‘నీరు, అడవి, భూమి’ ల యజమానులు ఎవరన్నదే మావోయిస్టు సమస్య -బి.డి.శర్మ


B D Sharmaగిరిజన ప్రాంతాల్లో “జల్, జంగిల్, జమీన్” యజమానులు ఎవరన్నదే మావోయిస్టులు, ప్రభుత్వం మధ్య ఉన్న ప్రధాన సమస్య అని మాజీ జిల్లా మేజిస్ట్రేట్ బి.డి.శర్మ అన్నారు. ఛత్తీస్ ఘర్ లో కిడ్నాపయిన కలెక్టర్ అలెక్స్ పాల్ మీనన్ విడుదల కోసం మధ్యవర్తిత్వం వహించి బి.డి.శర్మ సఫలం అయ్యారు. న్యూఢిల్లీలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ బి.డి.శర్మ ఖనిజ సంపదలున్న భూములకు యజమానులైన గిరిజనులపైన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వారి ప్రయోజనాలకు వ్యతిరేకమైన అభివృద్ధి నమూనాను బలవంతంగా రుద్దుతున్నాయని, సమస్యకు అదే మూల కారణమనీ వివరించారు.

“ఖనిజ సంపదలకు నిలయమైన భూములకు యజమానులయిన గిరిజనులకు చెందిన జల్, జంగిల్, జమీన్ లపై యజమాన్యం ఎవరిదన్న సమస్య మావోయిస్టులకు, ప్రభుత్వాలకు మధ్య ఘర్షణకు మూల కారణంగా ఉంది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలన్నీ బలవంతం గిరిజనులపై రుద్దుతున్న ‘అభివృద్ధి నమూనా’ సమస్యలు సృష్టిస్తోంది” అని బి.డి.శర్మ అన్నారు. ‘ఆపరేషన్ గ్రీన్ హంట్’ లో కుదిరిన తాత్కాలిక ‘కాల్పుల విరమణ’ శాంతికి దారి తీస్తుందన్న ఆశాభావాన్ని బి.డి.శర్మ వ్యక్తం చేశారు. తమ మధ్యవర్తిత్వం ఫలితంగా ఛత్తీస్ ఘర్, మావోయిస్టుల మధ్య కుదిరిన ‘అవగాహన’ ను ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్య చేశారు. ఈ ‘కాల్పుల విరమణ’ ఎంతకాలం ఉంటుందన్నది జ్యోతిష్యులే చెప్పగలరని ఆయన వ్యాఖ్యానించారు. ‘కాల్పుల విరమణ’ ఒప్పందం నిలిచేదేమీ కాదని ఆయన చెప్పకనే చెప్పారు.

బి.డి.శర్మ బస్తర్ జిల్లా మేజిస్ట్రేట్ గా పని చేసి రిటైరయ్యారు. గిరిజన ప్రాంతాల్లో నెలకొని ఉన్న పరిస్ధితులను ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. గిరిజనుల హక్కులను కాపాడడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆయన ఎత్తి చూపాడు. “మావోయిస్టుల ఉనికి వల్ల తమ జీవితాల్లో వచ్చిన తేడా గురించి బస్తర్ లో ఒక గిరిజనుడిని ప్రశ్నించాను. ‘పట్వారీ’, ‘దరోగా’ లు తమనిప్పుడీ పీడించడం లేదని అతను బదులిచ్చాడు” అని బి.డి.శర్మ తెలిపారు.

ప్రభుత్వాలు చేసిన గిరిజన చట్టాలలో ఉన్న స్వాభావిక వైరుధ్యాలను బి.డి.శర్మ వివరించారు. అడవులపైనా, అటవీ ఉత్పత్తులపైనా ఉన్న హక్కులు, భూములపైనా వనరులపైనా ప్రజలకి గల హక్కులు, వ్యాపారులు-కాంట్రాక్టర్లు-రాజకీయనాయకులు మధ్య గల అపవిత్ర బంధం… మొదలయిన మౌలిక సమస్యలను పరిష్కరించడానికి బదులుగా స్ధానిక ప్రజల అనుమతి లేకుండానే వారి ఖనిజ వనరులను కొల్లగొట్టుకుపోయేలా స్వదేశీ, విదేశీ ప్రవేటు కంపెనీలతో ప్రభుత్వాలు వందల కొద్ది ఎం.ఒ.యు (memorandum of understanding) లపై సంతకాలు చేశాయని బి.డి.శర్మ తెలిపారు.

“మన ప్రధాన మంత్రి గిరిజనులను పేదలుగా చెబుతాడు. చారిత్రకంగా, సహజంగా ఖనిజ సంపదలకు నిలయమయిన భూములకు సొంతదారులుగా ఉంటూ ఆ భూములను సాగు చేస్తూ వచ్చిన గిరిజనులను పేదలుగా ఎలా చెబుతారు?” అని బి.డి.శర్మ ప్రశ్నించారు. ప్రజా వ్యతిరేక చట్టాలతో భారత దేశ ఖనిజ వనరులకు స్వదేశీ, విదేశీ కంపెనీలను యజమానులుగా చేసినందునే భారత దేశ గడ్డపై పుట్టి, ఈ దేశానికి మూలవాసులయిన గిరిజనులను ప్రధాని పేదలుగా చెప్పడానికి వెనకాడడం లేదన్నది నిర్వివాదాంశం.

120 కోట్ల భారతీయులను అనేక వందల యేళ్లపాటు పోషించగల సహజ వనరులకు సొంతదారులుగా ఉన్న గిరిజనులు పేదవారుగా గుర్తించడం అంటే వారి నివాస స్ధలాలపైనా, వారు సాగు చేసుకునే భూములపైనా వారికి గల హక్కులను నిరాకరించడమే. “The sanctity of private property never applies to the poor” అన్న అరుంధతీ రాయ్ వ్యాఖ్య ఎంత సత్యమో ప్రధాని పలుకులే చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వమే స్వయంగా చేసిన, అనేక పరిమితులతో కూడిన ‘అటవీ హక్కుల చట్టం’ ని కూడా గుర్తించలేనంత బలహీనతలో ఉన్న ప్రధాని ఆ పదవిలో కొనసాగే అర్హత ఉన్నదా అన్నది కూడా సమస్యే.

పరిశ్రమల పైన ‘ప్రజల యజమాన్యం’ కి సంబంధించి 1996 లో భూరియా కమిటీ చేసిన సిఫారసు ఇంకా అమలుకు నోచుకోకపోవడం పట్ల బి.డి.శర్మ విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న ‘అభివృద్ధి నమూనా’ లో గిరిజనులకు ఎలాంటి భాగస్వామ్యమూ లేదని ఆయన వివరించారు. అభివృద్ధిలో గిరిజనులను భాగస్వాములు చేసే విధంగా ఒక ప్రత్యేక జోన్ ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచించినప్పటికీ అదేమీ ఆచరణలో లేదని ఆయన ఎత్తి చూపారు.

