క్లుప్తంగా… 05.05.2012


జాతీయం

వేచి చూస్తాం -రాష్ట్రపతి ఎన్నికపై లెఫ్ట్ పార్టీలు

Layout 1రాష్ట్ర పతి ఎన్నికకు సంబంధించి వేచి చూడడానికి నిర్ణయించుకున్నామని లెఫ్ట్ పార్టీలు తెలిపాయి. సి.పి.ఐ, సి.పి.ఎం, ఆర్.ఎస్.పి ఫార్వర్డ్ బ్లాక్ న్యూఢిల్లీలో సమావేశమై మాట్లాడుకున్న అనంతరం తమ నిర్ణయం ప్రకటించాయి. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్.సి.పి పార్టీ మాత్రం ఉప రాష్ట్రపతి ‘హమీద్ అన్సారీ’ కంటే ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ యే తమకు ఆమోదయోగ్యమని ప్రకటించింది. అంతిమ నిర్ణయం తీసుకునే ముందు ‘సెక్యులర్’ పార్టీల అభిప్రాయం తీసుకుంటామని లెఫ్ట్ పార్టీలు తెలిపాయి. పార్లమెంటరీ లెఫ్ట్ పార్టీలు చెప్పే ‘సెక్యులర్’ పార్టీలంటే వివిధ రాష్ట్రాలలో ఉన్న ప్రాంతీయ పార్టీలే. వీరి దృష్టిలో కాంగ్రెస్ కూడా సెక్యులర్ పార్టీయే. భూస్వామ్య, పెట్టుబడిదారీ వర్గాలకు ప్రతినిధులయిన పార్టీలతో ఎన్నికల ఫ్రంటుటు కట్టడానికి వీలుగా ఈ పార్టీలు ఎంచుకున్న లక్షణమే ‘సెక్యులర్’. కాంగ్రెస్ స్వయంగా అనేక మత తత్వ విధానాలను అవలంబించినా వీరికి పట్టదు. షాబానో కేసులో రాజీవ్ గాంధీ ముస్లిం మత తత్వ వాదులకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయం గానీ, బాబ్రీ మసీదు తాళాలు తెరవడంలో రాజీవ్ గాంధీ చూపిన సానుకూలత గానీ, బాబ్రీ మసీదు కూల్చివేతలో కాంగ్రెస్ సహకారం గానీ వీరి దృష్టిలో మతతత్వం కాదు.

అక్రమ మైనింగ్ కి ‘కవర్’ ఇచ్చిన గాలి కంపెనీ –సర్వే

కర్ణాటకలో అనేక చోట్ల అక్రమంగా తవ్వి తీసిన ఇనుప ఖనిజాన్ని గాలి జనార్ధన రెడ్డికి చెందిన ‘అసోసియేటెడ్ మైనింగ్Gali కంపెనీ’ (ఎ.ఎం.సి) ‘కవర్’ గా పని చేసిందని సి.బి.ఐ పురమాయించిన స్వతంత్ర సర్వే లో తేలింది. సి.బి.ఐ, రెండు సంస్ధల చేత స్వతంత్రంగా శాస్త్రీయ పద్ధతుల్లో సర్వే చేయించగా రెండూ ఒకే ఫలితాన్ని తేల్చాయని సి.బి.ఐ వర్గాలను ఉటంకిస్తూ ‘ది హిందూ’ తెలిపింది. దాల్మియా కంపెనీకి చెందిన గనుల్లో అనేక చిన్న చిన్న కంపెనీలు అక్రమంగా మేలైన ఖనిజాన్ని తవ్వి తీసాయనీ అయితే వాటికి సరైన అనుమతులు లేకపోవడంతో అమ్ముకోవడం సమస్యగా మారిందనీ సి.బి.ఐ తెలిపింది. ఇక్కడే గాలి జనార్ధన రెడ్డి ప్రవేశించి మంత్రిగా తన పలుకుబడిని ఉపయోగించి అనుమతులు సమకూర్చాడని తెలిపింది. ఎ.ఎం.సి ని చేత రాంగఢ్ గనుల అనుమతి పొందినప్పటికీ ఆ సంస్ధ ఎగుమతి చేసిన 8 లక్షల టన్నుల ఖనిజంలో 5 శాతం మాత్రమే రాంగఢ్ గనుల్లో తవ్వినదనీ మిగిలిందంతా దాల్మియా గనుల్లో, అటవీ ప్రాంతాల్లో తవ్వినదేననీ ‘ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్’, ‘సింగరేణీ కాలరీస్ కంపెనీ లిమిటెడ్’ లు 3డి లేజర్ టెక్నిక్ ని ఉపయోగించి చేసిన శాస్త్రీయ సర్వేలో తేలింది. ఎ.ఎం.సి ఎగుమతి చేసిన ఖనిజంలో 65 శాతం ఫెర్రస్ కంటెంట్ ఉండగా రాంగఢ్ గనుల్లో 45 శాతం ఫెర్రస్ కంటెంట్ ఉన్న ఖనిజమే లభ్యం అయిందనీ సర్వేలో తేలింది. ప్రభుత్వ భూముల్లో అక్రమంగా ఖనిజం తవ్వి తీయడమే కాక, ఇతర కంపెనీల ఖనిజాన్ని కూడా ఎం.సి.సి దొంగిలించిందనీ తేలింది. ఇలాంటి అవినీతిపరుడ్ని సహించిన బి.జె.పి అవినీతి అంటే ఏమిటో తనకేమీ తెలియనట్లు నటిస్తోంది.

అంతర్జాతీయం

చివరి అణు విద్యుత్ కర్మాగారం మూసేసిన జపాన్

జపాన్, తన చివరి అణు కర్మాగారాన్ని శనివారం మూసేసింది. ప్రభుత్వ నిర్ణయానికి హర్షం వ్యక్తం చేస్తూ వేలమంది జపాన్ ప్రజలు వీధుల్లోThousands march Japan shuts off Nuclear power ప్రదర్శనలు నిర్వహించారు. శనివారం జపాన్ మూసేసిన ‘తోమారీ’ అణు కర్మాగారం 50 వది. ఫుకుషిమా అణు కర్మాగారంలో గత సంవత్సరం ప్రమాదం సంభవించాక నిర్వహణ కోసం ఒక్కొక్క కర్మాగారన్నీ మూసేస్తూ వచ్చింది. అయితే మూసేసిన అణు కర్మాగారాలను తిరిగి తెరవడానికి రాష్ట్ర ప్రభుత్వాలేవీ అంగీకరించకపోవడంతో మూసినవి మూసినట్లే ఉండిపోయాయి. 40 సంవత్సరాల తర్వాత జపాన్ మొట్టమొదటి సారిగా అణు విద్యుత్ లేకుండానే తన విద్యుత్ అవసరాలు తీర్చుకుంటోంది. లోటును పూడ్చడానికి ఇరర మార్గాలు చూసుకుంది. ప్రజలు కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి ముందుకొచ్చారు. రోజులో కొద్ది గంటల పాటు విద్యుత్ వాడకుండా ఉండటం ద్వారా వారు తమవంతు సహకారం అందజేశారు. ప్రమాదానికి గురయిన ఫుకుషిమా అణు కర్మాగారం గాలిలోకీ, నీటిలోకీ ఇప్పటికీ రేడియేషన్ విరజిమ్ముతున్న నేపధ్యంలో జపాన్ ప్రజలు అణు విద్యుత్ పట్ల తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఒత్తిడితో రాష్ట్ర ప్రభుత్వాలు అణు కర్మాగారాన్ని తెరవడానికి కేంద్ర ప్రభుత్వానికి అనుమతి ఇవ్వలేదు. దానితో నాలుగు దశాబ్దాల తర్వాత అణు విద్యుత్ లేకుండానే జపాన్ ప్రజలు మనుగడ సాగించడం ద్వారా చరిత్ర సృష్టిస్తున్నారు. అయితే అణు విద్యుత్ కర్మాగారాలను వివిధ పరీక్షల అనంతరం తిరిగి తెరవడానికి కృత నిశ్చయంతో ఉన్నట్లు దాని ప్రకటనలు తెలియజేస్తున్నాయి.

