యమైనప్పుడు – ప్రజల భాగస్వామ్యం లేకుండా ప్రజలకు కనీసం అర్ధం కాకుండా కేవలం వాదనలుతో విప్లవం రాదు. బలవంతం గా తెచ్చినా ఆచరణలో సోషలిజం అమలుచేయడం ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రజలలో ఏ భావజాలం బలం గా ఉందో దానిని కనీసం తగ్గించకుండా కార్యక్రమం తీసుకుంటే ఆ కార్యక్రమం విజయం సాధించే అవకాశం ఉండదు.

 119. కొండలరావు గారు, ప్రపంచంలో ఏ దేశంలోనూ పార్లమెంట్ ఎన్నికల ద్వారా సోషలిస్ట్ విప్లవం వచ్చిన సందర్భం లేదు. ఇది అనుభవ పూర్వకమైన సత్యం. అందుకే ఎన్నికల పంథాని నేను వ్యతిరేకించాను. ఆ విషయం నేను అక్కడే చెప్పాను. కామెంట్లు చదవకుండానే లెనిన్, మావోలు చెప్పారు కనుక మనం అలాగే చేద్దాం అని అంటే ఎలా?

 120. విశేఖర్, ప్రవీణ్, కొండలరావు గార్లకు
  చైనా సైనిక వ్యూహకర్త సన్-జు 2600 సంవత్సరాల క్రితం రచించిన ప్రపంచంలో కెల్లా అత్యంత ప్రాచీన యుద్ధ తంత్ర గ్రంథ “యుద్ధకళ” (The Art of War) ఆన్‌లైన్‌లో యూనికోడ్ ఫాంట్‌లో దొరుకుతోంది. శంఖారావం బ్లాగర్ సరస్వతీ కుమార్ ఈ అరుదైన పుస్తకాన్ని మొత్తంగా తెలుగు చేసి తన బ్లాగులో పెట్టారు. దాదాపు దీనిగురించి మనందరికీ తెలిసిన విషయమే అయినా తెలుగులో ఒకేచోట ఈ పుస్తకం కనిపించేసరికి ఉద్వేగంతో మీకు పంపుతున్నాను.

  అనువాదకుడు సరస్వతీ కుమార్ గారి మాటల్లో చెప్పాలంటే…
  “ఈ గ్రంథం ప్రపంచ ప్రసిద్ధి చెందినది. చరిత్రలో ఎన్నో యుద్ధ గతులను, వాటి ఫలితాలను ప్రభావితం చేసింది. ప్రాచ్య, పాశ్చాత్య దేశాలకు చెందిన ఎందరో సేనానులు ఈ గ్రంథం లో వివరించిన వ్యూహాలను ఆచరించి విజయాన్ని తమ స్వంతం చేసుకున్నారు.

  నెపోలియన్, మావో సేటుంగ్, హొచిమిన్ వంటి రణతంత్రవేత్తలు, హెన్రీ కిసింజర్ వంటి రాజనీతి కోవిదుడు; ఇంకా ఇటువంటి వారు అనేక మంది ఈ గ్రంథాన్ని నిత్యపఠనీయ గ్రంథంగా పరిగణించారు. మరిముఖ్యంగా ఈ గ్రంథంతో నెపోలియన్‌కున్న అనుబంధం ప్రత్యేకమయినది. ఈ గ్రంథం యొక్క ఫ్రెంచ్ అనువాదం ఫ్రాన్సు దేశంలో ఓ ‘నెపోలియన్’ రూపొందడానికి కారణమయినదంటే అది అతిశయోక్తి కాదు. వియత్నాం యుద్ధకాలం నుండి అమెరికన్ సైనికాధికారులలో ఈ గ్రంథం విశేషమైన ఆదరణను పొందుతున్నది. వారి యుద్ధ వ్యూహాలన్నీ ఈ గ్రంథం మీదనే ఆధారపడి ఉంటాయి.

  ఆధునిక యుద్ధస్వరూపాన్ని రూపొందించిన నెపోలియన్ తను నిదురించే సమయంలో సైతం ఈ గ్రంథాన్ని చెంతనే ఉంచుకొనేవాడు.

  ఆధునిక కాలంలో వామపక్ష గెరిల్లా పోరాటాలకు మార్గదర్శకంగా ఉన్న గ్రంథం ‘గెరిల్లా వార్‌ఫేర్’. దీనిని చైనా నాయకుడు మావో సన్-జు ‘యుద్ధతంత్రం’ ఆధారంగానే రచించాడు.

  ఈ గ్రంథంలో సన్-జు ప్రతిపాదించిన సూత్రాలను అనుసరించడం వలనే వియత్నాం లాంటి చిన్నదేశం, పేదదేశం అమెరికాలంటి అతిపెద్దదేశం, అపరిమితమైన ఆర్ధికశక్తి, సైనికశక్తి ఉన్న దేశాన్ని ఓడించడం జరిగినది. 20వ శతాబ్దపు ద్వితీయార్థంలో జరిగిన ఈ యుద్ధం ‘వియత్నాం యుద్ధం’గా చరిత్ర ప్రసిద్ధి చెందింది. ఈ యుద్ధంలో వియత్నాంకు నాయకత్వం వహించిన హొచిమిన్ ఈ గ్రంథాన్ని చైనీస్ నుండి తమ దేశప్రజల మాతృభాషలోకి అనువదించాడు. ఈ యుద్ధ సమయంలోనే అమెరికా సైనికాధికారులు వియత్నాం గెలుపులో కీలక పాత్ర వహించిన ఈ గ్రంథం గురించి తెలుసుకుని అప్పటినుండి ఈ గ్రంథాన్ని అధ్యయనం చేయడం ప్రారంభించారు.

  కొంతకాలం క్రిందటివరకు సంపన్న పాశ్చాత్యుల డైనింగ్ టేబుల్ సంభాషణలలో ఈ గ్రంథం గురించి చర్చించడం ఒక ఫ్యాషన్…..”

  ఈ గ్రంథానికి అనేక విశిష్టతలున్నాయి. ఇది ఏదో ఒక కాలానికి మాత్రమే పరిమితమైన గ్రంథం కాదు. ప్రాచీన కాలంలో రచింపబడిన ఈ గ్రంథం నేటి ఆధునిక కాలంలో కూడా అనుసరింపదగినదిగా ఉండి అంతకంతకూ తన ప్రాధాన్యతను పెంచుకుంటూనే ఉన్నది. అలాగే ఈ గ్రంథం ఏదో ఒక రంగానికి మాత్రమే పరిమితమైనది కాదు. ఇందులో వివరించిన వ్యూహాలు కేవలం సైనిక పరంగానే కాక ఇతర రంగాలకు కూడా అన్వయించుకునే విధంగా ఉంటాయి. అందుకే ఈ గ్రంథం సైనికరంగంతో పాటుగా రాజకీయ, వ్యాపార, మానేజిమెంట్ వంటి అనేక ఇతర రంగాలలో కూడా విశేషమైన వ్యాప్తిని పొందినది.

  విశేఖర్ గారూ, కింది లింకులన్నీ డౌన్ లోడ్ చేసుకుని ఒక పుస్తకంగా నోట్‌ప్యాడ్ లేదా వర్డ్ ఫైల్‌లో కాపీ చేసుకుంటే ఉపయోగంగా ఉంటుంది. దీనిని ప్రత్యేకంగా మరో కథనం రూపంలో పరిచయం చేసి లింకులు అందిస్తే అందరికీ అనువుగా ఉంటుందేమో ఆలోచించండి.