1996 పంచాయితీ చట్టాన్ని [PESA – Panchayat (Extension to Schedule Areas) Act, 1996] బహిరంగంగానే ఉల్లంఘిస్తున్నారని బి.డి.శర్మ తెలిపారు. “ప్రజల సాంప్రదాయాలను, ఆచార ధర్మాలను, వారి సాంస్కృతిక అస్తిత్వాన్ని, కమ్యూనిటీ వనరులను, వివాద పరిష్కారాల కోసం వారు అనుసరించే స్వంత పద్ధతులనూ పరిరక్షించుకుంటూ, భద్రం చేసుకునే యోగ్యతా సామర్ధ్యాలు ప్రతి గ్రామ సభకు ఉంద” అని పంచాయితీ చట్టం గుర్తించిందనీ ఈ చట్టాన్ని గౌరవించేవారే లేరని బి.డి.శర్మ అన్నారు.

భారత దేశంలో ప్రజల ప్రయోజనాలను ప్రభుత్వాలు ఉల్లంఘిస్తున్న ముఖ్యమైన అంశాన్ని బి.డి.శర్మ వ్యాఖ్యలు విప్పి చూపుతున్నాయి. మావోయిస్టులు అనగానే ప్రభుత్వాధికారుల కిడ్నాప్ లు, భూస్వాముల హత్యలు, తుపాకులు ఇవి మాత్రమే చూసేవారు వారు లేవనెత్తుతున్న మౌలిక సమస్యలను పట్టించుకోవడం లేదు. లేదా చూసీ చూడనట్లు నటిస్తున్నారు. ‘ప్రవేటు ఆస్తి’ యజమాన్యాన్ని పరమ పవిత్రమైనదిగా గుర్తిస్తూ కూడా తరతరాలుగా గిరిజనులు సాగు చేసుకుంటూ వస్తున్న భూములపైన వారికి గల ‘ప్రవేటు ఆస్తి హక్కు’ ను గుర్తుంచడానికి నిరాకరిస్తున్నారు. దేశ ప్రయోజనాల కోసం ఖనిజ వనరులు కావాలని ఓ పక్క చెబుతూ ఆ వనరులను విదేశీ, స్వదేశీ కంపెనీల ప్రవేటు యాజమాన్యానికి తరలిస్తున్నారు. ప్రవేటు కంపెనీలు దేశ ప్రయోజనాల కోసం వనరులను వినియోగించకుండా తవ్వి తీసి విదేశాలకు తరలిస్తున్నా కమిషన్లు భోంచేసి మిన్నకుంటున్నారు. ప్రభుత్వాలు చేసిన చట్టాలను అమలు చేయాలని కోరుతున్నప్పటికీ, అలా కొరడమే దేశ ద్రోహం గా ముద్ర వేస్తున్నారు.

బి.డి.శర్మ చెప్పినవి అత్యంత ప్రాధమిక అంశాలు. ఈ దేశ గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరినీ దేశ వనరులనుండి లబ్ది పొందే హక్కు ఉంది. కానీ ఆచరణలో ఆ హక్కు ప్రజలకు దక్కడం లేదు. ప్రభుత్వాలు చేసిన నూతన ఆర్ధిక విధానాల చట్టాలు దేశ వనరులకు ప్రవేటు కంపెనీలను యజమానులుగా మార్చి వేశాయి. ఫలితంగా దేశం లోని నీరు, భూమి, ఖనిజ వనరులు దేశ ప్రజల జీవితాలను అభివృద్ధి చేసే సాధనాలుగా కాక  ప్రవేటు కంపెనీలకు లాభాలు ఆర్జించి పెట్టే సాధానాలుగా మారిపోయాయి. ప్రవేటు కంపెనీల లాభాలు అంబానీ, టాటా ల్లాంటి బిలియనీర్లను ఓ వైపూ, కూటికి గతిలేని కోట్లాది పేదలను మరోవైపూ సృష్టిస్తున్నాయి. బిలియన్ల లాభాలను అనంతంగా పెంచేందుకు ఉపయోగపడే శ్రమ జీవులుగా మాత్రమే కోట్లాది ప్రజానీకం మారిపోయారు. ఇలాంటి దుర్మార్గమైన పరివర్తనకు ప్రభుత్వాలు కావలి కుక్కలుగా మారిపోవడం భారత దేశ ప్రజానీకం స్వయంగా పరిష్కరించుకోవలసిన ముఖ్యమయిన సమస్య.

26 thoughts on “‘నీరు, అడవి, భూమి’ ల యజమానులు ఎవరన్నదే మావోయిస్టు సమస్య -బి.డి.శర్మ

 1. విశేఖర్ గారూ,
  ఈకథనంలోని ప్రతి అక్షరం సత్యభూయిష్టంగా ఉంది. రేపటి నుంచి బిడి శర్మ గారిని కూడా మావోయిస్టుగా ఆరోపించే ప్రబుద్ధులు బ్లాగ్‌లోకంలోనే పుట్టుకొస్తారు చూడండి.

  జీవితంలో ఒకరోజూ ప్రజల గురించి నిజాయితీగా ఆలోచించని వాళ్లు, కోట్లమంది గిరిజనులు తమ కాళ్లకింది భూములను పోగొట్టుకుంటూంటే ఇదేం అన్యాయమని కనీసం ప్రశ్నించలేనివారు.. లక్ష తప్పులు చేస్తున్నా, జీవిత సర్వస్వాన్ని ప్రజలకోసం ధారపోస్తున్నవారిని, పోరాడే వారిని దూషించడానికి, గేలి చేయడానికి మాత్రం అందరికంటే ముందువరుసలో ఉంటున్నారు.

  ‘ప్రవేటు ఆస్తి’ యజమాన్యాన్ని పరమ పవిత్రమైనదిగా గుర్తిస్తూ కూడా తరతరాలుగా గిరిజనులు సాగు చేసుకుంటూ వస్తున్న భూములపైన వారికి గల ‘ప్రవేటు ఆస్తి హక్కు’ ను గుర్తుంచడానికి నిరాకరిస్తున్నారు’

  మన బ్యాంకు బ్యాలెన్సులూ, జీతాల పెంపుదలలు, మహానగరాల దోపిడీ స్వర్గానుభూతులు పదిలంగా ఉంటే చాలు.. పేదల ఆస్తి హక్కుల గురించి మనకెందుకు..?

  బ్లాగ్ లోకం కూడా వర్గపరంగా చీలిపోయినట్లుంది. వర్గపోరాటం ఇక్కడ కూడా తనదైన రూపంలో జరుగుతున్నట్లు కనిపిస్త్తోంది. కళ్లముందు కనపడుతున్న దోపిడీని గుర్తించడానికి కూడా ముందుకు రాకుండా విద్వేషాన్ని, బూతుల పురాణాన్ని బ్లాగిజంలా అమలు చేస్తున్నవారు భావజాల రంగంలో కూడా వర్గపోరాటానికి తెర తీస్తున్నారు. వీరి ధోరణులను ఇలా అర్థం చేసుకుంటే తప్ప బ్లాగ్ ప్రపంచంలో విద్వేష ప్రచారంపై స్పష్టత ఏర్పడదనుకుంటాను.