అమెరికా ముస్లిం మహిళకు $ 5 మిలియన్ నష్ట పరిహారం

Susan Bashirఎ టి & టి కంపెనీలో పని చేస్తున్న ముస్లిం మహిళపై మతపరమైన వివక్షను చూపినందుకు $ 5 మిలియన్లు నష్ట పరిహారం చెల్లించాలని కాన్సస్ సిటీ కోర్టు తీర్పు నిచ్చింది. 2005 లో ముస్లిం మతంలోకి మారినప్పటి నుండీ కంపెనీ తో పాటు తోటి ఉద్యోగులు తనను వివక్షతో చూసారని సుసాన్ బషీర్ కోర్టుకి ఫిర్యాదు చేసింది. 2008 లో తన ఆఫీస్ చీఫ్ తన తలపై ఉన్న స్కార్ఫ్ ను బలవంతంగా లాగేసి అవమానపరిచాడనీ ఆమె ఫిర్యాదు చేసింది. మతం మారక ముందు తానేమీ ధరిస్తున్నదీ పట్టించుకోని ఉద్యోగులు మతం మారాక తన ప్రతి చర్యనీ రచ్చ చేశారనీ, ‘ఏం పేల్చబోతున్నావంటూ’ ఎకసక్కెం చేసేవారని సూసాన్ కోర్టుకి తెలిపింది. సంవత్సరానికి $70,000 చేసే ఉద్యోగం నుండి తనను తొలగించారని, దానితో తన కుటుంబం విచ్ఛిన్నమై విడాకులు తీసుకోవలసి వచ్చిందనీ సూసాన్ తెలిపింది. కోర్టు తీర్పుపై అప్పీలు కు వెళ్లనున్నట్లు ఎ టి & టి కంపెనీ అధికారులు తెలిపారని ఎన్.డి.టి.వి తెలిపింది.

29 thoughts on “క్లుప్తంగా… 05.05.2012

 1. విశెఖర్ గారు. ఈ కమ్యునిస్టు పార్టీ వాళ్ళు గొర్రెతొలు కప్పుకున్న క్రూరమృగాలు . ఎదుటనున్న శత్రువు కన్నా మారు రూపంలొ వున్న ఇలాంటి వాళ్ళు ఎక్కువ ప్రమాద కారులు. బుర్జువా పార్టీలకు ఈ గొర్రెతొలు కప్పుకున్న పార్టీలకు నాకు పెద్దతెడా కనపడలేదు. (మీకేమైనా తెడా కనపడితె చెప్పండి) బుర్జువా పార్టీలు వాళ్ళు ఏ పనిచేసినా ఓట్లను దృరుస్టిలో పెట్టుకుని చేస్తారు. వీళ్ళు కుడా ఆ బాపతె. పుచ్చలపల్లి సుందరయ్య లాంటి వాళ్ళు ఇప్పుడు ఒక్కరుకుడా లేరు. నేను స్వయంగా చుశాను ఆ పార్టీ కార్యకర్తలకు ఏ మాత్రం వర్గ చైతన్యం లేదు. (వుంటె ఆ పార్టీలొ వుండరు కదా?)

  భవిష్యత్తులొ ఈ పార్టీలకు ప్రత్యమ్న్యాయంగా మరొ కమ్యునిస్టు పార్టీ ఎర్పడవలసిన అవసరం వుంది.

 2. రామ్ మోహన్ గారూ, నక్సలైట్ పార్టీలు వీరికి ప్రత్యామ్నాయం కాదనా మీ ఉద్దేశ్యం? కమ్యూనిస్టు పార్టీలు కూడా ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని మీరు భావిస్తున్నారా?

 3. విశెఖర్ గారు. ప్రజలను సాయుధ పొరాటానికి సన్నద్దం చేయకుండా కేవలం ఎన్నికలలొ గెలిచి ఏదో చేద్దామనుకోవటం (వల్ల) ఇంకొక వంద ఏళ్ళు అయినా ఏమీ మార్పు వుండదు. పెట్టుబడిదారీ విధానం వల్ల పుట్టుకువచ్చే ఆటుపొట్లను ఎగుడు దిగుడుల(నూ) నివారించటానికి సర్వశక్తులు దానిమీదనే కేంద్రీకరిస్తె అంతకన్నా సాధించేదేదీ వుండదు. (అలా చేయడం వల్ల) మనం వ్యాధిని నివారిస్తున్నామే గాని అంతం చేయటం లేదు. నిరంతరం ప్రజలతో మమేకం కావాలి -ఓట్లకొసం కాదు. వాళ్ళ సమస్యలమీద పోరాడుతూ వర్గ చైతన్యం తీసుకవచ్చే ప్రయత్నం చేయాలి. మార్క్స్ అన్నట్టు న్యాయమైన పనికి న్యాయమైన జీతం అనే మితవాద (నినాదం) స్ధానే జీతాల వ్యవస్ధ రద్దు అనే విప్లవకరమైన నినాదాన్ని తమ పతాకం పైన లిఖించుకొవాలి.

  అయితే ఇప్పుడు వున్న కమ్యూనిస్టు ముసుగు పార్టీలకు ఈ లక్షణాలు ఏమాత్రం లేవు. అవి ఎంతసేపటికీ తమ శక్తి యుక్తులను ఎన్నికలమీదే కేంద్రీకరించి బూర్జువాలు దొచే దానిలో వీళ్ళు భాగం పంచుకుంటున్నారు. అంతకుమించి వారికి మరొక లక్ష్యమంటూ లేదు.

  ఇక మావోయిస్టులు. అసలు మావొయిజమే అనేక తప్పుల తడక (అని నా ఉద్దేశ్యం). వీళ్ళు వ్యక్తిగత పనులు నెరవేర్చుకుంటున్నారనీ, కోట్లు సంపాదించారనీ అనేక ఆరోపణలు వున్నాయి. అవి ఎంతవరకు నిజమో నాకూ తెలియదు. బూర్జువా మీడియా విష ప్రచారం చేస్తున్నారా? లేక నిజముందా తెలియదు. వాళ్ళు కుడా ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేయాలి. లేకపొతె ఏకాకులుగా మిగిలిపొతారు.

  (ఈ వ్యాఖ్యలో బ్రాకెట్లలో ఉన్నవి నేను చేర్చినవి. రామ్మోహన్ గారు అన్యధా భావించరని భావిస్తూ, స్పష్టత కోసం చేర్చాను. -విశేఖర్)

 4. రామ్మోహన్ గారూ, ఇప్పుడు మీ అభిప్రాయాల్లో నాకు కొంత స్పష్టత వచ్చింది.

  ఒక ప్రశ్న. ‘మావోయిజం తప్పుల తడక’ అని అనడంలో మీ ఉద్దేశ్యం ఏమిటి?

  ‘మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచనా విధానం (ధాట్)’ అన్న సిద్ధాంతంలో ‘మావో ధాట్’ ని ‘మావోయిజం’ గా మార్చడం సరికాదనా మీ ఉద్దేశ్యం? లేక అసలు మావో ఆలోచనా విధానమే సరికాదనా?

  మావో ఆలోచనా విధానమే సరికాదని మీరు చెప్పదలిస్తే ఎందుకని అలా భావిస్తున్నారో చెప్పగలరా?

  ఒకవేళ మావో చెప్పిన ‘నూతన ప్రజాస్వామిక విప్లవం’ కాకుండా ‘సోషలిస్టు విప్లవం’ ఇండియాకి సరయినదని మీరు భావిస్తున్నారా?

 5. అది బూర్జువా మీడియా చేస్తున్న విష ప్రచారమే కానీ మావోయిస్ట్‌లు నిజంగా కోట్లు సంపాదించడం లేదు. జార్ఖండ్‌లో ICICIకి చెందిన డబ్బులు కొన్ని సార్లు కొల్లగొట్టారు కానీ ICICIకి పెద్ద నష్టమేమీ రాలేదు. మావోయిస్ట్‌లని నైతికంగా దెబ్బతీసే టెక్నిక్‌లు పాలక వర్గంవాళ్ళు గతంలో కూడా పాటించారు. ఈ లింక్ చదవండి: http://stalin-mao.net.in/1970-42890 ఆరో భాగం త్వరలో వ్రాస్తాను.

 6. రామ్మోహన్, ప్రవీణ్

  నాకు తెలిసి మీడియా కూడా విష ప్రచారం చేయలేదనుకుంటా. అవన్నీ పోలీసులు చేసిన ఆరోపణలే తప్ప మీడీయా ఆ ఆరోపణలని సమర్ధిస్తున్నట్లుగా గానీ, విశ్వసిస్తున్నట్లుగా గానీ ఎప్పుడూ రాసినట్లు నేను చదవలేదు. ఇంకా చెప్పాలంటే మావోయిస్టు నాయకులను చంపినప్పుడు వారి వద్ద నుండి పెద్ద మొత్తంలో డబ్బు స్వాధీనం చేసుకుని కూడా దాన్ని ప్రభుత్వానికి ఇవ్వకుండా నొక్కేశారని కూడా మీడియా అనుమానాలు వ్యక్తం చేసింది.