  సన్-జు ‘ద ఆర్ట్ ఆఫ్ వార్ ‘ తెలుగులో గ్రంథపరిచయం
  http://shankharavam.blogspot.in/2012/01/blog-post_25.html
  (వేణుగానం బ్లాగులో రాసిన గ్రంథపరిచయాన్నే మరలా అందిస్తున్నాను – సరస్వతీ కుమార్)

  సన్-జు ‘ద ఆర్ట్ ఆఫ్ వార్ ‘ తెలుగులో
  http://shankharavam.blogspot.in/2012/01/blog-post.html

  సన్-జు ‘ద ఆర్ట్ ఆఫ్ వార్ ‘ తెలుగులో మనవి
  http://shankharavam.blogspot.in/2012/01/blog-post_27.html

  సన్-జు ‘ద ఆర్ట్ ఆఫ్ వార్ ‘ తెలుగులో హోమ్‌పేజి
  http://shankharavam.blogspot.in/2012/01/blog-post_23.html

  సన్-జు ‘యుద్ధకళ’1వ అధ్యాయం
  http://shankharavam.blogspot.in/2012/01/1.html
  సన్-జు ‘యుద్ధకళ’2వ అధ్యాయం
  http://shankharavam.blogspot.in/2012/01/2.html
  సన్-జు ‘యుద్ధకళ’ 3వ అధ్యాయం
  http://www.shankharavam.blogspot.in/2012/02/3.html
  4వ అధ్యాయం: వ్యూహాత్మక సంసిద్ధత
  http://www.shankharavam.blogspot.in/2012/02/4.html
  సన్-జు ‘యుద్ధకళ’ 5వ అధ్యాయం
  http://www.shankharavam.blogspot.in/2012/02/5.html
  6వ అధ్యాయం బలాలు–బలహీనతలు
  http://www.shankharavam.blogspot.in/2012/02/6.html
  సన్-జు ‘యుద్ధకళ’ 7వ అధ్యాయం
  http://www.shankharavam.blogspot.in/2012/02/7.html
  సన్-జు ‘యుద్ధకళ’ 8వ అధ్యాయం
  http://www.shankharavam.blogspot.in/2012/02/8.html
  సన్-జు ‘యుద్ధకళ’ 9వ అధ్యాయం
  http://www.shankharavam.blogspot.in/2012/02/9.html
  సన్-జు ‘యుద్ధకళ’ 10వ అధ్యాయం
  http://www.shankharavam.blogspot.in/2012/02/10.html
  సన్-జు ‘యుద్ధకళ’ 11వ అధ్యాయం
  http://www.shankharavam.blogspot.in/2012/02/11.html
  సన్-జు ‘యుద్ధకళ’ 12వ అధ్యాయం
  http://www.shankharavam.blogspot.in/2012/02/12.html
  సన్-జు ‘యుద్ధకళ’ 13వ అధ్యాయం
  http://www.shankharavam.blogspot.in/2012/02/13.html

  తెలిసిన మిత్రులందరికీ ఈ పుస్తకం లభ్యత గురించి చెప్పండి.

  వ్యాఖ్యలో చాలా పెద్దదయ్యేటట్టుంది కాబట్టి దీన్ని ప్రత్యేక టపాగా వేస్తేనే బాగుంటుందేమో..!

 121. ప్రవీణ్ గారూ !
  ఎన్నికలలో పాల్గొనడం అంటే ఎన్నికల ద్వారా విప్లవం వస్తుందని మీరు అనుకుంటున్నారు తప్ప ఎన్నికలలో పాల్గొనే పార్టీలు చెప్పలేదు. ఆ పార్టీల కార్యక్రమాలు చద్వకుండా ఆ పార్టీల వైఖరి అది అని మీరు చెప్పడం తప్పవుతుంది.

 122. కొండలరావు గారికి,
  చాలా సంతోషం.
  మనం వ్యక్తులుగా చదువుతున్న, సేకరిస్తున్న రచనలను సమిష్టిగా పంచుకునే తరహా నెట్‌వర్క్ ఉంటే సిద్ధాంత అద్యయనం మరింత సులభమవుతుందనుకుంటాను.

  ఏది ఏమైనా.. వీక్షణం పత్రికలో ఇటీవలి కాలంలో వచ్చిన నాలుగు మంచి రచనలను సంపాదకులు ఎన్.వేణుగోపాల్ గారి బ్లాగు లోంచి తీసి ఇక్కడ ఇస్తున్నాను. తప్పకుండా వీటిని చూడండి.

  విశేఖర్ గారూ, ప్రవీణ్ గారూ
  మీరు కూడా ఇప్పటివరకూ చూడకపోతే ఈ నాలుగు కథనాలను తప్పకుండా చదువగలరు.

  గ్రామాల అధ్యయనం ఎందుకు
  ఎన్ వేణుగోపాల్ గారి బ్లాగు
  http://kadalitaraga.wordpress.com/2012/04/02/%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B2-%E0%B0%85%E0%B0%A7%E0%B1%8D%E0%B0%AF%E0%B0%AF%E0%B0%A8%E0%B0%82-%E0%B0%8E%E0%B0%82%E0%B0%A6%E0%B1%81%E0%B0%95%E0%B1%81/#more-748

  గ్రామాల అధ్యయనాల చరిత్ర – 2
  http://kadalitaraga.wordpress.com/2012/04/23/%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B2-%E0%B0%85%E0%B0%A7%E0%B1%8D%E0%B0%AF%E0%B0%AF%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B2-%E0%B0%9A%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0-2/

  యాన్ మిర్డాల్ తో ఇష్టాగోష్ఠి
  http://kadalitaraga.wordpress.com/2012/04/26/%E0%B0%AF%E0%B0%BE%E0%B0%A8%E0%B1%8D-%E0%B0%AE%E0%B0%BF%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A1%E0%B0%BE%E0%B0%B2%E0%B1%8D-%E0%B0%A4%E0%B1%8B-%E0%B0%87%E0%B0%B7%E0%B1%8D%E0%B0%9F%E0%B0%BE%E0%B0%97%E0%B1%8B/

  ప్రపంచానికి మేడేనిచ్చిన నేల…
  http://kadalitaraga.wordpress.com/2012/05/01/%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AA%E0%B0%82%E0%B0%9A%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF%E0%B0%95%E0%B0%BF-%E0%B0%AE%E0%B1%87%E0%B0%A1%E0%B1%87%E0%B0%A8%E0%B0%BF%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A8/

  మనం చదవవలసిన పుస్తకాల గురించి, సేకరించవలసిన పుస్తకాల గురించి, అందుబాటులో ఉన్న పుస్తకాల గురించి బ్లాగులో చదవదగిన పుస్తకాలు అనే పేరుతో ఒక ప్రత్యేక కేటగిరీ రూపొందించి దాంట్లో వచ్చిన సమాచారాన్ని వచ్చినట్లుగా ఇస్తూ పోతే అందరీకీ ఉపయోగకరంగా ఉంటుందేమో మరి. పుస్తకాలు ప్రచురించిన సంస్థ. చిరునామా వంటి వివరాలు కూడా టపాలో రెగ్యులర్ గా లేదా వారానికి ఒకసారి ఆదివారం ప్రత్యేక సంచికలు చూసి వాటిని బ్లాగులో సమాచారంగా ఇస్తే బాగుంటుందేమో. ఆలోచన చాలా కాలం నుంచి ఉంది కాని సమయపాలన మీదే కాస్త సందేహంగా ఉంది.