  “The sanctity of private property never applies to the poor”
  ఎంత గొప్ప తాత్విక ప్రకటనో ఇది.

  ఈ సెలవు రోజు ఒక మంచి కథనం చదివాను. అభినందనలు..

 2. రాజు గారూ, ఈ బూతు గాళ్లని ‘వర్గ పోరాటం’ లో భాగం గా చూడడం శుద్ధ దండగమారి వ్యవహారం. వీళ్లకి వేరే పేర్లు ఉన్నాయి. లంపెన్, గూండా, వెధవ, యూజ్ లెస్ ఫెలో, ఆవారా ఇవి సరిపోతాయి వీళ్లకి.

  భావాల్ని అక్షరాల్లోకి కూర్చడం మొదలు పెట్టాక కొన్ని కనీస నియమాలు, మర్యాదలు పాటించాల్సి ఉంటుంది. ‘సరస్వతి’గా గౌరవించే కాగితం పైన పెన్ను పట్టి బూతులు రాయడం అంటే ఎంతగా అసహ్యించుకుంటాం! కీ బోర్డు పైన చేతులుంచి బూతులు టైప్ చేయడం కూడా అలాంటిదే. అలాంటి నికృష్టపు కార్యాల్ని అవలీలగా చేస్తున్న వీరు హిందూ సంస్కృతిని కాపాడతారంటే అది హిందూ మతానికి పట్టిన దౌర్భాగ్యం కాదా? ఇక ఆ మతాన్ని కృశింపజేయడానికి వేరే ఎవరైనా పని గట్టుకోవాలా? ఆ జ్ఞానం కూడా లేని వీరు వర్గ పోరాటం లో భాగం చెయ్యగల అర్హులు కానే కారు.

  లంపెన్ కి సమాధానం ఎలా చెబుతామో మీకు తెలియంది కాదు.

  మావోయిస్టుల సంగతి తర్వాత. బి.డి.శర్మ గారి పేరు ఉఛ్ఛరించడానికి కూడా వీరు అర్హులు కారు. బ్లాగులు దాటితే వీరిని ఎవరైనా పట్టించుకుంటారా? ఈ కూతలు బైట కూస్తే వారి భార్యలు, పిల్లలే ఖాండ్రించి ఉమ్మేస్తారు. అదే వారికి సరైన సమాధానం. కాని బ్లాగులు దాటే దమ్ము వీరికి ఉండదు. దాటితే ఉమ్మేస్తారని వీరికి బాగానే తెలుసు.

 3. విశేఖర్ గారూ,

  కేవలం మీ భావజాలాన్ని అంగీకరించని కారణంగా కొంత మందిని ఇలా దూశించడం విచిత్రంగా ఉంది. మీరన్నట్టు వర్గ పోరాటములో భాగ స్వామ్యానికి అర్హత లేకపోతే … ఆ అర్హత లేకపోవడాన్నే … ఈ వాస్తవ ప్రపంచములో బ్రతకడానికి ఒక అర్హతగా భావించే వారు చాలా మందే ఉన్నారు (మెజారిటీలు వారే) . కానీ దురదృష్టవ శాత్తూ మాకు భాగస్వామ్యాన్ని వద్దన్నా ఇవ్వడం జరుగుతోంది. పైన రాజశేఖర్ గారు చేసిన ప్రయత్నం అదే అనిపిస్తోంది. బ్లాగుల్లో కూడా వర్గపోరాటాలు చేయాల్సి వచ్చేలా ఉంది అని.

  సమర్ధించే వారంగా ఒక వర్గం, సమర్ధించరి వారంతా వారి వర్గ శాతృవులు. బయట మావోయిస్టులు చేసే పని ఇదే కదా. సిద్దాంత పరంగా ఎదుర్కోలేరు … అందుకే వారికి ఆయుధాలు అవసరం, బయపెట్టడానికి… వారు నమ్ముకున్నది సిద్దాంతాన్ని కాదు, ప్రజల్లో భయాన్ని. కాకపోతే అదృష్టమేమిటంటే … మావోయిస్టుల వద్ద ఉన్నవాటికన్నా శకివంతమైన ఆయుధాలు అనేకం పోలీసుల వద్ద ఉన్నాయి. మావోయిస్టులు సాయుధ పోరాటం కావాలనుకుంటే.. పోలీసులు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారు. అది చాలు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ప్రజలందరూ నిర్భయంగా అమలు పరచడానికి.

  ఇక ఈ పోస్టు మొత్తములో ఎక్కడా హిందూ మతం ప్రసక్తి లేదు, కేవలం అన్ని మతాలనూ గౌరవిస్తానని చెప్పిన మీ కామెంటులో తప్ప. ఈ అకారణ ద్వేశానికి కారణం..!?

 4. శ్రీకాంత్

  అయితే మారు పేర్లతో వచ్చి ఇన్నాళ్లూ బూతులు రాస్తున్నది మీరేనన్నమాట.

  బూతు గాళ్లని తిట్టినపుడల్లా వాళ్లని వెనకేసుకోస్తూ గతంలో కొన్ని సార్లు మీరు రాసినా పొరబడి ఉంటారని పట్టించుకోలేదు. లంపెన్, వెధవ లాంటి బూతుగాళ్లని పట్టించుకోవద్దని రాజు గారికి చెబుతుంటె, ఆయన బూతుగాళ్లకి వర్గపోరాటంలో భాగస్వామ్యం ఇస్తున్నారంటూ వచ్చాక కూడా మిమ్మల్ని గుర్తించకపోతే అది నా తప్పవుతుంది.

  ఓ పక్క హిందూ సంస్కృతి గురించి రాస్తూ తోటి బ్లాగర్లను ఈ విధంగా బూతులు తిట్టడానికి మీకెలా మనసొప్పింది? అది కూడా తల్లి దండ్రుల్నీ, అక్కా చెల్లెళ్లనీ ఉద్దేశిస్తూ అంత సంస్కార హీనంగా బూతులు ఎలా రాశారు?

  అడిగారు గనక చెబుతున్నా. రాజుగారు చెప్పిన ‘వర్గ పోరాటానికీ’ మీరంటున్న వర్గ పొరాటానికి పొంతనే లేదు. ‘వర్గ పోరాటం’ అంటే ఇంతకంటె అర్ధం చేసుకోలేకపోవడానికి మీకున్న పరిమితుల్ని నేను అర్ధం చేసుకోగల్ను.

  ఇక మావోయిస్టుల్ని సమర్ధించడం, వ్యతిరేకించడం నా పని కాదు. వాళ్లతో మీకేమన్నా అభ్యంతరం ఉంటే వాళ్లనే అడగడం సముచితం. మీ ఆయుధాల గొడవ నాకనవసరం.