  దానర్ధం మీడియా మావోయిస్టులని సమర్ధిస్తున్నదని కూడా కాదు. మావోయిస్టులపైన అలాంటి ఆరోపణలు చేయదగ్గ ఆధారాలు మీడియాకి ఏమీ లభ్యం కాలేదు. వారి జీవితం అంతా అండర్ గ్రౌండ్ లోనే కొనసాగుతున్నపుడు కోట్లు వెనకేసుకుని వారు చేసేదేమీ లేదు కదా. ఈ అవగాహన వల్లనే మావోయిస్టులపైన ఆర్ధిక కోణంలో ప్రతికూల ప్రచారం చేయడానికి మీడియా సిద్ధపడడం లేదని నాకనిపిస్తుంది.

  ఏమయినా ‘ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేయాలి’ అన్న రామ్మోహన్ గారి సూచన సకారణమని తోస్తోంది. అయితే వారు గిరిజనుల తోటే ఉన్నారు గనక ప్రజలకి దగ్గరకాకుండా ఎలా ఉన్నారన్న ప్రశ్నలు కూడా ఉన్నాయి. వారి చర్యలలో ప్రజల భాగస్వామ్యం లేకపోవడమే పెద్ద లోపం. ప్రజల తరపున తామే హత్యలు లాంటివి చేసి ప్రజా కోర్టు నిర్ణయించిందని చెప్పడం ‘రిటారికల్’ అనిపిస్తుంది.

  ప్రవీణ్, మీ ఆర్టికల్ చదివాను. వర్గ శతృ నిర్మూలన కరెక్టే అన్నట్లుంది మీ ధోరణి. కాని విప్లవ పార్టీల అనుభవం దానికి విరుద్ధంగా ఉంది కదా. మావోయిస్టులు చెప్పుకున్నంతగా ప్రజల మద్దతు లేదేమో అని లాల్ ఘర్ ఉద్యమం చూపుతోంది. మావోయిస్టుల ప్రవేశించనంతవరకూ లాల్ ఘర్ ఉద్యమం పతాక స్ధాయిలో కొనసాగింది. ఆ ఉద్యమంలో ప్రజల పాత్రం అత్యంత అమోఘంగా కొనసాగింది. కానీ మావోయిస్టుల ప్రవేశంతోనే నిర్భంధం తీవ్రమై ప్రజల పాత్ర నామ మాత్రమయిందని నాకు అర్ధం అయింది.

 7. వర్గ శతృ సంహారం వల్ల కాదు, వైరుధ్యాలని పూర్తి స్థాయిలో అంచనా వెయ్యకపోవడం వల్ల ప్రతికూల ఫలితాలు వచ్చాయి. నేను రాబోయే భాగాలలో ఆ విషయాలు వ్రాస్తాను.

 8. విశెఖర్ గారు. మావొ ఇజమైనా, లెనిలిజమైనా మార్కిజం ద్వారా పుట్టినాటివె. అయితె మావొ అనుచరించిన విదానాలు మంచీ, చెడు రొడూ కలసిపొయినాయి. ప్రపంచలొ యవరూ చెయించుకొని విధంగా తన వ్యెక్తి పూజ చేయించుకున్నాడు . మార్కిజం అద్యాయనం చేయనవసరం లేదని తనసుక్తులే సరిపొతాయని ప్రభొధించినాడు. అత్యధిక సందర్బాలలొ మావొ గ్రూపు మైనాటీలొ వుంది దాని వల్ల ప్రత్యర్ది గ్రూపు విధానాలను అనుచరిచవలసి వచ్చింది. ఆయన ఎన్నితప్పులు చేసినా తెలిసిగాని తెలియకగాని ,అంతిమంగా కార్మిక వర్గ పక్షాన్నె నిలిచాడు. మీకు వీలైతె “మావొ తర్వాత చైనా” అనే పుస్తకం రంగనాయకమ్మ గారు అనువాదం చేసినారు చదవండి.
  ప్రజాస్వమిక విప్లవం అంటె ప్రజలచేత ప్రభుత్వాన్ని ఎన్నుకొవడమనా? ప్రజాసమిక విప్లవమైనా సొషలిస్టు విప్లవమైనా కార్మిక వర్గ నియంత్రుత్వం తప్పనిసరీగా వుండాలి.
  మావొ ఉత్పత్తి సాదనాలు సమాజపరం చెస్తె చాలు అదే కమ్యునిజం అనుకున్నాడు పునాది మారిపొఇంది ఇకమార్చవలసింది ఉపరితలమే అంటూ సాంస్క్రుతిక విప్లవం మొదలు పెట్టినారు అప్పుడు గాని అర్దం కాలేదు ఇంకా పునాదే మారలేదని .అయితె సాంస్క్రుతిక విప్లవ కాలంలొ అర్బుతమైన మార్పులు జరిగినాయి.

 9. రామ్మోహన్ గారు, మీరు చెప్పిన పుస్తకం చదివాను. చార్లెస్ బెత్లెహామ్ రాసిన పుస్తకం అది. చైనాలో మావో ఉండగానే పెరుగుతూ పోయిన రివిజనిస్టు ప్రమాదం గురించి బెత్లెహాం పట్టించుకోలేదు. మావో కాలంలో జరిగిన తప్పుల్ని సాపేక్షికంగా చూడాలి తప్ప ప్యూరిటానిక్ గా చూడడం సరయింది కాదని నా అభిప్రాయం.

  సోషలిస్టు నిర్మాణం జరుగుతుండగానే ప్రతి అడుగులో రివిజనిస్టులు మావోకి అడ్డు పడ్డారు. అనేకసార్లు కేంద్ర కమిటీలో విప్లవ పంధా మైనారిటీలో ఉండిపోయింది. రివిజనిస్టు పంధాని ఓడించడానికి ఆయన కమ్యూనిస్టు పార్టీని కాకుండా ప్రజలపైన ఆధారపడవలసిన పరిస్ధితి ఏర్పడింది. దాన్నుండే ‘బాంబోర్డ్ ది హెడ్ క్వార్టర్స్’ అనే నినాదం ఇచ్చాడు. విప్లవ పంధాని కాపాడ్డానికి మావో ‘వ్యక్తి పూజ’ ని ఒక దగ్గరి మార్గంగా అనివార్య పరిస్ధితుల్లో ఎన్నుకోవలసి వచ్చిందన్నది నా అభిప్రాయం. అది ఆయన కావాలని తన కోసం చేసినది కాదు.

  సాంస్కృతిక విప్లవాన్ని కాపాడుకోవడానికి, డెంగ్ రివిజనిస్టులనుండి పార్టీని కాపాడుకోవడానికి మావోకి పార్టీలో సహకారం మృగ్యమయిన పరిస్ధితుల్లో, రష్యాలో కూడా రివిజనిజం విజయం సాధించిన పరిస్ధితిల్లో ఏకైక సోషలిస్టు రాజ్యాన్ని కాపాడుకోవడానికి మావో నుండి కొన్ని తప్పులు దొర్లాయి. వాటిని హైలైట్ చేసి మావోయిజం తప్పని చెప్పడం సరయింది కాదు. ఆచరణ రీత్యా, సోషలిస్టు నిర్మాణంలో జరిగిన తప్పుల్ని మావోయిజం లోపంగా చెప్పడం కరెక్టు కాదు.

  మావోయిజం అన్నా, మావో ధాట్ అన్నా ఇండియాకి సంబంధించి మనం చైనా విప్లవానికి ముందరి సిద్ధాంతాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. విప్లవం వచ్చాక అనుసరించిన పద్ధతులు ఇండియాకి లెక్కలోకి రావు. మనకి ‘మావోయిజం’ అంటే ప్రధానంగా చైనా విప్లవం కోసం మావో అనుసరించిన ఎత్తుగడలు, సిద్ధాంతమే.

  పెట్టుబడిదారీ దేశాల్లో జరిగి విప్లవాన్ని సోషలిస్టు విప్లవం అంటారు. పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి చెందకుండా భూస్వామ్య వ్యవస్ధ ఇంకా బలంగా ఉన్న చైనా (విప్లవానికి ముందు), ఇండియా లాంటి మూడో ప్రపంచ దేశాల్లో కార్మిక వర్గం నాయకత్వంలో జరిగే విప్లవాన్ని ‘నూతన ప్రజాస్వామిక విప్లవం’ అంటారు. ప్రజాస్వామిక విప్లవం అంటె భూస్వామ్య వ్యవస్ధను కూలదోయడానికి పెట్టుబడిదారుల నాయకత్వంలో జరిగే విప్లవం అని అర్ధం. ఇది కార్మికవర్గ నాయకత్వంలో జరిగేది కాదు. సామ్రాజ్యవాదం ప్రపంచాన్ని చుట్టుముట్టాక ‘ప్రజాస్వామిక’ విప్లవాలకి స్ధానం లేదు. ‘నూతన ప్రజాస్వామిక విప్లవాలే’ మూడో ప్రపంచ దేశాల విముక్తికి మార్గమని మావో సూత్రీకరించాడు. ఈ సూత్రీకరణని ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమం స్వీకరించింది.