 123. రాజశేఖరరాజు గారు , మీరన్నట్లు చేస్తే బాగుంటుంది. ఆ అవసరం కూడా చాలా ఉంది. వీలనినంత త్వరగా ఎవరో ఒకరు ఆ ప్రయత్నం ప్రారంభించాలి.

 124. కొండలరావు గారు. ఎన్నికలపైనా, విప్లవానికి పనికివచ్చె ప్రతి
  అంశాన్ని వినియొగించుకొవాలని లెనిన్ చెప్పింది నిజమే . కాని ఇప్పుడు
  సి.పి.యం. అలా ఉపయొగించుకొంటుందా? ఎంతచేపటికీ, అక్కడ అవినీతి
  జరిగింది. ఇక్కడ అవినీతి జరిగింది. కుభకొనాలు చేస్తున్నారు. అని
  సర్వశక్తులూ, ఎన్నికలపైన కేంద్రీకరించి సాదించినదేమిటి.? అంటె
  దానర్దం వాటిపైన మాట్లాడవద్దని కాదు. అలా అని అవిజరగకుండా
  ఆపగలిగారా? ఎపని చేసినా ప్రజలను రెచ్చగొట్టి ఎన్నికలలొ
  ఉపయొగించుకొవాలనే ఆలొచనతప్ప వేరేలేదు. అవినీతి గురించి
  కుంభకొనాల గురించి కమ్యునిస్టు పార్టీలేకాదు. బుర్జువా పార్టీలు
  కుడా పొరాడుతునాయి. మాట్లాడుతున్నాయి.
  లెనిన్ ,మావొలు చెప్పింది పార్లమెంట్కొ లేక శాసనసభకొ వెళ్ళి
  వాటా పంచుకొమకాదు కదా. మేము చెప్పెదీ అదే. ప్రజలను
  భాగస్వామ్యం చెయ్యమని . వాళ్ళలొ క్రమ క్రమంగా వర్గచైతన్యం
  పెంచమని. కాని అలాంటి కార్యక్రమాలు మచ్చుకైనా లేవు. బుర్జువా సంస్కరణవాదానికే పరిమితమైనారు. ప్రస్తుతం చాలాదేశాలలొ చాలా ఇజాలతొ పాటు మార్కిజం పేరు చెప్పుకుని చేస్తున్న పనేఇదే.
  నేను వ్యెక్తి గతంగా చుశాను. కమ్యునిస్టు పార్టీ వాళ్ళు రొడురొజులకొ లేక ముడురొజులకొ ఒక సారి స్టడీ సర్కిల్ నిర్వహిస్తారు. అందులొ కొంతమంది నేను పుట్టకముందు నుంచి పార్టీలొ వున్నారు. సమాజం గురించి వాళ్ళకు మిగతా ప్రజలకు ఎలాంటి ఆలొచనలు ,అభిప్రాయాలు, వుంటాయొ ఏమాత్రం తేడా లేకుండా అలాంటి అభిప్రాయాలతొనే వున్నారు. వాళ్ళ కార్యకర్తలకే నేర్పని వాళ్ళు మిగతా ప్రజలకు ఎమినేర్పుతారు.

  ఆ స్కకిల్ లొ వాళ్ళు చర్చించే అంశాలు ఏమిటంటె అవినీతి గురించి ,కుభకొనాల గురించి బి. జె. పి. నొ లేక, కాగ్రెస్ నొ విమర్సించటం అసలు అవినీతి దేని ఆదారంతొ జరుగుతుందొ తెలియదు, శ్రమదొపిడీ అంటె ఎమిటొ తెలియదు. సమాజంలొ ధనిక ,పేద, ఎందుకునాయొ తెలియదు. ముప్పై యెళ్ళుగా అధికారంలొ వున్నా కుడా అలాంటి వర్గచైతన్యం ఎమీచేయలేదు. కాబట్టె అక్కడ ఓడిపొవలసి వచ్చింది.

 125. చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఎన్నడూ ఎన్నికలలో పోటీ చెయ్యలేదు. ఎన్నికలలో పోటీ చెయ్యాలని మావో చెప్పాడా, లేదా అనేది ఇక్కడ అనవసరం. ఎన్నికల వల్ల పాలక వర్గంవాళ్ళ తలలోని వెంట్రుక కూడా రాలే పరిస్థితి లేనప్పుడు ఎన్నికలలో పోటీ చెయ్యడం అనేది అనవసరం.

 126. రామమోహన్ గారు చెప్పినది నిజమే. మాగుంట సుబ్బరామిరెడ్డి ఉదయం పత్రికకి లాకౌట్ ప్రకటించి కార్మికులని రోడ్ మీద పడేసినప్పుడు ఒక్క పాలక వర్గ పార్టీ వాళ్ళైనా ఆ లాకౌట్‌కి వ్యతిరేకంగా ఉద్యమించారా? ఉదయం పత్రికని దాసరి నారాయణరావు దగ్గర నుంచి సుబ్బరామిరెడ్డి కొనేశాడు కనుక అది సుబ్బరామిరెడ్డి యొక్క వ్యక్తిగత ఆస్తి అనీ, దాన్ని సుబ్బరామిరెడ్డి ఏమైనా చేసుకోవచ్చనీ అందరూ అనుకున్నారు కదా.

 127. విశేఖర్ గారూ !
  ఎన్నికలను ఒక ఎత్తుగడ గా మాత్రమే సీ.పీ.ఎం తీసుకుంటుంది తప్ప అదే వర్గ పోరాటమని , దాని ద్వారానే విప్లవం తీసుకురావచ్చని ప్రవీణ్ గారు అభిప్రాయ పడినట్లు సీ.పీ.ఎం అంచనా వేయడం లేదు.

  సీ.పీ.ఎం స్టడీ సర్కిస్ల్ లో కేవలం అవినీతి గురించి మాత్రమే చర్చిస్తారనే మీ అవగాహన పూర్తిగా తప్పు. అలా మీరెలా చెప్పగలరు. ఖమ్మం లో మేము కేపిటల్ – గతితర్కం లపై పూర్తిగా చర్చించడం జరిగింది. మార్కిస్టు మాసపత్రిక ద్వారా సైద్ధాంతిక అభివృద్ధికి కృషి చేస్తున్నది. స్టడీ సర్కిల్స్ పై ప్రత్యేక్ శ్ర్ద్ధ పెడుతూనే ఉంది. పొలిటికల్ క్లాసులలో సాధారణం గా చెప్పే క్లాసులలో లోతుగా అధ్యయనం చేయడం సాధ్యం కాదు.

  అలాగే పార్టీ సభ్యులలో పూర్తి స్థాయిలో అధ్యయనం – సభ్యులే కాదు జిల్లా స్థాయి నాయకులలో కూడా శ్రమదోపిడీ-అదనపువిలువ గురించి – పెట్టుబడి ప్రస్తుత రూపం గురించి అవగాహన లేని వాళ్లు కూడా ఉన్నారు. ఖమ్మం తో ప్రారంభమైనది రాష్ట్ర వ్యాపితం గా అధ్యయనం పై సీ.పీ.ఎం కేంద్రీకరించింది. కెరీరిజం సమస్యగా రావడానికి అధ్యయనం లోపమే అని సీ.పీ.ఎం గుర్తించడం జరిగింది.

