పశ్చిమ దేశాల ఆర్ధిక వ్యవస్ధలకు ‘నిరుద్యోగం’ కొత్త సాధారణ లక్షణం (new normal) గా మారిపోయింది. ఆర్ధిక సంక్షోభం అనంతరం ‘రికవరీ’ సాధించినట్లయితే అందులో ‘జాబ్ గ్రోత్’ కూడా కలిసి ఉండడం నియమం. కాని 2008 ఆర్ధిక సంక్షోభం అనంతరం ‘రికవరీ’ సాధించామని చెబుతున్నప్పటికీ అందులో ‘జాబ్ గ్రోత్’ లేదు. దానితో ఆర్ధిక వేత్తలు ఇప్పటి రికవరీని ‘జాబ్ లెస్ రికవరీ’ గా పేర్కొంటున్నారు. ‘జాబ్ గ్రోత్’ లేని రికవరీ, అసలు రికవరీ కానే కాదు. అందుకే నిరుద్యోగాన్ని ‘న్యూ నార్మల్’ అంటోంది. అంటే ఉద్యోగాలు కల్పించే బాధ్యతని పెట్టుబడిదారీ కంపెనీలు వదిలేశాయి. నిజానికి ‘ఉద్యోగాల’ బాధ్యత అవి ఎన్నడూ మోయలేదు. వాటి లాభాల కోసం, మార్మెట్ నిలుపుకోవడం కోసం అనివార్యంగా కల్పించబడ్డ ఉద్యోగాలే తప్ప దేశం పట్ల, ప్రజల పట్ల బాధ్యతతో ఇచ్చినవి కావు. నిరుద్యోగం ఒక సమస్య కాగా, నిరుద్యోగ సైన్యాన్ని అవకాశంగా మలుచుకుని కంపెనీలు వేతనాలను మరింతగా తగ్గించడం మరొక సమస్య. అమెరికాలో నిరుద్యోగం తగ్గుతున్నట్లు గణాంకాలు చెబుతున్నప్పటికీ అసలు ఉద్యోగ ప్రయత్నాలు పూర్తిగా మానేయడమే ఈ తగ్గుదల వెనుక ప్రధాన కారణంగా ఉంది. ఉద్యోగాల కల్పనలో ఒబామా ఘోరంగా విఫలం అయినప్పటికీ మరో ప్రత్యామ్నాయం లేని పరిస్ధితుల్లో మళ్లీ ఒబామా యే అధ్యక్షుడుగా ఎన్నికయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
- కేగిల్
- ప్యాట్ బేగ్లీ
- జెఫ్ పార్కర్
- ఎరిక్ అల్లీ
ఎం.ఎస్.ఎన్ వార్తా సంస్ధ ఈ కార్టూన్లు అందించింది.
1920-1930లలో అమెరికాలో 20% నుంచి 30% వరకు నిరుద్యోగం ఉండేది. 1940 నాటికి రష్యా 100% మంది ఉద్యోగాలు ఇచ్చింది. అమెరికన్ మార్క్సిస్ట్ హేరీ మెగ్డాఫ్ వ్రాసిన రచనలలోనే ఇది చదివాను. 1945లో రష్యా రెండో ప్రపంచ యుద్ధాన్ని గెలవడం వల్ల అమెరికా తన దేశంలో నిరుద్యోగాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోవడం తప్పనిసరి అయ్యింది. 1950 తరువాత మోటర్ వాహనాల తయారీ పరిశ్రమ అభివృద్ధి చెందడం వల్ల అమెరికా నిరుద్యోగాన్ని వేగంగా తగ్గించగలిగింది. 1991 తరువాత అమెరికాలో నిరుద్యోగం మళ్ళీ పెరిగింది. బిల్ క్లింటన్ కాలంలో అమెరికాలో 13% పేదరికం ఉండేది. క్లింటన్ కాలంలోని నిరుద్యోగం లెక్క మాత్రం నాకు గుర్తులేదు.
ఈ కార్టూన్లు కూడా చూడండి: http://stalin-mao.net.in/129697158