దుబాయ్ ఇప్పుడొక కాస్మోపాలిటన్ ఒయాసిస్సు. ప్రపంచంలో అత్యంత ఎత్తైన భవంతి ‘బర్జ్ ఖలీఫా’ దుబాయ్ లోనే ఉంది. అత్యంత విలాసవంతమయిన టూరిస్టు కేంద్రంగా దుబాయ్ భాసిల్లుతోంది. సొమ్ములు అనంతంగా పోగుపడిన వారు వాటిని త్వర త్వరగా ఖర్చు చేసుకోవడానికి దుబాయ్ సందర్శిస్తే సరిపోతుంది. అక్రమ సంపాదనను పెట్టుబడులు పెట్టుడానికీ, అక్రమ డబ్బుని దాచుకోవడానికి దుబాయ్ వీలు కల్పిస్తుంది. ఇది ఇప్పటి సంగతి.
ఇరవై, ముప్ఫై యేళ్ల క్రితం దుబాయ్ పరిస్ధితి ఇది కాదు. పెట్రో డాలర్లు ముంచెత్తి ఫైనాన్షియల్ సెంటర్ గా మారక ముందు గల్ఫ్ దేశాల దరిద్రం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అలాగని ఇప్పుడు దుబాయ్ జనం అంతా మిలియనీర్లేమీ కాదు. దరిద్రుల పరిస్ధితి కొనసాగుతుండగా ధనికుల జీవనంలో ఆధునికత ప్రవేశించింది. ఆదాయ అంతరాలు అనేక రెట్లు పెరిగాయి. 1960 లు, 70 ల్లో తీసిన ఫొటోలు కొన్నింటిని ‘ఫారెన్ పాలసీ’ పత్రిక ప్రచురించింది.
మొదటి ఫొటోలో దుబాయ్ రాజు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ ఆల్-మక్తౌమ్ యౌవనంలో సరదాగా ఒంటెల సవారీ పార్టీ జరుపుకున్న దృశ్యాన్ని చూడవచ్చు.
–
అల్జీరియా, ట్యూనిసియా లాంటి ఎడారి దేశాలలో ప్రజలు ఇప్పటికీ గాడిదల మీద తిరుగుతారు. అక్కడ ఒంటెలు ఆర్థికంగా కొంచెం ముందున్నవాళ్ళ దగ్గరే ఉంటాయి.