  అయితే సీ.పీ.ఎం ఆచరణలో లోపాలకు – పార్లమెంటును ఉపయోగించుకునే ఎత్తుగడ తప్పు అనడానికి లంకె పెట్టకూడదు. లోపం ఉన్నదానిని సరిచేసుకుని ముందుకు పోవాలి. పార్టీగా కూడా తప్పులు జరుగుతూనే ఉంటాయి. అలాంటప్పుడు పూర్తిగా ఎత్తుగడే తప్పు అయితే సరిచేసుకోవాలి తప్ప. ఆచరణలో లోపాలు ను ఎత్తుగడలలో లోపాలుగా ఎలా చూస్తాము. సాపేక్షం గా – నిరపేక్షం గా కూడా చూడాలి. పరిమానాత్మకం నుండే గుణాత్మకం గా వెళ్లాలి. ప్రజలు సాధారన పోరాటాలకే సిద్ధం కావడం లేదనేది చేదు నిజం. దీనికి కారణాలు – భౌతిక పరిస్థితులను చూడకుందా సీ.పీ.ఎం పూర్తిగా వర్గ పోరాట మార్గం లోనే లేదు అనేది చర్విత చరణం గా వస్తున్న విమర్శే.

  ఆచరణలో పార్లమెంటరీ భ్రమలు – కెరీరిజం పార్టీకి సవాల్ గా ఉన్నాయనేది వాస్తవమే. సిద్ధాంత అధ్యయనం – కేడర్ కు నేర్పడం అనేదానిలో అసలు ప్రయత్నమే లేదు అనేది తప్పు . కానీ శక్తిమేరకు చేయడం లేదనేది నిజం. పార్లమెంటరీ కోణానికి ఇచ్చిన ప్రాధాన్యం అధ్యతనం – కేడర్ నిర్మాణం కు ఇవ్వడం లేదనేది నిజమే. ఈ లోపాలను అధిగమించాల్సి ఉంది.

  భారత కమ్యూనిస్టు పార్టీలలఒ సీ.పీ.ఎం లో మాత్రమే లోపాలు ఉన్నాయి. మిగతా వాటిలో లేవు అని కూడా కాదు. సాపేక్షం గా ప్రజలకు దగ్గరగా సీ.పీ.ఎం మాత్రమే ఉంది. అయితే పార్లమెంటరీ భ్రమలౌ-కెరీరిజం భయంకరమైన సమస్యగా తయారయ్యాయి.

  30 యేండ్లు అధికారం లో ఉన్నా ఓడి పోవడానికి మీరు చెప్పిన అంశాలు కారణమనేది వ్యక్తిగతం గా నా అభిప్రాయం కూడా. అయితే దానికి ఎత్తుగడ నే మార్చుకోవలసిన అవసరం లేదు. బెంగాల్ దాకా ఎందుకు ? ఎం.ఎల్.ఏ అయితేనే చాలా ఫోజులు పెడుతుంటారు. ఎం.ఎల్.ఏ సీట్ల కోసం కొట్లాడే వాళ్లూ ఉన్నారు. ఎం.ఎల్.ఏ సీట్లను తృనప్రాయంగా చూసే వాల్లో ఉన్నారు. మిలిటెంట్లూ – అవకాశవాదులు ఉన్నారు.

  ఇదంతా పార్టీలో ఆంతరంగిక పోరాటం ద్వారా నిర్మూలించుకూఅవాలి . అందుకు నిరంతరం దిద్దుబాటు జరుగుతుండాలి. ఆంతర్నగిక పోరాటమూ వర్గపోరాటమే. పార్టీలఒ అంతా కార్మికవర్గ లక్షణాలు ఉండవు. కార్మిక వర్గ లక్షనాలు ఏర్పరచుకోవడం – విప్లవకార్యకర్తగా రాటుదేలడం మాటల్లో చెప్పినంత తేలిక కూడా కాదు. ప్రస్తుత భౌతిక పరిస్థితిలో అది మరింత సవాల్ గా ఉంది.

 128. 1991కి ముందు విశాలాంధ్ర, ప్రజాశక్తి బుక్‌హౌస్‌లు ప్రచురించిన రష్యన్ అనువాదాలు 1991 తరువాత ఎందుకు ఆపేశాయి? సమాధానం చెప్పండి కొండలరావు గారు: http://4proletarianrevolution.mlmedia.net.in/cpi-cpm-58763

 129. సారీ అండీ . రామ్మోహన్ గారి కే నా సమాధానం. రామ్మోహన్ గారు అని రాయబోయి మీ పేరు వ్రాశాను.

 130. నాకు ఆ విషయం తెలియదు ప్రవీణ్ గారు , వీలయితే వీలున్నప్పుడు కనుక్కుని చెపుతాను. దానిలో మీకు తెలిసిన మిగతా వివరం , దాని అవసరం ఏమిటో చెపితే కనుక్కుని చెపుతాను.

  రంగనాయకమ్మకు వీరభక్తుడిగా మీరు గతం లో కూడా సీ.పీ.ఎం పైనా ఇతర కమ్యూనిస్టులపైనా మీ ఇష్టం వచ్చినట్లు అన్నవి చాలాసార్లు చూశాను. రంగనాయకమ్మకు లేదా ఆమె రచనలకు మీరు అభిమానిగా ఉండడం లో తప్పు లేదు కానీ , రంగనాయకమ్మ చెప్పిందే ప్రామాణికం అని వాదించడం పద్ధతి కాదు.

  రంగనాయకమ్మ గారు మార్క్సిష్టుగా మారాక కొన్ని విషయాలపై ఆమె అభిప్రాయాలు ఆమె చెపుతున్నది. అభిప్రాయాలు ఉండడాన్ని గౌరవిస్తాను కానీ అవే ప్రమాణాలు అని నిర్ధారిచుకోవడం అనేది వ్యక్తిగత విషయం. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇతరులకు అవసరం లేదు. ఆమె అభిప్రాయాలతో ఏకీభవించాల్నా వద్దా ? అనేది కూడా వ్యక్తిగతమె.

  “భూపోరాటం లో తమ్మినేని వీరభద్రం భూములలో ఝండాలు పాతలేదు” నిర్ధారిస్తావా ? దీనిని. ఆయన తనకు ఉన్న ఆస్థులు పార్టీకి తెలిపాడు. అక్రమ ఆస్థులు ఏమైనా ఉంటే ఎవరికి రాసి ఇవ్వడానికైనా అభ్యంతరం లేదని పత్రికలవారికి చెప్పాడు. మీరు కనిపెట్టి ఇప్పుడు వ్రాయించుకున్నా నేను సాక్సి సంతకం పెడతాను. ఇలాంటి వ్యక్తులను టార్గెట్ చేయడం – కులాలను రెచ్చగొట్టే చీప్ ట్రిక్ లు అర్ధం లేని అసత్యాలు రాయడం వల్ల మీ క్రెడిబిలిటీ దెబ్బతింటుంది.