  ‘అన్ని మతాల్ని గౌరవిస్తానని’ పైన నా కామెంటు లో ఉందా? ఎక్కడ? నాకేమీ కనపడలేదే? అలాంటి సమాధానం వేరే ఎక్కడో వేరే పేరుతో వచ్చిన వ్యక్తికి ఇచ్చినట్లు గుర్తు. అది కూడా మీరేనన్నమాట. ఇన్ని రకాల పేర్లతో ఇన్ని రకాల వేషాలు ఎందుకు వేస్తున్నారు?

  బూతుగాళ్లతో నాకు అనవసరం అని నేనెప్పుడో చెప్పాను. నా బ్లాగ్ లోకి వచ్చి అడ్డంగా రాస్తే ఏకి పారేస్తాను అని కూడా రాసాను. అలాగే చేశాను కూడా. ఇలా బూతుల్తో రావడం, ఏకి పారేయడం… ఇది కూడా వ్యర్ధమే. ఇక మీ వ్యాఖ్యల్ని ప్రచురించడం, స్పందించడం ఉండదు. మీ బూతు కార్యక్రమాన్ని మీ బ్లాగ్ లో నిర్విఘ్నంగా కొనసాగించుకోవచ్చు. నాకది అనవసరం. మళ్లీ ఇటేపు రాకండి.

 5. రాజశేఖర్ గారు చెప్పినది నిజం. అన్నా హజారే ఆర్థిక అసమానతల గురించి ఏమీ మాట్లాడలేదు కాబట్టే కదా గ్లోబలైజేషన్ అనుకూల వర్గానికి చెందిన బ్లాగర్లు అతనికి పూర్తిగా సపోర్ట్ ఇచ్చారు. ఒకవేళ అన్నా హజారే కూడా ఆర్థిక అసమానతల గురించి మాట్లాడి ఉంటే వినాయక్ సేన్ పై వచ్చిన తరహా విమర్శలే అతనిపై కూడా వచ్చేవి.

 6. చిదంబరం భార్య డైరెక్టర్‌గా ఉన్న వేదాంత కంపెనీవాళ్ళు ఒరిస్సాలోని లంజిగఢ్ ప్రాంతంలో వంశధార నదిని ఎలా కలుషితం చేస్తున్నారో వ్రాస్తే ఒక్క హిందూ మతోద్ధారకుడు కూడా సపోర్ట్ ఇవ్వడు. అమెరికా దగ్గర ఎన్ని అణుబాంబులు ఉన్నాయో వ్రాస్తే మాత్రం హిందూ మతోద్ధారకులు గుమ్మడికాయ దొంగల్లాగ భుజాలు తడుముకుంటారు. అమెరికాలో హిందువులు 5% ఉంటారో లేదో తెలియదు కానీ మన దేశంలోని సమస్యల గురించి ఎన్నడూ ఆలోచించనివాళ్ళు అమెరికాని విమర్శించినప్పుడు మాత్రం అగ్గి మీద గుగ్గిలం అయిపోతారు.

 7. ఇక్కడ మత ప్రస్తావన తెచ్చి విమర్శించడం పెద్ద జోక్. నిజ జీవితంలో మతం గురించి సీరియస్‌గా ఎవరు ఆలోచిస్తారు? కమ్యూనిజంని వ్యతిరేకించే వర్గానికి చెందినవాళ్ళు మతం కోసం pro-Maoist అయిన స్వామి అగ్నివేశ్‌ని ఆరాధించగలరా? మార్టిన్ హీడెగ్గర్ గొప్ప నాస్తికుడు కానీ అతను virulent anti-communist. కమ్యూనిజంని వ్యతిరేకించే వర్గంవాళ్ళు నాస్తికత్వం మీద ద్వేషంతో తమ వర్గానికి చెందిన మార్టిన్ హీడెగ్గర్‌ని ద్వేషించగలరా? ఎవరికైనా మతం కంటే భౌతిక ప్రయోజనాలే ముఖ్యం కదా. అలాంటప్పుడు ఫలానావాళ్ళు తమ మతం మీద పడి ఏడుస్తున్నారు అని అంటూ వాళ్ళు ఏడవడం ఎందుకు?

 8. “కేవలం మీ భావజాలాన్ని అంగీకరించని కారణంగా కొంత మందిని ఇలా దూషించడం విచిత్రంగా ఉంది. మీరన్నట్టు వర్గ పోరాటములో భాగ స్వామ్యానికి అర్హత లేకపోతే … ఆ అర్హత లేకపోవడాన్నే … ఈ వాస్తవ ప్రపంచములో బ్రతకడానికి ఒక అర్హతగా భావించే వారు చాలా మందే ఉన్నారు (మెజారిటీలు వారే) . కానీ దురదృష్టవ శాత్తూ మాకు భాగస్వామ్యాన్ని వద్దన్నా ఇవ్వడం జరుగుతోంది. పైన రాజశేఖర్ గారు చేసిన ప్రయత్నం అదే అనిపిస్తోంది. బ్లాగుల్లో కూడా వర్గపోరాటాలు చేయాల్సి వచ్చేలా ఉంది అని.”

  శ్రీకాంత్ గారూ, చాలా పొరపాటు పడ్డారు. భావజాలాన్ని అంగీకరించని కారణంగా కొంతమందిని దూషించడం కాదండీ. మీ ఆలోచనా తీరును నేను, నా ఆలోచనలను మీరూ అంగీకరించకపోయినా ఫరవాలేదు. ప్రతి అభిప్రాయాన్ని ప్రతి ఒక్కరూ అంగీకరించడం జరగని పని కూడా. కాని చర్చ పేరిట కాసింత బూతు, కాసింత వ్యంగ్యం, కాసింత హేళన క్రమం పదే పదే కొన్ని బ్లాగుల్లో రిపీట్ కావడం.. ఒక సిద్ధాంతాన్ని నమ్మినంతనే కూడబలుక్కున్నట్లుగా కామెంట్ల రూపంలో దాడుల వరదకు పాల్పడిపోవడం సంవత్సరాలుగా జరుగుతూ వస్తున్న తీరునే నేను ప్రశ్నిస్తున్నాను. అకడమిక్ చర్చను కూడా నీచ స్థాయికి తీసుకుపోకూడదన్న వేదన తప్ప ఆలోచనలను అంగీకరించని కారణంగా ఎవ్వరినీ ఇక్కడ దూషించలేదండీ.

  గతంలో కూడా మీరు ఇదే బ్లాగులో నా వ్యాఖ్యలకు ప్రతిగా మీ బ్లాగులోనే పెద్ద టపా రూపంలో ప్రచురించారు. తప్పేం లేదు. కాని మీ ఆ టపాలో చోటు చేసుకున్న అసహనం, గుడ్డి వ్యతిరేకత, దానికన్నా మిన్నగా మీ టపా కింద వ్యాఖ్యల రూపంలో వ్యక్తమయిన వ్యంగ్యం, హేళన, వెకసెక్కం వంటి ధోరణులు చూసిన తర్వాత మీ టపాకు జవాబివ్వడం కంటే మౌనం పాటించడం మేలని ఊరకుండిపోయాను.