 10. విశెఖర్ గారు. బెతల్ హొం , మావొ వుండగా రివిజినిజాన్ని గ్రహించలేదు నిజమే కాని తర్వాత గ్రహించాడు కద. మావొ వ్యెక్తి పూజని ఎదొ సాదా సీదాగా తీసుకొకుడదు. ప్రజలను విప్లవంలొకి ఆకర్షించడానికి చాలామార్గాలు వున్నాయి . దానికొసం ఒక తప్పుడు మార్గాన్ని అనుసరిచవలసిన అవసరం లేదు. తప్పుడు మార్గాలు ఎప్పుడూ తప్పుడు పలితాలే ఇస్తాయి. మరి వ్యెక్తి పూజని పెద్ద ఎత్తున చేయించుకున్న మావొ ప్రజా మద్దతులొ ఎందుకు విఫలమైనాడు? దీని ద్వారా ప్రజలకు ఎలాంటి సంకేతాలు వెళ్ళతాయొ ఆలొచించడా? అయితె మరి విప్లవ పొరాటాలు వదిలి ఇలాంటి వ్యెక్తి పుజలే మార్గమన్నమాట .ప్రజలను ఆకర్షించడానికి. మావొనే కాదు. స్టాలిన్ కుడా చేయించుకున్నాడు వ్యెక్తి పూజ. అక్కడ ఎలాంటి పలితాలు వచ్చాయొ చుశారు కద.
  దాన్ని అలా వుంచితే మార్కిజాన్ని అద్యాయనం అవసం లేదన్నాడు దాన్ని గురించి ఎమంటారు.

 11. రామ్మోహన్ గారు, మార్క్సిజం అధ్యయనం అవసరం లేదని మావో అన్నాడని మీరు ఎక్కడ చదివారు? బెత్లెహాం పుస్తకంలో నేనలా చదవలేదు.

  మావో వ్యక్తి పూజ విషయం నేను సమర్ధిస్తున్నట్లు భావిస్తున్నారా? నాకలాంటి అభిప్రాయం లేదు.

  ప్రజల్ని విప్లవంలోకి ఆకర్షించడానికి మావో వ్యక్తి పూజని మాత్రమే ఎన్నుకోలేదు. ‘సాంస్కృతిక విప్లవం’ మావో ప్రయత్నమే. కమ్యూనిస్టు పార్టీలోనే మెజారిటీ లేక దాన్ని ఆపవలసి వచ్చింది. మావోకి ప్రజా మద్దతు లేదని మీనుండే వింటున్నాను. బెత్లెహాం కూడా అలా రాయలేదు. ప్రజల మద్దతు అప్పుడే కాదు. ఇప్పటికీ ఆయనకి చైనాలో మద్దతు ఉంది. ప్రజల మద్దతు వివిధ స్ధాయిల్లో ఉంటుంది. మద్దతు ఇచ్చేవారంతా కమ్యూనిస్టు మెరికలు కాలేరు. పార్టీ నిర్మాణం, పని విధానం, నిర్మాణ సూత్రాలు అన్నింటికీ లోబడి ప్రజల మద్దతుని ఆర్గనైజ్ చేయడం ఉంటుంది. ఆ పార్టీ నిర్ణయాలకి మావో సైతం అతీతుడు కాదు.

  మరొక విషయం. బెత్లెహాం, రంగనాయకమ్మ గార్ల విమర్శలు అంతిమంగా తీసుకుంటే అది కరెక్టు కాదు. వాస్తవంగా అనేక సంక్లిష్ట భౌతిక పరిస్ధితుల మధ్య పని చేయడానికీ, బైట ఉంటూ ప్యూరిటానిక్ సైద్ధాంతిక దృక్పధంతో విమర్శలు చేయడానికి చాలా పెద్ద తేడా ఉంటుంది. ఆ తేడాని దృష్టిలో పెట్టుకుని మావో నుండి దొర్లిన తప్పుల్ని విశ్లేషించాల్సి ఉంటుంది. సిద్ధాంతం మార్గదర్శకత్వం మాత్రమే వహిస్తుంది. ఆచరణలో వచ్చే అనేక ఫలితాలని అది విశ్లేషించదు. కనుక సిద్ధాంతం రిఫరెన్సుగా తీసుకుని ఆచరణలో ఎదురయ్యే సంక్లిష్ట పరిస్ధితులకి పార్టీ నాయకత్వం ఇచ్చే ప్రతిస్పందనలని మక్కీకి మక్కీకి కొలవడం సరి కాదు. సామాజిక ఆచరణలకి సిద్ధాంతం రిఫరెన్సు మాత్రమే తప్ప కొలబద్ద కాదని మీరు గుర్తించాలి. దీనర్ధం సిద్ధాంతాన్ని తక్కువ చెయ్యడం కాదు.

  తప్పులని దొర్లకుండా చేయాలన్నదే మనం తీసుకోదగ్గ గుణపాఠం. తప్పులు చేశాడని మావోని విమర్శిస్తూ కూచుంటే మన సైద్ధాంతిక తృష్ట తృప్తి పడవచ్చేమో గానీ ఆచరణకి అదేమాత్రం సహాయపడదు. తప్పులని విమర్శించడం చాలా తేలిక. తప్పులు దొర్లకుండా ఆచరించడం కత్తిమీద సాము లాంటిది. వంద కోట్ల జనాభా ఉన్న దేశంలో ప్రపంచ వ్యాపితంగా పూర్తి ప్రతికూలత ఉన్న పరిస్ధితుల్లో తప్పులు జరగవని ఎలా ఆశిస్తారు? సోషలిస్టు ఆచరణకి సంబంధించి రష్యాలో గానీ, చైనాలో గాని జరిగింది ప్రయోగ సమానం. సైద్ధాంతిక అంచనాని లెనిన్, స్టాలిన్, మావోలు ఆచరించే ప్రయత్నం చేశారు. కమ్యూనిస్టు సిద్ధాంతం నిజమనీ, ఆచరణ సాధ్యమేననీ రుజువు చేశారు. ఆ ఆచరణలో ఎదురయిన పాఠాల్ని గ్రంధస్తం చేసుకుని అమలు చేయడమే ఇప్పుడు చేయాలి.

  మూడు దశాబ్దాలు అనేక కష్టాలకు ఓర్చితేనే చైనాలో విప్లవం సాధ్యం అయింది. విప్లవానికి ముందు ఎదురయిన ప్రతిఘటనకి ఏ మాత్రం తగ్గని ప్రతిఘటన విప్లవం తర్వాతా ఎదురయింది. అన్ని ప్రతిఘటనల మధ్య పార్టీ మద్దతు సమకూర్చుకుంటూ, దేశ పరిస్ధితులను బేరీజు వేసుకుంటూ, అంతర్జాతీయ రాజకీయలను ఎదుర్కొంటూ, సభ్యుల సైద్ధాంతిక స్ధాయిని అభివృద్ధి చేసుకుంటూ, ఆర్ధిక వర్గాల పొందికను అంచనా వేసుకుంటూ, సోషలిస్టు నిర్మాణ ఫలితాలను సైద్ధాంతికంగా అంచనా వేసుకుంటూ, సరైన పాఠాలను రూపొందించుకుంటూ… మావో దేశాన్ని ముందుకు నడిపించాడు. అలాంటి ఆచరణలో ఇప్పుడు తప్పులు వెతకడమా మనం చేయవలసింది? తప్పులని రికార్డు చేసుకుని మరోసరి దొర్లకుండా మాత్రమే మనం చేయవలసింది. అది కూడా భారత దేశంలో విప్లవం పూర్తయితేనే సుమా.

  మావో వ్యక్తి పూజని తన కోసం చేసుకున్నాడని ఎవరయినా చెబితే, అది రంగనాయకమ్మ గారయినా, బెత్లెహాం అయినా… నేనసలు అంగీకరించను. అలాంటివారికి అసలు విప్లవం కోసం ఒక పార్టీని నిర్మించి చూపమని అడగాలని నాకనిపిస్తుంది. దేశవ్యాపిత పార్టీ నిర్మించి చూపమని నేను గొంతెమ్మ కోరిక కోరను. ఒక గ్రామంలో, ఒక కాలనీలో, లేదా ఒక వీధిలో పార్టీని అసలు సిసలయిన వందశాతం సైద్ధాంతిక పరిగ్నానం కలిగిఉన్న కార్యకర్తలతో ఒక చిన్న పార్టీని నిర్మించి చూపమనీ నేను అలాంటివారిని కోరతాను. నిర్మించడం తర్వాత సంగతి అసలలాంటి ప్రయత్నం మొదలు పెట్టాలని నేను కోరతాను. అప్పుడు తెలుస్తుంది ఆచరణకీ సిద్ధాంతాలు వల్లించడానికి ఎంత తేడా ఉంటుందో.