  ప్రపంచ కమ్యూనిస్టు పార్టీలు కమ్యూనిస్టు అని పేరు మార్చుకుంటున్న దశలో సీ.పీ.ఎం కలకత్తాలో ప్రపంచవ్యాపితం గా కమ్యూనిస్టులను పోగేసి మహాసభ నిర్వహించింది.సోషలిజం అజేయమని- కమ్యూనిస్టు పదం తొలగించాల్సిన అవ్సరం లేదని నొక్కి చెప్పింది మీకు తెలియదా? పీ.వీ నరసిమ్హారావులకు – మందంగి ప్రవీణ్ లకు భయపడే స్థితిలో సీ.పీ.ఎం భయపడౌ ప్రవీణ్ గారూ ! మీరిలా అసంబద్ధంగా అసత్యాలు వ్రాస్తే మీ క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. మీతో వాదించడం సమయం వృధా అవుతుంది. వాస్తవాలతో – ఆధారాలతో – వైఖరులతో – విధానాలమీద అయితే వాదించుకోవచ్చు. ఇదేనా రాజకీయం గా తలపండడం అంటే.

 131. గుడిసెవాసులకి వర్గ పోరాటం గురించి చెప్పకుండా అవినీతికి పాల్పడుతోన్న కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చండి అని చెపుతుండడం నేను మొన్న వైజాగ్‌లో స్వయంగా చూశాను. గుడిసెలని కూల్చేస్తే ఆ స్థలాలని కార్పొరేషన్‌వాళ్ళు స్టార్ హొటెల్స్ కట్టేవాళ్ళకి అమ్మెయ్యొచ్చు. ఇది డబ్బున్నవాళ్ళకి లాభం కలిగించి పేదవాళ్ళని నిలువ నీడ కూడా లేకుండా చేసే పని. ఆ సందర్భంలో డబ్బున్నవాళ్ళూ-పేదవాళ్ళూ మధ్య ఉన్న వైరుధ్యాల గురించి మాట్లాడితే ప్రజలకి అర్థమవుతుంది. అయినా GVMC ఆఫీస్ ఎదురుగా పెట్టిన మీటింగ్‌లో ఆ విషయం మాట్లాడకుండా కిరణ్ కుమార్ రెడ్డి అవినీతి గురించి మాట్లాడారు.

 132. నేను రంగనాయకమ్మ గారి రచనలు చదవడం 2006లో మొదలుపెట్టాను. కానీ నాకు మార్క్సిజం తొలిపాఠాలు నేర్పించింది మాత్రం రంగనాయకమ్మ గారు కాదు. రంగనాయకమ్మ గారు వ్రాసిన కాపిటల్ పరిచయం చదవకముందే నా స్నేహితురాలు నాకు కేపిటల్ చదవమని సలహా ఇచ్చింది. అప్పట్లో మా అమ్మానాన్నలు తూర్పు గోదావరి జిల్లాలోని ఓ పల్లెటూరిలో ఉద్యోగాలు చేసేవాళ్ళు. పల్లెటూరిలో పుస్తకాలు దొరకవు కనుక కొనలేకపోయాను. అప్పట్లో BSNL డయలప్ నెట్వర్క్‌తో కనెక్ట్ అయిన స్లో ఇంటర్నెట్‌లో http://marxists.org మరియు http://marx2mao.net వెబ్‌సైట్‌లు చదివేవాణ్ణి. 2006లో శ్రీకాకుళం తిరిగి వచ్చిన తరువాతే నేను రంగనాయకమ్మ గారు వ్రాసిన కాపిటల్ పరిచయం, జానకి విముక్తి, దళిత సమస్య, నీడతో యుద్ధం తదితర పుస్తకాలు కొన్నాను. రంగనాయకమ్మ గారి పేరు చెపితే మీకు ఎందుకు అంత భయం? నేనేమీ ఆవిడ వీర భక్తుణ్ణి కాదే. పైగా ఆవిడ వ్యక్తి పూజ ఇష్టం లేని నిజాయితీపరురాలు కూడా.

 133. కొండలరావు గారు. రంగనాయకమ్మ గారు రాసింది ప్రామాణికంగా తీసుకుంటారా లేదా అనేది మీ ఇస్టం. మీ వ్యక్తిగతం. ఆమె ఏ విషయానైనా మార్క్సిజం ఆదారం చేసుకుని చెప్పిందే. ప్రామాణికంగా లేవు అని మీరు భావిస్తె ఎందుకు లేవొ చెపితె మేము తెలుసుకుంటాము. మీరు చెప్పింది తార్కికంగా వుంటె అంగీకరిచటానికి సదా సిద్దం. యవరు చెప్పెరన్నది కాదు ముఖ్యం. హేతుబద్దంగా వున్నదా లేదా అన్నది ముఖ్యం.

  మా ప్రాంత ప్రజలు కమ్యునిజం అనే పేరే వాళ్ళ జీవిత కాలంలొ చాలా తక్కువసార్లు విని వుంటారు. ఇప్పుడైతె పేపర్ల ద్వారా టి.వీ.ల ద్వారా విని వుంటారు. అలాంటిది మార్కిజం గురించి తెలిసిందంటే అది ఆమె కృషి వల్లే.

 134. మీరు ఏమి చూశారో , ఏమి విన్నారో తెలియదు. మీరు చెప్పిన ప్రకారం చెపితే అక్కడి ప్రజలకు అర్ధం కాదు అని మాత్రం చెప్పగలను. సీ.పీ.ఎం ఏమి చెప్పినా మీకు వ్యతిరేకం గా కనపడుతుంది అని మాత్రం చెప్పగలను. మీ వైఖరి మీ వాదనలు నాకు తెలుసు గనుక.

 135. రంగనాయకమ్మ గారు సిద్దాంతము ఆచరణ రెండూ వుండాలంటుంది. అవి మీరు పాటించలేరు కాబట్టి ఆవిడంటె మీకు పడడం లేదు. మీ మాటలు చేతలు వేరుగా వున్నాయి.

  సి.పి.యం. పార్టీ వాళ్ళు పరిశ్రమల దగ్గరా, వ్యాపారుల దగ్గరా, డబ్బులు తీసుకున్నారని స్వయంగా రాఘవులుగారే చెప్పారు. అలాంటప్పుడు వాళ్ళ మీద తిరుగుబాటు ఎలాచేస్తారు? మీరు ఆ పార్టీని ఎంత సమర్దించినా ఆ పార్టి యొక్క బూర్జువా విధానాలు బహిర్గతమౌతూనే వుంటాయి. బృందా కారత్ గారు పొలేరమ్మ బొట్టు ఎందుకుపెట్టుకున్నట్టు? ఇది భౌతిక వాదమేనా? ఈ మద్యన ఒక కమ్యునిస్టు మహిళా ఎం.యల్.ఎ కి తలంబ్రాల పెళ్ళి దగ్గరుండి చేయించారు. ఇది కుడా బౌతికవాదమేనా? ఇలా చెప్పుకుంటూ పొతే ఎనైనా వున్నాయి.

 136. ప్రకాశ్ కారత్ గారి ప్రవచనాల గురించి గతంలో కెక్యూబ్ గారి బ్లాగ్‌లో చర్చ జరిగింది. ఆ లింకే ఇందాక ఇచ్చాను. అప్పట్లో కొండలరావు గారు బ్లాగుల్లో లేరు కానీ ఉంటే ఏమి సమాధానం చెప్పేవారో.