  చర్చ స్థానంలో అపహాస్యం, వెటకారం, చైనా ద్వేషం, ఇంకో ద్వేషం.. ఇలాంటి ధోరణులకు భాష సరిగా వాడటం తెలియని పిల్లకాయలతో పాటు కొంతమంది వయోవృద్ధ మేధావులు కూడా వంతపాడటం… ఇటువంటివాటితో కొనసాగడమే గొప్ప అని మీరు భావిస్తున్నట్లయితే మీ ఒంటి స్తంభం మేడలో మీరు కాలం గడపండి. ఎవ్వరికీ పోయేదేమీ లేదు.

  ప్రత్యక్ష రంగంలో వర్గపోరాటం జరుగుతున్నట్లే భావజాల రంగంలో కూడా వర్గపోరాటం జరుగుతుందని, దాని ధోరణులు భావపరంగా కూడా ప్రతి సందర్భంలోనూ ప్రతిబింబిస్తాయనేది కొత్తగా చెపుతున్న మాట కాదు. కాని ఎక్కడా ఏ భాషలోనూ లేని విధంగా తెలుగు బ్లాగులలో భాషా పరమైన అత్యాచారం దీర్ఘకాలంగా కొనసాగుతోంది. దీనికే శేఖర్ గారు మరింత స్పష్టంగా లంపెన్, గూండా, వెధవ, యూజ్ లెస్ ఫెలో, అవారా వంటి లక్షణాలను ఆపాదించారు. నాకు తెలిసి ఇవేవీ బూతు పదాలు కాదని అనుకుంటున్నాను.

  వర్గపోరాటంలో మీకు భాగస్వామ్యం ఇచ్చేంత శక్తి నాకు లేదు లెండి. పైగా వర్గం, వర్గ శత్రువులు అనే భావనలకు అర్థం కూడా తెలీకుండా అలవోకగా వాటిని మీరు వాడేస్తున్నారు. పైగా “మావోయిస్టులు చేసే పని ఇదే కదా. సిద్ధాంతపరంగా ఎదుర్కోలేరు.. అందుకే వారికి ఆయుధాలు అవసరం..” అంటూ మీ ఇష్టానుసారం వ్యాఖ్యానించేస్తున్నారు మీరు. మీరూ, మీ మిత్రులూ, ఇంకా బూతులు రాయడమే గొప్ప అని భ్రమిస్తున్న దేశదేశాల వల్గర్ వ్యాఖ్యాతలు కూడా, మావోయిస్టులకు సిద్ధాంతం తెలీదన్నంత మాత్రాన వారికి పోయేదేమీ లేదు లెండి. పోనీ ఒక పనిచేయండి.. వారికి సిద్ధాంతం తెలియదు కదా. మీరే వారివద్దకు పోయి నేర్పకూడదా? ఈ దేశానికి కాస్తంతయినా మేలు జరుగుతుందేమో కదా..!

  ప్రధాన టపా సారాంశాన్ని మొత్తంగా పక్కన పెట్టేసిన మీరు ఆ టపా కింది వ్యాఖ్యను మాత్రం పట్టుకుని మళ్లీ వ్యంగ్యాన్నే ఆశ్రయించారు.

  “మావోయిస్టుల వద్ద ఉన్నవాటికన్నా శక్తివంతమైన ఆయుధాలు అనేకం పోలీసుల వద్ద ఉన్నాయి. సాయుధపోరాటం కావాలనుకుంటే పోలీసులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు”

  నిజమే.. సాయుధ పోరాటమేం ఖర్మ.. శక్తివంతమైన ఆ తుపాకులను కూడా మావోయిస్టు పార్టీకి అప్పగించడానికి కూడా వారు సిద్ధంగా ఉన్నారంటే బాగుంటుంది. ఆయుధాలకు ప్రధాన వనరు శత్రువే అని దశాబ్దాలుగా మావోయిస్టులు చెబుతూనే ఉన్నారు.

  ‘భావవ్యక్తీకరణ స్వేచ్ఛ’ అంటూ ఏదో గంభీరమైన పదం వాడినట్లున్నారు మీరు. దాన్ని వదిలేయండి. అందరికీ మంచి జరుగుతుంది.

  నాకు అర్థం కానిదొకటే.. బ్లాగుల్లో విద్వేష ప్రకటనలు, బూతు ప్రయోగాలు వాడుతున్నందుకు నిరసన తెలిపితే మీరు వకాల్తాగా రావడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మీరూ వారూ ఒకటేనా వేరు వేరా.. కనీసం దీన్నయినా నిజాయితీగా బయటపెట్టండి. చాలు.

  శ్రీకాంత్ గారూ, నా వ్యాఖ్యలో ఏ సందర్భంలో కూడా మిమ్మల్ని వ్యక్తిగతంగా బాధించే వ్యక్తీకరణను నేను చేయలేదనే అనుకుంటున్నాను. అలాంటి ధోరణి ఉందని మీరనుకుంటే తప్పనిసరిగా నా వ్యాఖ్యను పునఃపరిశీలించుకుంటాను.

  చివరగా, విశేఖర్ గారు మీలోనూ రెండు రకాల ధోరణులున్నాయని అభిప్రాయపడుతూ ఆయన బ్లాగులోకి మిమ్మల్ని రావద్దని అన్నారు. నేను ఒడ్డున ఉండి, అలా నిషేధించవద్దని సలహా చెప్పడానికి ఎంత సేపో పట్టదు. కాని దారుణమైన అనుభవాలు, బూతు ప్రయోగాలకు నెలల తరబడి గురై తను ఇలా నిర్ణయించుకుంటే సరి కాదని చెప్పడానికి నాకు హక్కు లేదనుకుంటున్నాను. కాని ఇంత జరిగిన తర్వాత కూడా గత కొద్దినెలల పరిచయ మాత్ర సాన్నిహిత్యంతో ఈ సలహా మాత్రం ఇవ్వదలుచుకున్నాను.

  విశేఖర్ గారు, మీ నిర్ణయాన్ని మరోసారి పునఃపరిశీలన చేసుకునే అవకాశం ఉందా..! మళ్లీ ఈ నిర్ణయంపై ఆలోచించగలరు. శ్రీకాంత్ గారే కాదు ఎంత బద్ధవ్యతిరేకి అయినా సరే, విద్వేషి అయినా సరే అసభ్యతకు తావీయకుండా చర్చలోకి వస్తే దయచేసి వారి రాకను అడ్డుకోకండి. ఇది సలహా మాత్రమే. పాటించడం, పాటించకపోవడం మీ ఇష్టం.