 12. విశేఖర్ గారూ! >> విప్లవ పంధాని కాపాడ్డానికి మావో ‘వ్యక్తి పూజ’ ని ఒక దగ్గరి మార్గంగా అనివార్య పరిస్ధితుల్లో ఎన్నుకోవలసి వచ్చిందన్నది నా అభిప్రాయం. అది ఆయన కావాలని తన కోసం చేసినది కాదు. >>

  మీ వ్యాఖ్య అపార్థాలకు తావిచ్చేలా ఉంది. బూర్జువా రాజకీయ నాయకులు కూడా వ్యక్తి పూజ చేయించుకోడానికి ఎంతో కొంత జంకటం, సిగ్గుపడటం చేస్తారు. అలాంటిది మావో స్థాయి వ్యక్తి వ్యక్తి పూజను చీదరించుకోకపోగా దాన్ని ఘోరమైన తీరులో సకల మార్గాల్లో ప్రోత్సహించటం ఎంత సిగ్గు చేటు! అలాంటి వ్యక్తి పూజ / leader’s charisma వల్ల నిలిచేది విప్లవ పంథా అవుతుందా? అయినా అలాంటి తప్పుడు మార్గాలు విప్లవ పంథాను ఏమాత్రం కాపాడలేవని రుజువయింది కదా?

  అది మావో తన కోసం చేసినది కాదా? అలాంటపుడు అది ఒక పరిమితిలోనే సాగివుండేది. ‘దీర్ఘ శ్రుతితో, తీవ్ర ధ్వనితో’అంత ఘోరమైన వ్యక్తిపూజ సాధ్యమయ్యేదేనా? మావో వ్యక్తి పూజను విమర్శించటమంటే మావోయిజాన్ని మొత్తంగా తిరస్కరించటం అవ్వదు!

  రామ్మోహన్ గారు అడిగిన ప్రశ్న సంగతేమిటి? మార్క్సిజం అధ్యయనం అవసరమే లేదనటం ఏమిటి?

 13. రామ్మోహన్, వేణు

  నేను పైన రాసిన అంశాల్లో మావో వ్యక్తి పూజని స్వయంగా సమర్ధించుకున్నాడని నేను అంగీకరిస్తున్నట్లుగా అర్ధం వస్తోంది. వ్యక్తి పూజని దగ్గరి మార్గంగా మావో ఎంచుకున్నాడని నేను చెప్పింది పూర్తిగా నా అభిప్రాయం మాత్రమే.

  మావో అసలు వ్యక్తి పూజని సమర్ధించుకుంటే, అది తన కోసం చేసిందో మరొకందకు చేసిందో చర్చించుకోవచ్చు. అది లేకుండా నేను ఒక (అ) భావంగా చెప్పిన అంశం ఆధారంగా మావో ‘వ్యక్తి పూజ’ అంశంపై చర్చ జరగడం కరెక్టు కాదు గనక ఈ వివరణ ఇస్తున్నా.

  మావో వ్యక్తి పూజని సమర్ధించుకున్నట్లు మీ ఇద్దరి వద్దా ఏమన్నా ఆధారాలున్నాయా? ఉంటే చెప్పండి.

  వేణు గారూ, మీరు ఎత్తి చూపిన నా వాక్యాన్ని ఉపసంహరించుకుంటున్నాను. అది పూర్తిగా నా పైత్యం. దీని ద్వారా మావో పైన ఇలాంటి చర్చ జరగడం కరెక్టు కాదు.

  ‘ప్రజల్ని విప్లవంలోకి ఆకర్షించడానికి మావో వ్యక్తి పూజని మాత్రమే ఎన్నుకోలేదు’

  ఇది కూడా నా పైత్యమే. దీన్ని కూడా ఉపసంహరించుకుంటున్నా.

 14. చార్లెస్ బెతల్ హాం రాసిన China Since Mao పుస్తకాన్ని తెలుగులో ‘చైనాలో ఏం జరుగుతోంది?’గా రంగనాయకమ్మ గారు అనువదించారు. ఇందులో బెతల్ హామ్ వ్యక్తిపూజ విషయంలో మావోని తప్పు పట్టలేదు. అది విప్లవ పంథాకి నష్టం కలిగించిందని మాత్రం అన్నాడు.

  ఈ పుస్తకంలోని ఉటంకింపుల మూలంగా తెలిసే విషయాలు:

  ఎడ్గార్ స్నోకు మావో ఇచ్చిన ఇంటర్ వ్యూల్లో తన వ్యక్తి పూజకు సంబంధించి రెండు అభిప్రాయాలు వెల్లడించాడు. 1) Personality cult చాలా అవసరమని భావించామని 2) ప్రజలు సాంస్కృతికంగా వెనకబాటుతనంతో ఉండి ఈ వ్యక్తిపూజను పెద్దఎత్తున చేశారని.

  ‘మా దగ్గిర (చైనాలో) వ్యక్తి ఆరాధన ఉంది కానీ అది చాలదు, ఇంకా కావాలి..’
  ‘…ఎప్పుడూ కూడా వర్షిప్ చేయించుకోవాలనే కోరికా ఉంటుంది. చెయ్యాలనే కోరికా ఉంటుంది..’
  The long Revolution by Snow E. Newyork: Random House publication,1972

  ‘మార్క్సిజం అధ్యయనం’ అవసరం లేదని మావో నేరుగా ఎక్కడా చెప్పలేదు.

  అయితే మావో వ్యక్తిపూజ రూపకర్త లిన్ పియావో అలా మాట్లాడాడు- ‘చైర్మన్ మావో – మార్క్స్ , ఎంగెల్స్, లెనిన్, స్టాలిన్ ల కంటే ఉన్నతస్థాయిలో నిలబడతాడు. … కాపిటల్ పెట్టుబడిదారీ సమాజాల నియమాల్నీ, సమస్యల్నీ మాత్రమే ముందుకు తెస్తుంది. మనదేశంలో (చైనాలో) మనం ఇప్పటికే పెట్టుబడిదారీ విధానాల్ని కూల్చివేశాం. మనం ఇప్పుడు సోషలిస్టు సమాజపు నియమాల్నీ, సమస్యల్నీ ముందుకు తెస్తున్నాం. సామ్రాజ్యవాదాన్నీ, ఆధునిక రివిజనిజాన్నీ, వివిధ దేశాల అభివృద్ధి నిరోధకుల్నీ నిరోధించడానికి మనం మావో ఆలోచనావిధానం మీద ఆధారపడితీరాలి..’
  Speeches and instructions of Lin Piao, 1966- 67.

 15. విశేఖర్ గారూ, ప్రధాన కథనానికి భిన్నమయిన వ్యాఖ్యానాలు మీ బ్లాగులో తరచుగా కనబడుతున్నాయి. ఇది అనివార్యం. కాని ఇక్కడ ఇది వేదిక కాదనుకుంటాను. ఒక ప్రత్యేక కథనంలో ఇదే చర్చ కొనసాగించి ఉంటే అర్థవంతంగా ఉండేది.

  “ఒక గ్రామంలో, ఒక కాలనీలో, లేదా ఒక వీధిలో పార్టీని అసలు సిసలయిన వందశాతం సైద్ధాంతిక పరిగ్నానం కలిగిఉన్న కార్యకర్తలతో ఒక చిన్న పార్టీని నిర్మించి చూపమనీ నేను అలాంటివారిని కోరతాను. నిర్మించడం తర్వాత సంగతి అసలలాంటి ప్రయత్నం మొదలు పెట్టాలని నేను కోరతాను. అప్పుడు తెలుస్తుంది ఆచరణకీ సిద్ధాంతాలు వల్లించడానికి ఎంత తేడా ఉంటుందో.”

  ఇంత పరిశుద్ధమైన, పరిపూర్ణమైన, పరమ పవిత్రమైన పార్టీని నిర్మించటం మరో పది వేల ఏళ్ల తర్వాత కూడా సాధ్యం కాదనుకుంటాను. రష్యాలో, చైనాలో, వియత్నాంలో, క్యూబాలో, భారతదేశంలో కూడా మట్టిముద్దలనుంచే, అత్యంత వెనుకబాటుతనం నుంచే, ఘోరమైన సామాజిక పరిస్థితులనుంచే కమ్యూనిస్టు పార్టీలు పుట్టాయి. అదే బలహీనతల పునాదితోటే అధికారం సాధించిన దేశాల పార్టీలు కూడా దెబ్బతినిపోయాయి.