 137. ఏముందా లింకులో పాడిందే పాడరా పాచిపల్ల దాసరి అన్నట్లు ప్రవీణ్ పాటకో వంతపాట తప్ప. అదేదో అద్భుతమైన సిద్ధాంత చర్చగా లింకులు పెట్టి చూపడం వల్ల ఉపయోగమేముంది. ఇంటర్నెట్ లో నా కులం ఆరా తీసినట్లే మరోసారి ఆనందపడడం తప్ప. ఇలాంటి ప్రాధాన్యత లేని విషప్రచారపు లింకుల చర్చలతో సమయం వృధాతప్ప. ఇలాంటివి ఎన్ని చూపినా ఒకటే సారం అందులో సీ.పీ.ఎం పై , బూర్జువాలపై కూడా లేని అక్కసు – విషం కుమ్మడమే కనిపిస్తుంది. మీరు చేయగలిగేవి ఇలాంటి వింతలే ప్రవీణ్ గారు. ఇలాంటివి చెప్పడం – చేయడమే మీ వర్గపోరాటం. కులాలాను రెచ్చగొట్టడం – అసత్యాలు ప్రచారం చేయడం – ముక్కలు ముక్కలుగా లింకులు అర్ధం లేకుండా పెట్టడం వీటికి నేను చెప్పగలిగే చెప్పాల్సిన సమాధానం ఇదే. అవును ఇందులో మీరు తలపండినవారు కదా ? కానివ్వండి. వేయి భావాలు వికసించనివ్వండి అన్న మావో ఆలోచనా విధానం అంటే నిస్సిగ్గుగా అసత్యాలు ప్రచారం చేయడం . అనవసర క్రిటిసిజం కాదు అని మాత్రం చెప్పగలను. కామ్రేడ్ మావో ఆలోచనల సారం – మార్గం మాత్రం ముమ్మాటికీ ఇది కాదూ అని మాత్రం చెప్పగలను. మీతో చర్చించడం అంటే నిర్మాణాత్మకం కాదు టైం పాస్ జోకింగ్ మాత్రమే అని చెప్పగలను. ఓ ఆర్డరు – వరుస – లక్ష్యం – నిబద్ధత – కనీస మర్యాద – అన్నమాటకు కట్టుబడడం ఇవేవీ లేని వారితో చర్చించడం అంటే సమయం వృధా అవుతుంది. సీ.పీ.ఎం లైన్ వృధా అయితే ఆ పార్టీ తప్పు సరిచేసుకుంటుంది. తప్ప ఆ పార్టీపై ద్వేషం ప్రదర్శించడమే పనిగా పెట్టుకుంటే వర్గపోరాటం కాదు. పార్లమెంటరీ భ్రమలు – కెరీరిజం తో సీ.పీ.ఎం లో ఇబ్బందులు పడుతున్నవారు కూడా మీ లాంటి వాళ్ల వాదనల వల్ల మావో ఆఓచనా విధానం ఏమిటో ఆలోచిద్దామనుకోరు . గుడ్డి ద్వేషం తో విషప్రచారం తో ఒక వాదనకు మద్దతు పొందకపోగా శతృభావన – చులకన భావనే మిగులుతుంది. మీ లాగా వాదించే వారిపట్ల నాకు అదే భావం కలుగుతుంది. సీ.పీ.ఎం లో లోపాలకు అర్ధవంతం గా ప్రత్యామ్నయం చెప్పగలిగితే ఏమైనా ఆలోచించడానికి ఉంటుంది. ఆ పార్టీ కంటే మంచి ఆచరణ ఉంటే తప్పనిసరిగా సోషలిజం ఉన్నత మానవ సమాజం ఆలోచన కలిగిన వాళ్లు ఆఓచించడానికి ఉంటుంది . అలా గాక ఏమిటి విపరీత వాదనలు. వింత చేష్టలు. ఉంటాను. ఇలాంటివి చర్చించడం – ఈ పద్ధతిలో చర్చించడం పనిలేని వాళ్లు – లక్ష్యం లేని వాళ్లు మాత్రమే చెయగలరు.

 138. రంగనాయకమ్మ గారంటే నాకు భయం లేదు. భక్తీ లేదు. రంగనాయకమ్మ గారి గురించి మీరే ముక్కలుగా వివరించి ఆమెను అనవసర చర్చలలోకి లాగుతుంటారనేది నా అభిప్రాయం. రంగనాయకమ్మ కేపిటల్ పరిచయం నేనూ చదివాను. అవి చదివాకే కేపిటల్ ఈజీగా అర్ధమయింది. అందులో ఆమె కృషి ప్రశంసనీయం. ఎవరికైనా ఈజీగా ముందు కేపిటల్ అర్ధం కావాలంటే ఆమె రాసిన కేపిటల్ పరిచయం చదవమనే చెపుతాను నేను. రంగనాయకమ్మ గారు చెప్పారు ప్రజాశక్తి వాళ్లు ప్రచురించడం లేదు ఫలానా బుక్స్ ఎందుకు చెప్పండి అని వాదనలోగి ఆమెను ఎందుకు ప్రతి చిన్న విషయం లోకి లాగడం ప్రవీణ్ గారూ ! రంగనాయకమ్మ గారిపై నాకు ప్రత్యేకమైన శతృత్వం గానీ – అభిమానం గానీ లేవు. మార్క్సిస్టుగా మారిన తరువాత ఆమె రచనలు వల్ల మార్క్సిజం ప్రచారం లోకి రావడానికి మేలే తప్ప కీడు కాదుగా. ఆమె యాంగిల్ లో కొన్ని అభిప్ర్యాయాలు – ఆర్టికల్స్ మాత్రం నచ్చవు. ఆ హక్కు మాకు ఉంటుంది. ఆమెను వ్యక్తిగతం గా ఎక్కడా కించ్పరచలేదు నేను. ఆమె గురించి నాకు తెలిసింది తక్కువే. ఆమె బాలగోపాల్ గురించి కించపరుస్తూ వ్రాశారని విన్నాను. నిజమో కాదో తెలియదు. లింక్ కోసం ప్రయత్నిస్తే దొరకలేదు.

 139. ప్రవీణ్ ! ఆమె పోలేరమ్మ బొట్టు పెట్టుకుంది సరే . మీరు బట్టలు లేకుండా తిరుగుతారా ? మనిషి బట్ట కట్టడం మధ్యలోనే నేర్చాడు . పోయేటప్పుడూ వెంట రాదూ ! వేమన కట్టలేదు. నెత్తిన టోపీలు పెట్టుకుని గుర్రాలు గాడిదల మీద ఎందుకు తిరుగుతున్నారు ? రకరకాల వేషాలు ఎందుకు వేస్తున్నారు ? అంటే ఏమి సమాధానం చెపుతారు? వేషధారణ – అలంకారాలు ఎలా ఉండాలి అనేది ఎవరు నిర్ధారించాలి ? ఎలా నిర్ధారించాలి. మీ అంత మూర్ఖంగా ఆమె ఆలోచించదు కనుక ప్రజల విశ్వాసాలను గౌరవించాలి గనుక అవి ఒకేసారి మారవు గనుక అన్ని రకాల పెళ్లిల్లకు వెళుతుంది. మీలాగా నేను రానుపో అని పిచ్చిపిల్లడిలా మారాము చేయడం అందరికీ కుదరదుగా మరి. ఈ విషయం ఇంతకు ముందే వివరించాను. సీ.పీ.ఎం అంటే చాలు హిస్టీరియా రోగిలా మారిపోతారు మీరు. అందులో భాగమే ఈ చిన్నేలు. ఇదేనా ప్రజలను చైతన్యం చేయడం-నిరంతరం బ్లాగులలో విషం కుమ్మడం – దానినే మార్క్సిజమనీ – వర్గపోరాటమనీ భ్రమ పడడమూ . దీనిని వికృత ఆనందం అంటాను తప్ప నిర్మాణాత్మకమైన సద్విమర్శ అనుకోను.