 9. ఇక్కడ హిందూ మతం పేరు చెప్పి మార్క్సిస్ట్‌లని విమర్శించడం అర్థం లేనిది. ఒకవేళ మార్క్సిస్ట్‌లు హిందూ మతాన్ని అంగీకరిస్తే అంబానీలు గానీ వేదాంత కంపెనీ డైరెక్టర్‌లు గానీ తమ ప్రైవేట్ ఆస్తులని వదులుకుని కమ్యూనిస్ట్ విప్లవానికి సహకరిస్తారా? కమ్యూనిజంని వ్యతిరేకించే వర్గంలో నాస్తికులు కూడా ఉంటారు. ఆ వర్గానికి చెందిన మత భక్తులు విప్లవానికి వ్యతిరేకంగా నాస్తికులతో సహకరించడానికి నిరాకరిస్తారా? మతం అనేది ఒక నమ్మకమే కానీ జీవిత సత్యం కాదు. శనివారం, సోమవారం తప్ప మిగితా రోజులు కక్కుర్తి పడి మాంసాహారం తినే మత భక్తులని చూశాను. మాంసం తినకపోయినా సిగరెట్లు, మద్యం తాగే మత భక్తులని కూడా చూశాను. మతం కోసం ఆహారపు అలవాట్లనే మార్చుకోలేనివాళ్ళు దాని కోసం సమాజం విషయంలో అభిప్రాయాలని మార్చుకుంటారా?

  హిందూ మతం విషయానికొస్తే ఈ మతం కుల వ్యవస్థనీ, కర్మవాదం(fatalism)నీ సమర్థిస్తోంది. ఒకవేళ హిందూ మతం కుల వ్యవస్థనీ, కర్మవాదాన్నీ వ్యతిరేకిస్తే అగ్రకులాలవాళ్ళలో ఎంత మంది ఈ మతాన్ని నమ్ముతారు? తమకి కన్వీనియంట్‌గా లేనిది మత సిద్ధాంతమైనా, భౌతిక సిద్ధాంతమైనా దాన్ని నమ్మాలనిపించదు. ఇక్కడైనా, ఎక్కడైనా మతం కంటే వ్యక్తిగత అభీష్టం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. క్రైస్తవ మతం పుట్టిన కొత్తలో రోమన్ చక్రవర్తులు క్రైస్తవ మతాన్ని అణచివెయ్యడానికి ప్రయత్నించారు. క్రైస్తవ మతం పాలక వర్గాన్ని సమర్థించి అభివృద్ధి నిరోధకంగా మారిన తరువాతే రోమన్ చక్రవర్తులు క్రైస్తవ మతాన్ని అంగీకరించారు. ఏ మతమైనా ఉన్న వ్యవస్థని సమర్థించి తన ఉనికి(అస్తిత్వం)ని కాపాడుకుంటుంది కానీ విప్లవకరంగా ఉండదు.

 10. >శనివారం, సోమవారం తప్ప మిగితా రోజులు కక్కుర్తి పడి మాంసాహారం తినే మత భక్తులని చూశాను. మాంసం తినకపోయినా సిగరెట్లు, మద్యం తాగే మత భక్తులని కూడా చూశాను. మతం కోసం ఆహారపు అలవాట్లనే మార్చుకోలేనివాళ్ళు దాని కోసం సమాజం విషయంలో అభిప్రాయాలని మార్చుకుంటారా? <

  వెల్ సెడ్, ప్రవీణ్.

 11. రాజుగారూ, మీ మీద గౌరవంతో, కేవలం మీ మీద గౌరవంతో ‘అసభ్యత, వెటకారం’ లేకుండా ఆరోగ్యకరమైన చర్చ ద్వారా ఓ మంచి విషయాన్ని బైటికి తీయాలన్న ఉద్దేశ్యం ఉంటే వీరి వ్యాఖ్యలను ప్రచురిస్తాను.

  నా ‘కామెంట్ పాలసీ’ కి భిన్నంగా ‘మారకపోతారా’ అన్న ఆశతో అనుమతిస్తూ వచ్చాను. అదే ధోరణి కొనసాగినందున రావద్దని చెప్పాను. మీ సలహాను స్వీకరించి మరి కొంత కాలం చూస్తాను.

 12. ద్వేషంతో రగిలిపొయే వాళ్ళను వాళ్ళ ముందర ఎంత తర్కంతో నిరూపించినా ఉపయోగం వుండదు. మనకు ఒక సామెత ఉండనే వుంది. చెవిటి………. కాబట్టి అలాంటి వాటికి స్వందించాల్సిన అవసరం లేదు. ఇలాంటి శ్రీకాంత్ లు చాలామంది వున్నారు. ఒక చర్చ ఉద్దేశం సత్యాన్ని పట్టుకోవడం ఏది తార్కికంగా వుంటుందో దాన్ని పట్టుకొని ముందుకు సాగటం. అలాకాక నేచెప్పిందే నెగ్గాలి అనే పంతానికి పోతె ఇక దాన్ని చర్చ అనరు. శ్రీకాంత్ విషయంలో పంతానికి పోవడం కూడా కాదు. మార్క్సిజం పైన నిలువెల్లా విషం నింపుకున్నాడు.

 13. రామ్మోహన్ గారూ,
  ‘ఒక చర్చ ఉద్దేశం సత్యాన్ని పట్టుకోవడం ఏది తార్కికంగా ఉంటుందో దాన్ని పట్టుకుని ముందుకు సాగటం’
  చాలా చక్కటి వ్యాఖ్య. మార్క్జిజం ఆచరణలో ఎక్కడ విఫలమైంది, కారణాలేమిటి అనే అంశాలపే ఇంగ్లీషు సైట్లలో, బ్లాగుల్లో చాలా నిశితంగా చర్చలు జరుగుతున్నాయి. భవిష్యదాచరణకు ఉపయోగపడగల, తప్పకుండా స్వీకరించగల అంశాలు కూడా ఈ చర్చల్లో చాలానే ఉన్నాయి.

  ముఖ్యంగా ప్రవీణ్ గారు అడపా దడపా ఇస్తున్న లింకులలో కాని ఇతరత్రా కూడా ఇలాంటి ఆరోగ్యకరమైన చర్చలను చూడవచ్చు. పరమ పవిత్రమైన వ్యక్తిగత ఆస్తిపై చేయి వేసింది. వ్యక్తి చొరవను చంపేసింది అనే ఆరోపణతో, మార్క్సిజంపై విమర్శలకు లేదా దాడులకు దిగితే, ఇలాంటి కథనాలతో జీవితమంతా రచనలు చేసినా సామాజిక సమస్యలకు పరిష్కారం దొరకదు.