  వ్యక్తిపూజకు మూలం ఈ పరిస్థితుల్లో పాతుకుని ఉండగా, దాన్ని వ్యక్తులకు – మహానేతలే కావచ్చు- ఆపాదించి అదేదో సినిమాలో అన్నట్లుగా, మొత్తం మీరే చేశారు అన్నట్లుగా సూత్రీకరిస్తే ఎవరికీ ప్రయోజనం కలగదనుకుంటాను. స్టాలిన్ కాలంలో వ్యక్తిపూజ, మావోకాలంలో వ్యక్తిపూజ లేకుంటే అక్కడి సోషలిస్టు సమాజాలు కుప్పకూలకుండా ఉండేవని ఎవరయినా గ్యారంటీ ఇవ్వగలరా? అలా అని రెండో ప్రపంచ యుద్ధానంతరం స్టాలిన్, 1950ల తర్వాత మావోల చుట్టూ అమలయిన వ్యక్తిపూజను మనం సమర్థించి కూడా ప్రయోజనం లేదు.

  వ్యక్తిపూజను చార్లెస్ బెతల్ హామ్, అన్నా లూయీ స్ట్రాంగ్ ల అవగాహనకు, రంగనాయకమ్మగారు, తదితరులు అర్థం చేసుకుంటున్న దానికి చాలా తేడా ఉంటోంది. లిన్ పియావోలు, మావో పంధా అనుకూలురు సాగించిన మావో వ్యక్తి పూజకు, ఆసియా దేశాల్లో విశేష ప్రభావం చూపిన నేతల పట్ల సామాన్య ప్రజలు చూపిన, చూపుతున్న వీరారాధనకు మధ్య తేడాను తప్పకుండా వేరుగానే చూడాలి.

  జీవిత పర్యంతమూ కూడా ఒక నిర్మాణంలోనూ పట్టుమని పదిరోజులు ఇమడలేని వారు, పదిమందితో కలిసి పనిచేయలేకపోయిన వారు వ్యక్తిపూజల గురించి వ్యంగ్యాస్త్రాలు గుప్పిస్తుండటమే పరమ హాస్యాస్పదమైన విషయం. జీవితమంతా శల్యసారథ్యమే వహిస్తూ పోతే ఎవరికయినా మిగిలేదేమీ ఉండదు.

  ఇది వేదిక కాదంటూనే ఇక్కడ వ్యాఖ్యానిస్తున్నాను.

 16. రాజు గారూ, నిజమే. ఇలాంటి చర్చ ఇంకో మంచి సందర్భంలో జరిగుంటే బాగుంటుంది. ‘మావోయిజం’ గురించి రాంమోహన్ గారికి నేను వేసిన ప్రశ్న ఈ చర్చకు దారి తీసింది.

  వేణు గారు, అనేక విఛ్ఛిన్నకర శక్తులు కాచుకుని కూర్చున్న పరిస్ధితుల్లో సోషలిస్టు నిర్మాణాన్ని కాపాడుకోవడానికి, ప్రజల ఐక్యతని కాపాడడానికి వ్యక్తి పూజని ఒక ‘వే’ గా మావో భావించినట్లు తన అభిప్రాయంగా బెతెల్ హామ్ రాశాడు. బెతిల్ హాం రాసిన ఈ నాలుగైదు పదాలతో మావో వ్యక్తిపూజని సమర్ధించినట్లు అర్ధం వస్తుంది. అదే సమయంలో ఆయనా రాసిన కొన్ని పదాల్లో మావో ఎదుర్కొన్న అనేకానేక ప్రతికూల పరిస్ధితుల గురించి వీసమెత్తు సమాచారం కూడా మనకు కనపడదు.

  బెత్లెహాం రాసిన నాలుగు పదాలనీ, స్నో రాసిన మరో నాలుగు పదాల్నీ పట్టుకుని రంగనాయకమ్మ గారు మావో ‘వ్యక్తి పూజమైన’ నాలుగైదు పేజీల విమర్శలు గుప్పించారు. లిన్ పియావో చెప్పిన నాలుగు గ్రేట్స్ నీ ఫ్యూడల్ కాలంలో రాజుల్ని పొగిడే ‘రాజాధి రాజ’ లాంటి పొగడ్తల్నీ పోల్చి రెంటికీ తేడా ఉందా అని ప్రశ్నించారామే.

  తేడా ఖచ్చితంగా ఉందని నా అభిప్రాయం. తమ ఫ్యూడల్ దోపిడి కొనసాగించడానికి వీలుగా రాజుని దైవాంశ సంభూతుడిగా ఎస్టాబ్లిష్ చేసిన పరిస్ధితికీ, ఇంటి దొంగలతో సహా అనేకానేక ప్రతికూల పరిస్ధితుల మధ్య ఏకైక సోషలిస్టు రాజ్యాన్ని కాపాడుకోవడానికి లిన్ పియావో లాంటి వారు చేసిన దానికీ తేడా లేదా? ఈ తేడాని గుర్తించకపోతే అసలు మావో ని విమర్శించడానికి అర్హత ఎక్కడి నుండి వస్తుంది?

  భారత దేశంలో విప్లవ పార్టీ నిర్మాణానికి సరైన కృషి ఇంకా సరిగ్గా ప్రారంభమే కాలేదు. మొదటి అడుగు పూర్తి కాకుండానే దాదాపు శతాబ్దం గడిచిపోయింది. ఈ పరిస్ధితుల్లో చైనాలో విప్లవానంతరం చోటు చేసుకున్న ఒక పరిస్ధితిపైన తీవ్రమైన విమర్శ, అదేదో అర్జెంట్ కర్తవ్యంలా, చేయడం, అది కూడా తీవ్ర వ్యంగ్యోక్తులతో, మావో పట్ల ఉన్న గౌరవాన్ని కించపరిచేలా సాగడం అస్సలు కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఆవిడ చేసిన ‘disproportianate’ విమర్శ వల్ల రామ్మోహన్ గారి లాంటివారు అసలు ‘మావోయిజమే తప్పుల తడక’ అని భావించే స్ధితిలో ఉన్నారు. రంగనాయకమ్మ గారు చేసిన అసందర్భ , అసంగత విమర్శ ఇదిగో ఇలాంటి పరిస్ధితికి దారి తీస్తే, భారత దేశం లాంటి దేశాలకి అత్యంత అవసరమైన మావో ధాట్ పైనే రామ్మోహన్ గారి లాంటి వారు గురి కుదుర్చుకోలేని పరిస్ధితికి దారి తీస్తే, అది వాంఛనీయమా? కానే కాదు.

  పండిత చర్చలకేముంది, ఎన్నైనా చేసుకోవచ్చు. విప్లవ పార్టీ నిర్మాణానికి, విప్లవోద్యమం నిర్మాణానికీ వీసమెత్తు కూడా సాయపడని పండిత చర్చలు శుద్ధ దండగ.

  ఆచరణ లేని సిద్ధాంతం వ్యర్ధం అని మావో అనేకసార్లు చెప్పాడు. దానర్ధం ‘అధ్యయనం’ అవసరం లేదనా? దానితో పాటు సిద్ధాంతం లేని ఆచరణ గుడ్డిది అని కూడా చెప్పాడు మావో. కాని అది మరో సందర్భంలో ఉండవచ్చు. రెండింటినీ ఏక కాలంలో బేరీజు వేసుకుంటేనే మావో చెప్పినదేంటో అర్ధం అవుతుంది. అలా కాక సందర్భరహితంగా ఎత్తి చూపి విమర్శ చేస్తే దానివల్ల ప్రయోజనం శూన్యం. మార్క్స్, ఏంగెల్స్ లెనిన్, స్టాలిన్, మావో లు తమ జీవిత కాలాల్లో అనేక సూత్రీకరణలు చేశారు. అవన్నీ సందర్భోచితమయినవే. అటువంటి సందర్భాల నుండి విడదీసి చూస్తే పేజీలకు పేజీలు విమర్శలు రాసుకోవచ్చు.

  చైనా విప్లవానికి మావో చేసిన కంట్రిబ్యూషన్ పరిగణించినపుడు నాలుగు గ్రేట్స్ కంటే గొప్ప పదాలకే మావో అర్హుడవుతాడని రంగనాయకమ్మ కూడా తమ విమర్శ ప్రారంభంలో అన్నారు. కాని ఆ అంశాన్ని ఆమే వివరించలేదు. మావో కృషి ఇప్పటికే గ్రంధస్తమై ఉంది కనుక వివరించనవసరమ్ లేదని ఆమే భావించి ఉండవచ్చు. కాని ఆ వ్యాసం చదివినవారికి మావో పైన విమర్శ మాత్రమే, అది కూడా అసంగతమైన వ్యంగ్యోక్తులతో’ కనిపిస్తుంది కానీ మావో సాగించిన కృషి, ఆయన ఎదుర్కొన్న అనేక ప్రతికూల పరిస్ధితులు కనిపించవు. అలాంటప్పుడు వ్యాసం చదివినవారికి ఏం తడుతుంది? ఏం తడుతుందో రామ్మోహన్ గారి వ్యాఖ్యలు ఒక సూచిక.