 140. రాం మోహన్ గారూ ! రంగనాయకమ్మ్ గారి రచనాశైలి బాగుంటుంది. ఆమె రచనలు నేను పెద్దగా చదవలేదు. అరుణా పబ్లిషింగ్ హవుస్ వారు పబ్లిష్ చేసిన కేపిటల్ పరిచయం రెండు భాగాలను చదివాను. అవి నాకు బాగా ఉపయోగ పడ్డాయి. ఆమె తాను చెప్పదలచుకుంది సూటిగా ధైర్యం గా చెపుతుంది. మార్క్సిస్టు ధోరణిలో ఆమె చెపుతుందా ? లేదా ? అనే కోణం లో లోతుగా ఎపుడూ పరిశీలించలేదు. పతికలలో కొన్ని వ్యాసాలలో ఆమె వైఖరి మాత్రం నాకు నచ్చలేదు. ప్రజాశక్తి వాళ్లు ఫలానావి ముద్రణలు ఆపిందని రంగనాయకమ్మ గారు చెప్పారు – దానికి మీరు సమాధాన్మ్ చెప్పండి అని ప్రవీణ్ నన్నడిగితే అలా చెప్పాను. గతం లో కూడా రంగనాయకమ్మ గారి పేరు చెప్పి ఆయన ముక్కలు ముక్కలుగా లింక్ లేకుండా వాదించేవాడు. రంగానాయకమ్మ్ గారిని వివాదాంశం గా చేయాల్సిన అవసరం ప్రస్తుతం లేదు. ఏదైనా విషయం ఆమె వ్రాసినదానిపై వచ్చినప్పుడు వైఖరులు చర్చిస్తే మంచిదనుకుంటా.

 141. నేనేమీ రంగనాయకమ్మ గారి గురించి ముక్కలుగా వివరించలేదు కానీ ఆవిడ గురించి తెలిసితెలియకుండా వ్రాసినది మీరు. బాలగోపాల్ మొదట్లో మార్క్సిస్ట్‌లాగ కనపడి తరువాత మార్క్సిజం మానవ స్వభావంలో ఇమడదని వాదించాడు. అందుకే రంగనాయకమ్మ గారు బాలగోపాల్‌ని విమర్శించారు. ఆ వ్యాసం “మానవ సమాజం” పుస్తకంలో ఉంది.

 142. ప్రవీణ్, కొండల్రావు గార్లకు విన్నపం. వాద ప్రతివాదాలు ఇక ముగించగలరు. విషయం పూర్తిగా పక్కకు వెళ్లిపోతోంది. ఇక ఒకరిపై మరొకరు ఏమి రాసినా ప్రచురించలేను. దయచేసి ఏమీ అనుకోవద్దు.

  ప్రవీణ్, రంగనాయకమ్మ గారి గురించి రాసిన వ్యాఖ్య తీసేశాను. ఆ సమాచారం ఇప్పుడు అప్రస్తుతం. ఎవరికీ అవసరం లేనిది.

 143. రాం మోహన్ గారూ !

  రంగనాయకమ్మగారు చెప్పడం అని కాదు. సిద్ధాంతమూ ఆచరణ రెండూ ఉండాలి అనేది కమ్యూనిస్టు నిర్మాణ సూత్రమే.

  ప్రవీన్ తో వాదించేటప్పుడు బేలన్స్ మెయింటైన్ చేయడం లో నేను ఇబ్బంది పడాల్సి వస్తున్నదని నాకూ అనిపిస్తోంది. ప్రవీణ్ వాదనలకు సమాధానం గా నేనన్న దానిని గురించి నన్ను రంగనాయకమ్మ గారికి వ్యతిరేకిగా భావిస్తున్నారు. అది తప్పు . అలా భావించవద్దు.

  రంగనాయకమ్మ గారి వల్లే మార్క్స్ కేపిటల్ నాకు అర్ధమయింది. నాకు తెలిసి కమ్యూనిస్టు పార్టీ నేతలెవరూ చేయని – శ్రామిక వర్గానికి దిక్స్సూచి అయిన మార్క్స్ కేపిటల్ ను ఆమె అనువదించడం అనేది , అదీ చాలా సరళం గా అర్ధమయ్యేలా అనువదించడం అభినందనీయం. ఆ పని బాధ్యతగా చేయలేని కమ్యూనిస్టు బాధ్యుల కంటే ఆమె కృషి అభినందనీయం . మరోరకం గా కనువిప్పు అని చెప్పాలి.

  ఆమె వ్రాసిన బుక్స్ ఆధారం గానే మేము స్టడీ సర్కిల్స్ నిర్వహిస్తున్నాము. ఆమె గురించి తెలుసుకోవడానికి అభ్యంతరమూ , ఆమె పై వ్యతిరేకం పెంచుకోవలసిన అవసరమూ లేదు. మార్క్స్ కేపిటల్ అర్ధం కావాలంటే ఆ బుక్స్ చదవమనే నేను ఎవరికైనా చెపుతున్నాను. విశాలాంధ్ర వాళ్లు వేసిన బుక్ ఇంత తేలికగా అర్ధం కాదు.

  రంగనాయకమ్మ గారి గురించి – ఆమె సాహిత్యం వివరాలు మీకు అభ్యంతరం లేకపోతే – వీలుంటే నాకు మెయిల్ చేయగలరు. నాకు తెలుసుకోవాలనే ఉంది. అదే కాదు మార్క్సిజం గురించి ఇలా బహిరంగం గా వాదోపవాదాలు – కొన్ని సందర్భాలలో స్వీయాత్మక ధోరణులకు అందరం లోను కావడం కంటే ఇలాంటివి మెయిల్ ద్వారా చర్చించుకునేందుకు మీకు ఏమీ అభ్యంతరం లేకుంటే అలా చేద్దాం. మీ సూచనల వల్ల ఉపయోగం ఉంటున్నది కనుక నేను ఈ విషయం ప్రతిపాదిస్తున్నాను. ఆలోచించండి.

  బృందాకరత్ బొట్టుగురించి భౌతికవాదం అనేది మీరు ఆలోచించే ధోరణి నాకు అర్ధం కాలేదు. బొట్టుని పట్టి భౌతికవాదం నిర్ణయిస్తారా ? ఎలా ? ప్రజలకు దగ్గరగా ఉండేటప్పుడు ప్రజలకు తగిన రీతిలోనే ఆచరణ ఉండాలి. మీరన్నది సీ.పీ.ఐ ఎం.ఎల్.ఏ వివాహం గురించా? ఒక పెళ్లి హాజరు అయితే ఆమె దగ్గరుండి చేయించినట్లా ? మనం హాజరయ్యే ఇలాంటి కార్యక్రమాలనీ మన ఇష్ట ప్రకారం జరుగుతాయా? ఆలోచించగలరు. సీ.పీ.ఎం ప్రజలవద్దనే ప్రతి ఏటా విరాళాలు సేకరిస్తుంది. కార్పోరేట్ సంస్థల దగ్గర కాదు. రాఘవులు ఏ సందర్భం లో చెప్పారో నాకు తెలియదు. ఎవరి దగ్గర చందాలు తీసుకున్నా దానికి అకౌంట్బిలిటీ ఉంటుంది. కార్పొరేట్ శక్తుల దగ్గర చందాలు తీసుకుంటే ఆ ప్రభావం ఉంటుందండం లో సందేహం లేదు. ప్రజల దగ్గరే తీసుకోవాలి. నాకు తెలిసి రాఘవులు గారు అలా అని ఉండక పోవచ్చు.