  మరోవైపు పెట్టుబడిదారీ ఆర్థిక విధానపు సహజ సంక్షోభాలు ముదిరినప్పుడల్లా మార్క్స్ రచనల అధ్యయనం ప్రపంచమంతటా సార్వజనీన దృగ్విషయంగా మారుతోంది.మూడేళ్లకు పైగా కొనసాగుతున్న మహా సంక్షోభం కారణంగా పేరు మోసిన వాల్ స్ట్రీట్ అధిపతులకు కూడా ఈ సంక్షోభాలకు మూలం గురించి మార్క్స్‌ను అధ్యయనం చేయవలసిన పరిస్తితి ముందెన్నడూ లేనంతగా తీవ్రతరమైనట్లు మనం చూస్తున్నాం. తెలుగులోనే దీనిపై కొన్ని రచనలు వచ్చాయి.

  శ్రీకాంత్ గారి బ్లాగులోనే కాదు కొన్ని ఇతర బ్లాగుల్లో, వ్యక్తుల వ్యాఖ్యల్లో కూడా మీరన్న నిలువెల్ల ద్వేషం స్పష్టంగా ప్రతిఫలిస్తోంది. లాభం కోసం ఉత్పత్తి, అవసరం కోసం ఉత్పత్తి అనే వైరుధ్యం ప్రాథమిక దశలో కూడా ఇంకా పరిష్కారం కాలేదు. అప్పుడే మార్క్సిజం పనయిపోయింది అనే ధోరణి ఈ నాటిది కాదు. 1930ల నుంచే ఇది మొదలై కొనసాగుతోంది.300 ఏళ్లు భూస్వామ్య విధానంతో పోరాడి విజయం సాధించిన పెట్టుబడి దారీ విధానం ఈనాటికి కూడా శ్రమ శక్తి సంక్షోభానికి పరిష్కారం చూపలేదు.

  20 శతాబ్దిలో మానవ అవసరాలు తీర్చడంలో పెట్టుబడిదారీ, సామ్యవాద వ్యవస్థలు రెండూ విఫలమైనాయని జపాన్ ఆర్తికవేత్త పుహయామా ఇరవై ఏళ్ల క్రితమే ‘భావజాలాల అంతం’ అనే రచనలో వెలిబుచ్చిన దాంట్లో పాక్షిక సత్యం ఉంది.

  చరిత్రలో పెట్టుబడిదారీ విధానమూ, సోషలిజమూ రెండూ కూడా శాశ్వతం కాదనే విషయం తాత్వికంగా అర్థమయితే, మార్క్స్ ఎంగెల్స్ ఈ విషయంలో చెప్పింది అర్థం చేసుకుంటే మనం శాశ్వతత్వాలపై లేని పోని భ్రమలను పెట్టుకోము. కాని తెలుగు బ్లాగుల్లో మార్క్సిజం విమర్శకులకు ఈ దార్శనికత లేకపోవడమే ఇలాంటి విద్వేష పరిణామాలకు కారణ మవుతోందేమో.

 14. విశేఖర్ గారూ, నా సూచనకు విలువ ఇచ్చినందుకు కృతజ్ఞతలు.

  బ్లాగుల్లో పడి మనం చదవలసినవి, చరిత్రను పరామర్శించవలసినవి చాలా రచనలను మిస్సవుతున్నామేమో..

  ప్రస్తుతం హెచ్ జి వెల్స్ 1934లో నాటి సోవియట్ అదినేత స్టాలిన్‌తో జరిపిన ఆ ప్రఖ్యాత ఇంటర్వ్యూను చదువుతున్నాను. ఇంత అద్భుతమైన రచన తెలుగులోకి రాలేదా. లేదా మనకు తెలీలేదా అర్థం కావడం లేదు.

  ఆన్‌లైన్ లో ఉన్న స్టాలిన్ 14వ సంకలిత రచనల్లో ప్రచురించడిన ఈ మేటి ఇంటర్వ్యూను వీలైతే అనువదించాలని ఉంది. మహా సంక్షోభంలో కూరుకుపోయి ఉన్న అమెరికా, సంక్షోభం ఛాయను కూడా తన వద్దకు రానివ్వని సోవియట్ యూనియన్‌ల విశిష్టతలు, లోపాల గురించి ఒక గొప్ప మేధావికి, ఒక మహా దేశపు నేతకు మధ్య జరిగిన చర్చ ఇది. వీలైతే మీరూ ఒకసారి చదవండి. 1950ల తర్వాత 60 ఏళ్ల పాటు అప్రకటిత నిషేధానికి గురయిన అపురూప రచనలు ఇలా నెట్లో దొరకడం అరుదైన అవకాశం అనుకుంటాను.

  అలాగే మానవ సమాజపు అత్యత ప్రతిభావంత ఉత్పత్తి సాధనంగా ఆవిర్భవించిన కంప్యూటర్ వెనక ఉన్న మాయను, కంప్యూటర్ ద్వారా, సాంకేతిక విప్లవం ద్వారా వేతన బానిసత్వం ఎలా పెరుగుతూ వస్తుందో కూడా తెలిపే రచనలు చదువుతున్నాను. పదేళ్ల ఐటీ రాయితీల తర్వాత దిమ్మతిరుగుతున్న కంప్యూటర్ రంగ పరిస్తితులపై ఇలాంటి చర్చలు, కాంతి ప్రసారిత చర్చలు కావాలిప్పుడు.

  ప్రవీణ్ గారూ మరోసారి మీకు కృతజ్ఞతలు.. లింక్ ఇచ్చిన ప్రతిసారీ నాకు పని పడుతోంది.

 15. అసహనం ఉన్నవాళ్ళు ఎక్కడైనా కనిపిస్తారు. గూగుల్ ప్లస్‌లో ఒక సమైక్యవాద బ్లాగర్ తెలంగాణావాదం విషయంలో నా మీద పడి ఏడిస్తే నేను అతని ప్రొఫైల్ బ్లాక్ చెయ్యాల్సి వచ్చింది. అతను రివిజనిస్ట్ CPM కార్యకర్త. తెలంగాణా విషయంలో CPM రెండు నాలుకల స్టాండ్‌ని నేను విమర్శించడం సహించలేక అతను నన్ను తిట్టడానికి మా ప్రాంత (ఉత్తరాంధ్ర) ప్రజలని కించపరిచే పదజాలం ఉపయోగించాడు. చేసేది ఏమీ లేక బ్లాక్ చెయ్యవలసి వచ్చింది. బ్లాగుల్లో అయితే అలా బ్లాక్ చెయ్యడానికి అవ్వదు. చెయ్యగలిగేది ఐపి అడ్రెస్ బయటపెట్టడం ఒక్కటే. నా బ్లాగ్ stalin-mao.net.in కి గూగుల్ అనాలిటిక్స్ పెట్టాను కానీ అందులో ఐపి అడ్రెస్‌లు కనిపించడం లేదు. వర్డ్‌ప్రెస్, డ్రూపల్‌లలో అయితే ఐపి అడ్రెస్‌లు కనిపిస్తాయి.

 16. రాజు గారూ, మీరు చదివే ఇంటర్వూ లింక్ నా బ్లాగ్ లొ ఉంచే వీలుంటే చూడగలరు.