  శ్రమకు, మేధకు ఉన్న వైరుధ్యం గురించి బెత్లెహాం పుస్తక అనువాదంలో రంగనాయకమ్మ చెప్పారు. ఆ వైరుధ్యం పరిష్కారం కోసం ‘సాంస్కృతిక విప్లవం’ లో చేసిన కృషిపైన వ్యాఖ్యానాలు చేశారు. మేధావులుగా చెప్పబడుతున్నవారి చేత శారీరక శ్రమ చేయించడానికి ఆయన చేసిన కృషి పైన అనేక విమర్శలు వచ్చాయి. సాంస్కృతిక విప్లవాన్ని ప్రశ్నించే సి.పి.ఎం లాంటి వారు చేసే విమర్శల్లో ప్రధానమైనది డాక్టర్ల చేత రోడ్లు ఊడ్పించాలా అన్నదే. రంగనాయకమ్మ గారు ఈ కృషిని పూర్తిగా సమర్ధించుకొచ్చారు. అలా చేయకపోతే శ్రామిక, మేధో వైరుధ్యం ఎలా పరిష్కారం అవుతుంది అని ఆమే ప్రశ్నించారు. ఈ విషయంలో ఆవిడ చక్కగా రాసారు.

  విప్లవ పార్టీ నిర్మాణంలో కూడా ఇలాంటి తేడా రాకుండా చూడవలసిన అవసరాన్ని ఆవిడ గుర్తించకపోవడమే విమర్శనార్హం. కొందరు పుస్తకాలు రాసుకుంటూ పోతే మరికొందరు శారీరక శ్రమ చేస్తూ పోవాలా? అలా చేస్తే ఆచరణ ద్వారా పొందే అనుభవాలు సైద్ధాంతీకరణ చేసే గొప్ప కృషి సాధ్యం అవుతుందా? కాకపోగా ఇలాంటి అవసరం లేని విమర్శలే పుట్టుకొస్తాయి. విప్లవ కృషికి ఏమాత్రం సాయపడని వ్యంగ్యోక్తులే పుట్టుకొస్తాయి.

  ఈ అంశాన్ని గుర్తించాలన్నది నా అభిప్రాయం.

 17. విశెఖర్ గారు. మార్కిజం ఒక మార్గదర్శిగా వుంటుంది పొరాటాలు ఎలావుండాలి ఎంచేయాలి అనేది ఆయా చారిత్రక పరిస్తితుల బట్టి నిర్నైంచుకొవాలి దానిని ప్రజలలొ ప్రవేశ పెట్టి ఆఒచ్చె ఫలితాలను పట్టి ప్రజలనుంచి నేర్చుకొవాలి మార్కిజాన్ని మక్కీకి మక్కీగా ప్రవేశ పెట్టలని నేనడం లేదు. ఆయా పరిస్తులను బట్టి ఎంచేయాలనేది అప్పుడు నిర్నైంచుకొవాలి
  ఏదైనా ఒక కొత్తదానిని ప్రవేశపెట్టెటప్పుడు తప్పులు జరగటం సహజం. తప్పులు జరగకుండా చేయాలని నేను గాని ,రంగనాయకమ్మ గారు గాని అనటం లేదు. తప్పులు జరిగినప్పుడు దాన్ని దాచిపెట్టుకొకుండా ఆత్మ విమర్శచేసుకొని భవిష్యత్తు తరాల వాళ్ళు ఆతప్పు జరగకుండా చుసుకుంటారు.
  తప్పులు జరగకుండా చేయాలి అనేది నా కామెంటు ద్వారా ద్వనించి వుంటె అది పూర్తిగా నాభాజ్యతే ఇందులొ రంగనాయకమ్మ గారికి ఎటువంటి సంభంధం లేదు. కాని నేను ఆఉద్దెశంతొ అది రాయలేదు.
  యవరైనా ఒక వ్యెక్తి నేను నాయకుణ్ణి కావాలని ఉద్దెశంతొ పొరాట చేయడు ప్రజల సమస్యల మీద పొరాడుతూ ఒకమెట్టు నుంచి ఒకదానిపైకి తీసుకపొటాడు. అందులొ నాయకుడు యవరౌతారనేది యాద్రుచ్చికం. ఒక విప్లవం విజయవంథమైందంటె అందులొ ఆఒక్క నాయకుడి పాత్రె వుందా? ఎన్నివేల మంది ప్రాణ త్యాగం చేసివుంటారు. ఎన్నిలక్షలమంది అంఖితమైవుంటారు. ప్రజలందురూ కలిస్తెనే ఎదైనా విజయవంతమౌతుంది వాళ్ళ అందరిపాత్ర విస్మరించి ఆఒక్క నాయకుడి ఆకాశానికి ఎత్తడం భావదారిద్యమే. అలా అని ఆనాయకుడిని ప్రత్యెకతను విస్మరించటం కాదు.
  నాయకుడైనత మాత్రన ఆనాయకుడు ఎది చెపితే దానికి తల వూపడం కాదు. నాయకుణ్ణి విమర్శించడమంటె అతని క్రుషిని తిరస్కరించటం కాదు.

 18. రామ్మోహన్ గారు, మీ ద్వారా రంగనాయకమ్మగారి విమర్శలని నేను చూడలేదు. నేను కూడా ఆమె అనువాదాన్ని, ఇతర వ్యాఖ్యలని చదివాను గనక పై విషయాలు రాసాను. ఇందులో మీ ప్రమేయం ఏమీ లేదు.

  ‘మావోయిజం తప్పుల తడక’ అన్న మీ అభిప్రాయం పై అడిగినపుడు మీరు ఆవిడ అనువాదం ప్రస్తావించారు. అందులో మావో పై చేసిన విమర్శలే మీ అభిప్రాయానికి కారణంగా నేను అర్ధం చేసుకున్నాను. అది కాదని మీరిపుడు చెబుతున్నారు. అయితే తప్పుల తడక అన్న అభిప్రాయం ఇంకేవిధంగానైనా మీకు కలిగిందా? అదేమన్నా చెప్పగలరా? మీరేమన్నా చెప్పగలిగితే అది నాకు అకడమిక్ గా ఉపయోగపడుతుంది.

  మీరు ప్రస్తావించిన అంశాలతో నేను ఏకీభవిస్తున్నా. అయితె విమర్శ చేసినా, పొగడ్త చేసినా ఒక ప్రయోజనం ఉండేలా చూడాల్సిన అవసరం ఉంది. మావో లాంటి నాయకులపైన విమర్శలని గ్రంధస్తం చేసేటపుడు అలాంటి ప్రయోజనం తప్పనిసరి అవసరం. లేదంటే ఉపయోగం కంటే నష్టం ఎక్కుగ జరుగుతుంది.

 19. విశెఖర్ గారు. రంగనాయకమ్మ గారు. అసలు ఎమీ తప్పులు చేయకుడదు.అనే పద్దతిలొ ఎమైనా చెపారా? చెపితె ఎక్కడ?
  ఒక వ్యెక్తిని విమర్శించడం ద్వారా సిద్దాంటానికి గాని లేక మరేరకంగా నస్టం కలిగిస్తుందని భావిస్తున్నారా?
  అక్కడ మావొపైన విమర్శ అలా కాకుండా ఇంకెలా చెసుంటె భాగుంటుందొ చెప్పగలరా?

 20. ఇంకో విషయం. మావో బతికి ఉన్నప్పుడు సాంస్కృతిక విప్లవం సమర్థవంతంగా అమలు జరిగిందని నా స్నేహితుడు టిమోతీ అన్నాడు. అతను బ్రిస్బేన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్. రాళ్ళూ, రప్పలని కూడా సమిష్టి యాజమాన్యంలోకి తీసుకురావడం సాధ్యమే అని అతని వాదన.

 21. ‘రంగనాయకమ్మ గారు. అసలు ఎమీ తప్పులు చేయకుడదు.అనే పద్దతిలొ ఎమైనా చెపారా?’

  ఆవిడ అలా చెప్పారని నేను భావించడం లేదు.

  ‘ఒక వ్యెక్తిని విమర్శించడం ద్వారా సిద్దాంటానికి గాని లేక మరేరకంగా నస్టం కలిగిస్తుందని భావిస్తున్నారా?’