 144. వ్యక్తిగత విమర్శలు పబ్లిష్ చెయ్యను అని అంటూనే కొండలరావు గారు నా మీద చేసిన విమర్శలు ఎందుకు పబ్లిష్ చేశారు? గూగుల్ ప్లస్‌లో ఆయన సీకాకులం అనే పదం ఉపయోగించి మా ప్రాంతంవాళ్ళని కించపరిచారు. దీనిపై నీహారిక గారు కూడా అభ్యంతరం చెప్పిన తరువాత ఆయన తాను జెనెరల్ సెన్స్‌లో అలా మాట్లాడానంటూ వాదించారు. కావాలంటే నీహారిక గారినే అడగండి, ఆవిద మీకు వివరంగా చెపుతారు.

 145. అది కొండల్రావు గారు ఆత్మ విమర్శనాపూర్వకంగా రాసారు. అందువలన అలాగే ఉంచాను. తాను బ్యాలెన్స్ కోల్పోయినట్లు రాసారు తప్ప మీరు బ్యాలన్స్ కోల్పోయినట్లు రాయలేదు. గమనించండి ప్రవీణ్.

 146. ప్రవీణ్ గారు , మీపై నాకు వ్యక్తిగత కోపం లేదు. వాదనా పద్ధతి పట్ల కోపం ఉంది. కులం ఇతర విషయాలపట్ల మీరు వ్రాసిన వాటిని మీరే మరోసారి ఆలోచించండి. విశేఖర్ గారన్నట్లు నేను ఆత్మ విమర్శ చేసుకునే వ్రాశాను. నేను దానిని గెలుపు ఓటములుగా భావించడం లేదు. ఎదుటివారు పద్ధతిని బట్టి మనం బేలన్స్ కోల్పోయినా మనం ఆత్మవిమర్శ చేసుకునేందుకు వెనుకాడాల్సిన అవసరమేముంది. నాకు మావో గురించి తెలీదు. విశేఖర్ గారు వ్రాసింది చదివాను. మరోసారి చదివి దానిపై నిర్ధారణకు రావాలనుకుంటున్నాను. మనిషికి మంచి భావాలు ఎలా ఏర్పడతాయి ? అనే బుక్ మాత్రమే మావో వ్రాసింది చదివాను. విశేఖర్ గారి ద్వారా కొన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. ఆయన బ్లాగును గతం లో కంటే ఎక్కువగా వీలయినంతగా చూడాలనే అనుకుంటున్నాను. రాజసేఖరరాజు గారితో ఏర్పడిన పరిచయాన్ని మార్క్సిజం గురించి మరింతగా తెలుసుకునేందుకు ఉపయోగించుకుంటాను. రంగనాయకమ్మ గారి గురించి మీరు చెప్పినా తెలుసుకుంటాను. గతం లో అడిగినా మీరు సరైన సమాధానం చెప్పలేదు. ఇప్పుడు చెప్పినా మంచిదే. మీరు మార్క్సిజమే ప్రచారం చేయాలనుకుంటున్నారు కనుక మూల సూత్రాల విషయం లో మీ దగ్గర సమాచారమైనా తెలుసుకునేందుకు ఇబ్బంది లేదు. కానీ నేను సీ.పీ.ఎం అని చెప్పాక కూడా మీరలా లింకులు పెట్టి సమాధానం చెప్పండి ? అని ప్రశ్నించవద్దని విజ్ఞప్తి. దానివల్ల ప్రయోజనం ఉండదు. విధానపరమైనవి ఉంటే మీరు పోస్టు వ్రాసి మా అభిప్రాయం తీసుకోండి. ఇలా కామెంట్ల రూపం లో చర్చలకు మాత్రం దూరం గా ఉండాలను కుంటున్నాను. నేను సీకాకుళం అనే పదం వాడలేదు. నా ప్లస్ లో పోస్టులలో వాటిని డిలీట్ చేయలేదు. మల్లీ చెక్ చేసుకోండి. ఇంతకు మించి ఇక మీతో వాదించే సందర్భం లో సమ్యమనం పాటించేందుకు ప్రయత్నిస్థాను.లేదా అసలు వాదించకుండా ఉంటాను. ఇక పై విశేఖర్ గారి బ్లాగుని ఈ విషయం పై వేదికగా వాడుకోవడం పద్ధతి కాదు కనుక ముగిస్తున్నాను.

 147. నిన్న రామమోహన్ గారు బృందా కారత్ గురించి వ్రాసిన వ్యాఖ్య పూర్తిగా చదవకుండానే అది నేను వ్రాసాననుకుని కొండలరావు గారు నాపై విమర్శలు చేశారు. అది కరెక్ట్ కాదు అని నేను చెపితే ఆ వ్యాఖ్యలు కూడా మీరు డిలీట్ చేశారు. వ్యాఖ్య పూర్తిగా చదవకుండా, కనీసం వ్యాఖ్యాత పేరు కూడా చదవకుండా వ్రాసే కామెంట్లని మీరు అనుమతిస్తారా?

 148. ప్రవిణ్, పైన కొండల్రావు గారు రాసినట్లుగా మీనుండి ఒక్కసారి కూడా ఆత్మ విమర్శనా పూర్వకంగా రాసిన వ్యాఖ్య ఇంతవరకూ చూడలేదు. మీరసలు పొరపాట్లే చేయరన్నట్లుంటుంది మీ ధోరణి. మళ్ళీ మీరు ఆరోపణనలు మొదలు పెడితే తొలగించక తప్పదు. గమనించగలరు.

 149. వ్యాఖ్యలు చదవకుండానే వ్యాఖ్యాతలని విమర్శించేవాళ్ళ వ్యాఖ్యలని అనుమతిస్తారు కానీ నా వ్యాఖ్యలని అనుమతించరన్నమాట! CPM మార్క్సిస్ట్ పార్టీ కాదు. అదొక రివిజనిస్ట్ పార్టీ. ఆ పార్టీ నాయకులు బొట్లూ, నామాలూ పెట్టుకున్నా, మంగళ సూత్రాలు కళ్ళకి అద్దుకున్నా అది నాకు అనవసరమైన విషయం. రామమోహన్ గారు కేవలం CPM యొక్క self-contrastని బయట పెట్టడానికి ఆ వ్యాఖ్య వ్రాసారు, అంతే. అయితే నేను వ్రాయని వ్యాఖ్య విషయంలో నన్ను విమర్శించడం కరెక్టా అని అడిగితే నా వ్యాఖ్యలు ఎందుకు డిలీట్ చేశారు?

 150. ప్రవీణ్, నిన్న మీరిద్దరూ వేడి లో ఉన్నారు. అందువలనే ఇద్దరివీ ప్రచురించలేదు. కొండల్రావుగారిది కూడా విమర్శ లేకపోయినా, ఆత్మవిమర్శనా పూర్వకంగా ఉన్నా ప్రచురించలేదు. ఆ సంగతి మీకు తెలియదు కదా. పైన వేణు గారు మీరు చెప్పదలిచిన విషయం చెప్పారు. కనుక ఆ లోటు పూడినట్లే.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s