  మావో కాలంలో మిలియన్ల మంది చనిపోయారన్న ప్రచారంలో వాస్తవాలపై ఓ ఆర్టికల్ చదివాను. మంత్లీ రివ్యూ పత్రికలో ఈ ఆర్టికల్ వచ్చింది. నేనూ ఇంకా పూర్తిగా చదవలేదు. లింక్ కింద ఇస్తున్నాను ఓసారి చూడండి.
  http://monthlyreview.org/commentary/did-mao-really-kill-millions-in-the-great-leap-forward

 17. ఆ ఆర్టికల్ నేను ఎప్పుడో చదివాను. జోసెఫ్ బాల్ నాకు ఆన్‌లైన్‌లో ఎప్పటి నుంచో పరిచయం.

 18. J. V. STALIN Internet Library
  Established May 1, 1997

  http://marx2mao.com/Stalin/Index.html

  శేఖర్ గారూ,
  పై లింకులో స్టాలిన్ సంకలిత రచనలు 1- 13 మరియు 14 సంకలిత రచనలు విడిగా హెచ్‍టిఎమ్ఎల్ పైల్స్ రూపంలోనూ, పిడిఎఫ్ రూపంలోనూ లభ్యమవుతున్నాయి. మరో రెండు సంకలిత రచనలు -1940 నుంచి 53 వరకు స్టాలిన్ రచనలు, ఉత్తరాలు వంటివి ఉన్నాయట కాని ఇక్కడ అవి అన్నీ అందుబాటులో లేవు. అతి ప్రధాన రచనలు కొన్ని ఈ లింక్ కిందిభాగంలో విడి విడి పుస్తకాలుగా ఇచ్చారు.

  జె.వి స్టాలిన్ రచనలను మొత్తంగా పీడీఎఫ్ రూపంలో ఇక్కడినుంచే తీసుకోవచ్చు. నేనిప్పటికే పీడీఎఫ్ కాపీలను డౌన్‌లోడ్ చేసుకున్నాను. మళ్లీ చేయడం ఎందుకనుకుంటే మీకు ఈమెయిల్లో పంపిస్తాను. మీ జీమెయిల్ ఐడీ నావద్ద ఉందనుకుంటాను.

  కింది లింకులో స్టాలిన్ 14 సంకలిత రచనల విషయ సూచిక మొత్తంగా పీడీఎఫ్ రూపంలో ఉంది. ఏ సంకలనంలో ఏ రచనలు ఉన్నాయనే కీలక సమాచారం ఇక్కడ ఉంది.

  మీకు ఇప్పటికే ఈ వెబ్ సైట్ వివరాలు తెలుసుననుకునే మీకు లింక్ ఇవ్వలేదు.

  ఇప్పుడు చూడండి.

  Compilation of the Tables of Content for Stalin’s Works, Volumes 1-13
  ( Includes an Unofficial Volume 14)

  Click to access StWksTCwm.pdf

  This file contains the table of contents from each of the volumes of Stalin’s Works. The entries to the right provide access to the listing of the “Contents” of the respective volumes. There are no links to specific items (e.g., essays, reports, comments, etc.) identified in the “Contents”. To access a particular text, the entire volume must be called up, via either the “.pdf” markers on the right, or the “Volume” number on the title page preceeding each of the “Contents”.

  Stalin’s Works
  Volume 1 1901 — 1907 ( .pdf )
  Volume 2 1907 — 1913 ( .pdf )
  Volume 3 March — October 1917 ( .pdf )
  Volume 4 November 1917 — 1920 ( .pdf )
  Volume 5 1921 — 1923 ( .pdf )
  Volume 6 1924 ( .pdf )
  Volume 7 1925 ( .pdf )
  Volume 8 January — November 1926 ( .pdf )
  Volume 9 December 1926—July 1927 ( .pdf )
  Volume 10 August — December 1927 ( .pdf )
  Volume 11 1928 — March 1929 ( .pdf )
  Volume 12 April 1929 — June 1930 ( .pdf )
  Volume 13 July 1930 — January 1934 ( .pdf )
  Volume 14 1934—1940 Unofficial Collection ( .pdf )

  మీరు ఇచ్చిన లింకులో మావో- మహాముందంజ మరణాల గురించిన వ్యాసం నిన్న రాత్రే ప్రవీణ్ గారిచ్చిన లింకులోంచి చూశాను.

  Note : “Dialectical and Historical Materialism” (1938) is not included here; it is only available in The History of the Communist Party of the Soviet Union (Bolsheviks), Short Course (1939), where it was originally published.

 19. Marxism verses Liberalism – An interview with H.G wells july 23, 1934 అనే పేరుతో స్టాలిన్ రచనలు 14వ సంకలనంలో 21-44 పేజీలలో ఈ సుప్రసిద్ధ ఇంటర్వ్యూ ఉంది. చూడండి. అలాగే దానికిందే “Talk with the metal producers” అనే మరో గొప్ప రచన కూడా ఉంది. వీటికోసం కింది లింకులో చూడండి.

  Click to access StWorks14.pdf

 20. ప్రవీణ్ గారూ,
  మీరు పంపిన లింకులోంచి నిన్ననే ఈ కథనం తీసుకున్నాను. చాలా పెద్దది కాబట్టి కొంత సమయం పడుతుంది. తప్పక చదువుతాను. ధన్యవాదాలు.

  Lies Concerning the History of the Soviet Union
  By Mario Sousa
  Member of the Communist Party Marxist-Leninist Revolutionaries, Sweden KPML(r)

  http://www.northstarcompass.org/nsc9912/lies.htm

  From Hitler to Hearst, from Conquest to Solzhenitsyn

 21. స్వప్న, టిమోతీలతో యాహూలో చాటింగ్ చేసే రోజులలోనే ఇవన్నీ చదివేశాను రాజశేఖర్ గారు. ఇప్పుడు కూడా దొరికిన పుస్తకాలు చదువుతూనే ఉన్నారు.

 22. సౌసా వేరు, స్వప్న వేరు. సౌసా మగవాడు. స్వప్న నాకు గతితార్కిక-చారిత్రక భౌతికవాదం పరిచయం చేసిన మొదటి వ్యక్తి. టిమోతీ బ్రిస్బేన్‌లో ఉంటున్న మార్క్సిస్ట్ పండితుడు. అతను ఆన్‌లైన్‌లో కూడా ఆర్టికల్స్ వ్రాస్తుంటాడు. నన్ను డిడికేటెడ్ మార్క్సిస్ట్‌గా మార్చింది స్వప్న & టిమోతీలే. వాళ్ళిద్దరూ లేకపోతే నేను మార్క్సిజం విషయంలో అజ్ఞానాంధకారంలోనే ఉండేవాణ్ణి.

 23. అవునా ప్రవీణ్? అయితే స్వప్న గారి గురించి తెలుసుకోవాల్సిందే మరి. ఆవిడ ఆర్టికల్స్ ఆన్ లైన్ లో ఏమన్నా ఉన్నాయా? ఆవిడ తెలుగువారేనా?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s