  లేదు. విమర్శ-ఆత్మ విమర్శ కమ్యూనిస్టు ఉద్యమంలో అత్యంత ముఖ్యమైనవి. దీని గురించి మావో అనేకసార్లు నొక్కి చెప్పాడు. మావో ‘వ్యక్తి పూజ’ గురించి విశ్లేషించేటపుడు అప్పటి పరిస్ధితులను బేరీజు వేయాలన్నది నా ఉద్దేశ్యం. రెండు అంశాలని (వ్యక్తిపూజ, దేశంలోని పరిస్ధితులు) పాఠకుల ముందు ఉంచితే ఆ అంశాల్లో మరింత స్పష్టత రావడానికి అవకాశం ఉంటుంది. రంగనాయకమ్మ గారు మావో ధాట్ కి గట్టి మద్దతుదారు. వ్యవసాయక దేశాల్లో మావో ధాట్ ఇప్పటికీ ఆచరణీయం. మార్క్సిజం, లెనినిజం లకు మావో ధాట్ కొనసాగింపు మాత్రమే. అటువంటి అవగాహనకి భిన్నంగా మీరు ‘మావోయిజం తప్పుల తడక’ అంటున్నారు. అలాంటి అభిప్రాయం కలిగించేలా రంగనాయకమ్మ గారి విమర్శ దోహదం చేస్తే ఆ విమర్శలో సవరించుకోవలసిన అంశాలు ఉండవచ్చని నా అభిప్రాయం.

  స్పష్టత కోసం చెబుతున్నాను. రంగనాయకమ్మ గారు మార్క్సిజాన్ని ప్రభోదించే కొద్ది మంది మేధావుల్లో ఒకరు. ముఖ్యంగా ‘మార్క్సిస్టు అధ్యయనం’ రీత్యా తెలుగు ప్రజలకు ఆమె గొప్ప సాయం చేస్తున్నారు. కొన్ని ముఖ్యమైన గ్రంధాలను తెలుగులోకి తేవడం ద్వారా ఆమే చేసిన కృషి అనుపమానం. పెట్టుబడి గ్రంధాన్ని సులభ శైలిలో పరిచయం చేయడం ద్వారా చాలా పెద్ద కృషి చేశారు. అలాంటి మేధావులు ఆచరణలో ఉంటే మరింత మేలు కమ్యూనిస్టు ఉద్యమానికి చేకూరుతుంది. ఆచరణ నుండి గుణపాఠాలు తీయడంలో మరింత ఆచరణీయ మైన మార్గాన్ని భారత విప్లవోద్యమానికి రూపొందించడంలో అలాంటి వారి కృషి అవసరం. కాని ఆవిడ ఆచరణకి దూరంగా ఉండిపోయారు. విప్లవ కృషి లో ఉన్న వారు చేసే విమర్శలు మరింత వాస్తవికంగా, ఆచరణాత్మకంగా ఉండటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.

  ‘అక్కడ మావొపైన విమర్శ అలా కాకుండా ఇంకెలా చెసుంటె భాగుంటుందొ చెప్పగలరా?’

  ఈ ప్రశ్నకి సమాధానం సందర్భానుసారం చెబితే ఉపయోగంగా ఉంటుంది. కాని ఒక సంగతి చెప్పవచ్చు. ‘మార్క్సిజం-లెనినిజం-మావో ధాట్’ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేసిన ముఖ్యమైన వ్యక్తులపై చేసే విమర్శలు సిద్ధాంత పటిష్టతతో పాటు, విప్లవ ఆచరణకి ఉపయోగపడేలా విమర్శలు ఉంటే మరింత ఉపయోగం. అలా కాక ఆచరణ క్రమంలో, కొన్ని అనివార్య పరిస్ధితుల్లో దొర్లిన తప్పుల్ని భూతద్దంలో చూపితే లాభం కంటె నష్టం ఎక్కువ జరుగుతుంది. ఇంతకుముందు చెప్పినట్లు భారత దేశంలో ఉన్న పరిస్ధితుల రీత్యా, విప్లవ కృషి తప్పటడుగులతో సాగుతున్న రీత్యా, కేవలం సైద్ధాంతిక అభిమానులను మాత్రమే పోగేయడంతో మేధావుల కృషి పరిమితం అయితే సరిపోదు. మరింతమందిని విప్లవోద్యమంలోకి ఆకర్షించవలసిన కర్తవ్యం వారిపైన ప్రముఖంగా ఉంటుంది. ఆ బాధ్యతని రంగనాయకమ్మ గారు స్వీకరించలేదన్నది నా విమర్శ.

  ఒక స్ధాయి వరకూ రంగనాయకమ్మ గారి విమర్శలు ఉపయొగమే. మేధో చర్చల కోసం ఉపయోగపడవచ్చు. కాని ఆ చర్చలలో ఆచరణకి సంబంధించిన కాంపోనెంట్ లేకపొతే ఆ ఉపయోగం నల్లిఫై అయినట్లే.

 22. విశెఖర్ గారు. మావొఇజంతప్పులతడక అని నేను మావొ పూజను ద్రుస్టిలొ పెట్టుకుని అన్నాను. అక్కడ కేవలం మావొపైన విమర్శను మాత్రమే చదివితే మావొ పైన వ్యెతిరేక భావం ఏర్పడే అవకాశం వుంది. మొత్తం పుస్తకాన్ని చదివితే అలాంటి తప్పులు చేయకుడదనే పట్టుదల వస్తుంది. మావొ క్రుషికుడా తెలుస్తుంది.
  ఆ తప్పులను ఎత్తిచుపడం ద్వారా నస్టం కలుగుతుండంటున్నారు అది ఎవిధంగా నస్టం కలిగిస్తుందొ నాకు అర్దం కావడం లేదు. దానివలన విప్లవానికి ఎమైనా దూరమౌతాడా? ఉదాహరణకు కాసెపు మావొ పైన వ్యెతిరేక భావంతొ వుంటాడనుకుందాం, అతను వ్యెతిరేకంగా వుండేది మావొకు మాత్రమే సిద్దాంతానికి కాదు.
  ఆమె ఆచరణకి విరుద్దంగా ఎమి రాశారొ నేనెక్కడా చుడలేదు. అలాగే ఆమె క్రుషి కేవలం సైద్దాంతి అభిమానుల్లి పొగేశారనడ కుడా సరైనది కాదు. మీకెందుకు అలాంటి అభిప్రాయం కలిగిందొ తెలియదు. అనుభవం ద్వారా గుణపాఠాలు నేర్చుకుంటాం. అలాంటి తప్పులు మళ్ళీ జరగకుండా జాగ్రత్తపడతాము,
  పొతె ఈ విషయంలొ మన ఇద్దరి అభిప్రాయాలు భిన్నంగా వున్నాయి. ఈ చర్చ అనంతంగా సాగేటట్టు వుంది దీన్ని ఇంతటితొ ఆపేదాం.

 23. రామ్మోహన్ గారూ నేను చేస్తున్న చర్చ నెగిటివ్ గా ఏమన్నా ధ్వనిస్తోందా? ‘సైద్ధాంతిక అభిమానుల్ని’ పోగేయడం తప్పని నా ఉద్దేశ్యం కాదు. ఈ పదజాలం మిమ్మల్నేమన్నా బాధిస్తే వెనక్కి తీసుకుంటాను.

  ఇప్పటి పరిస్ధితుల్లో కమ్యూనిస్టు అభిమానుల్ని ఆచరణకి పురికొల్పితే మరింత ఉపయోగం అన్నదే నా చర్చలో ప్రధాన అంశం. అలాగే విమర్శ తో పాటు ఆత్మ విమర్శ అనివార్యంగా కలిసి ఉండాలన్నది కూడా నా అభిప్రాయం. ఆత్మ విమర్శ వివిధ ఆంశాల్ని సమతులిత దృక్పధంలో విశ్లేషించడానికి అవకాశం కల్పిస్తుంది.

  నేను చేసిన చర్చ ప్రధానంగా జనరల్ దృక్పధంతో చేసినది. మిమ్మల్నేమన్నా వ్యక్తిగతంగా బాధిస్తే క్షంతవ్యుడ్ని. మీరు కోరినట్లే చర్చను ముగిద్దాం.

  ఇంతకీ బ్లాగ్ మొదలు పెట్టాలన్న విషయం ఏం చేశారు? మళ్లీ మిమ్మల్నొకసారి గట్టిగా కోరుతున్నా.

 24. విశెఖర్ గారు. ఆలస్యానికి మన్నించాలి. నన్నేమీ బాదపెట్టలేదు మీరు. దానిగురించి మీరేమి బాదపడవద్దు. ఏదైనా సహజంగా తీసుకుందాం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s